Friday, November 15, 2024

దేశంలో కూష్మాండ దేవి ఆలయాలు.. పిండి అమ్మవారి నుంచి నిరంతరం నీరు ప్రవాహం.. మిస్టరీ టెంపుల్ ఎక్కడంటే..

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ హిందూ దేవుళ్లకు, దేవతలకు అంకితం చేయబడిన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. పండుగల సమయంలో ఈ దేవాలయాలలో విభిన్నమైన శోభ కనిపిస్తుంది. చాలా ఆసక్తికరమైన పౌరాణిక కథలతో పాటు, ఈ దేవాలయాలలో కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆలయాల్లోని రహస్యాలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. అమ్మవారి ఆలయాలను నవరాత్రుల సమయంలో భారీగా భక్తులు దర్శించుకుంటారు. అయితే దుర్గాదేవి అవతారం అయిన కూష్మాండ దేవికి అంకితం చేయబడిన దేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ ఆలయాల్లోని కూష్మాండ దేవి ఆశీర్వాదం దర్శనంతోనే పొందవచ్చు.

బనారస్‌లోని కూష్మాండ దేవి ఆలయం
కూష్మాండ దేవికి చెందిన ప్రసిద్ధ, పురాతన దేవాలయం వారణాసిలోని రామ్‌నగర్‌లో ఉంది. సుబాహు అనే రాజు కూష్మాండ దేవి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేసి తన రాజ్య రాజధాని వారణాసిలో అదే పేరుతో నివసించాలని దేవత నుంచి వరం కోరినట్లు ఈ ఆలయానికి సంబంధించిన పౌరాణిక నమ్మకం ఉంది. ఇది దేవీ భగవత్ పురాణంలో ప్రస్తావించబడింది. నవరాత్రి సమయంలో కూష్మాండ అమ్మవారి దర్శనం కోసం భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.

ఇక్కడ అమ్మవారి విగ్రహం రహస్యం ఏమిటంటే
ఈ ఆలయంలో ప్రతిష్టించిన కూష్మాండ దేవి విగ్రహం ఏ వ్యక్తి చేయలేద అని నమ్ముతారు. స్వయంభువుగా వెలిసిన అమ్మవారు దుష్ట శక్తుల నుంచి ప్రజలను రక్షింస్తుందని విశ్వాసం. కనిపించింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కువ సంఖ్యలో కోతులు ఉన్నందున ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు.
కూష్మాండ ఆలయం, ఉత్తరాఖండ్
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లోని అగస్త్యముని బ్లాక్‌లోని సిల్లా గ్రామంలో కూష్మాండ దేవిని.. ఆనంద దేవతగా పూజిస్తారు. సిల్లా గ్రామంలోనే అగస్త్య మహర్షి గర్భం నుంచి కూష్మాండ దేవి జన్మించిందని నమ్ముతారు. దుర్గా సప్తశతి నాల్గవ శ్రేణిలో తల్లి కూష్మాండ జననం గురించి వివరించబడింది. స్థానికులు ఇక్కడ ఉన్న అమ్మవారిని కుమాసైన్ అనే పేరుతో కూడా పూజిస్తారు.

ప్రాచుర్యం పొందిన అమ్మవారి అద్వితీయ కథ
హిమాలయ ప్రాంతంలో రాక్షసుల భయంతో ఋషులు తమ ఆశ్రమాల్లో పూజలు చేసే పరిస్థితి లేదని.. శనీశ్వర మహారాజ్ ఆలయంలో కూడా ఇదే పరిస్థితి ఉండేదట. అంతేకాదు ఆలయంలో పూజకు వచ్చిన బ్రాహ్మణుడిని రాక్షసులు చంపేశారట. అప్పుడు శనీశ్వర మహారాజ్ తన సోదరుడు అగస్త్య ఋషిని సహాయం కోరాడు. ఆ తర్వాత అతను సిల్లా గ్రామానికి చేరుకుని ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు. అతను కూడా రాక్షసుల హింసను చూసి భయపడ్డాడు. అప్పుడు ఆదిశక్తి జగదాంబను ధ్యానం చేసి ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి గర్భం నుంచి కూష్మాండ దేవి జన్మించింది.

కూష్మాండ ఆలయం, కాన్పూర్
కూష్మాండ దేవి పురాతన ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉంది. ఈ ఆలయంలో తల్లి కూష్మాండ పిండి రూపంలో ఉంటుంది. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాలు రెండవ నుంచి పదవ శతాబ్దానికి చెందినవిగా చెబుతారు. ఈ ఆలయాన్ని కుధ అనే గోవుల కాపరి కనిపెట్టాడని ప్రఖ్యాతి గాంచింది. అతని ఆవు ఇక్కడ పొదలో ఉన్న తల్లికి తన పాలను నైవేద్యంగా పెడుతుండగా.. ఆ గోరక్షకుడు ఆశ్చర్యపోయాడు. అతను ఈ ప్రదేశంలో తవ్వినప్పుడు.. అతను విగ్రహాన్ని చూశాడు.అయితే ఆ విగ్రహం ముగింపు కనిపించలేదు. దీంతో గోవుల కాపరి అక్కడే పిండిని తయారు చేసి కూష్మాండ దేవిని పూజించాడట.

విగ్రహం నుంచి కారుతుండే నీరు
ఈ ఆలయంలో తల్లి కూష్మాండ దేవి పిండి రూపంలో ఉంటుంది. ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే..దాని నుండి నీరు ఎల్లప్పుడూ కారుతుంది. పిండి నుండి వచ్చే నీటిని తాగిన వ్యక్తికి రోగాల నుండి విముక్తి లభిస్తుందని, ఎటు వంటి వ్యాధి దరిచేరదని జీవితంలో ఇబ్బంది పడరని నమ్మకం. నవరాత్రి సమయంలో కూష్మాండదేవి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

Hair care: మీ జుట్టు పల్చబడుతుందా? అయితే, ఒత్తైన జుట్టు కోసం ఇలా చేయండి

అద్దంలో మీ ఒత్తైన జుట్టు రోజురోజుకీ పలుచబడిపోవటం చూస్తుంటే మీకు బాధగా ఉందా. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలటం. చిన్న వయసుకే యువతీ, యువకుల్లో జుట్టు రాలటం (hair fall) అధికమవుతోంది.
ఇక జుట్టు రాలటం ఎక్కువయ్యేకొద్దీ మీరు హెయిర్ స్టైల్స్ చేసుకోలేరు. ఇందుకు విరుగుడుగా మీరు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించండి. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి.

ఇలా చేసి చూడండి..
నూనె మర్ధన చేసుకోవటం, ఉసిరి తినటం, కలబందతో హెయిర్ ప్యాక్ (hair pack) వేసుకోవటం, ప్రతిరోజూ షాంపూ చేయటం, బ్యాలెన్స్డ్ డైట్ వంటివాటిపై ఒకసారి మీరు పూర్తిగా దృష్టిసారించండి. ఆతరువాత మీ జుట్టు ఒత్తుగా పెరిగినట్టు మార్పు కనిపిస్తే మంచిదేగా.
నూనె
చాలామంది తలకు నూనె రాయటానికి ప్రాధాన్యత ఇవ్వరు. మీకు నచ్చిన ఏదో ఒక నూనెను పూయటం చాలా అవసరం. ఇలా చేస్తే బ్లడ్ సర్కులేషన్ పెరిగి, మీ జుట్టు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు గోరువెచ్చని నూనె కూడా మసాజ్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఇలా మసాజ్ చేశాక ఓ వెచ్చని టవల్ తో కొన్ని నిమిషాలపాటు తలకు అలాగే చుట్టుకోండి. దీంతో మీ జుట్టుకు ఎక్స్ ట్రా కండిషనింగ్ వస్తుంది.
ఉసిరి
అన్ని రకాల జుట్టు సమస్యలకు ఉసిరి కాయలు చక్కని విరుగుడు. తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా, పొడవుగా, నిగారింపు సంతరించుకునేలా మీ జుట్టుకు అవసరమైన పోషణ ఇచ్చే ఆమ్లా కుదుళ్లను గట్టిపరుస్తుంది. పరగడపున రోజూ ఉసిరికాయలు తినండి. అదేంటి ఏడాదిపొడవునా ఇవి దొరకవు కదా అనుకోకండి, ఎండబెట్టిన ఉసిరి ముక్కలు, లేదా ఉసిరి మురబ్బా వంటివి మీరు నిల్వచేసుకుని క్రమం తప్పకుండా తినండి. లేదా ఉసిరికాయ ఊరగాయను తినండి. సీ విటమిన్ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, సోడియం, మ్యాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో మీ జుట్టు ఆరోగ్యం మరింత పెరుగుతుంది.
కలబంద
కలబందతో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా మీ కురులకు కలబంద జెల్ అప్లై చేసినప్పుడు అవి పట్టులా మెరిస్తాయి. జుట్టు రాలకుండా ఉండేందుకు కలబంద చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మీ తలలో తేమను, పోషకాలను పెంచేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అలోవెరాను రాసి ఓ గంటపాటు వదిలేశాక తలస్నానం చేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు.
రోజూ తలస్నానం వద్దు
కొందరు తలస్నానం చేయకుండా బయటికి కాలు పెట్టరు. ఇంతకీ తలస్నానం ఎన్నిరోజులకు ఒకసారి చేయాలని చాలామంది అడిగే ప్రశ్నకు ఇదమిత్థంగా ఇది అని సమాధానం లేదు కానీ రోజూ తలస్నానం చేస్తే మీ జుట్టుకు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ. అది కూడా నూనె రాయకుండా తలస్నానం అస్సలు చేయద్దు. ఇక షాంపుల్లోని రసాయనాల వల్ల కురులకు ప్రమాదం ఎక్కువ. అందుకే రోజూ షాంపుతో తలస్నానం చేయకండి.
బ్యాలెన్స్డ్ డైట్
సమతులమైన ఆహారం (balanced diet) తీసుకోవటం ద్వారా కురుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పోషకాల లేమితో జుట్టు రాలటం ఎక్కువ అవ్వచ్చు. కంటి నిండా నిద్రపోవటం, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రొటీన్లున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఎక్కువ నూనె పదార్థాలు, కొవ్వు అధికంగా ఉన్న ఫ్యాటీ పుడ్స్ ను తగ్గించి, నీరు ఎక్కువగా తాగండి. వీటన్నింటినీ ఆచరించేందుకు ప్రయత్నించండి. అంతేకాదు మీరు జుట్టును దువ్వుకోవటంలో జాగ్రత్త చూపండి. చాలా సాఫ్ట్ గా ఉన్న దువ్వెనతో, సుతిమెత్తగా దువ్వటం అలవాటు చేసుకోండి.

బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చడంపై KTR సంచలన ప్రకటన

బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చడంపై KTR సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చడానికి కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయని చెప్పారు.

మారింది పేరు మాత్రమే జెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు మారలేదు, తెలంగాణతో మా పేగు బంధం ఎక్కడికి పోలేదని వెల్లడించారు కేటీఆర్. ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ సంచలన అరోపణలు చేశారు. కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడని వెల్లడించారు. వాళ్లు ట్యాపింగ్ చేయట్లేదు అని నిరూపించడానికి లై డిటెక్టర్ పరీక్షకు సిద్దంగా ఉన్నారా.. నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు కేటీఆర్.బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామనడానికి ఇవాళ వరంగల్ ఎంపీ అభ్యర్ధి ఎంపికే నిదర్శనం అన్నారు. వేరే పార్టీ నుండి ఇద్దరు వస్తామన్న 2001 నుండి పార్టీలో ఉండి కష్టపడి, చదువుకున్న, ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పించారు కేసీఆర్ గారు అని చెప్పారు కేటీఆర్.

Crowdfunding: మరణశిక్షను ఎదుర్కొంటున్న డ్రైవర్‌ను రక్షించేందుకు రూ34 కోట్లు సేకరణ

కేరళలో అతిపెద్ద మావనతా కార్యక్రమం మొదలైంది. సౌదీ జైలులో మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్న మలయాళీ అబ్దుల్ రహీమ్ ప్రాణాలను కాపాడేందుకు కదిలింది. గత 18 సంవత్సరాలుగా మరణశిక్షను అనుభవిస్తున్న కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ విడుదల కోసం ఇక్కడి ప్రజలు రూ.34 కోట్లు సేకరించారు.

ఉరిశిక్ష అమలుకు మూడు రోజుల ముందు రహీమ్ విడుదల కోసం యాక్షన్ కమిటీ మొత్తం వసూలు చేసింది. ఈ విషయాన్ని కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. క్రౌడ్ ఫండింగ్‌లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కమిటీ సభ్యులు.

క్రౌడ్ ఫండింగ్ కోసం యాక్షన్ కమిటీ మొబైల్ యాప్ ‘SAVEABDULRAHIM’ని ప్రారంభించింది. యాప్‌తో పాటు, మంచి పనికి సహకరించడానికి భారీ సంఖ్యలో ప్రజలు నేరుగా యాక్షన్ కమిటీని సంప్రదించారు. నాలుగు రోజుల్లోనే రూ.24 కోట్లు సమకూరినట్లు సమాచారం. క్రౌడ్ ఫండింగ్ కార్యాలయంగా వ్యవహరిస్తున్న రహీమ్ ఇంటికి మరింత మంది తరలివస్తున్నారు. అవసరమైన మొత్తాన్ని విజయవంతంగా సేకరించిన తర్వాత, విరాళాలను నిలిపివేయాలని కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

కోజికోడ్‌ ఫరూఖ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్‌ 2006లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. రియాద్‌లో హౌస్-డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ అతని విధుల్లో భాగంగా ఇంటిలో అనారోగ్యంతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలుడి సంరక్షణ చూసుకుంటున్నాడు. పిల్లాడి మెడకు అమర్చిన ప్రత్యేక పరికరం సహయంతో ఆహారం అందిస్తున్నారు. అయితే ఒక రోజు కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ జంక్షన్‌లో రెడ్ సిగ్నల్ పడింది. అయితే సిగ్నల్ జంప్ చేయాలంటూ బాలుడు డ్రైవర్ అబ్దుల్ రహీమ్‌కు సూచించాడు. అందుక నిరాకరించిన అతనిపై ఉమ్మి వేసిన బాలుడు, వాగ్వివాదానికి దిగి దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే అబ్దుల్ రహీమ్‌ చేయి బాలుడికి అమర్చిన పరికరానికి తగిలి ఉడిపోయింది. దీంతో అపస్మారకస్థితికి చేరిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో బాలుడి కుటుంబం క్షమాభిక్ష మంజూరు చేయడానికి నిరాకరించడంతో, హత్యకు సంబంధించి సౌదీ చట్టం ప్రకారం 2018లో మరణశిక్ష విధించింది కోర్టు. అప్పీల్ కోర్టు ఈ తీర్పును 2022లో సమర్థించింది. ఈ నిర్ణయాన్ని తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం ధృవీకరించింది. ప్రస్తుతం, దియా (బ్లడ్ మనీ)ని అంగీకరించేందుకు మరణించిన బాలుడి కుటుంబంతో ఒప్పందం చేసుకున్న తరువాత, రహీమ్ శిక్ష అమలును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంగీకరించిన మొత్తం 15 మిలియన్ సౌదీ రియాల్స్, దాదాపు రూ. 33.24 కోట్లు, ఇది అక్టోబర్ 16, 2023న ఒప్పందంపై సంతకం చేసిన ఆరు నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుందని బాలుడి కుటుంబం అంగీకరించింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 16లోగా ఇక్కడ జమ చేయకపోతే మరణశిక్ష విధిస్తారు. కుమారుడి విడుదల కోసం అబ్దుల్ రహీమ్ వృద్ధ తల్లి వేడుకుంటోంది. 26 ఏళ్ల వయసులో డ్రైవర్‌గా పని చేసేందుకు సౌదీ అరేబియాకు వచ్చాడు.

కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్‌ను మరణం నుండి రక్షించడానికి డెలివరెన్స్ డబ్బును సమీకరించడానికి ప్రతిజ్ఞ చేసిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త బాబీ చెమ్మనూర్, కేరళ అంతటా యాత్రతో నిధుల సేకరణతో గురువారం తన ప్రయత్నాలను కొనసాగించారు. ఈ యాత్ర గురువారం తిరువనంతపురం నుండి కొచ్చి మీదుగా త్రిసూర్‌కు చేరుకుంది. ఉరిశిక్ష అమలుకు మూడు రోజుల ముందు రహీమ్ విడుదల కోసం యాక్షన్ కమిటీ మొత్తం వసూలు చేసింది. ఈ విషయాన్ని కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

అంతరిక్షానికి వెళ్తున్న తొలి తెలుగు వ్యక్తి.. ఎవరీ గోపీచంద్ తోటకూర..

అంతరిక్షంలోకి వెళ్లే తొలి వ్యక్తిగా గోపిచంద్ తోటకూర నిలవనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ మిషన్‌లో అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఆరుగురు సభ్యుల సిబ్బందిలో గోపిచంద్ కూడా ఒక్కరు. ఈ మేరకు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటన చేసింది. 1984లో భారత్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. అయితే న్యూ షెపర్డ్ మిషన్ విజయవంతం అయితే.. అంతరిక్షంలో వెళ్లిన రెండవ భారతీయ పౌరుడిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు.
అంతరిక్షంలోకి వెళ్లే తొలి వ్యక్తిగా గోపిచంద్ తోటకూర నిలవనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ మిషన్‌లో అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఆరుగురు సభ్యుల సిబ్బందిలో గోపిచంద్ కూడా ఒక్కరు. ఈ మేరకు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటన చేసింది. 1984లో భారత్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. అయితే న్యూ షెపర్డ్ మిషన్ విజయవంతం అయితే.. అంతరిక్షంలో వెళ్లిన రెండవ భారతీయ పౌరుడిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన భారతదేశ మొదటి పౌర వ్యోమగామిగా నిలవనున్నారు.
వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ కూడా అంతరిక్ష ప్రయాణాలు చేసినప్పటికీ.. వారంతా భారత సంతతికి చెందిన యూఎస్ పౌరులు. అయితే గోపిచంద్ తోటకూర విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం యూఎస్‌లో ఉంటున్నప్పటికీ ఇండియన్ పాస్‌పోర్టును కలిగి ఉన్నారు. అయితే న్యూ షెపర్డ్ మిషన్‌ను ప్రారంభించే తేదీని బ్లూ ఆరిజిన్ సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ రాబోయే కొద్ది వారాల్లో దీనిని చేపట్టే అవకాశం ఉంది.
విజయవాడకు చెందినవాడే..
గోపిచంద్ తోటకూర విజయవాడలో జన్మించారు. అమెరికాలో ఆరోనాటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్‌ జెట్‌ పైలట్‌గా పని చేశారు. ప్రస్తుతం అట్లాంటా శివార్లలో అభివృద్ధి చేయబడుతున్న వెల్నెస్ సెంటర్ అయిన ప్రిజర్వ్ లైఫ్‌కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇది లక్షల డాలర్లతో రూపుదిద్దుకుంటుంది. అయితే గోపిచంద్ తోటకూర అమెరికాలో ఉంటున్నప్పటికీ.. అతని భారతీయ పాస్‌పోర్ట్‌ను నిలుపుకున్నారు.
ఒక పౌరుడిగా అంతరిక్షంలోకి తన ప్రయాణం.. భారతీయ పిల్లలకు వ్యోమగామిగా ఉండాలనే ఆలోచనను మరింత అందుబాటులోకి తెస్తుందని తాను ఆశిస్తున్నట్లు గోపిచంద్ తోటకూర ఈటీకి చెప్పారు. ఎనిమిదేళ్ల వయసులో కేఎల్‌ఎం విమానం కాక్‌పిట్‌ను సందర్శించినప్పటి నుంచి తాను ఏరోస్పేస్ పట్ల ఆకర్షితుడయ్యానని తెలిపారు. గోపిచంద్ తోటకూర.. దాదాపు ఒక దశాబ్దం క్రితం భారతదేశంలో మెడికల్ ఎయిర్-ఎక్యూయేషన్ సర్వీస్‌ను నడిపారు.
ఇక, తాను అంతరిక్ష ప్రయాణం చేయబోతున్నాననే విషయం బ్లూ ఆరిజిన్ అధికారిక ప్రకటన చేసిన తర్వాతనే తన కుటుంబానికి తెలిసిందని గోపిచంద్ తోటకూర చెప్పారు. వారు ఉద్వేగభరితంగా ఉన్నారని తెలిపారు. ఇదిలాఉంటే, బ్లూ ఆరిజిన్ సంస్థ ఆరు మిషన్‌ల ద్వారా మొత్తం 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీరంతా భూమి- అంతరిక్షం మధ్య సరిహద్దు, సముద్ర మట్టానికి 80 నుంచి 100 కి.మీ ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లారు.

Summer Weight Loss Plan: సమ్మర్‌లో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. మీ కోసం అద్భుత చిట్కాలు

Summer Weight Loss Plan: బరువు తగ్గాలనుకునే వారికి వేసవికాలం ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే వ్యాయామం చేసే సమయంలో శరీరం నుండి బయటకు వెళ్లే చెమట ద్వారా బరువు తగ్గుతారు. అంతేకాదు ఎండాకాలంలో కొన్ని ఆహారపదార్థాలు తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయట. సమ్మర్ లో కొన్ని కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలోని ఫ్యాట్ బర్న్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

ముల్లంగి :

వేసవికాలంలో పండ్లతో పాటు కూరగాయలను కూడా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ముల్లంగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముల్లంగిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతేకాదు తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. అంతువల్ల సమ్మర్ డైట్ లో ముల్లంగిని తినడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వాము ఆకులు :

ఎండాకాలంలో బరువును తగ్గించడానికి వాము ఆకులు బాగా సహకరిస్తాయట. కేలరీలు తక్కువగా ఉండే వీటిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుందట. దీనిని సలాడ్స్, సూప్స్ లలో ఉపయోగించుకుని తినాలి.

టమాటాలు :

టమాటల్లోను వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందుల్లో ఉంటే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయి. అందువల్ల సమ్మర్ డైట్ లో టమాటోలను ఉపయోగించడం వల్ల జీవక్రియ రేటును పెంచి బరువును తగ్గిస్తుంది. అంతేకాదు టమాటోలను జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా బరువు తగ్గొచ్చు. ఈ మేరకు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఓ నివేదికను వెల్లడించింది. 12 వారాల పాటు రోజుకు 2 టమాటోలను తినడం వల్ల దాదాపు 0.7 కిలోల మేరకు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయట. టమాటోలు తినడం వల్ల శరీరంలోని చెడు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

క్యారెట్ :

క్యారెట్లు ఆరోగ్యం, చర్మ సౌందర్యంతో పాటు బరువు తగ్గడానకి కూడా తోడ్పడతాయి. క్యారెట్ లో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గించి ఎక్కువ సేపు ఎనర్జీతో ఉండేలా చేస్తుంది.

APPSC Group1 Results-ఏపీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Group1 Prelims Results ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏప్రిల్ 12న రాత్రి ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. గ్రూప్-1 పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గ్రూప్-1 ఫలితాలకు సంబంధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతోపాటు (Selection List) వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురైన అభ్యర్థుల జాబితాను (Rejection List) కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి పేపర్-1, పేపర్-2 తుది ఆన్సర్ కీలకు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్ష నిర్వహించిన 27 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

Provisionally qualified candidates list for mains examination

Rejections list

Final Key: 

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 (84.67 %) మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే మెయిన్ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ప్రాథమిక కీని మార్చి 19న విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్ 12న ఫైనల్ ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏ క్షణంలోనైనా దాడులు.. అన్ని దేశాలు అలర్ట్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ అలుముకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు తెగబడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అప్రతమత్తం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమస్క్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో పలువురు ఇరానీ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గాజాపై దాడిని కూడా ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడులు జరగొచ్చని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా అప్రమత్తం అయింది. ఇరాన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయా దేశాలు తమ పౌరులను అలర్ట్ చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని సూచించాయి. ఫ్రాన్స్, భారత్, రష్యా, పోలాండ్, అమెరికా సహా పలు దేశాలు.. ఇజ్రాయెల్ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. తాము సమాచారం తెలియజేసే వరకూ వెళ్లొద్దని పేర్కొన్నాయి. ఇక తమ పౌరులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.

ఇక ఇజ్రాయెల్‌ను అమెరికా అప్రమత్తం చేస్తూనే.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. ఇరాన్ ఏ క్షణంలోనే దాడులకు పాల్పడొచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేసింది. మరోవైపు జర్మన్ సహా పలు దేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. మరోవైపు గత ఆరు నెలలుగా గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఇంకా యుద్ధం సాగుతూనే ఉంది. మరోవైపు దాడులకు విరామం ప్రకటించాలని ఇజ్రాయెల్‌తో చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉంది. తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగేటట్లు సూచనలు కనిపిస్తున్నాయి.

RBI Signed: ఆర్బీఐ గవర్నర్ సంతకం లేని ఒకే ఒక్క నోటు ఏది..? కారణం ఏమిటి?

నేటి డిజిటల్ యుగంలో కూడా భారతీయ కరెన్సీ అంటే రూపాయిని అందరూ ఉపయోగిస్తున్నారు. దేశంలో ఒక రూపాయి నుండి 500 రూపాయల వరకు కరెన్సీ నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం చెలామణిలో 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు. ఈ నోట్లపై ఎవరు సంతకం చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా మీరు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. ఈ నోట్లన్నింటికీ ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉండదు. ఒక్క రూపాయి నోటు వేరు. దీనిపై ఆర్‌బీఐ గవర్నర్‌కు బదులుగా ఆర్థిక కార్యదర్శి సంతకం చేశారు. దానికి ప్రత్యేక కారణం ఉంది.

నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తారు?

భారతదేశంలో నోట్లకు సంబంధించి 2016లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో కొత్త రూ. 500 నోటు, కొత్త రూ.2,000 నోటును ప్రవేశపెట్టారు. రూ.200 నోటు కూడా వచ్చింది. తదనంతరం మే 2023లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. సెప్టెంబర్ 2023 వరకు చట్టబద్ధమైన టెండర్‌లో ఉంది. ఈ నోట్లన్నింటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం చేశారు. భారతదేశంలో ఈ నోట్లు నాసిక్ (మహారాష్ట్ర), దేవాస్ (మధ్యప్రదేశ్), మైసూర్ (కర్ణాటక), సల్బోని (పశ్చిమ బెంగాల్)లలో ముద్రిస్తారు.

ఒక్క రూపాయి నోటుపై గవర్నర్ సంతకం ఎందుకు లేదు?

ఒక్క రూపాయి నోటు మినహా భారతదేశంలోని అన్ని కరెన్సీ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. కానీ రిజర్వ్ బ్యాంక్ బదులుగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఒకే ఒక్క రూపాయి నోటు. దీని కారణంగా, నోటుపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బదులుగా ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ నోట్లను ప్రింట్ చేసేటప్పుడు, గ్రీన్ కలర్ పేపర్‌ని ఉపయోగిస్తారు.

ఎప్పుడు ఒక్క రూపాయి నోటు వచ్చింది

మొదటి రూపాయి నోటు 1917 నవంబర్ 30న చెలామణిలోకి వచ్చింది. కానీ 1926లో దీని ముద్రణ ఆగిపోయింది. ఆ తర్వాత 1940లో మళ్లీ ముద్రణ ప్రారంభమైంది. ఇది 1994 వరకు ముద్రించబడింది. అయితే ఆ తర్వాత మూతపడింది. 2015లో మళ్లీ ఒక్క రూపాయి నోటు ముద్రణ మొదలైంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ నోట్ల ముద్రణ జరిగింది.

Telangana: ఉద్యోగుల పదవి విరమణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇదిగో క్లారిటీ

ఉద్యోగుల వయోపరిమితి కొత్త విధానంపై వచ్చిన వార్తలపై తెలంగాణ సర్కార్‌ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమి చేయలేదని తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణలో కొత్త నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలు ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఇదిలా ఉండగా, ఉద్యోగుల పదవి విరమణ 33 ఏళ్ల సర్వీస్‌ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పదవీ విరమణ నిబంధనలపై నిర్ణయం తీసుకుంటామని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి రూమర్స్ ను ప్రభుత్వం కొట్టి పారేంది. ఉద్యోగుల పదవీ విరమణ నిబంధనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల వయోపరిమితి కొత్త విధానం పై ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు లేదని తెలిపింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.

success story: ఇడ్లీ, దోశ పిండి అమ్మి రూ.2000 కోట్లకు అధిపతి..

అతని తండ్రి రోజుకు రూ.10 సంపాదించేవాడు. కానీ అతను మాత్రం రూ. 2,000 కోట్ల విలువైన సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు. అతనే ముస్తఫా పీసీ. కఠిక పేదరికం నుంచి వచ్చి వేల కోట్లు సంపాదించిన ముస్తఫా పీసీ జీవితం అందరికి ఆదర్శం. “నా తండ్రి రోజుకు 10 రూపాయలు సంపాదించాడు” అని అతను ది నియాన్ షో పాడ్‌కాస్ట్ హోస్ట్ సిద్ధార్థ అహ్లువాలియాతో చెప్పాడు. ముస్తఫా పీసీ పదేళ్ల వయసులో అతను తన తండ్రికి పొలంలో కట్టెలు సేకరించడం సహాయం చేయడంతో తన పనిని ప్రారంభించాడు.
ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు. కష్టపడి చదివి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందారు. తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువుల దిగ్గజం మోటరోలాతో కొన్నాళ్లు పనిచేశాడు. అతని డిగ్రీ తర్వాత అతను దుబాయ్‌లోని సిటీ బ్యాంక్‌లో ఉద్యోగం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ముస్తఫా ఇండియాకు వచ్చాడు. అంతేకాదు బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు.

బెంగళూరు ఐఐఎంలో చదువుతున్నప్పుడు ముస్తఫా తన బంధువులతో కలిసి దోసె, ఇడ్లీ పిండి తయారీ కంపెనీని ప్రారంభించాడు. ఐడీ ఫ్రెష్ అనే కంపెనీ 2005లో రూ. 50,000 సీడ్ క్యాపిటల్‌తో ప్రారంభించాడు. మొదట్ల వారి బిజినెస్ చాలా నెమ్మదిగా సాగింది. అయినా వారి ప్రయత్నం మాత్రం ఆపలేదు. ప్రారంభంలో వారి కంపెనీ రోజుకు కేవలం 10 ప్యాకెట్ల పిండిని విక్రయించేది. కానీ క్రమంగా వారి బిజినెస్ పెరిగింది. వారి బిజినెస్ 10 ప్యాకెట్ల నుంచి 10 వేల ప్యాకెట్లకు చేరుకుంది. నేడు కంపెనీ రూ. 479 కోట్ల వార్షిక లాభంతో హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్ దిగ్గజంగా ఎదిగింది. ముస్తఫా సరసమైన ధరకు తాజాగా ఇంట్లో తయారు చేసిన & వండడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల అమ్ముతున్నారు. ఐడీ ప్రెష్ దేశంలో ప్రముఖ బ్రాండ్ గా ఎదిగింది. తన కంపెనీతో పాటు ముస్తఫా పీసీ కూడా వ్యాపారవేత్తగా ఎదిగారు.

ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ఇద్దరి పరిస్థితి విషమం!

ఇటీవల యువత చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పేరెంట్స్ మొబైల్ కొనివ్వలేదని, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారని, మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు.
ఇకపోతే నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల రాకతో పలువురు ఇళ్లలో విషాదాన్ని నింపాయి. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన అనే విద్యార్థి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యిందని.. మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అలాగే చిత్తూరు జిల్లాలోని శాంతిపురంలోని గాయత్రి అనే విద్యార్థి, రామకుప్పంలో మిత్ర అనే అమ్మాయి పురుగులమందు తాగారు. అర్చన మరణించగా.. ప్రస్తుతం మిత్ర, గాయత్రి పరిస్థితి విషమంగా ఉంది.

ఎలాంటి మందులు వాడకుండా బీపీ తగ్గించే చిట్కాలు.. డాక్టర్‌తో అవసరమే ఉండదు..!

జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటివి ప్రస్తుతం యువతకు కూడా కామన్‌గా వస్తున్నాయి.

హై బీపీ వస్తే, రక్తపోటును కంట్రోల్ చేసే మందులు వాడాలి. కానీ ఎక్కువ కాలం మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అయితే ఎలాంటి మెడిసిన్ వాడకుండానే అధిక రక్తపోటును అదుపులో ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి.

అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అంటే రక్తపోటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం. హై బీపీ ఎక్కువ కాలం కొనసాగితే గుండె ధమనులు దెబ్బతింటాయి. దీంతో గుండె ఆగిపోవడం, పక్షవాతం, మూత్రపిండాల్లో రాళ్లు, కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడు పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. మాయో క్లినిక్ ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవనశైలితో బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందుకు లైఫ్‌స్టైల్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోండి.

* ఉప్పు వద్దు

ఉప్పు అధిక రక్తపోటుకు కారణమవుతుంది. తినే ఆహారంలో ఉండే సోడియం, ఇతర లవణాలు రక్తం సరఫరా అయ్యే ట్యూబ్స్‌లో పేరుకుపోయి గుండెపై ఒత్తిడి పెంచుతాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అందుకే ఉప్పు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.

* రెగ్యులర్‌గా వర్కౌట్స్

రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ లేదా శారీరక శ్రమ చేస్తే అధిక రక్తపోటు సైతం తగ్గుతుంది. ఇది దాదాపు 5 నుంచి 8 mm Hg వరకు తగ్గే వీలు ఉంటుంది. రక్తపోటు మళ్లీ పెరగకుండా ఉండాలంటే, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం కొనసాగించాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది.

* వెయిట్ మేనేజ్‌మెంట్

హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తే రక్తంలో షుగర్ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు కాస్త బరువు తగ్గినా రక్తపోటు తగ్గుతుంది. అందుకే మందులు వాడటానికి బదులు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

* హెల్తీ డైట్

హై బీపీతో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లో ఫ్యాట్ డెయిరీ ప్రొడక్ట్స్, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుకు చెక్ పెడతాయి.

* కంటినిండా నిద్ర

మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలకం. రాత్రి నిద్ర సమయాల్లో శరీర కణాల మరమ్మతు జరుగుతుంది. దీంతో ఉదయం రీఫ్రెష్‌గా, ఉల్లాసంగా ఉంటారు. సరైన నిద్ర రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే రోజూ కనీసం ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో మంచి నిద్ర పోవడానికి శరీరంలో అవసరమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

Professor Alok Sagar: ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..వదిలి… ఇలా…

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ డిగ్రీలు చేశాడు. అతడి వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నతాధికారులగా పనిచేస్తున్నారు. అతడి పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
అయినా వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అత్యంత సాదాసీదాగా జీవితం గడుపుతాడు. ప్రజల సేవ పరమావధిగా భావించే మహోన్నత వ్యక్తి ప్రోఫెసర్‌ అలోక్‌ సాగర్‌. అతడెవరూ? అతని నేపథ్యం ఏంటంటే..

అలోక్‌ సాగర్‌ ఐఐటీ ఢిల్లీ గ్య్రాడ్యేయేట్‌, ఎన్నో మాస్టర్స్‌ డిట్రీలు చేసిన వ్యక్తి. పైగా యూఎస్‌ఏలోని టెక్సాస్‌లో హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ కూడా చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన కొన్నాళ్లు ఐఐటీ ఢిల్లీలో మాజీ ప్రోఫెసర్‌గా పనిచేశారు అలోక్‌ సాగర్‌. అంతేగాదు ఐఐటీ ఢిల్లీలో ప్రోఫెసర్‌గా పాఠాలు బోధిస్తున్నప్పుడూ అలోక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ వంటి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాడు. ఏమయ్యిందో ఏమో సడెన్‌గా ప్రోఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి అలోక్‌ మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలోని కోచాము గ్రామానికి వచ్చి నివశించడం ప్రారంభించారు.

ఆ గ్రామంలో సరైన రోడ్డు సదుపాయాలు, కరెంట్‌ సౌకర్యం వంటివి ఏమీలేవు. అయినప్పటికీ అక్కడే ఉండి స్థానిక గిరిజనుల మాండలికాన్ని నేర్చుకున్నారు. వారి జీవన విధానాన్ని స్వీకరించారు. గిరిజనులు ప్రకృతితో మంచి సంబంధం కలిగి ఉన్నవారని ప్రగాఢంగా నమ్ముతారు అలోక్‌. అందుకోసమే ఆయన గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అంతేగాదు ప్రొఫెసర్‌ అలోక్‌ పేరుమీద ఢిల్లీలో కోట్ల ఆస్తులున్నా వాటన్నింటి త్యజించి గిరిజనుల కోసం పాటు పడ్డారు. ఆయన తల్లి మిరాండా హౌస్‌ డిల్లీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ తండ్రి ఇండియన్‌ రెవెన్నయూ సర్వీస్‌ అధికారి, తమ్ముడు ఐఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్యావంతుడు అయ్యి ఉండి గిరిజనుల కోసం అని ఓ పూరింటిలో జీవించడం, కేవలం మూడు కుర్తాలతో ఉండటం అంత ఈజీ కాదు.

చాలామంది ఉన్నత విద్యావంతులు సేవ చేస్తామంటూరు గానీ ఇలా వారి జీవన విధానం స్వీకరించి మరీ సంక్షేమం కోసం పాటుపడరు. కానీ అలోక్‌ అలా కాదు గిరిజన జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పాటుపడ్డారు. అంతేగాదు ఆ గ్రామంలో పయనించేందుకు కూడా ఓ సాదారణ సైకిల్‌నే వినియోగిస్తారు. అలాగే పర్యావరణానికి తోడ్పడేందుకు దాదాపు 50 వేలకు పైగా చెట్లను నాటారు. దీంతోపాటు గ్రామాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటూ పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీట్లరు సైకిల్‌పై ‍ప్రయాణించి మరీ ఇస్తారు.

ఆయన చాలామంది డిగ్రీలు చేసి స్టేటస్‌ చూపించుకోవడం, ఆస్తులు సంపాదించే పనిలోనే ఉన్నారు. సమాజ సేవ కోసం తమ వంతుగా ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదని ఆశోక్‌ బాధగా అన్నారు. ఇక ఆయాన దాదాపు 78 విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలరు. ఆయన చేస్తున్న సమాజ సేవ చూసి ఆ జిల్లా అధికారులు, గ్రామాధికారులు నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడేమోనన్న భయంతో ఈ ఊరి వదిలి వెళ్లిపోమనడంతో..ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. తన వివరాలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయాయి. ఈ విషయం వార్తల్లో హైలెట్‌ అయ్యింది కూడా. చివరికి ఆయన చెప్పిందంతా నిజమేనని తేలింది. ఐఐటీ ప్రొఫెసర్‌ స్థాయి అయ్యి ఉండి కూడా కించెత్తు నామోషి లేకుండా ఓ మారుమూల ప్రాంతంలోని గిరిజనుల కోసం పాటుపడటం వారితో కలిసి జీవించడం నిజంగా గ్రేట్‌ కదూ. ఇలా మరెవ్వరూ చేయరేమో.!గిరిజనుల సంక్షేమం కోసం వచ్చిన ‘శ్రీమంతడు’ ‍‍ప్రొఫెసర్‌ అలోక్‌ సాగర్‌..!

బ్లడ్‌ షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకోవాలి.? నిపుణులు ఏమంటున్నారు..

ప్రస్తుతం డయాబటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వీలైనంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందుకే క్రమంతప్పకుండా బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ను చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ ఎప్పుడు చేసుకోవాలి.? ఏ సమయంలో చేసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి ఆహారం తీసుకోక ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడాన్ని ఉత్తమ సమయంగా నిపుణులు చెబుతుంటారు. ఉదయం నిద్ర మేల్కొన్న తర్వాత మొదట రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

* అలాగే భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సరైన ఫలితం తెలుస్తుంది.

* ఇక ఆహారం తీసుకునే ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడం బెస్ట్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్‌ మోతాదు తీసుకోవడంలో సహాయపడుతుంది.
* * అధిక దాహం, అలసట, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్లడ్‌ టెస్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇక వ్యాయామం చేసే ముందు తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్‌ చేయించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని సరిగ్గా అంచనా వేయొచ్చు.

* ఇక తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయి 80-130 mg/dL ఉండాలి అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో, ఆహారం తిన్న 1-2 గంటల తర్వాత 180 mg/dL కంటే తక్కువగా ఉండాలి.

Walking Mistake: రోజూ నడిచినా షుగర్, బరువు తగ్గలేదా? ఈ 5 తప్పులు చేయకండి!

చెమట పట్టకుండా బరువు తగ్గడానికి మార్గం లేదు. జిమ్‌లో అయినా లేదా ఇంట్లో అయినా కనీసం కొంచెం వ్యాయామం చేయండి. కానీ చాలా మందికి వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయడం కష్టంగా ఉంటుంది. అతనికి ఎక్కువసేపు వ్యాయామం చేసే అలవాటు లేకపోతే అదనంగా, వయస్సుతో పాటు వ్యాధి-బాధలు కూడా పెరుగుతాయి. అక్కడ వ్యాయామం ప్రతికూలంగా ఉంటుంది. అలాంటప్పుడు చెమటను వ్యాప్తి చేయడానికి ఏకైక మార్గం నడక. రోజూ క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కానీ సరైన మార్గంలో నడవడం చాలా ముఖ్యం. లేదంటే ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. గుండెకు ఉత్తమమైన వ్యాయామం నడక. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎనర్జీ లెవెల్స్‌ని కూడా పెంచుతుంది. అలాగే అధిక బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దాంతో ఒత్తిడిని దూరం చేస్తుంది. రోజుకు కనీసం 30-45 నిమిషాలు నడవడం వల్ల మీ జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. అయితే నడక కోసం కొన్ని నియమాలు పాటించాలి. రోజురోజుకూ తప్పుడు మార్గంలో నడిచినా ప్రయోజనం లేకుంటే ప్రమాదమే. నడుము, కాలు, వెన్ను సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి సరైన నడక నియమాలను తెలుసుకోండి.

నడుస్తున్నప్పుడు పాదాలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి. దీని కారణంగా, ఎముకలు, కండరాలు తమ విధులను నిర్వహించడానికి తగినంత సమయం లభించవు. నెమ్మదిగా నడవండి.
సరైన నడక భంగిమను నిర్వహించండి. వెన్ను నిటారుగా, భుజాలు సడలించి వేగంగా నడవండి. రిలాక్స్డ్ మూడ్‌లో నడవండి.
నడవడానికి తగిన బూట్లు ఎంచుకోండి. సరికాని బూట్లు పాదాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. పాదాల సమస్యలను నివారించడానికి, నడవడానికి ఇబ్బంది పడటానికి, సౌకర్యవంతమైన బూట్లు కొనండి. మార్కెట్లో వివిధ రకాల వాకింగ్, రన్నింగ్ షూలు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించవచ్చు.
ఈ వేడిలో నడుస్తున్నప్పుడు మీకు చెమట పడుతుంది. అయితే మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం మీ బాధ్యత. లేదంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గి అలసట ఏర్పడవచ్చు. వాకింగ్‌కు వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ని వెంట తీసుకెళ్లండి. మీరు వీధికి వెళ్లి క్యాన్డ్ వాటర్ తాగవచ్చు.
ఒత్తిడితో నడవకండి. మీ ఆలోచనలను పక్కన పెట్టండి. నడక కోసం వెళ్ళండి.
(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ లోనే 108MP కెమెరాతో..

స్మార్ట్ ఫోన్ అనేది అవసరం నుంచి అత్యవసరంగా మారిపోయింది. ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకపోతే లైఫే లేదు అనే పరిస్థితి వచ్చేసింది. కొన్ని కొన్ని జాబ్స్ కి కూడా స్మార్ట్ ఫోన్ తప్పకుండా కావాల్సిన పరిస్థితి అయిపోయింది. అందులోనూ స్మార్ట్ ఫోన్ అంటే 5జీ అనే పరిస్థతి ఉంది. అయితే 5జీ స్మార్ట్ ఫోన్ అంటే కచ్చితంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈమధ్య కొన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నా కూడా వాటిలో అన్నీ ఫీచర్స్ ఉండటం లేదు. ముఖ్యంగా కెమెరా చాలా తక్కువ ఉంటోంది. కానీ, ఇప్పుడు ఒక కంపెనీ ఏకంగా 108 మెగా పిక్సల్ కెమెరా సామర్థ్యం ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ రేంజ్ లోకి తీసుకొచ్చింది.

ఇప్పుడు చెప్పుకుంటున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది ఇన్ఫినిక్స్ కంపెనీ. వాళ్లు తాజాగా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ అనే స్మార్ట్ ఫోన్ బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు. ఆ ఫోన్ 108 మెగా పిక్సల్ కెమెరా సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో మొత్తం రెండు వేరియంట్స్ ని తీసుకొస్తున్నారు. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్ 40 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.78 ఫుల్ హెచ్ డీ+ కర్వ్డ్ డిస్ ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంది. అంటే ఎండలో ఇబ్బంది లేకుండానే ఉంటుంది. ఇందులో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్ లో హైలెట్ ఫీచర్ 108 ఎంపీ మెయిన్ కెమెరా, 32 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ 2 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ తో 2కేలో వీడియో రికార్డింగ్ చేయచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఎమ్మార్పీ రూ.27,999 కాగా రూ.6 వేలు డిస్కౌంట్ తో రూ.21,999కే అందిస్తున్నారు.

దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ ఛేంజ్ బోనస్లు కూడా ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డులు కలిగి ఉంటే అదనంగా రూ.2 వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ ఫోన్ ని మీరు కేవలం రూ.19,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ స్పెసిఫికేషన్స్, ఈ ధరలో 108 ఎంపీ ఓఐఎస్ కెమెరా ఫోన్ అంటే బెస్ట్ ఆప్షన్ గా టెక్ నిపుణులు కూడా చెప్తున్నారు

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్..

TS Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తైనట్లు సమాచారం. ఇక మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలో ఈనెల 20 తేదీ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

పరిశీలన ప్రక్రియ పూర్తైన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు హాజర్యయారు. ఇక మార్చి 10వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు.

ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పరీక్ష ఫలితాలను అతి త్వరగా వెల్లడించాలని బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. జవాబు పత్రాల మూత్యాంకన ప్రక్రియ నాలుగు దశల్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఒక దశ మూల్యాంకనం పూర్తైంది. ఇక మిగతా మూడు దశల వాల్యుయేషన్ ప్రక్రియను బోర్డు ఈనెలాఖరులోపు పూర్తి చేయనుంది. ఇది పూర్తి చేయడానికి ఈనెల 20వ తేదీ వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఏపీ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.

తెలుగు పంచాంగం ,నేడు శుభ , అశుభ ముహుర్తాలివే…నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (13/04/24)

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని పంచమి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని పంచమి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…


మిధునంలో చంద్రుడి సంచారం..
రాష్ట్రీయ మితి ఛైత్ర 24, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, పంచమి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 03, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 13 ఏప్రిల్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. ఈరోజు పంచమి తిథి మధ్యాహ్నం 12:05 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్టి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:49 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున
రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:28 గంటల నుంచి ఉదయం 5:13 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:21 గంటల వరకు
నిశిత కాలం : రాత్రి 11:59 గంటల నుంచి రాత్రి 12:44 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:45 గంటల నుంచి సాయంత్రం 7:07 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 7:33 గంటల నుంచి ఉదయం 9:09 గంటల వరకు
సూర్యోదయం సమయం 13 ఏప్రిల్ 2024 : ఉదయం 5:58 గంటలకు
సూర్యాస్తమయం సమయం 13 ఏప్రిల్ 2024: సాయంత్రం 6:45 గంటలకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహు కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
యమ గండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 5:58 గంటల నుంచి ఉదయం 6:49 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు కోతులకు నల్ల శనగలు తినిపించాలి.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (13/04/24)

 

మేషం

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం పఠించాలి.

వృషభం
జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది. చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

మిథునం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొంత మంది వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

కర్కాటకం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో ఆత్మస్థైర్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించడం మంచిది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహం
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.

కన్య
అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

తుల
మీ కృషి ఫలిస్తుంది. మీ పనితీరుకు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితాదేవి స్తుతి మేలు చేస్తుంది.

వృశ్చికం
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ధనుస్సు
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగడానికి విష్ణు ధ్యానం శుభప్రదం.

మకరం
చేపట్టే పనుల్లో అలసత్యం ఉండకూడదు. ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

కుంభం
ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవనామాన్ని జపించడం మేలు చేస్తుంది.

మీనం
మానసిక సౌఖ్యం ఉంటుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయొద్దు. గోసేవ చేయాలి.

CCE Marks Entry | SA 2 Marks Entry Link Enabled SA 2 మార్కులు నమోదు చేయడానికి లింక్ ఎనేబుల్ చేశారు….

HOW TO ENTER SA- 2 MARKS OPNLINE

స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు లో స్కూల్ DISE కోడ్ తో లాగిన్ అవ్వాలి
CSE మర్క్స్ ఆన్లైన్ ట్యాబు ఎంచుకుని దానిలో కల SA-2 మర్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఎంచుకోవాలి
క్లాస్ మరియు అకాడమిక్ ఇయర్ ఎంచుకోవాలి
లాంగ్వేజ్ మరియు subject ఎంచుకోవాలి
తరగతి వారి విద్యార్థుల లిస్ట్ కనబడుతుంది.
ఒక్కక్కరి మర్క్స్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి

Direct link to enter SA -2 marks

https://studentinfo.ap.gov.in/

Rain In AP: ఏపీలో జిల్లాల్లో భారీ వానలు..!

ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలో మాడు పగిలే ఎండలతో జనాలు విలవిల్లాడుతున్నారు. మండే ఎండలకు తోడు.. వడగాలులు వీస్తుండటంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏసీ, ఫ్రిజ్జులు కూడా వేసవి తాపాన్ని తీర్చలేకపోతున్నాయి. మరో రెండు నెలల పాటు ఎండలను ఎలా భరించాలా అని జనాలు భయపడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రెండు రోజుల క్రితం వర్షాలు పడనున్నాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు కురిశాయి.

గత రెండు మూడు రోజుల క్రితం వరకు కూడా సూర్యుడు తన ఓ రేంజ్ లో తన ప్రతాపం చూపించారు. నిన్నటి నుంచి కాస్తా వాతావరణం చల్లబడింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయితే గుంటూరు జిల్లాలో శుక్రవారం అకాస వర్షం సంభవించింది. పల్నాడు, గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా భారీ వానాలు కురిశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు,మేడికొండతో పాటు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ భారీ వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.

ఈ క్రమంలో 13వ రోజు బస్సుయాత్రలో భాగంగా ఏటుకూరు వద్ద జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణం చేరుకున్నారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా వాన కురిసి.. ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారింది. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారటంతో ప్రజలు కాసేపు ఇబ్బంది పడ్డారు. కాగా, గత కొంత కాలంగా విపరీతమైన ఎండలు, వేడి గాలుల వల్ల ఇబ్బందిపడుతున్న జనానికి ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే ఇదే సమయంలో అకస్మాత్తుగా వానాలు కురవడంతో మిర్చి రైతులు ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లోని మిరప పంట వర్షానికి తడిసింది. మొత్తంగా చాలా రోజులుగా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరో రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది.

నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ. 80లక్షలు చెల్లించారట. మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ, రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారట. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కి కవితే రూ.100కోట్లు చెల్లించారని సీబీఐ తెలిపింది. అలా

ఇండో స్పిరిట్స్‌లో 65శాతం వాటా పొందారట. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారట. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడట. ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని.. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.

కోల్‌క‌తా నుంచి లండ‌న్‌కు బ‌స్సు ప్ర‌యాణం.. టిక్కెట్ ధ‌ర ఎంతో తెలుసా..?

ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్ర‌యాణించాలంటే క‌చ్చితంగా విమానాల్లో వెళ్లాల్సిందే. మ‌రొక ప్ర‌త్యామ్నాయం లేదు. కానీ స‌ముద్ర తీర ప్రాంతం ఉండే దేశాల‌కు అయితే షిప్‌లలోనూ వెళ్ల‌వ‌చ్చు. గ‌తంలో విమానాలు లేని స‌మ‌యంలో పెద్ద పెద్ద ఓడ‌ల ద్వారానే రోజుల త‌ర‌బ‌డి ఒక దేశం నుంచి మ‌రొక దేశానికి ప్ర‌యాణం చేసేవారు. అయితే మీకు తెలుసా..? 1950ల‌లో లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు బ‌స్సుల‌ను న‌డిపారు. అవును నిజ‌మే. మ‌రి ఆ వివ‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1957లో ఆల్బ‌ర్ట్ ట్రావెల్స్ అనేక కంపెనీ వారు లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు, ఆస్ట్రేలియాకు బ‌స్సుల‌ను న‌డిపారు. అయితే 1957వ సంవ‌త్స‌రం ఏప్రిల్ 15వ తేదీన లండ‌న్ నుంచి తొలిసారిగా కోల్‌క‌తాకు ఓ బ‌స్సు బ‌య‌ల్దేరింది. అందులో 20 మంది ప్ర‌యాణించారు. లండ‌న్‌లోని విక్టోరియా కోచ్ స్టేష‌న్ వ‌ద్ద వారు ఆ బ‌స్సు ఎక్కారు. టిక్కెట్ ధ‌ర అప్ప‌ట్లో 145 పౌండ్లు (దాదాపుగా రూ.13,644) ఉండేది. 5 రోజుల పాటు ఆ బ‌స్సు ప్ర‌యాణం చేసి లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆ రూట్‌లో అప్ప‌ట్లో మొత్తం 15 బ‌స్సుల‌ను ఆల్బ‌ర్ట్ ట్రావెల్స్ కంపెనీ న‌డిపింది.

ఇక లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చే బ‌స్సులు లండ‌న్‌, బెల్జియం, ప‌శ్చిమ జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బ‌ల్గేరియా, ట‌ర్కీ, ఇరాన్‌, ఆఫ్గ‌నిస్థాన్‌, వెస్ట్ పాకిస్థాన్ ల మీదుగా ఇండియాకు చేరుకునేవి. ఇండియాలో బ‌స్సులు ఢిల్లీ, ఆగ్రా, అల‌హాబాద్‌, బ‌నార‌స్ మీదుగా ప్ర‌యాణించి కోల్‌క‌తాకు చేరుకునేవి. అయితే అప్ప‌ట్లో తొలిసారిగా ఆ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసిన వారి ఫొటోలు ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు నిజ‌మా, కాదా అని వెరిఫై చేస్తే.. అవి నిజ‌మేన‌ని తేలింది. కాగా త్వ‌ర‌లోనే మ‌ళ్లీ అదే త‌ర‌హాలో లండ‌న్ నుంచి కోల్‌క‌తాకు బ‌స్సుల‌ను తిప్పుతార‌ని ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌చారం అవుతోంది. టిక్కెట్ ధ‌ర రూ.15 ల‌క్ష‌లు ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌లు నిజం అవుతాయో, కావో చూడాలి.

ఇది ఐపీఎల్లా?.. కర్రా బిల్లా?.. దినేష్ కార్తీక్ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు… దినేష్ షాట్స్ చూడండి….

ఐపీఎల్ అంటే దూకుడుకు పర్యాయపదం. వేగానికి ప్రతిపదార్థం.. ఎంత ధాటిగా ఆడితే జట్టుకు అంత స్కోరు లభిస్తుంది. ఎంత స్కోరు లభిస్తే విజయానికి అంత దగ్గరవుతుంది.
అందుకే టి20ల్లో ఆటగాళ్లు ధనా ధన్ ఇన్నింగ్స్ కు ప్రాధాన్యమిస్తారు. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, గేల్, రోహిత్ శర్మ వంటి వారు పంచ్ హిట్టర్లు గా పేరు పొందారంటే కారణం వారి దూకుడైన ఆట తీరే. ఈ జాబితాలో బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ పూర్తి విభిన్నం. ఒళ్ళును విల్లులాగా ఉంచి ఆడతాడు. 360 డిగ్రీలు కాదు.. 720 డిగ్రీల్లోనూ బ్యాటింగ్ చేస్తాడు. గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అలాంటి ఆట తీరు ప్రదర్శించి అలరించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు షాట్లు అలానే ఆడి పరుగులు పిండుకున్నాడు.

ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా తొలి వికెట్ కు మెరుపు ఆరంభం లభించలేదు. జాక్స్ (8), మాక్స్ వెల్(0) , లామ్రోర్(0), సౌరవ్ చౌహన్ (9) వంటి వారు పూర్తిగా నిరాశపరిచారు.. కెప్టెన్ డూ ప్లెసిస్(61), రజత్ పాటిదార్(50), దినేష్ కార్తీక్ (55 ) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 196 రన్స్ స్కోర్ చేయగలిగింది.

అయితే ఈ మ్యాచ్లో మాక్స్ వెల్ అవుట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనదైన ఆట తీరుతో అలరించాడు. దూకుడుకు అసలు సిసలైన పర్యాయపదంలాగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 55 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడి బ్యాటింగ్ తీరుతో బెంగళూరు 196 పరుగుల స్కోర్ చేసింది. ముఖ్యంగా 16 ఓవర్లో అతడు ఆడిన ఆట ఈ మ్యాచ్ మొత్తానికే హైలెట్.

16 వ ఓవర్ ను ఆకాష్ వేశాడు..తొలి బంతి వైడ్ గా వెళ్ళింది. మరుసటి బంతిని డూ ప్లెసిస్ సింగిల్ తీసి దినేష్ కార్తీక్ స్ట్రైక్ ఇచ్చాడు. ఇక అప్పటినుంచి మొదలైంది దినేష్ కార్తీక్ మాయాజాలం. రెండో బంతిని ఆకాష్ ఫుల్ టాస్ వేయగా.. జస్ట్ బ్యాట్ వంచి దినేష్ ఆడాడు.. ఆ బంతి నేరుగా ఒక స్టెప్ తీసుకొని బౌండరీ దాటింది. మరుసటి బంతిని ఆకాష్ డాట్ బాల్ గా వేశాడు. ఇంకో బంతిని ఫుల్ టాస్ వేయగా దినేష్ కార్తీక్ సేమ్ అలానే బ్యాట్ వంచి ఆడాడు. అది కూడా బౌండరీ దాటింది. మరుసటి బంతిని కూడా అలాగే వేయడంతో దినేష్ కార్తీక్ ఈసారి మరింత విభిన్నంగా బ్యాట్ తిప్పి కొట్టాడు. ఫలితంగా బంతి ఫోర్ వెళ్లింది. ఒత్తిడిలో ఆకాష్ ఆరో బంతిని వేసే క్రమంలో అది వైడ్ వెళ్ళింది. ఆ తర్వాత బంతిని నేరుగా యార్కర్ వేస్తే.. దానిని కూడా దినేష్ ఫోర్ గా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్లో బెంగళూరు జట్టుకు 19 పరుగులు లభించాయి. చివరి ఓవర్ లోనూ దినేష్ కార్తీక్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 19 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ కూడా ఆకాశ్ వేయడం విశేషం.

PF Account: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ అకౌంట్‌పై కీలక నిర్ణయం..ఇక డబ్బు ఆటోమేటిక్‌గా బదిలీ

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ​​ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ ఈపీఎఫ్‌వో ​​బ్యాలెన్స్‌ను దానితో పాటు బదిలీ చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది.

చాలా సార్లు ఈపీఎఫ్‌వో ​​బ్యాలెన్స్ నెలల తరబడి బదిలీ కాదు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ​​ఖాతాదారులు ఉద్యోగాలు మారినప్పుడు మాన్యువల్‌గా పీఎఫ్‌ అకౌంట్‌ బదిలీ కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌వో ఆటోమేటిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ కోసం ఉద్యోగులు రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉండగా ఇప్పుడు అలాంటిదేమి లేదు. దీంతో ఉద్యోగులకు మరింత సులభతరమైంది.

ఇప్పుడు ఉద్యోగస్తులు ఈ ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన అవసరం ఉండకుండా కొత్త ఉద్యోగం కోసం వెతకవచ్చు. కొత్త ఉద్యోగం మారినప్పుడు EPF ఖాతాలోని డబ్బు స్వయంచాలకంగా బదిలీ అవుతుంది. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తించుకోవాలి. పీఎఫ్‌ అకౌంట్‌ బదిలీ కావాలంటే ఉద్యోగులు తమ జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్‌లో ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా, యజమాని కూడా ఉద్యోగి తరపున సమాన మొత్తాన్ని ఈపీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్ చేయాలి.

పీఎఫ్‌ ఆన్‌లైన్ బదిలీకి యూఏఎన్‌ ఎందుకు అవసరం?

యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది ఒక వ్యక్తికి పీఎఫ్‌ నుంచి ఇచ్చే అకౌంట్‌ నంబర్‌. ఈ ఐడీ ఒకసారి తీసుకుంటే ఎన్ని ఉద్యోగాలు మారినా ఇదే ఉంటుంది. ఎక్కువ ఈపీఎఫ్‌ ఖాతాలను ఒకే సభ్యునికి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.

UAN అనేక రకాల సేవలు:

యూఏఎన్‌ నంబర్‌ వివిధ రకాల సేవలను అందిస్తుంది. ఇందులో UAN కార్డ్, అన్ని బదిలీ-ఇన్ వివరాలతో అప్‌డేట్‌ అయిన పీఎఫ్‌ పాస్‌బుక్, మునుపటి సభ్యుల పీఎఫ్‌ ఐడీని ప్రస్తుత పీఎఫ్‌ ఐడీతో లింక్ అయి ఉంటుంది. ​సహకారాల క్రెడిట్‌కు సంబంధించి నెలవారీ SMS నోటిఫికేషన్‌లు ఉంటాయి.

Breaking:చంద్రబాబు,లోకేష్‌కు కొత్త టెన్షన్..హైకోర్టు కీలక నిర్ణయం?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో నామినేషన్ తేదీలు కూడా వెల్లడించారు. ఈసారి ఎన్నికలు ఏపీలో కొత్త చరిత్రను సృష్టించబోతాయా అన్నట్టు పోటీపోటీగా ఉంది. సీఎం జగన్ గెలుపే లక్ష్యంగా ప్రచారం జోరు పెంచారు. వైసీపీని ఎలాగైనా ఓడించే లక్ష్యంతో అటు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయే పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణకు టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే..నామినేషన్‌కు సమయం దగ్గరపడుతోంది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా కచ్చితంగా నామినేషన్‌లో భాగంగా తమపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడైనా తేడా వచ్చినా, తమకు తెలిసి, తెలియక ఎక్కడైనా కేసులు నమోదైన ఆ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. లేకపోతే పరిశీలనలో వారి నామినేషన్లు తిరస్కరిస్తారు. అయితే ఈ విషయంలో వారిపై రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని కోరుతున్నా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని వీరు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా రాకపోవడంతో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు వీరికి కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తుంది.

OnePlus Mobiles: దేశంలో One Plus ఫోన్ల్ అమ్మకాలు బంద్.. మే 1 నుంచే.. ఎందుకంటే..

భారతదేశంలోని రిటైల్ చైన్‌లు మే 1 నుంచి చైనాకు చెందిన ప్రసిద్ధ వన్‌ప్లస్ బ్రాండ్ మెుబైల్ పరికరాల అమ్మకాలను నిలిపివేయనున్నాయి. కంపెనీకి, రిటైలర్లకు మధ్య తలెత్తిన వివాదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రకారం దేశంలోని OnePlus ఉత్పత్తులపై స్థిరంగా తక్కువ లాభాల మార్జిన్‌లు రిటైలర్‌లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం సవాలుగా మార్చాయని చెబుతున్నారు.
వీటికి తోడు వారంటీ, సర్వీస్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో నిరంతరం జాప్యంతో పాటు సంక్లిష్టతల కారణంగా వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నట్లు ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ పేర్కొంది. వీటిని వాటిని పరిష్కరించడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ వారి భారం పెరిగిందని వారు చెబుతున్నారు. దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కొన్ని ప్రధాన ఫలిత మార్కెట్లలో నిషేధం వర్తిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇవి ప్రభావవంతమైన, ఆర్థికంగా పెద్ద రాష్ట్రాలు కావటం గమనార్హం. అందువల్ల మొబైల్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లతో సహా అన్ని OnePlus పరికరాలు ఈ రాష్ట్రాల్లోని మొత్తం 4,500 స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉండవని తెలుస్తోంది. ఇది కంపెనీకి నిజంగా పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది.

33 ఏళ్ల సర్వీసు, 61 సంవత్సరాల వయో పరిమితి పూర్తైన అధికారుల తక్షణ పదవీ విరమణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు చేకూర్చే అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మార్చి 31 నుంచి రాష్ట్రంలో భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫైల్ ఆమోదం కోసం అధికారులు సీఎంవోకు పంపారు. అయితే దీని ఆమోదానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంతో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. అప్పటివరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.

భారతదేశంలో చివరి గ్రామం ఎక్కడుందో తెలుసా?

మన భారతదేశం, చైనా సరిహద్దు నుండి వచ్చిన చివరి భారతీయ గ్రామం “మా నా” గ్రామం. ఇది చమోలి జిల్లాలో ఉంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ గ్రామాన్ని టూరిజం విలేజ్ గా నియమించింది. మన గ్రామం బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది బద్రీనాథ్ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో సరస్వతీ నది ఒడ్డున ఉంది. ఇది సుమారు 3219 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ గ్రామం చుట్టూ హిమాలయ కొండలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

హిందూ పురాణాల ప్రకారం మహాభారతం యొక్క ఆనవాళ్ళు మానా గ్రామంలో కనిపిస్తాయి. పాండవులు స్వర్గానికి వెళ్లేటప్పుడు మానా గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు. భీమ్ పూల్ అని పిలువబడే రాతి వంతెన ప్రసిద్ధిచెందినది. ఇది సరస్వతి నదికి వంతెనగా ఏర్పడిన భారీ శిల. బద్రీనాథ్ ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలో వసుధర అనే ఒక జలపాతం ఉంది. ఈ ప్రదేశంలో పాండవులు బహిష్కరణ సమయంలో తాత్కాలిక బస చేశారని నమ్ముతారు.

నాలుగు వేదాల గురించి రాసేటప్పుడు వేద వ్యాసుడు ఇక్కడ నివసించారని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం వేదవ్యాసుడు తన పవిత్ర పుస్తకాల సేకరణ లో పేజీ లను పోలి ఉండే పైకప్పు ఈ గుహలో 5,000 సంవత్సరాలు పురాతనమైన చిన్న మందిరం ఉంది. అక్కడ నివసించే ప్రజలను బోటియాస్ అని పిలుస్తారు. మానా నుండి వసు దార వరకు ట్రెక్కింగ్ కు రెండు గంటల సమయం పడుతుంది. ఈ వంపు తిరిగిన ట్రెక్ సమయంలో వాసు ధర నది లోయ అద్భుతమైన అందాలను చూడవచ్చు.

Inter Supplementary: ఇంటర్ ఫెయిల్ అయిన వారు బాధ పడొద్దు – సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే?

Inter Supplementary Exams Dates 2024: ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు (Inter Results) విడుదలయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మేలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు రెగ్యులర్ లో పాస్ అయ్యారా.?, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా.? వంటివి మార్కుల జాబితాలో ఏమీ వివరాలు ఉండవని.. విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశానికి లోను కావద్దని అన్నారు.

Health

సినిమా