Thursday, November 14, 2024

Bhimaa OTT: ఓటీటీలోకి వచ్చేసిన గోపిచంద్ భీమా.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..

మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా. ఏ. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేష్, వెన్నెల కిశోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీలకపాత్రలో పోషించారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇందులో గోపిచంద్ భీమా, రామా అనే రెండు పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటి కలిగించిన ఈ మూవీ మార్చి 8న అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా కాలం సరైన హిట్టు కోసం వెయిట్ గోపిచంద్ కు ఈ మూవీ నిరాశను మిగిల్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈమూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

భీమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గత అర్దరాత్రి (ఏప్రిల్ 25) నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. భీమా సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు గోపిచంద్. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన సినిమా స్ట్రీమింగ్ అవుతుందని.. చూడండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ సినిమా థియేటర్లలో దాదాపు రూ. 20కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్స్ రాట్టింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

కథ విషయానికి వస్తే.. పరశురామ క్షేత్రం ఉండే మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా సినిమా కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో అరాచకాలు చేసే ముఠాను ఎస్ఐ భీమా కట్టడి చేస్తాడు. పరుశురామ్ క్షేత్రం ఎందుకు మూతపడింది. మళ్లీ దానిని భీమా తెరిచాడా అనేది ఈ సినిమా. ప్రస్తుతం గోపిచంద్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు.

Blood Tests : మీరు ఆరోగ్యంగానే ఉన్నారా? ప్రతిఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైన ఈ 6 రక్త పరీక్షలు తప్పక చేయించుకోవాల్సిందే!

Blood Tests : రక్త పరీక్ష ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫిక్షన్ సోకినప్పుడు లక్షణాల ఆధారంగా వైద్యులు కొన్ని రక్త పరీక్షలను సిఫార్సు చేస్తుంటారు. పరీక్ష ఫలితాల ఆధారంగా చికిత్స అందిస్తారు. అయితే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని నిర్ధారించడానికి రక్త పరీక్షలు చాలా ముఖ్యం.

అయితే, చాలామంది ఈ రక్త పరీక్షలను ఎప్పుడో ఏదో అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చేయించుకుంటారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను ముందుగా గుర్తించడానికి వీలుండదు. అందుకే ప్రతిఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి ఏడాదిలో ఒకసారి కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అందులోనూ రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. మీకు షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి ముందస్తు పరిస్థితులు ఉన్నట్లయితే.. ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్ష తప్పనిసరిగా చేయాలి.

అంతేకాదు.. ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలను ఏడాదిలో కనీసం రెండు సార్లు చేయించుకోవాలి. అందులో ప్రధానంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ (CBC), మెటాబాలిక్ ప్యానెల్ (MP), లిపిడ్ ప్రొఫైల్ ప్యానెల్ (Lipid Profile Panel), కార్డియాక్ బయోమార్కర్, విటమిన్ డి (Vitamin D), థైరాయిడ్ ప్యానెల్ (Thyroid Profile) టెస్టులను చేయించుకోవాలి.

కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష :
కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష (CBC) శరీరంలోని ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌ల స్థితిని సూచిస్తుంది. రక్తహీనత, రక్త క్యాన్సర్ వంటి ఇన్ఫెక్షన్లను గుర్తించడంలోనూ ఈ పరీక్ష సాయపడుతుంది.

మెటాబాలిక్ ప్యానెల్ :
ప్రాథమిక మెటాబాలిక్ ప్యానెల్ టెస్టు ద్వారా మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ స్థితిని ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను అంచనా వేయొచ్చు. ఈ పరీక్ష శరీరంలోని పొటాషియం, సోడియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్‌లతో సహా మీ మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని కూడా తెలుసుకోవచ్చు. అధిక బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) ఉన్న వ్యక్తులకు ప్రత్యేకంగా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.

లిపిడ్ ప్రొఫైల్ ప్యానెల్ :
ఈ రక్తపరీక్షకు ఫాస్టింగ్ తప్పనిసరి. లిపిడ్ ప్రొఫైల్ ప్యానెల్ టెస్టు ద్వారా మీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను చెక్ చేసుకోవచ్చు. ఈ ప్యానెల్ బోర్డర్ లెవల్స్ లేదా అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

కార్డియాక్ బయోమార్కర్స్ :
మీ శరీరంలో ఎంజైమ్ స్థాయిలను తప్పనిసరిగా చెక్ చేయండి. హెల్త్‌లైన్ ప్రకారం.. ఎంజైమ్‌లు ప్రోటీన్లతో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, రక్తం గడ్డకట్టడం వంటి వివిధ రసాయన ప్రక్రియలను పూర్తిచేయడంలో శరీరానికి సాయపడతాయి.

విటమిన్ డి లెవల్స్ :
విటమిన్ డి లెవల్స్ తగినంతగా ఉండాలి. లేదంటే.. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణ విటమిన్ డి స్థాయిలను టెస్టు ద్వారా నిర్ధారించవచ్చు. విటమిన్ డి సాధారణం కన్నా తక్కువగా ఉంటే దాన్ని లోపంగా పరిగణిస్తారు.

థైరాయిడ్ లెవల్స్ పరీక్ష :
థైరాయిడ్ పరీక్షతో మీ థైరాయిడ్ గ్రంధి హైపర్యాక్టివిటీ లేదా అండర్ యాక్టివిటీలో ఉందో లేదో నిర్ధారిస్తుంది. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH)ను సూచిస్తుంది. థైరాయిడ్ హర్మోన్ పనితీరు సరిగా లేదని తేలితే.. అందుకు అవసరమైన చికిత్స కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించవచ్చు.

Gold Prices: రూ. 2 లక్షలకు చేరనున్న తులం బంగారం ధర.. మహిళలకు పెద్ద షాక్.. ఎప్పటి వరకో తెలుసా?

Gold Investments: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలు వంటి కారణాల వల్ల బంగారం ధర గత నెల రోజులుగా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ. 74 వేల మార్కు కూడా ఇటీవల దాటేసింది. అయితే బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ఇది శుభవార్తేనని చెప్పొచ్చు. వారికి రేటు పెరిగితేనే మంచి రిటర్న్స్ వస్తాయి మరి. అందుకే చాలా మంది గోల్డ్‌ను సురక్షిత పెట్టుబడిగా చెబుతుంటారు. గత 3 రోజులుగా బంగారం రేటు తగ్గినా ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి.
ఇండియా బులియెన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం స్వచ్ఛమైన 24 క్యారెట్స్ పసిడి రేటు ఇటీవలే రూ. 74 వేల మార్కును దాటింది. 2015లో బంగారం రేటు రూ. 24,740 వద్ద ఉండగా.. 9 సంవత్సరాలలో రేటు ట్రిపుల్ (మూడింతలు) అయిందని చెప్పొచ్చు.

అంతకుముందు 2006లో బంగారం రేటు రూ. 8250 గా ఉండగా.. మూడింతలు అయ్యేందుకు 9 సంవత్సరాల కంటే ఎక్కువ పట్టింది. అంతకుముందు చూస్తే 1987లో రూ. 2570 గా ఉండగా.. 19 సంవత్సరాల్లో మూడింతలు అయింది. ఇంకా అంతకుముందు చరిత్ర చూసినట్లయితే రేటు మూడింతలు అయ్యేందుకు వరుసగా 8, 6 సంవత్సరాలు పట్టింది.

ఇక ప్రస్తుత బంగారం ధర రూ. 74 వేల లెక్కన చూస్తే.. మూడింతలు అయితే రేటు రూ. 2 లక్షల మార్కు దాటేస్తుంది. అయితే పసిడి ప్రియులు, బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి.. ఇప్పుడు రేటు ట్రిపుల్ అయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందనే ప్రశ్న మదిలో మెదులుతుంటుంది.

LKP సెక్యూరిటీస్‌ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది దీని గురించి విశ్లేషించారు. ప్రపంచంలో ఏ మూలనైనా తీవ్ర ఉద్రిక్తతలు లేదా అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం రేట్లు ఎక్కువగా పెరుగుతుంటాయని ఆయన చెప్పారు. ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి మార్పుల్ని బంగారం రేట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఇది కొన్ని సార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా పెరగొచ్చని అన్నారు.

3.3 సంవత్సరాలలో బంగారం ధర రూ. 40 వేల నుంచి రూ. 70 వేలకు అంటే 75 శాతం పెరిగిందని.. అంతకుముందు 2014లో రూ. 28 వేల నుంచి 2018లో రూ. 31,250 వరకు అంటే కేవలం 12 శాతం మాత్రమే పెరిగిందని ఉదహరించారు. ఇక త్రివేది కూడా ప్రస్తుత ట్రెండ్స్‌ను కొట్టి పారేయలేం అని.. దీని ప్రకారం 7 నుంచి 12 సంవత్సరాలలో బంగారం రేటు రూ. 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు.

>> రంజాన్ తర్వాత, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తత, చైనా- తైవాన్ ఘర్షణ వంటివి కూడా అనిశ్చితి సృష్టించే అవకాశం ఉందని ఐబీజేఏ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహ్తా చెప్పుకొచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే.. బంగారం రేట్లు అనిశ్చితి కారణంగా మరో 6 సంవత్సరాల్లోనే దాదాపు 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
>> ఇక నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ విక్రమ్ ధావన్ మాత్రం.. 19 ఏళ్లలో బంగారం రేటు 3 రెట్లు పెరిగిందనడానికి ఒకే ఒక ఉదాహరణగా ఉందని.. ఇన్వెస్టర్లలో బంగారానికి మంచి డిమాండ్ ఉందని, దీంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొన్నేళ్లలోనే అద్భుత రిటర్న్స్ అందుకోవచ్చని చెప్పారు. దీని ప్రకారం.. పలువురు నిపుణులు బంగారం ధర 3 రెట్లు పెరిగేందుకు కనీసం 7 నుంచి 12 ఏళ్లు పట్టొచ్చని అనుకుంటున్నారు.

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం మంగళవారం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా, ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్‌ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్‌ సమర్పించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్నే పంపాలని స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వం పంపిన ప్యానెల్‌ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన అధికారులు గురువారం ఉదయంలోగా బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఏపి ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్​ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 1994 బ్యాచ్‌​కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన కుమార్ విశ్వజిత్ ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులో ఉన్నారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుపై వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్​ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఇంటెలిజెన్స్ చీఫ్​గా బాధ్యతలు తీసుకోవాలని కుమార్ విశ్వ జిత్‌​కు ఆదేశాలు ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటల్లో గా బాధ్యతలు తీసుకున్న కంప్లేయన్స్ నివేదికను పంపాలని ఈసీ సూచించింది. మరోవైపు విజయవాడ సీపీగా 2006 బ్యాచ్‌‌​కు చెందిన ఐపీఎస్ అధికారి పీహెచ్‌​డీ రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తక్షణం సీపీ‌గా బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Kavya Maran: సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలు కనబడతాయ్.!

ఐపీఎల్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొట్టి ఫార్మాట్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగితేనే మాములుగా ఉండదు. అదీ ఐపీఎల్ అంటే.. ఇంకేముంది మస్త్ మజా ఉన్నట్టే. ఫ్యాన్స్ అరుపులు, కేకలు.. బంతి.. బంతికి నరాలు తెగే ఉత్కంఠ. ఇవన్నీ పక్కనపెడితే.. ఫ్రాంచైజీ ఓనర్లు.. ప్రతీ మ్యాచ్‌లోనూ గ్రౌండ్‌లో హాజరయ్యి.. తమ జట్లను ఎంకరేజ్ చేస్తుండటం సర్వసాధారణం. షారుఖ్ ఖాన్, ప్రీతీ జింటా, కావ్య మారన్.. ఈ లిస్టులోకి వస్తారు. ఇక మనం సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ గురించి మాట్లాడితే.. గ్రౌండ్‌లో ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వికెట్ తీస్తే ఆమె చేసే సందడి.. ప్రత్యర్ధి బ్యాటర్లు సిక్సర్లు కొడితే.. ఆమె ఇచ్చే హావభావాలు.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారతాయి. సన్‌రైజర్స్‌కి కావ్యమారన్ 2018లో సీఈఓగా నియమితులయ్యారు.

ఆటగాళ్లను కొనుగోలు చేసే వేలం దగ్గర నుంచి తన జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ కావ్య పాప కనిపిస్తుంది. జట్టు గెలిచినప్పుడు పట్టలేని సంతోషం వ్యక్తం చేసే కావ్య.. ఓడిపోయినప్పుడు దిగులుగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఫ్యాన్స్ ఆమెను చూసినప్పుడు అయ్యో.! పాపం అని అనుకుంటుంటారు. ఇక ఈ ఏడాది కావ్య పాప ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు. సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ సారధ్యంలో ఎదురులేని శక్తిగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె ఆస్తులు, కార్ల కలెక్షన్లు గురించి చూస్తే బిత్తరపోతారు. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. ఈ 31 ఏళ్ల చిన్నది చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అలాగే యూకే నుంచి ఎంబీఏలో పట్టా సాధించింది. జాతీయ మీడియా కథనం ప్రకారం కావ్య మారన్ ఆస్తి విలువ సుమారు రూ.409 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే కావ్య మారన్‌కు.. కార్లపై కూడా మక్కువ ఎక్కువే. ఆమె గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాయి.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB – ధర: రూ. 12.2 కోట్లు

బెంట్లీ బెంటెగా LWB – ధర: రూ. 6 కోట్లు

బీఎండబ్ల్యూ i7- ధర: రూ. 2.13 కోట్లు

ఫెరారీ రోమా – ధర: రూ. 3.76 కోట్లు.

TV offers: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదేమో..

E-commerce giant Flipkart is offering huge discounts అందిస్తోంది. Flipkart లో ‘Televisions stor పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించారు.

ఇది భారతదేశపు అతిపెద్ద ‘Televisions stor అని కూడా చెప్పబడింది. ఇక్కడ వారు అనేక టీవీలపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. Samsung Smart TVs లపై భారీ తగ్గింపులు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఎంత చౌకగా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం.

Samsung 32 inch HD Ready LED Tizen TVని Flipkart నుండి రూ.18,900కి బదులుగా రూ.15,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీపై కస్టమర్లు 18% తగ్గింపును పొందుతున్నారు.

Samsung Galaxy 43 inch Full HD LED Smart Tizen TV 2023 ఎడిషన్ను 26 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత, ఈ టీవీని రూ.37,900కి బదులుగా రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Crystal 4K iSmart Series 43 Inch Ultra HD TVపై 40 శాతం తగ్గింపు. టీవీ అసలు ధర రూ.52,900కి బదులుగా రూ.31,490కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Crystal 4K Series 43 Inch Ultra HD 4K LEDని Flipkart నుండి 33 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ శక్తివంతమైన టీవీని రూ.47,900కి బదులుగా రూ.31,990కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Crystal Vision 4K iSmart TV 43 అంగుళాలు, voice assistant. తో వస్తుంది. దీనిని 39 శాతం తగ్గింపుతో Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత, ఈ టీవీ ధర రూ. 22,900 బదులుగా రూ. 14,990 కొనుగోలు చేయవచ్చు.

Flipkart లో, ‘ది ‘Televisions stor లో shopping చేయడానికి మీరు Federal Bank, HDFC Bank, IDFC First Bank or ONE Card ని ఉపయోగిస్తే Television Store. అదనంగా 10 శాతం తగ్గింపును అందిస్తుంది.

బంపరాఫర్: ఈ ఫోన్ పై భారీ తగ్గింపు..కేవలం రూ. 6,999 కే 16 GB RAM ఫోన్

అనేక ఫీచర్లతో కూడిన phone పై 5,000 తగ్గింపు. అతిపెద్ద ఆఫర్ ఉన్న phone Tecno Spark 20C. Amazonలో లైవ్ ఆఫర్ ప్రకారం, Tecno Spark 20C phone ను రూ.11,999కి బదులుగా రూ.6,999కి కొనుగోలు చేయవచ్చు.

అయితే ఈ ధర bank offer ను జోడించిన తర్వాత అని గుర్తుంచుకోండి. ఈ ఫోన్ ప్రత్యేకత 16 జీబీ ర్యామ్, 50 megapixels . దానిspecifications ఇప్పుడు చూద్దాం.

Smartphone 90Hz రిఫ్రెష్ రేట్తో 6.6-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్లు) LCD డిస్ప్లేను కలిగి ఉంది. డిస్ప్లేలో సెంటర్ హోల్ పంచ్ స్లాట్ కూడా అందించబడింది. ఈ slot లో డైనమిక్ పోర్ట్ కూడా అందించబడింది. ఇది ఆపిల్ యొక్క డైనమిక్ ఐలాండ్ లాంటిది. Notifications లను ఇక్కడ చూడవచ్చు.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ smartphone లో డార్విన్ ఇంజన్ ఇవ్వబడింది. ఇది వినియోగదారు గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ phone MediaTek Helio G36 ప్రాసెసర్, 8GB RAMతో పనిచేస్తుంది. ఇది 8GB వర్చువల్ RAMకి కూడా మద్దతు ఇస్తుంది. దీని ఇంటర్నల్ మెమరీ 128GB. కార్డ్ సహాయంతో మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు. Android 13 ఆధారిత HiOS 13పై phone రన్ అవుతుంది.

Camera విషయానికొస్తే, Techno Spark 20C ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50–megapixel primary camera మరియు AI కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 megapixel camera అందించబడింది. పవర్ కోసం ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W wired fast charging support తో వస్తుంది. 50 నిమిషాల్లో ఫోన్ను 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ బడ్జెట్ ఫోన్లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

లక్కీ ఛాన్స్.. 8th పాసయ్యారా?.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..

ఈ రోజుల్లో ఉద్యోగాలు పొందాలంటే విద్యార్హతలతో పాటు స్కిల్స్ కూడా ఉండితీరాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యాగాలు పొందాలంటే కనీసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉండాల్సిందే. అయితే మీరు ఎనిమిదో తరగతితో చదువు ఆపేసినా బాధపడాల్సిన పనిలేదు. ఎనిమిదో తరగతితో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఇండియన్ నేవీ అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. భారత త్రివిధ దళాల్లో ఒకటైనా ఇండియన్ నేవీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. నేవీలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

నేవల్ డాక్‌యార్డ్‌ ముంబైలో వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 301 ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 8, 10వ తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 10 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
పోస్టుల వివరాలు:
ఫిట్టర్-50 పోస్టులు
ఎలక్ట్రీషియన్-40 పోస్టులు
మెకానిక్-35 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్-26 పోస్టులు
షిప్‌రైట్‌లు (వుడ్)-18పోస్టులు
వెల్డర్లు(గ్యాస్ & ఎలక్ట్రిక్) -15 పోస్టులు
మెషినిస్ట్‌లు-13పోస్టులు
ఎంఎంటీఎం-13పోస్టులు
పైప్ ఫిట్టర్లు-13పోస్టులు
పెయింటర్లు-9 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌లు-7పోస్టులు
షీట్ మెటల్ వర్కర్లు-3పోస్టులు
టైలర్లు-3పోస్టులు
ప్యాటర్న్ మేకర్లు-2పోస్టులు
ఫౌండ్రీమ్యాన్-1 పోస్టుపోస్టులు
మెకానిక్ Ref & A/C-7 పోస్టులు
విద్యార్హత:
అభ్యర్థులు 8, 10వ తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. ఐటీఐయేతర ట్రేడ్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఫోర్జర్ హీట్ ట్రీటర్ కోసం10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 14 సంవత్సరాలు, గరిష్టంగా 18 సంవత్సరాలు ఉండాలి.
శారీరక ప్రమాణాలు:
అభ్యర్థి ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, బరువు 45 కిలోల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే అభ్యర్థి ఛాతీ విస్తరణ తర్వాత 5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే కంటి చూపు 6/6 నుండి 6/9 వరకు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేదీ:
10-05-2024

ఆడవారికి వరం అవిసె గింజలు.. నిత్యం ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా మరెన్నో బెనిఫిట్స్

ఆడవాళ్లు తమ మొత్తం జీవితంలో శారీరకంగా మరియు మానసికంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తారు. వాటిని ఎదుర్కొని నిలబడాలంటే ఆరోగ్యమైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి.

అయితే ఆడవారికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో అవిసె గింజలు( Flax Seeds ) ఒకటి. అవిసె గింజలు ఆడవారికి ఒక వరమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవిసె గింజలు నిత్యం ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్( Weight Loss ) తో సహా ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ అవిసె గింజలు వేసుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ ఈ గింజలను దోరగా వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న అవిసె గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి మరియు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి.లేదా ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి( Flax Seeds Powder ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తినవచ్చు. ఇలా ఎలా తీసుకున్నా కూడా అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా ఆడవారు తమ డైట్ లో అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల చాలా లాభాలే పొందుతారు. అవిసె గింజల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్( Omega 3 Fatty Acids ), యాంటీ ఆక్సిడెంట్స్ మెలబాలిజం రేటును పెంచుతాయి. వెయిట్ లాస్( Weight Loss ) ను ప్రమోట్ చేస్తాయి. అలాగే అవిసె గింజలు ఆడవారిలో హార్మోన్లను సమతుల్యం( Hormonal Imbalance ) చేస్తాయి. నెలసరి సమస్యలను దూరం చేస్తాయి.

సక్రమంగా పీరియడ్స్ వచ్చేలా ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ ను అవిసె గింజలు తగ్గిస్తాయి. ఎముకలను, కండరాలను బలంగా మారుస్తాయి. జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి సైతం అవిసె గింజలు అండంగా ఉంటాయి

రూ.100 తో తన గ్రామం వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి! హ్యాట్సాఫ్ సార్!

మనిషికి జీవితంలో ఏదైనాసాధించాలనే కసి ఉంటే చదువు,ఇతర ఆస్తులు వంటి వాటితో సంబంధం లేకుండానే ఉన్నత శిఖరాలను అధిరోహించి.. విజేతగా నిలవచ్చు. గొప్పగా జీవించాలనే కసి, తపన, పట్టుదల ఉంటే..ఏ సమస్యలు మనల్ని ఆపలేవు. సంకల్పమే బలంగా ఉంటే.. ఎన్ని అవరోధాలైనా ఎదుర్కొన్ని విజేతగా నిలబడవచ్చు. అలా ఎందరో కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. అలాంటి వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మలయ్ దేబ్ నాథ్. కేవలం రూ.100తో ఊరు వదలి వెళ్లి.. నేడు 200కోట్లకు అధిపతిగా మారాడు. మరి..ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పశ్చిమ బెంగాల్ లోని కుచ్ బెహార్ జిల్లాలో మలయ్ దేబ్ ఓ చిన్న గ్రామంలో నివాసం ఉండే వాడు. ఆయనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు వారి కుటుంబ నిర్వహిస్తున్న వ్యాపారం అగ్నిప్రమాదానికి గురైంది. అయితే ఇలా వారి వ్యాపారం అగ్నిప్రమాదానికి గురికావడానికి ఓ బలమైన కారణం ఉంది. రాజకీయ కారణంగా వారి వ్యాపారం విషయంలో అలా జరిగింది. ఇక ఈ ఘటన వారి కుటుంబాల్లో పెద్ద విషాదాన్ని నింపింది. వాళ్లు తిరిగి ఆ వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ కోలుకోలేకపోయారు.

దీంతో దేబ్ నాథ్ తన గ్రామంలోనే ఓ టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించాడు. 12వ తరగతి పూర్తి చేసేవరకు టీ వ్యాపారాన్నే కొనసాగించాడు. అనంతరం ఇక్కడే ఉంటే..తమ జీవితాల్లో మార్పులు రావని దేబ్ నాథ్ భావించాడు. 12 తరగతి పూర్తి చేసిన తరువాత చదువును విడిచిపెట్టి తల్లి వద్ద రూ.100 తీసుకొని ఢిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడ క్యాటరింగ్ పనిచేస్తూ తన ఖర్చుల మేర సంపాదించుకున్నాడు. అలానే ఓ హోటల్ పాత్రలు శుభ్రం చేయడం, టేబుల్స్ తుడవడం లాంటి పనులన్నీ కూడా దేబ్ నాథ్ చేశాడు. అలా ఎంతో నిజాయితీగా పని చేసి అభిమానాన్ని పొందాడు. ఇదే సమయంలో దేబ్ నాథ్ రూ.500 జీతం ఇస్తుండగా..దాని రూ.3వేలకు పెచ్చాడు ఆయన యాజమాని. అలా కొన్నాళ్ల పాటు రోజుకు 18 గంటలు పనిచేసి..తాను సంపాదించిన డబ్బులను కుటుంబానికి పంపించేవాడు.

అలా కష్టపడుతూ.. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో సూపర్‌వైజర్‌ స్థాయికి ఎదిగాడు. అదే సమయంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేయాలని భావించాడు. తాను ఉద్యోగం చేస్తూనే హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోర్సును పూర్తి చేశాడు. ఈవెంట్ లో పనులు చేస్తూనే అందరితో పరిచయాలు బాగా పెంచుకున్నాడు. సొంతంగా క్యాటరింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. క్యాటరర్స్ అండ్ డెకరేటర్స్ అనే కంపెనీని దేబ్‌నాథ్ ఏర్పాటు చేశాడు. ఎంతో కష్టపడి పని చేయడంతో కంపెనీ పెద్ద విజయాన్ని సాధించింది. అంతేకాక మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టింది.

మలయ్ దేబ్ నాథ్ కి చెందిన కంపెనీ ఢిల్లీ, పూణే, జైపూర్, అజ్మీర్, గ్వాలియర్‌ సహా 35 కంటే ఎక్కువ ఆర్మీ మెస్ నిర్వహణ చూస్తోంది. 100 రూపాయలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయనకు నేడు ఉత్తర బెంగాల్‌లోని టీ తోటలతో సహా సుమారు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన ధనవంతుడిగా ఎదిగేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు. అచంచలమైన కృషితోపాటు పట్టుదలతో పని చేసి విజేతగా నిలిచాడు. మలయ్ దేబ్ నాథ్ జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద

అనంతపురం: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ..

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.

హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఆయన ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

గత రెండు ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన బాలకృష్ణ.. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ గెలుపు సునాయాసమే అనుకున్నప్పటికీ.. తాజాగా, స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.

తనకు కూటమి నుంచి టికెట్ దక్కుతుందని ఆశించానని.. అయితే రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు స్వామి పరిపూర్ణానంద తెలిపారు. ఈ నియోజకవర్గంలో తనకు బలమైన పట్టుందని.. తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన ప్రభావం ఎంత ఉందనేది ఎన్నికల ఫలితాల రోజే తెలిసే అవకాశం ఉంది.

మళ్లీ రాని అవకాశమిది.. హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు 1,36,520 జీతం

నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యాయ వ్యవస్థలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. మీరు న్యాయ శాస్త్రంలో పట్టా పొంది ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని మాత్రం వదలొద్దు. తెలంగాణ హైకోర్టు భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జీ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా సివిల్ జడ్జి పోస్టుల కోసం ఏప్రిల్ 18 2024 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన సమాచారం:
సివిల్ జడ్జి పోస్టుల సంఖ్య:
150
అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులు కనిష్టంగా 23 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
ఎంపకి ప్రకియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభ తేదీ:
18-04-2024
దరఖాస్తులకు చివరి తేదీ:
17-05-2024

Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రూ.20కే భోజనం

దూర ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇప్పటికి కూడా రైల్వేనే బెస్ట్‌ ఆప్షన్‌. ధర తక్కువ.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చూసుకునే వారు రైల్వేకే ఓటేస్తారు.

బస్‌ టికెట్‌ ధరతో పోలిస్తే.. చాలా తక్కువ ధరకే రైల్వేలో ఏసీ ప్రయాణం చేయవచ్చు. అంతేకాక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిచడం కోసం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. అనేక పథకాలను ప్రారంభిస్తుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన జర్నీ కల్పించేందుకు అవసరమైన చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే ఆహారాన్ని అందించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఈ శుభవార్త చెప్పింది. వేసవి కాలం, విద్యార్థులకు సెలవులు లభిస్తుండటంతో.. చాలా మంది దూర ప్రయాణాలు, తీర్థ యాత్రలకు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. దాంతో రైల్లలో భారీగా రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది.

కొన్ని రోజుల క్రితం ఇండియన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ను తీసుకువచ్చాయి. ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతోనే రైల్వే శాఖ ఈ ఎకానమీ మీల్స్ తీసుకు వచ్చింది. జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలో భోజనం అందించేందుకు ఈ విధానం తీసుకువచ్చారు.

దేశవ్యాప్తంగా వందకుపైగా రైల్వే స్టేషన్లలో 150 కేంద్రాల ద్వారా ఈ ఎకానమీ మీల్స్‌ పథకం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట , గుంతకల్ , తిరుపతి , రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్‌లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్‌ను ప్రయాణికులకు అందించేందుకు రెడీ అవుతుంది రైల్వే శాఖ. ఎకానమీ మీల్స్‌లో భాగంగా రెండు రకాలైన భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి రకంలో కేవలం 20 రూపాయలకే ప్రయాణికులకు ఎకానమీ భోజనం అందించనున్నారు. ఇక రెండోరకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తారు.

రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ భోజనం, నీటి ప్యాకెట్లను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఆగేచోట ఫ్లాట్ ఫారమ్‌లపై అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్‌ను కొనుగోలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను గతేడాది 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మద్య రైల్వేలోని 7 స్టేషన్‌లలో ఐఆర్‌సీటీసీ కిచెన్‌ యూనిట్ల ద్వారా ఈ భోజనం అందిస్తున్నారు. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ మీల్స్‌పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

US warning to Pakistan: పాక్‌కి అమెరికా వార్నింగ్, అసలేం జరిగింది?

ఒకప్పుడు ఏ దేశం ఎక్కడ ఉండేదో అమెరికాకు తెలీయదు. టెక్నాలజీ పుణ్యమాని ఎవరు ఏం చేసినా క్షణాల్లో అగ్రరాజ్యానికి ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ముందు ఆంక్షల ప్రమాదం గురించి ఆలోచించాలన్నది అందులో సారాంశం.

బాలిస్టిక్ మిసైల్స్ తయారీకి వస్తువుల సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని యూఎస్ విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతిని వేదాంత్ పటేల్ హెచ్చరించారు. విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా ఆంక్షలు విధిస్తామని వేదాంత్‌పటేల్ క్లారిటీ ఇచ్చారు. విపులంగా చెప్పాలంటే ఇరాన్‌‌తో వ్యాపార ఒప్పందాలపై ఆంక్షలు ఉంటాయనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఆ మేరకు అన్ని దేశాలకు సలహా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వినాశకరమైన ఆయుధాలు, వాటి పంపిణీ పెంపుదల నేపథ్యంలో ఆంక్షలు విధించాల్సి వస్తుందన్నారు. పాకిస్థాన్ మిస్సైల్ ప్రొగ్రామ్ సరఫరా దారులుగా ఉన్న కంపెనీలు చైనా, బెలారస్‌లో ఉన్నాయని ప్రస్తావించారు. బాలిస్టిక్ క్షిపణి తయారీ కోసం సంబంధిత వస్తువులను సేకరించినట్టు గుర్తించామని వెల్లడించారు.

మూడురోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉన్నత స్థాయి టీమ్‌తో పాకిస్థాన్‌కు వెళ్లారు. రెండురోజులపాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య 8 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కొన్ని అంశాల విషయంలో చర్చలు కొనసాగుతున్నట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా హెచ్చరిక జారీ చేసినట్టు చెబుతున్నారు.

BREAKING: హైకోర్టులో YCP ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అధికార వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బిగ్ షాక్ తగిలింది. శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. కాగా, దళిత యువకులకు శిరోముండనం కేసులో త్రిమూర్తులుతో పాటు మరో 8 మందికి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 16వ తేదీన విశాఖ కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ కోర్టు తీర్పును తోట త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తోట త్రిమూర్తులు అభ్యర్థనను తోసిపుచ్చి.. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానాలపై ఈసీ బదిలి వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్‌కు ఈసీ షాకిచ్చింది. ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర సీపీ కాంతిరాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. వీరిని తక్షణమే విధుల నుంచి బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని డ్యూటీ అప్పటించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఓ అగంతుకుడు రాయితో దాడి చేయడం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ విజయవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై వేటు
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ ఇటీవల వేటు వేసింది. పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి పనిచేస్తున్నారు. కొన్నిరోజుల కిందట వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినట్టు గుర్తించారు. కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కడప కలెక్టర్ తో నివేదిక తెప్పించుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తేలడంతో వెంకట్రామిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.

ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై బదిలీ వేటు !
ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఎలక్షన్ కమిషన్ ఇటీవల బదిలీ వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువాపై బదిలీ వేటు వేసింది ఈసీ. బదిలీ అయిన అధికారులు తమ కింది వారిని తక్షణం బాధ్యతలు నుంచి తప్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది.

భారీ డిస్కౌంట్ తో 24 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart Tv

కొత్త స్మార్ట్ టీవీ అదీకూడా QLED Smart Tv కొనాలని చూస్తుంటే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ప్రముఖ టెలివిజన్ బ్రాండ్ థాంసన్ యొక్క 50 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లతో కొత్త టీవీని మంచి చవక ధరకే అందుకునే అవకాశం ఈరోజు Flipkart అందించింది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.

ఏమిటా 50 ఇంచ్ QLED Smart Tv ఆఫర్?
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson యొక్క 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ 2023 ఎడిషన్ మోడల్ నెంబర్ 50OPMAXGT9020 పైన Flipkart ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీని 40% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ఆఫర్ ధరకే అందిస్తోంది.

Flipkart నుండి ఈ స్మార్ట్ టీవీని HDFC Bank Credit Card EMI ఆప్షన్ తో యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని 24 వేల రూపాయల కంటే చవక ధరకే అందుకోవచ్చు.

Thomson (50) ఇంచ్ QLED Smart Tv ప్రత్యేకతలు
ఈ థాంసన్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ సన్నని అంచులు కలిగిన గొప్ప డిజైన్ తో వస్తుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ సపోర్ట్ మరియు 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీలో 3 HDMI, 2 USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ టీవీలో USB 3.0 కనెక్టర్, HDMI ARC/CEC మరియు Bluetooth v5.0 సపోర్ట్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ మీడియాటెక్ Mali Quad-core GPU తో పని చేస్తుంది మరియు 12GB ర్యామ్ జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీలో 40W సౌండ్ అందించ గల రెండు బాక్స్ స్పీకర్లను Dolby MS12 మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో కలిగి వుంది.

EC on Babu: టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఈవో మీనా లేఖ రాశారు. బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఈవో మీనాకు వైసీపీ 18 సార్లు ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో.. వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు.

కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు, మరికొన్నింటికి స్పందించలేదు. అయితే చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను కూడా జత చేశారు.

ఏపీలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రజాగళం పేరుతో నిర్వహిస్తోన్న ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Late Night Sleeping: ఆలస్యంగా నిద్ర పోతున్నారా..రిస్క్ లో పడ్డట్టే

Late Night Sleeping: ఆరోగ్యంగా ఉండడానికి తగినంత నిద్ర ఎంతో అవసరం. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది ఆలస్యంగా నిద్ర పోతున్నారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నేటి తరం లేట్​గా పడుకోవడం లేట్​గా నిద్రలేవడం వల్ల వ్యాధులను కోరి కొని తెచ్చుకుంటున్నారు. ఆలస్యంగా నిద్ర పోయేవారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారో తెలుసుకుందాం.

పురుషులతో పాటు నేడు మహిళలు కూడా నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. లాంగ్ నైట్ షిఫ్ట్ కారణంగా పని ఒత్తిడితో వారు తీసుకునే ఆహారంపై సరైన శ్రద్ధ చూపించారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా పగలు ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పోవడం కూడా మంచిది కాదు. అందుకు అనేక కారణాలను వెల్లడిస్తునారు నిపుణులు.

యువత ఎలక్ట్రానిక్​ గాడ్జెట్లను ఉపయోగించడం వల్ల కూడా ఆలస్యంగా నిద్ర పోతున్నారు. స్మార్ట్​ఫోన్​, సోషల్​ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు లేట్​గా పడుకొని ఉదయం లేట్​గా నిద్ర లేవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు నెమ్మదిస్తుంది. భవిష్యత్తులో ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

మధుమేహం: ఆలస్యంగా నిద్రించే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేట్ నైట్ నిద్రపోయే వారి దినచర్య అస్థవ్యస్తంగా మారుతుంది. వీరి జీవనశైలి మారిపోవడంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆకలికి సంబంధించిన సమస్యలు ప్రారంభమవుతాయి. కార్బోహైడ్రేట్స్​ పెరిగి మధుమేహానికి గురవుతారు. అంతే కాకుండా మిగతా వారితో పోల్చితే వీరు చాలా లేజీగా కనిపిస్తారు.

గుండె జబ్బులు: ఆలస్యంగా నిద్రలేవడం వల్ల శరీరానికి అవసరమైన సూర్యరశ్మిని పొందలేరు. దీని వల్ల డి విటమిన్​ లభించక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా శరీరంలో హార్మోన్ల స్థాయి దెబ్బతింటుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ శరీరంలో విపరీతంగా పెరుగుతాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఊబకాయం: ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు ఉన్నవారిలో జీవక్రియలు మందగిస్తాయి. దీంతో వారు కేలరీలు బర్న్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి ఊబకాయంకు దారితీస్తుంది. అధిక బరువు వల్ల కీళ్ల నొప్పులు మొదలవడంతో..నడవడానికి ఆయాసపడుతారు.

3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్‌లో 509 మార్కులు

కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంటి పరిస్థితి గమనించిన నవీన వారంలో మూడు రోజులు కూలి పనులకు వెళ్తూ.. మూడు రోజులే బడికి వెళ్తోంది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఫీజులు, పుస్తకాలు అందిస్తూ.. చేయూతనిచ్చారు. సోమవారం వచ్చిన పదో తరగతిలో ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా అత్యధిక మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకుంది.

రజినీకాంత్ రెమ్యూనరేషన్ అన్ని వందల కోట్లా? దేశం కాదు.. ఆసియాలోనే హయ్యెస్ట్!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఏదైనా మూవీ గురించ పెద్ద చర్చ నడుస్తోందా అంటే అది తలైవర్ 171 గురించే అనాలి. ఈ మూవీకి సంబంధించి సోమవారం టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు కూలీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ టీజర్ చూసిన తర్వాత రజినీకాంత్ ఫ్యాన్స్ నేల మీద నిలవడం లేదు. ఎందుకంటే అది ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. లోకేశ్ కనకరాజుతో మూవీ అన్నప్పుడే ఫ్యాన్స్ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ టీజర్ చూసిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ మూవీకి సంబధించి ఇంకో క్రేజీ వార్త వినిపిస్తోంది. అది కూడా రజినీకాంత్ రెమ్యూనరేషన్ గురించి. ఆసియాలోనే హయ్యెస్ట్ అంటున్నారు.

రజినీకాంత్- లోకేష్ కనకరాజు కాంబోలో కళానిధి మారన్ కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. జైలర్ సినిమాని కూడా కళానిధి మారన్ నిర్మించిందే. చిత్రం అనూహ్య లాభాలు తెచ్చిపెట్టినందుకు రజినీకాంత్ కు ఒక లగ్జరీ కారు, రూ.100 కోట్ల వరకు అదనంగా ఇచ్చారని చెప్పారు. మూవీ టీమ్ మొత్తానికి బంగారు నాణేలు కూడా అందజేశారు. ఇప్పుడు మళ్లీ రజినీతో కళానిధి మారన్ కూలీ చిత్రం చేస్తున్నారు. ఈసారి సినిమా రెమ్యూనరేషనే నెక్ట్స్ లెవల్లో ఇస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం రజినీకాంత్ కు ఇస్తున్న రెమ్యూనరేషన్ తో దాదాపు 5 మంచి బడ్జెట్ చిత్రాలు నిర్మించవచ్చు అంటున్నారు.

కూలీ కోసం రజినీకాంత్ కు ఏకంగా రూ.260 కోట్ల నుంచి రూ.280 కోట్ల వరకు పారితోషకంగా ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఇవి కేవలం గాసిప్స్ మాత్రమే. ఒకవేళ అదే గనుక నిజమైతే పాన్ ఇండియా లెవల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరో కావడం కాదు.. ఏకంగా ఆసియా ఖండంలోనే అత్యధిక పారితోషకం అందుకున్న స్టార్ హీరోగా రజినీకాంత్ నిలుస్తారని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఈ వార్త చూసి రజినీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూలీ చిత్రం జైలర్ కి మించి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

ఇంక కూలీ చిత్రం టైటిల్ టీజర్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పైగా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్, విజయ్ సేతుపతి, కార్తీ ఉన్నారు. ఇప్పుడు రజినీకాంత్ ని కూడా లోకీ యూనిరవర్స్ లోకి తీసుకొస్తున్నారు అంటున్నారు. వీళ్లందరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే మాములుగా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Farmers : రైతు సోదరులారా. మీ ఖాతాల్లోకి నెలకు 3000 రూపాయలు జమ. రైతు పెన్షన్ స్కీమ్ కు అప్లై ఇలా చేసుకోండి.

సన్న చిన్న కారు రైతులను కొన్ని రకాల పథకాలను పెట్టి ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. సూక్ష్మ రైతులకు వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రతను ఇవ్వడానికి రూపొందించబడింది ఈ స్కీం.

పీఎం కిసాన్ మన్ దన్ పథకానికి వయసు అర్హత 18 నుండి 40 సంవత్సరాల వయసు కలవారు ఉండాలి. సంబంధిత రాష్ట్ర యూటీ భూ రికార్డుల ప్రకారం రెండు హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్న రైతులు అర్హులు.. పిఎం కిసాన్ పెన్షన్ యోజనలో ఎంపిక చేయబడిన ప్రతి లబ్ధిదారునికి హామీ పెన్షన్ పొందవచ్చు నెలకి 3000. ఇది భారత ప్రభుత్వం నుండి సరిపోయే విరాళాలతో కూడిన స్వచ్ఛంద మరియు కంట్రిబ్యూటర్ పెన్షన్ పథకం.ఇంకా ఇది దీనిని అప్లై చేసుకుని రైతులు PMKMY తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి PM కిసాన్ పెన్షన్ పథకం ఆన్లైన్ దరఖాస్తు ఫారం ను పూరించవచ్చు..

ప్రధానమంత్రి కిసాన్ మన్ దన్ యోజన 2024 యొక్క వివరాలు; ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన దేశంలోని భూస్వామ చిన్న మరియు సూక్ష్మ రైతులందరికీ సామాజిక భద్రత కల్పించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు తరచుగా కనీస పొదుపు ఉండదు. లేదా వారి వృద్ధాప్యంలో జీవనోపాధి ఉపాధి లేదు. వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వారికి ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అర్హులైన చిన్న సూక్ష్మ రైతులకు ఈ స్థిర పెన్షన్ లభిస్తుంది.. ఇది స్వచ్ఛంద మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే పెన్షన్ ఫండ్ నుండి పెన్షన్ అందివ్వబడుతుంది.

రైతులకు 55 నుండి 60 ఏళ్ల వరకు పెన్షన్ నెలకు 200 ఆ సమయంలో వారు పెన్షన్ పొందడం మొదలు పెడతారు.కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పండ్స్ రైతు సహకారంతో సరిపోతుంది. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న రైతులు మరియు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరడానికి అర్హులే.. చిన్నవయసు మరియు చిన్న రైతుల జీవిత భాగస్వామిలు కూడా విడివిడిగా పథకంలో చేరవచ్చు.. మరియు ప్రత్యేక పెన్షన్ 3000. వారికి 60 సంవత్సరాల వరకు వచ్చినప్పటికీ ఈ స్కీం నమోదు చేసుకున్న రైతులు ఏ కారణం చేతనైనా నిలిపియాలనుకుంటే ఆపవచ్చు.. పెన్షన్ పండ్స్ వారు విరాళాలు వడ్డీతో వారికి తిరిగి చెల్లించబడతాయి.. జీవిత భాగస్వామి లేకుంటే వడ్డీతో సహా మొత్తం సహకారం నామిని కి చెల్లించబడుతుంది. పదవి విరమణ తర్వాత రైతు మరణిస్తే జీవిత భాగస్వామి భాగస్వామి పెన్షన్ లో 50% పొందుకుంటారు. అంటే కుటుంబ పెన్షన్ గా నెలకు 1500 పొందవచ్చు..పీఎం కిసాన్ స్కీం నుండి ప్రయోజనం పొందుతున్న రైతులు పీఎం కిసాన్ ప్రయోజనం పొందేందుకు ఉపయోగించిన అదే బ్యాంకు ఖాతా నుండి నేరుగా చందా చెల్లించవచ్చు.

Farmers : రైతు సోదరులారా… మీ ఖాతాల్లోకి నెలకు 3000 రూపాయలు జమ… రైతు పెన్షన్ స్కీమ్ కు అప్లై ఇలా చేసుకోండి…

అర్హులైన రైతులు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబరు మరియు బ్యాంక్ పాస్ బుక్ లేదా ఖాతా వివరాలతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ కి కాల్ చేయవచ్చు.. పీఎం కిసాన్ రాష్ట్ర నోడల్ అధికారుల ద్వారా ప్రత్యామనయ నమోదు పద్ధతులు లేదా ఆన్లైన్ నమోదు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.. ఈ పథకం కింద నమోదు ఉచితం మరియు రైతులు CSC కేంద్రాలలో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు.. పీఎం కిసాన్ మన్ దన్ యోజన 2024 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానము; *https://maandhan/వద్ద అధికారిక వెబ్సైట్ను సందర్శించండి…*హోం పేజీలో సేవలు విభాగానికి వెళ్లి కొత్త నమోదు లింక్ పై క్లిక్ చేయాలి. డైరెక్ట్ లింకు: https://maandhan.in /login

-లింక్ ని క్లిక్ చేసిన తర్వాత సియా నమోదు లేదా CSC కోసం కొత్త పేజీని అనుసరించండి..
-మీ మొబైల్ నెంబరు మరియు ఓటీపీ లింకు ని ఇచ్చి సెలబ్రేషన్ టాప్ పై క్లిక్ చేయండి. మీ 10 అంకెల మొబైల్ నెంబర్ నమోదు చేసి కొనసాగించి బటన్ ప్లే చేయండి..
-రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి కొనసాగించాలి..
-స్కీం పేరుని ప్రధానమంత్రి కిసాన్ మన్ దన్ యోజనగా ఎంచుకోవాలి. ఈ లింకుపై క్లిక్ చేసిన తర్వాత PMKMY సబ్స్క్రైబ్ ఫారం తెరవబడుతుంది. పీఎం కిసాన్ మన్ దన్ యోజన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి PMKMY ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం లో వివరాలను సబ్మిట్ చేయాలి. అంతే ఎంతో సులభంగా ఈ దరఖాస్తును చేసుకొని నెలకి 3000 రూపాయల పెన్షన్ గా పొందండి…

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై దానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు!

ఇప్పుడు వంట గ్యాస్ లేని ఇల్లు లేదు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రతి మహిళ వంట గ్యాస్‌తోనే ఇంటిల్లిపాదికి వడ్డి వార్చుతోంది.

కట్టెల పొయ్యిలకు రాం రాం చెప్పి.. సులువుగా, త్వరగా వంట సిద్ధం చేసే కుకింగ్ గ్యాస్ పైనే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు ఉన్న అపోహాలు తొలగిపోయి.. పల్లెటూళ్లు, కుగ్రామాల్లోని ప్రజలు సైతం గ్యాస్ వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ వెల్లడించాయి చమురు కంపెనీలు. ఈమేరకు కీలక ప్రకటన చేశాయి. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉచిత సేవ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకు ఏం చేయనున్నాయంటే..?

మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా.. అలాగే లీకేజ్, సేఫ్టీకి సంబంధించిన ఇతర అనుమానాలు ఉన్నాయా. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దకే వచ్చి సేఫ్టీ చెక్ చేపట్టనున్నాయి దేశీయ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నాయి. గ్యాస్ కనెక్షన్ పనిచేసే తీరు, లీకేజీని తనిఖీ చేస్తాయి. లోపాలు ఉంటే వెంటనే మార్చాలని చెబుతారు అక్కడకు వచ్చిన సిబ్బంది. అలాగే అవగాహన కూడా కల్పిస్తారు. గ్యాస్ పైప్, ఇతర పరికరాలు ఎన్నాళ్లు వాడాలి, ఎన్నాళ్లకు వాటిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి సిబ్బంది వెల్లడిస్తారు.

ఈ సర్వీస్ అంతా ఉచితంగానే అందించనున్నాయి చమురు సంస్థలు. గ్యాస్ డెలివరీ చేసేందుకు వచ్చిన సిబ్బంది.. అదే సమయంలో 8 భద్రతా నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ చెక్ చేస్తారని పేర్కొన్నాయి. అలాగే 8 భద్రతా నిబంధనలపైనా కస్టమర్లకు అవగాహన కల్పిస్తారు. ప్రతి వినియోగదారుడు ఐదేళ్లకు ఒకసారి గ్యాస్ రెగ్యులేటర్, గ్యాస్ పైపు, ఇన్ స్టా లేషన్ వంటి పరికరాలను సేఫ్టీ చెక్ చేయించుకోవాలంటే.. రూ. 200 వరకు చార్జీలు వసూలు చేశాయి. దీనికి 18 శాతం జీఎస్టీ కూడా ఉండేది. ఇప్పుడు ఈ సేవలు పూర్తిగా ఉచితం. సేప్టీ చెకింగ్ లో కాషాయ రంగు పైపు పనికి రాదని తేలితే వెంటనే రూ. 150 చెల్లించి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సేఫ్టీ చెకింగ్ అనేది ఢిల్లీతో సహా వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైంది. రానున్ననెలల్లో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గ్యాస్ వినియోగదారుల ఇళ్లకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాయి.

2030కి బంగారం ధర ఆ రేంజ్ లోపెరుగుతుందా? లక్షాధికారులు కూడా కొనలేరు!

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇండియాలో అయితే బంగారం అంటే పడి చచ్చిపోతాం. ఆడ, మగ అనే తేడా లేకుండా బంగారం అంటే విపరీతమైన ఇష్టం. కానీ, బంగారం చూస్తే ఎండాకాలం వేడికంటే ఎక్కువ బగ్గు మంటోంది. గత కొన్ని వారాలుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. మధ్యలో ఒక్కోరోజు తగ్గినా కూడా అది కేవలం కంటితుడుపు లాగానే ఉంటోంది. తర్వాతి రోజు బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఒక బంగారం వ్యాపారి చేసిన వ్యాఖ్యలు అందరినీ భయ పెట్టడమే కాకుండా.. ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు లాభాలు పొందే మార్గంలా కూడా కనిపిస్తోంది.

బంగారం అనేది ఇప్పటి వరకు అలంకరణ సాధనంగానే చూసేవాళ్లం. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా బంగారం అనేది పెట్టుబడి సాధనంగా మారిపోయింది. బంగారం మీద పెట్టిన రూపాయి లాభాలు తెచ్చి పెడుతోంది. అయితే బంగారం కొనాలి అంటే.. ఇప్పుడే కొనుగోలు చేయండి.. 2030 నాటికి కొనలేరు అని నిపుణులు అంటున్నారు. అలా వాళ్లు అనడానికి గల కారణం ఏంటంటే.. సీఎన్బీసీలో ఇటీవల ఓ సమావేశం జరిగింది. ఆ సావేశంలో విఘ్నహర్త గోల్డ్ ఛైర్మన్ మహేంద్ర లూనియా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2030నాటికి 10 గ్రాముల ధర రూ.1.68 లక్షలు ఉంటుందని ఆయన అంచనా వేశారు. అంటే ఒక్కో గ్రాము ధర అక్షరాలా రూ.16,800 అనమాట. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ద్రవ్యోల్భణ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, మరికొన్ని కారణాల రీత్యా బంగారం ధరలు పెరుగుతున్నాయి. పైగా చైనా నుంచి అధిక కొనుగోళ్లు కారణంగా కూడా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. మరి.. గోల్డ్ రేటు తగ్గదా అంటే? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఇప్పుడల్లా బంగారం ధర తగ్గే ఆస్కారం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణం దృష్ట్యా సంపద విలువ తగ్గకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది బంగారం మీద పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దేశాలు సైతం అదే పని చేస్తుంటాయి.

ఇప్పుడు నిపుణులు ఇస్తున్న సలహా ప్రకారం ప్రజలు కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టడమే సరైన సమయంగా చెప్తున్నారు. అందుకు కేంద్రం నుంచి ఒక మంచి ఆవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏటా పలు సందర్భాల్లో సావరిన్ గోల్డ్ బాండ్ ప్లాన్(ఎస్జీబీ) బాండ్లను జారీ చేస్తూ ఉంటుంది. ఒక బాండు విలువ ఒక స్వచ్ఛమైన గ్రాము బంగారంతో సమానం. మీరు ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టుకుంటే మంచి లాభాలను ఆర్జించే ఆస్కారం ఉటుంది. ఒక వ్యక్తి అయితే గరిష్టంగా 4 కిలోల బంగారంతో సమానమైన బాండ్లను కొనుగోలు చేయచ్చు. ట్రస్టులు అయితే గరిష్టంగా 20 కిలోలతో సమానమైన బాండులను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే.. రానున్న ఐదేళ్లలో బంగారం మీద పెట్టుబడే సరైన నిర్ణయం అంటూ నిపుణులు కూడా సూచిస్తున్నారు.

Milk: 1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..కోటీశ్వరులయ్యేందుకు సింపుల్‌ ఫార్మూలా ఇదే!

ఎవరైన పని చేయకుంటే వారిని గాడితో పోలుస్తుంటారు. ఏ పని చేయకుండా గాడిదలాగా తిరుగున్నాడంటూ తిట్టిపోస్తుంటారు. అయితే ఈ గాడిద మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో తెలుసా? సుదూర ప్రాంతాలకు బరువైన వస్తువులను తీసుకెళ్లేందుకు గాడిదలను ఉపయోగిస్తుంటారు. అదే విధంగా గాడిద పాలతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చని మీకు తెలుసా? గాడిద పాల ధర ఆవు పాల ధర కంటే 70 రెట్లు ఎక్కువ. ఓ పాల వ్యాపారి ఈ వ్యాపారం చేస్తూ ధనవంతుడయ్యాడు. గుజరాత్‌కు చెందిన ధీరేన్ సోలంకి అనే వ్యాపారవేత్త గాడిద ఫారమ్‌ను ప్రారంభించి మొత్తం 42 గాడిదలను పెంచుతున్నారు. ఈ గాడిద పాలను అమ్మడం ద్వారా ప్రతి నెలా 2 నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

గుజరాత్‌లోని పటాన్ జిల్లాకు చెందిన ఈ వ్యాపారి మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తాను ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నానని, అయితే తాను కూడా ప్రైవేట్ ఉద్యోగం కోసం వెతుకుతానని చెప్పాడు. కానీ కుటుంబ పోషణతోపాటు భవిష్యత్తు కోసం డబ్బు కూడా ఆదా చేసే ఉద్యోగం రాలేదు. అలాంటప్పుడు ఒకరోజు అతనికి గాడిద పెంపకం గురించి తెలిసింది. దక్షిణ భారతదేశంలో పెరుగుతున్న ఈ వ్యాపారం గురించి విన్న తరువాత అతను 8 నెలల క్రితం తన గ్రామంలో గాడిద ఫారమ్ తెరవాలని నిర్ణయించుకున్నాడు.

మొదట్లో 20 గాడిదలతో వ్యాపారం ప్రారంభించాడు. కానీ గుజరాత్‌లో గాడిద పాలకు గిరాకీ లేదు. అతను ఐదు నెలల పాటు ఆచరణాత్మకంగా ఖాళీ చేతులతో కూర్చోవలసి వచ్చింది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని పలు కంపెనీలను సంప్రదించాడు. దక్షిణ భారతదేశంలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడ పాలను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పాలు సరఫరా చేస్తున్నాడు. వివిధ సౌందర్య సాధనాల కంపెనీలు కూడా అతని నుండి పాలను కొనుగోలు చేసి తమ ఉత్పత్తులలో ఉపయోగించుకుంటాయి.

ఆవు పాలు ధర రూ.50 నుండి రూ.65 మధ్య ఉంటే, గాడిద పాలు ధర రూ.5000 నుండి రూ.7000 వరకు అని వ్యాపారవేత్త చెప్పారు. ఫలితంగా తక్కువ మొత్తంలో పాలు విక్రయించడం ద్వారా కూడా ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఇంకో విషయం ఏంటంటే గాడిద పాలను ఎండబెట్టి పొడి రూపంలో కూడా విక్రయిస్తున్నాడు. ఈ సందర్భంలో పాల ధర లీటరుకు 1 లక్ష రూపాయల వరకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ వ్యాపారం చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు సదరు వ్యాపారి. ప్రస్తుతం తన పొలంలో 42 గాడిదలు ఉన్నాయని తెలిపారు. 38 లక్షల పెట్టుబడి పెట్టాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం తీసుకోవాల్సిన అవసరం లేదు.

గాడిద పాల ప్రయోజనాలు:

ఈజిప్టు రాణి క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం చేసేదని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుందట. అలాగే గాడిద పాలు తాగడం వల్ల కాలేయ సమస్యలు తగ్గుతాయనే వాదన కూడా ఉంది. గాడిద పాలు ముక్కు నుండి రక్తం కారడం, అంటు వ్యాధులు, జ్వరాలను తగ్గిస్తుందని గ్రీకు వైద్యుడు హిప్పోక్రేట్స్ సూచించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. గాడిద పాలు కూడా విషాన్ని తగ్గించడంలో సహాయపడతాయని కథనాలు సూచిస్తున్నాయి.

రక్తాన్ని శుద్ధి చేసే ఉత్తమ జ్యూస్ ఇది.. వారానికి ఒక్కసారి తీసుకున్న అద్భుత లాభాలు మీ సొంతం

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్త ప్రసరణ వ్యవస్థ( Blood Circulation ) అనేది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరిగినప్పుడే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.

కానీ అనారోగ్యమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా రక్తంలో మలినాలు పేరుకు పోతాయి. దీని కారణంగా రక్తప్రసరణ అనేది సక్రమంగా జరగదు. ఫలితంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో మలినాలు పేరుకుపోవడం వల్ల గుండె, కాలేయం, మెదడు, కిడ్నీలు( Kidneys ) వంటి కీలక అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. అందువల్ల రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ ను వారానికి ఒక్కసారి తీసుకున్న చాలు అద్భుత లాభాలు మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం రక్తాన్ని శుద్ధి చేసే( Purifying Blood ) ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక చిన్న కీర దోసకాయ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ స్లైసెస్ వేసుకోవాలి. అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులు, మూడు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ), వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, కొన్ని పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.చివరిగా కొన్ని వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన జ్యూస్ అనేది సిద్ధమవుతుంది. ఈ కీరా పాలక్ జ్యూస్( Cucumber Palak Juice ) లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వారానికి ఒక్కసారి ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా సాగుతుంది.అలాగే ఈ జ్యూస్ కాలేయం( Liver ) సక్రమంగా పని చేయడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. పాలకూరలో ఐరన్ కంటెంట్ అనేది మెండుగా ఉంటుంది. ఇది రక్తహీనతను తరిమి కొడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. మరియు హెల్తీ స్కిన్‌ను ప్రమోట్ చేస్తుంది.

Urban Development Jobs : ఇంటర్ అర్హతతో 760 అసిస్టెంట్ పట్టణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

Urban Development Jobs : రెండు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం మెగా సువార్త తెలిపింది. ఈ నోటిఫికేషన్ మనకు పట్టణ అభివృద్ధి సంస్థలో జాబ్ ల భర్తీ కొరకు రిలీజ్ చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 760 ఉద్యోగాలను భర్తీ చేశారు.. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకునేవారు సంబందించిన విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తుంది. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు..

ఈ ఉద్యోగానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు..
ఆర్గనైజేషన్: ఈ నోటిఫికేషన్ మనకు పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి రిలీజ్ అయింది.

Urban Development Jobs : జాబ్ రోల్ మరియు ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ..
ఖాళీల సంఖ్య: 760..
అర్హత: 12th పాస్..
జీవితము: ప్రారంభ దశలో దాదాపు 40,000 జీతము ఇస్తారు.. ఫ్రీ స్కేలు 19,900 నుండి 63200 వరకు ఇస్తారు.

Urban Development Jobs : ఇంటర్ అర్హతతో 760 అసిస్టెంట్ పట్టణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

వయసు: 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి.
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి తదుపరి స్కిల్స్ టెస్ట్ నిర్వహిస్తారు..
అప్లై చేసుకునే విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు..
వయోసడలింపు వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ను చూడండి..
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఢిల్లీ.. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది..

Snakes: ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?

భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ముఖ్యమైనది. అందుకే అవి కనిపిస్తే చాలు మనుషులతోపాటు జంతువులు కూడా అల్లంత దూరానికి పారిపోతాయి. మరికొందరికైతే వాటిని చూడగానే మూర్చవచ్చినంత పనౌతుంది.

అన్ని పాములు విషపూరితమైనవి కానప్పటికీ కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రాణాంతకమైనవి. పాములు ఎక్కువగా వర్షం పడే ప్రాంతాల్లో, తడి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. పాములతో చలగటం అంత మంచిది కాదు. పొరపాటున అవి కాటేస్తే వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మన దేశంలో పంట పొలాల్లో పాము కాటుకు గురై ఎంతో మంది రైతులు చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో, ప్రతి చోట పాములు కనిపిస్తుంటాయి. పాములు లేది దేశాలు దాదాపు లేనట్లే. ఐతే ఈ దేశంలో మాత్రం పాములు చూద్దామన్నా కనిపించవు. అదే న్యూజిలాండ్‌.. ఈ దేశానికి పాములు లేని దేశంగా పేరు కూడా ఉంది. దీని భౌగోళిక కారణాల వల్ల ఈ దేశంలో ఒక్కపాము కూడా కనిపించదు.

సాధారణంగా పాములు అత్యంత చల్లని ప్రదేశాల్లో మనలేవు. కానీ న్యూజిలాండ్‌ జియోగ్రాఫికల్ లొకేషనే గమనిస్తే.. ఇది దాదాపు దక్షిణ ధృవానికి దగ్గర్లో ఉంటుంది. భూమి రెండు ధృవాల్లో మంచు గడ్డ కట్టి అత్యంత చల్లగా ఉంటాయి. కానీ విచిత్రమేమంటే ఈ దేశంలో భూభాగంపై ఒక్క పాము కూడా కనిపించదు. కానీ న్యూజిలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో అక్కడక్కడా చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వాటిల్లో మాత్రం లెక్కకు మించి పాములు ఉంటాయి. ఇక ఆ దీవుల నుంచి పాములు ఈదుతూ న్యూజిలాండ్‌ రావాలంటే చాలా దూరం ఉండటం వల్ల అవి చేరుకోలేవు.

అయితే ఎవరైనా రహస్యంగా పాములు తీసుకొచ్చి న్యూజిలాండ్‌లో వదిలేస్తే? అనే సందేహం మీకూ వచ్చిందా.. ఈ దేశ చట్టం ప్రకారం పాములను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం, విదేశాల నుంచి తీసుకురావడం నిషేధం. అక్కడి స్థానికంగా ఉండే ఇతర ప్రాణులు, పక్షులకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ చట్టం తీసుకువచ్చారు. అందుకే న్యూజిలాండ్‌లోని జూపార్క్‌లలో కూడా ఒక్కపాము కనిపించదు. పసిఫిక్ మహా సముద్రంలో నైరుతీ భాగంలో న్యూజిలాండ్ ఉంది. ఇది భారీ ఖండంగా పిలిచే గోండ్వానాలాండ్‌ నుంచి 8.5 కోట్ల యేళ్ల కిందట విడిపోయింది. ఇక న్యూజిలాండ్ లాగానే ఐర్లాండ్‌లో కూడా పాములు కనిపించవు. దేశంలో విచిత్ర నమ్మకం ఉంది. సెయింట్ పాట్రిక్ అనే వ్యక్తి ఆ దేశంలోని పాములన్నింటినీ చంపేశాడని స్థానికులు చెబుతారు. స్థానిక పురాణం ప్రకారం.. ఓ సాధువు 40 రోజులు ఉపవాసం ఉన్న సమయంలో పాములు కాటేశాయి. దీంతో ఆగ్రహించిన ఆయన పాములను సముద్రంలోకి తరిమేశాడని అక్కడి స్థానికులు నమ్ముతారు.

Ice Cubes In Washing Machine : బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మెషిన్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టండి.. అద్భుతం మీరే చూడండి

ప్రతిరోజూ బట్టలు ఉతకడం, ఆరబెట్టడం చాలా శ్రమతో కూడుకున్న పని. చాలా మంది ఈ పనితో విసుగు చెందుతారు. అయితే ఈ రోజుల్లో వాషింగ్ మెషిన్లు ఈ పనిని కొంతవరకు సులభతరం చేశాయి.

కానీ మెషిన్ నుండి బట్టలు ఉతికిన తర్వాత ముడతలు పడతాయి. బట్టల్లో ఈ ముడతలు పడకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు కష్టపడాల్సిన పనిలేదు. ఒక చిన్న ట్రిక్ మీ బట్టలలో ముడతలను తగ్గిస్తుంది.

ఐస్ క్యూబ్స్ వేయండి

వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికిన తర్వాత, ముడతలు పడకుండా ఉండటానికి మెషిన్‌లో ఐస్ ఉంచండి. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఐస్ బట్టలలో ముడతలను కొంతవరకు తగ్గిస్తాయి. మీ వాషింగ్ మెషిన్‌లోని బట్టలకు 4 నుండి 5 ఐస్ క్యూబ్స్ జోడించండి. ఈ విధంగా మీరు డ్రైయర్‌లో బట్టలు వేసినప్పుడు చేయాలి. అవి ముడతలు పడవు.

ముందుగా మీ వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేయండి. ఇప్పుడు మెషిన్‌లో డిటర్జెంట్, సాఫ్ట్‌నర్ మొదలైన వాటిని కలపాలి. బట్టలు ఉతికిన తర్వాత డ్రైయర్‌లో 4 నుండి 5 ఐస్ క్యూబ్‌లను ఉంచండి. డ్రైయర్‌ను 15 నిమిషాల పాటు హైలో ఉంచండి. బట్టలు ముడతలు పడటం తగ్గడాన్ని మీరు చూస్తారు.

వాషింగ్ మెషిన్ దుర్వాసన పోయేందుకు చిట్కాలు

ఈ కాలంలో వాషింగ్ మెషిన్ లేని ఇల్లు లేదేమో. అయితే చాలామంది దానిలో బట్టలు ఉతుకుతారు, కానీ ఎప్పుడూ శుభ్రం చేయరు. వాషింగ్ మెషిన్‌ని కనీసం నెలకోసారి శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడంతో పాటు మెషిన్ కూడా త్వరగా చెడిపోతుంది. మీ వాషింగ్ మెషిన్ దుర్వాసన రాకుండా ఎలా శుభ్రం చేయాలో చూద్దాం.

వెనిగర్ : ముందుగా వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో వెనిగర్ పోసి ఆన్ చేయండి. ఆ తర్వాత, సమయం ముగిసినప్పుడు, అరకప్పు బేకింగ్ సోడా వేసి మళ్లీ వేయండి. బేకింగ్ సోడా యంత్రంలోని మురికిని తొలగిస్తుంది. వెనిగర్ యంత్రాన్ని వాసన పొగొడుతుంది.

నిమ్మకాయ : వాషింగ్ మెషిన్ వాసన పోగొట్టడానికి నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో ఉంచండి. నిమ్మకాయలోని ఆమ్లత్వం క్రిములను చంపుతుంది.

వేడి నీరు : వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన తొలగించడానికి వేడి నీటిని ఉపయోగించవచ్చు. దీని కోసం వేడి నీటిలో సబ్బు వేసి, వాషింగ్ మెషీన్‌లో పోయాలి. 5 నిమిషాలు నడపండి. ఇలా చేయడం వల్ల మెషిన్‌లో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అయితే బాగా వేడి నీటిని మాత్రం పోయకూడదని గుర్తుంచుకోండి.

వాషింగ్ మెషిన్ దుర్వాసనకు కారణాలు

వాషింగ్ మెషిన్ వాసన తేమ-ప్రేరిత బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. అంతే కాకుండా మెషిన్‌లో నీరు లీకేజీలు, బట్టలు ఉతికే యంత్రాలు వంటివి శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది. పైన పేర్కొన్న చిట్కాల సహాయంతో మీ వాషింగ్ మెషీన్ వాసన లేకుండా ఉంచండి. వాషింగ్ మెషిన్ వాసన వస్తే బట్టల మీద కూడా ప్రభావం పడుతుంది. అందుకే కచ్చితంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

Post Office: 5 ఏళ్లలో పొందే వడ్డీ కేవలం 2 ఏళ్లలోనే.. మహిళలకోసం ప్రత్యేకంగా..

కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ వినియోగదారులను మంచి పథకాలతో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక సాధారణంగా చాలా మంది పెట్టుబడి అనగానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇందులో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే పోస్టాఫీస్‌ మహిళలకోసం ప్రత్యేకంగా అందిస్తోన్న ఓ పథకం ద్వారా మాత్రం తక్కువ సమయంలో మంచి ఆదాయం పొందొచ్చు. ఇంతకీ ఏంటా పథకం.? దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ మహిళల కోసం మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికేట్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో మహిళలు కేవలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడితే సరిపోతుంది. దీనికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌లో 5 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే ఈ వడ్డీ లభిస్తుంది. కానీ మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో కేవలం రెండేళ్లలోనే ఈ వడ్డీని పొందొచ్చు. ఎక్కువకాలం డబ్బు డిపాజిట్ చేయకుండానే మంచి వడ్డీ పొందొచ్చన్నమాట.

ఈ ఖాతాను 18 ఏళ్లు దాటిని మహిళలు తెరవచచ్చు. ఒకవేళ 18 ఏళ్లలోపు బాలికలు అయితే వారి పేరెంట్స్‌ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంలో, మహిళలు 7.5 శాతం చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. మూడు నెలలు ఒకసారి వడ్డీని లెక్కిస్తారు. ఉదాహరణకు మహిళలు ఈ పథకలో రూ. 50000 పెట్టుబడిగా పెట్టారనుకుందాం. మీరు రెండేళ్లకు రూ. 8011 వడ్డీ లభిస్తుంది. ఇలా రెండేళ్ల తర్వాత రూ. 58011ని పొందొచ్చు. అదే రూ. లక్ష పెట్టుబడిగా పెడితే 7.5 శాతం వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 1,16,022 రిటర్న్స్‌ పొందొచ్చు.

ఈ పథకానికి కేవలం రెండేళ్ల మెచ్యూరిటీ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత డబ్బును తీసుకుంటేనే మొత్తం వడ్డీ లభిస్తుంది. అయితే ఏదైనా అవసరం దృష్ట్యా మీరు ముందుగానే డబ్బులు తీసుకోవాలనుకుంటే ఏడాది తర్వాత 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదారహణకు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత రూ. 80 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Health

సినిమా