Sunday, November 17, 2024

500 Gas Cylinder Scheme : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ జీవో జారీ-గైడ్ లైన్స్ ఇవే!

500 Gas Cylinder Scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో గ్యారంటీ అమలుకు రెడీ అయ్యింది. మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi)భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్(500 Gas Cylinder) అందించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వైట్ రేషన్‌కార్డుదారులకు(Ration Cards) రూ.500కే సిలిండర్‌ ఇవ్వనున్నట్లు జీవోలో ప్రకటించారు. ఈ మేరకు రూ.500కే గ్యాస్ పథకానికి సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేసింది.
గ్యాస్ సిలిండర్ స్కీమ్ గైడ్ లైన్స్
సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించేందుకు మూడు విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు ఆధారంగా 39.5 లక్షల మందిని లబ్ధిదారులను గుర్తించింది. గత మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని దాని సరాసరి ఆధారంగా ఏడాది ఎన్ని సబ్సిడీ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయిస్తారు. అయితే వినియోగదారులు గ్యాస్ లిండర్ మొత్తం నగదును చెల్లించి తీసుకోవాలి. అనంతరం వినియోగదారుల ఖాతాలోకి సబ్సిడీ నగదును జమ చేయనున్నారు. గ్యాస్ సబ్సిడీని(Gas Subsidy) నేరుగా ఆయిల్ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఆయిల్ సంస్థల నేరుగా వినియోగదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది. ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్లు మానిటరింగ్ చేయనున్నారు. భవిష్యత్తులో లబ్దిదారులకే రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సిలిండర్ కొనుగోలు చేసిన 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాల్లో సబ్సిడీ డిపాజిట్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

లబ్దిదారుల ఎంపిక
రూ.500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కొత్త గ్యాస్‌ కనెక్షన్లకు పథకం వర్తించదని అధికారులు తెలిపారు. పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న వారికే గ్యాస్ సబ్సిడీ(Gas Subsidy) అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంలో రూ.500 గ్యాస్ సిలిండర్‌ లబ్దిదారులను ఎంపికకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రజాపాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఆశావర్కర్ల సాయంతో లబ్దిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఆశా కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డుతోపాటు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ పథానికి అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అయితే తెల్లరేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్‌ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. వీటిలో 64 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతానికి రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కానున్నారు. మిగిలిన 26 లక్షల తెల్లరేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేకపోవడం..వారికి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 26 లక్షల మంది కొత్త గ్యాస్ కలెక్షన్ తీసుకుంటే ఈ పథకం వర్తించస్తుంది.

Jio New 5G Smartphone : గుడ్ న్యూస్.. రూ. 10వేల లోపు ధరలో కొత్త జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది!

Jio New 5G Smartphone : జియో అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో రిలయన్స్ జియో రూ. 10వేల లోపు ధరలో కొత్త క్వాల్‌కామ్ 5జీ పవర్డ్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. భారత ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో కలిసి క్వాల్‌కామ్ చిప్‌సెట్ కంపెనీ ఈ కొత్త జియో 5జీ ఫోన్ అభివృద్ధి చేస్తోంది. రూ. 10వేల లోపు సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలను కూడా ప్రకటించింది.
భారత మార్కెట్లో 2జీ నుంచి 5జీ నెట్‌వర్క్‌కి వేగవంతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వినియోగదారులకు సరికొత్త టెక్నాలజీని తక్కువ ఖర్చుతో కూడిన అప్‌గ్రేడ్‌ను అందించనుంది. క్వాల్‌కామ్ లేటెస్ట్ చిప్‌సెట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరకే ఫుల్ 5జీ ఎక్స్‌పీరియన్స్ అందించగలదని మనీకంట్రోల్ నివేదించింది.

కొత్త చిప్‌సెట్‌తో 5జీ ఫోన్ :
క్వాల్‌కామ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హ్యాండ్‌సెట్స్ జనరల్ మేనేజర్ క్రిస్ పాట్రిక్ ప్రకారం.. ఈ ఉత్పత్తి 4జీ, 5జీ టెక్నాలజీల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించేలా భారతీయ మార్కెట్‌కు ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. కొత్త చిప్‌సెట్‌తో.. సరసమైన స్మార్ట్‌ఫోన్‌ల కోసం వెతుకుతున్న వినియోగదారులకు పూర్తి స్థాయిలో 5జీ సర్వీసులను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని బార్సిలోనాలోని క్వాల్‌కామ్ హ్యాండ్‌సెట్స్ జనరల్ మేనేజర్ క్రిస్ పాట్రిక్ పేర్కొన్నారు.

4జీ, 5జీ మధ్య మార్పుపై దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్లోని మిలియన్ల మంది 2జీ వినియోగదారులను నేరుగా 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి కొత్త చిప్‌సెట్ సాయపడుతుందని క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు. దేశంలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధితో చిప్‌సెట్, అధునాతన 5జీ సామర్థ్యాలను కొత్త ధర శ్రేణికి మార్చగలదని భావిస్తున్నారు.

2.8 బిలియన్ల మందికి 5జీ డివైజ్‌లు :
క్వాల్‌కామ్ ఇండియా ప్రెసిడెంట్ సావి సోయిన్ ప్రకారం.. సరసమైన 5జీ డివైజ్ జియో నుంచి అతి త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్‌లు సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ విస్తరణపై ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్ఎమ్ఏ నుంచి డేటా ప్రకారం.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 2.8 బిలియన్ల మందికి 5జీ డివైజ్‌లు చేరుకోగలవని సూచిస్తున్నాయి.

ఇంకా, క్వాల్‌‌కామ్ వినియోగదారుల కోసం 5జీ టెక్నాలజీతో కలిగే ప్రయోజనాన్ని మరింత విస్తరించనుంది. మొత్తంమీద, రిలయన్స్ జియో, ఇతర భాగస్వామి (Qualcomm) సహకారంతో భారత టెలికం మార్కెట్లో 5జీ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే సరసమైన ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ అందించాలని భావిస్తోంది. రాబోయే లాంచ్ ఈవెంట్లో హై-స్పీడ్ కనెక్టివిటీకి యాక్సస్ విస్తరించనుంది.

SSC నుంచి 2049 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2049 ఖాళీల కోసం SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. మార్చి 18, 2024న గడువు తేదీతో ఫిబ్రవరి 26న దరఖాస్తు విండో తెరవబడింది.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపును మార్చి 19, 2024 వరకు రాత్రి 11:00 గంటలలోపు చేయవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తాత్కాలికంగా మే 6 నుండి మే 8, 2024 వరకు షెడ్యూల్ చేయబడింది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ లింక్‌ https://ssc.gov.in/ ను సందర్శించండి.

TS DSC 2024: 11 వేల ఖాళీలతో ‘మెగా డీఎస్సీ’ నోటిఫికేషన్ వచ్చేస్తోంది!

TS Mega DSC 2024: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ‘మెగా డీఎస్సీ’ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అన్ని అనుకూలిస్తే.. ఈ వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. మెగా డీఎస్సీ (TS Mega DSC) ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వం 5059 పోస్టులలో డీఎస్సీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ 1739, పండిట్‌ పోస్టులు 611, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 164, ఎస్జీటీ పోస్టులు 2,575 పోస్టులున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిన ప్రకారం 13 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోకుండా నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. అయితే ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. అయితే ఆ సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గత నోటిఫికేషన్‌ ను రద్దు చేసి, 11 వేల టీచర్‌ పోస్టులతో నాలుగైదు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నోటిఫికేషన్‌లోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్‌ టీచర్లను రిక్రూట్‌ చేయనున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. తుది ఫలితాలు వెల్లడికి అడ్డంకిగా మారిన కోర్టు కేసులు, ఇతర కారణాలను న్యాయనిపుణులతో చర్చించి పరిష్కరించింది. పోలీస్‌, గురుకుల, స్టాఫ్‌ నర్స్‌ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది. గ్రూప్‌-1 కూడా హైకోర్టు తీర్పును అనుసరించి గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఎలాంటి కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలతో, పెంచిన పోస్టులతో కొత్త నోటిషికేషన్‌ జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్‌ వివాదరహితంగా ఉన్నదని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా కోర్టు కేసులతో మళ్లీ ప్రక్రియ ఆగుతుందనే ప్రచారాన్ని విశ్వసించవద్దని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Viral Video: బాబోయ్ ఇలాంటి హెయిర్ స్టైల్ నెవర్ బీఫోర్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండరు..

ఈరోజుల్లో ప్రపంచంలో ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. సోషల్ మీడియా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఓ వింత హెయిర్ స్టైల్ కు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఓ ఇన్ స్టా వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేశాడు.. వైరల్ అవుతున్న ఈ వీడియోల ఓ మహిళ సెలూన్‌లో కూర్చుని ఉంది. అక్కడి స్టైలిస్టులు ఆమె హెయిర్‌కు ఏవోవో రకరకాల జెల్స్ పూస్తున్నారు. చివరికి మహిళ తలపై ఓ పాత్ర ఆకారంగా మార్చారు. ఆ తర్వాత అందులో మరో వ్యక్తి నీటిని వేశాడు. అందులో చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి. ఆమె జుట్టులో ఆ చేప పిల్లలు చక్కగా ఈత కొడుతున్నాయి.. నిజంగా ఇలాంటి ఐడియా అదిరిపోయింది..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వీడియోను ఇప్పటివరకు మిలియన్ మందికి పైగానే చూశారు. 43 వేల లైక్‌లు కూడా అందుకుంది ఈ వీడియో. ఇక ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. రకరకాల కామెంట్లు పెడితూ.. వైరల్ వేస్తున్నారు… ఫన్నీ కామంట్లతో వీడియో చక్కర్లు కొడుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

విశాఖ బీచ్‌లో ప్రారంభించిన రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

విశాఖ బీచ్‌లో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభించిన ఒక్కరోజులోనే తెగిపోయింది. ఆదివారమే వైఎస్సార్సీపీ నేతలు ఈ బ్రిడ్జిని ప్రారంభించగా.. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించారు. అయితే అంతలోనే అది కాస్తా రెండు ముక్కలైంది. ఆ సమయంలో పర్యాటకులు లేకపోవడంతో పెను విషాదం తప్పిపోయింది.

సముద్ర తీరం నుంచి లోపలికి వంద మీటర్ల పొడవున ఫ్లోటింగ్‌ డబ్బాలతో ఈ వంతెనను విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఏర్పాటు చేయించింది. ‘టీ’ ఆకారంలో ఉన్న దాని మీద నడుచుకుంటూ వెళ్లి చివరన నిలబడి సముద్రాన్ని వీక్షించొచ్చు. ఇప్పుడు ఆ వీక్షించే భాగమే విడిపోయి, అనుసంధానంగా ఉన్న ప్రాంతం నుంచి అది తెగిపడి సుమారు మూడు వందల మీటర్ల దూరంలోకి వెళ్లిపోయింది. అలల తీవ్రతకు అనుసంధాన బోల్టులు విరిగిపోయాయి.

ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1.60 కోట్లు ఖర్చు చేశారు. నిర్వాహకులు మూడేళ్ల పాటు ఏటా రూ.15 లక్షలు వీఎంఆర్‌డీఏకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఘటన తరువాత వీఎంఆర్‌డీఏ సంయుక్త కమిషనర్‌ రవీంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అధిక పెన్షన్ ఆశావహులకు ఝలక్.. EPFO కొత్త రూల్స్.. పింఛన్ భారీగా తగ్గిపోనుందా?

EPFO: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, పెన్షనర్లకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అధిక పెన్షన్ లెక్కింపునకు ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్త రూల్ తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రో రాటా (Pro Rata) ఆధారంగా అధిక పెన్షన్ లెక్కింపు చేపట్టనుందని తెలుస్తోంది. ఈ కొత్త రూల్ అమలు చేస్తే అధిక పెన్షన్ ఆశావహులకు భారీగా నష్టం వాటిళ్ల నుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈపీఎస్-95 సభ్యులకు దాదాపు 30 శాతం నుంచి 40 శాతం మేర అధిక పెన్షన్ తగ్గిపోనుందని తెలుస్తోంది.

ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు అమలులోకి తెస్తున్నట్లు కార్మిక విభాగం నిపుణులు వెల్లడించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈపీఎఫ్ఓ ఆఫీసుల సమాచారం ప్రకారం.. అధిక పెన్షన్ లెక్కింపు అనేది రెండు భాగాలుగా విభజించనున్నారని నిపుణులు తెలిపారు. అయితే, ఈ విషయంపై ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన గానీ లేగా సర్క్యూలర్ గానీ జారీ కాలేదు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ విడుదల చేసిన సర్క్యూలర్లలోనూ ప్రో రాటా ఆధారంగా పెన్షన్ లెక్కిస్తామని ఎక్కడా చెప్పలేదు.
పెన్షన్ లెక్కింపునకు తీసుకొచ్చే కొత్త రూల్ అనేది ఇప్పటికీ పని చేస్తున్న ఉద్యోగులు, లేదా సెప్టెంబర్ 1, 2024 తర్వాత రిటైర్ అయిన వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి సగటు పెన్షన్ శాలరీ లెక్కింపునకు సర్వీస్ పీరియడ్ అనేది రెండు భాగాలుగా లెక్కించనున్నారని తెలిపారు. మొదటి భాగంలో.. ఈపీఎస్-95 డేటా అమలులోకి వచ్చిన 16-11-1995 తేదీ నుంచి ఆగస్టు 31, 2014 వరకు.. రెండో భాగం సెప్టెంబర్ 1, 2014 నుంచి రిటైర్మెంట్ తేదీ వరకు సగటు వేతనం లెక్కలోకి తీసుకుంటారు. తొలి భాగంలో చివరి 60 నెలల జీతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. అలాగే రెండో భాగంలో సెప్టెంబర్ 1, 2024 తర్వాత 60 నెలల శాలరీని లేదా రిటైర్మెంట్ వరకు ఉన్న శాలరీని తీసుకుంటారు.
ప్రో రాటా ఆధారంగా కొత్త కాలిక్యులేషన్ రూల్ అనేది పెన్షన్ అమౌంట్ ని గణనీయంగా తగ్గిస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 2014కి ముందు వేతన లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంది. దీంతో చాలా మందికి మొదటి భాగంలో లెక్కించే సగటు పెన్షన్ శాలరీ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మొత్తంగా చేతికి అందే పెన్షన్ భారీగా తగ్గిపోతుంది. 30-40 శాతం మేర కోత పడే సూచనలు ఉన్నాయని కార్మిక విభాగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉంటుందని సూచిస్తున్నారు.

ఏపీ రాజధాని అమరావతే.. అందులో చర్చే లేదు

విజయవాడ: వైకాపా సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని భాజపా శ్రేణులకు కర్తవ్యబోధ చేశారు. విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల భాజపా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రక్షణ వ్యవహారాల్లో భారత్‌ సాధిస్తోన్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందని రాజ్‌నాథ్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభంతో ఈ విషయం చెబుతున్నానన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్నా పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని పేర్కొన్నారు. ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో ప్రస్తావించగా.. రాష్ట్ర పార్టీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు. భాజపా సైతం అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

సెంచరీలతో చెలరేగిన 10, 11 నంబర్‌ ఆటగాళ్లు.. క్రికెట్‌ చరిత్రలో రెండోసారి ఇలా..!

రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ముంబై టెయిలెండర్లు చారిత్రక ప్రదర్శన చేశారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్‌ ఫైనల్లో ఈ జట్టుకు చెందిన 10, 11వ నంబర్‌ ఆటగాళ్లు మెరుపు శతకాలతో విరుచుకుపడ్డారు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుశ్‌ కోటియన్‌ (129 బంతుల్లో 120 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తుషార్‌ దేశ్‌పాండే (129 బంతుల్లో 123; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) రికార్డు శతకాలు చేసి చరిత్రపుటల్లోకెక్కారు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో 10, 11వ నంబర్‌ ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది లం రెండోసారి మాత్రమే. 78 ఏళ్ల క్రితం (1946) సర్రేతో జరిగిన ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో భారత 10, 11 నంబర్‌ ఆటగాళ్లు చందు సర్వటే, షుటే బెనర్జీ సెంచరీలు చేశారు. తాజాగా తనుశ్‌-తుషార్‌.. చందు సర్వటే-షుటే బెనర్జీ జోడీ సరసన చేశారు. తనుశ్‌ -తుషార్‌ జోడీ శతకాల మోత మోగించడంతో బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆధిక్యాన్ని సాధించింది.

వీరితో పాటు ఓపెనర్‌ హార్దక్‌ తామోర్‌ (114) కూడా సెంచరీతో కదంతొక్కడంతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 569 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 36 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ముంబై.. బరోడా ముందు 606 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బరోడా 348 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది. ఆఖరి రోజు రెండో సెషన్‌ సమయానికి బరోడా వికెట్‌ నష్టానికి 79 పరుగులు చేసి, లక్ష్యానికి 527 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌ ఆధారంగా ముంబై సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో బరోడా బౌలర్‌ భార్గవ్‌ భట్‌ 14 వికెట్లు (7/112, 7/200) పడగొట్టడం విశేషం.

Bank Holidays: మార్చిలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్‌ లిస్ట్‌ ముందే చూసుకోండి

Bank Holidays List For March 2024: మార్చి నెల రాకముందే, ఆ నెలలోని బ్యాంక్‌ సెలవులను గుర్తించడం ముఖ్యం. వచ్చే నెలలో బ్యాంక్‌లు 14 రోజుల పాటు మూసి ఉంటాయి. ఆ 14 రోజుల్లో నేషనల్‌ పబ్లిక్ హాలిడేస్‌, కొన్ని ప్రాంతీయ సెలవులు, రెండు & నాలుగు శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్‌ సెలవులను నిర్ణయిస్తాయి.

మార్చి నెలలో మీకు బ్యాంక్‌లో పని ఉంటే, సెలవు రోజున బ్యాంక్‌కు వెళ్లి మీ సమయం వృథా చేసుకోకుండా, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ ప్రకారం ముందుగానే మీ పనిని ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

2024 మార్చిలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in March 2024):

మార్చి 01 (శుక్రవారం) —— చాప్చార్ కుట్ —— మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 03 —— ఆదివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 08 (శుక్రవారం) —— మహా శివరాత్రి —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే

మార్చి 09 —— రెండో శనివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి

మార్చి 10 —— ఆదివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

మార్చి 17 —— ఆదివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 22 (శుక్రవారం) —— బిహార్ దివస్ —— బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 24 —— ఆదివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

మార్చి 25 (సోమవారం) —— హోలీ —— కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు

మార్చి 26 (మంగళవారం) —— యయోసాంగ్ రెండో రోజు/హోలీ —— ఒడిశా, మణిపూర్, బీహార్‌లో బ్యాంక్‌లు పని చేయవు

మార్చి 27 ‍‌(బుధవారం) —— హోలీ —— బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు

మార్చి 29 ‍‌(శుక్రవారం) —— గుడ్ ఫ్రైడే —— త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము & కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు

మార్చి 30 —— నాలుగో శనివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి

మార్చి 31 —— ఆదివారం —— దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

బ్యాంక్‌ సెలవులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు
మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఈ సెలవుల వల్ల బ్యాంక్‌ సేవల్లో దాదాపుగా అంతరాయం ఉండదు. ఈ డిజిటల్‌ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్‌ ముందుగానే మీకు తెలియజేస్తుంది.

భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్‌ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.

Railway Jobs: నిరుద్యోగులకు రైల్వే‌ శాఖ గుడ్ న్యూస్.. ఇక కొలువుల జాతరే

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిపికేషన్‌ను కూడా విడుదల చేసింది. మొత్తం 9 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందుతో గ్రేడ్-1 సిగ్నల్, 1100, గ్రేడ్-3 పోస్టులకు 7,900 అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఉద్యోగానికి సంబంధించిన ఆర్హతలను కూడా నోటిఫికేషన్‌లో అధికారులు వెల్లడించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకన్న వారు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. గ్రేడ్-1 సిగ్నల్ పోస్టుకు రూ.29,200 రూపాయలు, గ్రేడ్-3 పోస్ట్‌కు రూ.19,900 బేసిక పే‌గా వేతనాన్ని నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తు చేసుకోవచ్చు వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రైల్వే‌శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Interest free loans: ఏపీ రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్.. వారందరికీ వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికీ ఎంతంటే?

Central Govt interest free loans To AP Farmers: ఏపీలోని రైతులు కేంద్రం శుభవార్త చెప్పింది. వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలలో వచ్చిన మిచౌంగ్ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న పొగాకు రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ సోమవారం ప్రకటించింది. మిచౌంగ్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. పొగాకు బోర్డు విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పొగాకు బోర్డుల వేలం ప్లాట్‌ఫామ్‌లో ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు అమ్మకానికి కేంద్రం అనుమతించింది.
ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ.. పొగాకు రైతులకు పదివేల రూపాయల చొప్పున వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. పొగాకు బోర్డుకు చెందిన గ్రోయర్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని అందులో సభ్యులుగా ఉన్న రైతులకు అందించనున్నారు. ఈ విషయాన్ని వాణిజ్యశాఖ సోమవారం అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఎఫ్‌సీవీ రకం పొగాకు ఏపీ, కర్ణాటకలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. అయితే డిసెంబర్ ఐదో తేదీన వచ్చిన మిచౌంగ్ తుపాను కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలలోని పొగాకు రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు.

Maruti Suzuki: గుడ్ న్యూస్.. 35 కి మీల మైలేజీతో పాటు కళ్లు చెదిరే ఫీచర్లు.. ధర తగ్గించిన మారుతీ..!

Maruti Alto k10: మారుతి సుజుకి తన సరసమైన హ్యాచ్‌బ్యాక్ ఆల్టో కె10 ధరలను తక్షణం అమల్లోకి తెచ్చింది. కంపెనీ కొన్ని వేరియంట్‌ల ధరలను తగ్గించింది. Alto K10 ధరలో మార్పులను చూద్దాం..

Alto K10 శ్రేణిలోని VXi AGS, VXi+ AGS వేరియంట్‌ల ధరలు రూ. 5,000 తగ్గాయి. ఈ వేరియంట్‌ల ధరలు ఇప్పుడు వరుసగా రూ. 5.56 లక్షలు, రూ. 5.85 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇవి కాకుండా, ఆల్టో కె10 ఇతర వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలై రూ. 5.96 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్‌ను నాలుగు వేరియంట్‌లలో విక్రయిస్తోంది: Std, LXi, VXi, VXi+.

ఆల్టో కె10 అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే దాని ఇంధన సామర్థ్యం గల ఇంజన్ పెట్రోల్, సిఎన్‌జి రెండింటిలోనూ మెరుగైన మైలేజీని ఇస్తుంది. ఆల్టో K10లో, కంపెనీ 999 cc 1-లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఇది గరిష్టంగా 67 bhp శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు పెట్రోల్‌లో లీటరుకు 24 కిలోమీటర్లు, CNGలో 35 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అంటే ఆల్టో కె10 రన్నింగ్ ఖరీదు బైక్‌తో సమానం.

ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు వంటి లక్షణాలను కలిగి ఉంది.

ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది.

చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌లను ప్రభుత్వం ఆమోదించింది. 2022–2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్‌ల (అడ్‌ హాక్ బోనస్‌లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది .

దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించబడతాయి.

FASTag KYC Deadline : మీ ఫాస్ట్‌ ట్యాగ్ కేవైసీ అప్‌డేట్ చేశారా? ఈ నెల 29 వరకు ఛాన్స్.. ఎలా అప్‌డేట్ చేయాలి? స్టేటస్ ఇలా తెలుసుకోండి!

FASTag KYC Deadline : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల వాహనాల కోసం ‘వన్ వెహికల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్‌’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఇకపై ఒకే ఫాస్ట్ ట్యాగ్‌ను అన్ని వాహనాలకు ఉపయోగించడానికి వీలుండదు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, దేశవ్యాప్తంగా టోల్ వసూలును క్రమబద్ధీకరించేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేయాలనుకుంటే కచ్చితంగా కేవైసీని పూర్తి చేసి ఉండాలి. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేసుకోవడానికి ఈ నెల (ఫిబ్రవరి) 29 వరకు గడువు విధించింది.
ఈ తేదీలోగా ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు తప్పనిసరిగా తమ కేవైసీని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువు తేదీలోగా ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయకపోతే ఆయా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు డియాక్టివేట్ అవుతాయని గమనించాలి. అందుకే, వినియోగదారలు తమ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. ఇంతకీ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? గడువు కన్నా ముందు ఎలా అప్‌డేట్ చేయాలనే అన్నింటికి పూర్తి వివరాలను మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి చూద్దాం..
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి? :

మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని సులభంగా అప్‌డేట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి ప్రయత్నంచండి.
ఎన్‌హెచ్ఏఐ (NHAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయండి
https://fastag.ihmcl.com సైట్ విజిట్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
ఆ తర్వాత, డ్యాష్‌బోర్డ్ మెనూకి వెళ్లి.. My Profile ఆప్షన్ క్లిక్ చేయండి.
My Profile పేజీలో కేవైసీ ఆప్షన్ ఎంచుకోండి.
కేవైసీ (KYC) ఆప్షన్ క్లిక్ చేసి.. ఆపై ‘Customer Type’ ఎంచుకోండి.
మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
డిక్లరేషన్‌ తప్పనిసరి ఆప్షన్ టిక్ చేయండి.
మీ అన్ని డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత కేవైసీని ఆమోదించడానికి 7 రోజుల సమయం పడుతుంది.
బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయండి :

మీరు ఫాస్ట్ ట్యాగ్ వెబ్‌సైట్‌ లాగిన్ చేయండి.
నేరుగా మీ పార్టనర్ బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రయత్నించవచ్చు.
డెస్క్‌టాప్ లేదా మొబైల్‌లో https://www.netc.org.in/request-for-netc-fastag వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకును ఎంచుకుని, వెబ్‌సైట్‌లోని లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి సంబంధిత ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంక్‌కి లాగిన్ అవ్వండి.
ఆన్-స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటించండి.
మీ ఫాస్ట్‌ట్యాగ్ KYCని అప్‌డేట్ చేసుకోండి.
ఆఫ్‌లైన్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయండి :

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయడానికి బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
మీ పాన్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ దగ్గర ఉంచుకోండి.
మీ సమీపంలోని ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకును విజిట్ చేయండి.
ఫాస్ట్ ట్యాగ్ కోసం కేవైసీ ఫారమ్ తీసుకుని తీసుకోండి.
డాక్యుమెంట్లతో పాటుగా పూర్తి చేసిన కేవైసీ ఫారమ్‌ను సమర్పించండి.
బ్యాంక్ ఈ కేవైసీ ఫారమ్‌ను ధృవీకరించి ప్రాసెస్ చేస్తుంది.
మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్‌డేట్ తర్వాత మీకు ఇమెయిల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ వస్తుంది.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్‌డేట్.. అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. మీరు కేవైసీని నిర్ధారించడానికి ఈ కింది అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లలో (OVDs) ఒకదాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

పాస్‌పోర్ట్
డ్రైవింగ్ లైసెన్స్
ఓటరు ఐడీ కార్డు
పాన్ కార్డు (PAN)
ఆధార్ కార్డు
NREGA జాబ్ కార్డ్
మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) కాపీని తప్పనిసరిగా సమర్పించాలి.
ఆన్‌లైన్‌లో ఫాస్ట్ ట్యాగ్ KYC స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

మీ ఫాస్ట్‌ట్యాగ్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.
https://fastag.ihmcl.com వెబ్‌సైట్ విజిట్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
ఆ తర్వాత డ్యాష్‌బోర్డ్ మెనూకి వెళ్లండి.
మై ప్రొఫైల్ (My Profile) ఆప్షన్ క్లిక్ చేయండి.
మీ కైవసీ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు.
ఎన్‌హెచ్ఏఐ (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వెబ్‌సైట్‌లో మీ నంబర్ రిజిస్టర్ చేసుకోవడానికి ముందుగా (MyFASTag) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ చెక్ చేయడానికి పైవిధంగా ప్రయత్నించవచ్చు.

అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన మోదీ.. వీరి ఎంపిక ఎలా జరిగిందంటే?

Gaganyaan Astronauts Name : భారత వ్యోమగాములు అంతరిక్షంలోకి అడుగుపెట్టే చారిత్రక ఘట్టానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో గగన్ యాన్ వ్యోమగాములను ఇస్రో ప్రపంచం ముందుంచింది. గగన్ యాన్ కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల బృందాన్ని ప్రకటించింది. గగన్ యాన్ ప్రాజెక్ట్ పురోగతిపై ప్రధాని మోదీ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. వీరంతా వేరేవేరే ఇస్రో కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. ఈ నలుగురు వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించారు. అయితే, రష్యారాకెట్ లో ఆయన అంతరిక్షంలోకి వెళ్లాడు. ఇప్పుడు నలుగురు భారతీయులు మనదేశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరే రాకెట్లో ప్రయాణించి అంతరిక్షంలో అడుగు పెట్టనున్నారు. ఈ నలుగురు వ్యోమగాములు భారతదేశంలోని అన్ని రకాల యుద్ధ విమానాలను నడిపారు. అందువల్ల, యుద్ధ విమానాల లోపాలు, ప్రత్యేకతలు వీరు అవపోసన పట్టారు. వీరంతా రష్యాలోని జియోగ్నీ నగరంలో ఉన్న రష్యన్ స్పేస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ తీసుకుంటున్నారు.
సెలక్షన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) గగన్ యాన్ మిషన్ కోసం వ్యోమగాములను ఎంపిక చేయడానికి ట్రయల్స్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా వందలాది మంది పైలట్లు ఇందులో అర్హత సాధించారు. వీరిలో టాప్ 12 మంది ఎంపికయ్యారు. అనేక రకాల రౌండ్ల తరువాత ఈ మిషన్ కోసం నలుగురు ఎయిర్ ఫోర్స్ పైలట్లను ఎంపిక చేశారు. వీరి శిక్షణ 2021లో పూర్తయింది. ఈ పైలట్లు రష్యాలో అనేక రకాల శిక్షణలు తీసుకున్నారు. ప్రస్తుతం వీరు బెంగళూరులో ఉన్న ఇస్రో హ్యూమన్ స్పేస్ సెంటర్ (హెచ్‌ఎస్‌ఎఫ్‌సి)లో సాధన చేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై కూడా శ్రద్ధ చూపుతున్నారు. అయితే, గగన్ యాన్ మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగించే సమయంలో ముగ్గురు వ్యోమగాములను మాత్రమే పంపించనున్నారు.

గగన్ యాన్ మిషన్ కింద ముగ్గురు వ్యోమగాములను 400 కిలో మీటర్ల దూరంలోని దిగువ భూకక్ష్యలోకి మూడు రోజులపాటు పంపనున్నారు. ఆ తరువాత వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఇందుకో్సం క్రూ మాడ్యూల్ రాకెట్ ను ఉపయోగించనున్నారు. ఈ మిషన్ భారతదేశానికి చాలా ముఖ్యమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే అమెరికా, చైనా, రష్యా తరువాత మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహించిన నాల్గో దేశంగా భారత్ అవతరిస్తుంది.

AP TET 2024 : ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం- మార్చి 6 వరకూ- ముఖ్య వివరాలివే..

ఏపీలో 6100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు వీలుగా జరుగుతున్న టెట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో ఇవాళ పరీక్షలు ప్రారంభించారు.
ఇవాళ్టి నుంచి మార్చి 6వ తేదీ వరకూ వివిధ కేటగిరీల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్ధులు సాధించే మార్కులు డీఎస్సీలో కలిసే అవకాశం ఉండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది.
టెట్ పరీక్షల్లో భాగంగా పేపర్ 1ఏను ఇవాళ్టి నుంచి మార్చి 1వ తేదీ వరకూ నిర్వహించబోతున్నారు. అలాగే పేపర్ 2ఏను మార్చి 2,3,4,6 తేదీల్లో నిర్వహిస్తారు. అటు పేపర్ 1బీని మార్చి 5న ఉదయం సెషన్ లో నిర్వహిస్తారు. పేపర్ 2బీ అదే రోజు మధ్యాహ్నం సెషన్ లో నిర్వహిస్తారు. పూర్తి ఆన్ లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్ష రాసేందుకు మొత్తం 2.67 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విద్యాశాఖ.. తెలంగాణ, కర్నాటకల్లో మూడేసి పరీక్షా కేంద్రాలు, తమిళనాడు, ఒడిశాలో రెండేసి పరీక్షా కేంద్రాల్ని అందుబాటులో ఉంచింది. గర్భిణులకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలు కేటాయించారు. అలాగే దివ్యాంగులకు స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాసేందుకు వీలు కల్పించారు.

డీఎస్సీ పరీక్షలో టెట్ పరీక్షలో సాధించే మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షల్ని కూడా అభ్యర్ధులు సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వకపోవడంతో అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా రాకరాక వచ్చిన డీఎస్సీ కావడంతో ఉన్న కాస్త సమయంలోనే రెండు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.

Business Idea: ఈ వ్యాపారంతో నెలకు రూ. లక్ష పక్కా.. ఎలా ప్లాన్‌ చేయాలంటే..

ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తిచూపిస్తున్నారు. దీనిని వ్యాపార అస్త్రంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు.
ఇలాంటి వాటిలో ఒకటి గానుగ నూనె బిజినెస్‌ ఒకటి. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ బిజినెస్‌తో భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.

చిన్న చిన్న మిషన్‌లతో ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. ఇంతకి ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చవుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మెషిన్ అవసరం ఉంటుంది.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 10X10 సైజ్ ఉన్న గది సరిపోతుంది. ఇక మిషన్‌ ధర విషయానికొస్తే కెపాసిటీ బట్టి రూ. 15 వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు ఉంటుంది. ఈ బిజినెస్‌ ప్రారంభించాలంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా fssai లైసెన్స్ పొందడం తప్పనిసరి దీంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. మీరు తయారు చేసిన నూనెను ప్యాకెట్స్‌ లేదా సీసాల్లో ప్యాక్‌ చేసిన నేరుగా విక్రయించుకోవచ్చు.

ఈ మిషన్‌ సహాయంతో తయారు చేసిన నూనెను మార్కెట్‌లో లీటరుకు రూ. 50 చొప్పున లాభం పొందొచ్చు. ఈ లెక్కన ఉదాహరణకు మీరు మీరు రోజుకు 50 లీటర్ల నూనెను తయారు చేసిన సరాసరి రోజుకు రూ. 2500 చొప్పున లాభం పొందొచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 60 వేలకి పైగా సంపాదన ఆర్జించవచ్చు. ఒకవేళ మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయగలిగితే ఎక్కువ లాభం పొందొచ్చు. అంతేకాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతుంది. దీన్ని విక్రయించి కూడా లాభాలు పొందొచ్చు.

ఒకటో తరగతిలో చేరాలంటే ఆరేళ్ల వయస్సు తప్పనిసరి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూ ఢిల్లీ: ఒకటవ తరగతిలో ఆడ్మిషన్ పొందాలంటే ఆరేళ్ల వయస్సు కనీసంగా ఉండాలని కేంద్రం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.2024-25 విద్యాసంవత్సరం నుండి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 నిబంధనల ప్రకారంగా ఒకటవ తరగతిలో చేరే చిన్నారులకు ఆరేళ్ల వయస్సు ఉండాలని కేంద్రం సూచించింది.ఈ మేరకు ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సమాచారం పంపింది.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా ఈ విధానాన్ని పాటించాలని ఆ నోటీసులో కేంద్రం కోరింది.
2024-25 విద్యాసంవత్సరంలో ఒకటవ తరగతిలో చేరే విద్యార్థులకు కనీసం ఆరేళ్లు ఉండాల్సిందేనని కేంద్రం ఆ నోటీసులో తేల్చి చెప్పింది.ఎన్ఈపీ 2020 ప్రకారంగా ఫ్రీ స్కూల్ 3 నుండి ఐదేళ్ల మధ్య ఉంటుంది. ఆ తర్వాత 1వ తరగతిలో విద్యార్థులు చేరుతారు.1వ, తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో విద్యార్థుల వయస్సుల్లో మధ్య తేడా ఉన్న విషయాన్ని కేంద్రం గుర్తించింది. 2022 మార్చి లో మంత్రిత్వ శాఖలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
ఢిల్లీ, అసోం వంటి రాష్ట్రాల్లో ఆరేళ్ల వయస్సు లేని విద్యార్థులకు కూడ ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించిన విషయాన్ని కేంద్రం పేర్కొంది.పాండిచ్చేరి, లడఖ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఒకటవ తరగతిలో చేరే విధ్యార్థుల వయస్సులో తేడా ఉందని కేంద్రం తెలిపింది.

కొన్ని రాష్ట్రాల్లో చిన్నారులను స్కూళ్లకు పంపేందుకు పేరేంట్స్ పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతుంటారు. ఇంటి వద్ద గడపాల్సిన బాల్యాన్ని స్కూళ్ల పేరుతో చిదిమేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఐదేళ్లలోపు వయస్సున్న చిన్నారులను స్కూళ్లకు పంపకపోీతే భవిష్యత్తుల్లో ఉద్యోగాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పేరేంట్స్ భయపడుతున్నారు. ఒకటవ తరగతిలో చేరాలంటే ఆరేళ్ల వయస్సు ఉండాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపింది.ఈ నిబంధనను పాటించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ఒకటవ తరగతిలో చేరే విద్యార్థుల వయస్సులో వ్యత్యాసం ఉండదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

APPSC Group 2 Prelims Exam Cut Off Marks 2024 : గ్రూప్‌-2 ప్రిలిమ్స్ కటాఫ్ ఇంతేనా..? ఈ సారి..

ఈ సారి కటాఫ్ మార్కులు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు విశ్లేషణ ప్రకారం 40-45 మార్కుల మధ్యలో Cut Off ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68-70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం. గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌ కుమా­ర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ లేదా జూలైలో గ్రూప్‌-2 మెయిన్స్‌ నిర్వహిస్తామని వెల్లడించారు.

IDBI Notification 2024: ఐడీబీఐలో 500 పోస్టులు.. ఎంపికైతే ఏటా రూ. 6.5 లక్షల వరకు వార్షిక వేతనం

500 పోస్ట్‌ల భర్తీకి ఐడీబీఐ నోటిఫికేషన్‌
పీజీడీబీఎఫ్‌లో ప్రవేశంతో కొలువులు ఖరారు
కోర్సు పూర్తయ్యాక బ్యాంకులో నియామకం
ఏడాదికి రూ. 6.5 లక్షల వరకు వేతనం

మొత్తం పోస్టుల సంఖ్య 500
ఐడీబీఐ తాజా నోటిఫికేషన్‌ ద్వారా.. మొత్తం 500 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఓపెన్‌ కేటగిరీలో 203; ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 50; ఓబీసీ కేటగిరీలో 135; ఎస్‌సీ కేటగిరీలో 75, ఎస్‌టీ కేటగిరీలో 37 పోస్ట్‌లు ఉన్నాయి.

అర్హతలు

జనవరి 31, 2024 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: జనవరి 31, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పీజీడీబీఎఫ్‌ పూర్తి చేసుకుంటేనే
జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐడీబీఐ.. నియామకాల ఖరారుకు వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్‌ఈఐపీఎల్, మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ సంస్థలతో కలిసి.. ఏడాది వ్యవధిలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్‌) కోర్సును అందిస్తోంది. జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన వారు ఈ కోర్సును పూర్తి చేసుకుంటేనే బ్యాంకులో కొలువు ఖరారు చేస్తారు.

పీజీడీబీఎఫ్‌ ఇలా
పీజీడీబీఎఫ్‌ కోర్సులో భాగంగా ముందుగా బ్యాంకింగ్‌ రంగ నైపుణ్యాలపై ఆరు నెలల పాటు క్లాస్‌ రూమ్‌ బోధన ఉంటుంది. ఆ తర్వాత రెండు నెలల ఇంటర్న్‌షిప్, మరో నాలుగు నెలలు ఐడీబీఐ శాఖల్లో ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ సదుపాయం కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఐడీబీఐ శాఖల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఓ స్థాయిలో నియామకం ఖరారవుతుంది. కోర్సు పూర్తి చేసుకున్న వారికి కొలువుతోపాటు పీజీడీబీఎఫ్‌ సర్టిఫికెట్‌ కూడా అందిస్తారు.

స్టయిఫండ్‌
ఐడీబీఐ పీజీడీబీఎఫ్‌ కోర్సులో చేరిన అభ్యర్థులకు స్టయిఫండ్‌ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు.ఏడాది వ్యవధిలోని కోర్సు సమయంలో మొదటి ఆరు నెలలు నెలకు రూ.5వేలు; ఆ తర్వాత రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ సమయంలో నెలకు రూ.15 వేలు చొప్పున స్టయిఫండ్‌ అందిస్తారు.

రూ. 6.5 లక్షల వేతనం
పీజీడీబీఎఫ్‌ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని.. జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఓ హోదాలో కొలువు ఖరారు చేసుకున్న వారికి ప్రారంభ వార్షిక వేతనం రూ.6.14 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉంటుంది. ఈ హోదాలో మూడేళ్లు పని చేశాక బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా గ్రేడ్‌-ఎ ఆఫీసర్లుగా పదోన్నతికి అర్హత లభిస్తుంది.

ఏడాది ప్రొబేషన్‌
జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఓ హోదా­లో నియమితులైన వారికి ఏడాది పాటు ప్రొబేషనరీ పిరియడ్‌ విధానం అమలవుతోంది. నియామకం ఖరారు చేసుకున్న వారు బ్యాంకులో కనీసం మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తామని రూ. 2 లక్షల విలువైన పూచీకత్తు బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

రెండంచెల ఎంపిక ప్రక్రియ
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఓ పోస్ట్‌లకు మార్గం వేసే పీజీడీబీఎఫ్‌ కోర్సులో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష,పర్సనల్‌ ఇంటర్వ్యూ.

నాలుగు విభాగాల్లో రాత పరీక్ష
పీజీడీబీఎఫ్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్ష.. రెండు వందల మార్కులకు నాలుగు విభాగాల్లో ఉంటుంది. ఇందులో లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 60ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/కంప్యూటర్‌/ఐటీ 60 ప్రశ్నలు-60 మార్కులకు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ టెస్ట్‌కు కేటాయించిన సమ­యం రెండు గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన­(ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు)ఉంది.

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా 100 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

వెయిటేజీ విధానం
పీజీడీబీఎఫ్‌కు ఎంపిక చేసేందుకు… తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తారు. రాత పరీక్షకు 75 మార్కులు; పర్సనల్‌ ఇంటర్వ్యూకు 25 మార్కులు చొప్పున వెయిటేజీని నిర్ధారించారు. అభ్యర్థులు పొందిన మార్కులను ఈ వెయిటేజీలకు అనుగుణంగా క్రోడీకరించి.. తుది జాబితా విడుదల చేస్తారు.

రాత పరీక్షలో రాణించేలా

లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి డైరక్షన్స్, డిస్టెన్స్, అనాలజీ, బ్లడ్‌ రిలేషన్స్, సిరీస్, డబుల్‌ లైనప్, డయాగ్రమ్స్, ఫ్లో చార్ట్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.
ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్‌ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్‌ సెంటెన్స్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మ్యాథమెటిక్స్‌లోని కోర్‌ అంశాలతోపాటు అర్థమెటిక్‌ అంశాలు (నిష్పత్తులు, శాతాలు, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, యావరేజెస్, స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, కూడికలు, హెచ్చవేతలు తదితర)పై దృష్టి పెట్టాలి.
నాలుగో విభాగంలోని జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ఎకానమీ విషయంలో ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ విషయంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ స్వరూపంతోపాటు తాజా పరిణామాలు, బ్యాంకింగ్‌ టెర్మినాలజీపై అవగాహన ఏర్పరచుకోవాలి. కంప్యూటర్‌/ఐటీ అవేర్‌నెస్‌ విషయంలో అభ్యర్థులు కంప్యూటర్‌ ఆపరేషన్‌ టూల్స్‌పై పట్టు సాధించాలి.
ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఫిబ్రవరి 26
ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: 2024, మార్చి 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

Portable AC: ఈ పోర్టబుల్ ఏసీలతో ఎండ వేడికి చెక్ పెట్టండి.. నిమిషాల్లోనే రూమంతా చల్లగా.. రూ.3వేలలోపే

Portable AC: చలి కాలం దాదాపుగా ముగిసింది. ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉండనున్నాయో తలచుకుంటే వణుకు పడుతోంది.
మండుతున్న ఎండలు, తేమ కారణంగా ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు కూడా పనిచేయడం లేదు. అయితే, అందరూ ఎయిర్ కండీషనర్‌పై పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేరు. కాబట్టి చింతించకండి. ఈ వేడి నుంచి మిమ్మల్ని రక్షించడానికి, మార్కెట్‌లో చాలా ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ ఇంటికి రూ. 5,000 లోపు, 2 లేదా 3 వేలు, మీకు ఉపశమనం కలిగించవచ్చు. మార్కెట్‌లో విరివిగా అమ్ముడవుతున్న పోర్టబుల్ ఎయిర్ కండిషనర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లభిస్తాయి.

చౌకైన పోర్టబుల్ AC గురించి చెప్పాలంటే, ప్రస్తుతం మార్కెట్‌లలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది కాకుండా, మీరు ఈ పోర్టబుల్ ఏసీలను ఆన్‌లైన్‌లో కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో సహా అనేక ఇ-మార్కెట్ ప్రదేశాలలో వీటిని కొనుగోలు చేయవచ్చు. వాటి ధర రూ. 5,000 కంటే తక్కువగా ఉంటుంది.

మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఎంచుకోండి..

మార్కెట్‌లో చాలా కంపెనీల పోర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే, మీరు మీ పరిమాణం, నాణ్యత ప్రకారం కొనుగోలు చేయవచ్చు. కానీ మీ బడ్జెట్ రూ. 5,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మీకు నచ్చిన అనేక మోడల్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ మార్కెట్ గురించి మాట్లాడితే, One94Store Portable AC అమెజాన్‌లో రూ. 2,199కి అందుబాటులో ఉంది.

ఇది కాకుండా, SK RAYAN పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ 2,649 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఇదే ధరల విభాగంలోని కొన్ని ఇతర బ్రాండ్ల గురించి మాట్లాడితే, Cupex Portable AC రూ. 2,499, Auslese పోర్టబుల్ AC రూ. 2,280కి అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, మార్కెట్లో మరిన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

RPF Jobs: టెన్త్‌, డిగ్రీ చదివితే చాలు.. రైల్వేలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇట్టే కొట్టేయొచ్చు

RPF Notification 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం మరో భారీ ఉద్యోగ ప్రకటన వచ్చింది. మంచి జీతంతోపాటు హోదా ఉండే ఉద్యోగాల ప్రకటన వచ్చేసింది.
ఈ ఉద్యోగాల ఎంపికకు కావాల్సిన అర్హతలు, పరీక్ష ఫీజు, ఇతర నియమ నిబంధనలు ఏమిటో చదవండి.
నిరుద్యోగులకు భారతీయ రైల్వే నియామక బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మరో ఉద్యోగ ప్రకటనతో ముందుకు వచ్చింది. గతంలోనే ఈ ఉద్యోగ ప్రకటనపై చిన్న ప్రకటన విడుదల చేయగా.. తాజాగా సమగ్ర వివరాలతో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. రైల్వే పోలీస్‌ దళం (రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)లో ఈ ఉద్యోగాల నియామకాలను చేపట్టనుంది. మొత్తం 4,660 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వాటిలో 452 ఎస్సై పోస్టులు ఉండగా.. 4,208 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాల భర్తీకి స్త్రీ, పురుషులు ఇరువురు అర్హులే. ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల భర్తీ-2024 కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం 11 ఏప్రిల్‌ నుంచి 14 మే 2024 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థులు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు రాయాల్సి ఉంది. అందులో ఎంపికైతే పీఈటీ, మెఈటీ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌తో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఆర్‌ఆర్‌బీ అధికారిక https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. దరఖాస్తుల గడువు ప్రకటించినా పరీక్షల తేదీలు మాత్రం ప్రకటించలేదు. ఈ ఉద్యోగాల్లో మహిళలకు 15 శాతం రిజర్వ్‌ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

పూర్తి వివరాలు
ఉద్యోగం పేరు: ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌, ఎస్సైలు
మొత్తం ఎన్ని పోస్టులు: 4,660 (452 ఎస్సై పోస్టులు, 4,208 కానిస్టేబుల్‌)
వయసు: అభ్యర్థుల వయసు 1 జూలై 2024 నాటికి ఎస్సై పోస్టులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ప్రారంభ వేతనం: ఎస్సై ఉద్యోగాలకు రూ.35,400, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ, ఎక్స్‌ సర్వీస్‌ వారికి రూ.250, ఇతరులకు రూ.500.
దరఖాస్తు గడువు: 15 ఏప్రిల్‌ 2024 దరఖాస్తులు ప్రారంభమై 14 మే 2024న ముగుస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో (https://indianrailways.gov.in/)

Namo drone didi scheme మహిళలకు భారీ శుభవార్త..వాటి కొనుగోలుపై 80 శాతం సబ్బీడీ ఇస్తున్న ప్రభుత్వం..

Drone Didi Scheme: కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సందర్భాల్లో చెప్పారు. వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచే చర్యలు తీసుకున్నామని, తద్వారా అనేక విభాగాలకు నాయకత్వం వహించే స్థాయికి అతివలు చేరుకున్నారని తెలిపారు.
అయితే వ్యవసాయంలో కూడా మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు గత ఏడాది ఆగస్టు 15న నమో డ్రోన్ దీదీ స్కీమ్‌ను(Namo drone didi scheme) ప్రారంభించారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల మహిళలకు డ్రోన్‌లను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం ఈ స్కీమ్ ఉద్దేశం.

ఫిబ్రవరి 25న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ మహిళాభివృద్ధి గురించి మాట్లాడారు. దేశ అభివృద్ధి పథంలో సహకారం అందిస్తున్న మహిళలను గౌరవించేందుకు రాబోయే మహిళా దినోత్సవం (మార్చి 8) మంచి సందర్భమని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ‘డ్రోన్ దీదీ’ సునీతా దేవి గురించి ప్రధాని మాట్లాడారు.

* డ్రోన్ దీదీలు
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయానికి డ్రోన్లను ఉపయోగిస్తారని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించలేదని, కానీ దీన్ని నిజం చేసి చూపిస్తున్నారని మోదీ చెప్పారు. సాధారణ గ్రామీణ మహిళ సునీతా దేవి డ్రోన్‌తో వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. వీరిని అందరూ డ్రోన్ దీదీలుగా పిలుస్తున్నట్లు వివరించారు. అయితే మహిళలకు డ్రోన్లను అందించడానికి కొత్త స్కీమ్‌ను ప్రధాని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రకటించారు. అదే నమో దీదీ డ్రోన్ స్కీమ్. డ్రోన్లతో వ్యవసాయం చేసే మహిళా శక్తిని ప్రధాని డ్రోన్ దీదీలుగా పేర్కొన్నారు.

* బడ్జెట్‌లో రూ.500 కోట్లు

మన దేశంలో దాదాపు 70 శాతం కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. ఈ రంగంలో గ్రామీణ మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం, వ్యవసాయ పద్ధతులను సమూలంగా మార్చడం నమో డ్రోన్ దీదీ స్కీమ్ ప్రాథమిక లక్ష్యం. కూలీల ఖర్చులను తగ్గించడం, ఎరువులు, సమయం, నీటిని ఆదా చేయడం, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించడం ఈ పథకం ఉద్దేశాలు.

స్వయం సహాయక బృందాలకు (SHGs) చెందిన 15,000 మంది మహిళలకు డ్రోన్‌ టెక్నాలజీనీ పరిచయం చేయాలని ఈ స్కీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ టెక్నాలజీతో ఈ మహిళలు వ్యవసాయ పద్ధతులను మెరుగుపర్చుకొని మొత్తం ఉత్పాదకతను పెంచవచ్చు. తాజా మధ్యంతర బడ్జెట్‌లో డ్రోన్ దీదీ పథకానికి రూ. 500 కోట్ల నిధులు కేటాయించారు. అంతకు ముందు ఏడాది రూ.200 కోట్లు కేటాయించగా, ఈసారి పెంచారు. దీంతో ఈ స్కీమ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

* పథకం లాభాలు
ఈ పథకం మహిళా స్వయం సహాయక సంఘాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డ్రోన్ కొనుగోలుపై కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. మహిళా స్వయం సహాయక సంఘాలు డ్రోన్ ధరలో 80 శాతం లేదా గరిష్టంగా రూ. 8 లక్షలు.. ఏది తక్కువైతే అంత మొత్తం సబ్సిడీకి అర్హులు. మిగిలిన డ్రోన్ ఖర్చుకు అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫండ్ (AIF) ద్వారా లోన్ తీసుకోవచ్చు. AIF ద్వారా పొందిన వడ్డీపై 3 శాతం నామమాత్రపు వడ్డీ ఉంటుంది.

డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీరు తమ కమ్యూనిటీలలోని రైతులకు డ్రోన్‌లను అద్దెకు ఇవ్వొచ్చు. తద్వారా ఆర్థిక స్థిరత్వం, సాధికారత పెంపొందించుకుంటూ సంవత్సరానికి రూ. 1 లక్ష అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

* ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు?
మహిళా స్వయం సహాయక సంఘాలు మాత్రమే నమో డ్రోన్ దీదీ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్కీమ్ ద్వారా పొందిన డ్రోన్‌లను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. దరఖాస్తు చేసుకోవడానికి మహిళా SHGల రిజిస్ట్రేషన్ నంబర్, మహిళా సభ్యుల ఆధార్ కార్డ్, మహిళా SHGల బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్.. వంటివి అవసరం.

* ఎలా దరఖాస్తు చేయాలి?

– ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలు, నమో డ్రోన్ దీదీ పథకం కింద అర్హులైన మహిళా SGHలను ఎంపిక చేసి షార్ట్‌లిస్ట్ చేస్తాయి. అయితే రిజిస్టర్ అయిన మహిళా SHGలు మాత్రమే ఈ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.

– జిల్లా కమిటీలు సంబంధిత మహిళల ఆర్థిక స్థితి, సామాజిక పనితీరు ఆధారంగా గ్రూపులను ఎంపిక చేస్తాయి. ఎంపిక అయిన గ్రూపు వివరాలను సంబంధిత SHGల లీడర్లకు తెలియజేస్తారు.

– నమో డ్రోన్ దీదీ పథకం కింద ఎంపిక చేసిన SHGలలోని మహిళా సభ్యులందరికీ డ్రోన్ ఆపరేషన్, టెక్నాలజీపై శిక్షణ ఇస్తారు. లబ్ధిదారులైన మహిళలు సమీపంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

* ట్రైనింగ్

నమో డ్రోన్ దీదీ పథకం కింద, మహిళలకు డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయంలో దాని వినియోగానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ సమగ్ర శిక్షణ అందిస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో అనేక అంశాలు ఉంటాయి. డ్రోన్ పైలటింగ్‌లో భాగంగా డ్రోన్‌లను టేకాఫ్, ల్యాండింగ్ చేయడం, నావిగేషన్ స్కిల్స్, బ్యాటరీ నిర్వహణ వంటివన్నీ నేర్పిస్తారు. పంటల పర్యవేక్షణ, పురుగుమందులు, ఎరువులు చల్లడం, విత్తనాలు విత్తడానికి డ్రోన్‌లను ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇస్తారు. డ్రోన్ల వాడకం పెరిగితే, డ్రోన్ స్టార్టప్స్, డ్రోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పెరుగుతాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగి ఎక్కువ మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది.

స్పీకర్ సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
ఈ మేరకు సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులను స్పీకర్ కార్యాలయం జారీ చేసింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తూ రాజకీయ వేడిని పెంచిన క్రమంలో.. స్పీకర్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం.. వైసీపీ పార్టీకి చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో పార్టీలు మారిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి.. వివరణ కోరగా.. పలుమార్లు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకుండా గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారు.

BREAKING : TTD నుంచి రమణ దీక్షితులు తొలగింపు !

TTD రమణ దీక్షితులుకు బిగ్‌ షాక్‌ తగిలింది. TTD నుంచి రమణ దీక్షితులును తొలగించారు. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది TTD పాలకమండలి.
TTD, అహోబిల మఠం, జియ్యంగార్లు,అర్చకులపై రమణ దీక్షితులు అనుచిత వాఖ్యలు చేసారని…..క్రమశిక్షణా రాహిత్యంతో వ్యవహరించిన రమణ దీక్షితులును టీటీడీ నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి.

గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక పై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని…తిరుమల శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద వున్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయిస్తామన్నారు. 4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బోట్టులు తయ్యారి..నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.ఇక పై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు.

ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..

ఏపీలోని రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 సీజన్‌కు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత నిధులను ఎప్పుడు విడుదల చేసేదీ ప్రకటించింది.
వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 28వ తేదీన రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. ఈ మేరకు రైతుభరోసా పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు రెండు వేల చొప్పున అకౌంట్లోకి జమచేస్తారు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు.

Amrit Bharat Stations : కొత్తగా ఏపీలో 34, తెలంగాణలో 15 ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు

Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 34 అమృత్ భారత్ రైల్వే స్టేషన్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించింది.
అమృత్ భారత్ స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌లో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను డెవలప్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫిబ్రవరి 26న ( సోమవారం) వీటికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.843.54 కోట్లతో ఈ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరణ చేయనున్నారు. ఇక సోమవారం రోజు దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ స్టేషన్లకు(Amrit Bharat Stations) వర్చువల్ విధానం ద్వారా ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణ పనులకు భూమిపూజ కూడా చేస్తారు.
అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్‌లో భాగంగా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతారు. ఇందులో భాగంగా ఏపీలో మొత్తం 72 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తారు. తొలి దశలో అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడతో పాటుగా, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను కేంద్రం గుర్తించింది. వీటి అభివృద్ధికి రూ.270 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లలో పనులు జరుగుతున్నాయి. తాజాగా మరో 34 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఆ లిస్టు వివరాలు కింద ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, అనపర్తి, ఆదోనీ, బాపట్ల, చీరాల, చిత్తూరు, కంభం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేశారు. అలాగే మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడికుడి, నంద్యాల, నర్సరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకొట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి కోసం రూ.610.30 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.

Original Watermelon : పుచ్చకాయలో ఈ మార్పులు కనిపిస్తే కెమికల్స్ మిక్స్ అయినట్టు అర్థం

పుచ్చకాయను చూస్తే నోరూరుతుంది. అలాగే పుచ్చకాయ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. నీటి శాతాన్ని నిర్వహిస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కళ్లకు మంచిది, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. వేసవిలో తప్పకుండా తినాల్సిన వాటిలో ఒకటి ఇది.

మార్కెట్‌లో లభించే అన్ని పుచ్చకాయలు మంచివే అని చెప్పలేం. అవి త్వరగా పండేందుకు వాటిలో రసాయనాలు కలుపుతూ ఉంటారు. పుచ్చకాయలు త్వరగా చెడిపోకుండా ఉండేందుకు, లోపలి భాగం ఎరుపు రంగులో ఉండాలని వివిధ కారణాలతో పుచ్చకాయలకు రసాయనాలు కలుపుతారు. ఆ పండ్లు చూసినప్పుడు చాలా ఎర్రగా ఉంటాయి. కానీ రుచి మాత్రం ఉండదు. పండును తియ్యగా చేసేందుకు రసాయనాలు కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి చాలా హానికరం.
పుచ్చకాయ బాగా పండాలి. కానీ కాయలుగా ఉన్నప్పుడే వాటిని తీసుకొచ్చి కొందరు రసాయనాలు కలుపుతారు. దీంతో పండిన పుచ్చకాయ గింజలు చాలా చిన్నవిగా ఉండాయి. అదే సహజంగా పండిన పుచ్చకాయ పండ్ల గింజలు నల్లగా ఉంటాయి…, పెద్దగా ఉంటాయి.

రసాయనాలు ఇంజెక్ట్ చేస్తారు

పుచ్చకాయలను కొందరు ఎర్లీగానే కట్ చేసి తీసుకొస్తారు. దానిలో రసాయనాలను ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఇలా చేసినప్పుడు గుజ్జు పగిలిపోయి రంగులో తేడా ఉంటుంది. కోసినప్పుడు విడిపోతే ఆ పుచ్చకాయలో కెమికల్ కంటెంట్ ఉందని చెప్పొచ్చు. కొన్నిసార్లు మనం పుచ్చకాయను కోస్తుంటే గుజ్జులో తేడా కనిపిస్తుంది. కింద పడుతూ ఉంటుంది. అది సరైనది కాదని అర్థం.
తెల్లటి మచ్చలు కనిపిస్తే..

పుచ్చకాయ పండ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, అలాంటి పండ్లపై రసాయనాలు స్ప్రే చేసినట్లు భావించవచ్చు. వాటిని చేతులతో తాకగానే పౌడర్ చేతులకు అంటుకుంటుంది. అలాంటి పండ్లను కొనకండి. త్వరగా పండేందుకు ఇలాంటి కెమికల్స్ వాడుతారు. ఆరోగ్యానికి మంచిది కాదు.

సూదితో పొడిచిన రంధ్రం

సాధారణంగా పండ్లను సరిగా పరిశీలిస్తే అందులో కెమికల్ కలిపారో లేదో అర్థం చేసుకోవచ్చు. నిశితంగా పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. పుచ్చకాయలో సూదితో పొడిచిన చిన్న రంధ్రం ఉంటుంది. అమ్మేవారిని అడిగితే ఈ విషయం ఒప్పుకోరు. ఇలాంటి పండ్లు కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.
పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్‌ను కలుపుతారు. ఇది ఇథనాల్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా పండ్లు త్వరగా పండుతాయి. త్వరగా పక్వానికి రావడానికి, రంగు వచ్చేలా చేయడానికి సుడాన్ రెడ్, మిథనాల్ ఎల్లో, మెర్క్యూరీ క్రోమేట్ వంటి రసాయనాలను కూడా ఉపయోగిస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు.

శరీరంపై దుష్ప్రభావాలు

కార్బైడ్‌తో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మిథనాల్ కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. క్రోమేట్ కడుపు సమస్యలు, రక్తహీనత, మెదడు దెబ్బతినడం, సంతానోత్పత్తి తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తింటాం. కానీ మనం తినే పండ్లు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే లాభం కోసం పండ్లపై రసాయనాలు వాడుతున్నారు.రసాయన రహిత పండ్లు తినడం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయ కొనేటప్పుడు పైన చెప్పిన విషయాలను గుర్తుంచుకోండి.

Dishti: దిష్టి అంటే ఏమిటి? పిల్లలకు ఎలా దిష్టి తీయాలి? అందుకు అనుసరించాల్సిన విధానం ఏంటి?

ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తుంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఇతరులు మన సంతోషం చూసి అసూయ పడటాన్ని కూడా దిష్టి అంటారు. దీని వల్ల ఈర్ష్య అసూయ భావాలతో లేదా ఆరాధనా భావం లేదా ప్రేమభావంతో భావోద్వేగాలకి గురైనప్పుడు మనకు ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పిల్లలకు దిష్టి తీయటం చాలా ఇళ్లల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందులోను పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. దిష్టి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.

అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దాని వల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని, కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారుని చిలకమర్తి తెలిపారు.

పిల్లలకు దిష్టి ఎలా తీయాలి?
కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెడతారు. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీస్తారు. ఆ ఉప్పుని రోడ్డు మీద నలుగురు తిరిగే చోట వేస్తే దిష్టి తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

ఐదేళ్ళు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కిందపడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకుని పిల్లలకు మూడు సార్లు తిప్పి పక్కన తీసేయాలి. కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసి పిల్లలని చీకటి పడిన తర్వాత, మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు.
రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. తల్లి దిష్టి.. అన్నీ తుడిచి పెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలని చిలకమర్తి తెలిపారు.

రేణుకా దేవి స్మరణ

ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్‌ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకా దేవిని స్మరించుకోవాలి. రేణుకా దేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు అని అంటారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

దిష్టి తగలకుండా ఉండాలంటే?

ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొడతారు. కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్లేటు చుట్టూ ఒక ముద్ద దిష్టి తీసి కాకికి పెడతారు. ఇంటికి వచ్చిన వారికి ఫలం, పానీయం ఇస్తారు. పితృ దేవతలను, భగవంతుడిని తలుచుకుని వారికోసం ఒక ముద్ద పక్కన పెడతారు.

నుదుట బొట్టు పెట్టుకోవడం, నల్ల మొలతాడు కట్టుకోవడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం, కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం, తినే ఆహార పదార్ధాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం కూడా దిష్టి తీసే విధానాలు.

కొంతమంది ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ మాత, గౌరి దేవి తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కూడా దిష్టి తీయడంలో ఒక భాగమే.

కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం, మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటి పనులు దిష్టి తగలకుండా చేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Health

సినిమా