అదిరిపోయే స్కీమ్ ప్రకటించిన ప్రభుత్వం.. టెన్షన్ లేకుండా ఇలా అప్లై చేసుకోండి!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలతో నిత్యం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టింది.
తాజాగా మరో కీలక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు ఉపశమనం కలిగించేలా 50 మిలియన్ల ఎల్‌పీజీ కనెక్షన్‌లను పంపిణీ చేసేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఈ ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం 2 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా మొదటి గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. హోలీ సందర్భంగా రెండో సిలిండర్ అందజేస్తామని ప్రధాని మోడీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలిపారు. ఈ ఉచిత సిలిండర్లు పొందాలంటే ముందుగా మీరు గ్యాస్ ఏజెన్సీలకు మనీ చెల్లించాలి. తర్వాత ఆ మనీ ప్రభుత్వం మీ ఖాతాలో వేస్తుంది.
అయితే ఈ నెలలో హోలీ పండగ రానుంది. హోలీ సందర్భంగా ఈ నెలలో ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఇందుకోసం ప్రజలు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా అప్లై చేసుకోవాలో తెలియక కొందరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వారు ఈ పథకానికి అర్హులేవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలో క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం..

సీఎం ఉజ్వల యోజన పథకానికి అర్హతలు..

Related News

* అప్లికేషన్ చేసేవారి వయస్సు 18 సంవత్సరాలు పైన ఉండాలి.

* దరఖాస్తురాలు తప్పకుండా మహిళ అయి ఉండాలి.

* కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1 లక్ష ఉండాలి.

* పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు.

ధరఖాస్తుకు కావాల్సిన డ్యాకుమెంట్స్..Two gas cylinders under the Pradhan Mantri Ujjwala Yojana scheme* ఆధార్ కార్డు

* రేషన్ కార్డు

* పాస్‌పోర్ట్ సైజు ఫోటో

* మొబైల్ నెంబర్

* బ్యాంక్ అకౌంట్

ముందుగా అఫిషీయల్ www.pmuy.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి.. ఉజ్వల యోజన 2.0 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీ గ్యాస్ కంపెనీని ఎంపిక చేసుకోండి. తర్వాత మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా డిటైల్స్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేశాక అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ డౌన్ లోడ్ చేసుకోండి. ఇక మీ దరఖాస్తు కంప్లీట్ అయిపోయినట్లే.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *