Friday, November 15, 2024

SBI: ఎస్‌బీఐ అదిరే గుడ్‌న్యూస్.. అమృత్ కలశ్ స్కీమ్ గడువు మళ్లీ పొడిగింపు.. రూ. 5 లక్షలకు ఎంతొస్తుంది?

SBI Extends Amrit Kalash FD: ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చాలా మందికి తమ సంపాదనలో నుంచి ఎంతో కొంత ఆదా చేసి.. దీనిని దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. దాని కోసం పెద్దగా రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే పెట్టుబడి సాధనాలవైపు చూస్తుంటారు. వీటిల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. కొంతకాలంగా కస్టమర్లకు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బంపర్ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే.. చాలా బ్యాంకులు FD పై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు రెగ్యులర్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ.. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని కూడా లాంఛ్ చేస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం గురించి
ఈ అమృత్ కలశ్ స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని ఎస్‌బీఐ 2023 ఏప్రిల్ 12న లాంఛ్ చేసింది. ఈ డిపాజిట్ టెన్యూర్ 400 రోజులుగా ఉంది. ఇటీవల మార్చి 31న గడువు ముగియగా.. తాజాగా బ్యాంక్ శుభవార్త చెప్పింది. గడువును మరోసారి పొడిగించింది. ఇప్పుడు 2024, సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ కోరుకునే వారికి మరో 6 నెలల సమయం ఇచ్చిందన్నమాట.

అంతకుముందు కూడా పలుమార్లు గడువులు ముగియగా.. వరుసగా నాలుగోసారి గడువు పొడిగిస్తూ వచ్చింది. మొదటగా 2023, జూన్ 23 వరకు.. తర్వాత ఆగస్ట్ 15 వరకు.. మళ్లీ డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించగా.. చివరగా మార్చి 31 వరకు ఈ స్కీం కొనసాగించింది. ఇప్పుడైతే ఏకంగా మరో 6 నెలలు పొడిగించడం విశేషం.

ఈ స్కీం గురించి చూసినట్లయితే 400 రోజుల డిపాజిట్. డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్లకు అవకాశం ఉంటుంది. NRI రూపీ టర్మ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు మాత్రమే డిపాజిట్‌కు అవకాశం ఉంది. కొత్త, రెనివల్ డిపాజిట్లకు ఛాన్స్ ఉంది. ఈ స్కీం కిందే SBI డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది. దీంట్లో రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ అందిస్తోంది. దీంట్లో లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. నేరుగా బ్రాంచుకు వెళ్లి ఎఫ్‌డీ తెరవొచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఛానెల్స్ ద్వారా కూడా ఇందులో చేరే అవకాశం ఉంది.

రూ. 5 లక్షల డిపాజిట్‌పై ఎంతొస్తుందంటే?
ఇప్పుడు ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి అంటే 400 రోజులకు ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం. రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం వడ్డీ రేటు లెక్కన రూ. 38,834 వడ్డీ అందుతుంది. మొత్తం చేతికి మెచ్యూరిటీ సమయంలో రూ. 5,38,834 అందుతుంది. ఇదే సీనియర్ సిటిజెన్లకు అయితే 7.60 శాతం వడ్డీ రేటు కింద 5 లక్షల డిపాజిట్‌పై రూ. 41,569 పొందుతారు.

ఎన్నికల వేళ వివేకా కేసులో బిగ్ ట్విస్ట్ లు-దస్తగిరి రివర్స్-నిందితుల బెయిల్ పోరు తీవ్రం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ అప్రూవర్ గా మారి సీబీఐకీ, వివేకా కుమార్తె సునీతకు అనుకూలంగా మాట్లాడిన దస్తగిరి ఇప్పుడు ఆమెతో పాటు వైఎస్ షర్మిలపైనా ఈసీని ఆశ్రయించాడు. అదే సమయంలో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎన్నికల్లోపు బెయిల్ కోసం మిగతా నిందితులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో సీబీఐ స్పీడు పెంచింది. అదే సమయంలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను ఆమోదించవద్దంటూ సీబీఐ కోర్టునూ కోరుతోంది. అలాగే నిందితులు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడు, అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ లభించిన నేపథ్యంలో అప్రమత్తమైంది.

తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తమకూ శివశంకర్ రెడ్డి తరహాలోనే బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై సీబీఐ తమ అభిప్రాయం తెలిపింది. మాజీ ఐపీఎస్ లనే ప్రభావితం చేయగలిగిన వీరికి సామాన్య సాక్ష్యులు ఓ లెక్కా అంటూ అఫిడవిట్ లో వ్యాఖ్యానించింది. ఇలాంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రారని తెలిపింది. దీంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మరోవైపు ఇన్నాళ్లూ వివేకా హత్య చేసిన తర్వాత అప్రూవర్ గా మారి ఆయన కుమార్తె సునీతారెడ్డికి అండగా ఉన్న దస్తగిరి ఎన్నికల వేళ ప్లేటు మార్చాడు. వివేకా హత్యను జనంలోకి తీసుకెళ్తున్న షర్మిల, సునీత, టీడీపీ ప్రయత్నాలను అడ్డుకునేలా ఈసీని ఆశ్రయించాడు. దీంతో ఇప్పుడు దస్తగిరి వ్యవహారం సంచలనంగా మారింది. షర్మిల, సునీత, టీడీపీ వివేకా హత్యను జనంలోకి తీసుకెళ్తే నష్టం ఎవరికి?, అటువంటప్పుడు వీరిని అడ్డుకోవాలని ఈసీని దస్తగిరి ఆశ్రయించడం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు అందరికీ సులువుగానే అర్ధమవుతోంది.

Chaturgrahi Yoga: 500 ఏళ్ల తర్వాత ఏర్పడిన చతుగ్రాహి యోగం.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

ఈ సూర్యగ్రహణం రోజే చతుగ్రాహి యోగం కూడా ఏర్పడింది. ఈ యోగం దాదాపు 500 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం రోజున ఏర్పడినందున ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు చెప్పారు. ఇప్పటికే సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. ఆకస్మికంగా ధన లాభాన్ని పొందుతారు. ఈ నేపథ్యంలో చతుగ్రాహి యోగం వలన ఏ రాశుల వారు అదృష్ట వంతులో ఈ రోజు తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలు ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణ సమయం అశుభంగా పరిగణిస్తారు కూడా.. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం అమెరికా, కెనెడా వంటి దేశాల్లో కనిపించినా మన దేశంలో కనిపించలేదు. అయినప్పటికీ గ్రహణ ప్రభావం రాశులపై ఉంటుందని జ్యోతిష్కులు పేర్కొన్నారు. అంతేకాదు ఉగాది ముందు రోజు ఏర్పడిన ఈ సూర్యగ్రహణానికి ప్రత్యేక ఉంది. ఈ సూర్యగ్రహణం రోజే చతుగ్రాహి యోగం కూడా ఏర్పడింది. ఈ యోగం దాదాపు 500 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం రోజున ఏర్పడినందున ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు చెప్పారు.

ఇప్పటికే సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. ఆకస్మికంగా ధన లాభాన్ని పొందుతారు. ఈ నేపథ్యంలో చతుగ్రాహి యోగం వలన ఏ రాశుల వారు అదృష్ట వంతులో ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి చెందిన వారికి సూర్య గ్రహణం రోజు ఏర్పడిన చతుగ్రాహి యోగం అదృష్టాన్ని తెచ్చింది. అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పని చేపట్టినా సక్సెస్ అయ్యేలా చేస్తారు. వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నవారికి శుభ్ర ప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలుఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారి ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెద్దల ఆస్తులు పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు.

ధనస్సు రాశి: ఈ రాశికి చెందిన వారికీ ఈ చతుగ్రాహి యోగం వలన ఆర్ధికంగా లాభాలను పొందుతారు. పట్టిందల్లా బంగారమే. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్థులు కొత్త పెట్టుబడులను పెడతారు. ఏ పని చేపట్టినా విజయాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు చతుగ్రాహి యోగం శుభ ఫలితాలను తెస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పోత్సాహంతో జీవితంలో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు లాభలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు పనుల విషయంలో ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంటారు.

వైట్‌రైస్ బదులు బ్రౌన్‌రైస్ తింటే ఈ సమస్యలన్నీ దూరం..

బ్రౌన్‌రైస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వైట్ రైస్ బదులు బ్రౌన్‌రైస్ తింటారు. బ్రౌన్‌రైస్ చూడ్డానికి కాస్తా లేత గోధుమ రంగులో ఉంటాయి. బ్రౌన్‌రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వైట్ రైస్ బదులు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.

పోషకాలు ఎక్కువ..
మీ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్ తీసుకుంటే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో సెలీనియం, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం మనకి అందుతాయి.ఇందులో ఫైబర్, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నింటి కంటే తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

కొలెస్ట్రాల్ తగ్గడం..
పీచుతో కూడిన బ్రౌన్‌రౌస్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.

అజీర్ణ సమస్యలు..
బ్రౌన్‌రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఈ బ్రౌన్‌రైస్‌ని వరిపై పొట్టుని మాత్రమే తీసి ఉంచుతారు. పాలిష్ ఉండదు. దీని వల్ల పేగు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

షుగర్ కంట్రోల్..
ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుంది. తెల్ల బియ్యంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ ఉన్నవారు బ్రౌన్‌రైస్ తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా ఉంచడంలో సాయపడతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు.

బరువు తగ్గేందుకు..
ఇతర సీజన్స్ కంటే సమ్మర్‌ని భరించడం కాస్తా కష్టమైనది. ఈ టైమ్‌లో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం కాస్త కష్టమైన పనే. దీనికోసం బ్రౌన్‌రైస్ మీకు హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్‌ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీని వల్ల చాలా కాలం పాటు ఆకలి కంట్రోల్ అవుతుంది. ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. దీంతో కేలరీను కూడా తగ్గించుకోవచ్చు. దీంతో బరువు తగ్గుతారు.

బ్రౌన్‌రైస్‌తో సైడ్‌ఎఫెక్ట్స్..
వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలుండవు. కొంతమందికి కొన్ని ధాన్యాల్లో ఆర్సెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులని పెంచుతాయి. బ్రౌన్‌రైస్‌లో ఆ ఆర్సెననిక్ గుణం కూడా ఉంటుంది. రోజుకి అరకప్పు బ్రౌన్‌రైస్ తినండి. ఇందులో దాదాపు 110 కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గేవారు రోజూ తీసుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

AP Election 2024: ఈసీ సంచలన నిర్ణయం.. సీఎం జగన్‌కు బిగ్ షాక్..!

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు పంపించింది ఎన్నికల సంఘం. ఈసీ ఆదేశాల నేపథ్యంలో కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్రం వీడాల్సి ఉంటుంది. గువహటి కేంద్రంగా ఆయన పని చేయనున్నారు.

అయితే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కళ్లు, చెవులు మొత్తం రఘురామిరెడ్డే అని పోలీస్ వర్గా్ల్లో భాగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం ఇతర విధులకు కేటాయించడం హాట్ డిస్కషన్‌గా మారింది. అయితే, రఘురామిరెడ్డి నియామకాన్ని ఆపేందుకు వైసీపీ కీలక నేతలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ, అది సాధ్యపడకపోవడంతో వైసీపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారట.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామిరెడ్డి అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం సిట్ కార్యాలయం వద్ద కీలక కేసులో హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే.. రఘురామిరెడ్డి విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ పరిశీలకుడిగా అసోం పంపించేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.

Pushpa 2 Teaser: 12 గంటల్లోనే 51 మిలియన్స్.. ‘తగ్గేదేలే’!

Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు.. ప్రస్తుతం సోషల్ మీడియా కూడా పూనకాలు వస్తున్నట్టుగా ఊగిపోతోంది. పుష్పరాజ్ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి.

పుష్ప 2 టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో.. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాబట్టింది. కేవలం 101 నిమిషాల్లోనే 500K లైక్స్ వచ్చాయి. దీంతో.. అత్యంత వేగంగా ఐదు లక్షల లైక్స్ సాధించి.. ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. ఇక యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తూ.. 12 గంటల్లోనే 51 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే 1 మిలియన్స్ లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో పుష్పరాజ్‌కు సంబంధించిన ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తున్నారు.

టీజర్‌తోనే పుష్ప2 సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. టీజర్‌ ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక ట్రైలర్‌ను హై ఓల్టేజ్ యాక్షన్‌గా కట్ చేస్తే ఆగష్టు 15న బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్‌తో పాటు వెయ్యి కోట్లు ఖాతాలో పడినట్టే. లెక్కల మాస్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. పార్ట్ 1తో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. పార్ట్ 2లో నట విశ్వరూపం చూపించనున్నారు.

ఎయిర్ పోర్టులో 490 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AAI Degree Recruitment 2024: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) డైనమిక్ మరియు అర్హత కలిగిన వ్యక్తులను జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా తమ బృందంలో చేరమని ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఏవియేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలో భాగం అయ్యే అవకాశాన్ని అందిస్తుంది.

AAI ఖాళీల విభజన
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్): 90
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్): 106
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13

AAI రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు
అర్హతలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) కోసం ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్) కోసం సివిల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) కోసం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) కోసం ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ
కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కోసం MCA
వయో పరిమితి:

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు (01-05-2024 నాటికి)
వయస్సు సడలింపు:
OBC అభ్యర్థులు: 3 సంవత్సరాలు
SC, ST అభ్యర్థులు: 5 సంవత్సరాలు
PWBD అభ్యర్థులు: 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:

SC/ST/PWBD అభ్యర్థులు: రూ. శూన్యం
మిగతా అభ్యర్థులందరూ: రూ. 300/-
చెల్లింపు విధానం: ఆన్‌లైన్
ఎంపిక ప్రక్రియ:

గేట్ మార్కుల ఆధారంగా
ఇంటర్వ్యూ

AAI రిక్రూట్‌మెంట్ (జూనియర్ ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి
అర్హత గల అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .
దరఖాస్తు వ్యవధి: 02-04-2024 నుండి 01-మే-2024 వరకు.
దరఖాస్తు చేయడానికి ముందు, మీరు మీ పత్రాల కాపీలను స్కాన్ చేశారని నిర్ధారించుకోండి.
రిజిస్ట్రేషన్ కోసం చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌ను అందించండి మరియు వాటిని అప్‌డేట్‌ల కోసం యాక్టివ్‌గా ఉంచండి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఖచ్చితమైన వివరాలతో పూరించండి, ఎందుకంటే మార్పులు వినోదాత్మకంగా ఉండకపోవచ్చు.
దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించండి (వర్తిస్తే).
అప్లికేషన్‌ను సమర్పించండి మరియు భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్ నంబర్‌ను సేవ్ చేయండి/ప్రింట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 02-04-2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 01-మే-2024

AAI నోటిఫికేషన్ ముఖ్యమైన లింక్‌లు

అధికారిక నోటిఫికేషన్ PDF

Onine వర్తించు

aai.aero
AAIతో మీ కెరీర్‌లో కొత్త శిఖరాలకు ఎదగడానికి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి! ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి మరియు భారతదేశం యొక్క ఏవియేషన్ ఎక్సలెన్స్‌లో భాగం అవ్వండి.

Govt Jobs : No Fee 10th అర్హ‌త‌తో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 6192 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

Staff Selection Commission CHSL Job Notification 2024 in Telugu Apply Now : గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్ట్: లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్టులో మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

మొత్తం పోస్ట్: 3712 పోస్ట్లు

అర్హత: కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWSకి రూ.100/- & SC/ST మహిళ అభ్యర్థులకు ఫీజు – Nil

ప్రారంబపు తేది: 08/04/2024

చివరి తేదీ: 07/05/2024

జీతం: పోస్టును అనుసరించి రూ.19,900/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు.

ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/

గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅Full Notification Pdf Click Here

✅Apply Link Click Here

✅Official Website Click Here

Kidney Stones: ఈ చిట్కాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు సులభంగా తొలగిపోతాయి..!

Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇది చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లేప్పుడు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. రాళ్ల పరిమాణం, సంఖ్యను బట్టి కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా వారాలు, నెలలు పట్టవచ్చు. నీళ్లు తక్కువగా తాగడం, మాంసాహారం ఎక్కువగా తిన్నా, విటమిన్‌ బి6, సీ లోపం, విటమిన్‌ డి అధికంగా ఉన్నా, మద్యం ఎక్కువగా తాగేవారికి, ఆలస్యంగా భోజనం చేస్తున్నా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. రాళ్ల పరిమాణం పెరిగి.. శస్త్రచికిత్సకు దారితీసే అవకాశం ఉంది. రాళ్లను కరిగించడానికి.. అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలో ఏర్పడే స్ఫటికాల నుంచి ఏర్పడే గట్టి పదార్థం. కాల్షియం స్టోన్స్ ఎక్కువగా కనిపించే మూత్రపిండాల్లో రాళ్లు, తర్వాత యూరిక్ యాసిడ్ రాళ్లు ఉంటాయి. కిడ్నీలో రాళ్లను తొలగించాలంటే ఏం చేయాలి? నీరు ఎక్కువగా తాగడం వల్ల చిన్న చిన్న రాళ్లు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే రాళ్లు ఎక్కువగా ఉన్నా, పెద్దవిగా ఉంటే తినడం, తాగడం వంటి వాటిపై మరింత శ్రద్ధ వహించాలి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ (NKF) ప్రకారం, మీరు మూత్రపిండాల తొలగింపు కోసం మందులతో పాటు క్రింది నివారణలను ప్రయత్నించాలి.

రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువ ద్రవాలు త్రాగాలి
రోజుకు కనీసం 2.5లీటర్ల ద్రవాలు తాగడం వల్ల మంచి మొత్తంలో మూత్రవిసర్జన జరుగుతుంది, ఇది రాళ్లను తొలగిస్తుంది.

అధిక ఆక్సలేట్ ఆహారాలకు దూరంగా ఉండండి
మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లయితే, బచ్చలికూర, అనేక బెర్రీలు, చాక్లెట్, గోధుమ ఊక, గింజలు, దుంపలు, టీ, రబర్బ్‌లను మీ ఆహారం నుండి పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లను ఏర్పరుస్తుంది.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
కిడ్నీ రాళ్లు ఏర్పడిన పేషెంట్లు రోజూ వారి ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. కాల్షియం తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడం మానుకోండి
కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. మీకు రాళ్లు ఉంటే, మీరు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోకుండా ఉండాలి. కాల్షియం సప్లిమెంట్లను మీ వైద్యుడు, నమోదిత కిడ్నీ డైటీషియన్ ద్వారా వ్యక్తిగతీకరించాలి.

ప్రోటీన్ తగ్గించండి, ఉప్పు తీసుకోవడం నివారించండి
అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియాన్ని విసర్జించబడతాయి, ఇది మూత్రపిండాలలో ఎక్కువ రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది కాకుండా, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం పెరుగుతుంది, ఇది రాళ్ళు వచ్చే అవకాశాలను పెంచుతుంది. బీపీని నియంత్రించడానికి ఉప్పు తక్కువగా ఉండే ఆహారం కూడా ముఖ్యం.

విటమిన్ సి అధిక మోతాదులను తీసుకోవడం మానుకోండి..
మీరు ప్రతిరోజూ 60 mg విటమిన్ సి తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. రోజుకు 1000 mg లేదా అంతకంటే ఎక్కువ మోతాదులో విటమిన్‌ సి ఉంటే శరీరం మరింత ఆక్సలేట్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది రాళ్ల నిర్మాణానికి దారితీస్తుంది.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (09/04/24)

మేషం
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.

వృషభం
శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

మిథునం
చేపట్టే పనుల్లో శుభఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

కర్కాటకం
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.

సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.

కన్య
కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

తుల
అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

వృశ్చికం
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకుపరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మకరం
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

కుంభం
శుభకాలం. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

మీనం
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్.. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు!

ప్రస్తుత రోజుల్లో విద్యకు ప్రాధాన్యత పెరిగింది. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు. పేదరికాన్ని పారద్రోలడానికైనా, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికైనా చదువు కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నారు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఖర్చుకు కూడా వెనకాడకుండా ప్రముఖ స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారికి శుభవార్త. తమ పిల్లల భవిష్యత్ ను బంగారుమయంగా మార్చేందుకు అవకాశం వచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు గడువుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.

మీరు మీ పిల్లలను స్కూళ్లో చేర్పించాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. నాణ్యమైన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో పిల్లలను చేర్పిస్తే భవిష్యత్ కు తిరుగుండదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఈ పాఠశాలలు అత్యున్నత ప్రమాణాలను కలిగి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ను అందిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ముగియనున్నది. దరఖాస్తు చివరి తేదీలోగా.. ఏప్రిల్ 01 2024 వరకు ఆరేళ్లు నిండిన పిల్లలు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి చదివేందుకు ఎంపికైన విద్యార్థులతో మొదటి ప్రొవిజినల్ జాబితా ఏప్రిల్ 19న, రెండో ప్రొవిజినల్‌ జాబితా (ఆర్‌టీఈ/సర్వీస్‌ ప్రియారిటీ (I & II)/ రిజర్వేషన్‌ కోటా) ఏప్రిల్‌ 29 విడుదల చేస్తారు (సీట్లు ఖాళీలను బట్టి). ఇకపోతే మూడో ప్రొవిజినల్‌ జాబితాను మే 8న విడుదల చేస్తారు.

కాగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ దక్కించుకోవాలంటే అనుకున్నంత ఈజీ కాదు. అప్లికేషన్ నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్ వరకు ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పులు దొర్లితే అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 2024 ఏప్రిల్ 1 నాటికి 6 ఏళ్లు నిండిన విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://kvsonlineadmission.kvs.gov.in ద్వారా ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే, ఆయా పాఠశాలల్లో సీట్ల ఖాళీలను బట్టి రెండో తరగతి నుంచి ఆ పైతరగతులకు (పదకొండో తరగతి మినహా) ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 10 వరకు కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను ఏప్రిల్‌ 15న విడుదల చేస్తారు. మరి మీ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేయండి.

Gold Price: బంగారం ధర పెరగడానికి ఐదు కారణాలు.. ఏంటంటే..?

గత కొన్నిరోజుల నుంచి బంగారం ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.

గత కొన్నిరోజుల నుంచి బంగారం (Gold) ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం (Gold) ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.

స్థిరమైన ఆస్తి

‘యూఎస్ ఫెడ్ ద్వారా ద్రవ్య విధాన సడలింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయ పరిస్థితి క్షీణించడంపై బెట్టింగ్ జరుగుతోంది. స్థిరంగా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ఎన్నికల రావడంతో బంగారం కొనుగోలు స్థిరమైన ఆస్తిగా ప్రజలు భావిస్తున్నారు. రూపాయి విలువ తగ్గిపోవడం బంగారం ధర పెరిగేందుకు ఊతం ఇస్తోంది అని’ ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ ఫండర్ సుగంద అభిప్రాయ పడ్డారు.

ఇంట్రెస్ట్

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. పెళ్లిళ్ల సమయంలో వధువు, వరుడు బంగారు ఆభరణాలు ధరిస్తారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. బంగారం వ్యాపారుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. బంగారం ధర పెరగడంతో కొనుగోలు దారుల సంఖ్య తగ్గిందని వివరించారు.

పెరిగేవి కావు..?

మధ్య ప్రాచ్య ప్రాంతంలో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం. అక్కడ ప్రశాంత పరిస్థితి ఉంటే బంగారం ధరలకు రెక్కలు వచ్చేవి కావని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య వివాదం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ కారణాల చేత ఏడాదిలో బంగారం ధర 12 శాతం పెరిగిందని నిపుణులు వివరించారు.

Ugadi 2024: ఉగాది రోజున ఈ పనులు చేస్తే.. ఏడాదంతా మీకు శుభమే!

తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ అంటే మంగళవారం వచ్చింది. ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది అంటే.. ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు..
తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ అంటే మంగళవారం వచ్చింది. ఉగాది పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది అంటే.. ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉగాది రోజు ఖచ్చితంగా కొన్ని రకాల పనులు చేయాలట. దీని వల్ల ఏడాదంతా శుభంగా ఉంటుందని పెద్దలు, పురాణాలు చెబుతాయి. అలాగే చేయకూడని పనులేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది రోజు చేయాల్సిన పనులు:
1. ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి.. కొత్త బట్టలు ధరించాలి.

2. ఉగాది పండుగ రోజు మీకు ఇష్టమైన కులదైవాలను పూజించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి.
3. అదే విధంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రతీ ఒక్కరు ఉగాది పచ్చడిని తినాలి. దైవ దర్శనం చేసుకోవాలి. ఆలయాలకు వెళ్లాలి.

4. ఉగాది పచ్చడి నవగ్రహాలతో పోలుస్తూ ఉంటారు. నవగ్రహాలలోని కొన్ని గ్రహాలకు ఈ పచ్చడిలోని రుచులతో సంబంధం ఉందని చెబుతారు.

5. ఖచ్చితంగా సాయంత్రం పూట పంచాంగం శ్రవణం చేయాలి. ఇలా చేస్తే ఏడాదంతా మంచే జరుగుతుంది.

6. లేని వారికి అన్నదానం, వస్త్రదానం, వస్తువులు దానాలు చేస్తూ ఉండాలి.

ఉగాది రోజు చేయకూడని పనులు:
1. పొద్దు పోయేంత వరకు నిద్రపోకూడదు.

2. ఎవర్నీ దూషించి మాట్లాడకూడదు.

3. గొడవలకు దూరంగా ఉండాలి.

4. చిరిగిపోయిన లేదా మాసిపోయిన బట్టలను ధరించకూడదు.

5. ఈ రోజు ఏడుస్తూ ఉండకూడదు.

ప్రపంచం ముంగిట్లో మరో మహమ్మారి.. మనుషులకు వ్యాపిస్తే మరణశాసనమేనా.?

కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది.
కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది. ఒక దాని తర్వాత ఒకటి మానవాళిపై పంజా వసురుతున్నాయి. కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోకముందే మరో వేరియంట్‌ వెంటాడుతోంది. అమెరికాలో వెలుగుచూసిన బర్డ్‌ ఫ్లూను కోవిడ్‌ను మించిన విలయంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. కరోనాను మించిన మృత్యుకౌగిలి అమెరికాలో ఇప్పుడు అలజడి రేపుతోంది. టెక్సాస్‌, కాన్సాస్‌ వంటి రాష్ట్రాల్లో వెలుగుచూసిన బర్డ్‌ ఫ్లూతో పౌల్ట్రీ రంగం ప్రశ్నార్ధకంగా మారింది. కోళ్లలో బర్డ్‌ ఫ్లూ ఉన్నట్టు మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీలోని వెటర్నరీ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ గుర్తించడంతో, ఆయా ప్లాంట్లలో కోళ్ల ఉత్పత్తికి బ్రేక్‌ పడింది.

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా-H5N1 వైరస్‌ సాధారణంగా పక్షులకు సోకే వ్యాధి. కానీ ఈ వ్యాధి క్షీరదాల్లోనూ బయటపడుతోంది. క్షీరదాల్లో ఈ కేసులు పెరిగితే మానవులకు కూడా ప్రమాదమే అన్నది నిపుణుల వాదన. అంతేకాదు దీని వల్ల కొత్త వైరస్‌లు పుట్టి మనుషులు, జంతువులకు కూడా హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్‌ఓ మనుషులకు వ్యాపిస్తే మరణాల రేటు గణనీయంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్‌లో ఓ కార్మికుడి ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అతన్ని వెంటనే ఐసోలేషన్‌ చేసిన అధికారులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పశువుల నుంచి మనిషికి బర్డ్‌ఫ్లూ సోకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2022లోనూ అమెరికాలోని కొలరాడోలో ఒక వ్యక్తికి వైరస్‌ సోకినప్పటికీ అతడికి కోళ్ల నుంచి సోకింది. అమెరికాలోని ఆవుల మందల్లో H5N1 వైరస్‌ సోకుతోంది. కాన్సాస్‌, న్యూమెక్సికో, టెక్సాస్‌, ఓహియో, ఇడాహో, మిషిగన్‌లో పాడి పశువులకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. పక్షుల ద్వారా పశువులకు వైరస్‌ సోకినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

కరోనాను మించి ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలు కూడా అలర్ట్‌ అయ్యాయి. H5N1 వైరస్‌ను తొలిసారి 1996లో చైనాలోని పక్షుల్లో గుర్తించారు. ఆ తర్వాత ఏడాది హాంకాంగ్‌లో వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించింది. అప్పుడు 18 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 887 మంది H5N1 బర్డ్‌ఫ్లూ బారిన పడగా 462 మంది మృతిచెందారు. వైరస్‌ బారిన పడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్‌లో మరణాల రేటు 0.1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ లక్షలాది మందిని బలిగొన్నది. H5N1లో మరణాల రేటు 52 శాతం కాబట్టి ఇది కొవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? – ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

50 inch Smart TV Deals: తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని మీరు అనుకుంటున్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద ఆఫర్ సేల్ జరుగుతోంది. దీనిలో పెద్ద సైజు టీవీలు కూడా మంచి తగ్గింపుతో లభిస్తాయి. ఈ సేల్‌లో 50 అంగుళాల స్మార్ట్ టీవీలు సగం ధరకే లభిస్తున్నాయి.

మీ కోసం అందుబాటులో ఉన్న మొదటి ఉత్తమ ఆప్షన్ కాంపాక్ 50 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ టీవీ ధర రూ. 43, 999 అయినప్పటికీ ప్రస్తుతం దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22, 990కి విక్రయిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్‌లతో మీరు దీన్ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

కాంపాక్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ 2 జీబీ ర్యామ్, డాల్బీ ఆడియో, బెజెల్ లెస్ స్క్రీన్, డబ్ల్యూసీజీ ప్లస్ వంటి ఫీచర్లతో వస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ గురించి చెప్పాలంటే రూ. 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ. 3500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ దీనిపై అందుబాటులో ఉంది.

రెండో ఆప్షన్ గురించి చెప్పాలంటే… థామ్సన్ 50 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ. థామ్సన్ అందిస్తున్న ఈ స్మార్ట్ టీవీని రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది 40 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇది కాకుండా మీరు బ్యాంక్ ఆఫర్‌లలో మరింత చవకగా కొనుగోలు చేయవచ్చు.

ఈ థామ్సన్ టీవీలో ఉన్న అతిపెద్ద ఫీచర్ అల్ట్రా హెచ్‌డీ 4కే రిజల్యూషన్, 40W స్పీకర్లు అని చెప్పవచ్చు. దీనిపై మీరు రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ దగ్గర ఉన్న మూడో ఆప్షన్ కోడాక్ 50 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఈ సేల్‌లో దీన్ని రూ. 25,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ హెచ్‌డీఆర్10 ప్లస్, డాల్బీ అట్మాస్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.

ఓరి దేవుడో.. కొండల మధ్య బొజ్జ గణపయ్య.. వీడియో చూస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే..

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయాలు ఉన్నాయి.. అయితే దట్టమైన అడవిలో కొలువైన బొజ్జ గణపతి మందిరం వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ గణపయ్య గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండీ..

ఈ మందిరం.. ఛత్తీస్‌గఢ్‌లోని ధోల్కల్ కొండపై ఉన్న 1,000 సంవత్సరాల పురాతనమైనది.. వినాయకుడికి హారతి ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ఓ భక్తుడు ఈ వీడియోను షేర్ చేసాడు.. అది ధోల్కల్‌ గణేష్‌ ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం బైలాడిలా పర్వత శ్రేణి దట్టమైన అడవిప్రాంతంగా కనిపిస్తుంది. చుట్టూ అద్భుతమైన కొండ.. కన్నుల విందును అందిస్తుంది.

అంత ఎత్తైన కొండపై వినాయకుడిని భక్తితో పూజిస్తున్నాడు పూజారి. ధూపదీప నైవేధ్యాలు సమర్పించి భూమి, ఆకాశాలకు సైతం నివేదిస్తున్నాడు. అతడు చేసే పూజలు చుట్టూ ఉన్న బండరాళ్లపై నిలబడి ఉన్న ప్రజలు భయపడుతూనే భక్తితో చూస్తున్నారు.. ఇక ధోల్కల్ గణేష్ అని పిలువబడే గణేశ మందిరం అనేక వందల సంవత్సరాల క్రితం కనుగొనబడింది. ఇది ‘ధోల్’ ఆకారంలో ఉన్న పర్వత శ్రేణిలో ఉంది. ఈ విగ్రహం 9వ లేదా 10వ శతాబ్దంలో నాగవంశీ రాజవంశం కాలంలో రూపొందించబడిందని నమ్ముతారు. ఆలయానికి చేరుకోవడానికి రహదారి అందుబాటులో లేనందున అటవీ మార్గం గుండా దాదాపు 40 నిమిషాల పాటు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది.. ఆ గణపతి పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నాడు.. రిస్క్ అయినా చాలా మంది అక్కడకు వెళ్తున్నారు. ఆ గణపతి మందిరం వీడియోను మీరు చూడండి..

రక్తం ఏరు ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసా?

మాములుగా నదులలో నీళ్లు నీలం రంగులో లేదా మట్టి కలర్ లో ఉంటాయి.. అయితే కొన్ని నదులలో నీళ్లు వివిధ రంగులలో దర్శనమిస్తు సైన్స్ కు సవాల్ విసురుతున్నాయి.. ఇప్పుడు ఓ నది ఎరుపు రంగులో ప్రవహిస్తుంది.. దాని పుట్టు పూర్వాలను కనుక్కోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ నది పై వారి పరిశోధనలు మొదలయ్యాయి. తెల్లటి మంచుతో కప్పబడిన ఖండం అంటార్కిటికా. నెలల తరబడి ఆ ఖండంపై సూర్యకాంతి పడదు. అయితే ఇక్కడ రక్త నది ప్రవహిస్తోంది. దీనికి బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. భూమి దక్షిణ భాగంలో ఉన్న ఈ ఖండంలో ఎక్కువ భాగం మంచే ఉంటుంది.

తెల్లటి దుప్పటి కప్పుకున్న ఈ జలపాతంలో రక్తపు నీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెత్తుటి జలపాతంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ ఫాల్స్ రివర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది…ఓ వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం..ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని ఛేదించడంలో విజయం సాధించారు. ఈ జలపాతాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నారు. ఈ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు. ఈ లోయలో ఐరన్‌ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు ఉండటమే ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు..

అక్కడ ఆక్సీకరణ కారణంగా ఐరన్ ద్రవం గాలిలోని ఆక్సిజన్‌తో తాకినప్పుడు నీరు రక్తం ఎరుపు రంగులోకి మారుతుంది. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదు అంతస్తుల భవనంతో సమానం. ఎర్త్ స్కై నివేదిక ప్రకారం, బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధన తర్వాత పరిశోధకుల బృందం కనుగొంది. కానీ 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది..ఇక్కడ ఇతర జీవులు అత్యంత క్లిష్ట పరిస్థితులలో మాత్రమే పెరుగుతాయని చెబుతున్నారు.. ఏది ఏమైనా ఈ నది భయంకరమైన రూపంతో అందరిని భయపెడుతున్నాయి..

ఈ చెట్లు కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయట..! రోజుకు ఒక్కో చెట్టు నుంచి 4660 యూనిట్ల విద్యుత్‌

టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది.. ఒకప్పుడు మనం చూసిన ఊరికి ఇప్పుడు మనం చూస్తున్న ఊరికే పొంతన లేదు.. అన్నీ మారిపోయాయి.. ఇక ప్రపంచం మారకుండా ఉంటుందా. ఒకప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటండి అనేవాళ్లు.. ఇప్పుడు అదే రోడ్డుకు ఇరువైపులా.. సోలార్‌ ట్రీస్‌ వచ్చేశాయి.. మనుషుల వాడకం తగ్గుతుంది.. మనిషే మనిషితో పనిలేకుండా జరిగేపోయే యంత్రాలను, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ను కనుక్కుంటున్నాడు. ఇంతకీ ఈ సోలార్‌ ట్రీస్‌ సంగతేంటో చూద్దామా..!

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు గాంధీనగర్ మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ గట్టిగా ప్రయత్నిస్తోంది. గాంధీనగర్‌లో విపరీతమైన ఎండ. అందుకే.. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతూ.. ఎండను ఎలా వాడుకోవాలో అలా వాడేస్తున్నారు. వివిధ పబ్లిక్ పార్కులలో 20 సోలార్ చెట్లను ఏర్పాటు చేశారు. ఏడాది పొడవునా ఈ సోలార్ చెట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కరెంటును టొరెంట్ పవర్ లేదా ప్రభుత్వ విద్యుత్ కంపెనీకి అమ్మేలా అక్కడి అధికారులు ప్లాన్ చేశారు.

ఒక్కో చెట్టు రోజుకు 4660 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 20 సోలార్ చెట్లు ఏడాది పొడవునా రూ. 1.25 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి.. పర్యావరణ కాలుష్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది. ఎందుకంటే సోలార్ చెట్టు పరిమాణం చాలా పెద్దది, ఇది నిజమైన పెద్ద చెట్టులా ఉంటుంది. ఒక పెద్ద పొద్దుతిరుగుడు ఆకుపై సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు ఉంటుంది. 15 నుండి 20 ఆకుల లాంటి ప్యానెల్స్ ఉండటం వల్ల ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది.

గాంధీనగర్‌లోని వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ చెట్లు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఈ సోలార్ ట్రీ.. కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్‌ చేసేస్తారు.

పెదాల చుట్టుపక్కల నల్లగా ఉందా..? ఇలా చేయండి వారంలో సమస్య మాయం..!!

చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నా.. వారి పెదాలు మాత్రం నల్లగా ఉంటాయి.. ముఖ్యంగా పైన పెద మరీ నల్లగా ఉంటుంది. పెదాలు చుట్టుపక్కల కూడా బ్లాక్‌ ఉంటుంది. వీటిని కవర్‌ చేయడానికి లిప్‌స్టిక్‌లు వాడేస్తారు.. ఇలా అవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. దీనిని ఒక పిగ్మెంటేషన్‌ అంటారు. శరీరంలో విటమిన్ల లోపం వల్ల ఇలా అవుతుంది. ఒక చిట్కాను ఉపయోగించి.. పెదాలను, ముక్క పక్కన ఉన్న నలుపును పోగొట్టుకోవచ్చు ఎలా అంటే..
పెద‌వుల చుట్టూ ఉండే ఈ న‌లుపును దూరం చేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మ‌నం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, అర టీ స్పూన్ ప‌సుపును, 2 టేబుల్ స్పూన్ల పెరుగును, ఒక చెక్క ట‌మాట ముక్క‌ను తీసుకోండి.. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని, ప‌సుపును తీసుకోవాలి. త‌రువాత పెరుగును వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక ట‌మాట కాయ‌ను అడ్డంగా రెండు ముక్క‌లుగా చేసి ఒక ముక్క‌ను తీసుకోవాలి. ఈ ట‌మాట ముక్కతో ముందుగా క‌లిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ముఖంపై న‌ల్ల‌గా ఉన్న ప్రాంతంలో రాస్తూ 3 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి.

ఇలా మ‌ర్దనా చేసేట‌ప్పుడు బియ్యంపిండి మిశ్ర‌మం, ట‌మాట ర‌సం రెండు క‌లిసేలా చూసుకోండి.. ఇలా రాసిన 15 నుంచి 20 నిమిషాల త‌రువాత వేడి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. త‌రువాత దూదితో గులాబీ నీటిని తీసుకుంటూ ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌లుపు పోయి ముఖం నిగ‌నిగ‌లాడుతూ క‌న‌బ‌డుతుంది. అలాగే పెద‌వుల చుట్టూ ఉండే న‌లుపుద‌నం కూడా పోతుంది.

వీటిపో పాటు.. బ్రష్‌ చేసేప్పుడు ఆ పేస్ట్‌ నురుగు అనేది చాలా మంది మూతి చుట్టూ అంటించుకుంటారు. అసలు ఆ నురుగు పైకి రాకుండా బ్రష్‌ చేయాలి. అది మీ పెదాలకు, చుట్టుపక్కలా రోజూ అంటితే..దాని వల్ల అక్కడ మొత్తం నల్లగా మారిపోతుంది. అందుకే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేస్తే వెంటనే క్లీన్‌ చేసుకోవచ్చు.. అలాగే నిద్రపోయేప్పుడు సొల్లు కార్చే అలవాటు ఉంటే మానేయండి. ఒకవేళ సొల్లు కారుస్తున్నట్లు తెలిస్తే..వెంటనే క్లీన్‌ చేసుకోండి. ఈ రెండింటి వల్ల కూడా పెదాల దగ్గర నల్లగా అవుతుంది.

తొలిసారి జనసేనకు చిరంజీవి డైరెక్ట్ సపోర్ట్.. ఎన్నికల వేళ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ (వీడియో)

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌కు చిరంజీవి మద్దతుగా నిలిచారు. తొలిసారిగా జనసేన పార్టీకి డైరెక్ట్ సపోర్ట్ చేశారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న చిరంజీవిని పవన్ కల్యాణ్, నాగబాబులు ప్రత్యేకంగా కలిశారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి కీలక విషయాలపై కాసేపు చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల భారీ విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కల్యాణ్‌తకు అందించారు. ప్రస్తుతం చిరంజీవి పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఈ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలో చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనంతరం కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

Dahnush: బ్రేకింగ్.. ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ విడాకులు..

Dahnush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధం అయ్యాడు. తాజాగా వారు చెన్నై కోర్టులో మ్యూచువల్ విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. సెక్షన్ 13 బి కింద వారు విడాకులకు అప్లై చేశారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ .. ధనుష్ ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 18 ఏళ్ళ తరువాత.. అనగా 2022 లో ఈ జంట కొన్ని విబేధాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

రెండేళ్ల నుంచి ఈ జంట విడిగానే ఉంటున్నారు. ” 18 సంవత్సరాలు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా మరియు ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నాము. మా ఈ ప్రయాణం.. ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు మరియు అనుకూలతలతో సాగింది. ఈరోజు మేము ఒక చోట నిలబడ్డాము. మా దారులు విడిపోయే చోట. ఐశ్వర్య మరియు నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మరియు మమ్మల్ని మంచి వ్యక్తులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవడానికి మాకు అవసరమైన గోప్యతను ఇవ్వండి. ఓం నమశివాయ! ప్రేమను పంచండి” అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఈ విషయం చెప్పి రెండేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటివరకు వీరు విడాకులు తీసుకోలేదా అనే అనుమానం అభిమానుల్లో మొదలయ్యింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రెండేళ్లు.. ఇరు కుటుంబ సభ్యులు వీరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేశారు అని, అయినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెండు కుటుంబాలు కూడా నగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి కేసు విచారణకు రానుంది.

పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి షేక్ జలీల్ ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు

జనసేన అగ్రనేతలు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. జనసేన నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. బకెట్ గుర్తు ఉన్న నవరంగ్ పార్టీ అభ్యర్థులను పోటీ చేయొద్దని బెదిరిస్తున్నారని చెప్పారు.

పవన్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశానని షేక్ జలీల్ తెలిపారు. ఈసీని కలిసి ఎంపీ బాలశౌరితో పాటు నాదెండ్ల మనోహర్, పవన్ పై ఫిర్యాదు చేశామని చెప్పారు. బాలశౌరి తనకు తుపాకీ గురి పెట్టి బెదిరించారని ఆరోపించారు. ఏపీలో ఈసీ తన పార్టీకి బకెట్ గుర్తు కేటాయించిందని గుర్తుచేశారు.

దీంతో జనసేన గాజు గ్లాసు గుర్తు, తమ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుందని, అందుకే తన పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని చెప్పారు. రూ.5 కోట్లు ఇస్తానని పవన్ చెప్పారని తెలిపారు. అయినా తాను వారి ప్రలోభాలకు లొంగలేదని తెలిపారు. తాము లక్ష్మీనారాయణ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ గా పోటీ చేస్తున్నామని అన్నారు.

ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఫైర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ..
దేశంలోని పలు పార్టీల పనితీరును వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వైసీపీ పాలన చెప్పుకొదగ్గట్లు జరగలేదని, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదని దీంతో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈ కారణంగానే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. పీకే మా దగ్గర కూడా ఐదేళ్లు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సలహాలు తీసుకుంటే మేము మనిగేవాళ్లం.. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పీకే మా నేతల దగ్గర దబ్బులు వసూలు చేసేవాడు. అతను మేనేజ్మెంట్ తప్ప చేసిందేమీ లేదు. బీహార్ లో పార్టీ పెట్టిన ఆయన్ను ప్రజలు తరిమేశారు. అందుకే ఆయన ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. సీఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దీనిపై వైసీపీ తరుపున మేము ఎలాంటి చర్చకైన సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే నిన్నిటి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.

రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి రూ. 2 వేలు.. ఎప్పుడంటే

రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. పెట్టబడి సాయం అందిచండంతో పాటు.. పండించిన పంటకు కనీస మద్దతు ధర, ప్రక్రుతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు బీమా సాయం, రైతు రుణ మాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఎప్పుడు.. ఎందుకంటే..

అన్నదాతలను ఆదుకోవడం కోసం మోదీ సర్కార్ కొన్నాళ్ల క్రితం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతులకు ఆర్థిక సాయం అందించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. చిన్న,సన్నకారు రైతుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఈ స్కీంను తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. ఏడాదికి మూడు విడతల్లో అందిస్తోంది.

ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో కిసాన్ సమ్మాన్ నిధులను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు 16 విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం రూ. 32,000 అందించింది. ప్రస్తుతం అన్నదాతలు 17వ విడత కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 16వ విడత నిధుల్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యావత్మాల్ వేదికగా విడుదల చేశారు. సుమారు 9 కోట్ల మంది రైతుల ఈ పథకం కింద లబ్ధి పొందారు.

తాజాగా కిసాన్ 17వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది మే ఆఖరి వారంలో ఇవి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మే చివరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది.

అయితే ఇ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 17వ విడత డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది. కిసాన్ నిధుల పొందాలంటే.. ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా దీనిని పూర్తి చేయొచ్చు. ఇంకా.. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

నాయనమ్మకు ప్రేమతో.. ఈ వాహనమే గిరిజన యువకుడి రోల్స్ రాయిస్

గిరిశిఖర గ్రామానికి చెందిన ఓ యువకుడు తన నాయనమ్మ పడుతున్న అవస్థలు చూసి చలించాడు. ఎలాగైనా సరే తన నాయనమ్మకు ఇబ్బందులు లేకుండా తన వంతు సహకారం అందించాలని అనుకున్నాడు.
వెంటనే తన మెదడుకు పని చెప్పాడు. నాయనమ్మ అవసరం తీర్చి అందర్నీ అబ్బురుపరిచాడు. ఇదే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్‎గా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువ చోరుపల్లి అనే గిరిశిఖర గ్రామంలో మండంగి చిన్నమ్మి అనే 75 సంవత్సరాల వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఈమెకు కళ్లు సరిగా కనిపించవు. వృద్ధాప్యంపై పడటంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది. అయితే గిరిశిఖర గ్రామం కావడంతో ఆ గ్రామం నుండి ఏ చిన్నపాటి అవసరం ఉన్నా మైదాన ప్రాంతానికి రాక తప్పదు. గ్రామస్తులు అందరూ ఎన్నో ఇబ్బందులు పడి మోటార్ సైకిల్ వెళ్లగలిగే రహదారిని గ్రామానికి ఏర్పాటు చేసుకున్నారు. రాళ్లు, రప్పలతో ఉన్న ఆ రహదారిలో బైక్ ప్రయాణం కూడా అతికష్టం మీద చేయాల్సిందే.

అయితే ఇది ఇలా ఉండగా చిన్నమ్మికి కురుపాం మండల కేంద్రంలోనే ఏపి వికాస్ గ్రామీణ బ్యాంక్‎లో చిన్నమ్మికి బ్యాంక్ అకౌంట్ ఉంది. తనకు వచ్చే పెన్షన్ డబ్బుతో పాటు తన వద్ద ఉన్న కాస్తో కూస్తో డబ్బును ఆ అకౌంట్ లోనే దాచుకుంటుంది. తాను దాచుకున్న సొమ్ము కోసం తన ఖాతా ఉన్న ఏపి వికాస్ గ్రామీణ బ్యాంక్ కు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆమె అక్కడకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కనీసం మోటార్ సైకిల్ పై కూడా కూర్చునే ఓపిక ఆమెకు లేదు. దీంతో ఆమె పరిస్థితి గమనించిన ఆమె మనుమడు మండంగి శివ ఎలాగైనా సరే తన నాయనమ్మను బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి ఆమె అవసరం తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన నాయనమ్మ అనారోగ్యానికి సంభందించిన అవసరం కానీ, ఇతరత్రా చిన్నపాటి అవసరాలను తీర్చడానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో వినూత్నంగా ఆలోచించాడు.

తన వద్ద ఉన్న పరికరాలతోనే తన నాయనమ్మ కూర్చునేలా ఒక వాహనాన్ని తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడువుగా వాహనం తయారీలో నిమగ్నమయ్యాడు. తన వద్ద ఉన్న పాత మోటర్ సైకిల్ చక్రాలు ఒక పట్టె మంచానికి బిగించి తాళ్ళతో బలంగా కట్టి ఒక ట్రాలీలా తయారు చేశాడు. ఆ ట్రాలీలో కూర్చుంటే తన నాయనమ్మకు ఎండ తగులుతుందని ట్రాలీ పైన కర్రల సహాయంతో ఒక దుప్పటి ఏర్పాటుచేశాడు. అలా తయారు చేసిన ఆ ట్రాలీని మోటార్ సైకిల్ వెనుక తగిలించి తన నాయనమ్మని తీసుకొని కురుపాం బ్యాంక్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ బ్యాంక్‎లో నగదు విత్ డ్రా చేసుకొని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడు. తనకు నాయనమ్మపై ఉన్న ప్రేమాభిమానాలే ఈ వాహనం తయారీకి ఆజ్యం పోసిందని, ఈ ట్రాలీ సహాయంతో తన నాయనమ్మకు కావలసిన అవసరాలు తీరుస్తాను అంటున్నాడు మనువడు మండంగి శివ.

Sleep As Per Age: మీ వయస్సు ప్రకారం మీకు ఎంత నిద్ర అవసరమో తెలుసా?

Sleep As Per Age: ఈ కాలంలో నిద్రలేమి సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. దీనికి స్ట్రెస్ కారణం కావచ్చు. ఏ ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు. అయితే, నిద్రలేమితో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల కలుగుతాయి.
అయితే, మీ వయస్సు రీత్యా ప్రతిరోజూ ఎంత నిద్ర అవసరమో తెలుసుకుందాం.

నవజాత శిశువు..
అప్పుడే పుట్టిన శిశువు నుంచి మూడు నెలల పిల్లల వరకు నిద్ర అందరి కంటే ఎక్కువ అవసరం ఉంటుంది. నవజాత శిశువుకు రోజుకు దాదాపు 14- 17 గంటల నిద్ర అవసరం.

చిన్నపిల్లలు..
నాలుగు నెలల నుంచి 11 నెలల వరకు చిన్నపిల్లలకు రోజుకు 12-15 గంటల నిద్ర అవసరం ఉంటుంది.

ఏడాది నుంచి రెండేళ్లు ఉన్న పిల్లలకు ప్రతిరోజూ 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం ఉంటుంది. ఇది మంచి మెదడు పనితీరుకు ఎంతో అవసరం.
ప్రీ స్కూలర్స్..
మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఉన్న పిల్లలు ప్రతిరోజూ నిద్ర 10 గంటల నుంచి 13 గంటలు అవసరం ఉంటుంది. వీళ్లు ప్రీ స్కూల్‌ కు చెందినవారు. స్కూళ్లకు వెళ్లే ఆరు నుంచి 12 ఏళ్ల వయస్సు ఉండే పిల్లలకు సరైన నిద్ర అవసరం. ఇది వారి ఎదుగుదలకు ఎంతో అవసరం. ప్రతిరోజూ 9-12 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
టీనేజీ..
13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న టీనేజీ పిల్లలు స్పోర్ట్స్‌, చదువులతో ఎక్కువగా అలసిపోతారు. ఈ సమయంలో వారి అవయవాలు కూడా పెరుగుతుంటాయి. టీనేజీ ఉన్నవారికి ప్రతి రోజూ 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం ఉంటుంది.

పెద్దలు..
ఇక 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఉద్యోగాలు, ఫ్యామిలీ వర్క్‌తో బిజీగా ఉంటారు. వీళ్లు ఎక్కువ స్ట్రెస్‌కు కూడా గురవుతారు. ఈ వయస్సు వారికి ఎక్కువ రెస్ట్‌ కూడా అవసరం. ఈ వయస్సుకు చెందినవారు ప్రతిరోజూ 7-9 గంటల నిద్ర అవసరం.
61 ఏళ్లు ఆపైన ఉన్నవారికి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం అవుతుంది. ఈ వయస్సువారిలో నిద్రలేమి కూడా వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణం వారి ఆరోగ్య సమస్యలు(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Mannam Web దీనిని ధృవీకరించడం లేదు. )

ఈ ప్రపంచం బ్రహ్మ దేవుడ్ని ఎందుకు మర్చిపోయింది.. పూజార్హత ఎందుకు కోల్పోయాడో తెలుసా?

ఉగాది పండుగ యుగానికి నాంది పలుకుతుంది. మరి ఇలాంటి యుగానికి కారకుడైన దేవుడికి దేశంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవాలయం ఉందంటే మీరు నమ్ముతారా?
సృష్టికర్త గురించి ఆలోచించినప్పుడు, మనకి వెంటనే బ్రహ్మ దేవుడు గుర్తొస్తాడు. మరి అలాంటి దేవుడిని ఈ ప్రపంచం ఎందుకు మర్చిపోయింది? పూజార్హత ఎందుకు కోల్పోయాడో ఇక్కడ తెలుసుకుందాం.

పద్మ పురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పుష్కర్ వద్ద ఒక యాగం చేసాడు. అతని భార్య సరస్వతి తన భార్యతో కలిసి ఈ యాగంలో కూర్చోవలసి ఉంది, కానీ అతని భార్య సరస్వతి ఈ పూజకి ఆలస్యం చేసింది. పూజ సమయం దాటిపోతుందేమోనని అప్పుడు బ్రహ్మ స్థానిక గొర్రెల కాపరిని వివాహం చేసుకుని యాగానికి కూర్చున్నాడు. కొంతసేపటికి సరస్వతి అక్కడికి చేరుకుంది. యాగంలో బ్రహ్మ ప్రక్కనే ఉన్న మరో స్త్రీని చూసి ఆమె చాలా కోపం తెచ్చుకుని ఆ సమయంలో బ్రహ్మను శపించింది.

ఈ లోకం బ్రహ్మను మరచిపోతుందని సరస్వతి శపించింది. అలాగే బ్రహ్మదేవుడిని ఎవ్వరూ పూజించరని శపించింది. సరస్వతి కోపాన్ని చూసి, యాగం వద్ద ఉన్న దేవతలందరూ ఆమెను శాపాన్ని తొలగించమని కోరారు. కానీ ఇది అసాధ్యం. అయితే భూమ్మీద ఒక గుడి మాత్రమే గుడి ఉంటుందని, అక్కడ మాత్రమే పూజలు అందుకుంటారని సరస్వతి చెప్పింది. ఈ గుడిని ఎక్కడా నిర్మించాలనుకున్నా అక్కడ మొత్తం నాశనమైపోతుందని శపించింది.

Anantapur: పరీక్ష పేపర్ లో విద్యార్థి రాసింది చూసి మెంటలెక్కిపోయిన ఉపాధ్యాయుడు.. ఇంతకీ ఏం రాశాడంటే?

Anantapur: వార్షిక పరీక్షలంటే చాలు విద్యార్థుల్లో ఎనలేని భయం ఉంటుంది. పరీక్షలు బాగా రాయాలి. చేతిరాత బాగుండాలి.. మంచి మార్కులు సాధించాలనే తపన విద్యార్థుల్లో ఉంటుంది.
అయితే కొందరు విద్యార్థులు మాత్రం విభిన్నంగా ఉంటారు. సరిగ్గా చదవరు. పాఠశాలకు వచ్చినా.. మాస్టారు చెప్పే పాఠాలను సరిగ్గా వినిపించుకోరు. ఇంకా అలాంటివారు పరీక్షల్లో ఏం రాస్తారు? అలాంటి కోవకు చెందిన ఓ విద్యార్థి వార్షిక పరీక్షల్లో లెక్చరర్ ను తన రాతలతో బెదిరించాడు. దెబ్బకు అదిరిపోయిన ఆ ఉపాధ్యాయుడు తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే

అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇంతకీ అతడు ఆ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే.. ఇటీవల 10 పరీక్షలు పూర్తి కావడంతో అతనికి స్పాట్ (జవాబు పత్రాల మూల్యాంకనం) డ్యూటీ పడింది.. అతను తన డ్యూటీలో ఉండగా.. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని పరిశీలించాడు.. అందులో ఉన్న సమాధానాలు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. 28 పేజీల జవాబు పత్రం లో ఆ విద్యార్థి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కు కూడా సమాధానం రాయలేదు. 28 పేజీల్లో 25 పేజీలను ఖాళీగా ఉంచాడు. ఇంతకీ అందులో ” నీకు దమ్ముంటే నన్ను పాస్ చేయ్ ” అని రాశాడు. అంతటితోనే ముగించాడు.

షాక్ కు గురయ్యాడు

ఆ జవాబు పత్రాన్ని చూసిన ఆ ఉపాధ్యాయుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ సమాధానానికి అతడికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే బయటికి వచ్చి ఒక వీడియో తీశాడు. “అన్ని జవాబు పత్రాలు చూసిన నేను.. ఆ విద్యార్థికి సంబంధించిన ఆన్సర్ షీట్ చూడడంతో తలనొప్పి మొదలైంది. 28 పేజీలు ఉన్న ఆన్సర్ షీట్ మొత్తం ఖాళీగా ఉంది. ప్రారంభ పేజీని వదిలిపెట్టి రెండు, మూడు, నాలుగు పేజీల్లో “నీకు దమ్ముంటే నన్ను పాస్ చెయ్” అని నన్ను బెదిరించినంత పని చేశాడు.. ఆ జవాబు చూసి ఒక్కసారిగా నాకు తల తిరిగిపోయింది.. ఈ తలనొప్పి తగ్గించుకోవాలంటే అర్జెంటుగా నేను జ్యూస్ తాగాలి. ఆ జ్యూస్ తాగి వచ్చి.. మిగతా జవాబు పత్రాలు ఎలా ఉన్నాయో మీకు చెబుతాను.. ఆ విషయాలను మరో వీడియోలో పంచుకుంటానని” ఆ ఉపాధ్యాయుడు తన బాధను వెళ్ళగక్కాడు.

వైరల్ గా మారాయి

అనంతపురం జిల్లాలోని మూల్యాంకనం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఆ ఉపాధ్యాయుడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.. ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి తలుచుకుని చాలామంది లోలోపల నవ్వుకుంటున్నారు. మరి కొంతమంది బాగా రాశాడు కదూ! అంటూ సెటైర్లు వేస్తున్నారు. పరీక్ష ఇలా కూడా రాస్తారా? అంటూ కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా కాలేజీకి వెళ్లి, అధ్యాపకులు చెప్పే పాఠాలు విని.. సక్రమంగా పరీక్ష రాస్తే ఇలాంటి తిప్పలు తప్పేవి కదా? అని హితవు పలుకుతున్నారు. అదే సమయంలో ఆ ఉపాధ్యాయుడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Ugadi 2024 : రేపే ఉగాది.. తెలుగువారి కొత్త సంవత్సరం విశేషాలివీ

Ugadi 2024 : రేపే (ఏప్రిల్ 9న) ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం.
పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది. యుగం అంటే వయస్సు , ఆది అంటే ప్రారంభం అని అర్థం. మహారాష్ట్రలో ఉగాది పండుగను ‘గుడి పడ్వా’ పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగను బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు.

పండుగ విశేషాలివీ..

మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని అంటారు.
బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెబుతారు. కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేశాడన్నది పెద్దల భావన.
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు రాజ్యాధికారం స్వీకరించి పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే.
ఉగాది టైంలోనే వసంత ఋతువు కూడా మొదలవుతుంది.

కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలుపెడుతుంటారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొంటారు. కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు.
ఉగాది పండుగ రోజున పులిహోర, పాయసం, బొబ్బట్లు అనేవి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళ తయారు చేస్తారు.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ.

Income Tax: ఆదాయపు పన్ను శాఖకు హైకోర్టు మెుట్టికాయలు.. ఇక అలా చేయెుద్దంటూ..!!

High Court: పన్ను చెల్లింపుదారులు, సంస్థలకు తరచుగా ఆదాయపు పన్ను శాఖ నుంచి వివరణ కోరుతూ నోటీసులు వస్తుంటాయి. మరికొన్ని సార్లు పెనాల్టీలకు సంబంధించిన నోటీసులు కూడా వస్తుంటాయి. వీటి విషయంలో ప్రజలు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు.
తాజాగా పన్ను చెల్లింపుదారుల హక్కులను పరిరక్షించే తీర్పును హైకోర్టు ఇచ్చింది. ఆదాయపు పన్న అధికారులు ఏదైనా చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు పూర్తి సమాచారాన్ని అందించాలని తన తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పుతో పన్ను చెల్లింపుదారుల హక్కులతో పాటు ప్రభుత్వాలు బాధ్యతతో మెలగటంపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్ & హర్యానా హైకోర్టు ముంజాల్ BCU సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు వ్యతిరేకంగా నవంబర్ 2022 షో-కాజ్ నోటీసును రద్దు చేసింది. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటే ముందుగా నోటీసులు సరిగా అందించాలని కోర్టు పేర్కొంది. కేవలం నోటీసులను పన్ను అధికారులు తమ ఈ-పోర్టల్ లో ఉంచి దానిని సదరు వ్యక్తికి కమ్యూనికేట్ చేసినట్లు ఊహించుకోవటం సరైనది కాదని నొక్కి చెప్పింది.
ఆదాయపు పన్ను శాఖాధికారులు ముందుగా సదరు వ్యక్తిగా ఈమెయిల్ ద్వారా అందించాలనుకున్న నోటీసులను పంపాలని తన రూలింగ్ లో వెల్లడించింది. అలాగే సమన్లు, ఆర్డర్లు, నోటీసులు, అవసరమైన సమాచారం కోరటం, నిర్ధారణలు వంటి చర్యలకు మెయిల్స్ పంపాలని తీర్పులో సూచించింది. అంటే సరైన రీతిలో పన్ను చెల్లింపుదారులకు సమాచారం అందించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవటం సరైనది కాదని మందలించింది.

Health

సినిమా