Maha Shivaratri 2024: యూరప్‌లో మిస్టరీ శివలింగం.. ఎన్నిసార్లు దాడిచేసినా చెక్కుచెదరలేదు

ఇండియాలోనే కాదు.. చాలా దేశాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ భూమిపై ఎన్నో ప్రాంతాల్లో పరమ శివుడు పూజలందుకుంటున్నాడు. ఐర్లాండ్‌లో కూడా ఓ పురాతన మిస్టరీ శివలింగం ఉంది.
మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన పొడువాటి శివలింగం వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఉంటుంది. వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు. స్థానికులు ‘లియా ఫెల్’ అని పిలుస్తారు. అంటే అదృష్ట శిల అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అలానే ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

లియా ఫెల్ చరిత్ర

క్రీ.శ. 1632-1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ”ది మైనర్స్ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్”లో శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ‘తుథాడి దేనన్’ వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్లు అందులో పేర్కొన్నారు. తుథాడి దేనన్ అంటే ‘దను’ దేవత పిల్లలు అని అర్థం. వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు ఐర్లాండ్‌ని పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించేవారు అంతేకాదు ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఇక్కడే జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

Related News

దను దేవత:

యూరోపియన్ సంప్రదయాల్లో దనను నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు పెట్టారు. ఇక మన వేద సంస్కృతిలోనూ దును దేవత ప్రస్తావన ఉంది. ఆమె దక్ష ప్రజాపతి కూతురు. కశ్యప ముని భార్య. నదీ దేవతగా కొలిచేవారు. దను సోదరి సతీ దేవి. శివుడిని పెళ్లి చేసుకుంది. తదుపరి జన్మలో సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని లియా ఫైల్‌ని శివలింగంగా భావిస్తారు.

ఐర్లాండ్‌లో ఉన్న ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. 2012లో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు దాడి చేశాడు. 2014లో కొందరు వ్యక్తులు శివలింగంపై పెయింట్ పోశారు. అంతేకాదు ఎన్నోసార్లు క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఐర్లాండ్‌తో పాటు అతి పురాతన నగరాలైన పాల్మైరా (సిరియా), నిమ్రుద్ (ఇరాక్)లోనూ శివుడిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి.

ఇతర దేశాల్లోని శివలింగాలు:

స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో స్వర్ణ శివాలయముంది. తుర్కిస్థాన్ సిటిలో 1200 అడుగుల శివలింగం, హైడ్రోపొలిస్ నగరంలో 300 అడుగుల శివలింగం, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఎన్నో శివలింగాలు ఉన్నాయి. యూరప్‌లోని కారిత్‌లో పార్వతి దేవాలయం, కంబోడియాలో ఓ పురాతన శివలింగం ఉంది. జావా, సుమత్రా దీవులు, నేపాల్,పాకిస్తాన్, ఈజిప్ట్ దేశాల్లోనూ పలు చోట్ల శివలింగాలు ఉన్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *