ఏపీ రాజధాని అమరావతే.. అందులో చర్చే లేదు

విజయవాడ: వైకాపా సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని భాజపా శ్రేణులకు కర్తవ్యబోధ చేశారు. విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల భాజపా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

రక్షణ వ్యవహారాల్లో భారత్‌ సాధిస్తోన్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందని రాజ్‌నాథ్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోనూ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభంతో ఈ విషయం చెబుతున్నానన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్నా పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని పేర్కొన్నారు. ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో ప్రస్తావించగా.. రాష్ట్ర పార్టీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు. భాజపా సైతం అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *