Thursday, November 14, 2024

Hyderabad: ఐటీ కారిడార్ లో డెంజర్ బెల్స్.. !

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. రాజధాని హైదరాబాద్ లో కూడా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రజలు ఎండ వేడిమితో పాటు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు.
భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో జలమండలి నళ్లపై ఆధారపడాల్సి వస్తుంది. నళ్ల నీళ్లు కూడా సరిపోక చాలా మంది ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. ఇక ఫైనాన్షయల్ డిస్ట్రక్ట్ లో నీటి కొరత తీవ్రంగా ఉంది.

ఐటీ కారిడార్ లో నీరు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఇళ్లు ఉండడంతో బోర్లు ఉన్నా నీరు సరిపోవడం లేదు. బోర్ల నీరు లేక ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇదే సమస్య వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతోనే సమస్య వస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోవడం లేదంటున్నారు.
శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. కంపెనీలకు దగ్గరగానే లక్షల్లో ఇళ్లను నిర్మించారు. ఈ ప్రాంతాల్లో మొత్తం దాదాపు లక్ష 50 వేళ ఇళ్లు ఉన్నాయి. ఇందులో హాస్టళ్లు, ఇళ్లు, హైరైజ్ భవనాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. అయితే అధికారలు రెండు అంతస్థులకు అనుమతి ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు నాలుగు అంతస్థులు కడుతున్నారు. దీంతో తక్కువ జాగాలో ఎక్కువ ఇళ్లు కట్టడంతో నీటి సమస్య వస్తుంది.

జలమండలి ఈ ప్రాంతాలకు రోజుకు 9 ఎంజీడీల నీటిని ఇస్తోంది. అయినా కూడా నీరు సరిపోవడం లేదు. నళ్ల నీళ్లు సరిపోకుంటే జలమండలి 2100 ట్యాంకర్లు పంపిస్తుంది. అయినా కూడా నీరు సరిపోవడం లేదు. ఓ అపార్ట్ మెంట్ లో 30 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో బోరు ఉంటే ఎండిపోయింది. జలమండలి నీరు సరిపోక రోజుకు 4 ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.

YCP Manifesto: ఇదేం మేనిఫెస్టో.. వైసిపి కేడర్ లో అసంతృప్తి

YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో పై సొంత పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. ఉన్న పథకాలకి కొంచెం మెరుగులు దిద్ది స్వల్ప మొత్తంలో కేటాయింపులు పెంచి ప్రకటించడంపై వారు పెదవి విరుస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాల మాదిరిగా ఏవీ కనిపించలేదు. ఇదే వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ముఖ్యంగా రుణమాఫీ ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ జగన్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉంది. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేశామన్న సానుకూలత తప్ప.. ఇతర విషయాల్లో ఏమాత్రం సంతృప్తి కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు భారీగా ప్రకటించి ఉంటే పరిస్థితి బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి సంక్షేమం అంటేనే చంద్రబాబు దూరంగా ఉంటారు. కానీ గత ఎన్నికల్లో జగన్ సంక్షేమ పథకాల హామీ ఇచ్చారు. అందులో కొంత వరకు అమలు చేశారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది. ఉప ఎన్నికల్లో సైతం ఆ పార్టీ దూసుకెళ్లింది. ప్రజలు సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారని గ్రహించిన చంద్రబాబు.. తాను సైతం జై కొట్టారు. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతానని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను సైతం ప్రకటించారు. వాటినే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆసక్తికరమైన మేనిఫెస్టోను రూపొందించాల్సి ఉండగా.. పైపై మెరుగులతో.. కొద్దిపాటి కేటాయింపులు పెంచి ప్రకటించడంపై వైసీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. ప్రమాదం తప్పదని భయపడుతున్నాయి. కూటమి పార్టీలు ఇంతకుమించి సంక్షేమంతో మేనిఫెస్టోను ప్రకటిస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ముఖ్యంగా డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీ ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు భావించాయి. ఆ ఒక్క ప్రకటనతో భారీ విజయం దక్కుతుందని ఆశించాయి. కానీ ఆ రెండు అంశాలకు చోటు లేక పోయింది. కేవలం రైతు భరోసా పథకం కింద ఇస్తున్న 13,500 రూపాయలను 16 వేలకు పెంచుతానని మాత్రమే జగన్ ప్రకటించారు. అంతకుమించి వ్యవసాయానికి ప్రోత్సాహం లేదు. ఇప్పటికే చంద్రబాబు సాగు ప్రోత్సాహం కింద సంవత్సరానికి ₹20,000 అందిస్తానని ప్రకటించారు. అటు డ్వాక్రా రుణమాఫీ పై మహిళలు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ నేతలు ప్రచారం చేయడంతో గత రెండు నెలలుగా బ్యాంకులకు రుణ చెల్లింపులు కూడా చేయడం లేదు.

జగన్ చెబితే ఎలాగైనా అమలు చేస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుంటారు.అభివృద్ధి కంటే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు.కానీ గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి లేదు.అదే విషయం అడిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెంచామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిట సంక్షేమం విషయంలో జగన్ వెనక్కి తగ్గడంపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఇన్ని రోజులపాటు సంక్షేమాన్ని ప్రచారంగా తీసుకున్నామని.. కానీ మేనిఫెస్టో చూస్తే డొల్లతనం కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కచ్చితంగా ఇది ఎన్నికల్లో ప్రతికూలత చూపుతుందని భయపడుతున్నారు. ఒక్క రుణమాఫీ విషయం ప్రకటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే మేనిఫెస్టోతో వైసిపి శ్రేణుల ఆశలు నీరుగారిపోయాయి

Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్, స్టప్.!

Ration Card : రేషన్ కార్డు లబ్ధిదారులకు బంపర్ ఆఫర్. ఇప్పుడు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ ను పొందవచ్చు.
అవును మీరు వింటున్నది నిజమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 స్కీమ్ కింద రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. మరి ఈ పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి..?దీనికి ఎలా అప్లై చేసుకోవాలి…?ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి…వంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Ration Card : ప్రధానమంత్రి ఉజ్వల యోజన…

భారతదేశంలో పేద మహిళలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇక ఈ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రతి ఏడాది రెండు సంవత్సరాల వరకు సిలిండర్లను అందుకుంటారు. అయితే దేశంలోని లక్షలాది పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ అందించాలనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకాన్ని 2016 మే 1న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా ఇప్పటికే పలు రాష్ట్రాలలో కూడా ఈ పథకం అమలులో ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వెనకబడిన వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది.

Ration Card : అర్హులు ఎవరంటే…

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.

దరఖాస్తుదారుల వయస్సు కచ్చితంగా 18 సంవత్సరాల నిండి ఉండాలి.

అదేవిధంగా కుటుంబం యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే 1లక్ష , పట్టణ ప్రాంతాలలో అయితే 2 లక్షలకు మించి ఉండకూడదు.

అలాగే అభ్యర్థులకు ఇంతకుముందు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.

కావలసిన పత్రాలు…

కుటుంబ సభ్యుల ఆధార్ , రేషన్ కార్డ్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్ , బ్యాంక్ అకౌంట్.

Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త… కేంద్ర ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్, స్టప్…!

అప్లై చేయు విధానం…

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు ముందుగా సంబంధిత ఆఫీసులు వెబ్ సైట్ www.pmuy.gov.in/ సందర్శించాలి.

హోమ్ పేజీ లోకి వెళ్లిన తర్వాత అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న click here to apply for new ujwala 2.0 connection పైన క్లిక్ చేయాలి

ఆ తర్వాత సంబంధిత గ్యాస్ కంపెనీ ఎంచుకోవాలి.

మొబైల్ నెంబర్ మరియు ఓటిపి సహాయంతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్న సమయంలో కచ్చితంగా పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు కరెక్ట్ గా ఇవ్వాలి.

అనంతరం దరఖాస్తు సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

మీరు అప్లై చేసిన ఫామ్ లో డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే వెరిఫికేషన్ అనంతరం కొత్త కనెక్షన్ పొందుతారు.

అలాగే మీకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తెలియకపోతే ఎల్పిజీ డిస్ట్రిబ్యూటర్ అవుట్ లెట్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద తొలిసారి గ్యాస్ సిలిండర్ తో పాటు స్టవ్ కూడా ఫ్రీగా వస్తుంది. రెండవసారి నుండి గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ లభిస్తుంది. ఇక ఈ పథకం ద్వారా ఏట 12 గ్యాస్ సిలిండర్ల పై సబ్సిడీని పొందవచ్చు.

IT News: టెక్ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. భారీగా నియామకాలకు హెచ్‌సీఎల్‌టెక్ నిర్ణయం..

HCL Tech News: ఇటీవల దేశంలోని టెక్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా కాలం విరామం తర్వాత టెక్ కంపెనీలు నియామకాలను తిరిగి ప్రారంభించాలని చూస్తున్నాయి.
వీటికి సంబంధించిన తమ ప్లాన్స్ బయటపెడుతున్నాయి.

టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ త్వరలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రెషర్‌లను గత ఏడాది మాదిరిగానే రిక్రూట్‌మెంట్ వ్యూహాన్ని అనుసరించి నియమించుకోవాలని కంపెనీ చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీ 12,141 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంది.

ఈసారి నియమించుకోనున్న 10,000 మంది ఫ్రెషర్ల విషయంలో నిర్దిష్ట నిబంధనల ప్రకారం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుందని హెచ్‌సీఎల్‌టెక్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ పేర్కొన్నారు. ఈ నియామకాలు FY25కి అదనం. కంపెనీ అవసరాలకు అనుగుణంగా కొత్త ఫ్రెషర్లను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. అయితే వీరిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోనున్నట్లు వెల్లడించారు. పదవీకాలం ముగిసే సమయానికి వారి నైపుణ్యాల ప్రకారం వారు మళ్లీ కాంట్రాక్ట్ చేయవచ్చన్నారు.

కొత్త టాలెంట్‌ని తీసుకురావడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. ఈ చర్య ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు పటిష్టం చేయగలుగుతుందన్నారు. సంస్థలోని పనిలో మరింత వేగం తీసుకురావడంలో వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపార అనిశ్చితుల్లో ఇతర టెక్ కంపెనీలు సైతం హెచ్‌సీఎల్‌టెక్ మాదిరిగానే ఉద్యోగులను కాంట్రాక్ట్ ప్రాతిపధికన నియమించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Walking: నిద్రపోయే ముందు వాకింగ్ చేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా

Walking: కదలకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా హానీ చేస్తుంది. అయితే నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా. ఆహారం తిన్న తర్వాత నడక చాలా ముఖ్యం.
మీరు నిద్రపోయే ముందు నడకను అలవాటుగా చేసుకుంటే అది మీ నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర వస్తుంది.

సాయంత్రం నడక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ నిద్రపోయే ముందు వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి. ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నిద్రపోయే ముందు రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు బీపీ కూడా అదుపులో ఉంటుంది.
నడక కండరాలను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కూడా అందిస్తుంది. ఈవినింగ్ వాక్ చేసేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత మాత్రమే నడక కోసం బయటకు వెళ్లండి. చాలా వేగంగా నడవకండి. సౌకర్యవంతమైన బట్టలు మరియు బూట్లు ధరించండి. సాయంత్రం నడక జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి కూడా చాలా సహాయపడుతుంది. కాబట్టి, తిన్న వెంటనే నిద్రపోకూడదు.

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: మే నెలలో మారుతున్న రూల్స్‌

ఏప్రిల్‌ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో మే నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా మాదిరిగానే మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక నియమాలు మారబోతున్నాయి.
ముఖ్యంగా కొన్ని బ్యాంకులకు సంబంధించి మే నెలలో మారబోతున్న నియమాలు ఏంటో ఈ కథనంలో​ తెలుసుకుందాం.

యస్ బ్యాంక్ రూల్స్‌
యస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. మే 1 నుంచి, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మారుతుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్‌ మినిమమ్‌ యావరేజ్‌ బ్యాలెన్స్ (MAB) రూ. 50,000గా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుమును రూ. 1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును రూ. 750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్‌ ప్రోలో కనీస నిల్వ రూ. 10,000. దీనిపై గరిష్ట రుసుము రూ. 750గా మారింది.
ఐసీఐసీఐ బ్యాంక్ రూల్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్‌, ఈసీఎస్‌ / ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు, మరిన్నింటితో సహా కొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1 నుండి అమలులోకి వస్తాయి.
డెబిట్ కార్డ్‌ వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ. 200 ఉండనున్నాయి. చెక్‌ బుక్‌ విషయానికి వస్తే 25 లీఫ్స్‌ వరకు ఎలాంటి ఛార్జ్‌ ఉండదు. ఆపైన ఒక్క చెక్‌ లీఫ్‌కు రూ.4 చొప్పున చెల్లించాలి. డీడీ క్యాన్సిలేషన్‌, డూప్లికేట్‌, రీవ్యాలిడేషన్‌ను చార్జీలను రూ.100లుగా బ్యాంక్‌ సవరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం అమలు చేస్తున్న “హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్‌డీ” గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం కింద, సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తోంది. 5 – 10 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్‌డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.

బ్యాంక్‌లకు సెలవులు
వచ్చే మే నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Honey And Garlic: రోజూ ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తింటే 7 రోగాలు మాయం!

Garlic And Honey Benefits: వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది ఒక సూపర్ ఫుడ్. ఇందులో చాలా మందులు ఉన్నాయి.
వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవడం వల్ల దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉంటుంది. ఇది గొంతు నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి, తేనె తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు కూడా ఈ సమస్యలతో సతమతమవుతున్నట్లయితే.. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తప్పకుండా ఒకసారి ఉపయోగించండి.
వెల్లుల్లి తేనె మిశ్రమంలోలో ఉండే పోషకాలు
వెల్లుల్లి
వెల్లుల్లిలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ – సి, బి6, మాంగనీస్, ప్రొటీన్ ఫైబర్, ఐరన్, కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కేలరీలు తక్కువగా లభిస్తాయి.
తేనె
తేనె ఒక రకమైన చక్కెర. ఏది మాధుర్యంతో నిండి ఉంటుంది. వేసవిలో, షర్బత్ చేయడానికి తేనెను ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
వెల్లుల్లి తేనెను ఎలా ఉపయోగించాలి
1) ఉదయం ఒక చెంచా తేనె.. ఒక వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని తినండి. దీంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2) ఒక గాజు పాత్రలో తేనె తీసుకుని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కలుపుకుని తినండి.
3) లేదా వెల్లుల్లి రెబ్బను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే నమిలి మింగేయండి.

4) ఒకవేళ మీరు వెల్లుల్లి తినకూడదనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో రెండు చెంచాల తేనె తినండి.
5) అంతే కాకుండా వేడి నీళ్లలో వెల్లుల్లి రసం, తేనె కలుపుకుని తాగడం వల్ల జ్వరం, సైనస్, గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

6) అదే విధంగా వెల్లుల్లి చట్నీ చేసుకోవచ్చు. అందులో తేనె మిక్స్ చేసి తినాలి. ఇది విటమిన్ సికి మంచి మూలం. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.7) ఒక టీస్పూన్ వెల్లుల్లి రసంలో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు

YSRCP Manifesto 2024 : 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల – అమ్మఒడి, రైతు భరోసా నగదు పెంపు, ఈసారి జగన్ ఇచ్చిన హామీలివే!

YSRCP Manifesto 2024 : మేనిఫెస్టో(Manifesto) అంటే పవిత్రమైన గ్రంథమని అన్నారు వైసీపీ అధినేత జగన్(YS Jagan). 2019లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని గుర్తు చేశారు.
2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన…. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానంగా చూసి అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోకు కావాల్సిన గుర్తింపును ఇచ్చామని చెప్పారు. నవరత్నాల పాలనకు మేనిఫెస్టో అద్దంపట్టిందన్నారు. నవరత్నాల కింద 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇది ఒక చరిత్ర అని జగన్ చెప్పుకొచ్చారు.

2019లో(YSRCP Manifesto 2019) ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా…గడిచిన 58 నెలల కాలంలో అమలు చేశామని చెప్పారు. చేయగలిగివే చెప్పి చేసి చూపించామన్నారు. అవి అమలు చేసే ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నామని ఉద్ఘింటించారు. సమస్యలకు పరిష్కారం చూపుతూ 58 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన జరిగిందని చెప్పారు. కొవిడ్ లాంటి సమస్యలు వచ్చినా… సాకులు చూపలేదన్నారు.

YSRCP Manifesto -వైసీపీ మేనిఫెస్టో -2024 వివరాలు:

2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను(YSRCP Manifesto 2024) విడుదల చేసింది.
విద్య, వైద్యం,వ్యవసాయానికి ప్రాధ్యానత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన
– మహిళలు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద గతంలో రూ. 75 వేలుగా ఉండేది. ఈసారి కూడా ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తామని జగన్ తెలిపారు.
వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో నాలుగు ధపాల కింద డబ్బులు ఇస్తాం.
– వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మూడు దఫాలు ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తాం.
జగనన్న అమ్మఒడి కింద రూ. 15 వేలు ఉండేది. ఈసారి రూ. 17 వేలకు పెంచుతామని ప్రకటన
సున్నా వడ్డీ కింద రుణాల మాఫీ స్కీమ్ కొనసాగుతుంది.
-వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ ముబారక్ స్కీమ్ ను కొనసాగిస్తామని జగన్ తెలిపారు.
వైఎస్సార్‌ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేల పెంపు, వైఎస్సార్‌ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంచుతామని జగన్ ప్రకటించారు.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కొనసాగింపు ఉంటుంది.
లారీడ్రైవర్లకు కూడా వాహనమిత్ర – రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.
వైఎస్ఆర్ లా నేస్తం కొనసాగింపు ఉంటుంది.
వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 16వేలకు పెంపు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని జగన్ ప్రకటన.
రాష్ట్రంలో తలపెట్టిన 12 కొత్త మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తి చేస్తాం.
కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం.
దళితుల జనాభా 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటన.
దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధులు.
అప్కో బకాయిలను ఈ దఫా కూడా కొనసాగిస్తాం.
కాపు సంక్షేమం కోసం వైసీపీ పాలనలో రూ. 34వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో మరింత సంక్షేమం చేస్తాం.
ఔట్ సోర్సింగ్ కింద రూ. 25వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు విద్య, వైద్యానికి సంబంధించిన నవరత్నాల స్కీమ్ లను వర్తింపజేస్తారు.
వైఎస్ఆర్ బీమా స్కీమ్ కింద ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్స్ ను సప్లయ్ చేసే వారికి వర్తింపజేస్తారు.
బోగాపురం పోర్టు పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని జగన్ ప్రకటన.
వచ్చే ఐదేళ్లలో సురక్షితమైన తాగు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం.
వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే… విశాఖపట్నం నుంచి పాలన ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని జగన్ కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.

TCS Offers Free 15 Days Digital Certification Program: ఐటీ జాబ్‌ చేయాలనుకునేవారికి టీసీఎస్‌ ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సు

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (TCS),టీసీఎస్‌ ఐయాన్‌ (tcs ion) పేరుతో 15 రోజుల పాటు డిజిటల్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.

టీసీఎస్‌ ఐఓఎన్‌ కెరియర్‌ ఎడ్జ్‌లో ఈ కోర్సులను ఉచితంగా అందుబాటులో ఉంచింది. విద్యార్థులు, ఉద్యోగులు వారి కెరీర్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 14 డిఫరెంట్‌ మాడ్యుల్స్‌ ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు.

అర్హత: అండర్‌ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్స్‌ ఎవరైనా అప్లై చేయవచ్చు.

నేర్చుకునే అంశాలు

వర్క్‌ ప్లేస్‌లో ఇతరులతో కలిసి సమర్థవంతంగా ఎలా పనిచేయాలి
డెవలప్‌ సాఫ్ట్‌స్కిల్స్‌ ఫర్‌ ద వర్క్‌ప్లేస్‌
రైట్‌ ఎ విన్నింగ్‌ రెజ్యూమె అండ్‌ కవర్‌ లెటర్‌
అకౌంటింగ్‌ ఫండమెంటల్స్‌
ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ గురించి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు.
నానో ట్యుటోరియల్‌ వీడియోలు, కేస్‌స్టడీస్‌, అసెస్‌మెంట్లు కోర్సులో భాగంగా ఉంటాయి. ఆంగ్లభాషలో బోధన ఉంటుంది. అసెస్‌మెంట్లు అభ్యర్థి బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి సాయపడతాయి. టీసీఎస్‌ నిపుణులు వెబినార్లనూ నిర్వహిస్తుంటారు. 15 రోజుల కోర్సు పూర్తిచేసుకున్నాక ఎండ్‌ ఆఫ్‌ కోర్స్‌ అసెస్‌మెంట్‌ ఉంటుంది.

స్పోర్ట్స్ బాగా ఆడుతారా? చదువుతో సంబంధం లేకుండా రైల్వేలో జాబ్స్! మిస్ చేసుకోకండి!

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే నేటి రోజుల్లో ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్పా జాబ్ దక్కించుకోలేరు. దీనికోసం ప్రణాళికబద్దంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబం భవిష్యత్ స్వరూపమే మారిపోతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నార్తర్న్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి అర్హతతోనే రైల్వేలో ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు వారు మాత్రమే అర్హులు.

రైల్వే శాఖ నిత్యం ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో న్యూ ఢిల్లీలోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనున్నది. కాగా ఈ ఉద్యోగాలకు క్రీడాకారులు మాత్రమే అర్హులు. నోటిఫికేషన్ లో నిర్దేశించిన క్రీడాంశాల్లో ప్రతిభకనబరిచిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

స్పోర్ట్స్ కోటా గ్రూప్ డీ మొత్తం పోస్టులు:

38
క్రీడాంశాలు:

ఫుట్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, కబడ్డీ, రెజ్లింగ్, చెస్ తదితర క్రీడలు.
అర్హత:

అభ్యర్థులు పదోతరగతిలో పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో ప్రతిభ చూపి ఉండాలి.
వయోపరిమితి:

అభ్యర్థులు 01-07-2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు:

ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ, అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. ఇతరులు రూ. 400 చెల్లించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:

16-04-2024
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

16-05-2024

వెయ్యి గ్రామాలకు నీళ్లు అందించిన ఈయనను చంపాలని చూశారు..ఎందుకో తెలుసా?

కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండేవి. కరువు విలయతాండవం చేసేది. భూగర్భ నీటి స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉండేవి.

తాగునీటికి కూడా అక్కడి జనం అల్లాడేవారు. మంచి నీళ్లు తాగాలంటే మహిళలు 8 నుంచి 9 గంటలు పట్టేంత దూరం నడిస్తేనే గానీ తాగడానికి మంచి నీళ్లు దొరకవు. ఈ పరిస్థితుల్లో చాలా కుటుంబాలు బలవంతంగా వీరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఆ సమయంలో ఒక్కడు వచ్చాడు. అతనే రాజేంద్ర సింగ్. ఆళ్వార్ గ్రామానికి ఆయుర్వేదిక్ డాక్టర్ గా వచ్చిన రాజేంద్ర సింగ్ అక్కడి నీళ్లు లేక జనం అల్లాడుతుంటే చూసి చలించిపోయారు. ఈ గ్రామంలో వారికి అనారోగ్య సమస్యలకు కారణం నీళ్ల సమస్య అని తెలుసుకున్న రాజేంద్ర సింగ్ దాన్ని పరిష్కరించాలని అనుకున్నారు.

వర్షపు నీటిని నిల్వ ఉంచడానికి గ్రామస్తుల సహాయం తీసుకున్నారు. అయితే మొదట్లో గ్రామస్తులు ఈయనను నమ్మలేదు. వింత వ్యక్తిలా చూశారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆయనను నమ్మడం ప్రారంభించారు. ఇలా ఒక్క గ్రామం నుంచి మొదలై 1000 గ్రామాల ప్రజలను సమీకరించి 11 వేల నీటి వనరులను సృష్టించారు. దీంతో వెయ్యి గ్రామాల్లోనూ వాటర్ లెవల్ పెరిగింది. ఎండిన నదుల్లో నీరు వచ్చింది. వలస వెళ్లే పరిస్థితి పోయి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడి వాళ్ళు వ్యవసాయాన్ని స్థిరమైన వృత్తిగా ఎంచుకున్నారు. సమృద్ధిగా నీరు, మంచి ఆహారం కారణంగా అక్కడి ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. చాలా సంతోషంగా జీవించేవారు. అయితే ఇదంతా సాఫీగా జరిగిపోతే ఈరోజు ఈయన గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం. మంచి చేస్తుంటే అడ్డుకునేందుకు విలన్ బ్యాచ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. రాజేంద్ర సింగ్ లైఫ్ లో కూడా మైనింగ్ మాఫియా రూపంలో విలన్స్ ఎదురుపడ్డారు.

అదేంటి ఆయన దారి వేరు, వీళ్ళ దారి వేరు కదా.. శత్రుత్వం ఎందుకు అని అనుకోకండి. ఎందుకంటే పంట పండని పొలాల్లోనే వీళ్ళు మైనింగ్ చేసేవారు. నీళ్లు రావు, పంట పండదు.. ఆ భూమి ఎందుకూ పనికిరాదని చెప్పి గ్రామస్తులను మాయ చేసి వాళ్ళ భూములను మైనింగ్ కోసం ఉపయోగించుకునేవారు. ఇంకొంతమందిని అయితే మైనింగ్ పనిలో పెట్టుకునేవారు. ఇప్పుడు రాజేంద్ర సింగ్ హీరోలా వచ్చి ఎందుకూ పనికిరాని బీడు భూములను పంట పొలాలుగా మార్చేస్తానంటే మైనింగ్ మాఫియా వాళ్ళు ఎలా బతకాలి? భూమిని తినకుండా జీవించడం ఎలా? మైనింగ్ పనిలోకి జనాలు రాకపోతే ఎలా? అని ఆలోచనలో పడ్డారు. ఒక్కడి వల్ల మైనింగ్ మాఫియా షేక్ అయ్యింది.

ఇలాంటోడు ఉంటే తమ ఉనికికే ప్రమాదం అని రాజేంద్ర సింగ్ ని చంపాలని చూశారు. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. దీని వల్ల ఆయన 20 రోజులు కోమాలోకి వెళ్లారు. ఈయన కోమాలోకి వెళ్ళిపోయినందుకు గ్రామస్తులు ధైర్యం కోల్పోలేదు. మైనింగ్ మాఫియాతో పోరాడారు. అటవీ ప్రాంతంలో మైనింగ్ ఆపాలని మైనింగ్ మాఫియాకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ 470 మైనింగ్ సైట్లు మూసివేతకు కారణమైంది. ఇది మైనింగ్ మాఫియాకి అతిపెద్ద దెబ్బ. రాజేంద్ర సింగ్ చేసిన సేవలను, కృషిని పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. ప్రతిష్టాత్మకమైన ‘స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్’ ఆయనను వరించింది. నీటి రక్షణ, సంరక్షణలో ఇదే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈయనను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి వెయ్యి గ్రామాల ప్రజల జీవన విధానాన్ని మార్చిన వాటర్ మ్యాన్ గురించి మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Central Government : సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

Central Government : చాలామంది ప్రజలకి సొంత ఇల్లు లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం కింద ఉచిత ఇల్లును పొందవచ్చు అని చెప్తోంది. ఇల్లు అనేది అందరికీ ముఖ్యమైనది అయినప్పటికీ అందరికీ అందించడం సాధ్యం అవ్వదు.. ధనవంతులు ఎలాగోలా సొంత ఇల్లును కట్టుకుంటారు. అయితే నిరుపేదలకు నిరుపేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు తమ సొంత ఇంటి కలను సహకారం చేసుకోవడం కూడా చాలా కష్ట తరం అవుతుంది..

ఈ విషయాలను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకి కనీసం ఒక చిన్న ఇల్లునైనా నిర్మించుకునేలా కొత్త స్కీములను ప్రవేశపెట్టాలి అనుకుంది. 2024 -25 బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలను తెలిపారు…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన; ఈ స్కీం చాలామందికి చేరువైన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా ఇళ్లను నిర్మించారు. సుమారు 40 లక్షల కాంక్రీట్ ఇళ్లను కట్టించారు. ఈ ప్రాజెక్టు 2014 నుండి సాగుతోంది. మరియు 2025 నాటికి కోటి ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సహకరిస్తున్న బ్యాంకులు; ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి గ్రాంట్లను రిలీజ్ చేసి ఎంతోమందికి సహాయపడుతుంది.. ప్రతి ఒక్కరు తమ ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందడానికి బ్యాంకు నుండి రుణ సౌకర్యాన్ని అందిస్తోంది.. బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు వాణిజ్య సమస్యలు ఇంటి నిర్మాణానికి రుణ సదుపాయాన్ని కల్పిస్తాయని మీరు ఎక్కడ రుణం తీసుకున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ సొమ్ముని తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది..

Reasons For Tooth Decay: పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? కారణం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!

Causes Tooth Decay: మన శరీరంలో దంతాలు ఆరోగ్యంతో మనకు భవిష్యత్తులో 75 శాతం జబ్బులను నయం చేయవచ్చు. ఈ క్రమంలో దంత ఆరోగ్య సంరక్షణ ఎంతో ముఖ్యం. దంతాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దంత క్షయం, పంటి నొప్పి, సున్నితత్వం, చిగురువాపు, నోటి దుర్వాసన మొదలగు దంత సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి.

అయితే దంత సంరక్షణ అనేది పెద్ద రాకెట్ సైన్స్ సబ్జెక్ట్ కాదు. మన ఇంట్లోని చిట్కాలతో దంతాలను ఆరోగ్యంగా చూసుకోవచ్చు.

సాధారణంగా మనం రోజువారి దినచర్యలో భాగంగా నోటి పరిశుభ్రత కచ్చితంగా ఉండాలి. రోజుకు ఒకసారి కంటే రెండు సార్లు నోటిని, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉదాహరణకు పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వాపు వంటి రుగ్మతలను తగ్గించుకోవచ్చు.

కొందరిలో చిగుళ్లు ఎప్పుడూ వాపుతో ఉంటాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. దంతాలు సరిగా శుభ్రం చేసుకోకపోయినా.. రకరకాల రుగ్మతలు వస్తాయి. మరోవైపు పోషకాహార తగ్గినా ఇలాంటి సమస్యలు వాటిల్లుతాయని నిపుణులు అంటున్నారు. అయితే అలాంటి పోషకాహార విలువలు కలిగి ఆహారం ఏంటో దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. దాంతో పాటు దంత సమస్యల కోసం కొన్ని చిట్కాలను కూడా తెలుసుకుందాం.

దంత సమస్యల కోసం చిట్కాలు..

మనం రోజువారీ తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు చేర్చుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది. దంతాల నుంచి చెడు బ్యాక్టీరియాని తొలగింతడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు పండ్లలోని యాపిల్స్‌లో మాలిక్ యాసిడ్ వంటి మూలకం దంతాలపై ఉన్న ఫలకాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా వాటిలో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు దంతాలను చిగుళ్ల నుంచి బలోపేతం చేస్తాయి.
వీటితో పాటు పాలు, పెరుగు, చీజ్ వంటి పాల పదార్థాల ద్వారా కాల్షియం, ఫాస్పరస్ వంటివి అధికంగా లభిస్తాయి. పాల పదార్థాలలో ఉండే పోషకాలు చిగుళ్లకు ఎంతో మేలు చేస్తాయి. మరోవైపు చేపలో ఉంటే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చిగుళ్ల వ్యాధి బారిన పడకుండా కాపాతాయి.
అధిక పోషక విలువలు కలిగిన డ్రై ఫ్ర్రూట్స్ లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దంతాలు పాడవ్వకుండా ఇవి ఎంతగానో తోడ్పతాయి. దంతాలపై బ్యాక్టీరియా కూడా రాకుండా డ్రై ఫ్రూట్స్ సహకరిస్తాయి. దినచర్యలో భాగంగా ప్రతిరోజూ భోజనం తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. భోజనం తర్వాత నోటిని నీటితో శుభం పరచుకోవాలి. పళ్ల మధ్య దాగి ఉన్న పదార్థాలు నోటిలో ఉంటాయి. వీటిని వెంటనే శుభ్రం చేయకపోతే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
వీటితో పాటు తరచుగా నీళ్లు తాగితే నోటిలో ఉండే లాలాజలం ఉప్పగా మారే అవకాశం ఉంది. చూయింగ్ గమ్ లేదా బబూల్ గమ్ తినడం వల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. కానీ చూయింగ్ గమ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ తినడం మంచిదని పోషకాహార నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

viral : Marriage Canceled: రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడు.. దాంతో పెళ్లి క్యాన్సిల్..

తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ వధువు తాను తాళి కట్టించుకోవడానికి ముందు కాబోయే భర్త చదువుకోలేదని తెలిసింది. అయితే అతడు రెండో ఎక్కం కూడా చెప్పలేకపోయాడు. ఇక అంతే ఆ పెళ్లిని పెళ్లికూతురు ధైర్యంగా క్యాన్సిల్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని మెహబూబా జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు మాల్సా పెళ్లికి ముందు నిమిషంలోనే తన కాబోయే భర్త బండారం తెలుసుకోవడంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. పెళ్లి మాటలు జరిగిన సమయంలో వరుడు బాగా చదువుకున్నాడని వారి కుటుంబ సభ్యులు అబద్ధం చెప్పారు. కాకపోతే వధువు చదువుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అబ్బాయి చదువుకున్నాడని అబద్ధం చెప్పడంతో సదరు పెళ్లి కూతురు పెళ్లికి ఒప్పుకొని పెళ్లి పీటల దాకా చేరుకుంది.

ఇకపోతే చివరి నిమిషంలో అసలు విషయం కనిపెట్టి పెళ్లి మండపంపై ని వధువు వరుడికి టెస్ట్ పెట్టడంతో అతని బాగోతం బయటపడింది. ఈ సందర్భంగా వధువు వరుడుని రెండవ ఎక్కం చెప్పమంటే నీళ్లు నమిలాడు. ఈ దెబ్బతో వరుడు ఏమి చదవలేదన్న విషయం పెళ్లి కూతురికి ఇట్లే తెలిసిపోయింది. ఈ దెబ్బతో పెళ్లి పీటల నుంచి వధువు లేచి వెళ్ళిపోయింది. పూల దండలు మార్చుకున్న సమయంలో వధువు మాల్సాతో వరుడు మాటలు కలిపగ.. పంతులుగారు మంత్రాలు చదువుతుంటే ఈ మంత్రాలు, లెక్కలు అసలు నాకు రావంటూ మాట జారాడు. ఆ దెబ్బతో పెళ్లి కూతురికి అనుమానం వచ్చింది. ఇకంతే అతడి ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ మొత్తం మారిపోయాయి.

దేవుడి ఉంగరం దొంగిలిస్తారా? భక్తులను కట్టేసిన పూజరులు! చివర్లో ట్విస్ట్!

ఏపీలో ఎన్నో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచల క్షేత్రం ఒకటి. ఇక్కడి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వెలసి..నిత్యం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. బుధవారం అక్కడ వినోదోత్సవం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే సమయంలో అక్కడ ఓ పెద్ద ఇష్యూ జరిగింది. స్వామి వారి ఉంగరం తీశారంటూ భక్తులను ఆలయ పూజరులు ప్రశ్నించారు. దీంతో అక్కడి వచ్చిన భక్తులు అవాక్కయ్యారు. తాము స్వామి వారి దర్శనంకి వస్తే ఈ నిందలు ఏంటి అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే చివర్లో పూజలు, ఆలయ అధికారులు ఇచ్చిన ట్విస్ట్ కు భక్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం…

బుధవారం సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు వచ్చారు. ఇక కొందరు భక్తులు క్యూలైన్లో ఉండగా..వారికి ఓషాకింగ్ ఘటన ఎదురైంది. స్వామి దర్శనానికి వచ్చి.. ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా చోరీ చేసిన ఉంగరాన్ని ఇచ్చేయండి, లేదంటే పోలీసులకు అప్పగిస్తామంటూ పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించారు. దీంతో దేవుడి దర్శనం కోసం వచ్చిన ఈ భక్తులు.. ఆయన మాటలకు అవాక్కయ్యారు. తాము దొంగల్లా కనిపిస్తున్నామా.. స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని చోరీ చేశారంటారేంటి? ప్రశ్నించారు. చోరీ చేశామని నిందవేయడమే కాకుండా తాళ్లతో బంధించి తీసుకొస్తారా? అంటూ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేవస్థానాచార్యులు అదే స్థాయిలో మరింత గట్టిగా భక్తులపై ఫైర్ అయ్యారు.

మీరు దొంగతనం చేసినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని, పోలీసులు రాక ముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండంటూ ఆయన గట్టిగా అడిగారు. దీంతో అక్కడన ఉన్న కొందరు భక్తులు అయితే ఏకంగా కన్నీటి పర్యంత అయ్యారు. తాము ఉంగరం దొంగిలించలేదని ఎంత చెబుతున్నా వినకుండా దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక భక్తుల చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. చోరీ చేసిన వాటి మాదిరిగానే ఉన్నాయని స్థానాచార్యులు అనడంతో వారి నోటి మాట రాలేదు.

అయితే చివరకు స్థానాచార్యులు చెప్పిన అసలు నిజం తెలుసుకుని భక్తులు అవాక్యయ్యారు. స్వామి వారికి నిర్వహించే వినోదోత్సవంలోని ఓ ఘట్టమని తెలుసుకుని భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం గురించి తెలియని వాళ్లు దొంగతనం నింద పడటంతో భోరున విలపించగా, ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. సింహాచలం అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఇలా వినోదోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

వేసవిలో బెస్ట్‌ బిజినెస్‌.. నో రిస్క్‌.. పెట్టుబడి పోను లక్షల్లో లాభం..

నేటి కాలంలో వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే బిజినెస్‌ అంటే చాలా డబ్బులు పెట్టుబడి పెట్టాలి. సక్సెస్‌ అవుతామనే గ్యారెంటీ లేదు. మరి ఏం చేయాలి. అలాంటి వారికి బెస్ట్‌ ఆప్షన్‌.. సీజనల్‌ వ్యాపారాలు. పండగలు, కాలాలకు తగ్గట్టుగా వ్యాపారం చేసే వారికి లాభమే తప్ప నష్టం ఉండదు. పైగా ఈ సీజనల్‌ బిజినెస్‌లకు పెట్టుబడి తక్కువ.. రిస్క్‌ ఉండదు. లాభం మాత్రం పక్కా. మన అదృష్టం బాగుంటే.. నెలల వ్యవధిలోనే లక్షలు సంపాదించగలం. అలా ఈ వేసవి కాలానికి సెట్‌ అయ్యే ఒక బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీనిలో రిస్క్‌ తక్కువ.. లాభం గ్యారెంటీ. అన్ని కలిసి వస్తే.. నెలల వ్యవధిలోనే మీరు లక్షలు సంపాదించుకోవచ్చు. ఇంతకు ఆ బిజినెస్‌ ఐడియా ఏంటి అంటే..

వేసవి కాలానికి బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా.. కొబ్బరి బోండాల వ్యాపారం. ఎండాకాలంలో వీటికి ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ఏడాదంతా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. కానీ వేసవిలో మాత్రమే దీనికి డిమాండ్‌ ఎక్కువ.. భారీగా లాభాలు పొందేందుకు అవకాశం ఉంది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం జనాలు ఎండాకాలంలో ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక నేటి కాలంలో అందరికి ఆరోగ్యం మీద స్పృహ పెరిగింది. దాంతో కూల్‌డ్రింక్స్ వైపు వెళ్లకుండా కొబ్బరి నీళ్లు తాగడానికే ఆసక్తి చూపుతున్నారు. దాంతో వేసవిలో వీటికి డిమాండ్‌ ఎక్కువ. మీరు గనక ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. లాభమే తప్ప నష్టం ఉండదు అంటున్నారు నిపుణులు.


ఇక కొబ్బరి బొండాల బిజినెస్‌ ప్రారంభానికి భారీగా డబ్బులు అక్కర్లేదు. 20-30 వేల రూపాయలు చాలు అంటున్నారు. మీ వద్ద ఉన్న డబ్బుతో.. పట్టణాల్లో, సిటీల్లో, ఓ హైవే పక్కనే ఓ పెద్ద నీడ ఉన్న చెట్టు చూసుకుని.. కొబ్బరి బోండాలు బిజినెస్ ఎంచక్కా సెట్ చేసుకోవచ్చు. మనకి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు బెంగళూరు నుంచి బోండాలు సరఫరా అవుతున్నాయి. ఒకవేళ మీరు గోదావరి బోండాల వ్యాపారం పెట్టాలనుకుంటే.. ఒక్కో బోండం మీ వద్దకు చేరేసరికి 25 నుంచి 30 రూపాయలు పడుతుంది. ఇక ఇప్పుడు వేసవిలో ఒక్కో బోండం 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముడవుతుంది. అంటే ఒక్కో బోండానికి 20 రూపాయల లాభం ఎటూ పోదు.

ఇలా రోజుకు తక్కువలో తక్కువ 200 కాయలు అమ్ముకున్నా.. 4000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అలా నెల రోజులకు చూసుకుంటే.. మీకు లక్షా 20 వేలు ఆదాయం వస్తుంది. పైన 20 వేలు వివిధ కారణాల వల్ల తీసేసుకున్నా లక్ష రూపాయల లాభం ఎటూ పోదు. అలా ఎండాకాలం తీవ్రత ఉండే ఈ 2 నెలలు వీటిని అమ్ముకున్నా.. కొద్ది రోజుల్లోనే 2 లక్షలు మీరు వెనకేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ప్రారంభించే వ్యాపారం విజయం సాధించాలంటే ముఖ్యంగా చేయాల్సింది.. సరైన ప్రాంతం ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. రద్దీ బాగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే.. ఎక్కువ వ్యాపారం జరిగి.. లాభాలు కళ్ల చూస్తారు అంటున్నారు నిపుణులు.

Age Calculator -క్షణాల్లో మీవయసు సంవత్సరాలలో , వారాలలో మరియు గంటలలో తెలుసుకోవచ్చు..

Age Calculator- The Age Calculator can determine the age or interval between two dates..
👉మీ పుట్టిన తేదీని ఎంటర్ చేసి క్షణాల్లో మీవయసు సంవత్సరాలలో , వారాలలో మరియు గంటలలో తెలుసుకోవచ్చు..

Age Calculator

Date of birth needs to be earlier than the age at date.

The Age Calculator can determine the age or interval between two dates. The calculated age will be displayed in years, months, weeks, days, hours, minutes, and seconds.

Age Calculator- The Age Calculator can determine the age or interval between two dates
The age of a person can be counted differently in different cultures. This calculator is based on the most common age system. In this system, age grows at the birthday. For example, the age of a person that has lived for 3 years and 11 months is 3 and the age will turn to 4 at his/her next birthday one month later. Most western countries use this age system.

In some cultures, age is expressed by counting years with or without including the current year. For example, one person who is twenty years old is the same as one person who is in the twenty-first year of his/her life. In one of the traditional Chinese age systems, people are born at age 1 and the age grows up at the Traditional Chinese New Year instead of birthday. For example, if one baby was born just one day before the Traditional Chinese New Year, 2 days later, the baby will be at age 2 even though he/she is only 2 days old.

In some situations, the months and days result of this age calculator may be confusing, especially when the starting date is the end of a month. For example, we all count Feb. 20 to March 20 to be one month. However, there are two ways to calculate the age from Feb. 28, 2015 to Mar. 31, 2015. If thinking Feb. 28 to Mar. 28 as one month, then the result is one month and 3 days. If thinking both Feb. 28 and Mar. 31 as the end of the month, then the result is one month. Both calculation results are reasonable. Similar situations exist for dates like Apr. 30 to May 31, May 30 to June 30, etc. The confusion comes from the uneven number of days in different months. In our calculation, we used the former method.

Know Your Age… Age Calculator

Personality – మన కనుబొమలు మన వ్యక్తిత్త్వాన్ని చెప్పేస్తాయా ?

సాధారణంగా ఎవరైనా మనకు ఎదురుపడితే ముందుగా మన దృష్టి వారి మొహంపై పడుతుంది. కను ముక్కు తీరు ఎలా వుందనే విషయాన్ని మన కళ్లు స్కాన్ చేసేస్తాయి. వీటిలో ప్రధానంగా మన దృష్టి ఎదుటివారి కళ్ల పై పడుతుంది. ఆ కళ్లతో బాటు కనుబొమల మీద కూడా దృష్టిని సారిస్తాం. అయితే, ఒక్కొక్కరి కనుబొమలు ఒక్కో విధంగా వుంటాయి. కనుబొమలను బట్టి వారి మనస్తత్త్వం, వ్యక్తిత్వం ఏంటో ఇట్టే తెలిసిపోతుందని అంటున్నారు నిపుణులు. అసలు కనుబొమల్లోని విభిన్న రకాలేంటో, వాటిని బట్టి వారి మనస్త్త్వాలను ఎలా తెలుసుకోవచ్చునో ఓసారి చూద్దామా ?

కనుబొమ్మల మధ్య ఎక్కువ దూరం ఉన్నవారు ప్రేమగల వ్యక్తులు. ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తారు. అయితే ఇతర వ్యక్తులు, అంశాల నుంచి చాలా సులభంగా ప్రభావితం అవుతారు.
ఎవరేం చెప్పినా శ్రద్ధగా వింటారు. ఈ క్రమంలో భావోద్వేగాలు, భయం, ఆందోళనల కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఎలాంటి ప్లాన్‌ లేకుండానే పనులు, నిర్ణయాల్లో ముందుకు వెళతారు.

కనుబొమ్మలు బాగా వంగినట్టుగా ఉన్నవారు ఏదైనా సాధించాలన్న లక్ష్యంతో ఉంటారు. సహనం తక్కువ, నాటకీయత ఉంటుంది. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంతా వారిని గుర్తించాలని కోరుకుంటారు. అలా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. జీవితంలోకి, మనసులోకి ఎవరినైనా రానిచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.

దాదాపు గీతలా, నేరుగా ఉండే కనుబొమ్మలు ఉన్నవారు తార్కికంగా ఆలోచించే లక్షణాలు కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచిస్తారు. వీరు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను వేరుగా ఉంచుతారు. ఒకదాని ప్రభావం మరోదానిపై పడనివ్వరు. మొండిగా, సూటిగా వ్యవహరిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. వారి సంబంధ, బాంధవ్యాలలో భావోద్వేగ అలజడులు తక్కువగా ఉంటాయి.

ఉమ్మడి కనుబొమ్మలు ఉన్నవారు ప్రపంచం, సమాజం తమ గురించి ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. వీరు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తారు. వీరి గురించి వీరు వ్యక్తీకరించుకునే అవకాశాన్ని వదులుకోరు. వీరిలో సృజనాత్మకత ఎక్కువ. కళా రంగాల్లోకి వెళ్లే అవకాశం తక్కువ. వీరికి దయాగుణం ఎక్కువ. కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని క్షమించకుండా కఠినత్వం వహిస్తారు. వీరికి నచ్చని అంశాలపై త్వరగా మనస్తాపం చెందుతారు, చిరాకుపడతారు.

మందమైన కనుబొమ్మలు ఉన్నవారు స్వేచ్ఛాజీవులు. ఏదైనా ఎలా ఉన్నదాన్ని అలా ప్రేమిస్తారు. లోపాలు వెతకరు. ఇతరులు వీరి గురించి ఏమనుకుంటారోనని చింతించరు. వీరి మీద వీరికి విశ్వాసం ఎక్కువ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశం, ఉద్వేగాలపై కాకుండా తార్కికంగా ఆలోచనలు చేస్తారు. అయితే ఏదైనా వీరికి అడ్డువస్తే మాత్రం తీవ్రంగా విసుగు చెందుతారు.

సన్నని కనుబొమ్మలు ఉన్నవారు అతిగా ఆలోచిస్తారని.. వారిలో ఆత్మ విశ్వాసం పాళ్లు కాస్త తక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే తమకు ఆత్మవిశ్వాసం బాగానే ఉన్నట్టుగానే వీరు భావిస్తుంటారని.. ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో తర్జనభర్జన పడతారని, ఇతరుల సాయం తీసుకుంటారని వివరిస్తున్నారు. ఏదైనా అంశం గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న దానిపై బాగా ఎక్కువ దూరం ఆలోచిస్తారని చెబుతున్నారు.

గడప దగ్గర ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి ఇంట్లో నుండి అసలు బయటకు వెళ్ళదు..

గడప లేని ఇళ్లు పొట్ట లేని శరీరం వంటిది. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం గడప లేని ఉండదు. అలాగే హిందూ ధర్మంలో ముగ్గుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.
ముగ్గు పాజిటివ్ ఎనర్జీకి ఒక సంకేతం. దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పని చేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగే వారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకుంటే ఆ ఇంటికి వెళ్లేవారే కాదు. వారే కాదు భిక్షగాళ్లు కూడా ముగ్గు లేని ఇంటికి వెళ్లి భిక్షం అడిగే వారే కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. మరణించిన వారికి శార్థ కర్మలు జరిగే వరకు ఆ ఇంటి ముందు ముగ్గు వేయరు.

శార్థ కర్మలుయ జరిగిన తరువాతే ఇంటి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారం కూడా మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడి ఉన్నవి. అందుకే ఏ ఇంటి ముగ్గు లేదో ఆ ఇంట్లో ఇల్లాలికి ఏమి తెలియదని అర్థం. అయితే ఏ ముగ్గును ఎక్కడ వేయాలి అనేది కూడా ఉంది. దేవతా పూజ చేస్తున్నా, దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా చిన్న గీతలను గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు కూడా రానీయదు. అంతేకాదు మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి.

అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా. యంత్ర తంత్ర రహస్య శాస్త్రాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరి చేరనివ్వవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్క కూడదు. తులసి కోట దగ్గర అష్ట దళ పద్మం వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఇక నూతన వధూవరలు తొలిసారి భోజనం చేసే పమయంలో వారి చుట్టు పక్కల లతలు, పుష్పాలు ఉన్న ముగ్గులు వేయాలి. ఇక దేవతా రూపాలు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులను అస్సలు వేయకూడదు. ఒకవేళ వేసిన వాటిని తొక్క కూడదు. ఏ స్త్రీ అయితే నిత్యం దేవాలయంలో అమ్మవారు, శ్రీ మహా విష్ణువు ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి వైదవ్యం రాదని ఏడు జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చింద కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. చాలా మంది రోజు ముగ్గులు వేయలేక ఇంటి ముందు పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. దీనిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనక, దీపారాధన చేసే ప్రదేశంలో, తులసి మొక్క దగ్గర ముగ్గులు వేయాలి. ఇక ఇంటి ముందు లేక గడపపైనా ముగ్గులో భాగంగా రెండు అడ్డ గీతలు ఇంట్లోకి దుష్ట శక్తి రాకుండా ఉంటుంది. గడప పైనా రెండు అడ్డగీతలు గీస్తే లక్ష్మీ దేవి అస్సలు బయటకు వెళ్లదు. ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండు అడ్డ గీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని అర్థం. ఏ సమయంలో చేసినా చేయకపోయినా పండుగ సమయంలో ఈ విధంగా ముగ్గు వేయాలి.

ఉత్తర, పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ.

రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలోకూడా వ్రాయబడి ఉన్నది.

తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది, దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.

భూమి ఒక పెద్ద అయస్కాంతం, మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును.

ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు పిలుస్తారు, విశ్వములోని అన్నింటి ప్రభావం, శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య “లయ” తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును.

ఉత్తరదిక్కుకు ఆకర్షణ ( అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును.

ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో ఉన్నది.

మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం, శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.

వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం, బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం, దీనినే పుణికి అని బ్రహ్మకపాలం అని అందురు.

ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.

దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని ” వెక్టార్ ” ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును.

యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస, నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును, ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోవును.

విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును, వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను, కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం, బాధ, అలసట , నిస్సారం మొదలగునవి కలుగును.

కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం, తిమ్మిరి, నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును.

కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.

ఇదేవిధముగా పడమట దిక్కు కూడా, ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి, మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు సర్వప్రాణులకు ఆధారభూతము, జగత్తును పోషించువాడు, సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తలఉంచి నిదురించిన కలుగును.

Washing Machine Tips: బాంబుల్లా పేలుతున్న వాషింగ్ మిషన్లు.. ఈ టిప్స్ పాటిస్తే సేఫ్.. ఓ లుక్కేయండి

ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
పల్లెల నుంచి నగరాల వరకు అనేక ఇళ్లలో వాషింగ్ మిషన్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరూ.. వారి ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా తగిన వాషింగ్ మిషన్లను కొనుగోలు చేసి వాడుతున్నారు.

అయితే.. వాషింగ్ మిషన్లలో బట్టలు వేస్తే నిమిషాల్లో శుభ్రం అవుతాయన్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవలి కాలంలో వాషింగ్ మిషన్లు బాంబుల మాదిరిగా పేలుతున్నాయన్న వార్తలు అనేకంగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇటీవల లక్నోలో ఓ మహిళ వాషింగ్ మిషన్ వినియోగిస్తున్న సమయంలో షాక్ కు గురై ప్రాణాలు వదిలింది. అయితే.. వాషింగ్ మిషన్ ను వినియోగిస్తున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై అనేక మందికి అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని చిట్కాలను పాటిస్తే.. ప్రమాదాలు జరగవని చెబుతున్నారు. వారు ఏమంటున్నారో చూద్దాం. వాషింగ్ మెషీన్ను ఉపయోగించడం చాలా సులభం, కానీ కొన్నిసార్లు వాషింగ్ మెషీన్ను ఉపయోగిస్తున్నప్పుడు అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు.

మనలో చాలా మంది తమలో ఓ చిన్న ఎలక్ట్రీషియన్ ఉన్నాడని భావిస్తూ ఉంటారు. ప్లగ్ లు ఫిట్ చేయడం లాంటి పనులను చిటికెలో చేస్తామన్న ధీమా ఉంటుంది. అయితే.. వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు లాంటి సున్నితమైన వస్తువులను రిపేర్ చేయడంలో వేలు పెట్టకపోవడమే మంచిది.

ముఖ్యంగా వాషింగ్ మిషన్లకు సంబంధించిన వైర్లు ఏమైనా తెగినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత టెక్నీషియన్ ను పిలిపించండి. ఇంకా ఎప్పటికప్పుడు ప్లగ్ కు సంబంధించిన వైర్లను చెక్ చేయండి. ఏమైనా తెగినట్లు అనిపిస్తే.. వెంటనే మార్పించండి. లేకపోతే.. వాషింగ్ మెషీన్‌లో విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.

వాషింగ్ మెషిష్ ను ఉపయోగిస్తున్నప్పుడు నీరు నీరు నియంత్రణ ప్యానెల్‌పై పడకూడదు. యంత్రాన్ని నియంత్రించే బటన్‌పై చాలాసార్లు నీరు పడుతూ ఉంటుంది. ఈ అంశంపై శ్రద్ధ చూపకపోతే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

వాషింగ్ మెషిన్ ను ఎల్లప్పుడూ అనుభవజ్ఞుడైన సాంకేతిక నిపుణుడితోనే రిపేర్ చేయించాలి. అనుభవం లేని సాంకేతిక నిపుణులు కొన్నిసార్లు యంత్రం లోపల వైర్లకు టేప్ చేయడం మర్చిపోతారు.

అలాగే కొన్నిసార్లు మోటార్ స్క్రూలు సరిగ్గా బిగించడం మర్చిపోతారు. అటువంటి పరిస్థితిలో.. వాషింగ్ మెషిన్ ను ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదం పెరుగుతుంది.

ఇంకా వాషింగ్ మిషన్ ను క్రమం తప్పకుండా.. సర్వీసింగ్ చేయిస్తూ ఉండండి. తద్వారా చిన్న చిన్న రిపేర్లు పెద్దవిగా కాకముందే సమస్యను పరిష్కరించవచ్చు.

WhatsApp: అదే జరిగితే ఇండియా నుంచి వెళ్లిపోతాం.. వాట్సాప్ సంచలన కామెంట్స్..

WhatsApp Sensational Comments: వాట్సాప్ సంచలన కామెంట్స్ చేసింది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను రద్దు చేయాలనుకుంటే భారత్ నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోతామని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. వినియోగదారుని గోప్యత దృశ్యా తాము ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే వాట్సాప్‌ను భారతదేశంలో నిలిపివేస్తామని మెటా కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా మెసేజ్ కంటెంట్‌ను పంపినవారు, గ్రహీత మాత్రమే చదవగలరని.. దానిని విచ్ఛిన్నం చేస్తే వినియోగదారుని గోప్యతకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నారు.

వాట్సాప్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ మెటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021ని సవాలు చేస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం కంపెనీలు చాట్‌లను ట్రేస్ చేయడం, మెసేజ్ మూలాలను గుర్తించడం అవసరం.

వాట్సాప్‌ను ప్రజలు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ అందించే గోప్యతా లక్షణాల కారణంగా, భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు వాట్సాప్‌ను వాడుతున్నారని న్యాయవాది తెలిపారు. కంటెంట్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు వినియోగదారుల గోప్యతను దెబ్బతీసే ఏవైనా నియమాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 కింద ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తాయని వాట్సాప్ వాదించింది.

కంపెనీ తరపు న్యాయవాది, “ఇలాంటి నిబంధన ప్రపంచంలో మరెక్కడా లేదు. బ్రెజిల్‌లో కూడా కాదు. దీని కోసం పెద్ద ఛైన్ సిస్టం డెవలప్ చెయ్యాలి. ఏ సందేశాలను డీక్రిప్ట్ చేయమని అడగుతారో మాకు తెలియదు. దీని అర్థం మిలియన్ల సందేశాలు కొన్ని సంవత్సరాల పాటు నిల్వ చేయాలి.” అని తెలిపారు.

Amazon Sale | త్వరలో అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు..!

Amazon Sale : ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ప్రొడక్ట్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది. అంతేగాక సెలక్టెడ్ డివైజ్‌లపై భారీ తగ్గింపులు అందించనుంది. అదేవిధంగా వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, AC లు ఇతర పరికరాలపై కస్టమర్‌లు గొప్ప డీల్‌లను పొందవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం అమెజాన్‌లో సమ్మర్ సేల్ బ్యానర్‌ లైవ్ అవుతున్నది. సేల్ డేట్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ సేల్‌లో కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు, AC లు, రిఫ్రిజిరేటర్‌లు, కూలర్‌లు, ల్యాప్‌టాప్‌లు లాంటి అనేక ప్రత్యేక పరికరాలపై డిస్కౌంట్లు, ఆఫర్లను పొందవచ్చు. ఏ పరికరాలపై ఎంత వరకు డిస్కౌంట్ లభించనుందో చూద్దాం..

డిస్కౌంట్స్‌..
బెస్ట్ డీల్ – రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్టంగా 40 శాతం తగ్గింపు
ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు
హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు తగ్గింపు
ఏసీలపై 55 శాతం వరకు తగ్గింపు
రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు తగ్గింపు
స్మార్ట్‌వాచ్‌లపై 70 శాతం వరకు తగ్గింపు
ట్యాబ్లెట్‌లపై 70 శాతం వరకు తగ్గింపు
టాప్ రేటింగ్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు
ఇతర ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు
Alexa, Fire TV పరికరాలపై గరిష్టంగా 45 శాతం తగ్గింపు
పైవే కాకుండా అమెజాన్ కూపన్‌లు, క్యాష్‌బ్యాక్ రివార్డ్స్, ప్రీ-బుక్, బై మోర్ సేవ్ మోర్, అమెజాన్ కాంబో ద్వారా మరింత మెరుగైన ఆఫర్‌లను అమెజాన్ ఇండియా తీసుకువస్తోంది. అమెజాన్ ఈ సేల్‌లో పాకెట్-ఫ్రెండ్లీ స్టోర్‌లను కూడా హోస్ట్ చేస్తుంది. ఇందులో రూ.99 లోపు స్టోర్‌లు, రూ.199 లోపు స్టోర్‌లు, రూ.299 లోపు స్టోర్‌లు, రూ.499 లోపు స్టోర్‌లు ఉంటాయి. అదేవిధంగా 8pm డీల్ స్టోర్, గ్రాండ్ ఓపెనింగ్ డీల్ మొదలైన డీల్ స్టోర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ICICI బ్యాంక్, BoB, OneCard క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందుకోవచ్చు.

కేంద్రం స్కీమ్.. వ్యాపారానికి 10 లక్షల వరకు లోన్.. మొత్తం కట్టాల్సిన అవసరం లేదు!

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల వరకు ఎన్నో స్కీమ్ లను ప్రారంభిస్తున్నారు. అలాగే వ్యాపారంలో మహిళలను ప్రోత్సాహించి వారి సొంత కాళ్ల మీద నిలబడే విధంగా.. రకరకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. కాగా, సొంతంగా వ్యాపారం చేయాలి అనుకున్నవారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. పైగా ఈ పథకంలో సబ్సిడీ ద్వారా లోన్ కూడా అందిస్తున్నారు. మరి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ కొత్త పథకం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఇప్పటి వరకు సరైన ఉద్యోగం లేక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అందించింది. కాగా, సొంతగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నా వారికి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పవచ్చు. అయితే దేశంలో ఉండే నిరుద్యోగులకు సొంత వ్యాపారాల వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అద్భుతమైన స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. పైగా దీనిపై 35 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇక సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. అలాగే తక్కువ వడ్డీకే పెట్టుబడిని అందుకుని తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. ఇక మీరు తీసుకునే రూ.10 లక్షల రుణంలో కేంద్ర ప్రభుత్వమే రూ. 3.5 లక్షల వరకు చెల్లిస్తుంది. అయితే ఇందులో మీరు చెల్లించాల్సింది రూ. 6.5 లక్షలు మాత్రమే. కనుక ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

అయితే మెక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఈ లోన్స్ అందిస్తుంది. ఈ క్రమంలోనే.. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం (PMFME) తీసుకొచ్చింది. ఇక ఆహార శుద్ధి రంగంలో చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో..కేంద్రం ఈ స్కీమ్ ప్రారంభించింది. అయితే దీనిని మీ ఊరిలోనే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా ప్రారంభించవచ్చు. అలాగే పీఎంఎఫ్ఎం పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. కనుక అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ఇందులో మీరు ఏర్పాటు చేసే యూనిట్ ఖర్చు రూ. 10 లక్షలు అయితే.. అందులో 90 శాతం కేంద్రం రుణం ఇస్తుంది.

అయితే మిగిలన 10 శాతాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు రూ. 9 లక్షల వరకు లోన్ వస్తుంది. ఈ లోన్ పై మీకు 35 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అంటే దాదాపు రూ. 3.15 లక్షల వరకు మాఫీ అవుతుంది. కనుక ఈ స్కీమ్ ద్వారా లోన్ అప్లై చేసుకోవాలి అనుకునే వారు https://pmfms.mofpi.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పథకంలో ఇప్పటి వరకు మొత్తం 2,46,102 దరఖాస్తులు వచ్చినట్లు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. అందులో వ్యక్తులు 2,43,400 మంది ఉండగా.. సంఘాలు 2,385 ఉన్నాయి. వీటిల్లో 87,355 దరఖాస్తులకు ఇప్పటికే రుణాలు మంజూరయ్యాయి. అందులో 67,949 మందికి రుణాలు పంపిణీ చేశారు. ఓడీఓపీ అప్లికేషన్లు సబ్మిట్ చేసినవి 45,949 ఉన్నాయి. పీఎంఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Navy Recruitment: నావల్ డాక్‌యార్డులో 301 పోస్టులు.. అర్హతలివే

Navy Recruitment: ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(NAVY).. నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 301 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 8th, 10thతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉన్నవారు అర్హులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొత్తం ఖాళీల సంఖ్య 301. అందులో ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో 288 పోస్టులు ఉన్నాయి. అలాగే రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో 13 పోస్టులు ఉన్నాయి.

ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో 288 పోస్టులు:

ఎలక్ట్రీషియన్- 40పోస్టులు

ఫిట్టర్- 50పోస్టులు

మెకానిక్(డీజిల్)-35 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 26 పోస్టులు

షిప్ రైట్(ఉడ్)కార్పెంటర్- 18 పోస్టులు

ఎలక్ట్రోప్లేటర్- 01 పోస్టు

ఫౌండ్రీ మ్యాన్- 01 పోస్టు

మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్(ఎంఎంటీఎం)- 13 పోస్టులు

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 07 పోస్టులు

మెషినిస్ట్- 13 పోస్టులు

పైప్ ఫిట్టర్(ప్లంబర్)- 13 పోస్టులు

పెయింటర్(జి)- 09 పోస్టులు

టైలర్(జి)సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్- 03 పోస్టులు

ప్యాటర్న్ మేకర్/కార్పెంటర్- 02 పోస్టులు

మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ- 07 పోస్టులు

షీట్ మెటల్ వర్కర్- 03 పోస్టులు

షిప్ రైట్(స్టీల్)(ఫిట్టర్)- 16 పోస్టులు

వెల్డర్(జి అండ్‌ ఇ)- 20 పోస్టులు

మేసన్(బీసీ)- 08 పోస్టులు

ఐ అండ్‌ సీటీఎస్‌ఎం- 03 పోస్టులు

రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ 13 పోస్టులు:

రిగ్గర్ -12 పోస్టులు

ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్ -01 పోస్టు

8th, 10th తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
14 సంవత్సరాలకు పైబడి ఉండాలి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 2024 మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.

స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్‌ వ్యవహారంపై దుమారం..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజని కిడ్నాప్‌ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజని కిడ్నాప్‌ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ఆ మహిళ అపహరణకు గురయ్యారని డయల్‌-100 ద్వారా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ విషయాన్ని ఆ రాత్రికి తెలియజేయకుండా గోప్యత పాటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టిలో పెడతారు. అలాంటిది కీలకమైన ఎన్నికల సమయంలో, ఆపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న ఆమె కిడ్నాప్‌కు గురైతే చెప్పకపోవడం ప్రశ్నార్థకమవుతోంది. ఆ మహిళను గురువారం వారి తండ్రికి అప్పగించడానికి కొద్ది నిమిషాల ముందే ఆయన చెవిలో పడేసినట్లు సమాచారం. అప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అప్పటికే ఆమె కిడ్నాప్‌ వ్యవహారం మీడియాలో రావడం చూసి సదరు ఉన్నతాధికారి కంగుతిన్నారు. ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నించే లోపే ఓ అధికారి నుంచి ఫోన్‌ వెళ్లింది. ఇప్పుడు చెబుతారా అంటూ ఉన్నతాధికారి ఆగ్రహించినట్లు సమాచారం. ఓ అధికారి ఆదేశాల మేరకు ఉన్నతాధికారికి తెలియనీయకుండా గోప్యత పాటించారని తెలుస్తోంది.

విడిచిపెట్టి మళ్లీ తీసుకురావడం ఏమిటి?
ఆ మహిళను బుధవారం రాత్రి స్టేషన్‌ నుంచి పంపించేశామని తెదేపా లీగల్‌సెల్‌ న్యాయవాదులకు సమాధానమిచ్చిన పోలీసులు తిరిగి గురువారం ఎందుకు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె ఎక్కడ ఉందో చెప్పాలని పోలీసుల్ని గట్టిగా నిలదీశారు. తాము హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేయడంతో ఉదయం పంపించేశామని చెప్పారు. అయితే ఆ మహిళ గురువారం ఉదయం 11 గంటల సమయంలో స్టేషన్‌కు సమీపంగానే మరోసారి అపహరణకు గురయ్యారు. అయితే ఇంతకీ ఆమె ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. ఆమె మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తానేమీ నామినేషన్‌ వేయడం లేదని, దయ చేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు.

మీ స్టేషన్‌లో ఉందా?

అపహరణకు గురైన రజని మీ స్టేషన్‌లో ఏమైనా ఉందా? వికాసనగర్‌లో ఉందట కదా? అని ఆరా తీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నగరంపాలెంలో కేసు నమోదైతే ఆ స్టేషన్‌లో కాకుండా ఇతర స్టేషన్లలో ఏమైనా ఉన్నారా అని ఆరా తీయడం వెనుక ఓ కారణం లేకపోలేదు. పోలీసుల చెర నుంచి తప్పించుకోకుండా చూడడానికి నగరంపాలెం స్టేషన్‌ సిబ్బందే కాదు ఇతర పోలీసుస్టేషన్ల సిబ్బందికి ఆమెను కాపాడే బాధ్యతలు అప్పగించిన విషయం తెలుసుకునే సదరు అధికారులు ఆమె గురించి ఇతర పోలీసు స్టేషన్లలో కూడా ఆరా తీశారని చెబుతున్నారు.

విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్‌గా..!

సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ కొదవేం ఉండవు. ఇప్పటికప్పుడు కొత్తగా సినీ తారల జీవితాలకు సంబంధించిన విషయాలు అభిమానులకు చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే మీడియాలో సినీ తారలకు చెందిన ఆసక్తిని మాత్రమే కాదు.. సంచలనం రేపుతుంటాయి. అయితే తాజాగా బాలీవుడ్ తార విద్యాబాలన్ వైవాహిక జీవితం పట్ల ఓ వార్త సంచలనం రేపుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి, విద్యా బాలన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే..

విద్యాబాలన్ విషయానికి వస్తే.. ముంబైలో జన్మించిన ఆమె అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్నది. బెంగాలీ చిత్రం భోలే థేకో సినిమాతో వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పరిణిత సినిమాతో ఆమె దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాందించుకొన్నది. అక్కడి నుంచి విలక్షణమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకొంటున్నది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో యూటీవీ మోషన్ పిక్చర్స్ సీఈవోగా పనిచేస్తున్న సిద్దార్థ్ రాయ్ కపూర్‌తో ప్రేమలో పడింది. వారిద్దరూ చాలాకాలం డేటింగ్ చేశారు. 2012 మే నెలలో తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఇక డిసెంబర్‌లో వారిద్దరూ ముంబైలో వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ సుఖంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక ప్రొఫెషనల్‌గా విద్యాబాలన్ హీరోయిన్‌ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకొంటున్నారు. శాకుంతల దేవీ, షేర్నీ, జల్సా, నీయత్ లాంటి సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా దో ఔర్ దో ప్యార్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి అంతంత మాత్రంగానే స్పందన ఉంది. ఈ సినిమాలో లిప్ లాక్స్‌తో ఆమె నటించిన తీరు హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది.

ఇక విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకంగా తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకొన్నారు. విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్నారు. తెలుగులో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆమెపై ఓ భారీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఇదిలా ఉండగా, ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు, వార్తలతో సంచలనం రేపే ఉమేర్ సంధూ రూమర్ క్రియేట్ చేశాడు. విద్యాబాలన్, ఆమె భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ విడిపోయారు. వేర్వేరుగా కాపురం ఉంటున్నారు అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వార్త నిజమేనా అనే విషయం భారీ చర్చకు దారి తీసింది.

Chanakya Niti: విజయం కోసం చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి…అన్నిటి లో సక్సెస్…. డబ్బుకు లోటు ఉండదు

ప్రతి ఒక్కరూ ఆనందం, శ్రేయస్సు, సంపద , కీర్తి దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటే మీరు ఆచార్య చాణక్య చెప్పిన ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఇవి జీవితంలో చాలా మార్పును తీసుకురావచ్చు. దీంతో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. విజయం కోసం ఆచార్య చాణక్య చెప్పిన 5 సక్సెస్ సూత్రాలను గురించి తెలుసుకుందాం. వీటిని గుర్తించి నడుచుకుంటే జీవితంలో సులభంగా విజయం సాధించవచ్చు.

ఎవరైనా జీవితంలో విజయం సాధించాలనుకుంటే కొన్ని విధానాలను అనుసరించడం ద్వారా జీవితంలో సులభంగా విజయం సాధించవచ్చు. నేటి కాలంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందం, శ్రేయస్సు, సంపద , కీర్తి దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటే మీరు ఆచార్య చాణక్య చెప్పిన ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఇవి జీవితంలో చాలా మార్పును తీసుకురావచ్చు. దీంతో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. విజయం కోసం ఆచార్య చాణక్య చెప్పిన 5 సక్సెస్ సూత్రాలను గురించి తెలుసుకుందాం. వీటిని గుర్తించి నడుచుకుంటే జీవితంలో సులభంగా విజయం సాధించవచ్చు.

అలాంటి వారికి మంచి జ్ఞానం ఉంటుంది:
శాస్త్ర నియమాలను నిరంతరం ఆచరిస్తూ విద్యను పొందే వ్యక్తి.. ఏది తప్పు, ఏది ఒప్పు , శుభా అశుభాల గురించి జ్ఞానాన్ని పొందుతారు. ఇలాంటి వ్యక్తికి ఉత్తమ జ్ఞానం ఉంటుంది. అంటే అలాంటి వ్యక్తులు జీవితంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి కష్ట, నష్టాలు ఎదురైనా సులభంగా ఎదుర్కొంటారు.

అలాంటి వారికి దూరంగా ఉండండి
కొందరు వ్యక్తులకు అంటే దుష్ట భార్యకు, తప్పుడు స్నేహితుడికి, సోమరి సేవకులకు, శత్రువులకు ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అంతేకాదు వీరితో చెలిమి మరణాన్ని ఆలింగనం చేసుకోవడం వంటిది. అంటే అలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం స్నేహం చేస్తారు. మీకు అవసరమైన సమయంలో మమ్మల్ని వదిలేస్తారు.
డబ్బులు ఆదా చేసే గుణం
ఎప్పుడు ఎలా ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయో ఎవరికీ తెలియదు. ఆర్ధిక ఇబ్బందులను నివారించడానికి ప్రతి వ్యక్తి తమ సంపాదనలో కొంత డబ్బును ఆదా చేయాలి. అదే సమయంలో తన సంపదను వదులుకుని కూడా భార్యను రక్షించాలి.

ఇలాంటి చోట ఉండకూడదు
ఎవరైనా సరే తమకు గౌరవం లభించని ప్రాంతాల్లో అస్సలు జీవించకూడదు. ఉపాధి మార్గాలు లేని చోట, మనుషులు నివసించకూడదు. మీకు స్నేహితులు లేని చోట. జ్ఞానం లేని ప్రదేశాన్ని కూడా వదిలివేయాలి. ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలి.

ప్రజలు జీవితంలో ఈ విధంగా పరీక్షించబడతారు.
చెడు సమయం ఎదురైనప్పుడు సేవకుడు పరీక్షించబడతాడు. జీవితంలో కష్టాలు చుట్టుముట్టినప్పుడు బంధువులు పరీక్షించబడతారు. సంక్షోభ సమయాల్లో స్నేహితుడు పరీక్షించబడతాడు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు భార్యకు పరీక్ష వస్తుంది. అంటే కష్టాల్లో ఎవరు అండగా నిలబడతారో గుర్తించుకుని మనిషి నడుచుకోవాలి.

ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఎవరు నడుచుకుంటే వారు తమ జీవితంలో సక్సెస్ అందుకుంటాడని చాణుక్యుడు చెప్పాడు.

Jio Prepaid Plans: ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం.. ప్రయోజనాలు కూడా తెలిస్తే షాకవుతారు

ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో డేటాతో పాటు, కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది కాకుండా అనేక ప్లాన్‌లతో ఉచిత ఓటీటీను కూడా ఆస్వాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డేటా వినియోగం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో సగటు వినియోగదారుడు అధిక డేటా వచ్చే వివిధ ప్లాన్స్‌ గురించి అన్వేషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మీరు 2.5 జీబీ రోజువారీ డేటా పొందే అవకాశం ఉండేలా కొన్ని ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జియో ప్లాన్ రూ. 3662
ఈ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 2.5 జీబీ డేటాను అందిస్తుంది. ఇది 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు రోజువారీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ ఎంపికను పొందవచ్చు. అలాగే సోనీ లివ్, జీ5, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.

జియో ప్లాన్ రూ. 2999
ఈ జియో ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో 2.5 జీబీ డేటాతో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ అందుబాటులో ఉంది.
జియో ప్లాన్ రూ. 349
చౌకైన ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ డేటాతో పాటు వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇది జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లకు కూడా యాక్సెస్‌ పొందవచ్చు.

Oppo K12 Launch: ఒప్పో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు అదుర్స్.. ధర కూడా తక్కువే….

ప్రముఖ మొబైల్స్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఒప్పో K12 ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి లాంచ్ కాబోతుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది. సెంటర్ హోల్-పంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇక ఈ హ్యాండ్‌సెట్ 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.. ఈ ఫోన్ ధర మొదలగు వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ తో రాబోతుంది.. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా అడ్రినో 720 జీపీయూతో వస్తుంది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది.. అదే విధంగా ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14తో ఫోన్ వస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే..డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియులకు ఇది పండగే అని చెప్పాలి. సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ను కలిగి ఉంటుంది. 5,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది..

ధర విషయానికొస్తే.. ఈ కొత్త మొబైల్ 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర దాదాపు రూ. 20,700 ఉంటుందని తెలుస్తుంది.. అలాగే 12జీబీ+ 256జీబీ, 12జీబీ+ 512జీబీ వేరియంట్‌లు దాదాపు రూ. 23,900, రూ. 28,700 ధరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త ఫోన్ ఈ నెల 29 నుంచి సేల్ అందుబాటులో కి రానుంది.. ఈ ఫోన్ వెయిట్ లెస్ గా రాబోతుంది.. 186 గ్రాముల బరువు ఉంటుంది..

Health

సినిమా