Sunday, November 17, 2024

ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10 లక్షల వరకూ లోన్.. ఎవరు అర్హులంటే?

భారత ప్రభుత్వం యువతలో పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద భారీ మెుత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తోంది. వ్యవసాయేతర, కార్పొరేట్, సుక్ష్మ, చిన్న తరహా సంస్థలకు సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన(PMMY) పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎలాంటి గ్యారెంటీ లేకుండా.. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకూ లోన్లు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కమర్షియల్, RRBలు, MFI, NBFC లాంటి పలు ఆర్థిక సంస్థల ద్వారా అర్హులైన వ్యక్తులకు రూ. 10 లక్షల వరకూ లోన్లు ఇస్తున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ముద్ర 3 ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. శిశు, కిషోర్, తరుణ్ లాంటి మూడు రకాల లోన్లు ఇస్తోంది. మెుదటగా శిశు విభాగంలో రూ. 50 వేలు, కిషోర్ లోన్ కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు అందిస్తారు. ఇక చివరిగా తరుణ్ లోన్ కింద రూ. 5లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తారు.

భారత ప్రభుత్వం ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడానికి శిశు కేటగిరీ యూనిట్ లపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ పథకంలో ముద్ర లోన్లు రెండు రకాల స్కీమ్స్ ద్వారా అందిస్తారు. అందులో ఒకటి మైక్రో క్రెడిట్ స్కీమ్. ఇందులో ఒక లక్ష వరకు అందిస్తారు. రెండో దాంట్లో రీ ఫైనాన్స్ ద్వారా లోన్లు మంజూరు చేస్తారు. ఇవి వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.

మ్యానుఫాక్చరింగ్, పౌల్ట్రీ, డైరీ, తేనేటీగల పెంపకం, వ్యాపారం, సేవలు, వ్యవసాయం లాంటి రంగాలలో టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్స్ అవసరాల కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజనలో రుణాలు అందిస్తుంది. అయితే బయటి వడ్డీ రేట్లకంటే తక్కువగానే ఇందులో వడ్డీ రేట్లు ఉంటాయని తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే ఈ రుణాల కోసం అప్లై చేసేవారు ఎలాంటి ఛార్జీలు కానీ.. గ్యారెంటీ పత్రాలు కానీ సమర్పించాల్సిన అవసరం లేదు.

అర్హతలు:
దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. బిజినెస్ ప్లాన్ సిద్ధంగా ఉన్న ఏ వ్యక్తి అయినా లోన్ పొందొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్‌, ట్రేడింగ్‌, సర్వీస్‌ సెక్టార్స్‌లో ఇన్‌కమ్‌-జనరేటింగ్‌ యాక్టివిటీలకు, త్రీ లోన్‌ ప్రొడక్టులలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు లోన్‌లు మంజూరు ఇస్తారు. అయితే దరఖాస్తుదారుడు గతంలో డిఫాల్ట్ హిస్టరీని కలిగి ఉండకూడదు. కనీసం 3 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉండాలి. 24 నుంచి 70 ఏళ్ల వయస్సుగలవారై ఉండాలి.

దరఖాస్తు విధానం:
పైన తెలిపిన అర్హతలు ఉన్న వారు అధికారిక వెబ్ సైట్ www.udyamimitra.in ఓపెన్ చేయాలి. అందులో అప్లై నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి.. అక్కడ వచ్చిన వాటిల్లో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇక కొత్తగా రిజిస్టేషన్ చేస్తుంటే.. దరఖాస్తుదారుని పేరు, ఈమెయిల్ ఐడీ, మెుబైల్ నంబర్ యాడ్ చేసి.. ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న సంబంధిత బ్యాంకులను సంప్రదించవచ్చు.

AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP POLYCET 2024: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్-2024 నోటిఫికేషన్ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఫిబ్రవరి 17న విడుల చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. పదోతరగతి చదువుతున్న, ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులు ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు…

* ఏపీ పాలిసెట్ – 2024

బ్రాంచ్లు:సివిల్ ఇంజినీరింగ్(CE), ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్(ARC), మెకానికల్ ఇంజినీరింగ్(MEC/MRA), ఆటోమొబైల్ ఇంజినీరింగ్(AUT), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(EEE), ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ (EVT) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(ECE), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్-EII), ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(IOT), అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్(AEI), కంప్యూటర్ ఇంజినీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, 3-డి ఏనిమేషన్ అండ్ గ్రాఫిక్స్ (AMG), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI), కంప్యూటర్ సైన్స అండ్ ఇంజినీరింగ్(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-CAI), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా(CCB), కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ (CCN), మైనింగ్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (CCP), అప్పారెల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ (AFT), మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత:పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, ఈ ఏడాది మార్చి/ఏప్రిల్లో నిర్వహించే పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్నవారు పాలిసెట్ దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు ఫీజు:ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా .

ప్రవేశాలు కల్పించే సంస్థలు: పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం:పాలిసెట్ పరీక్షను పెన్ అండ్ పేపర్(ఆఫ్లైన్) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్–50, ఫిజిక్స్–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానంలో అమల్లో లేదు.

ముఖ్యమైన తేదీలు…

➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.04.2024.

➥ పాలిసెట్ పరీక్షతేది: 27.04.2024. (11:00 am to 1:00 pm)

➥ ఫలితాల వెల్లడి: 13.05.2024

Notification

Register with Mobile Number
(for other than SSC and TS Candidates)

Register with SSC Hall Ticket Number
(for AP SSC Candidates)

POLYCET previous years (2014-2022) papers

Website

AAI Recruitment 2024: ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 ఉద్యోగాల భర్తీ

దేశవ్యాప్తంగా ఉన్న ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన వివిధ శాఖలలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమవుతుంది.
అభ్యర్థులు మే 1 వ తేదీ వరకు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ www.aai.aero ద్వారా అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హతలు..

ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే, వారు ఆ సబ్జెక్ట్ లో గేట్-2024కు హాజరై, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్/ సివిల్): 90

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్): 106

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13

ఏఏఐ రిక్రూట్మెంట్ 2024 వయోపరిమితి

ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఏఏఏలో సంవత్సరం అప్రెంటిస్ షిప్ పూర్తి చేసుకున్నవారికి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించాలి

బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాలేంటి.. ఎందుకు వాడతారో తెలుసా…

బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ వంటగదిలో అవసరమైన పదార్థాలు. భారతీయులు బజ్జీలు, కేకుల వంటి వంటల్లో బేకింగ్ సోడా (Baking soda)ను వాడుతుంటారు.
అందం, ఆరోగ్యం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీనిని తినేసోడా, వంటసోడా అని కూడా పిలుస్తారు. అయితే బేకింగ్ పౌడర్ (Baking powder) కూడా అచ్చం దీని లాగానే కనిపిస్తుంది. చాలామంది ఈ రెండింటి మధ్య తేడా తెలియక వంటల్లో తప్పుగా వాడేస్తుంటారు.

చూసేందుకు ఒకేలా కనిపించినా ఇవి రెండూ వేర్వేరు పదార్థాలు. వీటి రుచులు కూడా వేరుగా ఉంటాయి. రుచి చూస్తే, ఇవి రెండు విభిన్నమైన పదార్థాలు అనే సంగతి తెలుస్తుంది. అవి జరిపే రసాయనిక చర్యలు కూడా విభిన్నంగా ఉంటాయి. వీటి మధ్య తేడాలేంటి; వీటిని ఎలాంటి వంటల్లో, ఎందుకు వాడతారో తెలుసుకుందాం.

* బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను సైంటిఫిక్‌గా “సోడియం బైకార్బోనేట్” అంటారు. ఇది స్వచ్ఛమైన ఆల్కలీన్ పదార్థం. ఇది ఆమ్ల పదార్థాలను తాకినప్పుడు, ఒక కెమికల్ రియాక్షన్‌కి గురవుతుంది. ఈ రియాక్షన్ కారణంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు రిలీజ్ అవుతుంది. ఈ వాయువు పిండి పులిసి ఉబ్బడానికి కారణమయ్యే బుడగలను ఏర్పరుస్తుంది. అందుకే బేకింగ్ సోడాను కేకులు, కుకీలు, పాన్‌కేక్‌లు, ఇతర బేకింగ్ డిష్‌లలో పులియబెట్టే ఏజెంట్‌ (Leavening agent)గా ఉపయోగిస్తారు.

అయితే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదల కావాలంటే బేకింగ్ సోడాకు రియాక్ట్ అయ్యే ఓ యాసిడిక్ సబ్‌స్టెన్స్ ఉండటం తప్పనిసరి. ఉదాహరణకు పిండిలోని సహజ ఆమ్లాలైన పెరుగు, నిమ్మరసం వంటి ఆమ్లాలతో బేకింగ్ సోడా రియాక్ట్ అయి కార్బన్ డయాక్సైడ్‌ను రిలీజ్ చేస్తుంది. బేకింగ్ సోడాను వంటల్లో మాత్రమే కాకుండా క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని ఆల్కలీన్ లక్షణాలు వాసనలను పోగొడతాయి,ఉపరితలాలను సమర్థవంతంగా క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

* బేకింగ్ పౌడర్

బేకింగ్ పౌడర్ అనేది ఒక యాసిడ్. సాధారణంగా ఇందులో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. ఈ పౌడర్ సోడియం బైకార్బోనేట్, యాసిడ్, డ్రైయింగ్ ఏజెంట్ (మొక్కజొన్న పిండి వంటివి) కలయిక వల్ల వచ్చే మిశ్రమం. ఈ కలయిక వల్ల బేకింగ్ పౌడర్‌లో పులియబెట్టే ప్రక్రియకు అవసరమైన అన్ని పదార్థాలు ఉంటాయి.

ఇందులో ఆల్రెడీ ఒక ఆమ్లం ఉంటుంది కాబట్టి అది పని చేయడానికి ప్రత్యేకంగా ఆమ్ల పదార్థాలు అవసరం లేదు. ద్రవంతో కలిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేయడం ప్రారంభిస్తుంది, వేడిచేసినప్పుడు మరింత ప్రతిస్పందిస్తుంది. అందుకే కొన్ని బేకింగ్ పౌడర్లను “డబుల్-యాక్టింగ్” అని లేబుల్ చేస్తారు.
* ఎప్పుడు ఉపయోగించాలి?

బేకింగ్ సోడాను నిమ్మరసం, వెనిగర్, పెరుగు, మజ్జిగ లేదా కోకో పౌడర్ వంటి ఆమ్లాలు ఉండే వంటకాల్లో ఉపయోగించాలి. ఈ పదార్థాలలోని యాసిడ్ బేకింగ్ సోడాను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల పిండి బాగా పులిసి ఉబ్బుతుంది. సహజ ఆమ్లాలు లేని వంటకాల్లో బేకింగ్ పౌడర్‌ను మిక్స్ చేయవచ్చు. మెత్తటి, తేలికపాటి కన్సిస్టెన్సీ కోరుకునే వంటకాలకు ఇది సరైనది.

 

Heart Attack: ఎవరైనా గుండెపోటుకు గురైతే వెంటనే ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకోండి

గుండెపోటు ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. చిన్నపాటి అవగాహనతో మెదిలితే ఈ ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు.
ఐదేళ్ల చిన్నారుల నుంచి పాతికేళ్ల యువకుల వరకు అత్యంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు వస్తే ఏం చేయాలో, ఏం చేయకూడదు అనే విషయాలపై అవగాహన ఉంటే సులువుగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మీ పరిసరాల్లో ఎవరైనా గుండెపోటుకు గురైతే చూస్తూ ఊరుకోకూడదు. వెంటనే ఏం చేస్తే వారి ప్రాణం నిలబడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, ఒత్తిడి, సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తినే వారి రేటు పెరిగింది. కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు చాలా సాధారణం అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్‌లో చాలా కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తపోటు, చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే, గుండెపోటు లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు. గుండెపోటు ఛాతీ నొప్పి (నొప్పి), ఛాతీ బిగుతు (అసౌకర్యం), ఛాతీ కుడి లేదా ఎడమ వైపు నొప్పి లేదా రెండు వైపులా నొప్పి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఛాతీ నొప్పి ఎడమ చేయి నుంచి క్రింది నుంచి ప్రారంభమవుతుంది. క్రమంగా దవడ ద్వారా పైకి వ్యాపిస్తుంది. ఈ లక్షణాలతో పాటు గుండెపోటు వచ్చే సమయంలో అధిక చెమట వస్తుంది. రోగిలో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే ఆస్పిరిన్ 300 mg (ఆస్పిరిన్ 300 mg) నీటిలో కలిపి ఇవ్వాలి. నాలుక కింద సార్బిటాల్ ట్యాబ్లెట్‌ ఉంచాలి. వెంటనే రోగిని సమీపంలోని ఏదైనా ఆసుపత్రి లేదా నర్సింగ్ హోమ్‌లో చేర్పించాలి.

సీపీఆర్‌ ఎలా చేయాలి..

గుండెపోటుకు గురైన వారికి తాత్కాలికంగా CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) ఇవ్వవచ్చు. సమీపంలో ఎవరైనా గుండెపోటుకు గురైతే తొలుత వారిని ఫ్లాట్‌గా పడుకోబెట్టాలి. రోగిని మూసి ఉన్న గదిలో ఉంచకూడదు. గాలి బాగా వ్యాపించేలా ఇంటి కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి. ఆ తర్వాత రెండు చేతులతో ఛాతీపై భాగంలో ప్రెస్‌ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీ చేతులు బెండ్​ కాకుండా స్ట్రైట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఛాతీని కనీసం 5 సెంటీమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ఒక నిమిషం చేశాక పల్స్ చెక్ చేయాలి. పల్స్ దొరక్కపోతే పేషెంట్ ముక్కు మూసి, అతని నోటిలోకి నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. తరువాత మళ్లీ సీపీఆర్ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేస్తుండాలి. ఇలా చేస్తే పేషెంట్ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా CPR చేయాలి. సీపీఆర్ ఎలా ఇవ్వాలో తెలిస్తే, రోగి జీవితాన్ని సులభంగా రక్షించవచ్చు.

Mobile Apps: మీ మొబైల్‌లో ఈ 18 యాప్స్‌ ఉన్నాయా? యమ డేంజర్‌..వెంటనే డిలీట్‌ చేసుకోండి!

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? Google Play Store నుండి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? జాగ్రత్తగా ఉండండి. గేమ్‌లు ఆడటం నుండి ఫోటోలు తీయడం వరకు ప్రతిదానికీ రకరకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము.
మీరు మీ ఫోన్‌లో చాలా యాప్‌లు ఉండవచ్చు. వాటిని మీరు అంతగా ఉపయోగించలేకున్నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. కొన్ని యాప్‌ల కారణంగా ప్రమాదం పొంచి ఉంటుందని గూగుల్‌ చెబుతోంది. కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తుంటుంది.

Google Play Store వినియోగదారులను రక్షించడానికి అనేక యాప్‌లను కూడా తొలగిస్తుంది. వినియోగదారులు నివేదించిన నకిలీ యాప్‌లు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి తొలగించుకోవడం మంచిది. తాజాగా 18 యాప్‌లు తొలగించింది గూగుల్‌. అలాంటి యాప్స్‌ మీ మొబైల్‌లో ఉంటే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని గూగుల్‌ సూచిస్తోంది. ఈ అన్ని మొబైల్ యాప్‌లలో స్పైలోన్ మాల్వేర్ గుర్తించింది గూగుల్‌. ఈ యాప్స్‌ మీ ఫోన్‌లో ఉంటే వ్యక్తిగత వివరాలతో పాటు డేటాను దొంగిలిస్తుంటాయి.

SpyLoan ఎలా పని చేస్తుంది?

SpyLoan అనేది ఈ 18 యాప్‌లలో కనిపించే ఒక రకమైన మాల్వేర్. ఇది ఏదైనా వినియోగదారు ఫోన్ నుండి డేటాను దొంగిలించగలదు. ఫోన్‌లో ఉన్న ఏదైనా సమాచారం హ్యాకర్లకు అందుబాటులో ఉంటుంది. మీ సందేశాలను కూడా చదవగలరు. ఈ మాల్వేర్ వినియోగదారులను బ్లాక్ మెయిల్ చేయగలదు. భారతదేశం, అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలకు చెందిన వినియోగదారులు స్పైలోన్ బాధితులు. కాబట్టి Google ఇప్పటికే తీసివేసిన యాప్‌లను ఇప్పుడు మీ ఫోన్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

ఏయే యాప్స్‌ తొలగించారంటే..

AA Credit
Love Cash
GuayabaCash
EasyCredit
Dinner
CrediBus
FlashLoan
LoansCredit
Credit Loans-YumiCash
Go Credit
Instant Loan
large wallet
Fast Credit
Finupp Lending
4S Cash
TrueNaira
EasyCash

రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ.. గుడ్‌న్యూస్ చెప్పిన కోహ్లీ.. ఏం పేరు పెట్టారో తెలుసా?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
విరుష్క దంపతులు రెండవ సంతానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాబుకు ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఇప్పటికే ‘వామిక’ మొదటి సంతానం ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతోనే విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

ఇక, విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టడంతో రన్ మెషిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చోటా విరాట్ ఆగయా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండవసారి తల్లిదండ్రులు కావడంతో సోషల్ మీడియా వేదికగా విరుష్క దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Paracetamol: వామ్మో.. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండే గుభేలే..

తలనొప్పి అయినా.. శరీరంలోని ఏ ప్రాంతంలో నొప్పి అయినా.. డాక్టర్లు వెంటనే పారసెట్‌మాల్ ట్యాబ్లెట్‌ను రిఫర్ చేస్తారు.. అందుకే.. తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి, నొప్పిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పారాసెటమాల్ ట్యాబ్లెట్ నమ్మదగిన మందులలో ఒకటిగా పరిగణిస్తారు.
ఇది నొప్పి నివారిణితోపాటు.. యాంటిపైరేటిక్ (ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది). ఇది ఇతర మందులతో పాటు తీసుకోవచ్చు. అయితే, దశాబ్దాల పాటు నిరూపితమైన సమర్థతతో, ఈ టాబ్లెట్‌లు అవాంతరాలు లేకుండా వేగంగా పని చేసి తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే పారాసెటమాల్‌ను రెగ్యులర్‌గా తీసుకునే వ్యక్తులకు నిపుణులు ప్రమాదకరమైన ఆరోగ్య హెచ్చరికను జారీ చేశారు. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లోని బృందం నిర్వహించిన కొత్త అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఎలుకలపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఎలుకలపై ఈ ఔషధం ప్రయోగించగా.. ఇది తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలను గమనించి, అది ప్రత్యక్ష నష్టాన్ని కలిగిస్తుందని అధ్యయనం నిర్ధారించింది. ఈ ఆవిష్కరణ ఔషధం వల్ల కలిగే హానిని ఎదుర్కోవడానికి చికిత్సలపై పరిశోధనను తెలియజేయగలదని బృందం తెలిపింది.
ఔషధం అధిక మోతాదు తీసుకునే రోగులపై ఈ ప్రభావాలు కనిపిస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. దీర్ఘకాలిక నొప్పి ఉన్న రోగులకు రోజుకు నాలుగు గ్రాముల పారాసెటమాల్ సాధారణ మోతాదు అని పేర్కొన్నారు. అయితే, దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే దుష్ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

“ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు మానవ, ఎలుక కణజాలంలో కాలేయ కణాలపై పారాసెటమాల్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. కొన్ని సందర్భాల్లో పారాసెటమాల్ అవయవంలోని ప్రక్కనే ఉన్న కణాల మధ్య ముఖ్యమైన నిర్మాణ సంబంధాలకు హాని కలిగించడం ద్వారా కాలేయాన్ని దెబ్బతీస్తుందని పరీక్షలు చూపించాయి” అని అధ్యయనం తెలిపింది.

“ఈ సెల్ వాల్ కనెక్షన్‌లు – టైట్ జంక్షన్‌లు అని పిలుస్తారు – అంతరాయం ఏర్పడినప్పుడు, కాలేయ కణజాల నిర్మాణం దెబ్బతింటుంది. కణాలు సరిగా పనిచేయలేవు.. అవి చనిపోవచ్చు” అని అధ్యయన నిపుణులు తెలిపారు.
హెపటైటిస్, సిర్రోసిస్, క్యాన్సర్ వంటి పరిస్థితులలో కనిపించే విధంగా.. పారాసెటమాల్ టాక్సిసిటీని కాలేయం దెబ్బతినడానికి పనిచేస్తుందని ఒక అధ్యయనం చెప్పడం ఇదే మొదటిసారి.

ఎడిన్‌బర్గ్, ఓస్లో విశ్వవిద్యాలయాలు, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సర్వీస్‌ల పరిశోధకులు పాల్గొన్న ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Lemon Juice: రోజూ గ్లాసుడు నిమ్మరసం తాగడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పులు ఇవే, ఇది చదివితే రోజూ నిమ్మరసం తాగేస్తారు

Lemon Juice: ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం ఆరోగ్యానికే కాదు చర్మానికీ ఇది మెరుపుని ఇస్తుంది. నిజం చెప్పాలంటే ప్రతి రోజు నిమ్మరసం తాగితే చర్మంలో అద్భుతమైన మార్పులు చూడొచ్చు.
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఒక నెల రోజులు ప్రతిరోజూ నిమ్మరసం తాగి చూడండి. ఆ తర్వాత మీ చర్మం లో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు.

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం మెరుపుకు విటమిన్ సి అవసరం. ఇది చర్మం తాజాగా ఉండేలా కాపాడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ నిమ్మరసం తాగితే కొల్లాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల ముఖం మీదున్న చర్మం పై గీతలు, ముడతలు రాకుండా ఉంటాయి.

చర్మం ప్రకాశవంతంగా ఉంటేనే అందంగా కనిపిస్తుంది. నిమ్మరసంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కావాలనుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. నిమ్మకాయ నీరు ప్రతిరోజు తాగితే హైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరం తేమతో నిండి ఉంటుంది. కాబట్టి చర్మం తేమను నిలుపుకుంటుంది. దీనివల్ల మీ చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది .

చర్మం మెరుపుకు

నిమ్మరసం తాగడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్‌కు గురవుతుంది. అంటే శరీరంలోని వ్యర్ధాలను, విషాన్ని బయటికి పంపిస్తుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మచ్చలు లేకుండా కాంతివంతంగా మారుతుంది. కాబట్టి మీ మేని ఛాయ మెరిసిపించుకోవడానికి నిమ్మకాయ రసం ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకోవాలి.

నిమ్మరసంలో ఆమ్ల స్వభావం అధికంగా ఉంటుంది. ఇది శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. నిమ్మకాయ నీటిని ప్రతిరోజు తాగే వారిలో PH స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. PH స్థాయిలు బ్యాలెన్స్ గా ఉండడం వల్ల చర్మం మెరవడం ఖాయం. PH బ్యాలెన్స్ సమతుల్యంగా ఉంటే మొటిమలు ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు మరింత అందంగా ఉంటారు.

నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ డామేజ్ ను ఎదుర్కోవడంలో సహాయ పడతాయి. దీంట్లో లక్షణాలు ఎక్కువ. కాబట్టి చర్మంపై గీతలు, ముడతలు, పొడిబారడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉంటుంది.

ప్రతిరోజు నిమ్మకాయ రసాన్ని తాగే వారి చర్మం సహజంగానే మెరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ వంటివి తగ్గుతాయి.

మొటిమలు రావు
మొటిమల చికిత్సకు నిమ్మకాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమల బారిన పడినవారు ప్రతిరోజు నిమ్మకాయ రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి. ఒక నెల రోజులు పాటు నిమ్మకాయ రసాన్ని తాగి ఫలితాన్ని మీరే చూడండి. మీ చర్మం లో మెరుపును మీరే గుర్తిస్తారు. నిమ్మరసం, నీళ్లు, కాస్త తేనే వేసుకుని తాగండి. చక్కెర వేసుకుంటే నిమ్మరసం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అందవు. ఎందుకంటే చక్కెర వల్ల చర్మానికి హాని కలుగుతుంది.

CBSE Board Exams: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచే అమలు

Central Board Of Secondary Education: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఇందులో భాగంగానే ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

అయితే, పరీక్షలు సెమిస్టర్ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్పై రెండు సార్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. ఇక, కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం.. 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్లను కచ్చితంగా అభ్యసించాలని.. వీటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని నిర్ణయించారు. అయితే పరీక్షలను రెండుసార్లు రాయాలా లేదా ఎప్పటిలా ఒకేసారి రాయాలా అనేది విద్యార్ధుల ఇష్టమని కేంద్రం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఐచ్ఛికం. విద్యార్థులు రెండు సార్లు తప్పనిసరిగా రాయాలన్న నిర్భంధమేమీ లేదని తెలిపింది. ఒకవేళ రెండు సార్లు పరీక్షలు రాస్తే.. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. ఆ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.
ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్లో పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది (2025-26 విద్యాసంవత్సరం) నుంచి 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడికి దూరం చేసిన నాణ్యమైన విద్యను అందించడమే మా సర్కారు లక్ష్యం. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుందని వెల్లడించారు.

ఒత్తిడి లేని విద్యతోనే ఉద్యోగం..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుండటంతో.. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటూ రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.

అన్ని ప్రాంతీయ భాషల్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచండి, విద్యాసంస్థలకు కేంద్రం ఆదేశం
దేశవ్యాప్తంగా విద్యార్థులకు మాతృ భాషలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తర్జుమా చేపట్టాలని నియంత్రణ సంస్థలైన ఎన్సీఈఆర్టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (ఎన్ఐఓఎస్)తోపాటు కేంద్రీయ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం-2020 సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీటెక్ కోర్సులనూ ప్రాంతీయ భాషల్లో బోధనకు ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా అనుమతిస్తోంది. మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే మొదలైంది.

AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే..

AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే..

టీడీపీ-జనసేన కూటమికి విజయాన్ని కట్టబెట్టేందుకు సంసిద్ధమయ్యారా?. అనువజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు చేతికి మరోసారి రాష్ట్ర అధికార పగ్గాలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారా? అంటే ఔననే సమాధానమిస్తోంది మరో తాజా సర్వే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే అధికారమంటూ ఇప్పటికే వెలువడిన పలు సర్వేల పరంపరలో మరో సంచలన అంచనా విడుదలైంది. ‘వై నాట్ 175’ అని ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జగన్ అండ్ కో బిత్తరపోయేలా.. ఏపీ ఓటర్ల నాడికి అద్దం పట్టేలా ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ (Pioneer Poll Strategies Private Limited) సంచలన సర్వే ఫలితాలు వెలువరించింది.

ఎవరికి ఎన్ని సీట్లంటే..

ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా టీడీపీ+జనసేన కూటమి 104 సీట్లు గెలుచుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది. అధికార వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పదని, వచ్చే ఎన్నికల్లో 47 నియోజకవర్గాల్లో మాత్రమే గెలవనుందని లెక్కగట్టింది. అయితే 24 నియోజకవర్గాల్లో నువ్వు-నేనా అన్నట్టుగా టీడీపీ+జనసేన, అధికార వైసీపీ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడవనుందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 25 స్థానాలు ఉండగా టీడీపీ+జనసేన అత్యధికంగా 18 సీట్లు, వైసీపీ -7 సీట్లు దక్కించుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది.

రాయలసీమలో పెరిగిన కాంగ్రెస్ ఓట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ+జనసేన కూటమికి అత్యధికంగా 52 శాతం ఓటు షేర్‌ని దక్కించుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఓటు షేర్ 42 శాతానికి పడిపోనుందని పేర్కొంది. శ్రీకాకుళం మొదల్కొని నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని సర్వే తెలిపింది. అయితే రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా మిగతా మూడు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉందని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ ఓటు షేర్ వచ్చే ఎన్నికల్లో అనూహ్యంగా పెరగనుందని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని ‘పయనీర్ పోల్’ సర్వే పేర్కొంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2.4 శాతం ఓట్లు రానున్నాయని సర్వే లెక్కగట్టింది. ఇక కేంద్రంలోని బీజేపీకి 1.5 శాతం ఓట్లు, ఇతరులకు 2.1 శాతం ఓట్లు పడనున్నాయని వివరించింది.

175 నియోజకవర్గాల్లో సర్వే

ఫిబ్రవరి 1,2024 నుంచి ఫిబ్రవరి 14, 2024 మధ్య ఈ సర్వేను నిర్వహించినట్టు ‘పయనీర్ పోల్’ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 90 వేల మంది అభిప్రాయాలను తీసుకున్నామని వివరించింది. సర్వేలో పాల్గొన్నవారిలో పురుషులు 52 శాతం, స్త్రీలు 48 శాతంగా ఉన్నారని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ+జనసేన(కూటమి) , కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఆప్, బీఎస్పీ, బీసీఐ, జై భారత్ పార్టీ వంటి పార్టీలను కూడా సర్వేలో పరిగణనలోకి తీసుకున్నామని ‘పయనీర్ పోల్’ సర్వే వివరించింది. ఓట్ల శాతం, సీట్ల అంచనాలు రెండింటిలోనూ టీడీపీ-జనసేన కూటమి ముందంజలో ఉందని, అధికార వైఎస్సార్‌సీపీ ఓట్ షేర్, సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గనుందని, అయితే కూటమికి ప్రధాన పోటీదారుగా నిలవనుందని విశ్లేషించింది.

జిల్లాల వారీగా చూస్తే…

Loksabha Elections: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ పై ఈసీ కసరత్తు.. తేదీల ఖరారు ఎప్పుడంటే..?

లోక్ సభ ఎన్నికలు 2024 త్వరలోనే జరుగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోసం వరుస పర్యటనలు, ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 9 తర్వాత ఏ క్షణమైనా 2024 లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో 18వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఇప్పటికే ఈసీఐ అధికారుల బృందం వివిధ రాష్ట్రాల్లో వరుసగా పర్యటిస్తోంది.

జమ్మూకశ్మీర్ భద్రతా పరిస్థితి, బలగాల లభ్యత గురించి తెలుసుకోవడానికి ఈసీ అధికారులు మార్చి 8-9 మధ్య ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చా లేదా అని తెలుసుకోవడానికి ఈ నెల 12,13 తేదీల్లో ఈసీ అధికారులు జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు. అయితే చివరిసారిగా 2019 పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చి 10న ప్రకటించగా, ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా, మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.
అయితే పార్లమెంట్ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. ఇటీవలనే ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ నేతలు దిశానిర్దేశం చేస్తూ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఏన్డీఏ 400 సీట్లు సాధించి మూడోసారి అధికారంలోకి రావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ అయోధ్య రామమందిరం ప్రత్యేక ఎజెండా ఎత్తుకోబోతుండగా, కాంగ్రెస్ మాత్రం ఛలో ఢిల్లీ, మణిపూర్ అల్లర్లు, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ జనాల్లో వెళ్లే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు ఇండియా కూటమికి వరుసగా షాకులు తగులుతుండటం ఆ నేతలకు మింగుడు పడటం లేదు.

ఇక ప్రపంచ నాయకులలో ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతమైన నాయకుడు అని , ఇతరులకు భిన్నంగా నిలిచారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలకు లక్నోలో జరిగిన భూమిపూజ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో యావత్ భారతదేశం పురోగతి సాధిస్తోందన్నారు.

Paytm FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 తర్వాత ఏ సర్వీసు పనిచేస్తుంది? ఏది పనిచేయదంటే? అన్ని ప్రశ్నలకు సమాధానాలివే!

Paytm Services FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మీరు పేటీఎం ద్వారా లావాదేవీలను చేస్తున్నారా? పేటీఎం వ్యాలెట్ దగ్గర నుంచి ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ లావాదేవీలకు సంబంధించి అనేక మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిషేధం తర్వాత పేటీఎంతో లింక్ అయిన యూపీఐ సర్వీసులు పనిచేస్తాయా లేదా? అనే గందరగోళం ఇప్పటికీ చాలామంది వినియోగదారుల్లో ఉంది.

దీనిపై పేటీఎం తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ఒక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత వ్యాలెట్, ఫాస్ట్ ట్యాగ్ మరిన్నింటికి సంబంధించి ఏది పని చేస్తుంది? ఏది పని చేయదు? అనే ప్రశ్నలకు సమాధానాలను (FAQs) పూర్తి వివరాలను వెల్లడించింది.

మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లుల చెల్లింపునకు పేటీఎం వాడొచ్చా? :
అన్ని బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌ల కోసం పేటీఎం యాప్‌ని ఉపయోగించడం కొనసాగించవచ్చని కంపెనీ తాజా (FAQ) పేజీని ధృవీకరించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం కారణంగా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇతర అధీకృత బ్యాంకులకు తమ పేటీఎం లింక్ చేసిన వారిపై ప్రభావం చూపదు. పేటీఎంని ఉపయోగించి రీఛార్జ్ చేయొచ్చు. ఆర్బీఐ నిషేధం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్లపై మాత్రమే ప్రభావం ఉంటుంది.

పేటీఎం క్యూఆర్ కోడ్, పేటీఎం సౌండ్‌బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ పనిచేస్తాయా? :
కంపెనీ ప్రకారం.. మీ పేటీఎం, క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఈ తరహా విధానం కొనసాగుతుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాలెట్ వాడొచ్చా? :
పేటీఎం వ్యాలెట్లలో బ్యాలెన్స్ ఉన్నంతవరకు ఉపయోగించవచ్చు. విత్‌డ్రా చేయడం లేదా మరో వ్యాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీరు ఎలాంటి డిపాజిట్లు చేయలేరని గమనించాలి. అయినప్పటికీ, అన్ని రీఫండ్‌లు, క్యాష్‌బ్యాక్ ఇప్పటికీ మీ వ్యాలెట్లలో క్రెడిట్ అవుతాయి.

పేటీఎం ఫాస్ట్ ట్యాగ్/ఎన్‌సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించగలరా? :
ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన (FASTag / NCMC) కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత వీటిని రీఛార్జ్ చేయలేరు. అకౌంట్లలో డబ్బును క్రెడిట్ చేయలేరు. మీరు ఆ మొత్తాన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ ఫాస్ట్ ట్యాగ్/ ఎన్‌సీఎంసీ కార్డ్‌ని కూడా క్లోజ్ చేయొచ్చు. ఆపై రీఫండ్ కోసం బ్యాంక్‌కు రిక్వెస్ట్ పంపవచ్చు.

పేటీఎంలో నగదు సురక్షితమేనా? :
మార్చి 15, 2024 తర్వాత పేమెంట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్, వ్యాలెట్ కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా లేదా క్రెడిట్ లావాదేవీలను అనుమతించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాన్ని జారీ చేసిందని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, గడువు తర్వాత ప్రస్తుత బ్యాలెన్స్ నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడంపై ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేసింది. మీ అకౌంట్ లేదా వ్యాలెట్‌లోని ప్రస్తుత బ్యాలెన్స్‌లపై ప్రభావం ఉండదు. మీ నగదు సురక్షితంగా ఉంటుందని తెలిపింది.

Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?

How To Update Aadhaar: ఇప్పుడు ప్రతి పథకానికి, ప్రతి ప్రభుత్వ సేవకు ఆధార్‌ తప్పనిసరిగా మారింది. ఈ సమయంలో ఆధార్‌లో వివరాలు తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంది.
అందులో మార్పులు చేర్పులు చేసుకోకుంటే పథకాలు అందలేని పరిస్థితి. ఆధార్‌ అప్‌డేట్‌ లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా అప్‌డేట్‌ కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగు రోజుల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని వెల్లడించింది.
ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు తీసుకుని పదేళ్లు ముగిసిన వారి విషయంలో ఆధార్‌ ధ్రువీకరణ అధికారులు పలు మార్పులు చేశారు. కచ్చితంగా ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అలాంటి వారు ఆంధ్రప్రదేశ్‌లో 1.49 మంది ఉన్నారు. వారంతా ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోలేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు ఈ కేంద్రాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
ఎక్కడా?
రాష్ట్రంలో విప్లవాత్మకంగా అమలుచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్‌ అప్‌డేట్‌ సేవలను అందిస్తున్నారు. నాలుగు రోజుల పాటు స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకునేందుకు వెళ్లవచ్చు. అయితే ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఆధార్‌ అప్‌డేట్‌తోపాటు అన్ని రకాల సేవలు ఉచితంగా పొందవచ్చు.

అప్‌డేట్‌ అంటే..?
ఆధార్‌ కార్డు అంటే మీ గుర్తింపు కార్డు అని అర్ధం. భారత ప్రభుత్వం మీకు అందిస్తున్న గుర్తింపు కార్డుగా భావించవచ్చు. ఈ కార్డు ద్వారా మీ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఆధార్‌ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఉంటేనే మీకు ప్రభుత్వ సేవలు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, సేవలు పొందాలనుకుంటే ఆధార్‌లో వివరాలు సరైనవి ఉండాలి. అవి తప్పు ఉంటే మీకు సేవలు అందకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే అప్‌డేట్‌ అనేది తప్పనిసరి చేస్తున్నారు.

ఆధార్‌ కార్డులో పేర్లు తప్పు ముద్రితమైనా.. నంబర్లు, చిరునామా మారినా, ఫొటో మార్చాలనుకోవాలన్నా ఇప్పుడు మార్చుకోవచ్చు. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం కేంద్రం ప్రత్యేకంగా కొన్ని రోజుల ప్రకటించింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతోపాటు మరిన్ని పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. దీనికితోడు చాలా మంది ఆధార్‌ కార్డు ఉందనే విషయాన్ని కూడా మరచిపోయారు. ఆధార్‌ కార్డును వినియోగించడం మరిచారు. అలాంటి వారి వివరాలు అప్‌డేట్‌ లేవు. అప్‌డేట్‌ లేని వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆధార్‌ అప్డేట్‌పై దృష్టి సారించాయి.

Diabetes Control Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసే ఆరు అద్భుతమైన పద్ధతులు

Diabetes Control Tips: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది మధుమేహం. ఒక్క మధుమేహం కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తవచ్చు.
ఇది కాస్తా హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌లకు దారీ తీయవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు అనేవి ఒకదానికొకటి సంబంధమున్నవని..ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారీ తీస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

మరి ఈ పరిస్థితుల్లో మధుమేహం ఎలా నియంత్రించుకోవాలనేది ప్రధాన సమస్య. కేవలం మందుల ద్వారానే మధుమేహం నియంత్రణ సాద్యమౌతుందా అనేది ప్రధానమైన ఆందోళన. అయితే ప్రకృతిలో లభించే సహజసిద్దమైన సీడ్స్ సైతం బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అద్బుతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ సీడ్స్ తీసుకోవడం ద్వారా మధుమేహం నియంత్రణకు మందులు వాడాల్సిన అవసరం లేదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు దోహదపడే సహజసిద్ధమైన సీడ్స్‌లో ముఖ్యమైనవి నువ్వులు, చియా సీడ్స్, మెంతులు, గుమ్మడికాయ విత్తనాలు, సన్‌ఫ్లవర్ సీడ్స్,

నువ్వులు

నువ్వుల్లో ప్రోటీన్స్‌తో పాటు హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ నియంత్రణకు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పైనోరెసినోల్ కారణంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. షుగర మాల్టోజ్ బ్రేక్ చేయడంలో మాల్టేజ్ పాత్ర కీలకం. మాల్టోజ్ జీర్ణ ప్రక్రియలో పైనోరెసినాల్ ఇన్‌హిబిట్ అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

చియా సీడ్స్

చియా సీడ్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపులో జెల్ ఫామ్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర సంగ్రహణను స్లో చేస్తుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ స్థాయి ఆదుపులో ఉంటుంది.

మెంతులు

మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ స్థాయి తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ల సంగ్రహణ మందగిస్తుంది. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, ఇన్సులిన్ ఉత్పత్తిని స్టిమ్యులేట్ చేయడం చేస్తుంది. మెంతుల్ని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. దేశంలో చాలా రకాల వ్యాధులకు మెంతుల్ని చిట్కా రూపంలో ఉపయోగిస్తారు.

గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాల్లో లభించే మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర సంగ్రహణను మందగించేలా చేస్తాయి.

సన్‌ఫ్లవర్ విత్తనాలు

సన్‌ఫ్లవర్ విత్తనాల్లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి. రక్తంలో చక్కెర సంగ్రహణను నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.

ప్రవీణ్‌ప్రకాశ్‌పై నివేదిక ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం

ప్రవీణ్‌ప్రకాశ్‌పై నివేదిక ఇవ్వండి.
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలి మరోసారి రచ్చకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తరచూ

ఎమ్మెల్సీ రఘువర్మ ఫిర్యాదుపై కేంద్రం ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలి మరోసారి రచ్చకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తరచూ జిల్లాల పర్యటనలు చేస్తూ, అధికారులు, ఉపాధ్యాయులను ఆయన హడలెత్తిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి నోట్‌ పుస్తకాలు పరిశీలిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల కుటుంబాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన సెన్సేషన్‌ కోసం తాపత్రయపడుతున్నారని, ఆయన వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి గతేడాది ఆగస్టులో ఫిర్యాదు పంపారు. దీనిపై స్పందించిన కేంద్రం.. ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సవివర నివేదిక పంపాలని పాఠశాల విద్యాశాఖను జీఏడీ ఈ నెల 14వ తేదీన ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖకు ఆయనే బాస్‌ కావడంతో ఇప్పుడు ఎలాంటి నివేదిక పంపుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఆయనది రహస్య అజెండా…

సీనియరు ఐఏఎస్‌ అధికారిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ తరచూ సెన్సేషన్‌ కోసం తాపత్రయపడుతున్నారని, అందుకోసం మిగిలిన అధికారులతో పోలిస్తే అసాధారణంగా వ్యవహరిస్తున్నారని తన ఫిర్యాదులో రఘువర్మ తెలిపారు. ‘‘దీనివెనుక రహస్య అజెండా ఉందనేది బహిరంగ రహస్యం. ఆయన తనపాఠశాలల పర్యటనల్లో విద్యార్థుల ముందే టీచర్లను దూషిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటన పేరుతో నేరుగా విద్యార్థుల ఇళ్లకే వెళ్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలోనూ ఇళ్లకు, కేజీబీవీలకు వెళ్లి నోట్‌ పుస్తకాల పరిశీలన అంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా అక్కడే అధికారులు, టీచర్లను తిట్టడం, సస్పెండ్‌ చేయాలనే ఆదేశాలు ఇవ్వడం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోయినా దానికీ టీచర్లనే బాధ్యులను చేస్తున్నారు. రాష్ట్రంలోని 9వేల పాఠశాలల్లో ఒక్కో టీచరే ఉన్నారు. కానీ వారిపై బోధనేతర పనులు చాలా ఉన్నాయి. పిల్లల హాజరు, టాయిలెట్ల ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం పనులు, నాడు- నేడు పనులు లాంటి బాధ్యతలు టీచర్లపై పెట్టారు. కానీ ఇవేం పట్టించుకోకుండా రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇంటికి వెళ్లి విద్యార్థుల నోట్‌ పుస్తకాలు అడుగుతున్నారు. ప్రతి ఉద్యోగికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అది లేకుండా ఉపాధ్యాయులను ప్రవీణ్‌ ప్రకాశ్‌ వేధిస్తున్నారు’’ అని తన ఫిర్యాదులో రఘువర్మ తెలిపారు.

One plus: కస్టమర్లకు తిరిగి డబ్బు చెల్లిస్తున్న వన్‌ప్లస్‌.. కారణం ఇదే..

One plus: కస్టమర్లకు తిరిగి డబ్బు చెల్లిస్తున్న వన్‌ప్లస్‌.. కారణం ఏంటంటే..
స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లాష్‌ స్టోరేజీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించినందుకు గాను వన్‌ప్లస్‌ కస్టమర్లకు డబ్బులను తిరిగి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్చి 16వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్‌ సీఈఓ తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్‌ లాంచింగ్ సమయంలో ఇందులో యూనివర్సల్‌ ఫ్లాష్‌…
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్ ఇటీవల వన్‌ప్లస్‌ 12ఆర్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఎవరైతే వన్‌ప్లస్‌12ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేశారో వారికి పూర్తి డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ వన్‌ప్లస్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లాష్‌ స్టోరేజీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించినందుకు గాను వన్‌ప్లస్‌ కస్టమర్లకు డబ్బులను తిరిగి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్చి 16వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్‌ సీఈఓ తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్‌ లాంచింగ్ సమయంలో ఇందులో యూనివర్సల్‌ ఫ్లాష్‌ స్టోరేజ్‌ 4.0 స్టోరేజీ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ విషయంపై వన్‌ప్లస్‌ కీలక ప్రకటన చేసింది.

వన్‌ప్లస్‌ ఆర్‌ హై స్టోరేజీ వేరియంట్‌ ఫోన్లు నిజానికి UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చాయని, లాంచింగ్ సమయంలో తప్పుగా ప్రకటించామని తేల్చి చెప్పంది. దీంతో వన్‌ప్లస్‌ ఆర్‌ 256జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసినవారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వన్‌ప్లస్‌ సీఓఓ కిండర్‌ లియు సూచించారు.
ఇక వన్‌ప్లస్‌ 12 ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడీయో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ధర విషయానికొస్తే.. 16 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.45,999గా నిర్ణయించారు.

Peach Candy:పీచు మిఠాయిపై ‘బ్యాన్’.. ఎందుకో తెలిస్తే ఇకపై ముట్టుకోరు

తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయిని నిషేధిస్తూ అధికారులు బాంబు పేల్చారు. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలని నిపుణులు కోరుతున్నారు. పీచు మిఠాయి తయారీలో వాటికి రంగు రావడం కోసం రోడమైన్-బి అనే కెమికల్ ఉపయోగిస్తున్నారని..
ఇది క్యాన్సర్ కు కారణమని ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం విధించామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సైతం తనిఖీలు చేపట్టి.. పీచు మిఠాయి నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించారు. ఈ కాటన్ క్యాండీల తయారీలో రోడమైన్-బి అనే కెమికల్ ఉన్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. పుదుచ్చేరీలో కూడా పీచు మిఠాయి విక్రయాలు నిషేధిస్తున్నట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. పిల్లల కోసం వీటిని కొనడం మానుకోవాలని ప్రజలను కోరారు.

పీచు మిఠాయిలో రోడమైన్-బి వంటి ప్రమాదకరమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల నిషేధం ఏర్పడింది. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఆరాధించే ఈ మిఠాయి సింథటిక్ డైతో కలుషితమైంది.. అందుకే ఇకపై మీరు కూడా తినడం తినిపించడం మానేయండి.

Cheetah : ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..? మద్యం ఫ్యాక్టరీలోకి వెళ్లి మద్యం సేవించిన చిరుత పులి.. పరిస్థితి వీడియో చూడండి

పుల్‌గా తాగితే మనిషి ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కపడితే అక్కడ పడిపోయి ఉంటాడు. పైగా ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అలా తాగేసి రోడ్లపై పడిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు.
అయితే ఇలా క్రూర జంతువులు తాగినే పరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం అవి కూడా మత్తులోనే జోగుతాయని. కానీ ఇక్కడొక చిరుతని చూస్తే అవి కూడా ఇంతేనా! అని అనుకుంటారు.

అసలేం జరిగిందంటే..బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో మద్యం తయారీ కర్మాగారం ఉంది. అయితే అందులోకి ఓ చిరుత పులి అనుకోకుండా ప్రవేశించింది. పైగా అక్కడ ఉండే మద్యాన్ని ఫుల్‌గా తాగేసింది. పాపం ఆ మద్యం సేవించిన తర్వాత అది ఒక్కసారిగా మత్తులోకి వెళ్లిపోయింది. కనీసం అడుగు తీసి అడుగువేయలేనంత మత్తులోకి వెళ్లిపోయింది.

ఇంతలో కర్మాగారంలో పనిచేసే సిబ్బంది అక్కడకు వచ్చారు. మొదట ఆ చిరుతను చూసి వారంతా భయపడ్డారు. అయితే అది అలాగే పడుకుని ఉండటం చూసి బహుశా మద్యం తాగేసి ఉంటుంది అందుకే అలా ఉందని అనుకున్నారు. అయినప్పటికి అది ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుని దాన్ని అక్కడ నుంచి బయటకు పంపే యత్నం చేశారు. ఇంతలో అది లేచింది. కానీ నడిచే మూడ్‌లో అస్సలు లేదు. ఇక వాళ్లు ఎలాగో లేచింది కదా అని నెమ్మదిగా బయటకు వెళ్లేలా చేశారు.
అయితే అక్కడున్న వారంతా దాని దగ్గరకు వచ్చి దాని మీద చేయి వేసినా.. కిమ్‌ అనకుండా ఉంది. పైగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తోంది. అందుకు సంబంధించిన ఘటనను ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే గాక ఆ పులి గనుకు మత్తులో లేకుంటే మీ అందరి తలలు తీసుకువెల్లేది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.

TSBIE Inter Hall Ticket 2024 (Released) 1st and 2nd year Admit Card download

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో వారి TSBIE ఇంటర్ హాల్ టికెట్ 2024ని పొందడాన్ని సులభతరం చేసింది. విద్యార్థులు ఫిబ్రవరి 19, 2024 నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయి.
TSBIE ఇంటర్ హాల్ టికెట్ 2024
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో TSBIE ఇంటర్ హాల్ టికెట్ 2024ని పొందడాన్ని సులభతరం చేసింది. విద్యార్థుల పేర్లు, రోల్ నంబర్లు, పరీక్ష కేంద్ర సమాచారం మరియు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరాల రెండింటికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌లు అన్నీ హాల్ టిక్కెట్‌పై పొందుపరచబడ్డాయి.
వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థులు బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయవచ్చు మరియు TSBIE ఇంటర్ హాల్ టికెట్ 2024ని పొందవచ్చు. మొదటి సంవత్సరం పరీక్షల తేదీలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 18, 2024 వరకు ఉంటాయి, రెండవ సంవత్సరం పరీక్షల తేదీలు ఫిబ్రవరి 29 నుండి మార్చి 19, 2024 వరకు.

అధికారిక వెబ్‌సైట్ – tsbie.cgg.gov.in
TSBIE ఇంటర్ 1 ఇయర్ హాల్ టికెట్ లింక్
TSBIE ఇంటర్ 2వ సంవత్సరం హాల్ టికెట్

Fruits For Diabetic Patients: డయాబెటిక్ పేషెంట్లు తప్పనిసరిగా తినాల్సిన నాలుగు పండ్లు ఇవే.. ఎందుకంటే..

డయాబెటిక్ రోగులు సరైన ఆహారం మరియు పండ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది తిన్న తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు ఎంత త్వరగా పెరుగుతుందో చెప్పే కొలత.
డయాబెటిక్ రోగులకు తక్కువ జిఐ ఉన్న పండ్లు మంచివి. GI స్కేల్ 0 నుండి 100 వరకు ఉంటుంది, ఇక్కడ మొత్తం చెరకు చక్కెర (గ్లూకోజ్) 100గా పరిగణించబడుతుంది.

యాపిల్‌లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఆపిల్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది సాధారణంగా 30-40 మధ్య ఉంటుంది. అంటే యాపిల్ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది, దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు.

బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఫైబర్ ఉన్నాయి, ఇవి చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. బార్బెర్రీ యొక్క గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది, దీని కారణంగా ఈ పండు రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతుందని అర్థం. బార్లీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. దీని వల్ల ఇన్సులిన్ సమతుల్యంగా ఉంటుంది. బార్లీ యొక్క తక్కువ GI కారణంగా, డయాబెటిక్ రోగులు దాని నుండి ప్రయోజనం పొందవచ్చు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగడాన్ని నిరోధించవచ్చు.

చెర్రీస్ కూడా మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి మరియు వాటి GI కూడా తక్కువగా ఉంటుంది. అనేక మూలాల ప్రకారం చెర్రీస్ యొక్క GI 20 మరియు 25 మధ్య ఉంటుంది, ఇది చాలా తక్కువ. చెర్రీస్ యొక్క తక్కువ GI కారణంగా, వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా మరియు వేగంగా పెరగడాన్ని నిరోధిస్తుంది, ఇది మధుమేహాన్ని నివారిస్తుంది. రోగులకు ఇది మంచి ఎంపిక అని నమ్ముతారు.

జామపండులో విటమిన్ సి మరియు ఫైబర్ ఉన్నాయి, ఇవి మధుమేహ రోగులకు సరిపోతాయి. జామ యొక్క గ్లైసెమిక్ సూచిక సాధారణంగా 30 నుండి 33 మధ్య ఉంటుంది, ఇది మధ్యస్థ GI పండుగా పరిగణించబడుతుంది. జామలో తగినంత మొత్తంలో డైటరీ ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

ఈ ఆయుర్వేద ఆకు అడ్డుపడే రక్తనాళాలను మళ్లీ తెరుస్తుంది, ఈరోజే ప్రయత్నించండి!

కొలెస్ట్రాల్ తొలగించే ఆకులు: ఈ రోజుల్లో, చెడు జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు, వీటిలో కొలెస్ట్రాల్, షుగర్, హై బిపి మరియు మధుమేహం వంటి సమస్యలు సర్వసాధారణం.
అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఒత్తిడి, ధమనులలో అడ్డంకులు మరియు అధిక బీపీ. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు మేము మీకు ఆయుర్వేద గృహ చికిత్స గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. దాని సహాయంతో మీరు ఈ సమస్యను వదిలించుకోవచ్చు. నిజానికి మనం చెప్పబోయే ఈ ఆయుర్వేద మూలిక పేరు పథర్చట్ట(అడవి ఉల్లిపాయ).

ఈ మొక్క ఆకులు గుండె సంబంధిత వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అంతే కాదు, ఆయుర్వేదంలో ఇది చాలా తీవ్రమైన వ్యాధుల చికిత్సకు పురాతన కాలం నుండి ఉపయోగించబడింది. హై బీపీ లో దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

హైపర్‌టెన్షన్‌లో ప్రయోజనకరమైన అడవి ఉల్లిపాయ ప్రయోజనాలు.
అధిక బిపి రోగులకు పత్తర్‌చట్ట చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది, ఎందుకంటే ఇది శరీరంలో నిరోధించబడిన రక్తనాళాలను తెరుస్తుంది మరియు రక్తనాళాల గోడలను విస్తరించడం ద్వారా వాటిని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు గుండెపై ఒత్తిడిని కలిగించదు. హై బీపీ రోగులకు ఇది ఒక వరంలా భావించడానికి ఇది ఒక కారణం. ఇది బిపిని అదుపులో ఉంచుతుంది మరియు అనేక తీవ్రమైన వ్యాధులను దూరం చేస్తుంది.

కొలెస్ట్రాల్ మూలాల ద్వారా విచ్ఛిన్నమవుతుంది,
ఇది అధిక కొలెస్ట్రాల్ మరియు అడ్డుపడే సమస్యను త్వరగా తొలగిస్తుంది. వాస్తవానికి, ఇది కొన్ని యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది, ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దీని కారణంగా, ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మరియు కొవ్వు కణాలు చాలా వరకు కరగడం ప్రారంభిస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.అటువంటి పరిస్థితిలో, ఇది అధిక BP సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు గుండె సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

దాన్ని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి?
మీరు బీపీ వ్యాధిగ్రస్తులైతే, ఉల్లిపాయ ఆకుల రసాన్ని తయారు చేసి, వారానికి రెండుసార్లు అరకప్పు తీసుకోండి. ఇది చేయుటకు, 1 కప్పు నీరు తీసుకుని, అందులో కొన్ని అడవి ఉల్లిపాయ ఆకులను వేసి, ఉడకబెట్టి, ఆపై ఈ రసాన్ని తక్కువ మంటపై చిక్కగా చేసి, చల్లారిన తర్వాత త్రాగాలి. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది మరియు గుండె సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. దీని రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి.

Health Tips : బరువు తగ్గించడంలో తమలపాకు భేష్.. ఇలా చేస్తే వారం రోజుల్లోనే కొవ్వు కరిగి నాజుకు నడుము మీ సొంతం..!!

Health Tips : అధిక బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు.. అనేక శారీరక రోగాలకు దారి తీస్తుంది.. అందుకే అధిక బరువు తగ్గించుకోవటం, పొట్ట, నడుం చుట్టూ కొవ్వును కరిగించుకోవటానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
కానీ, కొంతమంది వ్యాయామాలు, జిమ్‌లకు వెళ్లే సమయం కూడా ఉండదు. అందుకని వారు.. బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.. ఆహారం తక్కువగా తీసుకుంటే.. బరువు కంట్రోల్‌ ఉంటుందని భావిస్తారు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు కరిగి నాజుకైన నడుమును సొంతం చేసుకుంటారు.. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి తమలపాకులను ప్రయోజనకరంగా భావిస్తారు. అంతే కాదు ఎనిమిది వారాల్లోనే ప్రభావం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకులోని పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. సరైన జీవక్రియను నిర్వహిస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తమలపాకులను తీసుకోవడం వల్ల చాలా వరకు కొవ్వులు కరిగి బరువు తగ్గడం సులభం అవుతుంది.
అలాగే ఆయుర్వేదంలో, తమలపాకులను శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయకరంగా భావిస్తారు. అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ వల్ల వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. అయితే ఇవే కాకుండా అధిక వరువును తగ్గించడానికి దివ్య ఔషదంలా పనిచేస్తోంది.తమలపాకులు కడుపు ఉబ్బరం లక్షణాలు, జీర్ణక్రియ చికిత్సలో సహాయపడతాయి. ఎలాంటి కసరత్తులు చేయకుండా కొవ్వుని తగ్గించవచ్చు.

పచ్చి తమలపాకు తీసుకుని అందులో ఐదు మిరియాలు వేసి పాన్‌ కట్టుకోండి. అలా తయారు చేసిన పాన్‌ ఎక్కువ సేపు నోటిలో పెట్టుకోండి..మీరు సాధారణ పాన్ తింటున్నట్టుగానే..అలా నోటిలో ఏర్పడిన లాలాజలం కడుపులోకి వెళ్లనివ్వండి. ఎనిమిది వారాల పాటు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపున ఇలా మిరియాలతో తమలపాకులను తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు గమనిస్తారు.. ఆయుర్వేదంలో ఈ పద్ధతి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులోని విషాన్ని తొలగిస్తుంది.

ఈ పద్ధతిని ఉపయోగించి కేవలం పచ్చి తమలపాకులను మాత్రమే తినండి.. ఎందుకంటే వాటిలో ఈ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పండిన లేదంటే ఎండిపోయిన తమలపాకులను ఈ పద్ధతిలో తీసుకుంటే, మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, మీరు ప్రతిరోజూ మిరియాలతో పాటు తమలపాకులను తింటే, ఎనిమిది వారాల తర్వాత మీ బరువులో మార్పు కనిపిస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మీ ఇంట్లో దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా..? ఈ చిట్కాలను పాటించి తరిమికొట్టండి..!

జింజర్ గ్రాస్ లేదా లెమన్ గ్రాస్ దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాటి రసాన్ని ఇంట్లోనే చల్లుకోవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా దోమలను రాకుండూ అడ్డుకుంటుంది.
వెల్లుల్లి సారంలో ఉండే సల్ఫర్ దోమలతో సహా వివిధ కీటకాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. ఎక్కువ సమయం పాటు వెల్లుల్లి వాసన ఆ ప్రాంతం నుండి వారాలపాటు దోమలను నిరోధిస్తుంది. దీంతో మీరు దోమల మోత లేకుండా హాయిగా ఉండొచ్చు.

సాయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా తిరుగుతున్నప్పుడు..ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కూడా దోమలు పారిపోతాయి. అలాగే, సాంబ్రాణి వెలిగించి పొగను ఇంటింటా వ్యాపింపజేయడం వల్ల కూడా దోమలు దూరంగా పారిపోతాయి. ఇలా చేయటం కూడా చాలా మంచిది.

మరో ఔషధ మొక్క తులసి. తులసి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. తులసి ఆకులను చూర్ణం చేసిన నీటిని ఇంటి లోపల, వెలుపల పిచికారీ చేయడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.

చివరగా, ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు సన్నని నెట్‌ డోర్‌లు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోండి. ఇంటి చుట్టూ దోమలు వృద్ధి చెందే వాతావరణం లేకుండా చూసుకోండి..ఎక్కువగా నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి. పూల కుండీలు, కుండీలు, బకెట్‌లు వంటి వాటిలో నీటిని నిల్వకాకుండా చూసుకోవాలి. అలాగే దోమల బెడదను తగ్గించకునేందుకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వకుండా చేసుకోవాలి.

Diabetics: మధుమేహ రోగులకు గుడ్ న్యూస్.. ఇకపై 14 రోజుల్లోనే..!

మధుమేహం ఇది ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. దీనిని ప్రాధమిక దశలో గుర్తిస్తే సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో నియంత్రించుకోవచ్చు. అదే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మెడికేషన్ తప్పనిసరి.
అయితే ప్రపంచ దేశాలతో పోటీ పడి మన భారత్ కూడా దీనిపై అనేక ప్రయోగాలు చేస్తోంది. తద్వారా కొంత మేర సత్ఫలితాలను సాధిస్తోంది. ఇటీవల చేసిన సరికొత్త అధ్యయనంలో కేవలం 14రోజుల్లోనే మధుమేహాన్ని నియంత్రించవచ్చని తేలింది. ఇది ఏ హోమియోపతి, అల్లోపతి వైద్యంతో కాదు పూర్తి ఆయుర్వేద చికిత్సతో షుగర్ లెవెల్స్ అదుపులోకి తీసుకురావచ్చని నిరూపితమైంది. దీనిపై పరిశోధనలు చేస్తున్నారు వైద్యనిపుణులు.

భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్న షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. దీనికి కారణం సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, శరీరానికి తగిన వ్యాయామం కల్పించకపోవడం. రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేయకపోవడం. ఐటీ రంగం అభివృద్ది చెందిన తరుణంలో ఎనిమిది నుంచి 10 గంటల పాటూ ఒకే చోట స్థిరంగా కూర్చొని పని చేయడం. ఇవన్నీ డయాబెటిక్ టైప్ 1కి కారణం అవుతున్నాయి. దీనిని తొలిదశలోనే గుర్తించకుండా వ్యాధి తీవ్రతను పెంచుకుంటున్నారు. అయితే పాట్నాలో ఈమధ్య కాలంలో చేసిన అధ్యయనంలో కేవలం 14 రోజుల్లోనే డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకువచ్చినట్లు నిరూపితమైంది.

పాట్నాకు చెందిన ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి వైద్యులు ఓ వ్యక్తి కేంద్రంగా చేసుకుని మధుమేహం సమస్యపై ప్రయోగం చేశారు. ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటూ, మంచి ఆహారాన్ని సరైన సమయానికి మితంగా అందించారు. దీంతో పాటూ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే బీజీఆర్34 అనే ఔషధమూలకాలతోపాటూ ఆరోగ్యవర్థిని వాతి, చంద్రప్రభావతి అనే మందులను అందించారు. 14 రోజుల చికిత్స తరువాత షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి రక్తపు నమూనాలను సేకరించి పరీక్షించారు. అద్భుతమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. చికిత్సకు ముందు పరగడుపున సేకరించిన రక్తపు శాంపిల్స్‌లో 254 ఎంజీ ఉంటే.. చికిత్స తరువాత 124 ఎంజీకి షుగర్ విలువలు పడిపోయాయి. అలాగే తిన్న తరువాత సేకరించిన శాంపిల్స్‌లో 413 ఎంజీ ఉండగా.. చికిత్స తరువాత 154కు తగ్గింది. దీనిపై పరిశోధనలు జరిపి రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని వైద్యనిపుణులు తెలిపారు.

Horse Grams: కిడ్నీలో రాళ్లు, కొలెస్ట్రాల్‌, మధుమేహం.. సమస్యలకోసం ఉలవలను ఎలా వాడాలంటే..

పాత కాలం వంటలైన ఉలవచారు లాంటివి ఇటీవల మళ్లీ ఎక్కువగా వాడుకలోకి వస్తున్నాయి. ఉలవచారు బిర్యానీ లాంటివి ఇప్పుడు చాలా ఫేమస్‌ అయిపోయాయి. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉలవల్ని ఎక్కువగా ఆహారంలో, పసువుల దానాగానూ ఉపయోగిస్తుంటారు.
ఇవి వేడి చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందుకనే వీటిని శీతాకాలంలో ఎక్కువగా వాడుతుంటారు. వీటిలో డైటరీ ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు లాంటి సమస్యలను తగ్గిస్తాయి. ఏఏ ఆరోగ్య సమస్యలకు ఇవి ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం రండి.

కిడ్నీల్లో రాళ్లు :

చాలా మంది కిడ్నీల్లో రాళ్ల వల్ల చాలా నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఐదు గ్రాముల ఉలవల్ని తీసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి. రాత్రి వంద మిల్లీ లీటర్ల నీటిలో వాటిని వేసి ఉదయం వరకు నాననివ్వాలి. ఉదయాన్నే వాటిని కాస్త పిసికి నీటిని వడగట్టుకోవాలి. పరగడుపున రోజూ ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు దూరం అవుతాయి.
మధుమేహం :

శరీరంలో వాత, కఫ దోషాల అసమతుల్యత వల్ల అజీర్ణం సమస్య వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. అజీర్ణం వల్ల విష పదార్థాలు ఎక్కువగా శరీరంలో పేరుకుపోతాయి. క్లోమంలోని కణాలపై ప్రభావం చూపించి ఇన్సులిన్‌ విడుదలను అస్తవ్యస్థం చేస్తాయి. ఫలితంగా మధుమేహం సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఉలవలు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మూడు గ్రాముల ఉలవల్ని రోజుకు రెండు సార్లు చొప్పున భోజనం తర్వాత తింటూ ఉంటే అజీర్ణ సమ్యలు తగ్గుతాయి. ఇన్సులిన్‌ అసమతుల్యత రాకుండా ఉంటుంది. తద్వారా మధుమేహం దరి చేరదు.

కొలెస్ట్రాల్‌ :

మనలో కొలెస్ట్రాల్‌ ఎక్కువ కావడం వల్ల ఊబకాయం, బరువు పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఉలవలతో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వంద గ్రాముల ఉలవల్ని తీసుకోండి. వాటిని లీటరు నీళ్లలో వేసి చిన్న మంట మీద కనీసం రెండు గంటలైనా మరగనివ్వండి. నీరు సగానికి వచ్చాక ఆ నీటిని వడగట్టి సూప్‌లా చేసుకుని తాగుతూ ఉండండి. ఇలా వారానికి రెండు సార్లయినా చేస్తూ ఉండటం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ నిల్వలు తగ్గుతాయి. జీవ క్రియ మరింత మెరుగై క్యాలరీలు కరుగుతాయి. బరువు తగ్గుతారు. ఇవే కాకుండా ఎముకలు బలహీనంగా మారడం, అల్సర్లు, మహిళల్లో నెలసరి సమస్యలు, గుండె సమస్యల్లాంటివి వీటి వాడకం వల్ల తగ్గుముఖం పడతాయి.

Diabetes : డయాబెటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి.. నార్మల్‌గా షుగర్ ఎంతుంటే మనం సేఫ్‌..?

Diabetes : మీకు స్వీట్ అంటే ఇష్టమా.. కానీ స్వీట్లు తింటే షుగర్ వస్తుందేమో అని భయపడి తినడం మానేస్తున్నారా.. అసలు మీకు షుగర్ ఉందో లేదో చెక్ చేసుకున్నారా..
ఒకవేళ చెక్ చేసుకున్న కూడా మీకు షుగర్ లేదని రిపోర్ట్ వచ్చిందా.. అయినా భయంగా ఉందా.. అసలు మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే మనకు షుగర్ వ్యాధి వచ్చినట్టు నిర్ధారించాలి. ఎటువంటి సంకేతాల ద్వారా మనకు షుగర్ వచ్చిందని నిర్ధారించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా చూద్దాం… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది చక్కెర వ్యాధి. ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన ప్రపంచంలో చాలామంది పడుతున్నారు.. మనదేశంలో షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ అని వ్యవహరిస్తారు. ఎక్కువగా డయాబెటిస్ అని పిలుస్తారు. ఇన్సూలిన్స్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అన్యంతృత మెటబిలజం రక్తంలో అధిక గ్లూకోజ్ స్తాయిలు వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీన్ని చెప్పుకోవచ్చు. డయాబెటిస్ రాబోయే ముందు కనిపించే లక్షణాలను ఫ్రీ బయోటిక్ స్టేజ్ అంటారు. ఈ దశలో కొందరికి జుట్టు రాలిపోతుంది.. మరికొందరికి రోజంతా అలసటగా ఉంటుంది.

ఏ పని చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. ఇంకొందరికి చర్మంపై మచ్చలు వస్తుంటాయి. కొందరిలో తరచూ మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది. కొంతమంది లక్షణాలు కూడా సంకేతాలుగా ఉంటాయి. పై లక్షణాల్లో ఏది కనిపించిన వెంటనే షుగర్ చెక్ చేయించుకోవడం ఉత్తమం. ప్రతి మూడు మాసాలకు ఆరు మాసాలకు పరీక్ష చేసి షుగర్ ఉందో లేదో కనుగొనాలి. మధుమేహం ఉన్నవారిలో గుండె కండరాలకు రక్తాన్ని కోల్పోయే కరునరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్న లేకపోయినా ప్రతి ఏటా ఈసీజీ ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపే లిమిట్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ లిపి ప్రొఫైల్లో 130 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్లే.. ఈ షుగర్ ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లలో కూడా కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. ధా

న్యాలు, పిండి పదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు పదార్థాలను కలిగిన సోడియం కొలెస్ట్రాల్ లేని జామపండు మధుమేహ వ్యాధి గ్రస్తులు మధుమేహాన్ని తగ్గిస్తుందని ఆధునిక విజ్ఞానం కూడా చెబుతోంది. ఒకసారి ఇన్సూలిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సూలిన్స్ తీసుకోవాల్సిన తీసుకోవడానికి వెనకాడ కూడదు. అలాగే మనం చెప్పుకుంటున్నట్లుగా ఎటువంటి పరీక్షల ద్వారా మనకు డయాబెటిస్ ఉంది అని గుర్తించాలి. అంటే ఫ్రీ డయాబెటిస్ ను గుర్తించడానికి రెండు టెస్టులు ఉన్నాయి. ఒకటి ఫాస్టింగ్ ప్లాస్మాత్ లో పోస్టర్ ఈ టెస్ట్ ల ద్వారా నిర్ధారించి ఒక వ్యక్తి ఫ్రీ డయాబెటిస్ లేక డయాబెటిస్తో బాధపడుతున్నాడా అని స్పష్టంగా నిర్ధారించవచ్చు.. ఆహారంలో నియంత్రణ రెగ్యులర్ వ్యాయామం బాడీ వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడటం అదనపు వెయిట్ను తగ్గించుకోవడం విధిగా చేసి తీరాలి.

ఈ రోజుల్లో మనం తినే ఆహారం ఏ విధంగా మన శరీరంలో మార్పులు చెందుతుంది అని తెలుసుకోవాలి. అంటే ఇలాంటి టెస్టుల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి షుగర్ టెస్ట్ లు చేయించుకుని దానికి తగిన వైద్యం తీసుకోవడం గాని.. ఆహారపుట అలవాట్లలో మార్పులు చేసుకోవడం కానీ చేస్తే ఈ డయాబెటిస్ అనే సమస్య నుంచి మనం బయటపడొచ్చు

Dry Amla For White Hair : దీన్ని వాడితే చాలు.. మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది..!

Dry Amla For White Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. పూర్వం వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ తెల్లజుట్టు నేటి తరుణంలో పిల్లల్లో కూడా కనిపిస్తుంది.
మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి వివిధ కారణాల చేత మనలో చాలా మంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడడం వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలాగా కనిపిస్తారు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. కానీ వీటిలో రసాయనాలు అధికంగా ఉంటాయి. దీంతో జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి. కనుక మనం సహజ పద్దతుల ద్వారానే జుట్టును నల్లగా మార్చుకోవడం మంచిది.

మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక చిట్కాను తయారు చేసివాడడం వల్ల చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. తెల్లజుట్టును నల్లగా మార్చే ఈ చిట్కా ఏమిటి.. దీనిని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 5 మందార ఆకులను, గుప్పెడు గోరింటాకును, ఒక గుడ్డు తెల్లసొనను, ఒక టీ స్పూన్ ఉసిరిపొడిని, 3 టీ స్పూన్ల అలోవెరా జెల్ ను, 3 టీ స్పూన్ల పెరుగును, అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పైన చెప్పిన పదార్థాలన్నింటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.

Dry Amla For White Hair

తరువాత ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Sleeplessness : నిద్ర మధ్యలో మెళకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయండి..!

Sleeplessness : చక్కగా నిద్ర పట్టడం కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. ఒకవేళ నిద్ర పట్టిన కూడా చాలా మందికి మధ్యలో మెలుకువ వచ్చి లేగుస్తున్నారు.
నిద్ర పట్టినప్పటికి శబ్దాల కారణంగా అలాగే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చి చాలా మందికి నిద్ర మధ్యలో మెలుకువ వస్తుంది. మరలా నిద్ర పట్టడానికి ఎంతో సమయం పడుతుంది. మరలా నిద్రించడానికి అరగంట నుండి రెండు గంటల సమయం వరకు పడుతుంది. కొందరు ఎప్పటికో తెల్లవారు జామున నిద్రిస్తున్నారు. ఈ సమస్యను మనలో చాలా మంది అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో చాలా మంది మంచి నిద్రను కోల్పోతున్నారు. కనీసం మనం రోజుకు 8 గంటల పాటు చక్కగా నిద్రపోవడం చాలా అవసరం. ఇలా మెలుకువ వచ్చిన తరువాత మరలా నిద్రరాకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి.

మెలకువ వచ్చిన తరువాత మరలా మెదడుకు ఆలోచించే పని చెప్పడం వల్ల మనకు నిద్రపట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకే విషయాన్ని గురించి పదే పదే ఆలోచించడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ తగాదాలు, ఉద్యోగం, వ్యాపారం గురించి ఆలోచించడం వల్ల నిద్రపట్టదని నిపుణులు చెబుతున్నారు. మెలుకువ వచ్చిన తరువాత మరలా నిద్ర రావాలంటే మన మనసు ఆలోచనల మీదకి వెళ్లకుండా చూసుకోవాలి. మెలుకువ వచ్చిన తరువాత ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిద్రలో మెలుకువ వచ్చిన తరువాత ఆలోచనలు వస్తూ ఉంటే వెంటనే ఆ ఆలోచనలు దారి మళ్లించడానికి ప్రయత్నించాలి. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉంచాలి.
ఉచ్చాస్వ, నిచ్ఛాస్వల మీద ధ్యాసను ఉంచాలి. ఇలా చేయడం వల్ల మూడు నుండి నాలుగు నిమిషాల్లోనే మరలా నిద్ర పడుతుంది. అలాగే నిద్రలో మెలుకుల వచ్చి మరలా నిద్ర పట్టనప్పుడు మనసులో అంకెలను లెక్కించాలి. కళ్లు మూసుకుని మనసులో అంకెలను లెక్కించడం వల్ల మనసు ఇతర ఆలోచనలపైకి వెళ్లకుండా ఉంటుంది. ఇలా 20 నుండి 30 అంకెలు లెక్కపెట్టే సరికి మరలా నిద్ర పడుతుంది. అలాగే మెలుకువ వచ్చి నిద్రపట్టనప్పుడు మన మనసును మనం బొట్టు పెట్టుకునే దగ్గర ఉంచి అలాగే కళ్లు మూసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసు ఇతర ఆలోచనల మీదికి వెళ్లకుండా 3 నుండి 4 నిమిషాల్లోనే నిద్రపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల నిద్ర మధ్యలో మెలుకువ వచ్చినప్పటికి మరలా 3 నుండి 4 నిమిషాల్లోనే నిద్రపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Yashavi Jaiswal: యశస్విపై ప్రశంసలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు

భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashsavi Jaiswal) డబుల్‌ సెంచరీ చేసి,.. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక సిరీస్‌లో 20+ సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో 12 సిక్సులు కొట్టి పాక్‌ దిగ్గజ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్‌తో కలిసి సంయుక్తంగా యశస్వి అగ్రస్థానంలో ఉన్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

‘‘డబుల్‌ సెంచరీ, డబుల్‌ ఫిఫ్టీ.. యశస్వి-సర్ఫరాజ్‌ ఖాన్ జోడీ అదరగొట్టేసింది. ఇంగ్లాండ్‌కు డబుల్‌ ట్రబుల్‌గా నిలిచింది. నేను వారిద్దరి ఇన్నింగ్స్‌లను మొత్తం లైవ్‌లో చూడలేకపోయా. కానీ, వారి ఆటతీరును చెబుతుంటే విన్నా. ఇలాగే కొనసాగాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించిన టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. కంగ్రాట్స్‌..’’ – సచిన్‌ తెందూల్కర్

‘‘యశస్వీ…. జై…స్వాల్‌.. సూపర్ బ్యాటింగ్‌. సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా జైస్వాల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మా శుక్లా గారికి చెబుతుంటా.. ఈ అబ్బాయి (యశస్వి) నాకు తెలుసు.. చాలా గట్టిగా ఆడతాడు’’ – సూర్యకుమార్‌ యాదవ్

‘‘అద్భుతమైన విజయం. యశస్వి ఆరంభం ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే అడుగులు వేస్తున్నాడు. అతడి సత్తాకు ఆకాశమే హద్దు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమ్‌ఇండియా గెలిచింది. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది’’ – వీరేంద్ర సెహ్వాగ్

‘‘భారీ తేడాతో విజయం సాధించడం అభినందనీయం. భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యధికం. ఇలాంటి గెలుపు వల్ల మిగతా మ్యాచుల్లో ఒత్తిడి ఎక్కువైనా సరే భారత్‌ దానిని తట్టుకోగలదు. 33/3 స్కోరుతో తొలి రోజులో వెనుకబడినా.. ఇంగ్లాండ్‌ 200/2 స్కోరుతో ముందంజ వేసినా కంగారు పడలేదు. ప్రతి దశలోనే ఒక హీరో వచ్చి టీమ్‌ఇండియాను కాపాడాడు’’ – వసీమ్‌ జాఫర్

‘‘ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ను యశస్వి బాగా అందుకొన్నాడు. అద్భుతంగా ఆడటం అలవాటు చేసుకున్నాడు. బెన్‌ డకెట్‌ను ధ్రువ్‌ రనౌట్‌ చేయడమే మ్యాచ్‌కు హైలైట్‌’’ – ఇర్ఫాన్‌ పఠాన్‌

Health

సినిమా