Thursday, September 19, 2024

Cloves : రోజుకు ఒక్క లవంగం.. ఇదొక అద్భుతం.. దీంట్లోని పవర్ తెలిస్తే విడిచిపెట్టరు..!

Cloves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి లవంగాలను ఉపయోగిస్తున్నారు. వీటిని తరచూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి.
ఎక్కువగా మాంసాహార, మసాలా వంటకాల్లో లవంగాలను వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం లవంగాల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల లవంగాలను తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు.

Cloves
లవంగాలను రోజూ రాత్రి భోజనం చేశాక తినాలి. రాత్రి భోజనం అనంతరం ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. లవంగాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్ తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగాలను రోజూ ఒక్కటి చొప్పున తిన్నా చాలు. షుగర్ లెవల్స్ దెబ్బకు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి.

లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు రోజూ ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకుని చాలా సేపు చప్పరించి ఆ తరువాత నమిలి మింగాలి. దీంతో నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని తింటే క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. అలాగే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఇలా రోజుకు ఒక్క లవంగాన్ని తిన్నా చాలు.. అనేక లాభాలను పొందవచ్చు.

Jackfruit Health Benefits: పనస పండు తిన్న తర్వాత మరిచిపోయి కూడా వీటిని తినకండి.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు..

వేసవిలో మనకు విరివిగా దొరికే పండ్లలో పనసపండు(Jackfruit) ఒకటి. ఇందులో విటమిన్- ఎ, సి, బి6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, పైబర్ ను సమృద్దిగా ఉంటాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. దీని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి. ఇవి తియ్యగా తినడానికి రుచిగా ఉంటాయి. ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం మేలు చేస్తుంది. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పండు కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

పనసపండు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జాక్‌ఫ్రూట్ తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం , లాక్టిక్ యాసిడ్ పెరుగుతుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని అనేక పరిశోధనలలో వెల్లడైంది. ఐరన్‌తో కూడిన పనస పండు రక్తహీనత నుంచి రక్షిస్తుంది. జాక్‌ఫ్రూట్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్ బితో సమృద్ధిగా ఉన్న జాక్‌ఫ్రూట్ షుగర్ రోగులలో ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది. షుగర్ పేషెంట్లు యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్న జాక్‌ఫ్రూట్‌ను తీసుకుంటే.. వారి మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం..

పాలు తాకండి: జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత పాలు తాగకండి. అంతే కాదు, పాలు తాగిన తర్వాత కూడా జాక్‌ఫ్రూట్ తినకూడదు. అలా చేస్తే ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. మీరు ఇలా చేస్తే రింగ్‌వార్మ్, గజ్జి, దురద, తామర, సోరియాసిస్ సమస్యలు వచ్చే అకాశం ఉంది

తేనెను తీసుకోవద్దు: మీరు జాక్‌ఫ్రూట్‌తో తేనెను తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. పనస పండు తిన్న తర్వాత తేనె తీసుకుంటే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.

బొప్పాయిని కూడా తినకండి: జాక్‌ఫ్రూట్ తో చేసిన వంటలు కాని, పనస పండు కాని తిన్న తర్వాత బొప్పాయిని ఎప్పుడూ తినకూడదు.

పనస పండు తిన్న తర్వాత పాన్‌ను అస్సులు తినవద్దు: చాలా మందికి భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అలవాటు. అయితే పనస పండు తిన్న తర్వాత మాత్రం మరిచి పోయి కూడా తమలపాకు(కిల్లీ) తనవద్దు. పనస పండు తిన్న తర్వాత తమలపాకులు తింటే శరీరంలో అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

జాక్‌ఫ్రూట్‌తో బెండకాయను తినవద్దు: మీరు పనసపండు, బెండకాయలను తింటుంటే మంచిది. అలా చేయకండి ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో చర్మ సమస్యలు, శరీరంలో తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్

అంగన్వాడీలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలునిచ్చాయి. ఈ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవిద్రనాధ్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి.ప్రసాద్, టీఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు, ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్ తదితరులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో .. “ఒక లక్షా ఐదువేల మంది అంగన్వాడీ మహిళ శ్రామికుల జీతభత్యాలు, పనిభారలు తదితర సమస్యలపై సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సమ్మె జరుగుతున్నది. వారి డిమాండ్లకు మద్దతుగా ప్రజలనుండి సేకరించిన కోటి సంతకాలను జగనన్నకి సమర్పించడానికి విజయవాడ వస్తున్న అంగన్వాడీలపై పాశవికంగా పోలీసులతో దాడి చేయించారు.
అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత నిరంకుశమైనది. పైగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న దీక్షా శిబిరంపై ఈరోజు అనగా 42వరోజు తెల్లవారుజామున 3 గంటలకు నిరాహారదీక్ష శిబీరాన్ని కూల్చాయి. దీక్షలు చేస్తున్న నాయకులను దూరప్రాంతాలకు తరలించి నిర్బందించారు. వారి ఆరోగ్యాన్నికూడా పట్టించుకోలేదు.

కరెంటు తీసివేసి ఆడవాళ్ళను కూడా మగ పోలీసులే అరెస్టులు నిర్వహించి అరగంట పాటు యుద్ధభూమిని తలపించారు. దీక్షలకు మద్దతుగా పాల్గొన్న సుమారు 2 వేల మంది అరెస్టుచేసి మచిలీపట్నం, నూజివీడు తదితర సుదూర ప్రాంతాలకు తరలించారు. లక్ష మందికి పైగా అంగన్వాడీలు చాలిచాలని జీతాలతో జీవిస్తున్న మహిళా కార్మికులపట్ల రాష్ట్ర ప్రభుత్వ పాశవిక విధానానికి వ్యతిరేకంగా, బాధిత అంగన్వాడిలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి. 24-01-2024 న రాష్ట్ర బంద్ జయప్రదం చేయడం ద్వారా నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వం పట్ల తగిన ప్రతిఘటనను ప్రదర్శించాల్సి ఉందని మేము భావిస్తున్నాము. ఈ పిలుపును రాష్ట్ర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, వివిద వర్గాల ప్రజలు బలపరచవలసిందిగా కోరుతున్నాము” అని పేర్కొన్నారు.

Ram Jyoti: ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి?

అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాగే దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ నీరీక్షణ సాకారం అయ్యింది. ఎన్నో దశాబ్దాలు పోరాటం వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అయ్యింది. ఈ అద్భుత క్షణాల కోసం ఎంతో మంది రామ భక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూశారు.

కాగా ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో రామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. మరి ఇంతకీ ఈ రామ జ్యోతిని ఎలా వెలిగించాలి? ఏ సమయానికి వెలిగించాలి? అనే డౌట్లు వచ్చే ఉంటాయి. ప్రాణ ప్రతిష్ఠ రోజున అంటే సోమవారం సాయత్రం రామ జ్యోతిని వెలిగిస్తారు. మీరు కూడా రామ జ్యోతి వెలిగించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు నెయ్యి దీపాన్ని వెలిగించడం మంచిది.

ఎన్ని వెలిగించాలి?

ఎవరి నమ్మకాన్ని బట్టి.. ఒక దీపం అయినా వెలిగించవచ్చు. లేదా ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. ఇది మీ కుటుంబం మొత్తానికి శ్రీరాముడి అనుగ్రహాన్ని తీసుకు వస్తుందని, జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుందని నమ్ముతారు.

దీపాన్ని ఎక్కడ ఉంచాలి?

అదే విధంగా ఈ దీపాలను ఎక్కడ పెట్టాలి అనే సందేహం కూడా చాలా మందికి నెలకొంది. రామ జ్యోతి దీపాలను ఇంటి ముందు లేదా తులసి మొక్క దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఈ ఐదు దీపాలను తయారు చేసి వంటగదిలో ఒకటి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు, ఆవరణలో ఒకటి, తులసి మొక్క దగ్గర ఒకటి ఇలా ఎక్కడైనా పెట్టవచ్చు.

ఏ సమయానికి వెలిగించాలి?

రామ జ్యోతి దీపాన్ని ఏ సమయానికి వెలిగించాలి? అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. ఈ రామ జ్యోతి దీపాన్ని సాయంత్రం ఐదు గంటలు లేదా 6 గంటల సమయంలో వెలిగించుకోవచ్చు.

బాల రాముడి ఆగమనం సందర్భంగా ఇంట్లో ఇలా చేయడం వల్ల.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. వీలైనంత వరకు పేదలకు పండ్లు, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

 AP state Final Voters Lists 2024 DOWNLOAD

AP state Final Voters Lists 2024 DOWNLOAD
The final list of AP voters for the upcoming general elections has been released. The Election Commission released the final list of voters on Monday. EC has published the final voter list named Final SSR 2024 on CEOAndhra.NIC.in website. The Election Commission has published the assembly constituencies wise. Constituency wise pdf files have been uploaded by EC.

It is known that the draft list released on October 27 last year has been criticized a lot. Votes with zero door number and duplicate votes received huge complaints. Keeping this in mind, more precautions have been taken in the final voter list, said the Chief Electoral Officer of the state. There is concern that what kind of action will be taken against the officials if there are mistakes in the final list as well. It is known that EC is serious about downloading voter identity cards and creating fake cards in Tirupati by-election. In this regard, the government has already issued orders suspending one IAS officer and some other officers. In this order, the employees who are preparing the list are expressing concern that if there are any mistakes in the list in the final water, what kind of action will be taken against them.

AP state Final Voters Lists 2024 DOWNLOAD    New Lists

 

AP Voters List 2024 DOWNLOAD LINKS 

 VERIFY WITH YOUR PHONE NUMBER

AP VOTERS LIST 2024 DOWNLOAD 

Link to Search your Name in Voter List Click Here

Download PDF Electoral Rolls Click Here

AP Government: అంగన్వాడీలకు షాక్‌.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..!

AP Government: అంగన్వాడీల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.. ఓ వైపు సుదీర్ఘంగా సమ్మె చేయడంతో పాటు.. ఈ రోజు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో…
వారిపై చర్యలకు సిద్ధం అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ ఆర్డర్స్‌ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు. అందులో భాగంగా విశాఖ జిల్లాలోని అంగన్వాడీలకు షాక్‌ ఇచ్చారు కలెక్టర్‌.. ఎస్మా ఉల్లంఘనకు పాల్పడ్డ సిబ్బంది తొలగింపుకు చర్యలు ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే టెర్మినేషన్ లెటర్స్ ఇళ్లకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ప్రభుత్వం హెచ్చరికలతో విధుల్లో చేరారు 69 మంది వర్కర్లు, 42మంది ఆయాలు.. అయితే, జిల్లాలో మొత్తం అంగన్వాడీలు 752 మంది, ఆయాలు 698 మంది ఉన్నారు. వీరిని వెంటనే తొలగించేందుకు సిద్ధం అవుతోంది సర్కార్.. మరోవైపు.. కొత్త అంగన్వాడీల భర్తీకి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్నారు.
మరోవైపు. పార్వతీపురం మన్యం జిల్లాలో విధులకు హాజరుకాని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచిచూశాం.. నేడు తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.. అంతేకాకుండా నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ విధులకు హాజరు కాని కార్యకర్తలు 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని.. జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, సాధికారిత అధికారి ఎం ఎన్ రాణి తెలిపారు. ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక, విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కూడా అంగన్వాడీ కార్యకర్తలకు నేటి నుంచి విధుల నుంచి తొలగిస్తున్న ఉత్తర్వులు జారీ చేశారు.. విజయనగరం జిల్లా పరిధిలో 4151 అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాల్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొంటున్నారు.. నిబంధనల ప్రకారం వారికి నోటీసులు జారీ చేశాం.. అయితే, ఇవాళ్టి వరకు జిల్లాలో 503 మంది విధుల్లో చేశారు.. సోమవారం ఉదయం 9:30 గంటల వరకు కూడా తిరిగి విధులకు హాజరు కావడానికి అవకాశం కల్పించడం జరిగింది.. అలాంటి వారు మినహా ఇంకా విధుల్లో చేరని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి.

Cracked Heels : పాదాల పగుళ్లను శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన చిట్కా..

Cracked Heels : పాదాల పగుళ్లు.. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. పాదాలు పగుళ్లకు గురి అయ్యి నొప్పిని కలిగిస్తాయి.
దీంతో మనం ఒక్కోసారి నడవలేకపోతుంటాం. ఈ బాధ పాదాళ్ల పగుళ్లతో బాధపడే వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ పాదాల పగుళ్లను నిర్లక్ష్యం చేసే సమస్య మరింత తీవ్రమయ్యి పగుళ్ల నుండి రక్తం కారడం వంటివి జరుగుతుంటాయి. పాదాల పగుళ్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తగినంత నీటిని తీసుకోకపోవడం, శరీరంలో అతి వేడి వంటి వాటిని పాదాల పగుళ్లు రావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.
పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, పాదాలపై దుమ్ము, ధూళి అధికంగా చేరడం వంటి వాటి వల్ల పాదాల పగుళ్లు ఏర్పడతాయి. ఈ సమస్య చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. పాదాల పగుళ్లతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కొవ్వొతిని, కొబ్బరి నూనెను, విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కొవ్వొత్తిని తురుముగా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కొవ్వొతి తురుమును తీసుకోవాలి. తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను వేయాలి.ఇప్పుడు ఈ గిన్నెను ఒక వేడి నీటిలో ఉంచి కొవ్వొతి కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత ఈ మిశ్రమంలో 2 విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి కలుపుకోవాలి. కాళ్ల పగుళ్ల వల్ల అడుగు తీసి అడుగు వేయలేని వారు రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పగుళ్ల మీద రాసి పడుకోవాలి.

ఉదయాన్నే నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాల పాటు చేయడం వల్ల పాదాల పగుళ్లు నయం అవుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే పాదాలకు శుభ్రం ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే తగినంత నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో రాకండా ఉంటాయి. పాదాలు అందంగా మారతాయి.

Heart Attack: ఇలా స్నానం చేస్తున్నారా.. అయితే గుండెపోటు రావడం ఖాయం?

ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండెపాటు కారణంగా మరణిస్తున్నారు. గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేకాకుండా ప్రతి వంద మందిలో దాదాపు 20 మంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు.
చిన్న వయసు వారు కూడా ఈ హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు. హార్ట్ ఎటాక్ అసలు కారణాలు మారుతున్న జీవన శైలి, ఒత్తిడి అలాగే పోషకాలు లేని ఆహారపు అలవాట్లు. అంతేకాకుండా స్నానం చేసే పద్దతి సరిగ్గా లేకున్నా గుండె పోటు ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నానం చేసేటప్పుడు పక్షవాతం గుండెపోటు రావడానికి గల ప్రధాన కారణం సరైన పద్ధతిలో స్నానం చేయకపోవడం.

ముఖ్యంగా గుండె జబ్బులు అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు స్నానంని సరైన పద్ధతిలో చేయాలి. సాధారణంగా చల్లని నీళ్లతో స్నానం చేసినప్పుడు మాత్రమే గుండెపోటు సమస్య వస్తూ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు నేరుగా తలపై నీటిని పోయడం వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. స్నానం చేయడానికి సరైన మార్గం ఏమిటంటే మొదట కాళ్లపై, ఆ తర్వాత నడుము, మెడ, చివరగా తలపై నీళ్లను పోయాలి. చల్లని నీళ్లను నేరుగా తలపై పోయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ముఖ్యంగా నీరు మరీ చల్లగా ఉంటే.. అది కేశనాళిక సిరలు కుంచించుకుపోయేలా చేస్తుంది.

అలాగే రక్తపోటు కూడా ఉన్నట్టుండి బాగా పెరుగుతుంది. రక్త ప్రసరణ తల నుండి కాలి వరకు జరుగుతుంది. తలపై చల్లని నీరు పడిన వెంటనే రక్త నాళాలు సంకోచించబడతాయి. దీంతో రక్త ప్రసరణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది స్ట్రోక్ మరియు హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే రక్తం గుండెకు సరిగ్గా చేరదు. కాబట్టి స్నానం చేయడానికి మగ్గును ఉపయోగించి.ముందుగా మీ పాదాలపై నీటిని పోయగా అది నీటి ఉష్ణోగ్రత గురించి శరీరానికి తెలిసేలా చేస్తుంది. నెమ్మదిగా పాదాల తరువాత నీటిని పైకి పోయాలి. చివరగా, మీ తలపై నీటిని పోయండి. ఇది మెదడుకు షాక్ ఇవ్వదు. రక్త ప్రసరణ సాధారణంగా ఉంటుంది.

Albakara Fruit : ఈ పండ్లు ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. అసలు విడిచిపెట్టొద్దు..

Albakara Fruit : మనకు తినేందుకు అందుబాటులో అనేక రకాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో ఆల్బుకరా పండ్లు ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

కొన్ని రకాల ఆల్బుకరా పండ్లు ఊదా రంగులో కూడా ఉంటాయి. అయితే ఎరుపు రంగులో ఉండే పండ్లే మనకు ఎక్కువగా లభిస్తాయి. వీటిని దాదాపుగా అన్ని సీజన్లలోనూ విక్రయిస్తుంటారు. మనకు ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. ఆల్బుకరా పండ్లను జామ్‌లను తయారు చేసేందుకు కూడా ఉపయోగిస్తారు. వీటిలో సుమారుగా 2000కు పైగా వెరైటీలు ఉన్నాయి. ఆల్బుకరా పండ్లను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ఆల్బుకరా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.

ఆల్బుకరా పండ్లలో క్రోమియం, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ తోపాటు విటమిన్ సి, బీటా కెరోటీన్ కూడా అధిక మొత్తాల్లో ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ ఎ, ఫోలేట్‌, విటమిన్ కె, విటమిన్ బి1, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, కాల్షియం, ఫ్లోరైడ్‌, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ ఉన్నవారికి ఈ పండ్లు ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. ఈ పండ్లను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. సన్నగా, నాజూగ్గా మారుతారు. ఆల్బుకరా పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీని వల్ల మలబద్దకం అన్నది ఉండదు. రోజూ ఉదయాన్నే సాఫీగా విరేచనం అవుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. పనితీరు మెరుగు పడుతుంది.

ఈ పండ్లలో విటమిన్ సి, బీటా కెరోటీన్ అధికంగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఉండే కెరోటినాయిడ్లు, లుటీన్‌, జియాజంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి పొరలను రక్షిస్తాయి. దీంతో కళ్లలో శుక్లాలు రావు. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంప్యూటర్ల ఎదుట కూర్చుని గంటల తరబడి పని చేసే వారు ఆల్బుకరా పండ్లను తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. ఈ పండ్లు గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి. రక్తనాళాల్లో రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తాయి. దీంతో కార్డియాక్ అరెస్ట్‌, స్ట్రోక్‌, హార్ట్ ఎటాక్ వంటివి రావు. గుండె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.

ఆల్బుకరా పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు, వాపులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ పండ్లను తింటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ కె, పొటాషియం శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహించేలా చేస్తాయి. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం అవుతాయి. డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు ఆల్బుకరా పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. అలాగే కణాలు, కణజాలం సురక్షితంగా ఉంటాయి.

ఆల్బుకరా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే హాని నుంచి మనల్ని రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఆల్బుకరా పండ్లలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారి మెరిసేలా చేస్తాయి. అలాగే చర్మంపై ఉండే గీతలు, మచ్చలు, మొటిమలు, ముడతలు ఉండవు. కనుక ఇన్ని లాభాలు ఉన్న ఆల్బుకరా పండ్లను తినడం మరిచిపోకండి. ఇవి ఎక్కడ కనిపించినా సరే వెంటనే కొని తెచ్చి తినండి. పైన చెప్పిన లాభాలు అన్నీ కలుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

తరచూ కళ్లు తిరుగుతున్నాయా? అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయేమో?

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, తగ్గినా కూడా అంతే ప్రమాదం. ఎవరైనా కళ్లు తిరిగి పడిపోయినప్పుడు ఎక్కువ మంది చూసేది రక్తపోటు. రక్తపోటు తగ్గిందేమో, లేక అధికంగా పెరిగిందేమో అనుకుంటారు.
రక్తంలో చక్కెర స్థాయిలను పట్టించుకోరు. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం కచ్చితంగా తరచూ కళ్లు తిరుగుతున్నా, కింద పడిపోతున్నట్టు అనిపిస్తున్నా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చెక్ చేసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు ఏమవుతుంది?

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడాన్ని ‘తక్కువ బ్లడ్ షుగర్ లేదా హైపోగ్లైసీమియా’ అంటారు. ఇది ప్రధానంగా మధుమేహం ఉన్నవారిలోనే కనిపిస్తుంది. డయాబెటిస్ లేని వారిలో ఈ సమస్య కలగడం చాలా అరుదు. దీనికి సకాలంలో చికిత్స అందకపోతే రక్తంలో చక్కెర శాతం ఇంకా తగ్గి మరణం సంభవిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు అందుకే తమ దగ్గర కచ్చితంగా ఓ తీపి పదార్థం ఉంచుకోవాలని చెబుతారు. ఎప్పుడైనా కళ్లు మసకగా మారి, తిరుగుతున్నట్టు అయితే చిన్న చాక్లెట్ ముక్క తినమని చెబుతారు.

తగ్గడానికి కారణాలు ఏమిటి?

డయాబెటిస్ ఉన్న వారిలో హఠాత్తుగా రక్తంలో అకస్మాత్తుగా చక్కెర స్థాయిలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి.

1. భోజనం తినకుండా ఎక్కువ కాలం పాటూ ఖాళీ పొట్టతో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అల్పాహారం దాటవేయడం, మధ్యాహ్నం భోజనం దాటవేయడం వంటివి చేయకూడదు.

2. ఇన్సులిన్ అధికంగా తీసుకున్నా లేక హెపటైటిస్ సి వ్యాధి కోసం వాడే యాంటీ వైరల్ మందుల వల్ల కూడా ఇలా జరగవచ్చు.

3.బంగాళాదుంపలు, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి.

4. వ్యాయామాలు చేయడం మంచిదే, కానీ తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి.

5. ఆల్కహాల్ అతిగా తాగడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

6. కిడ్నీ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా జరుగుతుంది.

7. తగినంత నీరు తాగకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి.

8. క్షయ, క్యాన్సర్, కాలేయ సమస్యలు ఉన్న వారిలో కూడా జరుగుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.

1. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గగానే ఒళ్లంతా అకారణంగా చెమటలు పడతాయి.
2. తీవ్ర అలసటగా అనిపిస్తుంది, తల తిరుగుతుంది. వికారంగా అనిపిస్తుంది.
3. విపరీతమైన ఆకలి వేస్తుంది. పెదవుల్లో వణుకు కనిపిస్తుంది.
4. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
5. ఏడుపు త్వరగా వచ్చేస్తుంది. ఆత్రుత పెరుగుతుంది.
6. చర్మం రంగు మారుతుంది.
7. చూపు మసకబారుతుంది.
8. మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది.

వెంటనే ఏం చేయాలి?
పై లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని అర్థం. వెంటనే గ్లాసుడు పండ్ల రసం తాగాలి.లేదా చాక్కెట్ తినాలి. బిస్కెట్లు, పాలు వంటివి వెంటనే తిన్నా ఫర్వలేదు. ఎదురుగా కూల్ డ్రింక్ కనిపిస్తే సగం తాగేయండి. వెంటనే అంతా సరి అయిపోతుంది.

ఇవి తింటే త్వరగా ముసలోళ్ళు అయిపోతారు.. ఆ ఆహార పదార్ధాలు ఏంటంటే?

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మనుషుల జీవనశైలి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కారణంగా అతి తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు రావడం వయసులో ఉన్నప్పుడే ముసలి వాళ్ళలా కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవడం వల్ల మన వయసుకు తగ్గట్టుగా శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉంచుకోవచ్చు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆలూ చిప్స్, ఆలూ ఫ్రెంచ్ ప్రైస్ చేసే రకరకాల ఫ్రైలను వీలైనంతవరకు వరకు దూరం పెట్టాలి.

వీటిని ఎక్కువగా నూనెలో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇది మన శరీర కణాలకు హాని చేస్తాయి. అంతే కాకుండా వాటిలో ఉప్పు అధికంగా వేస్తారు. దానిని తినడం వల్ల ముసలితనం తొందరగా వచ్చేస్తుంది. అలాగే తరచూ కాఫీలు కూల్ డ్రింక్ లు తాగేవారు వాటిని తగ్గించుకోవాలి. వీటిలో కేఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రను దూరం చేసి నిద్రలేని సమస్యకు దారితీస్తుంది. నిద్ర లేకపోతే త్వరగా ముసలితనం వస్తుంది. అలాగే చక్కెరను ఎక్కువగా తినే వారికి ముసలితనం తొందరగా వస్తుంది. అధిక షుగర్ వాడడం వల్ల డయాబెటిస్ లివర్ సమస్యలు వస్తాయి. ఈ షుగర్ కొల్లాజెన్ ని నాశనం చేసే చర్మం ముడతలు పడేలా చేస్తుంది. అలాగే ప్రాసెస్ చేసినా లేదంటే ప్యాక్ చేసి ఉంచిన మాంసాహారానికి దూరంగా ఉండాలి.

మాంసం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఉప్పు అలాగే అనేక పదార్థాలు కలుపుతూ ఉంటారు. అవి బాగా వేడి చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల అవి చర్మంలో తేమను పోగొట్టి ముడతలు వచ్చేలా చేస్తాయి. అలాగే ఆల్కహాల్ వేడి చేస్తుంది. ఇది కణాలు త్వరగా చనిపోయేలా చేస్తుంది. ఆల్కహాల్ కారణంగా చర్మం పాడే ముడతలు వస్తాయి. దాంతో చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తారు. ముసలితనం ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. వాటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరి ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు చర్మ కణాలను కాపాడి చర్మ సమస్యలను దూరం చేస్తాయి.. అలాగే కూరగాయలు తృణ ధాన్యాలు శరీరంలో వేడిని తగ్గించి త్వరగా ముసలితనం రాకుండా చేస్తాయి. అలాగే పాలకూర, టమాట,సాల్మన్ చేపలు, ఓట్స్ పప్పులు, గింజలు వంటివి ఎక్కువగా తీసుకుంటే ముసలితనం రాదు..

Google pay loan : మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు 8 లక్షలు పొందవచ్చు.. ఇలా చేయండి

Google Pay Loan: మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే గుడ్ న్యూస్. ఇలా చేస్తే రూ. 8 లక్షలు రుణం పొందొచ్చు. ఎలా చెల్లించాలో కూడా తెలుసుకోండి.
Google Pay Loan: ఈరోజుల్లో ఏ అవసరానికైనా ధనం మూల ఇంధనంగా మారింది. మరీ ముఖ్యంగా అప్పు తీసుకోకుండా అవసరాలు గట్టెక్కే మార్గం లేకుండా పరిస్థితులు తయారయ్యాయి. దీనికి తోడు టెక్నాలజీతో పాటు సాంకేతికతలో మార్పు కారణంగా అర చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నిల్చున్న చోటే డబ్బు పుట్టే సౌకర్యం కూడా వచ్చేసింది.
గతంలో మాదిరిగా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీసుల్లో గంటల తరబడి నిలబడటం, డాక్యుమెంట్లు, షూరిటీ సైన్లతో పని లేకుండా ఫోన్ లోనే అప్పులు తీసుకునే రోజులు వచ్చేశాయి. మరీ ముఖ్యంగా మనీ పేమెంట్స్ యాప్ లలో బాగా ప్రాచూర్యం పొందినది..ఎక్కువ మంది ఉపయోగించే గూగుల్ పే యూపీఐ మంచి ఆఫర్లు అందిస్తోంది.
ఇప్పుడున్నవి ఇది వరకు రోజులు కాదు. లోన్, అప్పు, రుణం తీసుకోవాలంటే బ్యాంకులు చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. అప్పు దానంతటకి అదే పుడుతుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్నీ లోన్ యాప్స్ లో కొన్ని జనం నుంచి భారీగా వడ్డీలు వసులు చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
అయితే ప్రముఖ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది. గూగుల్ పే యూజర్లకు రూ.8లక్షల వరకు రుణం(Loan) తీసుకోవడానికి ఓ మార్గం చూపిస్తోంది.
ఈవిధంగా ఫోన్ ద్వారా గూగుల్ పేమెంట్ యాప్ సర్వీస్ లో తీసుకున్న పెద్ద మొత్తంలో రుణాన్ని ఒక్కసారిగా చెల్లించడం కాకుండా సులభమైన వాయిదా పద్దతుల్లో (EMI) ద్వారా లోన్ తిరిగి చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తుంది.
రుణం పొందడానికి కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేపర్ వర్క్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా మాత్రమే రుణాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈవిధంగా లోన్ తీసుకువాలనుకునే వారికి సిబిల్ స్కోర్ మాత్రం కచ్చితంగా బాగుండాలన్నదే ఏకైక కండీషన్.
ఈ లోన్ పొందడానికి గూగుల్ పే యూజర్స్ ఫస్ట్ Google Pay యాప్కి వెళ్లాలి. ఆ తర్వాత ఆఫర్స్ అండ్ రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్లి మేనేజ్ యువర్ మనీ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే లోన్ ఆప్షన్పై క్లిక్ చేసి అవసరమైన మొత్తం వివరాలను అందించండి.
అటుపై అప్లై నవ్ (Apply Now) ఆప్షన్పై క్లిక్ చేయండి. చివరగా కొత్త పేజీ లోన్ వివరాలను చూపుతుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన ఖాతాకు లోన్ మొత్తం వెంటనే జోడించబడుతుంది. రుణంపై వడ్డీ రేటు 13.99 శాతం. రుణాన్ని 6 నెలల నుండి 4 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు.

FD Interest Rates: ఎఫ్‌డీ ఖాతాదారులకు ఆ బ్యాంకు శుభవార్త.. రెండేళ్ల ఎఫ్‌డీ పథకంపై అదిరే వడ్డీ ఆఫర్‌

తాజాగా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త చెబుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ వడ్డీ రేటు సవరణను అనుసరించి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే నిబంధనలతో ఎఫ్‌డీలపై బ్యాంక్ తన రెగ్యులర్ క్లయింట్‌లకు 3.5 శాతం నుంచి 7 శాతం వడ్డీని అందిస్తుంది.
భారతదేశంలో పొదుపు చేసే వాళ్లు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు సురక్షితమైనవి, హామీతో కూడిన రాబడిని ఇస్తాయని నమ్మకం. అయితే తాజాగా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త చెబుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ వడ్డీ రేటు సవరణను అనుసరించి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే నిబంధనలతో ఎఫ్‌డీలపై బ్యాంక్ తన రెగ్యులర్ క్లయింట్‌లకు 3.5 శాతం నుంచి 7 శాతం వడ్డీని అందిస్తుంది. అదనంగా, బ్యాంక్ సీనియర్ సిటిజన్ ఖాతాదారులకు అదే సమయ వ్యవధిలో 4 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుంది. కాబట్టి ప్రస్తుతం వడ్డీ రేట్లు విషయంలో సెంట్రల్‌ తీసుకున్న చర్యల గురించి ఓ సారి తెలుసుకుందాం.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెగ్యులర్ కస్టమర్లకు ఎఫ్‌డీలను గరిష్టంగా 7 శాతం వడ్డీ రేటుతో రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధితో అందిస్తుంది. అయితే దాని సీనియర్ కస్టమర్‌లు అదే గరిష్ట వడ్డీ రేటు 7 శాతాన్ని పొందుతారు. అధిక కొత్త వడ్డీ రేట్లు జనవరి 10 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. వడ్డీ రేట్లలో ఈ మార్పు తర్వాత బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం, 15 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3.75 శాతం, 46 రోజుల ఎఫ్‌డీలపై 4.50 శాతం ఆఫర్ చేస్తోంది. 59 రోజులు. 60 రోజుల నుండి 90 రోజుల ఎఫ్‌డీపై 4.75 శాతం వడ్డీ ఇస్తారు.

సెంట్రల్‌ బ్యాంక్‌ 91 రోజుల నుంచి 179 రోజుల వరకు ఎఫ్‌డీపై 5.50 శాతం వడ్డీని, 180 నుంచి 270 రోజుల వరకు ఎఫ్‌డీపై 6 శాతం వడ్డీని ఇస్తుంది. అలాగే 271-364 రోజుల్లో మెచ్యూరయ్యే డిపాజిట్లపై 6.25 శాతం రాబడికి హామీ ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంది. బ్యాంక్ ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు 2-3 సంవత్సరాల మధ్య ఉన్న డిపాజిట్లపై 7 శాతం, 3 నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ డిపాజిట్లపై 6.50 శాతంగా ఉన్నాయి. అలాగే ఐదు నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు ఇప్పుడు 6.25 శాతంగా ఉంటుంది.

Success Story: కోటీశ్వరుడు అయిన డెలివరీ బాయ్.. సక్సెస్ అంటే ఇలా ఉండాలి..

Ambur Iyyappa: ఒక వ్యక్తి ఉద్యోగిగా సక్సెస్ అవ్వాలంటే ఎంతో కృషి చేయాలి. కంపెనీ కోసం ఎంత పనిచేసినా కంపెనీ గుర్తిస్తుందని నమ్మకం లేని పరిస్థితులు బయట ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అంబూర్ అయ్యప్ప సక్సెస్ స్టోరీ గురించే. దాదాపు 12 ఏళ్ల కిందట ఒక సాధారణ డెలివరీ బాయ్‌గా ఒక కొరియర్ కంపెనీలో చిన్న ఉద్యోగిగా అయ్యర్ కెరీర్ ప్రారంభమైంది. తాను పనిచేస్తున్న ఫస్ట్‌ఫ్లైట్ కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కానీ ఇప్పుడు ఆయన ఈకామర్స్ దిగ్గజం ఫిప్‌కార్ట్‌లో ఉన్నత స్థాయి అధికారిగా మల్టీ మిలియనీర్ స్థాయికి చేరుకున్నారు.
అయ్యప్ప తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని అంబూరులో జన్మించాడు. డిప్లొమా తర్వాత అశోక్ లేలాండ్ కంపెనీలో చిన్న ఉద్యోగిగా తన ప్రయాణాన్ని మెుదలుపెట్టారు. ఆ తర్వాత హిందుస్థాన్ మోటార్స్ కంపెనీలో చేరాడు. తర్వాత కొరియర్ కంపెనీలో ఉద్యోగిగా మారాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఫిప్ కార్ట్ సదరు కొరియర్ కంపెనీతో జతకట్టింది. అలా అయ్యప్ప పనిగురించి తెలుసుకుని తొలినాళ్లలో సచిన్, బిన్నీ బన్సల్ తమ స్టార్టప్ కంపెనీలో పనిలోకి తీసుకున్నారు. ఆ సమయంలో కనీసం ఆఫర్ లెటర్ ఇచ్చేందుకు స్టార్టప్ కంపెనీకి హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ సైతం లేకపోవటం గమనార్హం.
తొలినాళ్లలో కంపెనీకి వచ్చిన ఆర్డర్లను తానొక్కడే నిర్వహించేవాడు. దీంతో అతడిని ‘Human ERP’అనే బిరుదు ఇవ్వబడింది. ఒక్కడే రోజూ దాదాపు 1000 ఆర్డర్లకు పైగా ప్రాసెస్ చేయటంతో కంపెనీ అయ్యర్ పనిసామర్థ్యాన్ని గుర్తించి కంపెనీలో తర్వాతి కాలంలో సముచిత స్థానాన్ని అందించింది. అలా తొలినాళ్లలో ఉద్యోగిగా అందుకున్న స్టాక్ ఆప్షన్లను 2009లో అయ్యప్ప విక్రయించారు. ప్రస్తుతం కంపెనీలో మల్టీబిలియనీర్ గా మారారు. ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్ కోసం అసోసియేట్ డైరెక్టర్ హోదాలో అంబుర్ అయ్యప్ప కొనసాగుతున్నారు. చిరు ఉద్యోగి స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఒకే కంపెనీలో పనిచేసి మారిన అయ్యప్ప సక్సెస్ స్టోరీ నేటి తరం యువతకు ఆదర్శనీయం.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోండి.. ఫిబ్రవరి నుంచి కష్టమే..

పర్సనల్ లోన్: Personal Loan

ఫిబ్రవరి తర్వాత పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.

ఫిబ్రవరి 29 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఫిబ్రవరి పర్సనల్ లో తీసుకోవడం చాలా ఖరీదైనదిగా మారిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్పై రిస్క్ బరువును 100 శాతం నుండి 125 శాతం పెంచింది.

దీని కారణంగా అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) రిస్క్ పెరుగుతుంది. ఇది అన్సెక్యూర్డ్ రుణాలను అందించే ఖర్చు పెరుగుతుంది.

తెలిసిన సమాచారం ప్రకారం.. వాటాదారులందరూ 29 ఫిబ్రవరి 2024 నుండి వారి అన్ని అసురక్షిత రుణాలలో RBI యొక్క ఈ కొత్త నియమాన్ని అమలు చేయాలి.

NBFC వడ్డీ రేటును పెంచడం ద్వారా రుణం తీసుకునే వారిపై ఈ భారాన్ని మరింతగా మోపుతుంది.

Change in loan rate..

RBI నియంత్రిత రుణదాతలు ఇప్పుడు వారు ఇచ్చిన రుణ మొత్తం ఆధారంగా మూలధనంలో కొంత నిర్వహించవలసి ఉంటుంది. రుణ ప్రదాతలకు రిస్క్ భారం పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేశారు. రుణదాతలు అధిక మూలధన నిల్వలను నిర్వహించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. దీని కారణంగా రుణ రేట్లు మారుతాయి.

రూ.100 రుణం ఇవ్వడం వల్ల రూ.125 నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంతకుముందు రూ.100 రుణం ఇచ్చినప్పుడు, రుణదాత డబ్బును కోల్పోయే ప్రమాదం రూ.100. కానీ కొత్త నిబంధనల తర్వాత, ఇప్పుడు ఈ రిస్క్ రూ.125 అవుతుంది.

దీని కారణంగా రుణదాతలు వడ్డీ రేట్లు పెంచుతారు. గతంలో 9 శాతం ఉన్న రుణంపై వడ్డీ రేటు ఇప్పుడు 11 శాతం వరకు ఉండవచ్చని అంచనా. అదేవిధంగా.. వాణిజ్య బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేసే ప్రమాదం ఇప్పుడు 150 శాతంగా ఉంటుంది. ఇది గతంలో 125 శాతంగా ఉంది.
మరిన్ని రుణాలు ఇవ్వడానికి రుణాలు ఇచ్చే కంపెనీలు మార్కెట్ నుండి మరిన్ని నిధులను సేకరించవలసి ఉంటుంది. రుణదాతలందరూ మార్కెట్లో దీన్ని చేసినప్పుడు.. మార్కెట్లో కొత్త నిధుల కోసం డిమాండ్ పెరుగుతుంది.

ఇది వాటిని స్పష్టంగా పొందేందుకు ఎంతో ఎక్స్ పెన్సీవ్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ 25 శాతం పెరుగుదల భారం సాధారణ ప్రజలపై మాత్రమే పడుతుంది. ఇలా కొంత రుణం తీసుకునే వారిపై అదనపు భారం పడుతుంది

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నిత్యానంద హాజరుకానున్నారా?

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వ సిద్ధమైంది. చాలా మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. కాగా.. రాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరవుతున్నట్లు తెలిపారు స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరవుతానని తెలిపారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం సహా ఇతరులు పాల్గొనే వీవీఐపీ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని ట్విట్టర్ లో తెలిపారు. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసలో జరిగే కార్యక్రమాల గురించి కూడా వివరించారు.

2010లో నిత్యానందపై అతని మాజీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదైంది. నిత్యానందను అరెస్టు చేసిన తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు. నిత్యానంద దేశం నుంచి పారిపోయాడంటూ డ్రైవర్ కోర్టుని ఆశ్రయించడంతో.. అతడి బెయిల్ రద్దయ్యింది. దేశం వదిలి పారిపోయిన నిత్యానంద.. 2020లో తన సొంత దేశాన్ని ఏర్పరుచుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది ఐక్యరాజ్యసమితి సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధిగా మాతా విజయప్రియ నిత్యానంద వ్యవహరించారు. మరోవైపు రేప్ కేసు ఇప్పటికీ రామనగర సెషన్స్ కోర్టులో పెండింగ్ లో ఉంది.

FA – 3 / CBA – 2 Exams Syllabus,Time Table and Instructions

????️????️

????CBA-2/FA-3 టైం టేబుల్

???? 1 నుంచి 5 తరగతులకు :-

???? 23.01.2024 (9.30 – 10.30) : తెలుగు , (1.20 – 2.20) : గణితం

???? 25.01.2024 (9.30 – 10.30) : పరిసరాల విజ్ఞానం , ఇంగ్లీషు పార్ట్ A : 1.20 – 2.20 , పార్ట్ B : 2.30 – 3.30

???? 6 నుంచి 8 తరగతులకు :-

???? 23.01.2024 (9.30 – 10.30) : తెలుగు , (1.20 – 2.20) : గణితం

???? 25.01.2024 (9.30 – 10.30) : హిందీ , (1.20 – 2.20) : జనరల్ సైన్స్

???? 27.01.2024 (9.30 – 10.30) : సోషల్_

???? 29.01.2024 : ఇంగ్లీషు పార్ట్ A : 2.00 – 3.00 , పార్ట్ B : 3.10 – 4.10

???? 9 , 10 తరగతులకు :-

???? 23.01.2024 (9.30 – 10.15) : తెలుగు , (10.30 – 11.15) : గణితం

???? 25.01.2024 (9.30 – 10.15) : హిందీ , (10.30 – 11.15) : జనరల్ సైన్స్

???? 27.01.2024 (9.30 – 10.15) : సోషల్_

???? 29.01.2024 ఇంగ్లీషు పార్ట్ A : 2.00 – 3.00 , పార్ట్ B : 3.10 – 4.10

FA 3 / CBA 2 Syllabus…

History Of The Pencil : పెన్సిల్ చరిత్ర తెలుసా?

History Of The Pencil : ‘పిన్సిల్‌’ అనే ఫ్రెంచ్‌ పదం, ‘పిన్సిలస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ఆ పదాలకు అర్థం ‘చిన్న కుంచె’ అని.
ఒకప్పుడు చిత్రకారులు ఒంటె తోక వెంట్రుకలను ఉపయోగించి పెయింటింగ్‌ కుంచెలను తయారు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘పెన్సిల్‌’కు ఆ పేరు పెట్టారు.
బ్రిటన్‌లోని ఇంగ్లీష్‌ లేక్‌ డిస్టిక్ట్‌లోని కెస్విక్‌ వద్ద 1564లోనే గ్రాఫైట్ గనులు బయటపడ్డాయి. అక్కడి గొర్రెల కాపరులు.. గ్రాఫైట్ ముక్కలతో గొర్రెల మీద గుర్తులు పెట్టేవారు. దీంతో ఆ కెస్విక్‌ ప్రాంతాల్లో 19వ శతాబ్దంలో పెన్సిల్‌ పరిశ్రమ విస్తరించింది.
నెపోలియన్‌ ఆర్మీలో పనిచేసిన నికోలస్‌ జాక్వస్‌ కాంటే అనే శాస్త్రవేత్త 1795లో నీరు, బంక మట్టి, గ్రాఫైట్‌ మిశ్రమాన్ని బట్టీలో 1900 డిగ్రీల ఫారిన్‌హీట్‌ వద్ద వేడిచేసి నేడు మనం వాడే పెన్సిళ్లను తయారు చేశారు. అవసరాలనుబట్టి నాలుగు మూలలు, గుడ్రిటి పెన్సిళ్లను కూడా తయారు చేశారు. కాలక్రమంలో కర్ర పెన్సిళ్లు వచ్చాయి.
1832లో ‘బ్యాంక్స్, సన్‌ అండ్‌ కంపెనీ’ పేరిట తొలి పెన్సిల్‌ పరిశ్రమ ఏర్పాటయింది. అదే కాలక్రమంలో ‘డెర్వంట్‌ కంబర్‌లాండ్‌ పెన్సిల్‌ కంపెనీ’గా రూపాంతరం చెందింది. కంబర్‌లాండ్‌ పెన్సిళ్లను ప్రపంచంలోనే నాణ్యమైన పెన్సిళ్లుగా పరిగణిస్తారు. కారణం అక్కడ దొరికే గ్రాఫైట్‌కు దుమ్మూ ధూళి అంటదు.
1858లో హైమెన్‌ లిప్‌మ్యాన్‌.. గ్రాఫైటును పొడిచేసి దానికి కొన్ని పదార్థాలు కలిపి సన్నని కర్ర ముక్కల మధ్య పెట్టి, రాసుకోడానికి అనువుగా ఉండేలా తయారు చేశాడు. రాసింది తుడిపేందుకు పెన్సిల్‌కు రబ్బరును చేర్చింది ఇతనే. అంతేకాదు.. పెన్సిల్ మీద ఇతగాడు పేటెంట్ కూడా తీసుకున్నాడు. ఆ పేటెంట్ వచ్చిన మార్చి 30ని ‘పెన్సిల్‌ దినోత్సవం’గా జరుపుతున్నారు.
ఐరోపాలో 1622 నుంచి, అమెరికాలో 1812 నుంచి పెన్సిళ్ల వాడకం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 1400 కోట్ల పెన్సిళ్ళు తయారవుతుండగా, ఒక్క అమెరికాలోనే సుమారు 200 కోట్ల పెన్సిళ్ళు తయారు చేస్తారు.
ఒక మాదిరి ఎత్తున్న చెట్టు కలపతో సుమారు 3 లక్షల పెన్సిళ్ళు చేయొచ్చు. ఒక పెన్సిల్‌తో 56 కి.మీ. పొడవున గీత గీయొచ్చు. సుమారు 45,000 పదాలను రాయవచ్చు. ఒక పెన్సిల్‌ను దాదాపుగా 17 సార్లు చెక్కవచ్చు.
అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు కనుక పెన్నులు పనిచేయవు. కనుక వ్యోమగామలు పెన్సిల్ వాడాల్సిందే. నీటిలోనూ పెన్సిల్‌తో రాయొచ్చు. అమెరికాలో రబ్బరు అమర్చిన పెన్సిళ్ళను ఎక్కువగా వాడుతుంటే.. బ్రిటిషర్లు మాత్రం రబ్బరు లేని పెన్సిళ్ళనే ఎక్కువగా వాడతారు.
మొదటి పెన్సిల్‌ ఫ్యాక్టరీని ఇంగ్లాండ్‌లో స్థాపించారు. ఇంగ్లాండ్‌లో ‘కుంబర్‌ల్యాండ్‌ పెన్సిల్‌ మ్యూజియం’ ఉంది. ఇక్కడ 26 అడుగుల ఎత్తు, 446.36 కిలోల బరువున్న ప్రపంచపు అతి పెద్ద రంగుల పెన్సిల్‌ ఉంది.
ఎమిలియో అనే వ్యక్తి 1956 నుంచి 2013 వరకు 16,260 పెన్సిళ్లు సేకరించి రికార్డు కొట్టాడు. ఇక.. యూకేకు చెందిన ఎడ్‌ డగ్లస్‌ మిల్లర్‌ 1,061 అడుగుల పొడవైన పెన్సిల్‌ని తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సాధించాడు.

NPS rules: NPSలో కీలక మార్పులు.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

NPS withdraw: జీవిత చరమాంకంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు పలువురు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనం నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS). దీనికి సంబంధించిన నిబంధనల్లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ PFRDA కీలక మార్పులు తీసుకొచ్చింది.
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని 60 ఏళ్ల తర్వాత పెన్షన్ రూపంలో తిరిగి తీసుకునేందుకు ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఈ నిబంధనను సవరిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సర్క్యులర్ రిలీజ్ చేసింది. వివిధ సందర్భాల్లో NPS కింద పెన్షన్‌ ను పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు ఓకే చెప్పింది.
ఫిబ్రవరి 1, 2024 నుండి NPS చందాదారులు తమ ఖాతా నుంచి పెన్షన్ పాక్షిక ఉపసంహరణకు పెన్షన్ ఫండ్ అనుమతిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం, యజమానుల కంట్రిబ్యూషన్ మినహాయించి, సబ్‌స్రైబర్స్ తమ పెన్షన్‌లో 25 శాతాన్ని ఉపసంహరించుకోగలుగుతారని PFRDA పేర్కొంది.
ఈ విధంగా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న వారితో సహా పిల్లల ఉన్నత విద్య, వివాహం, సబ్‌స్క్రైబర్ పేరిట నివాస గృహం లేదా ఫ్లాట్‌ కొనుగోలు, కొన్ని వ్యాధులకు సంబంధించిన వైద్య ఖర్చులు, వైకల్యాల సమయంలో మాత్రమే ఇలా చేయడం కుదురుతుందని స్పష్టం చేసింది.

NPS ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణకు చందాదారులు సంబంధిత ప్రభుత్వ నోడల్ కార్యాలయం లేదా పాయింట్ ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA)కి కారణాలతో సహా సెల్ఫ్ డిక్లరేషన్‌ను సమర్పించవచ్చు. పేరును సరిపోల్చుకోవడానికి చందాదారుల బ్యాంక్ ఖాతాతో CRA ‘పెన్నీ డ్రాప్’ పరీక్షను నిర్వహిస్తుంది. తర్వాత మాత్రమే సబ్‌స్క్రైబర్ కోరిన మొత్తం వారి ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

Vivo G2: రూ. 14వేలకే అదిరిపోయే ఫీచర్స్‌.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో జీ2 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోకి లాంచ్‌ చేయనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే భారత కరెన్సీలో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,000 కాగా.. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 17,500, ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 18,700గా ఉండనుంది

వివో జీ2 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 720×1,612 పిక్సెల్‌ ఈ స్క్రీన్‌ సొంతం. రిఫ్రెష్ రేట్ 90Hz, 89.67 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందించారు.
వివో జీ2 స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆరిజిన్‌ ఓఎస్‌ 3పై పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ 7ఎన్‌ఎమ్‌ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌ పనిచేస్తుంది. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను సైడ్‌కు అమర్చారు.
ఇక కెమెరా విషయానికొస్తే వివో జీ2 స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15వాట్స్‌ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.

OnePlus 12 India Launch : భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 23నే లాంచ్.. పూర్తి వివరాలు ఇవే..!

OnePlus 12 India Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ 12 ఫోన్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ మరికొద్ది రోజుల దూరంలో ఉంది. భారత మార్కెట్లో జరగబోయే పెద్ద ఈవెంట్‌కు తుది మెరుగులు దిద్దడంలో కంపెనీ బిజీగా ఉంది.
వన్‌ప్లస్ 12 బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. యాదృచ్ఛికంగా 10 ఏళ్ల క్రితమే కంపెనీ ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు భారత్ సహా యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో లాంచ్ కానుంది. గ్లోబల్ లాంచ్ భారత మార్కెట్లో జరుగనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

లాంచ్ తేదీ, టైమ్ వివరాలివే :
వన్‌ప్లస్ 12 భారత్ లాంచ్ జనవరి 23 (మంగళవారం) గ్లోబల్ ఈవెంట్ ఢిల్లీలో రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. వన్‌ప్లస్ అధికారిక యూట్యూబ్ పేజీలో సామాజిక ఛానెల్‌లలో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండనుంది.

వన్‌ప్లస్ 12 ధర, ఫీచర్లు ఇవే :
వన్‌ప్లస్ 12 ఫోన్ కొత్త ఏఐ చిప్ కారణంగా మాత్రమే కాకుండా హాసల్ బ్లాడ్‌తో అభివృద్ధి చేసిన కొత్త ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను ఉపయోగిస్తుందని పుకార్లు వచ్చాయి. వన్‌ప్లస్ 12 ఫోన్ అమోల్డ్ క్యూహెచ్‌డీ+ (1,440 x 3,168) డిస్‌ప్లేను పొందుతుంది. 2600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో (2000నిట్స్), పిక్సెల్ 8 ప్రో (2400నిట్స్)తో సహా కొన్ని ఇటీవలి ఫ్లాగ్‌షిప్‌ల కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది.

ఈ డివైజ్ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే పెద్ద 5,400ఎంఎహెచ్ బ్యాటరీతో కూడా వస్తుంది. ఇటీవలి లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ 12 భారత్ లాంచ్ ధర 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ దాదాపు రూ. 65వేలు ఉండవచ్చునని అంచనా. మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ కొత్త చిప్‌సెట్‌తో సరసమైన రెండవ ఫోన్ మాత్రమే.

వన్‌ప్లస్ 12 లాంచ్ ఈవెంట్.. ఏం ఆశించవచ్చు? :
వన్‌ప్లస్ 12 లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ కొత్త వన్‌ప్లస్ బడ్స్ 3 ఇయర్‌బడ్స్‌తో పాటు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో మునుపటి గత ఫ్లాగ్‌షిప్ ఎస్ఓసీ, స్పాప్ డ్రాగన్ 8 జెన్ 2 అమర్చి ఉంటుందని భావిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్ ప్రామాణికంగా కలిగి ఉండాలి. 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉండాలి. వన్‌ప్లస్ బడ్స్ 3 తక్కువ ధర ట్యాగ్‌లో ప్రో-లాంటి ఫీచర్‌లను పొందవచ్చు. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరికొన్ని నిఫ్టీ టూల్స్‌ను అందిస్తుంది.

AP Assigned Lands : అసైన్డ్ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Assigned Lands : అసైన్డ్ భూములపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే వాటికి మార్కె్ట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నోటిఫికేషన్ జారీ చేశారు. పేదలు సాగుచేసుకోవడానికి గతంలో ప్రభుత్వం భూములు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని అసైన్డ్ భూములుగా పిలుస్తారు. వీటిని తరాలపాటు సాగుచేసుకోవడానికి మాత్రమే వినియోగించాలి తప్ప క్రయమిక్రయాలకు నిబంధనలు ఒప్పుకోవు.

మార్కెట్ విలువ ప్రకారమే

ఏపీ అసైన్‌మెంట్‌ యాక్ట్-1977కు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీచేశారు. అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఇతర భూముల యజమానులతో సమానంగానే మార్కెట్‌ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని, ఈ విషయంలో సంప్రదింపులకు అవకాశం లేదని తెలిపింది. అయితే భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రజాప్రయోజనాల కోసం భూముల్ని సేకరించినప్పుడు మార్కెట్‌ విలువ కంటే యజమానులు ఎక్కువ డిమాండ్‌ చేస్తే కలెక్టర్‌లు సంప్రదింపులు జరుపుతారు. ఇరువర్గాలకు ఆమోదమైన ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే అసైన్డ్‌ భూముల విషయంలో ఈ తరహా అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో స్పష్టంచేసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన సాగు భూములపై 20 ఏళ్లు, ఇంటి స్థలాలపై 10 సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ జాబితాల్ని స్థానిక ఎమ్మార్వో ప్రకటిస్తారని రెవెన్యూ శాఖ పేర్కొంది.

అర్హుల జాబితా

అయితే అర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించి తుది జాబితాలు నిర్దేశించిన ఫాం-6, ఫాం-7 ద్వారా జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తారని రెవెన్యూ శాఖ పేర్కొంది. కలెక్టర్ ఆమోదిస్తే ఈ భూములను జిల్లా రిజిస్ట్రార్‌ నిషిద్ధ జాబితా (22A) నుంచి తొలగిస్తారని తెలిపింది. తుది జాబితా ప్రకటనకు ముందు అసైన్డ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? పట్టాదారులు పేరిట భూములు ఉన్నాయా? వారసులు ఉన్నారా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అర్హుల జాబితాను ఎమ్మార్వో తయారు చేస్తారని రెవెన్యూ శాఖ పేర్కొంది.

అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు

అసైన్డ్‌ భూములు కేటాయించి (అసైన్‌ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తూ గత ఏడాదిలో ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఈ మేరకు 1977 ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) సవరణను ఆమోదిస్తూ అప్పట్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆర్డినెన్స్‌ జారీచేశారు. దీంతో అసైన్డ్‌ భూములు పొందిన పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించినట్లు అయింది. దాదాపు రాష్ట్రంలో 28 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు అంచనా.

నెలకి 88,000/- జీతం తో యునైటెడ్ ఇన్సూరెన్స్ లో 250 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే.

UIIC AO రిక్రూట్మెంట్ 2024:

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
UIIC రిక్రూట్మెంట్ 2024 – 250 ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు
UIIC జనవరి 7, 2024న తన అధికారిక వెబ్సైట్ ద్వారా UIIC AO రిక్రూట్మెంట్ 2024, 250 స్థానాల ప్రకటనలను వెల్లడించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 8, 2024న ప్రారంభమై జనవరి 23, 2024న ముగుస్తుంది.

కంపెనీ పేరు: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC)

UIIC AO రిక్రూట్మెంట్ 2024 ప్రఖ్యాత యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-I)గా కెరీర్ని ప్రారంభించే అవకాశాన్ని అందిస్తుంది. మీరు తెలుసుకోవలసిన ముఖ్య వివరాలు ఇక్కడ ఉన్నాయి:

వివరాల సమాచారం

ఆర్గనైజేషన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

రిక్రూట్మెంట్ UIIC AO రిక్రూట్మెంట్ 2024

ఖాళీలు 250

General 102
EWS 24
SC 37
OBC 67
ST 20
మొత్తం 250

UIIC AO రిక్రూట్మెంట్ 2024 గురించి:

గ్రాడ్యుయేట్ లు దీనికి అర్హులు..

ఎంపిక ప్రక్రియ : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్

UIIC AO నోటిఫికేషన్ 2024:

ఆసక్తి గల అభ్యర్థులు విద్యా అవసరాలు, ఓపెనింగ్ల సంఖ్య, వయస్సు పరిమితులు మరియు ఎంపిక విధానంపై సమాచారాన్ని సేకరించడానికి అధికారిక వెబ్సైట్లో అధికారిక UIIC AO రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ను యాక్సెస్ చేయవచ్చు.

UIIC AO 2024 ఖాళీలు: 250

దరఖాస్తు రుసుము: ST/SC/PWD/: 250/0

మిగిలిన వారికి : INR 1000

గమనిక: దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు.అప్లికేషన్ ప్రారంభ తేదీ 8 జనవరి 2024

దరఖాస్తు ముగింపు తేదీ 23 జనవరి 2024

అధికారిక వెబ్సైట్ www.uiic.co.in

రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం రూ. 999 లకే

ఆఫర్.. అమెజాన్ ఆఫర్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Pringle 2 జార్ మిక్సర్ గ్రౌండర్ కేవలం రూ.999లకే లభిస్తోంది.దీని ఒరిజినల్ ధర రూ.3,840లు.
అంటే 74 శాతం డిస్కౌంట్ తో లభిస్తోంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్, 1 లీటర్ కెపాసిటీ, 5000 W ల పవర్ ఫుల్ మోటార్, ప్రత్యేకమైన స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్స్ తో కఠినమైన ఇంగ్రీడియెన్స్ కూడా మెత్తగా పేస్ట్ చేస్తుంది. పాలిష్డ్ బ్లేడ్స్ తో 2డిటాచబుల్ స్టెయిన్ లెస్ స్టీల్ జార్ లు తడి, పొడి గ్రైండింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి.1 సంవత్సరం గ్యారంటీ తో ఈ లైట్ వెయిట్ మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది.

Gold Rates: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. బంగారం ధర మీ ఫోన్‌కే మేసేజ్..ఎలానో చూడండి

Missed call number,Gold Rates: ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండాల్సిందే. అందువల్ల బంగారం కొనాలంటే వాటి ధరల మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
అందువల్ల మన ఫోన్ కె బంగారం ధరలు వస్తే బాగుంటుంది కదా.. ఇప్పుడు ఆ విధానం ఉంది. ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు బంగారం ధరలు మొబైల్ నంబర్‌కు మేసేజ్ రూపంలో వస్తాయి.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధరలు ఉంటాయి. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం కొనుగోలుకు ముందు మీరు మిస్డ్ కాల్ ద్వారా ధరలు తెలుసుకోవచ్చు. ఐబీజేఏ నంబర్ 8955664433 కు మీ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొద్ది సేపటికి మీ మొబైల్ నంబర్‌కు బంగారం ధరలు మేసేజ్ రూపంలో వస్తాయి. దీంతో మీరు చాలా సులభంగా ధరలు తెలుసుకోవచ్చు.

మరోవైపు.. గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.com లో సమాచారం పొందవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేయాలనీ అనుకున్నప్పుడు ముందుగానే ధరలను తెలుసుకుంటే.. అధిక ధరలు చెప్పి చేసే మోసాల నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది.

కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఫోన్ నుంచి పైన చెప్పిన నంబర్‌కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి బంగారం ధరలు తెలుసుకోండి. బంగారం కొనే విషయంలో మోసం జరగకుండా చూసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

E PAN: అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ అవసరమా.? రెండు నిమిషాల్లో ఈ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి..

పాన్‌ కార్డ్‌ ఎంత అనివార్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఆధార్‌ కార్డ్‌ తర్వాత అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్‌ కార్డ్‌ ఒకటని తెలిసిందే.
దేశంలో ప్రతి పౌరుడి, సంస్థల ట్యాక్సేషన్ కోసం ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. బ్యాంకుల్లో ఒకేసారి రూ. 50 వేల నగదు డిపాజిట్‌ చేయాలన్నా, ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలన్నా పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే.

అయితే పాన్ కార్డ్‌ను అప్లై చేసుకున్న తర్వాత కనీసం రెండు వారాల తర్వాతే పాన్‌ చేతుకి అందుతుంది. కొన్ని సందర్భాల్లో నెల రోజులు కూడా పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆధార్‌ కార్డ్‌ను క్షణాల్లో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫైల్ రూపంలో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణ పాన్ కార్డులాగే దీన్ని కూడా అన్ని ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ పాన్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇందుకోసం ముందుగా.. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

* అనంతరం స్క్రీన్‌కి లెఫ్ట్‌ సైడ్‌ కనిపించే.. ఆప్షన్స్‌లో ‘ఇన్ స్టాంట్ ఈ-పాన్ ‘ బటన్ పై క్లిక్ చేయాలి.

* తర్వాత గెట్‌ న్యూ పాన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.

* అనంతరం ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, చెక్ బాక్స్ పై టిక్ చేసి పై క్లిక్ చేసి కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి.

* వెంటనే మీ రిజిస్టర్ ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. దానిని ఎంటర్‌ చేసి కంటిన్యూ నొక్కాలి.
* తర్వాత ఆధార్ వివరాలను చెక్‌ చేసిన తర్వాత టర్మ్స్‌ను యాక్సెప్ట్ చేస్తూ చెక్‌ బాక్స్‌పై టిక్ చేయాలి.

* వెంటనే ఇన్‌స్టాంట్‌గా ఈ పాన్‌ కార్డ్‌ వస్తుంది. పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జగన్‌ను అలా ఎందుకన్నావ్… వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే సీఎం జగన్‌ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు.
ఏపీ విభజన సమస్యలు పరిష్కరించకపోవడానికి వైసీపీ, టీడీపీ కారణమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీఎం జగన్ పరిపాలనపైనా షర్మిల సన్సేషనల్ కామెంట్స్ చేశారు.
దీంతో వైఎస్ షర్మిలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసుకోకుండా వైఎస్ షర్మిల ఏపీకి ఎందుకువచ్చిందంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఆమె రాష్ట్రానాకి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ జగన్ పాలన బాగుందని కాని షర్మిల చేసిన వ్యాఖ్యలు సరిగాలేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.


అయితే వైఎస్ షర్మిలపై ఆమె బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి సైతం విరుచుకుపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఆమె ఎవరు అని ప్రశ్నించారు. తమతో వస్తే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగిందో చూపిస్తామని సవాల్ చేశారు. మొన్నటి వరకూ పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి అభివృద్ది జరగలేదంటే ఎలా అని నిలదీశారు. షర్మిల కాదు.. ఎవరు వచ్చినా జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని చెప్పారు. వైఎస్సార్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అలాంటి పార్టీ కోసమేనా షర్మిల మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టే వైసీపీ అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

LIC Jeevan Dhara II Policy: ఎల్‌ఐసీ ‘జీవన్​ ధార 2’ పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్‌ఫిట్స్‌!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్​ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్‌ అందుబాటులోకి రానుంది.

ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్‌ ఇన్‌ కమ్‌ పొందవచ్చు.

జీవన్ ధార 2 పథకం వివరాలు

►పాలసీ కట్టే సమయంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తిస్తుంది.

►ఒకేసారి డిపాజిట్‌ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు.
►యాన్యుటైజేషన్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది.

► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి.

► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు,

► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు,

►యాన్యుటీ టాప్​-అప్​ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
►ఈ ఎల్​ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్​ తీసుకోవచ్చు.

►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు.

Health Tips : క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి

Health Tips : మనం రోజువారీ జీవితంలో తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మనం ఏయే పదార్థాలు తిన్నా, తాగినా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయో తెలుసుకుందాం.
క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. దాని ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి, కానీ కొంతకాలం తర్వాత అది తీవ్రంగా మారుతుంది.
ప్రాసెస్ చేసిన మాంసం
ప్రాసెస్ చేయబడిన మాంసం కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో నైట్రేట్ ఉంటుంది. దీని కారణంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తిన్నప్పుడు అవి కడుపులో , జీర్ణక్రియ సమయంలో నైట్రోసమైన్‌ను ఉత్పత్తి చేస్తాయి. తక్కువ సోడియం లేదా నైట్రేట్ లేని మాంసాన్ని తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. పదార్ధాల లేబుల్‌లను తనిఖీ చేయడం, ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం కూడా మంచిది.
తీపి ఎక్కువగా తినవద్దు
ఎక్కువ చక్కెర తినడం లేదా పానీయాలు తాగడం వల్ల రొమ్ము, కడుపు క్యాన్సర్‌తో సహా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి కొన్ని క్యాన్సర్‌లకు ప్రమాద కారకాలుగా గుర్తించబడ్డాయి. శుద్ధి చేసిన చక్కెర కూడా ఆరోగ్యానికి చాలా హానికరం.
అత్యంత ప్రాసెస్ చేయబడిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారంలో చాలా సోడియం, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
వేయించిన కూరగాయలను తినొద్దు
వేయించిన కూరగాయలు ఆరోగ్యానికి హానికరం. అధిక ఉష్ణోగ్రత వద్ద వండిన ఆహారం, అదనపు నూనె వాడకం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఇది క్యాన్సర్ రిస్క్ తో ముడిపడి ఉంటుంది. అక్రిలమైడ్, పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్‌లు (PAHలు) వంట ప్రక్రియలో హానికరం. ఈ ఆహార పదార్థాలలో స్టార్చ్, ఆక్సిడైజ్డ్ పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మద్యం
అతిగా తాగడం వల్ల కొలొరెక్టల్, రొమ్ము, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్ , కాలేయ క్యాన్సర్‌లతో సహా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఆల్కహాల్ మెటబాలిజం సమయంలో ఎసిటాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారకం ఉత్పత్తి అవుతుంది.అందుకే వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలని అంటారు.

వైసీపీ ప్రభుత్వంపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఊహించని రేంజ్‌లో సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు YS షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ…
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో పాలకులు ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే కనిపిస్తున్నాయని ఎవరూ ఊహించని రేంజ్‌లో షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి ఒక నియంతలా పాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Health

సినిమా