FASTag KYC Deadline : మీ ఫాస్ట్‌ ట్యాగ్ కేవైసీ అప్‌డేట్ చేశారా? ఈ నెల 29 వరకు ఛాన్స్.. ఎలా అప్‌డేట్ చేయాలి? స్టేటస్ ఇలా తెలుసుకోండి!

FASTag KYC Deadline : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల వాహనాల కోసం ‘వన్ వెహికల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్‌’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఇకపై ఒకే ఫాస్ట్ ట్యాగ్‌ను అన్ని వాహనాలకు ఉపయోగించడానికి వీలుండదు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, దేశవ్యాప్తంగా టోల్ వసూలును క్రమబద్ధీకరించేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేయాలనుకుంటే కచ్చితంగా కేవైసీని పూర్తి చేసి ఉండాలి. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేసుకోవడానికి ఈ నెల (ఫిబ్రవరి) 29 వరకు గడువు విధించింది.
ఈ తేదీలోగా ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు తప్పనిసరిగా తమ కేవైసీని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువు తేదీలోగా ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయకపోతే ఆయా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు డియాక్టివేట్ అవుతాయని గమనించాలి. అందుకే, వినియోగదారలు తమ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. ఇంతకీ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? గడువు కన్నా ముందు ఎలా అప్‌డేట్ చేయాలనే అన్నింటికి పూర్తి వివరాలను మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి చూద్దాం..
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి? :

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని సులభంగా అప్‌డేట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి ప్రయత్నంచండి.
ఎన్‌హెచ్ఏఐ (NHAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయండి
https://fastag.ihmcl.com సైట్ విజిట్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
ఆ తర్వాత, డ్యాష్‌బోర్డ్ మెనూకి వెళ్లి.. My Profile ఆప్షన్ క్లిక్ చేయండి.
My Profile పేజీలో కేవైసీ ఆప్షన్ ఎంచుకోండి.
కేవైసీ (KYC) ఆప్షన్ క్లిక్ చేసి.. ఆపై ‘Customer Type’ ఎంచుకోండి.
మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
డిక్లరేషన్‌ తప్పనిసరి ఆప్షన్ టిక్ చేయండి.
మీ అన్ని డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత కేవైసీని ఆమోదించడానికి 7 రోజుల సమయం పడుతుంది.
బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయండి :

మీరు ఫాస్ట్ ట్యాగ్ వెబ్‌సైట్‌ లాగిన్ చేయండి.
నేరుగా మీ పార్టనర్ బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రయత్నించవచ్చు.
డెస్క్‌టాప్ లేదా మొబైల్‌లో https://www.netc.org.in/request-for-netc-fastag వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకును ఎంచుకుని, వెబ్‌సైట్‌లోని లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి సంబంధిత ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంక్‌కి లాగిన్ అవ్వండి.
ఆన్-స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటించండి.
మీ ఫాస్ట్‌ట్యాగ్ KYCని అప్‌డేట్ చేసుకోండి.
ఆఫ్‌లైన్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయండి :

Related News

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయడానికి బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
మీ పాన్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ దగ్గర ఉంచుకోండి.
మీ సమీపంలోని ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకును విజిట్ చేయండి.
ఫాస్ట్ ట్యాగ్ కోసం కేవైసీ ఫారమ్ తీసుకుని తీసుకోండి.
డాక్యుమెంట్లతో పాటుగా పూర్తి చేసిన కేవైసీ ఫారమ్‌ను సమర్పించండి.
బ్యాంక్ ఈ కేవైసీ ఫారమ్‌ను ధృవీకరించి ప్రాసెస్ చేస్తుంది.
మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్‌డేట్ తర్వాత మీకు ఇమెయిల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ వస్తుంది.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్‌డేట్.. అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. మీరు కేవైసీని నిర్ధారించడానికి ఈ కింది అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లలో (OVDs) ఒకదాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

పాస్‌పోర్ట్
డ్రైవింగ్ లైసెన్స్
ఓటరు ఐడీ కార్డు
పాన్ కార్డు (PAN)
ఆధార్ కార్డు
NREGA జాబ్ కార్డ్
మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) కాపీని తప్పనిసరిగా సమర్పించాలి.
ఆన్‌లైన్‌లో ఫాస్ట్ ట్యాగ్ KYC స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

మీ ఫాస్ట్‌ట్యాగ్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.
https://fastag.ihmcl.com వెబ్‌సైట్ విజిట్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
ఆ తర్వాత డ్యాష్‌బోర్డ్ మెనూకి వెళ్లండి.
మై ప్రొఫైల్ (My Profile) ఆప్షన్ క్లిక్ చేయండి.
మీ కైవసీ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు.
ఎన్‌హెచ్ఏఐ (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వెబ్‌సైట్‌లో మీ నంబర్ రిజిస్టర్ చేసుకోవడానికి ముందుగా (MyFASTag) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ చెక్ చేయడానికి పైవిధంగా ప్రయత్నించవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *