Saturday, November 9, 2024

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులోనూ(Supreme Court) నిరాశే ఎదురైంది.

కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ(ED) అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటిసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. ఏప్రిల్ 24వ తేదీ లోపు సమాధానం చెప్పాలని ఈడీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయాలంది.

ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు.. కూడా తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను రెండు కోర్టులు తిరస్కరించగా.. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణను తరువాత చేస్తానని చెప్పింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కస్టడీ పొడగింపు..

ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రివాల్‌కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు.

కవితకు జ్యూడీషియల్ కస్టడీ..

లిక్కర్ స్కామ్ కేసులోనే ఎమ్మెల్సీ కవితను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సీబీఐ మూడు రోజుల కస్టడీ ముగియగా.. ఇప్పుడు మరో 9 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూకోర్టు తీర్పునిచ్చింది.

Weight Loss Tip: పరగడుపున పచ్చి వెల్లుల్లి.ప్రయోజనాలు తెలిస్తే షాక్

Weight Loss: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల జీవితం మరింత అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ గందరగోళంలో మనం తీసుకునే ఆహారంపై మనకు అస్సలు నియంత్రణ లేకుండా పోతుంది.
ఈ కారణం చేత చిన్న వయసు నుంచే గ్యాస్ట్రిక్ సమస్య ,ఊబకాయం ప్రజల్లో సర్వసాధారణమైపోయింది. అయితే ఇటువంటి సమస్యలకు పరిష్కారం మన వంట ఇంటిలోనే ఉంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.. తెలిసిన పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మనం ఆ విషయాన్ని పట్టించుకోము.

అలా మరుగున పడిపోతున్న ఒక పాత పద్ధతి రోజు పొద్దున పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం. అనాదిగా..మనం తినే అన్నం తొలి ముద్దలో రెండు వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని తినమని మన పెద్దలు చెబుతూ వచ్చేవారు. అది చాదస్తం అనుకున్న వాళ్లే తప్ప దాని వెనక ఉన్న సైన్సు గురించి ఎవరు ఆలోచించలేదు. అసలు వెల్లుల్లి పచ్చిగా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అందులోనూ పరగడుపున తింటే మన శరీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం పదండి.
మన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి అంటే మంచి డైట్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆహారానికి రుచి పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే పదార్థమే వెల్లుల్లి. అలాంటి వెల్లుల్లి పొద్దున ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మనల్ని మనం అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోగలుగుతాము. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ సైతం సోకే ప్రమాదం తప్పిస్తుంది వెల్లుల్లి.

వెల్లుల్లిలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లాంటి తత్వాల కారణంగా మన శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకదు. పైగా రోజు పొద్దున ఖాళీ కడుపున ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోగలిగితే మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడంతో పాటు పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు కరుగుతుంది. ఇది తీసుకునే వాళ్ళకి జీర్ణక్రియ మెరుగుగా పని చేస్తుంది కాబట్టి తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడంతో పాటు మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోతాయి.
డిప్రెషన్,నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా వెల్లుల్లి మంచి మందుగా పనిచేస్తుంది. రోజు పచ్చి వెల్లుల్లి తినేవారికి రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. మరి ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్స్ ఇలా వెల్లుల్లి తినడం వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోగలుగుతారు. చిన్నపిల్లలలో ఇది ఇమ్యూన్ సిస్టం ని బలపరుస్తుంది. అయితే వెల్లుల్లి పచ్చిగా తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటివారు తొక్కు తీసిన వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో నానబెట్టుకోవాలి. ఇలా రెండు రోజులు తేనెలో ఊరిన తర్వాత వెల్లుల్లి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పరగడుపున దీన్ని ఒక స్పూన్ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా తయారుచేసిన అన్నం తినాలి

Weight Loss: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల జీవితం మరింత అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ గందరగోళంలో మనం తీసుకునే ఆహారంపై మనకు అస్సలు నియంత్రణ లేకుండా పోతుంది.
ఈ కారణం చేత చిన్న వయసు నుంచే గ్యాస్ట్రిక్ సమస్య ,ఊబకాయం ప్రజల్లో సర్వసాధారణమైపోయింది. అయితే ఇటువంటి సమస్యలకు పరిష్కారం మన వంట ఇంటిలోనే ఉంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.. తెలిసిన పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మనం ఆ విషయాన్ని పట్టించుకోము.

అలా మరుగున పడిపోతున్న ఒక పాత పద్ధతి రోజు పొద్దున పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం. అనాదిగా..మనం తినే అన్నం తొలి ముద్దలో రెండు వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని తినమని మన పెద్దలు చెబుతూ వచ్చేవారు. అది చాదస్తం అనుకున్న వాళ్లే తప్ప దాని వెనక ఉన్న సైన్సు గురించి ఎవరు ఆలోచించలేదు. అసలు వెల్లుల్లి పచ్చిగా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అందులోనూ పరగడుపున తింటే మన శరీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం పదండి.
మన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి అంటే మంచి డైట్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆహారానికి రుచి పెంచడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే పదార్థమే వెల్లుల్లి. అలాంటి వెల్లుల్లి పొద్దున ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మనల్ని మనం అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోగలుగుతాము. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ సైతం సోకే ప్రమాదం తప్పిస్తుంది వెల్లుల్లి.

వెల్లుల్లిలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లాంటి తత్వాల కారణంగా మన శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకదు. పైగా రోజు పొద్దున ఖాళీ కడుపున ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోగలిగితే మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడంతో పాటు పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు కరుగుతుంది. ఇది తీసుకునే వాళ్ళకి జీర్ణక్రియ మెరుగుగా పని చేస్తుంది కాబట్టి తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడంతో పాటు మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోతాయి.
డిప్రెషన్,నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా వెల్లుల్లి మంచి మందుగా పనిచేస్తుంది. రోజు పచ్చి వెల్లుల్లి తినేవారికి రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. మరి ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్స్ ఇలా వెల్లుల్లి తినడం వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోగలుగుతారు. చిన్నపిల్లలలో ఇది ఇమ్యూన్ సిస్టం ని బలపరుస్తుంది. అయితే వెల్లుల్లి పచ్చిగా తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటివారు తొక్కు తీసిన వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో నానబెట్టుకోవాలి. ఇలా రెండు రోజులు తేనెలో ఊరిన తర్వాత వెల్లుల్లి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పరగడుపున దీన్ని ఒక స్పూన్ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Personality Test: పెదవుల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేయచ్చట.. మీ పెదవులు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి మరి..!

పెదవుల ఆకారం వ్యక్తులు ఎలాంటి వారో చెప్పేస్తాయి.

కింద పెదవి పై పెదవి కంటే పెద్దదైతే..

పై పెదవి కంటే కింద పెదవి పెద్దగుంటే బబ్లీ పర్సనాలిటీని కలిగి ఉంటారు. నిరంతరం వినోదం, సాహసం కోసం వెతుకుతూ ఉంటారు. జీవనశైలి చురుగ్గా ఉంటుంది.

పై పెదవి కింది పెదవి కంటే పెద్దదైతే..

ఇలాంటి వ్యక్తులు నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటారు. సంతోషం కోసం అనవసరమైన వస్తువుల మీద ఆధారపడరు. దృఢంగా, నిజాయితీగా ఉంటారు. స్నేహం, ప్రేమలో విఫలం కారు.

పెదవులను కృత్రిమంగా రూపొందించుకుంటే..

పెదవులను కృత్రిమంగా రూపొందించుకుని సహజ లక్షణాలు మార్చుకుంటే విధితో ఛాలెంజ్ చేస్తున్నారని అర్థమట.

సహజంగా ఉబ్బినట్టు ఉంటే..

సహజంగా పెద్దగా బొద్దుగా ఉండే వ్యక్తులు చాలా సానుభూతి కలిగినవారు. ప్రేమ, దయ, భాద్యత కలిగి ఉంటారు. జంతు ప్రేమికులై ఉంటారు.

గోల్డిలాక్ పెదవులు..

ఇవి మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. ఇలాంటి వారు సమతుల్య లక్షణాలతో ఉంటారు. స్థిరమైన, పరిణితి చెందిన ఆలోచనలతో ఉంటారు. మంచి శ్రోతలు. స్నేహితులు, ఆప్తులు వీరి సలహాలు కోరుతుంటారు కూడా.

బొద్దుగా ఉన్న పెదవులు..

చిన్న తేనెటీగ కుడితే ఎలా బొద్దుగా ఉబ్బినట్టు ఉంటాయో అలాంటి పెదవులు ఉన్నవారు అందరికంటే తమకు తాము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. వీరికి స్వీయ నిమగ్నత ఎక్కువ.

సన్నని పెదవులు..

సన్నని పెదవులు కలిగిన వారు ఏకాంతాన్ని ఎక్కువ ఇష్టపడతారు. వీరు ఇంట్రోవర్ట్ గానూ, ఎక్స్టోవర్ట్ గానూ రెండువిధాలుగా కూడా ఉంటారు. స్పష్టమైన జీవిత లక్ష్యాలను కలిగి ఉన్న జీవిత భాగస్వాములతో అనుకూలంగా ఉంటారు.

విల్లులాంటి పెదవులు..

విల్లులాంటి పెదవులు కలిగిన వారు చాలా ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరి మనసు చాలా దృఢంగా ఉంటుంది. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Gold seized: ఎన్నికల వేళ 1425 కేజీల (విలువ 900 కోట్లు బంగారం సీజ్.. ఎక్కడ?

Gold seized: ఎన్నికల వేళ నగదు, నగల ప్రవాహాన్ని కంట్రోల్ చేసేందుకు దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఆపాల్సిందేనని భావించింది. అన్నట్లుగా చెక్ పోస్టులను భారీగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్లయింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించింది. తాజాగా తమిళనాడులో భారీ ఎత్తున పసిడి పట్టుబడింది. ఒక్కరోజులో దాదాపు 1025 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు.

తొలుత మిని లారీ, మినీ కంటెయినర్లను సోదాలు చేశారు పోలీసులు. ఓ లారీలో దాదాపు 1025 కేజీ గోల్డ్ పట్టుబడింది. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టు నుంచి శ్రీపెరుంబుదూర్ సమీపంలోకి ఓ గోడౌన్‌కు తరలిస్తున్నట్లు తేలింది. అయితే 400 కేజీల బంగారానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అయితే లారీలో స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించిన ఆధారాలు లేనట్లు సమాచారం. వీటి విలువ మార్కెట్‌లో 900 కోట్ల రూపాయలుగా ఉంటుందని అధికారుల అంచనా.

కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ రహదారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల తనిఖీల్లో ఈ బంగారం వ్యవహారం బట్టబయలైంది. దీంతో తమిళనాడు అంతటా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను మెహరించారు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. మరో నాలుగురోజుల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 39 నియోజక‌వర్గాలు ఈ ఫేజ్‌లోనే ఉన్నాయి. పోలింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అక్కడ ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ కూత మొదలు ఇప్పటికే అత్యధిక బంగారం పట్టుబడింది కేవలం దక్షిణాదిలో మాత్రమే.

ముఖ్యమంత్రిపై రాయి దాడి పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు?

ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాయి విసిరిన దుండగుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

రాయి విసిరిన దుండగుడిని రౌడీషీటరుగా గుర్తించారు. పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. సిఎం యాత్రను కిలోమీటరు దూరం నుంచి వాళ్లు అనుకరిస్తూ వచ్చినట్లు సమాచారం. ఘటన జరిగిన స్కూల్‌ – గంగానమ్మగుడి మధ్య ఉన్న గోడ ప్రాంతంలోని ఓ చెట్టు మాటు నుంచి రాయి విసిరినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.

Injected Watermelon: ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను గుర్తించడం ఈజీనే.. ఇలా ఉంటే ఇంజెక్ట్ చేసినట్టే!

Injected Watermelons Identified: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల తో పాటు పుచ్చకాయలు ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి రోడ్లపై సైతం రాసులుగా పోసి అమ్ముతూ ఉంటారు.

సమ్మర్ లో పుచ్చకాయతో తయారుచేసిన సలాడ్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటి శాతంతో పాటు విటమిన్స్ మినరల్స్ అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ఎండా కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. దీని కారణంగా చాలామంది వేసవికాలంలో ఎక్కువగా పుచ్చకాయలను కొనుక్కొని తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లలో చాలామంది పుచ్చకాయలను విక్రయించేవారు త్వరగా క్యాష్ చేసుకోవడానికి తాజాగా ఉండేటట్లు కనిపించేలా ఇంజక్షన్ చేసి విక్రయిస్తున్నారు.

ఇలా ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటినే తరచుగా తీసుకోవడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంజక్షన్స్ ఇచ్చిన పుచ్చకాయలను తినడం వల్ల ముందుగా మనుషుల జీర్ణక్రియ పై తీవ్ర ప్రభావం పడి ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంజక్షన్ ఇచ్చిన పుచ్చకాయలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పుచ్చకాయను చూడగానే పై ఉపరితలంపై కాస్త తెలుపు రంగులో ఉండి పసుపు రంగు అక్కడక్కడ ఉంటుంది. ఇలా కనిపిస్తే, తప్పకుండా మీరు దానికి ఇంజక్షన్ ఇచ్చినట్లు గుర్తించవచ్చు. అలాగే కొన్నింటిపై పసుపు రంగులో పొడి కూడా కనిపిస్తుంది. ఇలా కనిపించే పొడినే కార్బైడ్ అంటారు. నిజానికి ఈ పొడిని వినియోగించడం వల్ల పుచ్చకాయలు తొందరగా పండ్లు పండుతాయి. అంతేకాకుండా చూడడానికి తాజాగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పుచ్చకాయపై భాగం మొత్తం ఆకుపచ్చ రంగులోకి కూడా మారుతుంది.

పుచ్చకాయ ఎగువ ఉపరితల భాగం పై పసుపు రంగులో ఉన్న పొడిని తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటిని పిల్లలకు ఇచ్చే ముందు ఉప్పు నీటితో శుభ్రం చేయడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఇంజక్షన్ ఇచ్చిన పుచ్చకాయలు కోయగానే సాధారణ ఎరుపు రంగు కంటే నాలుగు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని తింటే నాలుక కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా ఉంటే పక్కా ఇంజక్షన్ చేసినట్లే అని చెప్పవచ్చు. ఇంజక్షన్ చేసిన కొన్ని పుచ్చకాయలపై రంద్రాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా వాటిపై తొందరగా పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి వేసవిలో బుచ్చకాయలను కొనుగోలు చేసేవారు ఇవి తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి.

Summer Tour: వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేశారా..? అయితే, వెంటనే ఈ ప్రదేశాలను సందర్శించండి.. ప్రకృతి అందాలకు పరవశించిపోతారు..

Summer Visits : సమ్మర్ వచ్చిందంటే చాలు.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేస్తారు. అందుకే హలీడేస్‌లో చాలా మందికి బోర్ కొట్టడం మామూలే.. కానీ ఆ బోర్ పోగొట్టుకునేందుకు ఎక్కువ మంది టూర్లకు వెళ్తుంటారు.

ఇంట్లో కూర్చుని విసుగు చెందకుండా కొత్త కొత్త ప్రదేశాలకు ప్రయాణిస్తూ అక్కడి ప్రకృతి అందాలు, ఆహారం, సంప్రదాయాలను ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారికోసం వేసవి నెలల్లో కర్ణాటకలో సందర్శించడానికి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..ఇది మీరు వేసవిలో సందర్శించడానికి అనువైన ప్రదేశాలు అవుతాయి.

మడికేరి (కొడగు): “స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా”గా పిలువబడే కూర్గ్ వేసవిలో కూడా పచ్చని ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది.. ఇక్కడి కాఫీ తోటలు, చల్లని వాతావరణాన్ని అందిస్తాయి. మండువేసవిలో ఇక్కడి వచ్చే పర్యాటకులు శీతాల వాతవరణాన్ని ఎంజాయ్‌ చేస్తారు.

చిక్కమంగళూరు: కాఫీ తోటలు, ప్రకృతి అందాలకు నెలవైన మరొక ప్రసిద్ధ హిల్ స్టేషన్ చిక్కమంగళూరు. బాబా బుడంగిరి, ముల్లయనగిరి కొండలు పర్యాటకులకు బెస్ట్‌ ట్రెక్కింగ్ స్పాట్‌గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్‌ను కూడా తప్పక ఎంజాయ్‌ చేస్తారు.

నంది కొండలు: బెంగుళూరు సమీపంలోని నంది కొండలు దాని ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలతో మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తాయి.

గోకర్ణ: మీరు బీచ్ స్పాట్‌లను ఇష్టపడితే, గోకర్ణం ఖచ్చితంగా మీకు మంచి టూరిస్ట్‌ స్పాట్‌ అవుతుంది. ఇది ఓం బీచ్, కుడ్లే బీచ్, హాఫ్ మూన్ బీచ్ వంటి ప్రశాంతమైన బీచ్‌లను కలిగి ఉంది. మీరు అక్కడ ఎలాంటి ఒత్తిడి, చింతలు లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.

హంపి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన హంపి గొప్ప చారిత్రక, నిర్మాణ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి రాతి నిర్మాణాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాల మధ్య విజయనగర సామ్రాజ్యం అవశేషాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి.

బాదామి: ఇసుకరాయి శిఖరాలతో చెక్కబడిన పురాతన గుహ దేవాలయాలను చూడటానికి బాదామిని సందర్శించండి. నిర్మాణ అద్భుతాలు, గొప్ప చరిత్ర కలిగిన ఈ బాదామిని కూడా మీరు తప్పనిసరిగా సందర్శించవలసిన గమ్యస్థానంగా మార్చింది.

హోగెనకల్ జలపాతం: కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న హోగెనకల్ జలపాతం వేసవి నెలల్లో అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. మీరు కోరాకిల్ రైడ్‌లను ఆస్వాదించవచ్చు. అద్భుతమైన జలపాతాన్ని చూడవచ్చు.

మైసూర్: వేసవిలో మైసూర్ వేడిగా ఉన్నప్పటికీ, దాని అద్భుతమైన మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్, బృందావన్ గార్డెన్స్ చూడదగినవి.

ఈ ప్రదేశాలు సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత, సాంస్కృతిక అనుభవాల సమ్మేళనాన్ని అందిస్తాయి, వీటిని కర్ణాటకలో వేసవి సెలవులకు అనువైన ప్రదేశాలుగా మార్చాయి. ఈ సారి వేసవి సెలవుల్లో మీరు కూడా టూర్‌ప్లాన్‌ చేస్తున్నట్టయితే.. ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి.

Amazon: అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. వీటిపై 80 శాతం వరకు తగ్గింపు.. !

Amazon Mega Electronics Days Sale: తక్కువ ధరలో మంచి ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ది బెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో అనేక రకాలైన ప్రొడక్టులపై దాదాపు 80 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే ఏ ఏ ప్రొడక్టులపై ఎంత శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ కొత్తగా ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భారీ తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు, HDFC క్రెడిట్ / డెబిట్ కార్డుతో సహా మరికొన్ని బ్యాంక్ కార్డులపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు.

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచెస్, హెడ్ ఫోన్స్, టాబ్లెట్స్, కెమెరా వంటి వాటిపై తగ్గింపులను అందిస్తుంది. అలాగే గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు తగ్గింపు, స్పీకర్స్‌పై 65 శాతం వరకు తగ్గింపు, కంప్యూటర్ యాక్ససరీస్‌పై 70 శాతం వరకు తగ్గింపు, సెక్యూరిటీ కెమెరాపై 80 శాతం, స్టోరేజీ డివైజెస్‌పై 65 శాతం, వైఫై రూటర్స్‌పై 60 శాతం, ప్రింటర్స్‌పై 40 శాతం, కాంపోనెంట్స్‌పై 60 శాతం, మోనిటర్స్‌పై 60 శాతం, మ్యూజికల్ ఇన్‌స్ట్రూమెంట్స్‌పై 75 శాతం, డెస్క్‌టాప్‌పై 60 శాతం, అలాగే ఆఫీస్ ప్రొడక్ట్స్ ‌పై 65 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.

వీటిపై SBI క్రెడిట్ కార్డు లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ ఆప్షన్లలో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అలాగే HDFC బ్యాంక్ కస్టమర్లు సుమారు రూ.5000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. అందువల్ల అత్యంత భారీ డిస్కౌంట్స్‌తో తక్కువ ధరలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులను కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి. ఈ సేల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు.. మీకు ఏ ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్స్ ధర వివరాలు తెలియాలంటే ఓ సారి అమెజాన్‌‌లో చెక్ చేసుకోవచ్చు.

IPL 2024: నేడు RCB vs SRH కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో(IPL 2024) ఈరోజు 30వ మ్యాచ్‌ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. బెంగళూరుకు ఇది 7వ మ్యాచ్‌. ఈ జట్టు 6 మ్యాచ్‌ల్లో కేవలం 1 విజయం సాధించి 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో దిగువన 10వ స్థానంలో ఉంది.

మరోవైపు హైదరాబాద్‌(SRH)కు ఇది ఆరో మ్యాచ్‌. ఐదింటిలో 3 విజయాలు సాధించి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకమని చెప్పవచ్చు. మరోవైపు బెంగళూరు(RCB) కూడా వరుసగా ఓటమి చెందుతున్న వేళ సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్ గెలవాలని చూస్తోంది.

ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. RCB 10, SRH 12 గెలిచింది. కాగా ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. బెంగళూరులో ఇరు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. బెంగళూరు 5, హైదరాబాద్‌ రెండు గెలిచాయి. ఇక్కడ ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలింది.

బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా ఉంది. బౌలర్లకు ఇక్కడ కొంచెం కష్టమేనని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ 91 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 38 మ్యాచ్‌లు గెలవగా, ఛేజింగ్ జట్లు 49 మ్యాచ్‌లు గెలిచాయి. ఇక్కడ 4 మ్యాచ్‌లు కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక బెంగళూరులో వెదర్ విషయానికి వస్తే సోమవారం వర్షం కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 21 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

మరోవైపు ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు 46 శాతం గెలిచే ఛాన్స్ ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టులో ప్రాబబుల్ ప్లేయర్స్ ఫాఫ్ డు ప్లెసిస్ (C), విరాట్ కోహ్లి, విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, రీస్ టాప్లీ, విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో ప్రాబబుల్ ప్లేయర్స్ పాట్ కమిన్స్ (C), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, మయాంక్ మార్కండే కలరు.

Good news :సెల్‌ టవర్‌ లేకున్నా మొబైల్‌ కమ్యూనికేషన్‌!

స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్స్‌లో చైనా విప్లవాత్మక ఆవిష్కరణను తీసుకొచ్చింది. భూమిపై ఉన్న సెల్‌ టవర్ల అవసరం లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్‌ను సాధ్యం చేయగలిగేలా ప్రపంచంలోనే మొదటి ఉపగ్రహాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్వర్గంతో కనెక్ట్‌ అవ్వడం అని అర్థం వచ్చేలా దీనికి ‘టియాంటాంగ్‌’ అని దీనికి పేరుపెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం చైనా రోదసీలోకి పంపిన ‘టియాంటాంగ్‌-1’ ఉపగ్రహ శ్రేణి ప్రస్తుతం మూడుకు చేరింది. ఇవి జియోసింక్రోనస్‌ కక్ష్యలో తిరుగుతూ మొత్తం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాన్ని కవర్‌ చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా మొబైల్‌ శాటిలైట్‌ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది. చైనాకు చెందిన ‘హువావే’ ఇప్పటికే ప్రపంచంలోనే శాటిలైట్‌ కనెక్టివిటీని సపోర్ట్‌ చేసే మొదటి మొబైల్‌ కంపెనీగా గుర్తింపు పొందింది. హువావే టెక్నాలజీస్‌ గతేడాది సెప్టెంబరులో శాటిలైట్‌ కాల్స్‌కు మద్దతునిచ్చే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా ఆ జాబితాలో షియోమి, హానర్‌, ఒప్పో వంటి మొబైల్‌ కంపెనీలు కూడా చేరాయి. గతేడాది డిసెంబరు 18న చైనాలోని గాన్సు ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. సాంప్రదాయ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పనిచేయలేదు. ఈ సమయంలో బాధితుల్లో కొందరు శాటిలైట్‌ కాల్‌ సౌకర్యం ద్వారా బాహ్య ప్రపంచంతో సమాచారాన్ని పంచుకోగలిగారు.

 

Vastu Tips : ఈ లోహపు విగ్రహాలను పూజిస్తే, నట్టింట్లో కనకవర్షమే!

పూజ గదిలో వివిధ రకాల లోహాలతో చేసిన దేవుని విగ్రహాలను పూజిస్తాం. సాధారణంగా పంచలోహాలు,వెండి విగ్రహాలతో చేసిన దేవుళ్లను పూజిస్తాం. అయితే శాస్త్ర ప్రకారం బంగారంతో చేసిన దేవుడి విగ్రహాలను కూడా పూజ చేయవచ్చని పండితులు చెబుతున్నారు. ఎవరి స్తోమతను బట్టి వారు ఈ విగ్రహాలను పూజిస్తుంటారు. పూజాగదిలో బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

దేవుని విగ్రహాలు మతవిశ్వాసం, భక్తికి చిహ్నాలు. సాధారణంగా చాలా మంది తమ పూజాగదిలో దేవుడి చిత్రపటాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే మరికొందరు నియమ నిష్టలు పాటించేవారు దేవుడి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. కాగా ఇంట్లో ప్రతిష్టించే విగ్రహాలు..శాంతి, ప్రశాంతతను కలిగిస్తాయి. సనాతన మత గ్రంథాల ప్రకారం పూజ గదిలో ఏర్పాటు చేసుకునే లోహపు విగ్రహం మీ పూజ ఫలం మరింత పెంచుతుంది.

పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి:
పూజ గదిలో బంగారంతో చేసిన దేవుడి విగ్రహాన్ని పూజించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. పూజ గదిలో బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం అనేది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే బంగారు విగ్రహం నుంచి వెలువడే పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ను నిలువరిస్తాయి.

బంగారు విగ్రహం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం:
బంగారంతో చేసినటువంటి విగ్రహాలను పూజించడం ద్వారా, సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. బంగారానికి మరో పేరు సిరి. సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. కావున ఆ మహాలక్ష్మి దేవి కృపాకటాక్షాలు దక్కాలంటే బంగారాన్ని పూజించాలి.

శక్తికి మూలం:
బంగారంతో చేసిన విగ్రహాలు శక్తికి మూలమని సనాతన ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి. ఎవరైతే శక్తి ఆరాధన చేయాలనుకుంటారో వారు బంగారంతో చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా తమ కోరికలను నెరవేర్చుకోవచ్చు.

పూజలో ఆత్మీయత:
బంగారంతో చేసిన విగ్రహాలు ఆరాధనలో ఆత్మీయతను, గౌరవాన్ని పెంపొందిస్తాయి. ఇది భక్తులు, దేవుళ్ల మధ్య బంధాన్ని సృష్టిస్తుంది. అలాంటి విగ్రహాలను పూజించే వ్యక్తి మనసులో గౌరవ భావం ఏర్పడుతుంది. ఇది సమాజంలో మీ గౌరవం పెంచేందుకు సహాయపడుతుంది.

అదృష్టం, శ్రేయస్సు:
ఇంట్లో బంగారంతో చేసిన విగ్రహాలను ఉంచడం, ఇంట్లో వాటిని పూజించడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ శక్తిని నింపుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఏ ఇంట్లో అయితే బంగారు లోహంతో తయారు చేసిన విగ్రహాన్ని పూజిస్తారో.. ఇంటిపై లక్ష్మీదేవి దీవెనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే బంగారు విగ్రహాన్ని పూజించే ముందు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

సాధారణంగా పూజ గదిలో విగ్రహాలను పెట్టి పూజించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నిత్య పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే బంగారు వెండి విగ్రహాలు ప్రతిష్టించినప్పుడు పవిత్రంగా ప్రతిరోజు స్నానం చేసి దీపం వెలిగించి నిత్య పూజ చేయాలి. అలా చేయలేని వారు దేవుని చిత్రపటాలు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే బంగారు విగ్రహం ప్రతిష్టించాలి అనుకున్నప్పుడు ఏ దేవతల విగ్రహాలను ప్రతిష్టించాలి అనే అనుమానం మీకు కలగవచ్చు.

బంగారం రూపంలో లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడు, వంటి విగ్రహాలను మాత్రమే పూజించాలి.
బంగారు శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు.
శివుడు కోరికలకు దూరంగా ఉండే యోగి. కావున ఆయనకు బంగారం వంటి ఆడంబరాలు చేయకూడదు.
ఇక బంగారు విగ్రహాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. పూజ గదిలో ప్రవేశించేది ముందు కాళ్లు చేతులు కడుక్కొని వెళ్లాలి.
బంగారు విగ్రహాలను అతిగా అభిషేకాలు చేయకూడదు.
పలుచటి వస్త్రంతో తుడవవచ్చు. నిత్య పూజలు చేయలేని వారు బంగారు విగ్రహాలను భద్రంగా అలమారలో దాచుకొని.. పర్వదినాల్లో మాత్రమే పూజ గదిలో ప్రతిష్టించి పూజ చేసుకుంటే మంచిది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘MannamWeb ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఈ విషయాలను MannamWeb ధృవీకరించడం లేదని గమనించగలరు.

Lucky Bamboo: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే అదృష్టం తెస్తుందా?

Vastu Tips: వాస్తు శాస్త్రం జీవితం సజావుగా సాగేందుకు అవసరమైన అనేక విషయాలను గురించి చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని రకాల వస్తువులు జీవితంలో కష్టాలు తొలగించి జీవితాన్నిసజావుగా సాగుతుందని వాస్తు వివరిస్తుంది. లక్కీ బాంబూ(Lucky Bamboo) మొక్క అలాంటి వాటిలో ఒకటి.

లక్కీ బాంబూ(Lucky Bamboo) విశిష్టత ఇదే
Lucky Bamboo మొక్క పవిత్రమైనది. వాస్తు ప్రకారం ఇది అదృష్టాన్ని తెస్తుంది. ఇది ఆయువు, ఆరోగ్యాన్ని అందిస్తుందని నమ్మకం. Lucky Bamboo ఉన్న చోట సంపద, సౌఖ్యం ఉంటుందని శాస్త్రం వివరిస్తోంది. చాలా మంది వారి ఇంటి ఆవరణలో పొడవైన వెదురు మొక్కలు పెంచుకుంటారు. పొడవుగా పెరిగే ఈ మొక్కులు నిరంతర ఎదుగుదలకు సంకేతాలు.

వెదురు మొక్కతో కలిగే లాభాలు
ఒక్కో వెదురు మొక్క 4, 5 వందల సంవత్సరాల పాటు జీవిస్తుంది. కనుక ఇవి దీర్ఘాయుష్షుకు సంకేతాలు. ఆరోగ్యం బాగాలేని వారి పరిసరాల్లో ఈ మొక్కను ఉంచితే త్వరగా కోలుకుంటారని నమ్మకం.
వెదురు మొక్కలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడుతాయి. కనుక ఇవి అన్ని రకాల కష్టాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి.
వెదురు మొక్కను వ్యాపార ప్రదేశాలు, కార్యాలయాల్లో పెట్టుకుంటే లాభదాయంకంగా ఉంటుంది. పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతాయి.
ఈ మొక్కలు ఉన్న చోట పాజీటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగెటివిటి తొలగిపోతుంది.
వెదురు మొక్కలు మాత్రమే కాదు. వెదురు ఉపయోగించి చేసిన విండ్ షెమ్స్ వంటివి ఉపయోగించడం వల్ల కూడా పరిసరాల్లోని నెటెటివిటిని తొలగించి పాజిటివ్ గా ఉంచుతాయి.
ఎక్కడ పెడితే మంచిది?
సాధారణంగా వెదురు మొక్కను ఇంట్లో తూర్పు వైపు పెట్టుకోవచ్చు. ఆర్థిక సమస్యలు తీరేందుకు లక్కీబాంబు ఎప్పుడూ ఆగ్నేయంలో పెట్టుకోవాలి. ఆగ్నేయంలో ఉంటే లక్కీ బాంబూ సంపదను ఆకర్శిస్తుందని నమ్మకం. డైనింగ్ టేబుల్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పెద్దగా ఎండ కానీ సంరక్షణ కానీ అవసరం లేదు కనుక బెడ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇంటిలోపల ముఖద్వారానికి దగ్గరగా అలంకరించుకుంటే జీవితంలోకి కొత్త అవకాశాలను ఆహ్వానిస్తుంది. వెదురు మొక్క ఇంట్లోని టాక్సిన్లను తొలగించి పరిసరాలను శుద్ధి చేస్తుంది.

ఎన్ని మొక్కలు ఉండాలి?
ఒక కుండిలో ఎన్ని వెదురు మొక్కలు ఉండాలనే విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు మొక్కలున్న కుండి పెట్టుకుంటే యుక్త వయసు వారైతే మీకు తగిన భాగస్వామి దొరుకుతారని అర్థం. ఐదు మొక్కలుంటే జీవితంలోకి ఆనందం వస్తుది. ఆరుంటే ఆరోగ్యం, ఎనిమిదుంటే సంపదను అందిస్తాయని ఫెంగ్ ష్యూయి చెబుతోంది. తొమ్మిది మొక్కలుంటే మంచి భవిష్యత్తు, పది మొక్కులైతే అదృష్టం తీసుకువస్తాయి. 21 మొక్కులుంటే ఆ దేవుడి కరుణకు మీకు పాత్రుతవుతారని అనేందుకు సంకేతం. అయితే నాలుగు మొక్కలున్న Lucky Bamboo తెచ్చుకోవద్దు, ఎవరికి బహుకరించవద్దు కూడా ఎందుకంటే ఈ సంఖ్య మరణాన్ని ఆహ్వానిస్తుందట.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఈ విషయాలను MannamWeb దృవీకరించడం లేదని గమనించలరు.

త్వరలోనే మూఢం.. ఏ పనులు చేయాలి.. ఏం చేయకూడదంటే

గత నాలుగైదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. మరో 12 రోజులు పూర్తయితే అనగా ఏప్రిల్ 26 తర్వాత నుంచి శుభకార్యాలు చేయడానికి మంచి ముహుర్తాలు లేవు. అందుకు కారణం.. మూఢం. హిందూ పురణాల ప్రకారం.. ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు. త్వరలోనే మూఢాలు ప్రారంభం కాబోతుండటంతో.. పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరందుకున్నాయి. ఆ తర్వాత మూడు నెలల వరకు శుభ ముహుర్తాలు లేవు. మరి ఇంతకు మూఢం అంటే ఏంటి.. ఎందుకు ఈ సమయంలో శుభకార్యాలు చేయవద్దు అంటారు.. మౌఢ్యంలో ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు అంటే..

2024 లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగష్టు 8 వరకూ దాదాపు మూడు నెలల కాలం మూఢం. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.

ఇంతకు మూఢం అంటే ఏంటి..
మన పురణాల్లో గ్రహాలు, వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. సైన్స్ ప్రకారం చూసుకున్న నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. ఈ క్రమంలో భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. ఇక మూఢాలు రెండు రకాలు. గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం ఏర్పడతాయి.

సూర్యునికి దగ్గరగా గురు, శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు వాటి శక్తులు తగ్గి బలహీనమై, నీరసపడతాయి. అంటే గ్రహాల స్థితి బలహీనంగా మారుతుందన్నమాట. గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు బలహీనంగా మారుతాయి. ఆ సమయాన్ని మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. శుభకార్యాలకు గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం. అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు అంటారు పండితులు.

మూఢంలో ఏ పనులు చేయకూడదంటే..
మూఢాల్లో వివాహాది శుభ కార్యాలు జరపకూడదు.
లగ్నపత్రిక రాసుకోకూడదు.
కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు.
అలానే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు.
ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన వంటి పనులు చేయకూడదు.
ఇల్లు మారకూడదు.
మూఢంలో ఏ పనులు చేయవచ్చంటే..
అన్న ప్రాసన చేసుకోవచ్చు
ప్రయాణాలు చేయవచ్చు
ఇంటికి మరమ్మత్తులు చేసుకోవచ్చు
భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు
నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు
నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు.
కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు.
మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏం జరుగుతుంది..
జ్యోతిష్య శాస్త్ర పండితులు, హిందూ పురణాల్లో చెప్పిన దాని ప్రకారం.. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది కలిసి రాదని.. చెడు వార్తలు వినాల్సి రావొచ్చని.. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదు అంటారు.

Oppo A3 Pro: కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో కొత్త ఫోన్‌.. ధర కూడా తక్కువే..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి ఒప్పో ఏ3 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ2 ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే భారత్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే బేస్‌ వేరియంట్‌ మన కరెన్సీలో రూ. 25,000 వరకు ఉండొచ్చని అంచనా. ఇక టాప్‌ ఎండ్ మోడల్‌ ధర రూ. 28,900గా ఉండనుంది.

ఈ ఫోన్‌ను ఐపీ69 రేటింగ్‌తో తీసుకొచ్చారు. దీంతో నీటిలో తడిచినా ఫోన్‌కు ఏం కాదు. అలాగే ఈ ఫోన్లో 67 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపైస ఈ ఫోన్‌ పనిచేస్తుంది

ఒప్పో ఏ3 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఈ స్క్రీన్ సొంతం. 360 డిగ్రీ యాంటీ ఫాల్ బాడీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఒప్పో ఏ3 ప్రోలో 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌ సొంతం.

Google: గూగుల్ తల్లిని నమ్ముకున్న రైల్వే.. ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’గా మారిన రైలు.. ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి..

గూగుల్‌… ఇప్పుడు ఇదే చాలా మందికి దిశ నిర్దేశంగా మారింది. ఏ పని చేయాలన్న ప్రజలు గూగుల్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. గూగుల్‌ని నమ్ముకుని ప్రయాణం చేసిన వారు నిలువునా మునిగిపోయిన వార్తలు మనం అనేకం చూశాం. చాలా సార్లు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా బయల్దేరిన వాహనదారులు ఏకంగా నదులు, అడవులు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లిన సంఘటనలు సోషల్ మీడియాలో అనేకం చూశాం. అయితే, ఇప్పుడు గూగుల్ ట్రాప్‌లో పడ్డ ఇండియన్‌ రైల్వే కూడా ప్రజల విమర్శలకు కారణంగా మారింది. గూగుల్ సహాయంతో చేసిన అనువాదం కొన్నిసార్లు అర్థాన్ని వక్రీకరించేలా చేస్తుంది. అలాంటి ఒక అనువాదం రైల్వే చేసింది.

గూగుల్‌ ట్రాన్స్‌ లేషన్‌ను నమ్ముకున్న భారతీయ రైల్వే ఇటీవల ఒక రైలుకు పేరు పెట్టింది. అది శరవేగంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దూసుకెళ్లింది. దాంతో ఇండియన్‌ రైల్వేపై నెటిజన్లు ఫన్నీగా ప్రశంసించటం మొదలుపెట్టారు. దీనిపై ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించింది. తన తప్పును అంగీకరించింది. జరిగిన తప్పిదానికి చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ఇంతకీ రైల్వే చేసిన ఆ తప్పేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గూగుల్‌ ట్రాన్స్‌లేషన్ ఆధారంగా భారతీయ రైల్వే ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేసింది.. దీంతో ఆ రైలు పేరు మారిపోయింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని హటియా, కేరళలోని ఎర్నాకుళం నగరాల మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తున్నది. అయితే హిందీ పదమైన ‘హటియా’ను మలయాళంలో అనువాదించడంలో తప్పు జరిగింది. హతియా(హంతకుడి)గా భావించి ఆ అర్థం వచ్చేలా ‘కోలపథకం’ అని మలయాళంలో రాశారు. దీంతో హటియా-ఎర్నాకుళం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు కాస్తా ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’గా మారిపోయింది. ఇంకేం కొందరు స్థానికులు దీన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ చేశారు.. ఇలా రైల్వే శాఖ చేసిన తప్పిందంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రైలుకు సంబంధించిన నేమ్‌ బోర్డు ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రైల్వే అధికారులు తమ పొరపాటును గ్రహించారు. ఆ రైలు బోర్డుపై ఉన్న పేరును సరిదిద్దారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు షెడ్యూల్‌ విడుదల

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వివరాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి విడుదల చేసింది. మే 24 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చునని విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా రూ.550 చెల్లించాలని తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.250, బ్రిడ్జి కోర్సు సబ్జెక్ట్‌కు రూ.150 చెల్లించాలని వివరించారు. అదేవిధంగా రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు కూడా ఈ తేదీల్లోనే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీ కౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంటు రాయాలనుకుంటే రూ.1100 చెల్లించాలన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షకు రూ.500, బ్రిడ్జి కోర్సుకు రూ.300 అని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి ఇంప్రూవ్‌మెంటు రాయాలనుకుంటే ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1240, సైన్స్‌ విద్యార్థులు రూ.1440 చెల్లించాలని వివరించారు.

LIC Policy: ఎల్‌ఐసీలో అద్భుతమైన పాలసీ.. రూ.500 పెట్టుబడిలో కోటి రూపాయల బెనిఫిట్

మీరు నెలవారీ పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మంచి రాబడి అందించే పాలసీలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎల్‌ఐసీ మీ కోసం ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంది.
ఇది మంచి రాబడిని కూడా అందిస్తుంది. ఇందులో మీరు డిపాజిట్ చేసిన డబ్బు నుండి మంచి రాబడిని పొందుతారు. ఎల్‌ఐసీ కరోడ్‌పతి లైఫ్ బెనిఫిట్‌లో మీరు 1 కోటి రూపాయల వరకు తిరిగి పొందుతారు. ఈ పాలసీని లక్షాధికారులను చేయడానికి రూపొందించబడింది. కోటి రూపాయల పరిహారాన్ని అందిస్తుంది.

దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్లాన్‌లో మీరు డిపాజిట్ చేయాల్సిన మొత్తం చాలా తక్కువ, ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. ఈ పథకంలో గరిష్టంగా 70 లక్షల వరకు వడ్డీ పొందవచ్చు.

ఈ ప్లాన్‌కు ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి మాట్లాడితే, ఈ పాలసీలో డిపాజిట్ చేయాల్సిన మొత్తం మీరు నెలకు సుమారు 15 వేల రూపాయలు అంటే రోజుకు 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. నెలకు రూ.15,000 డిపాజిట్ చేస్తూ 16 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌ఐసీలో 16 ఏళ్ల పాటు రూ.29 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు కేవలం 30 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి, ఆ తర్వాత మీకు 1 కోటి రూపాయలను రాబడిగా పొందుతారు.

ఎల్‌ఐసీ ఈ పాలసీ 25 సంవత్సరాలు. అయితే 16 ఏళ్లు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అటువంటి పరిస్థితిలో మిగిలిన 9 సంవత్సరాల వాయిదాను ఎల్‌ఐసి స్వయంగా చెల్లిస్తుంది. అంటే 16 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత మీరు 9 సంవత్సరాల పాటు మెచ్యూరిటీ కోసం వేచి ఉండాలి.

ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ మొత్తంతో పాటు, మీ కుటుంబానికి రూ. 40 బీమా, రూ. 80 లక్షల వరకు ప్రమాద రక్షణ లభిస్తుంది. ఏదైనా కారణం వల్ల ఏదైనా సంఘటన జరిగితే మీ కుటుంబానికి రూ. 80 లక్షల ప్రయోజనం లభిస్తుంది. దీనితో మీ బీమా ప్రతి సంవత్సరం పెరుగుతుంది.

RPF Recruitment 2024 : ఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్.. 4,660 సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులు.. ఈ నెల 15నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు!

RPF Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభమై మే 14తో ముగుస్తుంది. రిక్రూట్‌మెంట్ మొత్తం 4,660 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 4,208 కానిస్టేబుళ్లకు మిగిలిన 452 సబ్-ఇన్‌స్పెక్టర్లకు రిజర్వ్ అయింది.

ఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2024 విద్యా అర్హతలు :
సబ్-ఇన్‌స్పెక్టర్లు :అభ్యర్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)చే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
కానిస్టేబుల్స్ : అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సర్టిఫికేట్ నుంచి సమానమైన పరీక్ష అర్హతను కలిగి ఉండాలి.

ఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2024 వయో పరిమితులు :
సబ్-ఇన్‌స్పెక్టర్లు :వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంటుంది.
కానిస్టేబుల్స్ :అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2024 వయో పరిమితులు :
సబ్-ఇన్‌స్పెక్టర్లు :వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంటుంది.
కానిస్టేబుల్స్ :అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ :
ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) : అభ్యర్థులందరూ ఆన్‌లైన్ సీబీటీ పరీక్షకు హాజరుకావచ్చు.
షార్ట్‌లిస్టింగ్ : సీబీటీ పనితీరు ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు. ఎంపిక ప్రతి కేటగిరీలో మెరిట్ ఆధారంగా ఉంటుంది.
ఫిజికల్ టెస్ట్‌లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ : షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు (మాజీ-సర్వీస్‌మెన్ మినహా) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) తీసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.

ఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు రుసుము :
అభ్యర్థులందరికీ (కింద పేర్కొన్న వారికి మినహా): రూ. 500, బ్యాంక్ ఛార్జీలను తొలగించిన తర్వాత సీబీటీలో కనిపించిన తర్వాత రూ. 400 తిరిగి చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, స్త్రీ, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) అభ్యర్థులకు రూ. 250, బ్యాంక్ ఛార్జీలు తొలగించిన తర్వాత సీబీటీలో కనిపించిన తర్వాత రూ. 250 తిరిగి చెల్లించవచ్చు.

పే స్కేల్ :
సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు : ప్రారంభ వేతనం రూ. 35,400
కానిస్టేబుల్ : ప్రారంభ వేతనం రూ. 21,700
దరఖాస్తు చేసే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు వంటి ముఖ్యమైన వివరాలను (rpf.indianrailways.gov.in) వద్ద అధికారిక వెబ్‌సైట్‌లో కనుగొనవచ్చు.

తెలుగు పంచాంగం ,నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (15/04/24)

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏప్రిల్(April) 15వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం…

కర్కాటకంలో చంద్రుడి సంచారం..
రాష్ట్రీయ మితి ఛైత్ర 26, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, సప్తమి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 05, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 15 ఏప్రిల్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 7:36 గంటల నుంచి ఉదయం 9:10 గంటల వరకు. ఈరోజు సప్తమి తిథి మధ్యాహ్నం 12:12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పునర్వసు నక్షత్రం అర్ధరాత్రి 3:15 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధునం నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:26 గంటల నుంచి ఉదయం 5:14 గంటల వరకు
అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 గంటల వరకు
అమృత కాలం : అర్ధరాత్రి 12:14 గంటల నుంచి రాత్రి 12:31 గంటల వరకు
సూర్యోదయం సమయం 15 ఏప్రిల్ 2024 : ఉదయం 6:03 గంటలకు
సూర్యాస్తమయం సమయం 15 ఏప్రిల్ 2024: సాయంత్రం 6:28 గంటలకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహు కాలం : ఉదయం 7:36 గంటల నుంచి ఉదయం 9:10 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 1:49 గంటల నుంచి మధ్యాహ్నం 3:22 గంటల వరకు
యమ గండం : ఉదయం 10:43 గంటల నుంచి మధ్యాహ్నం 12:16 గంటల వరకు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:40 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 3:09 గంటల నుంచి సాయంత్రం 3:59 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు శివ లింగానికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (15/04/24)

మేషం
మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

వృషభం
ధర్మసిద్ధి ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

మిథునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

కర్కాటకం
సమయాన్ని అభివృద్ధికై కేటాయించండి. శ్రమపెరగకుండా ప్రణాళికలను తయారుచేసుకోవాలి. మరపురాని విజయాలు సొంతమవుతాయి. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దుర్గ ధ్యాన శ్లోకం చదవండి.

సింహం
చేపట్టేపనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి . ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

కన్య
మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

తుల
ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణుసహస్రనామం చదవడం లేదా వినడం చేస్తే మంచిది.

వృశ్చికం
మిశ్రమ ఫలితాలున్నాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సౌమ్యంగా ముందుకుసాగాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు
శుభసమయం. వృత్తి, ఉద్యోగాల్లో మేలు చేకూరుతుంది. ముఖ్యవిషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.

కుంభం
చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు వాటిని ప్రారంభించడంలో చిన్నచిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

మీనం
చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

పులివెందుల‌లో ప్రజల నుంచి ష‌ర్మిల‌కు హ్యూజ్ రెస్పాన్స్‌

రోజురోజుకూ ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌వుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడూ మాటల్లో రాటుదేలుతున్నారు. పులివెందుల గ‌డ్డ మీద నిల‌బ‌డి సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె పాల్గొన్న పులివెందుల స‌భ‌కు వ‌చ్చిన హ్యూజ్ రెస్పాన్స్ చూసి వైసీపీ నాయ‌కుల‌కు గుండె ద‌డ పుట్టింద‌నే టాక్ వినిపిస్తోంది. ఎంత‌గా అడ్డుకున్నా, వెళ్లొద్ద‌ని వైసీపీ నాయ‌కులు చెప్పినా లెక్క‌చేయ‌ని ప్ర‌జ‌లు ష‌ర్మిల స‌భ‌కు భారీ ఎత్తున త‌ర‌లిరావ‌డం విశేషం.

వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ పులివెందుల నుంచి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు వైఎస్‌కు కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు జ‌గ‌న్ అడ్డాగా మారింది. అలాంటి చోట నిల‌బ‌డి ష‌ర్మిల ధైర్యంగా చేసిన ప్ర‌సంగం ఆక‌ట్టుకుంది. క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న ష‌ర్మిల‌.. ఈ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పులివెందుల్లో నిల‌బ‌డి జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌న్న బిడ్డ‌గా ఆద‌రించాల‌ని ఆమె ఎమోష‌న‌ల్ స్పీచ్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింద‌నే టాక్ వినిపిస్తోంది. తాను వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలో తిరుగుతుంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డి అవినాష్ రెడ్డిని మార్చాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చార‌ని ష‌ర్మిల అన్నారు. అంటే అవినాషే హంత‌కుడ‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లే క‌దా అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

పులివెందుల బిడ్డ ఒక్క రాజ‌ధాని కూడా క‌ట్ట‌లేక‌పోయారని, ఉద్యోగాలు ఇవ్వ‌కుండా ఇప్పుడు కుంభ‌క‌ర్ణుడిలా నిద్ర‌లేచి డీఎస్సీ అంటున్నార‌ని ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం అంటే వైఎస్ కుటుంబానికి పెట్ట‌ని కోట‌. దీని కార‌ణంగా ఇక్క‌డ గ‌తంలో కాంగ్రెస్ ప‌టిష్ఠంగా ఉండేది. 1978 నుంచి 2009 వ‌ర‌కు కాంగ్రెస్ త‌ర‌పున వైఎస్ కుటుంబ స‌భ్యులు ఇక్క‌డ విజ‌యం సాధించారు. ష‌ర్మిల‌ తండ్రి దివంగ‌త నేత వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి పులివెందుల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2011 ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి విజ‌య‌మ్మ నెగ్గారు. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ విజ‌యం సాధించారు. అలాంటి చోట జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ష‌ర్మిల నిర్వ‌హించిన స‌భ‌కు ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ద‌క్క‌డం విశేషం.

ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో ఇదొక్కటి వేస్తే మీ ఇంట్లోకి ఒక్క చీమ రాదు, దోమ రాదు..

ఇంట్లోకి చీమలు, దోమలు వస్తూనే ఉంటాయి. ఇవి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే అనిపిస్తుంటుంది. అయితే మీరు ఇల్లు తుడిచి నీటిలో ఒకటి కలిపితే మీ ఇంట్లోకి ఒక్క చీమ, దోమ కూడా రాదు.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. చాలా మంది ఆడవారు ప్రతి రోజూ ఇంటిని తుడుస్తూనే ఉంటారు. కానీ చీమలు, దోమలు, ఇతర చిన్న చిన్న పురుగులు రావడం మాత్రం ఆగదు. ఇది చిరాకు తెప్పిస్తుంది. అయితే ఇంటిన తుడిచే నీటిలో కొన్ని వస్తువులను కలిపితే ఇంట్లోకి చీమలు రావు. దోమలు,ఇతర కీటకాలేమీ రావు. ఇందుకోసం ఏం చేయాలంటే?

వెనిగర్

ఇల్లును తుడిచేటప్పుడు నీటిలో కొంచెం వెనిగర్ ను కలపండి. వెనిగర్ నేల తలతల మెరిసేలా చేస్తుంది. అలాగే వాటర్, వెనిగర్ మిశ్రమం కీటకాలు, దోమలు ఇంట్లోకి రాకుండా చేస్తుంది. ఎండాకాలంలో మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే వెనిగర్ ను నీటిలో కలిపి తుడవండి.

ఎసెన్షియల్ ఆయిల్

ఇంటిని తుడిచే నీటిలో మీరు ఎసెన్షియల్ ఆయిల్ ను కలపొచ్చు. అంటే లావెండర్ ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్ ను నీటితో కలిపి తుడిస్తే తీసుకుంటే మీ ఫ్లోర్ చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. అలాగే ఇంట్లోకి కీటకాలు, దోమలు వంటివి వచ్చే సమస్యే ఉండదు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కను వేసి నీళ్లను మరిగించాలి. ఈ వాటర్ తో మీ ఇంటిని మొత్తం క్లీన్ చేయండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల నేలలోని మురికి కూడా శుభ్రపడుతుంది.

పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోడీ కీలక ప్రకటన

వాహన దారులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన చేశారు.
మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అతి త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రకటన చేశారు. 6G టెక్నాలజీ అమలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆటో మొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్ హబ్‌గా భారత్ అవతరించేలా చర్యలు చేపడుతామని అన్నారు. అంతేకాకుండా.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని మోడీ వెల్లడించారు.

‘బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతి రెండింటికీ ప్రాధాన్యం ఉంది. ఏజెన్సీలో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం. సోషల్‌, డిజిటల్‌, ఫిజికల్‌ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేకచోట్ల శాటిలైట్‌ పట్టణాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తున్నాం. దేశంలో మూడు రకాల వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్‌ స్లీపర్‌, వందే భారత్‌ మెట్రో రైళ్లు, బుల్లెట్‌ రైళ్లు’ అని ప్రధాని మోదీ చెప్పారు.

వైసీపీ సమస్యలన్నింటికీ “గులకరాయి” మందు !

జగన్ పై రాయి దాడి అనగానే వైసీపీ రంగంలోకి దిగిపోయింది. తమ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లేనని యాక్షన్ ప్రారంభించింది. అసలేం జరిగిందో తెలిసీతెలియక ముందు… ” చంద్రబాబు ” అంటూ బిగ్గరగా కేకలు వేసుకుంటూ… పెద్దనోరున్న అంబటి లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చేశారు.
అంతా ప్లాన్డ్ గా జరిగిందని అందరూ అనుకుంటున్న సమయంలో వైసీపీ నేతలు మరింత పకడ్బందీగా .. స్క్రిప్ట్ ప్రకారం అన్నట్లుగా రాజకీయాలు ప్రారంభించారు.

జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్పందన లేదన్నది అందరికీ తెలిసిన నిజం. ఆయనకు ఉండే సెక్యూరిటీ.. ఆ నియోజకవర్గంలో పోటీ చేసేఅభ్యర్థి అతి కష్టం మీద తీసుకు వచ్చే ఒకటి,రెండు వందల మంది తప్ప సామాన్య జనం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో బస్సు యాత్రను ఆపలేక.. కొనసాగించలేక తంటాలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. అందుకే గులకరాయి ఎపిసోడ్ బయటకు వచ్చినట్లుగా అనుమానాలు వస్తున్నాయి.
జగన్ పై రాయి దూసుకు వస్తే.. దానికి చంద్రబాబే కారణం అని ఆరోపించి.. సానుభూతి రాజకీయాలు ప్రారంభించగానే అసలేం జరిగిపోయిందో అందరికీ తెలిసిపోతుంది. సొంత పార్టీ కార్యకర్తలు కూడా సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ అయితే బోర్ కొడుతుంది కదా అన్న భావనకు వస్తున్నారు. అయితే ఇంతకు మించిన ఆలోచన … అనుభవం ఉన్న ఘటనలు తమకు చేతకావనుకున్నారేమో రంగంలోకి దిగిపోయారు.

రాయితో తగిలింది అతి చిన్న గాయం. చిన్న బ్యాండేజ్ వేసుకున్నారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి డ్రెస్ వేసుకుని వైద్య పరీక్షలు చేసుకుని ఫోటోలు తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. ఎందుకిదంతా ? ఓ వైపు లేని జనస్పందన.. మరో వైపు షర్మిల, సునీత వేస్తున్న ప్రశ్న… ఎన్నికల బరిలో వెనుకబడిన అన్నింటికీ… పరిష్కారాన్ని గులకరాయితో వెదుక్కున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 50 శాతానికి పెరిగింది. ఇది జనవరి 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ ఏప్రిల్‌ నుంచి చెల్లించనుంది. కానీ, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ పెంపు)తో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరిగాయి. ఈ అలవెన్సుల్లో అతిపెద్ద మార్పు ఇంటి అద్దె అలవెన్స్ (HRA)లో వచ్చింది.కరువు భత్యం 50శాతం దాటడంతో, హెచ్ఆర్ఏ కూడా సవరించింది. ప్రభుత్వం జనవరి 2024 నుండి డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతానికి పెంచింది. డీఏ 50 శాతం దాటిన వెంటనే, హెచ్‌ఆర్‌ఏ కూడా సవరించబడింది. పెరిగిన HRA రేట్లు ఇప్పుడు 30%, 20% మరియు 10%. ఉద్యోగులకు ఏప్రిల్ నుండి దాని ప్రయోజనాలను పొందడం ప్రారంభమవుతుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్- డిఓపిటి ప్రకారం, డియర్‌నెస్ అలవెన్స్ ఆధారంగా కేంద్ర ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ)లో సవరణ జరిగింది. ఉద్యోగులందరూ పెరిగిన హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం పొందుతారు. నగర కేటగిరీ ప్రకారం 30 శాతం, 20 శాతం, 10 శాతం చొప్పున హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు. డీఏతో పాటు ఈ పెంపుదల జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది. 2016లో జారీ చేసిన మెమోరాండంలో ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ డీఏను ఎప్పటికప్పుడు సవరిస్తామని పేర్కొంది.

ఇంటి అద్దె అలవెన్స్‌లో అత్యధిక సవరణ 3శాతం. గరిష్ఠ రేటు 27 శాతం కాగా, దానిని 30 శాతానికి పెంచారు. మెమోరాండం ప్రకారం, డీఏ 50శాతం దాటితే హెచ్‌ఆర్‌ఏను 30శాతం, 20శాతం 10శాతం రివిజన్ చేయడానికి నిబంధన ఉంది. X, Y, Z క్లాస్ సిటీల ప్రకారం ఇంటి అద్దె అలవెన్స్ (HRA) కేటగిరీలు ఉంటాయి. ఎక్స్ కేటగిరీలో ఉన్న కేంద్ర ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది. అదే సమయంలో, వై క్లాస్ ప్రజలకు ఇది 20 శాతంగా మారింది. జెడ్ క్లాస్ వారికి 9 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది.

Kundaleshwara swami: కాశీకన్నా ముందుకు కుండలేశ్వరం ఎందుకు దర్శించాలి? కుండలేశ్వర స్వామి మహత్యం ఏమిటి?

Kundaleshwara swami: కాశీ వెళ్ళడం కంటే ముందు వెళ్లాల్సిన క్షేత్రం ఒకటి ఉంది. దానిపేరు కుండలేశ్వరం. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో అంతటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ఇది.

తూర్పు గోదావరి జిల్లాలో గోదావరీ నదీ తీరాన ఈ క్షేత్రం ఉంది. అక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు. ఆ నదిలో స్నానం చేసి, కుండలేశ్వరస్వామికి అభిషేకం చేయించుకుని ఆ తరువాత కాశీ వెళ్ళాలని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కుండలేశ్వరం ప్రాముఖ్యత

కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు. అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం అందరి వద్దా పాపాలు స్వీకరించి తెల్లని రాజహంసలాంటి గంగా నది సాయంత్రానికి నల్లని కాకిలాగ మారిపోతుంది. అ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం. కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే, వారు తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందట.

కాశీ అయినా, హరిద్వార్‌ అయినా ఎక్కడ గంగా స్నానం చేస్తామో అక్కడకు వెళ్ళే ముందు కుండలేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని (ఈశ్వరుడిని) అర్చించుకుని ఆ తర్వాత ఆయా పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలని చిలకమర్తి తెలిపారు.

కుండలేశ్వరుని కథ కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి రాశాడు. గౌతమీ మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమను గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది.

కుండలేశ్వరం కథ

కాశీఖండలోనూ ఈ కుండలేశ్వరం గూర్చి ప్రస్తావన ఉంది. అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లుగా ఉంది. కోటిపల్లిలో సోమేశ్వరుడుగాక దక్షిణ భాగం నుంచి గౌతమిని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతోంది. ఆ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుడిని వేధించాలని అనుకుంది.

అయితే గోదావరి ఆలోచనలను నదులన్నింటికి నాథుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను కుండలాలనను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమికి ఎదురెళ్ళాడు. గౌతమీనది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నామీద కోపం వద్దు సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు.

గౌతమీనది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని, అక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదానపూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని అని చిలకమర్తి తెలిపారు.

ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాసమహర్షి ఒక వరం ఇచ్చాడు. పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాస మహర్షి కాశీని వదిలిపెట్టి, విశ్వేశ్వరుని దర్శించుకోలేని దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్న తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చాడు. దక్షయజ్ఞం తరువాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవి కుండలం పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించి ఆయన కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందాడు. అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపమైన వరం ఇచ్చాడు.

భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికీ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాల సమయంలో నదీస్నానం చేసినవారు పాపవిముక్తులవుతారు. అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధ గౌతమికి మాత్రం ప్రతిరోజూ పుష్కరాలే అని వ్యాస మహర్షి వరం ఇచ్చాడు. కనుక ఆరోజు ఈరోజు అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం వలన పాప విముక్తి లభిస్తుంది.

కుండలేశ్వరం ఎలా వెళ్ళాలి?

ఆ తరువాత వారు కాశీ హరిద్వార్‌ వంటి గంగాతీరంలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటే గంగానది యొక్క అనుగ్రహం వలన కోరుకునే ఒక కోరిక గంగానది తీరుస్తుందని పురాణ కథనం అని చిలకమర్తి తెలిపారు. ఈ కుండలేశ్వర స్వామి అలయం మురమళ్ళకు దగ్గరలో కాట్రేనికోన మండలంలో ఉంటుంది.

కాకినాడ నుంచి యానాం మీదుగా టాక్సీలో వెళ్ళవచ్చు. బస్సులో కానీ రైలులో కానీ విమానంలో కానీ రాజమండ్రి చేరుకున్న తర్వాత, టాక్సీలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు. లేదా రాజమండ్రి నుంచి బస్సులో అమలాపురం వెళ్ళి అక్కడనుంచి ఆటోలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు. అమలాపురం నుండి కుండలేశ్వరం బస్సు కూడా ఉంటుంది. కుండలేశ్వరం చేరుకుని గోదావరి స్నానం చేసి కుండలం ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు. రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం కూడా శివాలయం ప్రాంగణంలో ఉంది.

Summer Health Care : ఎండాకాలంలో ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది

Summer Health Care Tips : ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో మనం చేసే కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే కొన్ని రకాల టిప్స్ తీసుకోవాలి.
వేసవి మెుదలైంది. ఎండ తీవ్రంగా ఉంది. మండే ఎండలో కాసేపు బయట నడిస్తే, అలసిపోతాం. మార్చిలోనే సూరీడు కోపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఏప్రిల్, మే నెలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. చల్లగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

వడదెబ్బకు గురయ్యే ప్రమాదం వృద్ధులకు, పిల్లలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం సమస్యలు, కొన్ని వ్యాధులకు మందులు తీసుకోవడం, ఎండలో పనిచేయడం వలన కూడా వడదెబ్బ తగులుతుంది.

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?
నీరు ఎక్కువగా తాగండి, మద్యం సేవించవద్దు, శీతల పానీయాలు తాగవద్దు, బయట నీరు తీసుకోకండి. పుష్కలంగా నీరు తాగాలి. పండ్లు తినండి, మంచినీరు తాగండి, చల్లటి నీటితో స్నానం చేయాలి. బయటకు వెళితే సన్‌స్క్రీన్ తీసుకోండి. ఎండలో పని చేయకండి. ఉదయం 10 లోపు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత పని చేయండి.

ఇంటిని చల్లగా ఉంచుకోవాలి. కిటికీకి కర్టెన్ వేసి , హెయిర్ కండీషనర్ లేకుంటే ఇంటిలోపల వెంటిలేషన్ చేయాలి. ఇంట్లో ఓవెన్ లేదా స్టవ్ వాడొద్దు. బయట ప్లాన్ చేయండి. రాత్రిపూట వాడితే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. పిల్లలకు ఎక్కువగా నీళ్లు తాగించండి, జ్యూస్ ఇవ్వండి.

శరీరంలో నిర్జలీకరణకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మైకం, అలసట, దాహం, పసుపు రంగు మూత్రం వస్తుంది. ఆకలి లేకపోవడం కూడా జరుగుతుంది. పుష్కలంగా నీరు తాగండి. టీ తాగవద్దు, మద్యం తాగవద్దు, స్ప్రే బాటిల్‌లో నీరు నింపి ముఖం, మెడపై స్ప్రే చేయండి.
హీట్‌ స్ట్రోక్‌తో సమస్యలు
వేసవిలో ఆరుబయట క్రికెట్, ఇతర ఆటలు ఆడుతున్నప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని నివారణకు సరిపడా నీళ్లు తాగాలి. ఎండ వేడికి హీట్ స్ట్రోక్ గురవుతారు. పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో అధిక దాహం వేస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. వాంతులు, మైకం, వింత ప్రవర్తన, మూర్ఛవంటివి వస్తాయి.

ఈ చిట్కాలు పాటించాలి
వేసవిలో ఒక వ్యక్తి మైకం ఉంటే కొన్ని చిట్కాలు పాటించాలి. చల్లటి ప్రదేశంలో కూర్చోబెట్టి, వారికి స్పృహలో ఉంటే నీరు ఇవ్వండి. తర్వాత ముఖంపై కొంచెం నీరు వేయాలి. తల, చంకలు, కాళ్ళను నీటిలో ముంచి, నీటి గుడ్డను ఉంచండి. ఈ సమయంలో పారాసెటమాల్ లేదా ఆస్పిరిన్ ఇవ్వవద్దు. ఎండాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మజ్జిగ తీసుకోండి. మంచినీళ్లు తాగండి. పండ్లు ఎక్కువగా తినండి. ఉప్పు ఎక్కువగా తినకండి. కాటన్ బట్టలు వేసుకోండి. ఎండలో నడిచేటప్పుడు గొడుగు పట్టుకెళ్లాలి.

ఎండాకాలం ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే శరీరం బాగుంటుంది. డీహైడ్రేషన్‌కు గురైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. అందుకే వేసవిలో నీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి.

Chanakya Niti in Telugu చాణక్యుని ఈ సూత్రాలను ఫాలో అయితే ఏ రంగంలో అయినా యువత ఈజీగా సక్సెస్ అవుతారు…!

Chanakya Niti in Telugu ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక విషయాలను వివరించారు. తన విధానాలను అనుసరించడం ద్వారా మనం ఏ సమస్య నుంచి అయినా సులభంగా బయటపడొచ్చు. అంతేకాకుండా ఆచార్య చాణక్యుడు యూత్ గురించి, విద్యార్థుల గురించి కూడా సవివరంగా వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. ఈ దశలో విద్యార్థులు, యువత చాలా సీరియస్ గా ఉండాలి. ఈ సమయంలో నిర్లక్ష్యం, చెడు సహవాసం, సోమరితనం వల్ల అత్యంత నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక్కడ తప్పు చేయడం వల్ల మొత్తం జీవితంపై ప్రభావం పడుతుంది. అందుకే విద్యార్థులు, యువత తమ విద్య, జీవితం పట్ల అంకితభావంతో ఉండాలి. ఇదిలా ఉండగా.. చాణక్యుని విధానాలను అనుసరించడం వల్ల విద్యార్థులు, యువత తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యూత్ సక్సెస్ కావాలంటే చాణక్యుడు చెప్పిన ఈ విధానాలను కచ్చితంగా పాటించాలి.

చాణక్య నీతి ప్రకారం, ఎవరైతే తమ జీవితంలో సక్సెస్ కావాలనుకుంటారో.. వారందరూ తమ పనులను సకాలంలో పూర్తి చేయాలి. అంటే ఏ పని మొదలుపెట్టినా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. ముఖ్యంగా యువత, విద్యార్థులు సమయానికి ప్రతి పనిని పూర్తి చేయాలి.

విద్యార్థి దశలో ఉండే ప్రతి ఒక్కరూ చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా, సోమరితనంగా ఉండకూడదు. విద్యార్థులు, యువత ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వారు విజయం సాధించేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అలాంటి విద్యార్థులు, యువత సులభంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.

చెడు సహవాసాలను నివారించాలి..
చాణక్య నీతి ప్రకారం, విద్యార్థులు, యువత ఎప్పటికీ తప్పుడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి అలవాట్లు మిమ్మల్ని నాశనం చేస్తుంది. యువతగా ఉన్న సమయంలో స్నేహితులతో సహవాసం చేయడం వల్ల మీ జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థులు, యువత మంచి వ్యక్తులతో, నిజాయితీగా ఉండే వ్యక్తులతోనే స్నేహం చేయాలి.

చెడు విషయాలకు బానిస కావొద్దు..
ఆచార్య చాణక్యుని ప్రకారం, విద్యార్థులు, యువత డ్రగ్స్ తదితర వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే చెడు అలవాట్లు విజయానికి ఆటంకం కలిగిస్తాయి. అదే సమయంలో ఇది శరీరం, మనసు, సంపదను నాశనం చేస్తుంది. అంతేకాకుండా మీకు గౌరవం కూడా తగ్గిపోవడమే కాదు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సోమరితనాన్ని వదులుకోవాలి..
విద్యార్థులు, యువతకు సోమరితనమే పెద్ద శత్రువు అని చాణక్య నీతి శాస్త్రం వివరిస్తోంది. కాబట్టి మీరు సోమరితనాన్ని వదిలేయాలి. ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాలి.

Chanakya Neeti: చాణక్య నీతి: శత్రువు వద్ద విజయం సాధించాలంటే ఇవి పాటించాలి..

Chanakya Neeti: చాణక్యుడు ఎన్నో విషయాల గురించి ప్రజలకు వివరించారు. ఆయన చెప్పిన ధర్మసందేహాలను తూ.చ తప్పకుండా పాటిస్తే మెరుగైన జీవితం పొందుతారు. ఇప్పటికీ ఈయన నియమాలను, మార్గ దర్శకాలను పాటించేవారు ఉన్నారు. అయితే శత్రువులు అందరికీ ఉంటారు. చిన్న పిల్లలను ఈ ప్రశ్న అడిగినా కొందరి పేరు చెబుతుంటారు. అయితే శుత్రువుల విషయంలో కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దీని వల్ల విజయం మీకే సొంతం అవుతుంది. ఇంతకీ ఏ విషయాలను మర్చిపోకూడదో చూడండి.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త వహించకపోతే చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. విపత్తు లేదా ఇబ్బంది వచ్చినప్పుడు భయపడకుండా ఎదురు వెళ్లండి. కష్టాలు వచ్చినప్పుడు సహనం కోల్పోతే.. శత్రువు చేతిలో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సహనం ముఖ్యం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మంచి ఆరోగ్యం ఉంటే ఎంతటి సమస్యను అయినా ఇట్టే పరిష్కరించుకోవచ్చు. అందుకే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటారు చాణక్యుడు.

ఆరోగ్యంగా ఉంటే శక్తియుక్తులు పెంపొందుతాయి. శత్రువును ఓడించడంలో మీ ఆరోగ్యమే ముఖ్య పాత్ర పోషిస్తుంది. అహంకారానికి కూడా దూరంగా ఉండాలి అంటారు చాణక్యుడు. అహంకారం శత్రువుకు ప్రయోజనం చేకూరేలా చేస్తుంది. అహంకారం ఉంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది శత్రువుకు అవకాశంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సత్యం వైపు అడుగులు వేసే మనిషి నీతినియమాలు అనుసరిస్తాడు. క్రమశిక్షణతో ఉంటాడు. ఇలాంటి వారికి శత్రువులు భయపడుతారు.

సత్యాన్ని పాటిస్తూ లక్ష్యాన్ని వదలకపోతే మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. దీనికోసం కొంత సమయం పట్టవచ్చు. కానీ సత్యమే చివరికి విజయం సాధిస్తుంది. ఈ విషయం ఎప్పటికీ మరిచిపోకండి. శత్రువు మీ కదలికలను, కార్యాచరణను గమనిస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు మీ అజాగ్రత్త ఆయనకు ప్లస్ అవుతుంది. సో జాగ్రత్త. నమ్మకమైన వ్యక్తులు మీ చుట్టూ ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అన్నారు చాణక్యుడ. ఈయన చెప్పిన విషయాలు పాటిస్తే శత్రువు పట్ల విజయం మీదే అవుతుంది.

Salman Khan: ఇది ట్రైలర్ మాత్రమే.. సల్మాన్‌ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది మేమే.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటన

ముంబైలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ నివాసంపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించుకుంది లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌. లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అనుమోల్‌ బిష్ణోయ్‌ కాల్పులు జరిపింది తామేనని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది ట్రైలర్‌ మాత్రమే అని పిక్చర్‌ ముందుందని సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశాడు. ఈ సారి ఇంటిపై కాల్పులు జరపమని.. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ లేఖలో పేర్కొన్నారు. సల్మాన్‌ నివాసంపై ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్‌ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు ఈ ఘటన జరిగింది. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్‌ నిపుణులు.

గత ఏడాది మార్చిలో సల్మాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్‌ వచ్చాయి. . దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరు టార్గెట్‌ చేసిన జాబితాలో సల్మాన్‌ పేరున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఆరోపించాడు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 2023 ఏప్రిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ‘ఎక్స్‌’ గ్రేడ్‌ భద్రతను ‘Y+’గా అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు నిత్యం భద్రతగా ఉంటున్నారు.

ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Health

సినిమా