Personality – మన కనుబొమలు మన వ్యక్తిత్త్వాన్ని చెప్పేస్తాయా ?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

సాధారణంగా ఎవరైనా మనకు ఎదురుపడితే ముందుగా మన దృష్టి వారి మొహంపై పడుతుంది. కను ముక్కు తీరు ఎలా వుందనే విషయాన్ని మన కళ్లు స్కాన్ చేసేస్తాయి. వీటిలో ప్రధానంగా మన దృష్టి ఎదుటివారి కళ్ల పై పడుతుంది. ఆ కళ్లతో బాటు కనుబొమల మీద కూడా దృష్టిని సారిస్తాం. అయితే, ఒక్కొక్కరి కనుబొమలు ఒక్కో విధంగా వుంటాయి. కనుబొమలను బట్టి వారి మనస్తత్త్వం, వ్యక్తిత్వం ఏంటో ఇట్టే తెలిసిపోతుందని అంటున్నారు నిపుణులు. అసలు కనుబొమల్లోని విభిన్న రకాలేంటో, వాటిని బట్టి వారి మనస్త్త్వాలను ఎలా తెలుసుకోవచ్చునో ఓసారి చూద్దామా ?

కనుబొమ్మల మధ్య ఎక్కువ దూరం ఉన్నవారు ప్రేమగల వ్యక్తులు. ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తారు. అయితే ఇతర వ్యక్తులు, అంశాల నుంచి చాలా సులభంగా ప్రభావితం అవుతారు.
ఎవరేం చెప్పినా శ్రద్ధగా వింటారు. ఈ క్రమంలో భావోద్వేగాలు, భయం, ఆందోళనల కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఎలాంటి ప్లాన్‌ లేకుండానే పనులు, నిర్ణయాల్లో ముందుకు వెళతారు.

కనుబొమ్మలు బాగా వంగినట్టుగా ఉన్నవారు ఏదైనా సాధించాలన్న లక్ష్యంతో ఉంటారు. సహనం తక్కువ, నాటకీయత ఉంటుంది. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంతా వారిని గుర్తించాలని కోరుకుంటారు. అలా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. జీవితంలోకి, మనసులోకి ఎవరినైనా రానిచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.

దాదాపు గీతలా, నేరుగా ఉండే కనుబొమ్మలు ఉన్నవారు తార్కికంగా ఆలోచించే లక్షణాలు కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచిస్తారు. వీరు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను వేరుగా ఉంచుతారు. ఒకదాని ప్రభావం మరోదానిపై పడనివ్వరు. మొండిగా, సూటిగా వ్యవహరిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. వారి సంబంధ, బాంధవ్యాలలో భావోద్వేగ అలజడులు తక్కువగా ఉంటాయి.

ఉమ్మడి కనుబొమ్మలు ఉన్నవారు ప్రపంచం, సమాజం తమ గురించి ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. వీరు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తారు. వీరి గురించి వీరు వ్యక్తీకరించుకునే అవకాశాన్ని వదులుకోరు. వీరిలో సృజనాత్మకత ఎక్కువ. కళా రంగాల్లోకి వెళ్లే అవకాశం తక్కువ. వీరికి దయాగుణం ఎక్కువ. కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని క్షమించకుండా కఠినత్వం వహిస్తారు. వీరికి నచ్చని అంశాలపై త్వరగా మనస్తాపం చెందుతారు, చిరాకుపడతారు.

మందమైన కనుబొమ్మలు ఉన్నవారు స్వేచ్ఛాజీవులు. ఏదైనా ఎలా ఉన్నదాన్ని అలా ప్రేమిస్తారు. లోపాలు వెతకరు. ఇతరులు వీరి గురించి ఏమనుకుంటారోనని చింతించరు. వీరి మీద వీరికి విశ్వాసం ఎక్కువ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశం, ఉద్వేగాలపై కాకుండా తార్కికంగా ఆలోచనలు చేస్తారు. అయితే ఏదైనా వీరికి అడ్డువస్తే మాత్రం తీవ్రంగా విసుగు చెందుతారు.

సన్నని కనుబొమ్మలు ఉన్నవారు అతిగా ఆలోచిస్తారని.. వారిలో ఆత్మ విశ్వాసం పాళ్లు కాస్త తక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే తమకు ఆత్మవిశ్వాసం బాగానే ఉన్నట్టుగానే వీరు భావిస్తుంటారని.. ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో తర్జనభర్జన పడతారని, ఇతరుల సాయం తీసుకుంటారని వివరిస్తున్నారు. ఏదైనా అంశం గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న దానిపై బాగా ఎక్కువ దూరం ఆలోచిస్తారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *