Google: గూగుల్ తల్లిని నమ్ముకున్న రైల్వే.. ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’గా మారిన రైలు.. ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి..

గూగుల్‌… ఇప్పుడు ఇదే చాలా మందికి దిశ నిర్దేశంగా మారింది. ఏ పని చేయాలన్న ప్రజలు గూగుల్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. గూగుల్‌ని నమ్ముకుని ప్రయాణం చేసిన వారు నిలువునా మునిగిపోయిన వార్తలు మనం అనేకం చూశాం. చాలా సార్లు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా బయల్దేరిన వాహనదారులు ఏకంగా నదులు, అడవులు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లిన సంఘటనలు సోషల్ మీడియాలో అనేకం చూశాం. అయితే, ఇప్పుడు గూగుల్ ట్రాప్‌లో పడ్డ ఇండియన్‌ రైల్వే కూడా ప్రజల విమర్శలకు కారణంగా మారింది. గూగుల్ సహాయంతో చేసిన అనువాదం కొన్నిసార్లు అర్థాన్ని వక్రీకరించేలా చేస్తుంది. అలాంటి ఒక అనువాదం రైల్వే చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

గూగుల్‌ ట్రాన్స్‌ లేషన్‌ను నమ్ముకున్న భారతీయ రైల్వే ఇటీవల ఒక రైలుకు పేరు పెట్టింది. అది శరవేగంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దూసుకెళ్లింది. దాంతో ఇండియన్‌ రైల్వేపై నెటిజన్లు ఫన్నీగా ప్రశంసించటం మొదలుపెట్టారు. దీనిపై ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించింది. తన తప్పును అంగీకరించింది. జరిగిన తప్పిదానికి చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ఇంతకీ రైల్వే చేసిన ఆ తప్పేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గూగుల్‌ ట్రాన్స్‌లేషన్ ఆధారంగా భారతీయ రైల్వే ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేసింది.. దీంతో ఆ రైలు పేరు మారిపోయింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని హటియా, కేరళలోని ఎర్నాకుళం నగరాల మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తున్నది. అయితే హిందీ పదమైన ‘హటియా’ను మలయాళంలో అనువాదించడంలో తప్పు జరిగింది. హతియా(హంతకుడి)గా భావించి ఆ అర్థం వచ్చేలా ‘కోలపథకం’ అని మలయాళంలో రాశారు. దీంతో హటియా-ఎర్నాకుళం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు కాస్తా ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’గా మారిపోయింది. ఇంకేం కొందరు స్థానికులు దీన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ చేశారు.. ఇలా రైల్వే శాఖ చేసిన తప్పిందంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రైలుకు సంబంధించిన నేమ్‌ బోర్డు ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రైల్వే అధికారులు తమ పొరపాటును గ్రహించారు. ఆ రైలు బోర్డుపై ఉన్న పేరును సరిదిద్దారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *