విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్‌గా..!

సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ కొదవేం ఉండవు. ఇప్పటికప్పుడు కొత్తగా సినీ తారల జీవితాలకు సంబంధించిన విషయాలు అభిమానులకు చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే మీడియాలో సినీ తారలకు చెందిన ఆసక్తిని మాత్రమే కాదు.. సంచలనం రేపుతుంటాయి. అయితే తాజాగా బాలీవుడ్ తార విద్యాబాలన్ వైవాహిక జీవితం పట్ల ఓ వార్త సంచలనం రేపుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి, విద్యా బాలన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే..


విద్యాబాలన్ విషయానికి వస్తే.. ముంబైలో జన్మించిన ఆమె అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్నది. బెంగాలీ చిత్రం భోలే థేకో సినిమాతో వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పరిణిత సినిమాతో ఆమె దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాందించుకొన్నది. అక్కడి నుంచి విలక్షణమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకొంటున్నది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో యూటీవీ మోషన్ పిక్చర్స్ సీఈవోగా పనిచేస్తున్న సిద్దార్థ్ రాయ్ కపూర్‌తో ప్రేమలో పడింది. వారిద్దరూ చాలాకాలం డేటింగ్ చేశారు. 2012 మే నెలలో తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఇక డిసెంబర్‌లో వారిద్దరూ ముంబైలో వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ సుఖంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక ప్రొఫెషనల్‌గా విద్యాబాలన్ హీరోయిన్‌ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకొంటున్నారు. శాకుంతల దేవీ, షేర్నీ, జల్సా, నీయత్ లాంటి సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా దో ఔర్ దో ప్యార్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి అంతంత మాత్రంగానే స్పందన ఉంది. ఈ సినిమాలో లిప్ లాక్స్‌తో ఆమె నటించిన తీరు హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది.

ఇక విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకంగా తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకొన్నారు. విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్నారు. తెలుగులో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆమెపై ఓ భారీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఇదిలా ఉండగా, ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు, వార్తలతో సంచలనం రేపే ఉమేర్ సంధూ రూమర్ క్రియేట్ చేశాడు. విద్యాబాలన్, ఆమె భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ విడిపోయారు. వేర్వేరుగా కాపురం ఉంటున్నారు అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వార్త నిజమేనా అనే విషయం భారీ చర్చకు దారి తీసింది.