Rain In AP: ఏపీలో జిల్లాల్లో భారీ వానలు..!

ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలో మాడు పగిలే ఎండలతో జనాలు విలవిల్లాడుతున్నారు. మండే ఎండలకు తోడు.. వడగాలులు వీస్తుండటంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏసీ, ఫ్రిజ్జులు కూడా వేసవి తాపాన్ని తీర్చలేకపోతున్నాయి. మరో రెండు నెలల పాటు ఎండలను ఎలా భరించాలా అని జనాలు భయపడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రెండు రోజుల క్రితం వర్షాలు పడనున్నాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు కురిశాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

గత రెండు మూడు రోజుల క్రితం వరకు కూడా సూర్యుడు తన ఓ రేంజ్ లో తన ప్రతాపం చూపించారు. నిన్నటి నుంచి కాస్తా వాతావరణం చల్లబడింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయితే గుంటూరు జిల్లాలో శుక్రవారం అకాస వర్షం సంభవించింది. పల్నాడు, గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా భారీ వానాలు కురిశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు,మేడికొండతో పాటు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ భారీ వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.

ఈ క్రమంలో 13వ రోజు బస్సుయాత్రలో భాగంగా ఏటుకూరు వద్ద జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణం చేరుకున్నారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా వాన కురిసి.. ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారింది. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారటంతో ప్రజలు కాసేపు ఇబ్బంది పడ్డారు. కాగా, గత కొంత కాలంగా విపరీతమైన ఎండలు, వేడి గాలుల వల్ల ఇబ్బందిపడుతున్న జనానికి ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే ఇదే సమయంలో అకస్మాత్తుగా వానాలు కురవడంతో మిర్చి రైతులు ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లోని మిరప పంట వర్షానికి తడిసింది. మొత్తంగా చాలా రోజులుగా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరో రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *