Central Govt : మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… వడ్డీ లేకుండా 5 లక్షల రుణాలు….!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Central Govt : ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్య వైద్య మరియు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అర్హత కలిగి ఉన్న మహిళలందరికీ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా లఖపతి దీదీ యోజన అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.

Central Govt : లఖపతి దీదీ యోజన పథకం ..
మహిళలకు ఉచిత శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి అంశాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా స్వయం ఉపాధి , కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా మహిళలకు వడ్డీ లేకుండా 1 లక్ష నుండి 5 లక్షల వరకు రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది.

Central Govt : ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖపతి దీదీ యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం గ్రామాలలో నివసించే మహిళలు వారి ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలను స్థాపించడానికి ఆర్థిక సాయం కల్పించడం. ఇక ఈ పథకం ద్వారా మహిళలు ప్లంబింగ్ ఎల్ఈడి బల్బులు తయారీ , డ్రోన్ ఆపరేషన్ మరియు టైలరింగ్ వంటి రంగాలలో ఉచితంగా శిక్షణ పొందవచ్చు.

Related News

Central Govt : అవసరమైన పత్రాలు…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మహిళలు ప్రయోజనాలు పొందాలంటే కింది పత్రాలను కచ్చితంగా కలిగి ఉండాలి..

ఆధార్ కార్డు

ఆదాయ ధ్రువీకరణ పత్రం

నివాస ధ్రువీకరణ పత్రం

బ్యాంకు ఖాతా వివరాలు

మొబైల్ నెంబర్

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.

దరఖాస్తు ప్రక్రియ…

ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలు ప్రయోజనాలు పొందాలంటే ముందుగా మీ సమీపంలో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *