Sunday, November 17, 2024

అక్కడ ప్రతి పురుషుడూ ఇద్దరు మహిళల్ని పెళ్లిచేసుకోవాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే..

ఆధునిక ప్రపంచం రోజురోజుకూ అభివృద్ధివైపు దూసుకెళ్తోంది. గతంతో పోలిస్తే మానవ సంబంధాల విషయంలోనూ ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు, సంప్రదాయాలు, ప్రజల ఆచార వ్యవహారాలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి.
అతి పురాతన పద్ధతులు, ఆశ్చర్యానికి గురిచేసే ఆచారాలు పాటించేవారు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉన్నారు. కొందరు ప్రత్యేక నియమ, నిబంధనలను పాటిస్తుంటారు. అలాంటి వారిలో ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా (Eritrea Polygamy) తెగ కూడా ఒక్కటి. ఈ తెగ ప్రజల వివాహాలు ఇతర ప్రపంచానికి భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్క పురుషుడు తప్పకుండా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకొని తీరాల్సిందేనట.

స్త్రీలు కూడా కాదనడానికి లేదు..

చాలా వరకు పెళ్లిళ్లు సంప్రదాయాలు, ఆచారాలపైనే ఆధారపడి కొనసాగుతుంటాయి. అయితే ఆయా దేశాలు, ప్రాంతాలను బట్టి భిన్నంగా ఉంటాయి. ఒకప్పటి పురాతన సంప్రదాయంలో బహు భార్యత్వం ఉండేదని మనకు తెలిసిందే. కానీ ఈ సంప్రదాయం క్రమంగా కనుమరుగైపోయింది. ఇప్పుడు చాలా చోట్ల ఒక పురుషుడు ఒక భార్యను మాత్రమే కలిగి ఉండే, చట్టం ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మొదటి భాగస్వామికి విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆఫ్రికాలో ఖండంలోని ఎరిత్రియా తెగలో మాత్రం అలా కాదు. వీరి వివాహ సంప్రదాయం చాలా డిఫరెంట్. ఇక్కడి ప్రతి పురుషుడు రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. కాదు కూడదు అంటే జైల్లో వేస్తారట. చట్టం, సంప్రదాయం ఉల్లంఘించిన కారణంగా జీవిత ఖైదు పడే చాన్స్ కూడా ఉంటుంది. ఇక మహిళలు కూడా దానికి అంగీకరించాల్సిందే. ప్రతి వివాహిత స్త్రీ తన భర్తను మరో మహిళతో పంచుకోవాలి. అడ్డు చెబితే ఇక్కడి చట్టం, సంప్రదాయం ఒప్పుకోదు.

ఎందుకలా?

ఎరిత్రియా తెగలోని ప్రతి పురుషుడు ఇద్దరు భార్యలను చేసుకోవాలన్న నిబంధన వెనుక ఓ రీజన్ ఉంది. ఈ తెగలో దశాబ్దాల కాలంగా పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంటూ వస్తోందట. అందుకే స్త్రీ, పురుష నిష్పత్తిని సమానంగా ఉండేలా చేయడానికి ఇక్కడి పురుషులు ఇద్దరు మహిళలను చేసుకోవాలన్న ఆచారం కూడా కొనసాగుతూ వస్తోంది. పైగా దానిని చట్టంగా కూడా మార్చారట. అయితే ఈ ఎరిత్రియా వివాహ వ్యవస్థపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయినా ఇక్కడి ప్రజలు తమకు సంప్రదాయం, చట్టమే ముఖ్యమని అదే అనుసరిస్తూ వస్తున్నారు.

Free Training in Land Surveyor Course: ల్యాండ్‌ సర్వేయర్‌ కోర్సులో ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో తమ సంస్థ ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ ల్యాండ్‌ సర్వేయర్‌ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎన్టీఆర్‌ జిల్లా అధికారి పి.నరేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో భూమి కొలతలు, హైవే రోడ్డు లెవలింగ్‌, ఆటో లెవలింగ్‌, కెనాల్‌ సర్వే అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి సర్టిఫికెట్‌తో పాటుగా ప్రవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కూడా చూపిస్తామని చెప్పారు.

10వ తరగతి పాసై18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 11వ తేదీ లోగా విద్యాధరపురం కబేళా సెంటర్‌లో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ బాయ్స్‌ హాస్టల్‌ ఆవరణలోని తమ కార్యాలయానికి పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌ కార్డు, ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబరుతో వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 98482 55009, 98667 95010 నెంబరులో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

ఈ నూనెను రోజు నైట్ ముఖానికి ఇలా రాశారంటే చర్మం పై ఒక్క మచ్చ కూడా ఉండదు

నువ్వుల నూనె( Sesame Oil )మనందరికీ అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆయిల్స్ లో ఒకటి. నువ్వుల నుంచి తయారు చేయబడే నూనెను ప్రాచీన కాలం నుంచి వంటలకు వాడుతున్నారు.
అలాగే అనేక అనారోగ్య సమస్యల చికిత్సలో కూడా నువ్వుల నూనెను ఉపయోగిస్తుంటారు. మిగతా వాటితో పోలిస్తే నువ్వుల నూనె అత్యంత శ్రేష్టమైనది. నువ్వుల నూనెలో ప్రోటీన్ తో పాటు అనేక రకాల విటమిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల చాలా మంది వంటలకు నువ్వుల నూనె వాడుతుంటారు.

అయితే ఆరోగ్య పరంగానే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా నువ్వుల నూనె సహాయపడుతుంది. మనలో ఎంతో మందికి ముఖ చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. అవి ఎన్ని చేసినా కూడా ఓ పట్టాన వదిలిపెట్టవు. అలాంటివారికి నువ్వుల నూనె ఒక వరమనే చెప్పవచ్చు.

నువ్వుల నూనెను రోజు నైట్ ఇప్పుడు చెప్పబోయే విధంగా ముఖానికి రాశారంటే చర్మం పై ఒక్క మచ్చ కూడా ఉండదు. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసి రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని చేతి వేళ్ళతో కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నువ్వుల నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ సమృద్ధిగా ఉన్నాయి.ఇవి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి. చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా వాటిని క్రమంగా మాయం చేస్తాయి. పిగ్మెంటేషన్ సమస్యను సైతం దూరం చేస్తాయి.

అలాగే నువ్వుల నూనె చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది. ముడతలు ఏమైనా ఉంటే మటుమాయం చేస్తుంది. అలోవెరా జెల్‌ స్కిన్ ను హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మరియు చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది. కాబట్టి మచ్చలేని మెరిసే యవ్వనమైన చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని రెగ్యులర్ గా ట్రై చేయండి.

 

Bay Leaf Burn: బిర్యానీ ఆకును ఇంట్లో కాల్చి చూడండి.. జరిగే అద్భుతాలను నమ్మలేరు..! నిజమండోయ్..

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో వేలాది మొక్కలు ఉన్నాయి. ఇవి వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల మొక్కలను ఔషధ మొక్కలుగా సాంప్రదాయ వైద్యంతో పాటు ఇంగ్లీష్‌ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు.
ఆరోగ్యానికి ఉపయోగపడే లెక్కలేనన్ని లక్షణాలతో నిండిన అటువంటి అద్భుతమైన మొక్క బిర్యానీ ఆకు.. ఈ ఆకులు ఆహారం రుచిని పెంచడమే కాకుండా పోషకాలను కూడా పెంచుతాయి. బిర్యానీ ఆకులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది ఇది ఒక మసాలా అకుగానే భావిస్తారు. అయితే ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిర్యానీ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనేక పరిశోధనలు చెప్పగా, దీన్ని తినడమే కాకుండా ఇంటిలోపల కాల్చడం, వాసన పీల్చడం వల్ల కూడా అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
బిర్యానీ ఆకు ప్రయోజనాలు ఏమిటంటే ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందుకే దీనిని శతాబ్దాలుగా ప్రకృతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. సతత హరిత పొద అయిన లారెల్ మొక్క నుండి బిర్యానీ ఆకులు వస్తాయి. ఈ మూలిక ఆకులు నూనె, ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, బిర్యానీ ఆకులు వేడిని కలిగిస్తాయి. అందువల్ల కఫ, వాత దోషాలను తొలగిస్తుంది. అంతేకాదు..బిర్యానీ ఆకును కాల్చి ఆ వాసన పీల్చటం వల్ల మనస్సు ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించటం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి, వాసన వస్తాయి.
రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చటం వల్ల వాటి నుంచి పొగ వ్యాపిస్తుంది. ఈ సమయంలో ఆ గది తలుపులు మూసివేయాలి. ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు తలుపులను మూసి ఉంచాలి. దాంతో ఆ పొగ గదిలో అంతటా బాగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత గదిలో మంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చుకుంటే కూడా మంచిది. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు, మీ రూమ్‌ అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమలు ఉంటే కూడా పారిపోతాయి.
అంతేకాదు.. బిర్యానీ ఆకులతో నిద్రలేమి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. బిర్యానీ ఆకులు మీ శరీరానికి విశ్రాంతిని అందించడంలో సహాయపడతాయి. ఇవి మీ మెదడు పనితీరును శాంతపరచడం వల్ల నిద్రలేమిని దూరం చేస్తుంది. నిద్రపోయే ముందు మీ గదిలో నాలుగు బిర్యానీ ఆకులను కాల్చి వాసన పీల్చినా, లేదంటే, ఒక చెంబు నీళ్లల్లో రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగినా కూడా మంచి నిద్రకు దారితీస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు MannamWeb బాధ్యత వహించదు.)

గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్స్.. 58 శాతం మందిలో పెరిగిన రిస్క్

ప్లాస్టిక్ వాడకం ఒక ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని చాలా కాలంగా వింటున్నాం. బాటిల్ వాటర్ నీళ్లలోనూ నానో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని నిపుణులు హెచ్చరించారు.
తరచూ ప్లాస్టిక్ ఎక్స్‌పోజర్‌కు గురికావడంవల్ల మానసిక రుగ్మతలు, నరాల బలహీనత, క్యాన్సర్లు వంటివి తలెత్తుతాయని గత నివేదికలు కూడా పేర్కొన్నాయి. అయితే తాజాగా గుండె జబ్బులు కలిగిన పేషెంట్ల ఆర్టెరీస్ (దమనులు)లోనూ ప్లాస్టిక్స్ ఉంటున్నాయని, మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకుండా అడ్డుపడుతున్నాయని, కొన్నిసార్లు సడెన్ హార్ట్‌ ఎటాక్ రావడానికి దారితీస్తున్నాయని ఇటలీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

వీరిలోనే ఎక్కువ

వాస్తవానికి ధమనులు అనేవి గుండె నుంచి శరీరానికి, శరీరం నుంచి గుండెకు రక్త సరఫరా చేసే ముఖ్యమైన రక్త నాళాలు. అయితే గుండె జబ్బుల బారిన పడినవారిలో దాదాపు సగానికంటే ఎక్కువమంది ధమనుల్లో మైక్రోప్లాస్టిక్స్ ఒక ఫలకంగా ఏర్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా ఆర్టెరీ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కలిగిన పేషెంట్లపై దృష్టి కేంద్రీకరించారు. సర్జరీల సమయంలో వారి అవయవాలను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కరోటిడ్ ధమనిలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నట్లు కనుగొన్నారు. వీటి విశ్లేషణ కోసం వారు పైరోలిసిస్ – గ్యాస్, క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ, స్థిరమైన ఐసోటోప్ ఎనలైజింగ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించారు.

58 శాతం మందిలో అదే ప్రాబ్లం

హార్ట్ సర్జన్లు కూడా అయినటువంటి ఇటలీ పరిశోధకులు గుండె జబ్బుల రోగుల్లో శస్త్ర చికిత్సల సందర్భంగా ప్రతి 10 మంది రోగులలో ఆరుగురికి వారి ధమనులలో ప్లాస్టిక్ కణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా పాలిథిలిన్, షాపింగ్ బ్యాగ్స్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ను తయారు చేసే పదార్థాలు 58.4 శాతం మంది రోగుల ఆర్టెరీస్‌లో పెక్కులు లేదా ఫలకం రూపంలో పేరుకుపోయి ఉండటాన్ని కనుగొన్నారు. పైపుల నుంచి వినైల్ రికార్డుల వరకు అన్నింటిలోనూ ఉపయోగించే పాలీ వినైల్ క్లోరైడ్ ఇందులో 12.1 శాతం వరకు ఉందని కూడా తెలిపారు. అయితే అవి మానువులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా పరిశోధకులు అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా వారు దాదాపు 34 నెలల సగటు వ్యవధిలో 257 మంది రోగుల ఆరోగ్య ఫలితాలను విశ్లేషించారు. మైక్రోప్లాస్టిక్స్ గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణం వంటి తీవ్రమైన హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించారు.

10 Facts About Bananas : అరటిపండ్ల గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు తెలుసా..? 90 శాతం మందికి తెలియవు..!

10 Facts About Bananas : మనం ఆహారంగా తీసుకునే రుచికరమైన పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు.
అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిగా లభిస్తూ ఉంటుంది. అలాగే అరటి పండ్లను అందరూ కూడా సులభంగా కొనుగోలు చేసి తీసుకోవచ్చు. అరటిపండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక అరటిపండును తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. అసలు రోజూ ఒక అరటిపండును ఎందుకు తీసుకోవాలి… దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. అరటిపండులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. అరటిపండ్లు ట్రిప్టోఫాన్ ను కలిగి ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
కండరాల తిమ్మిర్లు, కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండ్లల్లో ఫ్రక్టోలిగోసాకరైడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి. దీంతో అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. ఎముకలు గుళ్లబారడం, బోలు ఎముకలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అరటిపండు బీటా కెరోటీన్ ను కలిగి ఉంటుంది. బీటా కెరోటీన్ మన శరీరంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ మారుతుంది. కనుక అరటిపండ్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దృష్టి లోపాలు తగ్గుతాయి.
అరటిపండును తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అరటిపండ్లను తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. రోజూ అరటిపండును తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అరటిపండును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కనుక వీటిని రోజూ ఒకటి చొప్పున తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లను నేరుగా తినడంతో పాటు స్మూతీ, ఓట్ మీల్, ఫ్రూట్ సలాడ్ వంటి వాటితో కూడా కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Business Idea: తక్కువ పెట్టుబడి భారీగా ఆదాయం.. ఈ బిజినెస్‌ స్టార్ట్ చేస్తే మీకు తిరుగుండదు

ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పటిలా ఉద్యోగం చేశాక వ్యాపారం చేద్దామనుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ, చదువు పూర్తికాగానే వ్యాపారం చేద్దామనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిద్దామా ఆసక్తి ఎక్కువుతోంది. ఇందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ముందుకుసాగుతున్నారు. అయితే మీరు కూడా వ్యాపారం చేద్దామని ఆలోచనలో ఉన్నారా.? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే మంచి వ్యాపారం ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్లో చిప్స్‌కు భారీగా డిమాండ్‌ ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చిప్స్‌ను ఎంతో ఇష్టపడి తింటున్నారు. కొన్ని బహుళ జాతి కంపెనీలు ప్రకటనలకే కోట్లలో ఖర్చు పెడుతున్నాయి అంటేనే చిప్స్‌ వ్యాపారం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం లోకల్‌ బ్రాండ్‌ పేరుతో ఆలు చిప్స్‌ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాన్ని ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పొటాటో చిప్స్‌ తయారీకి ముందుగా ఒక మిషన్‌ అవసరం పడుతుంది. చిప్స్‌ తయారీ ఆధారంగా ఈ మిషన్‌ ధర ఆధారపడింది. మార్కెట్లో మ్యానువల్‌గా (చేతులతో) చిప్స్‌ తయారు చేసే మిషన్‌ ధర రూ. 1000 నుంచే అందుబాటులో ఉంది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ చిప్స్‌ తయారు చేయాలంటే ఆటోమేటిక్‌ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ. 20 వేల నుంచి ప్రారంభమవుతుంది. దీంతో అలుగడ్డల తొక్కలను తీసి మిషిన్‌లో వేస్తే చాలు మీరు కోరుకున్న విధంగా చిప్స్‌ బయటకు వస్తాయి.

ఇక చిప్స్‌ తయారీకి ప్రత్యేంగా స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఒక గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. కరెంటర్‌ కూడా పెద్దగా ఖర్చవదు. ఇక చిప్స్‌లో కలిపే మసాలా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మసాలతోనే చిప్స్‌కు రుచి వస్తుంది. ఆ తర్వాత ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి చిప్స్‌ను విక్రయించుకోవచ్చు. ఇందుకోసం ప్యాకింగ్‌ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండే చిన్న చిన్న దుకాణాలకు నేరుగా వెళ్లి మీ ప్రొడక్ట్‌ను ప్రమోట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మార్కెట్‌ చేసుకున్న ఆధారంగా నెలకు తక్కువలో తక్కువగా రూ. 30 వేల వరకు సంపాదించొచ్చు.

Bhimaa Movie Review – భీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ – సినిమా హిట్టా? ఫట్టా?

Gopichand’s Bhimaa Movie Review In Telugu: మ్యాచో స్టార్ గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్లు చేసిన ప్రతిసారి ఆయనకు మంచి పేరు, విజయాలు వచ్చాయి.
ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాల్లో పోలీసుగా నటించారు. ‘భీమా’తో మరోసారి పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ఉందని గోపీచంద్ చెప్పారు. ఆ ట్విస్ట్ ఎలా ఉంటుంది? గోపీచంద్ ఎలా చేశారు? హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఎలా నటించారు? కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది?

కథ (Bhimaa Movie Story): మహేంద్రగిరిలో భవాని (ముఖేష్ తివారి)కి తిరుగులేదు. ఆయనకు ఎదురు తిరిగితే పోలీస్ అధికారుల్ని అయినా సరే చంపేస్తారు. చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల జోలికి ఎవరొచ్చినా ఊరుకోడు. ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. ఆ తర్వాత భీమా (గోపీచంద్) ఎస్సైగా వస్తాడు. వచ్చీ రావడంతో భవానీకి వార్నింగ్ ఇస్తాడు. భవాని మనుషుల్ని టార్గెట్ చేస్తాడు. ఆఖరికి చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల దగ్గరకు వస్తాడు.
భవాని ట్యాంకర్లలో రహస్యం ఏమిటి? పకృతి వైద్యుడు రవీంద్ర వర్మ (నాజర్) ఏం చేశాడు? విద్య (మాళవికా శర్మ) వల్ల భీమా జీవితంలో ఏం జరిగింది? రామా (గోపీచంద్), పారిజాతం (ప్రియా భవానీ శంకర్) ఎవరు? భీమా మీద విజయం కోసం భవాని తన బలం, బలగాన్ని మహేంద్రగిరిలో దించడంతో ఏం జరిగింది? వీళ్లకు, మహేంద్రగిరిలోని పరశురామ క్షేత్రంలో ఐదు దశాబ్దాలుగా మూత పడిన శివాలయానికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Bhimaa Review Telugu): గోపీచంద్ చెప్పినట్లు ఇంతకు ముందు ఆయన నటించిన పోలీస్ సినిమాలకు, ‘భీమా’కు చాలా డిఫరెన్స్ ఉంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్ కథను కొత్తగా చూపించింది. అయితే… హీరో ఇంట్రడక్షన్ మొదలు ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ చిత్రాలను తలపించిందీ ‘భీమా’.
భీమా’ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు పదిహేను నిమిషాల వరకు హీరోను చూపించలేదు. పరశురామ క్షేత్రం, ఆ శివాలయంలో జరిగే పూజల గురించి వివరించారు. అప్పుడు ఏదో తెలియని ఆసక్తి కలుగుతుంది. హీరో పరిచయమైన తర్వాత ఆసక్తి నెమ్మదిగా తగ్గుతుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ వరకు మళ్లీ గుడి ప్రస్తావన ఉండదు.

హీరో పరిచయం తర్వాత ‘భీమా’ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మారింది. భీమా, విద్య లవ్ ట్రాక్ బాలేదు. మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్లు ఉన్నారు. రామా, పారి లవ్ ట్రాక్ కూడా కొత్తగా లేదు. సోషియో ఫాంటసీ పాయింట్ తీసుకుని రాసిన కొత్త కథను ఆ రెండు లవ్ ట్రాక్స్ సాదాసీదాగా మార్చాయి. ప్రేమ కథలు, కామెడీ సీన్లు బాగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

రవి బస్రూర్ పాటల కంటే నేపథ్య సంగీతం ‘భీమా’ చిత్రానికి బలంగా నిలిచింది. యాక్షన్ సీన్లకు చేసిన రీ రికార్డింగ్ బావుంది. గోపీచంద్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ మాస్ సినిమాకు కావాల్సిన మూడ్ స్క్రీన్ మీద చూపించింది. నిర్మాత కెకె రాధామోహన్ ఖర్చుకు వెనకాడలేదు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. ఫస్టాఫ్లో అనవసరమైన సన్నివేశాల విషయంలో ఎడిటింగ్ పరంగా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు.

Gopichand Bhimaa Review గోపీచంద్ లుక్స్ గురించి మాట్లాడాలి. ఆయన రెండు లుక్స్లో కనిపించారు. ఇంతకు ముందు సినిమాలతో కంపేర్ చేస్తే హ్యాండ్సమ్గా, స్లిమ్గా ఉన్నారు. హుషారుగా కనిపించారు. ఎనర్జీ చూపించారు. భీమాగా పోలీస్ పాత్రలో మీసకట్టు, రామాగా పొడవాటి జుట్టుతో డిఫరెన్స్ చూపించారు. నటనలో ఎప్పటిలా 100 పర్సెంట్ ఇచ్చారు. హీరోయిన్లలో మాళవికా శర్మకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. మాస్ ఆడియన్స్ కోసం అన్నట్లు ఆమెను గ్లామరస్గా కనిపించారు. పతాక సన్నివేశాల్లో ప్రియా భవానీ శంకర్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.
‘భీమా’ను హీరో సెంటిక్ సినిమా అని చెప్పలేం. కానీ, కథంతా ఎక్కువ హీరో చుట్టూ నడుస్తుంది. మిగతా పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంది. అయితే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్ల తరహాలో ఉంటాయి. ముఖేష్ తివారి కొంత విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించారు. ‘బాహుబలి’లో బిజ్జలదేవ టైపులో బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేశారు. రవీంద్ర వర్మగా పాత్రకు తగ్గట్టు నాజర్ నటించారు. రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్, సీనియర్ నరేష్, సప్తగిరి, ‘చమ్మక్’ చంద్ర, సరయు. భద్రం సహా కొందరు కమెడియన్లు ఉన్నారు. సీనియర్ నరేష్ మినహా మిగతా వాళ్లకు సరైన కామెడీ సీన్లు పడలేదు.
‘భీమా’లో దర్శకుడు ఎ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అందులో నావెల్టీ ఉంది. సినిమా ప్రారంభం, ముగింపు బాగా రాసుకున్నారు. మధ్యలో సో సో సీన్లతో నింపేశారు. గోపీచంద్ చాలా వరకు సినిమాను నిలబెట్టారు. ఆయన ఎనర్జీ, నటన అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. చివరి 30 నిమిషాల్లో అసలు కథ ఉంది. అదొక కొత్త అనుభూతి ఇస్తుంది. ఆ అరగంట ఆయువుపట్టుగా నిలిచింది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే గోపీచంద్ నటన, క్లైమాక్స్, యాక్షన్ సీన్లు నచ్చుతాయి. మాస్ ఆడియన్స్ను మెప్పించే చిత్రమిది.

Mini Air cooler : వేసవిలో అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే మినీ ఎయిర్ కూలర్స్. కేవలం రూ.400 మాత్రమే..!

Mini Air cooler : వేసవికాలం వచ్చిందంటే చాలు కూలర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా ఉండడంతో ఈసారి వేసవికాలం ఎలా ఉండబోతుందో ముందే ప్రజలకు అవగాహన వచ్చింది.
దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ఏసీ మరియు కూలర్ల వైపే ఉందని చెప్పాలి. అయితే చాలామందికి వీటిని కొనుగోలు చేయాలని ఉంటుంది కానీ సరిపడా డబ్బులు లేక వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ వేసవిలో అతి తక్కువ ధరకే లభించే కూలర్ ను తీసుకువచ్చాం. మరి ఆ కూలర్ వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వేసవిలో డబ్బు ఆదా చేసుకోవాలనుకునే వారికి ఈ మినీ కూలర్ బాగా ఉపయోగపడుతుంది.అదేవిధంగా ఆఫీస్ లో లేదా కారు లో ఈ మిని కూలర్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ మినీ కూలర్ ధర విషయానికి వచ్చినట్లయితే వాటి పరిమాణం ప్రకారమే చాలా చౌకగా లభిస్తాయి. అయితే ఈ మినీ కూలర్ ను కొనుగోలు చేయడానికి మీరు 400 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు వీటిని ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి అలాంటి మినీ కూలర్ల వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఛార్కి మినీ కూలర్ : ఈ చార్కి మినీ కూలర్ మనకు ఈ కామర్ సైట్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఇక దీని ధర రూ.999 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిని ఈ కామర్స్ సైట్ వాళ్ళు ఆఫర్ లో రూ.499కి అందుబాటులో ఉంచారు. అంటే ఈ ఆఫర్ ద్వారా మీరు ఈ మినీ కూలర్ ను రూ.499 కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ కూలర్ ను మీ ఆఫీస్ లేదా షాప్ టేబుల్స్ పై ఉంచడం ద్వారా వినియోగించుకోవచ్చు. అలాగే చల్లని గాలి కోసం ఈ కూలర్ లో రిఫ్రిజిరేటర్ నీటిని కూడా ఉంచుకునే ఆప్షన్ కలదు.

Suzec పోర్టబుల్ జ్యూయల్ బ్లేడ్ బ్లెస్ మినీ కూలర్… : ఇది డ్యూయల్ బ్లేడ్ లెస్ కూలర్. ఇక ఈ మినీ కూలర్ లో మీరు రెండు దిశలలో గాలిని అందుకోవచ్చు. ఇక ఈ మినీ కూలర్ మనకు అమెజాన్ నుండి రూ.332 కే అందుబాటులో ఉంది. ఈ మినీ ఎయిర్ కూలర్స్ ను కార్ డాష్ బోర్డులపై ఉంచడం ద్వారా ఉపయోగించుకోవచ్చు.
రూమ్ కూలింగ్ మినీ కూలర్ : ఈ రూమ్ కూలింగ్ మినీ కూలర్ మనకు ప్రస్తుతం 83% తగ్గింపు ధరకే లభిస్తుంది. ఇక ఈ మినీ కూలర్ అసలు ధర విషయానికి వస్తే రూ.2999 గా ఉంది. కానీ ఇది ఆఫర్ లో తగ్గింపు ధరతో రూ.495 కే అందుబాటులో ఉంది. ఇక దీనిలో కూడా చల్లని గాలి కోసం రిఫ్రిజిరేటర్ నీటిని ఉపయోగించవచ్చు.

SEMAPHORE ఎయిర్ కూలర్ : ఈ ఎయిర్ కూలర్ మనకు అమెజాన్ లో రూ.999కి ఉండగా 60% తగ్గింపుతో ఇప్పుడు ఇది కేవలం రూ.399కే కొనుగోలు చేయవచ్చు.

ఆ గ్రామం నాగుపాములకు పుట్టినిల్లు.. సొంతబిడ్డల్లాగా చూసుకుంటున్న ప్రజలు..

సాధారణంగా పాములకు చాలా దూరంగా ఉంటాం. అందులోనూ నాగుపాములు అంటే మరి భయం. అవి మన పరిసరాల్లోకి, ఇంట్లోకి ప్రవేశిస్తే.. అక్కడ్నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తాం.
కానీ ఈ గ్రామస్థులు మాత్రం.. నాగుపాములతో కలిసి నివసిస్తున్నారు. నాగుపాములను తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్రామం నాగుపాములకు పుట్టినిల్లుగా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ నాగుపాములు దర్శనమిస్తాయి. మరి ఆ గ్రామం ఎక్కడుందంటే.. మన ఇండియాలోని మహారాష్ట్రలో.

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని స్థానికులు పాముల భూమి, పాముల దేవస్థానం అని పిలుస్తారు. మన దేశంలో నాగుపాములను పరమ శివునితో సమానంగా చూస్తారు. కాబట్టి ఆ గ్రామంలో నాగుపాములను ఎంతో గౌరవంగా చూసుకుంటూ, తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. నాగుపాములను నిత్యం పూజిస్తూ.. వాటితో సహజీనవం చేస్తున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ, వాస్తవం.
నాగుపాములకు భయపడరు..

విషపూరితమైన ఈ నాగుపాములకు షెట్పాల్ గ్రామప్రజలు అసలు భయపడరు. వాటి మధ్యనే స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ప్రతి ఇంట్లో పాములకు దేవస్థానం అనే ప్రత్యేక ప్రాంతం కూడా ఉంటుంది. స్థానికులు ఎవరైనా సొంతిల్లు నిర్మించుకున్నప్పుడు పాములు నివసించేందుకు, అవి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఒక గదిలాంటి నిర్మాణాన్ని నిర్మిస్తారు. ఇక ఆ ప్రాంతంలోనే పాములు ఉంటాయి. పాములు కూడా మనషులకు భయపడవు. పిల్లలు నాగుపాములతో కలిసి మెలిసి ఉంటారు. 2,600 మంది ప్రజలు నివసిస్తున్న ఆ గ్రామంలో నాగపంచమి రోజు సందడిగా ఉంటుంది. ఆ రోజున ఇతర గ్రామాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు. పాములకు పూజలు చేసి దైవానుగ్రహం పొందుతారు.

Maha Shivaratri 2024: యూరప్‌లో మిస్టరీ శివలింగం.. ఎన్నిసార్లు దాడిచేసినా చెక్కుచెదరలేదు

ఇండియాలోనే కాదు.. చాలా దేశాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ భూమిపై ఎన్నో ప్రాంతాల్లో పరమ శివుడు పూజలందుకుంటున్నాడు. ఐర్లాండ్‌లో కూడా ఓ పురాతన మిస్టరీ శివలింగం ఉంది.
మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన పొడువాటి శివలింగం వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఉంటుంది. వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు. స్థానికులు ‘లియా ఫెల్’ అని పిలుస్తారు. అంటే అదృష్ట శిల అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అలానే ఉంది.

లియా ఫెల్ చరిత్ర

క్రీ.శ. 1632-1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ”ది మైనర్స్ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్”లో శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ‘తుథాడి దేనన్’ వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్లు అందులో పేర్కొన్నారు. తుథాడి దేనన్ అంటే ‘దను’ దేవత పిల్లలు అని అర్థం. వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు ఐర్లాండ్‌ని పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించేవారు అంతేకాదు ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఇక్కడే జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

దను దేవత:

యూరోపియన్ సంప్రదయాల్లో దనను నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు పెట్టారు. ఇక మన వేద సంస్కృతిలోనూ దును దేవత ప్రస్తావన ఉంది. ఆమె దక్ష ప్రజాపతి కూతురు. కశ్యప ముని భార్య. నదీ దేవతగా కొలిచేవారు. దను సోదరి సతీ దేవి. శివుడిని పెళ్లి చేసుకుంది. తదుపరి జన్మలో సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని లియా ఫైల్‌ని శివలింగంగా భావిస్తారు.

ఐర్లాండ్‌లో ఉన్న ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. 2012లో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు దాడి చేశాడు. 2014లో కొందరు వ్యక్తులు శివలింగంపై పెయింట్ పోశారు. అంతేకాదు ఎన్నోసార్లు క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఐర్లాండ్‌తో పాటు అతి పురాతన నగరాలైన పాల్మైరా (సిరియా), నిమ్రుద్ (ఇరాక్)లోనూ శివుడిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి.

ఇతర దేశాల్లోని శివలింగాలు:

స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో స్వర్ణ శివాలయముంది. తుర్కిస్థాన్ సిటిలో 1200 అడుగుల శివలింగం, హైడ్రోపొలిస్ నగరంలో 300 అడుగుల శివలింగం, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఎన్నో శివలింగాలు ఉన్నాయి. యూరప్‌లోని కారిత్‌లో పార్వతి దేవాలయం, కంబోడియాలో ఓ పురాతన శివలింగం ఉంది. జావా, సుమత్రా దీవులు, నేపాల్,పాకిస్తాన్, ఈజిప్ట్ దేశాల్లోనూ పలు చోట్ల శివలింగాలు ఉన్నాయి.

బీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టేలా కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్‌ఎల్పీ చీలికపై ఫోకస్!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికార ‘హస్తం’ పార్టీలో చేరిపోయారు.
చేరిన వారిలో సాధారణ కార్యకర్త మొదలు ఎమ్మెల్యేల వరకూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి చేరికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. చేంజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి్ంది. వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం పలు రకాలుగా ఆలోచిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందా.. లేక ఆ తరువాత స్టార్ట్ చేయాలా ? అని దానిపై ఆరా తీస్తున్నది. చేరికల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడితే పొలిటికల్‌గా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేస్తున్నది. ఈ మూడు నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డిని ఏడుగురు గులాబీ ఎమ్మెల్యేలు కలిశారు. వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేలా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
3 నెలల్లో 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

గతేడాది డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు. ఈ రెండు మూడు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సీఎంతో మీట్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌కు ముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్‌రావు, మహిపాల్ రెడ్డి.. సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా ఎప్పుడో ఒకసారి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

జంపింగ్‌కు డజన్ మంది రెడీ?
ఇప్పటికిప్పుడు డజను మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు ధీమాగా చెబుతున్నారు. ‘ఫోన్ చేసి పిలిచిన అరగంటలోపు గాంధీభవన్ మెట్లు ఎక్కేందుకు సదరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు’ అని ఓ సీనియర్ మంత్రి జిల్లాల వారీగా పార్టీ మారే ఎమ్మెల్యేల సంఖ్యను వివరించారు. అయితే వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు జాయిన్ చేసుకుంటే రాజకీయంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే దానిపై ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

కేసీఆర్‌కు ఝలకిచ్చే ప్లాన్
మాజీ సీఎం కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కామెంట్స్ చేయడంపై ఏఐసీసీ లీడర్లు దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్న 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. దీనితో బీఆర్ఎస్ బలహీన పడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో పాటు, లోకసభ ఎన్నికల్లో రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్‌ఎల్పీ చీలికపై ఫోకస్

చట్టపరంగా 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సదరు పార్టీ ఎమ్మెల్యేలపై అన్హరత వేటు పడదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ మధ్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి చెందడంతో ఆ పార్టీ సంఖ్య 38కి చేరింది. ఇందులో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే,బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవచ్చు. ఈ సంఖ్య కోసమే కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.

Senior NTR : 18 ఏళ్లు ఆలస్యంగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమా.. షాక్ అయిన ఫ్యాన్స్…

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
ఆయన ఏ పాత్ర వేసినా పాత్రకే అందం వస్తుందనడంలో సందేహం లేదు.

తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం ఆయన.ఈ దివంగత నటుడు కెరీర్ మొత్తంలో 300 సినిమాల్లో నటించారు.అందులో రెండు సినిమాలకు మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు.

వాటిలో ఒకటి “సంపూర్ణ రామాయణం”( Sampoorna Ramayanam ). ఈ మూవీలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుని పాత్రలో కనిపించారు.ఈ మూవీలో ఎన్టీఆర్ బదులు వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్పినా ప్రేక్షకులు ఆశ్చర్యపోలేదు.

ఎన్టీఆర్ సొంత డబ్బింగ్ చెప్పని మరొక సినిమా “ఎర్రకోట వీరుడు”.ఎర్రకోట వీరుడు 18 ఏళ్లు ఆలస్యంగా విడుదలైంది.
ఆ సమయంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్నారు.ఈ మూవీలో ఎన్టీఆర్ వాయిస్ వెరైటీగా ఉండటం, ఆయన అవతారం కూడా చిత్రంగా ఉండటం చూసి అభిమానులు షాక్ అయ్యారు.

Facts Behind Ntr Errakota Veerudu Movie Release
1955లో హెచ్‌.ఎం.రెడ్డి ఎన్‌.టి.రామారావును హీరోగా పెట్టి “ఎర్రకోట వీరుడు”ని ‘గజదొంగ’ పేరుతో ప్రారంభించారు.దీనిని వై.ఆర్‌.స్వామి డైరెక్ట్ చేయడం మొదలుపెట్టారు.

సావిత్రి, బి.సరోజాదేవిలను హీరోయిన్లుగా, రాజనాల, ఆర్‌.నాగేశ్వరరావులను విలన్లుగా ఎంపిక చేసుకున్నారు.

ఈ సినిమా 50% కంప్లీట్ అయ్యాక హెచ్‌.ఎం.రెడ్డి కన్నుమూయడంతో సినిమా ఆగిపోయింది.ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి కొందరు దీనిని పునఃప్రారంభించారు.
అయితే దురదృష్టం కొద్దీ ఆర్.నాగేశ్వరరావు( R Nageswara Rao ) చనిపోయారు.దాంతో మరోసారి ఈ మూవీకి బ్రేక్ పడింది.
కొంతకాలానికి ఆర్‌.నాగేశ్వరరావు పాత్రను తమిళ నటుడు నంబియార్‌ చేయడానికి ఒప్పుకున్నాడు.

దాంతో మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఈసారి వై.ఆర్‌.స్వామి తప్పుకున్నాడు.

దాంతో డైరెక్టర్ పార్థసారథి( Director Partha Saradhi ) ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నాడు.
మూవీ టైటిల్‌ను కూడా ‘ధర్మవిజయం’గా చేంజ్ చేశారు.అలా మళ్లీ మొదలైన ఈ సినిమా చాలా అడ్డంకులను ఎదుర్కొంటూనే ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది.పోస్ట్‌ ప్రొడక్షన్‌ కంప్లీట్ చేయడంలో కూడా చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి.

దీనివల్ల ఈ మూవీ పూర్తి కావడానికి మరింత సమయం పట్టింది.అగ్ర నటీనటులు నటించిన సినిమా కాబట్టి దీనిని ఎలాగైనా పూర్తి చేయాలని ప్రొడ్యూసర్ టి.గోపాలకృష్ణ ముందుకు వచ్చారు.ఆయన సొంత డబ్బులతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని పూర్తి చేశారు.

ఇక రిలీజ్ చేద్దాం అనుకుంటున్న సమయంలో మరో సమస్య వచ్చి పడింది.అదేంటంటే ఎన్టీఆర్ డబ్బింగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం వచ్చింది.ఎప్పుడో 18 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ సినిమాకి ఇప్పుడు డబ్బింగ్ చెప్పమంటే బాగుంటుందో లేదో అని టి.గోపాలకృష్ణ తనలో తానే మానసిక పోరాటం చేశాడు.ఎన్టీఆర్ ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటంతో చివరికి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ దశరథరామిరెడ్డితో ఎన్టీఆర్ రోల్ కి డబ్బింగ్‌ చెప్పించాడు.

మిగిలిన నటీనటులు డబ్బింగ్‌ కూడా కంప్లీట్ చేయించి మూవీకి ‘ఎర్రకోట వీరుడు’( Errakota Veerudu ) అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేశాడు.దీనిని 1973 డిసెంబర్‌ 14న తెలుగులో రిలీజ్ చేశాడు.

అయితే ఎన్టీఆర్ కొత్త సినిమా వస్తుందంటే చాలు అప్పట్లో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకునేవారు.ఆ అంచనాలతోనే ఈ సినిమాకి వచ్చారు కానీ అందులో ఎన్టీఆర్ వాయిస్ వేరేగా ఉండటంతో డిసప్పాయింట్ అయ్యారు.

దశరథరామిరెడ్డి డబ్బింగ్ వారికి అసలు నచ్చలేదు.అందుకే ఈ మూవీ ఫెయిల్ అయింది.

YS Sunitha: 15న వైఎస్ సునీత సంచలన ప్రకటన.. అదేంటంటే?

YS Sunitha: వైఎస్ సునీత రాజకీయ ప్రకటన చేయనున్నారు.వచ్చే ఎన్నికల్లో పోటీపై తన నిర్ణయం ప్రకటించనున్నారు. ముఖ్యంగా కడప రాజకీయాల్లో ఇదో ఆసక్తికరమైన పరిణామం.
ఈనెల 15న వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. వివేకానంద రెడ్డి వర్ధంతికి సంబంధించి పులివెందులలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వైసిపి నాయకులు అడ్డుకోవడంతో వేదికను కడపకు మార్చారు. కొద్దిరోజుల కిందట ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తనకు ఏపీ ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ప్రచారం జరుగుతోంది.

వైయస్ వివేకానంద రెడ్డి కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ సీటుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఆ జిల్లా నుంచి పోటీ చేయబోతున్నట్లు సునీత ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆమె పులివెందుల నుంచి బరిలో దిగుతారా? కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారా? అన్నది ఈనెల 15న క్లారిటీ రానుంది. అయితే సునీత నేరుగా బరిలోకి దిగుతారా? లేకుంటే ఆమె తల్లి సౌభాగ్యవతమ్మను పోటీలో పెడతారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని మాత్రం అనుచరులు చెబుతున్నారు.

ఒకవేళ సునీత ఆసక్తి చూపితే తెలుగుదేశం పార్టీ వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వారి వెనుక చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి వైపు మొగ్గుచూపితే ఆ ప్రచారానికి బలం ఇచ్చినట్టు అవుతుంది. మరోవైపుషర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీలో ఛాన్స్ ఉంది.అయితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఎంత అన్నది అనుమానం. అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు పొందే అవకాశం ఉంది . అందుకే ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. వారి నుంచి అటువంటి ప్రకటన వచ్చినా వైసీపీకి కలవరపాటు తప్పదు. ఒకవేళ సునీత కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో దిగితే మాత్రం కడప రాజకీయ సమీకరణలో మార్పులు శరవేగంగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

AP Elections: ఏపీ ఎన్నికలపై సీఈవో మీనా కీలక సూచనలు

ఏపీ ఎన్నికలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక సూచనలు ఇచ్చారు. భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు & సూచనలపై రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులకు సమగ్ర అవగాహన అవసరమని ఇందులో ఎలాంటి గందరగోళానికి తావు ఉండదని తెలిపారు.
గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించడంపై పార్టీలకు అవగాహన అవసరమని చెప్పారు. నామినేషన్ల పక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెలికాప్టర్లు, వాహనాలు వినియోగానికి, సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహణకు ముందుగా పొందాల్సిన అనుమతుల విషయం తెలుసుకోవాలని చెప్పారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే వ్యయ పర్యవేక్షణ పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను సీఈవో మీనా తెలిపారు.

Rupert Murdoch:ఐదో పెళ్లికి సిద్ధమైన 93 ఏళ్ల బిలియనీర్

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ మరో సారి వార్తల్లో నిలిచారు.
93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా, ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వృద్ధ జంట వివాహం చేసుకోబోతోందంటూ స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో కాలిఫోర్నియాలోని మార్దోక్ ఎస్టేట్లో వీరి వివాహం జరగనున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది.

మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన స్నేహితురాలు ఎలెనా జుకోవ్ తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ముర్డోక్ కు ఇది ఐదో నిశ్చితార్థం.
ఆయన వయసు 92 ఏళ్లు. ముర్డోక్ ను పెళ్లి చేసుకోబోతున్న ఎలెనా వయసు 67 ఏళ్లు. ఆమె రష్యన్. ఇంతకుముందు ప్రముఖ మోడల్ జెర్రీ హాల్ ను వివాహం చేసుకున్న ముర్డోక్, ఆమెనుంచి తాజాగా విడాకులు తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని ముర్డోక్ ఎస్టేట్ లో ఎలానా, ముర్డోక్ ల వివాహం త్వరలో జరుగుతుందని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు.

850 ఏళ్ల చరిత్ర కలిగిన రంగులు మారే శివలింగం గురించి తెలుసా.. ఎక్కడ ఉందంటే..?

రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ శివలింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ లింగానికి ఉన్న విశిష్టత, భక్తుల మనసులో ఈ లింగం రావడానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాజ్ చుంగి లో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. శివాలయాల్లో ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాదేవ్ తాజనగరిని పూజిస్తారు. ఈ దేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే కోరుకున్న కోరికలు సులువుగా నెరవేరుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.

ఈ దేవాలయంలోని శివలింగం కూడా చాలా ముఖ్యమైనది. అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయంలోని శివలింగాన్ని సందర్శిస్తారు. ఈ శివలింగం ప్రతిరోజూ మూడు రంగుల్లోకి మారుతుంది.

ఆగ్రాలోని ఈ దేవాలయం రంగులు మార్చే శివలింగాన్ని కలిగి ఉండటం ప్రపంచంలోని దేవాలయాలలో ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో రాజేశ్వర మహాదేవ అనే శివలింగం రోజులో మూడు రంగులు మారుస్తుంది. ఈ లింగాన్ని చూసి మనసులో స్మరించుకుంటే కోరికలు నెరవేరుతాయని ఆలయ పూజారి తెలిపారు. ఈ లింగం ఉదయం తెల్లగా, మధ్యాహ్నం లేత నీలం రంగులో రాత్రికి లేత నీలం రంగులో, రాత్రి పూట గులాబీ రంగులో కనిపిస్తుంది. ఇలా రంగు మారే శివలింగం ఉన్న ఆలయాలను అరుదుగా చూస్తుంటాము.

హీరో ఆయనే, హీరోయిన్ కూడా ఆయనే! ఇండియాలో మొట్టమొదటి డబుల్ యాక్షన్ మూవీ…

టెక్నాలజీ పెరిగిన తర్వాత డబుల్ యాక్షన్ ఏంటి? ఒకే సారి తెర మీద 10 మందిగా కనిపించడం కూడా తేలికైం పోయింది. ‘దశావతారం’ సినిమాలో కమల్ హాసన్ పది అవతరాల్లో కనిపించాడు.
ఒకే సీన్‌లో డబుల్ రోల్ ఏంటి, నాలుగు పాత్రల్లో తానే కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఇండియాలో డబుల్ యాక్షన్ చేసిన మొట్టమొదటి నటుడు ఎవరో తెలుసా..

అన్నా హరి సాలుంకే… దాదా సాహెబ్ పాల్కే దర్శకత్వంలో వచ్చిన ‘హరిశ్చంద్ర’, ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసిన నటుడు అన్నా హరి సాలుంకే.. 1922లో రామాయణాన్ని ఆధారంగా తీసుకుని ‘లంకా దహన్’ మూవీని తెరకెక్కించాడు దాదా సాహెబ్ పాల్కే.. ఈ మూవీలో హరి సాలుంకే అటు రాముడిగా, ఇటు సీతా దేవిగా రెండు పాత్రల్లోనూ నటించాడు..

భారత చలన చిత్ర చరిత్రలో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడిగా చరిత్ర లిఖించాడు హరి సాలుంకే.. రావణాసుడు, సీతా దేవిని అపహరించడం, హనుమంతుడు లంకను చేరి, సీతమ్మకి రాములవారి ఉంగరాన్ని ఇవ్వడం, ఆ తర్వాత కోపంతో లంకా దహనం చేయడం వంటి సన్నివేశాలు ‘లంకా దహన్’ మూవీలో ఉంటాయి. ఈ మూవీలో రాముడు, సీత ఎదురెదురుగా ఒకే ఫ్రేమ్‌లో ఉండే సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో హరి సోలంకి, సీతగా, శ్రీరాముడిగా చేశాడనే విషయాన్ని జనాలు చాలా రోజుల వరకూ గుర్తించలేకపోయారు..

అన్నా హరి సోలంకి, సినిమాటోగ్రాఫర్ కూడా.. ‘లంకా దహన్’ మూవీ తర్వాత ‘సత్యనారాయణ్’, ‘బుద్దా దేవ్’ వంటి సినిమాల్లో కూడా ఫీమేల్ క్యారెక్టర్లు పోషించాడు హరి సోలంకి.. ఆ తర్వాత మహిళా నటులు, సినిమాల్లోకి రావడం పెరగడంతో హరి సోలంకికి స్త్రీ వేషాలు వేయాల్సిన అవసరం రాలేదు. 1931లో ‘ఆమీర్ ఖాన్’ అనే సినిమాలో చివరిగా నటించిన హరి సోలంకి, ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు..
భారత చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవలు చేసిన అన్నా సోలంకి, ఎక్కడ పుట్టారు? సినిమాలు మానేసిన తర్వాత ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు చనిపోయారు? అసలు చనిపోయారా? ఇంకా బతికే ఉన్నారా? అనే విషయాలు ఎవ్వరికీ తెలియకపోవడం విశేషం..

LPG Gas: ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. తగ్గిన వంటగ్యాస్ ధర

దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది.
నిజంగా ఇది గొప్ప విషయమే.
దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వంటగ్యాస్‌పై రూ.100 తగ్గించడం చాలా మంచి విషయమే. ముఖ్యంగా నారీ శక్తి లబ్దిదారులకు ఇది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

దీనికి సంబంధించి ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. “నేడు, మహిళా దినోత్సవం సందర్భంగా, మా ప్రభుత్వం LPG సిలిండర్ ధరలను రూ.100 తగ్గిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది” అని మోదీ తెలిపారు.
“వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్ధారించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది.” అని మోదీ ట్వీట్‌లో తెలిపారు.

ఇది మహిళలకు కానుక అని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఐతే.. కారణం ఏదైనప్పటికీ.. దేశ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ కిందే లెక్క.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతీ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తోంది. ఇప్పుడు సబ్సిడీ మరో 100 పెరిగింది. అందువల్ల మొత్తం సబ్సిడీ రూ.400 అవుతుంది. సబ్సిడీ తీసేయగా సిలిండర్ ధర రూ.555 ఉంది. అదే సబ్సిడీ ఎత్తివేస్తే సిలిండర్ ధర రూ.955 అవుతుంది.

ఎన్‌డీఏలోకి టీడీపీ?: సీట్ల సర్ధుబాటుపై చర్చలు

ఢిల్లీ: పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు గురువారం నాడు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు.
శుక్రవారం నాడు కూడ ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది.ఇవాళ మధ్యాహ్నానికి పొత్తు విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గత నెలలో కూడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గురువారం నాడు సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం నాడు అర్ధరాత్రి వరకు కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చించారు. ఎన్‌డీఏ కూటమిలోకి టీడీపీ చేరే విషయమై చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దరిమిలా అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లో గతంలో కంటే ఎక్కువ సీట్లను బీజేపీ కోరే అవకాశం లేకపోలేదు.
2014 ఎన్నికల్లో బీజేపీకి 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే ఈ దఫా బీజేపీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలను కోరుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను కేటాయించింది. దరిమిలా బీజేపీ కోరిన సీట్లను తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది.ఇవాళ కూడ బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్ననికి పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 50 శాతానికి పెంపు..

DA Hike:7వ వేతన సంఘం ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతానికి డీఏ పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర మంత్రివర్గం సమావేశంలో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.

7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి చెల్లించాల్సిన ఇంటి అద్దె భత్యం, పిల్లల విద్యా భత్యం, రవాణా భత్యం కూడా పెరుగుతాయి. హోమ్ పే ప్యాకెట్ అమలు చేసినప్పుడు డీఏ, డీఆర్ పెంపుదల 2024 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. మునుపటి నెలల బకాయిలతోపాటు పొందుతారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పారిశ్రామిక కార్మికుల కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కిస్తారు. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో ప్రతి నెలా ఈ డేటాను ప్రచురిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా జనవరి, జూలైలో సంవత్సరానికి రెండుసార్లు డీఏను సవరిస్తుంది.
2023 అక్టోబర్ లో కేంద్ర కేబినెట్ డీఏ 4 శాతం పెంచింది. దీంతో 46 శాతానికి చేరింది. డీఏ పెంపునకు గ 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా గుర్తింపు పొందిన ఫార్ములానే అనుసరిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ అదనపు వాయిదాను విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2023 జూలై 1 ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాథమిక చెల్లింపు, పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 42 శాతం రేటు కంటే 4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించారు

డీఏ, డీఆర్ రెండింటి కారణంగా కేంద్ర ఖజానాపై ప్రభావం సంవత్సరానికి రూ.12,857 కోట్లుగా ఉంటుంది. దీని వల్ల దాదాపు 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారు.

Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ..! ఒకే చెప్పేశారు.. ఆ రోజే చేరిక..!

Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
ఆ మధ్య జనసేనలోకి వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఆయన్ని.. పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది.. కానీ, ఏం జరిగిందో తెలియదు.. ఈ వ్యవహారంలో ఎలాంటి ముందుడుగు పడలేదు.. ఆ తర్వాత ఈ పరిణామాలపై ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.
అయితే, ఇప్పుడు పోటీ చేసే అవకాశం లేకపోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముద్రగడ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారట మిథున్ రెడ్డి.. ఇక, మీరు అడుగుతున్నారా? లేక సీఎం జగన్ అడగమన్నారా? అని మిథున్ రెడ్డిని ప్రశ్నించారట ముద్రగడ.. దీంతో.. సీఎం అడగమన్నారని మిథున్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా చెబుతున్నారు. అయితే, పార్టీలో జాయినింగ్ కి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనావేసి నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారట ముద్రగడ.. సీఎంకు విషయం చెప్పి స్పష్టత ఇవ్వాలని మిథున్‌రెడ్డిని కోరారట.. అన్ని ఓకే అనుకుంటే సిద్ధం సభలో జాయినింగ్ పెట్టుకుందామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ముందు సీఎం జగన్‌ కి చెప్పండి.. ముహూర్తం బట్టి చూద్దాం అని ముద్రగడ చెప్పినట్టుగా వైసీపీ నేతలు తెలిపారు.. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే జాయినింగ్ ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ముద్రగడ కుమారుడు గిరి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

Ganesh Baraiah ఎత్తు మూడడుగులు.. ప్రభుత్వాన్నే ఎదురించి డాక్టర్.. గణేష్ బరయ్య సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే

ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒక పేరు తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి పేరు గణేష్ బరయ్య( Ganesh Baraiya) కాగా ప్రభుత్వాన్ని ఎదురించి డాక్టర్ అయిన ఇతని సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
72 శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధ పడుతున్న గణేష్ బరయ్య ఎత్తు కేవలం 3 అడుగులు కావడం గమనార్హం. బాల్యం నుంచి గణేష్ బరయ్య డాక్టర్ కావాలని భావించేవారు. గణేష్ బరయ్య బరువు కేవలం 18 కిలోలు. వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం వల్ల ఈ వ్యక్తికి ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు.

శారీరక వైకల్యం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా గణేష్ మాత్రం కోర్టుకు వెళ్లి మరీ లక్ష్యాన్ని సాధించాడు. గుజరాత్ కు చెందిన గణేష్ బరయ్య ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా( Shortest Doctor ) అరుదైన రికార్డ్ ను సాధించి వార్తల్లో నిలిచారు. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో గణేష్ బరయ్య 2018లో ఉత్తీర్ణత సాధించాడు. అయితే తగినంత ఎత్తు లేడనే కారణం చూపుతూ ఎంబీబీఎస్( MBBS ) లో పవేశానికి గణేష్ ను అనుమతించలేదు.

ఎత్తు వల్ల అత్యవసర కేసులను నిర్వహించడం గణేష్ కు సాధ్యం కాదని భారత వైద్య మండలి కమిటీ నుంచి సైతం గణేష్ కు తిరస్కరణ ఎదురైంది. సుప్రీం కోర్టు( Supreme Court ) తలుపు తట్టిన గణేష్ కు కోర్టు తీర్పు అనుకూలంగా రావడం గమనార్హం. ప్రస్తుతం గణేష్ బరయ్య ఇంటర్న్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. సాధారణ రైతు కొడుకు అయిన గణేష్ కు జీవితంలో ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు. అయితే ఏరోజు గణేష్ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన సక్సెస్ స్టోరీతో( Ganesh Baraiya Success Story ) గణేష్ వార్తల్లో నిలవడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. గణేష్ బరయ్యను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Gold Rate: మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం ధర.. మరో ఏడాదిలో రూ. 80వేలకు ?

రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు. గతేడాది ఇదే సమయానికి 60 వేలు దాటితే.. ఇప్పుడు 65 వేల మార్క్ క్రాస్ చేసింది. 2018లో 30వేలున్న పది గ్రాముల పసిడి ధర..ఆరేళ్లు గడిచేసరికి రెండింతలైంది. మరో ఏడాదిలోగా 80వేలకు చేరవచ్చన్నది ఒక అంచనా. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మంగళవారం ఒక్కరోజే 800 రూపాయలు పెరిగింది. గత వారం రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర 2,300 పెరిగింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పసిడి ధరల దూకుడు ఏ రేంజ్‌లో ఉందో. స్వతహాగా భారతీయ మహిళలు ఆభరణ ప్రియులు. పైగా శుభ సందర్భం ఏదైనా తాహతుకు తగ్గట్టు ఎంతోకొంత బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. అందుకే కొనుగోళ్ల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు.

పుత్తడి ఇంత ప్రియం ఎందుకవుతోంది..? అంటే.. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు.. ఆర్థిక అనిశ్చితి కొనసాగడం.. ఇలా అనేక కారణాలు చెబుతారు ఎక్స్‌పర్ట్స్. దీనికి తోడు భౌగోళిక, రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల్ని శాసిస్తాయి. సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడి వైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి. క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరగడానికి మరో కారణం.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. అటు.. బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒక సెంటిమెంట్‌గా మారిందని, దాన్ని ఎవరూ ఆపలేరని ధీమాతో ఉన్నారు జ్యుయెలరీ వ్యాపారులు. ప్రస్తుతానికి ఏప్రిల్ నెలనుంచి కొన్నిరోజులు సుముహూర్తాలు లేవు. ఇప్పుడు అమ్మకాలు మందగించినా.. ఆ తర్వాత పుంజుకుంటాయనేది ఒక అంచనా. సో.. పుత్తడి ధరకు కళ్లెం పడే ఛాన్స్ లేనట్టే మరి.

SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 314 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

మొత్తం పోస్టుల సంఖ్య: 314పోస్టుల వివరాలు: ఓసీటీటీ-మెటలర్జీ-57, ఓసీటీటీ-ఎలక్ట్రికల్‌-64, ఓసీటీటీ-మెకానికల్‌-100, ఓసీటీటీ-ఇన్‌స్ట్రుమెంటేషన్‌-17, ఓసీటీటీ-సివిల్‌-22, ఓసీటీటీ-కెమికల్‌-18, ఓసీటీటీ-సెరామిక్‌-06, ఓసీటీటీ-ఎలక్ట్రానిక్స్‌-08, ఓసీటీటీ-కంప్యూటర్‌/ఐటీ(మైన్స్‌లో మాత్రమే)-20, ఓసీటీటీ-డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-2.

అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు మెటలర్జీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీటీటీ-డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పోస్టుకు ఏడాదిపాటు డ్రాఫ్ట్స్‌మ్యాన్‌/డిజైన్‌గా పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 18.03.2024.

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/

Revanth vs Mallareddy : తొడలు కొట్టిన అహంకారం కాళ్ల బేరానికి వచ్చింది

Revanth vs Mallareddy : రాజకీయాలన్నాకా పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగొద్దు. అధికారం కోల్పోయినప్పుడు బాధపడొద్దు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత రాజకీయాలు చేసినప్పుడు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేవారు.
కోర్టుకు లాక్కునేవారు. జైలుకు ఈడ్చుకునేవారు. వారిద్దరి మరణం తర్వాత అక్కడ అలాంటి రాజకీయాలు దాదాపు కనుమరుగయ్యాయి. వారిద్దరూ బతికి ఉన్నంత కాలం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. ఇలాంటి రాజకీయాలు మంచివి కావని వారికి చెబితే.. వారు వినిపించుకునేవారు కాదు.. అందుకే రాజకీయాల్లో ఉండేవారు పరిణతి, విజ్ఞత ప్రదర్శించాలి అని చెప్పేది..

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు తరహాలోనే రాజకీయాలు చోటుచేసుకున్నాయి. ధర్నా చౌక్ ఎత్తేయడం.. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించడం.. సొంత మీడియాలో అడ్డగోలుగా కథనాలు అచ్చేయడం.. ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు.. ఇక అప్పటి పాలనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. “పాలమ్మి, పూలమ్మి సంపాదించిన” అని పదేపదే చెప్పే ఆయన.. తనకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో మాత్రం చెప్పడు. చెప్పలేడు. అలాంటి ఆయన అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మల్లారెడ్డి భూ అక్రమాలు వెలికి తీయడమే రేవంత్ రెడ్డి చేసిన పాపం. దానిని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి రాజీనామాకు నువ్వు సిద్ధమా? నేను సిద్ధమే అంటూ తొడగొట్టాడు. బహిరంగంగా సవాల్ విసిరాడు. రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించాడు. సీన్ కట్ చేస్తే తొడగొట్టిన మల్లారెడ్డి ప్రతిపక్ష స్థానంలోకి వెళ్ళాడు. చీత్కరింపులు ఎదుర్కొన్న రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు..

ఇక అదిగో అప్పటినుంచి మల్లారెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పట్లో తనకు దోస్త్ అని చెప్పినప్పటికీ రేవంత్ ఒప్పుకోలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు.. అప్పట్లో తాను మోపిన అభియోగాల సంగతి చూడండి అంటూ అధికారులను పురమాయించాడు. ఇంకేముంది వారు యాక్షన్ మొదలుపెట్టారు.. సవాల్ చేసిన మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు పంపించారు. ఇటీవల ఒక రోడ్డును నేలకూల్చారు. ఆయన అల్లుడు భవనాన్ని పడగొట్టారు. రికార్డుల ప్రకారం అది చెరువు పరిధిలోదట. అంటే ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి చెల్లుబాటయింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా.

రేవంత్ దాడులతో మల్లారెడ్డి భయపడ్డాడు. వెంటనే రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో రాయబారాలు మొదలుపెట్టాడు. రేవంత్ ను జర కల్పిండయ్యా అంటూ చేతులెత్తి మొక్కాడు.. నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడాలి అంటూ వేడుకున్నాడు. అవసరమైతే నేను, నా అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని రాయబారం పంపాడట.. మరి దానికి రేవంత్ ఎస్ అంటాడా? నో అంటాడా? రేవంత్ తలుచుకుంటే మల్లారెడ్డిని ఒక్క తొక్కుడు తొక్క గలడు. పాలు, పూలు అమ్మేలా చేయగలడు.. కానీ ఆ దిశగా అడుగులు పడతాయా? అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగల మల్లారెడ్డి రేవంత్ తో సంధి కుదుర్చుకోగలడా? ఏమో వీటికి కాలమే సమాధానం చెప్పాలి..

డాక్టర్లకు, టీచర్లకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కొట్లలో సంపాదించుకోవచ్చు!

సంవత్సరానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి పైనే సంపాదించుకోవచ్చు అంటే ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలి అనుకోరు. లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని కలలు కంటారు.
అందుకు స్కాట్లాండ్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. స్కాట్లాండ్ పరిధిలో కొన్ని చిన్న దీవులు ఉన్నాయి. వీటిలో డాక్టర్లుగా, టీచర్లుగా పనిచేసేందుకు ఉత్సాహవంతులైన వారు కావాలని స్కాట్లాండ్ ప్రకటన చేసింది. డాక్టర్లకు ఏడాదికి రూ.1.57 కోట్లు ఇస్తామని ప్రకటించింది. టీచర్లకైతే ఏడాదికి రూ.71.47 లక్షల వరకు ఇస్తారట. స్కాట్లాండ్ కు చెందిన హెబ్రెడీస్ దీవుల సమాహారంలోని యూవీస్ట్, బెన్ బెక్యులా తదితర 6 దీవుల్లో డాక్టర్ల కొరత అధికంగా ఉంది.

కాగా, ఇక్కడికి వచ్చే డాక్టర్లు 6 దీవుల్లోని 4,700 మంది వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఇక్కడికి సమీపంలోని రమ్ ఐలాండ్ లో టీచర్ల కొరత ఉంది. రమ్ దీవిలోని కిన్లోచ్ అనే గ్రామ జనాభా కేవలం 40 మంది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 5. ఈ దీవుల్లో నివసించే జనాభా చాలా తక్కువే అయినప్పటికీ, వారికి ప్రాథమిక
సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత.

అయితే, ఇవి మారుమూల దీవులు కావడంతో ఇక్కడ పనిచేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదట. అందుకే సాధారణ వేతనాల కంటే 40 శాతం అధిక వేతనాలు ఇచ్చేందుకు స్కాటిష్ ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు, డాక్టర్లు, టీచర్ల జీవిత భాగస్వాములకు కూడా ఈ దీవుల్లోనే ఉపాధి కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తాము ఉన్న చోటి నుంచి ఈ దీవులకు వచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

దాంతో పాటే, వీరిని ఈ దీవులకు స్వాగతించే క్రమంలో ‘గోల్డెన్ హలో’ పేరిట రూ.9 లక్షల ప్రోత్సాహక నగదు కూడా అందిస్తారు. నిజంగానే ఇది కళ్ళు చెదిరే ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఆలస్యం ఎందుకు మరి మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటె వెంటనే ఈ విషయం వారికి చెప్పండి

Tower of London: వెయ్యేళ్ల కోటకు సంరక్షకులు కాకులే .. వాటి రక్షణ కోసం కేర్ టేకర్..

కాకులు రక్షణలో అతి పురాతన కోట ఉంది. అదే సమయంలో ఆ కోటని రక్షిస్తున్న కాకుల సంరక్షణ కోసం ఒక వ్యక్తి అధికారికంగా నియమింపబడ్డాడు. లండన్ నగరంలోని థేమ్స్‌ నది తీరంలో ఉన్న వెయ్యేళ్ల కోట ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’కు కాకులు సంరక్షకులుగా ఉన్నాయి.
ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటం కోసం తాజాగా ఓ వ్యక్తి ఉద్యోగంలో నియమితులయ్యారు. ఆయనే 56 ఏళ్ల మైకేల్‌. రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడైన మైకేల్‌ ‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను తాజాగా స్వీకరించారు. ఈయన కింద మరో నలుగురు సిబ్బంది పని చేస్తారు.

1066లో ఇంగ్లండ్‌ను జయించిన తర్వాత రాజు విలియం I ఈ కోటను నిర్మించాడు. ఈ కోట అనేక వందల సంవత్సరాలు రాజ నివాసంగా పనిచేసింది.. అనంతరం కాలక్రమంలో ఇది జైలుగా ప్రసిద్ధి చెందింది. 1483లో కింగ్ ఎడ్వర్డ్ IV కుమారులు “టవర్‌లోని రాకుమారులు” నిర్బంధించబడ్డారు. వీరి మామని కింగ్ రిచర్డ్ III హత్య చేశాడు. అంతేకాదు 8వ హెన్రీ తన రెండవ భార్యతో విసిగిపోయిన తర్వాత 1536లో అన్నే బోలీన్‌ను ఉరితీయించాడు. ఇలా ఎంతో చారిత్రాత్మ నేపధ్యం ఉన్న టవర్‌ను సంరక్షణను వదిలివేస్తే.. దీని పక్కన ఉన్న వైట్ టవర్ కూలిపోతుంది, తర్వాత ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందని 7వ శతాబ్దంలో కింగ్ చార్లెస్ IIకి జోస్యం చెప్పబడింది. అంతేకాదు ఈ టవర్ వద్ద ఎల్లప్పుడూ ఆరు కాకిలు ఉండాలని ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వహిస్తాయని స్థానికుల విశ్వాసం. కాకులు కోటను వీడి వెళ్లిపోతే వైట్‌ టవర్‌తోపాటు ఇంగ్లాండ్‌ రాజ్యం కూలిపోతుందని నమ్ముతారు కూడా..

కింగ్‌ ఛార్లెస్‌ – 2 తనకు చెప్పిన జ్యోష్యాన్ని విశ్వసించాడు. ఆ టవర్‌ వద్ద ఎప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశాడు. గతేడాది కింగ్‌ ఛార్లెస్‌ – 3 పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను ఏడుగా మార్చారు. ఇప్పుడు కాకుల సంరక్షణ బాధ్యత చేపట్టిన రావెన్‌మాస్టర్ వయసు 50 సంవత్సరాలు మాత్రమే. మిస్టర్ చాండ్లర్ ఈ పదవికి ఆరవ అధికారి. ఇతను సాధారణంగా పగలు టవర్ గ్రౌండ్స్ చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ… రాత్రి బోనులలో నిద్రించే పక్షుల ఆరోగ్యం, సంక్షేమానికి బాధ్యత వహిస్తాడు.
పక్షుల ఎన్‌క్లోజర్‌లను నిర్వహించడం, వెటర్నరీ చెకప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కాకులకు ఇష్టమైన పచ్చి మాంసాన్ని ఆహారంలో అందించడం, అప్పుడప్పుడు ఉడికించిన గుడ్డు లేదా రక్తంలో నానబెట్టిన హార్డ్-టాక్ బిస్కెట్‌ను అందించడం వంటి విధులు ఉన్నాయి.

కోట సంరక్షులుగా నియమించే పక్షులు ఎగిరిపోకుండా ఈకలు కత్తిరించబడతాయి, అయినప్పటికీ అవి అప్పుడప్పుడు తప్పించుకుంటాయి. హిస్టారిక్ రాయల్ ప్యాలెస్‌ల ప్రకారం, టవర్‌ను పర్యవేక్షిస్తోంది స్వచ్ఛంద సంస్థ. గ్రోగ్ అనే కాకి 1981లో ఎగిరింది. చివరిగా రోజ్ అండ్ పంచ్‌బౌల్ అనే ఈస్ట్ ఎండ్ పబ్ వెలుపల కనిపించింది.

LPG Gas: మీ గ్యాస్‌ సిలిండర్‌ పైప్ గడువు ముగిసిందా? Validity ఉందో లేదో చెక్‌ చేయండిలా!

గ్యాస్ పైప్ రబ్బరుతో తయారు చేయబడి ఉంటుంది. ఈ పైప్‌ చాలా రోజుల నుంచి వాడుతుంటే కాలక్రమేణా రబ్బరు నాణ్యత క్షీణిస్తుంది. దీంతో గ్యాస్ లీకేజీ ప్రమాదం పెరుగుతుంది. గ్యాస్ లీకేజీ వల్ల అగ్నిప్రమాదం జరిగి తీవ్ర ప్రమాదాలు సంభవించవచ్చు. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల, గ్యాస్ పైపును సమయానికి మార్చాలి. పైప్ గడువు ముగిసిందో లేదో మీకు తెలియకపోతే,
గ్యాస్ సిలిండర్ మన ఇళ్లలో ముఖ్యమైన వంట సాధనం. కానీ, గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నప్పుడు భద్రత చాలా ముఖ్యం. నిర్లక్ష్యం వహిస్తే గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు గ్యాస్‌ సిలిండర్‌ ఎంత ముఖ్యమో దానికి బిగించే పైపు కూడా అంతే ముఖ్యం. లీకేజీ కాకుండా ఉండేందుకు మంచి నాణ్యమైన పైప్‌ను వాడటం చాలా ముఖ్యం. గ్యాస్ సిలిండర్ భద్రత కోసం గ్యాస్ పైప్ గడువు తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. ఈ పైప్‌నకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉంటే సిలిండర్ పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గ్యాస్ పైప్ గడువును సులభంగా ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాం.

ఈ పైప్‌ చాలా రోజుల నుంచి వాడుతుంటే కాలక్రమేణా రబ్బరు నాణ్యత క్షీణిస్తుంది. దీంతో గ్యాస్ లీకేజీ ప్రమాదం పెరుగుతుంది. గ్యాస్ లీకేజీ వల్ల అగ్నిప్రమాదం జరిగి తీవ్ర ప్రమాదాలు సంభవించవచ్చు. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల, గ్యాస్ పైపును సమయానికి మార్చాలి. పైప్ గడువు ముగిసిందో లేదో మీకు తెలియకపోతే, మీరు ఇక్కడ చూపిన ఆన్‌లైన్ పద్ధతిని ఉపయోగించి దాన్ని తనిఖీ చేయవచ్చు .

గ్యాస్ పైప్ గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలి?
గ్యాస్ పైపుపై గడువు తేదీ రాసి ఉంటుంది. ఇది వాస్తవానికి లైసెన్స్ తేదీ. ఇది మీరు గ్యాస్ పైపుపై రాసి ఉంటుంది. మీరు భారత ప్రభుత్వ BIS కేర్ యాప్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా ధృవీకరించబడిన అంశాల గురించి సమాచారాన్ని చూడవచ్చు.

బీఐఎస్ కేర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు

BIS కేర్ యాప్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను Google Play Store లేదా Apple App Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్యాస్ పైపు లీక్‌లను తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి. ముందుగా బీఐఎస్‌ కేర్ యాప్‌ను తెరవండి. ఇందులో వెరిఫై లైసెన్స్ డీటెయిల్స్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ఇప్పుడు పైపుపై రాసిన CM/L కోడ్‌ను నమోదు చేయండి. కోడ్‌ను నమోదు చేసిన తర్వాత గో బటన్‌పై క్లిక్ చేయండి. దీని తరువాత మీరు గ్యాస్ పైపుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ పైప్‌ ఎప్పటి వరకు వాడుకోవచ్చు. అనే అంశాలు ఉంటాయి. అంటే గడువు తేదీ కూడా అందులో రాసి ఉంటుంది. పైపు గడువు ముగిసినట్లయితే, వెంటనే కొత్త పైపును కొనుగోలు చేయాలి.

అక్కడ మహిళలదే పైచేయి..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..ఎక్కడంటే..!

ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కొడుకు పుట్టగానే వారుసుడు పుట్టాడంటూ ఘనంగా వేడుకలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆడిపల్ల పుడితేనే సెలబ్రేషన్స్‌. ఆడిపిల్లలకే ఆస్తి ఇస్తారు.
ఆఖరికి అక్కడి మహిళలు అత్తారింటికి వెళ్లరు. అబ్బాయిలే అత్తారింటికి వస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి విభిన్నంగా ఉంటారని చెప్పొచ్చు. ఆ వ్యవస్థ విదేశాల్లోనేమో! అనుకోకండి. మనదేశంలోనే ఈ వ్యవస్థ ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో మనదేశంలో ఉన్న ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఏంటా వింత ఆచారాలు తెలుసుకుందామా!.

గిరిజనులు అనగానే బాగా వెనుకబడిన వాళ్లు, అమాయకులు అనుకుంటాం. మేఘాలయ రాష్ట్రంలోని గిరిజన తెగను చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ తెగల ఆచారాలు సంప్రదాయలను చూసి సమాజానికి ఎంత స్ఫూర్తిగా ఉన్నాయా ? అని ఆశ్చర్యపోవడం ఖాయం. మనమే చాలా వెనకబడి ఉన్నామా? అన్నా సందేహం కూడా వస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే..

ఆడపిల్లకే పట్టం..
మేఘాలయలోని ఖాసీ, గరో అనే తెగలు మయాన్మార్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన తెగలు. ఈ తెగలు మేఘలయాలోని జైంటియా అనే పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ తెగలు దశాబ్దాలకు పూర్వమే కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టుకున్నారు. వాటినే ఇప్పటికీ ఆచరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అక్కడ ఆడపిల్ల పుడితేనే వేడుకగా సెలబ్రేషన్స్‌ చేస్తారు. ఆడపిల్లకే పట్టం కడతారు.పెత్తనం అంతా ఆడపిల్లదే. ఆడపిల్లకే ఆస్తి ముట్టజెప్పుతారు. ఆఖరికిగా ఆడపిల్ల అత్తారింటికి వెళ్లదు. వరుడే అత్తారింటికి ఇళ్లరికం అల్లుడుగా వస్తాడు.

 

అయితే ఆ తెగలోని ఆడపిల్లలు తమ తెగలోని అబ్బాయిని కాకుండా మరో జాతి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ నియమాలు వర్తించవట. అలాగే అక్కడి కుటుంబాల్లో ఒకరికి మించి ఎక్కువమంది ఆడిపిల్లలు ఉంటే..చిన్న కూతురు తప్పించి మిగతా వాళ్లంతా తమ భర్తలతో అదే ఇంట్లో ఉండోచ్చు. అక్కడ చిన్న అమ్మాయిని ఖథూగా పరిగిణిస్తారు. ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత ఇంటి భాద్యతలు, ఆస్తిపాస్తులన్నీ ఆమెకే ఇస్తారు.

 

ఆఖరికీ తల్లి మరణం తర్వాత ఇంటి భాద్యతలన్నీ నిర్వర్తించాల్సి కూడా ఆమెనే. అంతేగాదు పుట్టబోయే పిల్లలకు ఇంటిపేరు కూడా తల్లి ఇంటి పేరే పెడతారు. అలాగే పిల్లల పోషణ, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా ఆడవాళ్లకే ఎక్కువ హక్కులు ఉంటాయట. అందువల్లే ఇక్కడ మహిళలు వ్యవసాయం, ఇతర ఉద్యోగాల్లో వాళ్లే బాగా రాణిస్తారట. ఇలా ప్రతి విషయంలో పురుషుల కంటే మహిళలదే పైచేయి కావడంతో అక్కడ గృహహింస,అత్యాచారాలు, వేధింపులు ఉండవని అక్కడ స్థానికులు చెబుతున్నారు.

సమానత్వం కోసం పురుషుల పోరాటం..
ఇలా ఇక్కడ దశాబ్దాలుగా మాతృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలుతోంది. అయితే ప్రపంచంలో చాలా చోట్ల స్త్రీలకు సమాన హక్కుల ఉండాలని, లింగ సమానత్వం కోసం తెగ పోరాటాలు చేస్తుంటే ఆ ఖాసీ, గరో తెగకు చెందిన పురుషులు మాత్రం తమ సమానత్వం కోసం ఏళ్లుగా పోరాడుతుండటం విశేషం. ఇందుకోసం 1990 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ నిరంతరం కృషి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ రెండు తెగలు సమాజానికి స్ఫూర్తిగా మంచి నియమాలు పెట్టుకున్నాయి కదూ!. అయితే ఇలాంటి ఆచారమే 20వ శతాబ్దానికి పూర్వమే కేరళలోని నాయర్‌ తెగలో కూడా ఉండేదట.

Health

సినిమా