Paytm FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 తర్వాత ఏ సర్వీసు పనిచేస్తుంది? ఏది పనిచేయదంటే? అన్ని ప్రశ్నలకు సమాధానాలివే!

Paytm Services FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మీరు పేటీఎం ద్వారా లావాదేవీలను చేస్తున్నారా? పేటీఎం వ్యాలెట్ దగ్గర నుంచి ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ లావాదేవీలకు సంబంధించి అనేక మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిషేధం తర్వాత పేటీఎంతో లింక్ అయిన యూపీఐ సర్వీసులు పనిచేస్తాయా లేదా? అనే గందరగోళం ఇప్పటికీ చాలామంది వినియోగదారుల్లో ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

దీనిపై పేటీఎం తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ఒక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత వ్యాలెట్, ఫాస్ట్ ట్యాగ్ మరిన్నింటికి సంబంధించి ఏది పని చేస్తుంది? ఏది పని చేయదు? అనే ప్రశ్నలకు సమాధానాలను (FAQs) పూర్తి వివరాలను వెల్లడించింది.

మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లుల చెల్లింపునకు పేటీఎం వాడొచ్చా? :
అన్ని బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌ల కోసం పేటీఎం యాప్‌ని ఉపయోగించడం కొనసాగించవచ్చని కంపెనీ తాజా (FAQ) పేజీని ధృవీకరించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం కారణంగా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇతర అధీకృత బ్యాంకులకు తమ పేటీఎం లింక్ చేసిన వారిపై ప్రభావం చూపదు. పేటీఎంని ఉపయోగించి రీఛార్జ్ చేయొచ్చు. ఆర్బీఐ నిషేధం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్లపై మాత్రమే ప్రభావం ఉంటుంది.

Related News

పేటీఎం క్యూఆర్ కోడ్, పేటీఎం సౌండ్‌బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ పనిచేస్తాయా? :
కంపెనీ ప్రకారం.. మీ పేటీఎం, క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఈ తరహా విధానం కొనసాగుతుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాలెట్ వాడొచ్చా? :
పేటీఎం వ్యాలెట్లలో బ్యాలెన్స్ ఉన్నంతవరకు ఉపయోగించవచ్చు. విత్‌డ్రా చేయడం లేదా మరో వ్యాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీరు ఎలాంటి డిపాజిట్లు చేయలేరని గమనించాలి. అయినప్పటికీ, అన్ని రీఫండ్‌లు, క్యాష్‌బ్యాక్ ఇప్పటికీ మీ వ్యాలెట్లలో క్రెడిట్ అవుతాయి.

పేటీఎం ఫాస్ట్ ట్యాగ్/ఎన్‌సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించగలరా? :
ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన (FASTag / NCMC) కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత వీటిని రీఛార్జ్ చేయలేరు. అకౌంట్లలో డబ్బును క్రెడిట్ చేయలేరు. మీరు ఆ మొత్తాన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ ఫాస్ట్ ట్యాగ్/ ఎన్‌సీఎంసీ కార్డ్‌ని కూడా క్లోజ్ చేయొచ్చు. ఆపై రీఫండ్ కోసం బ్యాంక్‌కు రిక్వెస్ట్ పంపవచ్చు.

పేటీఎంలో నగదు సురక్షితమేనా? :
మార్చి 15, 2024 తర్వాత పేమెంట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్, వ్యాలెట్ కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా లేదా క్రెడిట్ లావాదేవీలను అనుమతించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాన్ని జారీ చేసిందని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, గడువు తర్వాత ప్రస్తుత బ్యాలెన్స్ నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడంపై ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేసింది. మీ అకౌంట్ లేదా వ్యాలెట్‌లోని ప్రస్తుత బ్యాలెన్స్‌లపై ప్రభావం ఉండదు. మీ నగదు సురక్షితంగా ఉంటుందని తెలిపింది.

Related News