గడప దగ్గర ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి ఇంట్లో నుండి అసలు బయటకు వెళ్ళదు..

గడప లేని ఇళ్లు పొట్ట లేని శరీరం వంటిది. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం గడప లేని ఉండదు. అలాగే హిందూ ధర్మంలో ముగ్గుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.
ముగ్గు పాజిటివ్ ఎనర్జీకి ఒక సంకేతం. దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పని చేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగే వారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకుంటే ఆ ఇంటికి వెళ్లేవారే కాదు. వారే కాదు భిక్షగాళ్లు కూడా ముగ్గు లేని ఇంటికి వెళ్లి భిక్షం అడిగే వారే కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. మరణించిన వారికి శార్థ కర్మలు జరిగే వరకు ఆ ఇంటి ముందు ముగ్గు వేయరు.


శార్థ కర్మలుయ జరిగిన తరువాతే ఇంటి ముందు ముగ్గు వేస్తారు. ఈ ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారం కూడా మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడి ఉన్నవి. అందుకే ఏ ఇంటి ముగ్గు లేదో ఆ ఇంట్లో ఇల్లాలికి ఏమి తెలియదని అర్థం. అయితే ఏ ముగ్గును ఎక్కడ వేయాలి అనేది కూడా ఉంది. దేవతా పూజ చేస్తున్నా, దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా చిన్న గీతలను గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు కూడా రానీయదు. అంతేకాదు మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి.

అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా. యంత్ర తంత్ర రహస్య శాస్త్రాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరి చేరనివ్వవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్క కూడదు. తులసి కోట దగ్గర అష్ట దళ పద్మం వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఇక నూతన వధూవరలు తొలిసారి భోజనం చేసే పమయంలో వారి చుట్టు పక్కల లతలు, పుష్పాలు ఉన్న ముగ్గులు వేయాలి. ఇక దేవతా రూపాలు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులను అస్సలు వేయకూడదు. ఒకవేళ వేసిన వాటిని తొక్క కూడదు. ఏ స్త్రీ అయితే నిత్యం దేవాలయంలో అమ్మవారు, శ్రీ మహా విష్ణువు ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి వైదవ్యం రాదని ఏడు జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చింద కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. చాలా మంది రోజు ముగ్గులు వేయలేక ఇంటి ముందు పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. దీనిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనక, దీపారాధన చేసే ప్రదేశంలో, తులసి మొక్క దగ్గర ముగ్గులు వేయాలి. ఇక ఇంటి ముందు లేక గడపపైనా ముగ్గులో భాగంగా రెండు అడ్డ గీతలు ఇంట్లోకి దుష్ట శక్తి రాకుండా ఉంటుంది. గడప పైనా రెండు అడ్డగీతలు గీస్తే లక్ష్మీ దేవి అస్సలు బయటకు వెళ్లదు. ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండు అడ్డ గీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని అర్థం. ఏ సమయంలో చేసినా చేయకపోయినా పండుగ సమయంలో ఈ విధంగా ముగ్గు వేయాలి.