Sunday, November 17, 2024

Viral Video: ఇది కదా వాడకం అంటే.. పక్కన పడేసిన సైకిల్ చక్రాన్ని.. ఇలా వాడాలని ఎవరికైనా అనిపిస్తుందా..

పనికిరావని పక్కన పడేసిన వస్తువులను కొందరు తిరిగి వినియోగంలోకి తీసుకొస్తుంటారు. మరికొందరు పాత వస్తువులను వేరే పనులకు వాడుతుంటారు. అది కూడా అంతా ఆశ్చర్యపోయేలా వినియోగిస్తుంటారు..
ఆటోలను కార్ల రూపంలోకి మార్చడం, బైకులను ఆటో తరహాలో మార్చడం, సైకిల్‌ను బైకు రూపంలోకి మార్చడం వంటి వీడియోలను చాలా చూశాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పక్కన పడేసిన సైకిల్ చక్రాన్ని వినూత్నంగా వాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ”ఇది కదా వాడకం అంటే”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంట్లో పక్కన పడేసిన సైకిల్ చక్రాన్ని (Old bicycle wheel) వినియోగంలోకి తేవాలని అనుకున్నాడు. డైనింగ్ టేబుల్‌ (Dining table) లేని లోటును సైకిల్ చక్రంతో పూడ్చాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ కర్రను నిలువుగా పాతాడు. దానిపై సైకిల్ చక్రాన్ని పెట్టి గుండ్రంగా తిరిగే విధంగా ఏర్పాట్లు చేశాడు.
ఫైనల్‌గా దానిపై ఆహారంతో కూడిన ప్లేట్లను ఉంచాడు. అలా చక్రాన్ని తిప్పుతూ తనకు కావాల్సిన ఫుడ్ తింటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”ఇది కదా వాడకం అంటే”.. అంటూ కొందరు, ”ఎలా వస్తాయబ్బా.. ఇలాంటి ఐడియాలు”.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

టీచర్ల రిటైర్మెంట్‌పై కొత్త ఎత్తు

విద్యా సంవత్సరం మధ్యలో రిటైరైనా ఏడాదంతా కొనసాగించేలా వ్యూహం

ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు వల

రిటైర్మెంట్‌ ప్రయోజనాలు సకాలంలో ఇచ్చే అవకాశం లేకుండా తప్పించుకునే ఎత్తుగడ

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పదవీ విరమణ విషయంలో జగన్‌ ప్రభుత్వం కొత్త ఎత్తు వేస్తోంది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రిటైర్మెంట్‌ సమయాన్ని మార్చే ఆలోచన చేస్తోంది. తద్వారా వారిని ఎన్నికలకు ముందు మచ్చిక చేసుకోవడం ఒక ఎత్తయితే, రిటైర్మెంట్‌ ప్రయోజనాలను సకాలంలో అందించకుండా జాప్యం చేసే మరో ఎత్తుగడ ఈ వ్యూహం వెనుక దాగి ఉండడం గమనార్హం. వాస్తవానికి ఉపాధ్యాయులైనా, ఉద్యోగులైనా రిటైర్మెంట్‌ అనేది వారి పుట్టిన తేదీ ఆధారంగా ఉంటుంది.

గత ప్రభుత్వంలో 58 ఏళ్ల రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లు చేస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని 62 ఏళ్లకు పెంచింది. అయితే రిటైర్మెంట్‌ వయసు ఏదైనా పుట్టిన తేదీ ఆధారంగా నిర్దేశిత సమయం చేరుకున్నప్పుడు ఆ నెలలోనే రిటైర్‌ అవుతారు. కానీ, వైసీపీ ప్రభుత్వం టీచర్లు రిటైర్‌ అయినా విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగించాలని ప్రతిపాదించింది. ఏటా పాఠశాలలకు విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమై, ఏప్రిల్‌లో ముగుస్తుంది.
ఈ మధ్య కాలంలో ఎవరైనా టీచర్‌ రిటైర్‌ అయితే, వారిని ఆ విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగాలించాలనేది ప్రభుత్వ ఆలోచన. అంటే జూన్‌ నుంచి మార్చి మధ్యలో ఏ నెలలో రిటైర్‌ అయినా ఏప్రిల్‌ వరకు వారు కొనసాగనున్నారు. దీనివల్ల విద్యార్థులకు టీచర్ల కొరత ఉండదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానం ఎక్కడా అమలుచేయలేదు.

సాధారణంగా విద్యా సంవత్సరం మధ్యలోనూ టీచర్లను బదిలీ చేస్తుంటారు. అప్పుడు కూడా విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే, ఒక టీచర్‌ రిటైర్‌ అయితే ఆ స్థానంలో కొత్తవారు పాఠాలు చెబుతారు. ఈ ప్రభుత్వంలోనూ ఇదే విధానం ఉంది.

ఇప్పుడు కొత్తగా విద్యార్థుల ఇబ్బంది గుర్తుకొచ్చింది. ఇకపై ఒక్క టీచర్‌ ఖాళీ కూడా ఉండకూడదనే లక్ష్యంతో ఇలా ఆలోచన చేసినట్లు చెబుతోంది. కానీ, గత నాలుగున్నరేళ్లుగా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు. 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయకుండా వదిలేసింది.

ఇంతకాలం టీచర్ల కొరత ఉన్నా పట్టించుకోకుండా, ఇప్పుడు రిటైర్మెంట్‌ విధానాన్నే మార్చాలని చూస్తోంది. ఎన్నికలకు ముందు టీచర్లను ఆకర్షించడానికి రాజకీయ కోణంలో ఈ ఆలోచన చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. అంతేకాదు, ఎప్పటి ఖాళీలు అప్పుడు భర్తీ చేయడంలో ఈ విధానం అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికే రిటైర్‌ అయిన వారికి సకాలంలో పదవీ విరమణ ప్రయోజనాలు అందడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతుంటే మళ్లీ ఈ కొత్త విధానాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొత్త ఆలోచనతో ప్రయోజనాలను ఇంకా ఆలస్యం చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఎవరైనా టీచర్‌ జూలైలో రిటైర్‌ అయినా వారికి ఆ తర్వాత ఏడాది ఏప్రిల్‌ వరకు ప్రయోజనాలు అందవు.

AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో పొత్తు పొడిస్తే..బీజేపీ ఆశిస్తున్న స్థానాలివే, ఇవాళ అమిత్ షాతో చంద్రబాబు భేటీ

AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ పొత్తు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షపార్టీలు తెలుగుదేశం-జనసేన ఇప్పటికే జతకట్టాయి.
ఇక బీజేపీ కలుస్తుందా లేదా అనేది మరో 4-5 రోజుల్లో తేలిపోనుంది. ఈ క్రమంలో బీజేపీ కొన్ని కండీషన్స్ విధించింది. వాటికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారో లేదో తేలాల్సి ఉంది.

ఏపీలో బలంగా పాతుకుపోయున్న వైఎస్ జగన్‌ను ఓడించాలంటే జనసేనతో పాటు బీజేపీ పొత్తు కూడా అవసరమనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకే బీజేపీ పొత్తు గురించి స్పష్టం చేయకపోయినా వేచి చూస్తోంది. పొత్తులపై త్వరలోనే స్పష్టత రావచ్చని తెలుస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ఛీప్ జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకు కేటాయించే ఎంపీ, లోక్‌సభ స్థానాలపై చర్చించనున్నారు. ఇవాళ చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డాతో జరిగే చర్చల్లో అంశాలపై ఈ నెల 9వ తేదీన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం-జనసేనతో కలిస్తే బీజేపీ కొన్ని షరతులు విధించనున్నట్టు సమాచారం.

పొత్తులో భాగంగా బీజేపీ 10-15 ఎమ్మెల్యే స్థానాలు, 4-5 ఎంపీ స్థానాలు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 బీజేపీ 4 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెల్చుకుంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు అదనంగా కొన్ని స్థానాలు ఆశిస్తోంది. గతంలో గెలిచిన విశాఖపట్నం, నర్శాపురంతో పాటు రాజమండ్రి, ఏలూరు, కాకినాడ స్థానాల్ని ఆశిస్తోంది. హీనపక్షం 10-12 స్థానాలు, 2-3 ఎంపీ స్థానాలకు తగ్గదని తెలుస్తోంది.

జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు 25 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు తగ్గకుండా కేటాయించాల్సి వస్తుంది. అంటే బీజేపీ-జనసేన రూపంలో 35-37 అసెంబ్లీ, 4-6 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకు తగ్గిపోతాయి. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న దాదాపు 40 మందిపై ప్రభావం పడవచ్చు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో అధికార పార్టీ అన్ని సామాజిక సమీకరణాలతో అభ్యర్ధుల్ని ప్రకటిస్తున్నప్పుడు తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు పొడిస్తే సమీకరణాలు దాటుకుని టికెట్ కేటాయించడం కష్టం కానుంది.

Motovolt Urban E-Bike: లైసెన్స్ అవసరమే లేని ఈ-బైక్ ఇది.. ధర కేవలం రూ. 50వేల లోపే.. సిటీ అవసరాలకు బెస్ట్..

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది. అది ఇంకా పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో వాటి వృద్ధి సాధ్యం కావడం లేదు.
దీనికి ప్రధాన కారణం వాటి ధరలు. అవును ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు రూ. లక్ష పైనే ఉంటున్నాయి. ఈ క్రమంలో అనువైన బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఇదే అంశంపై ఫోకస్ పెట్టిన ఓ కంపెనీ అత్యంత అనువైన ధరలో మంచి శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. అంతేకాక దీనిని రైడ్ చేయడానికి లైసెన్స్ కూడా అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పేరు మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 120కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది చూడటానికి చాలా స్టైలిస్ గా ఉంటుంది. అలాగే రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ ధర, లభ్యత..

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ రూ. 49,999 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేవలం రెండు వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌పై 5 రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇది పెద్ద టైర్ సైజులు, సౌకర్యవంతమైన సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇది కొత్తగా వచ్చిన కొత్త తరం బైక్.

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ బ్యాటరీ..

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్‌లో భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. అది కేవలం 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది రహదారిపై 25 ఎంపీహెచ్ వేగంతో నడుస్తుంది. దీని బీఎల్డీసీ మోటార్ అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది రైడ్‌ను సున్నితంగా చేస్తుంది. ఈ ఈ-బైక్‌లో 36 V/20 Ah బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ కనెక్టివిటీ..
ఈ-బైక్ మొత్తం బరువు కేవలం 40 కిలోలు. ఇది రోడ్డుపై నియంత్రణ, రైడ్ చేయడం సులభం చేస్తుంది. మోటోవోల్ట్ అర్బన్‌లో ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తో వస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున డ్యూయల్ షాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ చక్రాలు..

దీని రెండు టైర్లలో డిస్క్ బ్రేకులు అందిచారు. ఇది పెద్ద 20-అంగుళాల చక్రాలను కలిగి ఉంది. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మోటోవోల్ట్ బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 అర్బన్ మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ తో పోటీపడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు..
మోటోవోల్ట్ అర్బన్ ఇ-బైక్‌ను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అదనంగా, దానిని నమోదు చేయవలసిన అవసరం కూడా లేదు. వాస్తవానికి, నిబంధనల ప్రకారం, భారతదేశంలో 16-18 ఏళ్ల వయస్సు గల వారు మాత్రమే గేర్‌లెస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నడపగలరు. అటువంటి వాహనాల గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఇది కూడా అంతే వేగంతో ప్రయాణించగలుతుంది.

ఒకప్పుడు సర్పంచ్.. ఇప్పుడు న్యాయమూర్తి.. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సంతోషలక్ష్మి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే

ప్రస్తుత కాలంలో కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించి సత్తా చాటాల్సి ఉంటుంది. ఒకప్పుడు సర్పంచ్ గా పని చేసిన సంతోషలక్ష్మి తన ప్రతిభతో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి గ్రామంలో జన్మించిన కర్రి సంతోషలక్ష్మి ( Karri Santhoshlakshmi )న్యాయమూర్తిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు.

గ్రామంలో సర్పంచ్ గా సేవలు అందించి ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంతోషలక్ష్మి ఆ తర్వాత న్యాయశాస్త్రం చదివారు. ఒకవైపు న్యాయశాస్త్రం చదువుతూనే మరోవైపు న్యాయమూర్తి కావాలనే ఆలోచనతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన సంతోషలక్ష్మి తాజాగా రిలీజైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాలలో సత్తా చాటారు. ఆమె సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

భర్త దువ్వాడ వెంకట్ కుమార్ చౌదరి( Duvvada Venkat Kumar Chaudhary ) ప్రోత్సాహం వల్లే కెరీర్ పరంగా సక్సెస్ దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఈ తరానికి చెందిన ఎంతోమందికి ఆమె స్పూర్తిగా నిలిచారని చెప్పవచ్చు. సంతోషలక్ష్మి ఐదు సంవత్సరాల పాటు గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సంతోషలక్ష్మి సక్సెస్ స్టోరి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

భవిష్యత్తులో సంతోషలక్ష్మి మరిన్ని విజయాలను సాధించాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంతోషలక్ష్మి టాలెంట్ కు సామాన్యులు సైతం ఫిదా అవుతున్నారు. చిన్న వయస్సులోనే జూనియర్ సివిల్ జడ్జిగా( Junior Civil Judge ) ఎంపికైన ఆమెను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సంతోషలక్ష్మిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ తరం విద్యార్థినులు సైతం ఎన్నో విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Car Tires: కారు టైర్లలో సాధారణ గాలికంటే నైట్రోజన్‌ గాలితో ప్రయోజనాలు ఏంటి?

సాధారణ గాలితో పోలిస్తే, నైట్రోజన్ గాలిని నింపడం వల్ల కారు టైర్ల జీవితకాలం పెరుగుతుంది. సాధారణ గాలితో పోలిస్తే ఈ నైట్రోజన్‌ గాలి నింపడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి టైర్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంటే, ఈ గాలి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు వాహనం మైలేజీని పెంచుకోవాలనుకుంటే టైర్లే కాకుండా నైట్రోజన్ గాలి కూడా కీలక పాత్ర పోషిస్తుందని..
పెట్రోల్ పంపులో ఇంధనం నింపిన తర్వాత పంపు వద్ద అమర్చిన నైట్రోజన్ గ్యాస్ మిషన్‌ను మీరు ఎప్పుడైనా చూశారా? ఇప్పటి వరకు మనం కారు టైర్లలో సాధారణ గాలితో నింపుతున్నామని, అప్పుడు టైర్లలో నైట్రోజన్ గాలిని నింపాల్సిన అవసరం ఏముందని మీరు కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. సాధారణ గాలితో పోలిస్తే కారు టైర్లలో నైట్రోజన్ గాలి ఐదు ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి.
టైర్లకు నైట్రోజన్ గాలిని నింపడం వల్ల టైర్ల జీవితకాలం పెరుగుతుంది. అంతేకాదు వాహనానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. మరి సాధారణ గాలి కంటే నైట్రోజన్ వాయువు టైర్లకు ఎందుకు మేలు చేస్తుందో తెలుసుకుందాం?
సాధారణ గాలితో పోలిస్తే, నైట్రోజన్ గాలిని నింపడం వల్ల కారు టైర్ల జీవితకాలం పెరుగుతుంది. సాధారణ గాలితో పోలిస్తే ఈ నైట్రోజన్‌ గాలి నింపడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి టైర్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంటే, ఈ గాలి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

మీరు వాహనం మైలేజీని పెంచుకోవాలనుకుంటే నాణ్యమైన టైర్లే కాకుండా నైట్రోజన్ గాలి మంచిది. సాధారణ గాలి వల్ల టైర్ త్వరగా డీఫ్లేట్ అవుతుంది. టైర్‌లోని గాలి పీడనం తగ్గుతుంది. ఇది టైర్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన కారు మునుపటి కంటే తక్కువ మైలేజీని ఇస్తుంది. అలాగే నైట్రోజన్ గాలి ఈ సమస్యను అధిగమించి మైలేజీని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
టైర్‌లో అధిక వేడి ఉత్పన్నమైతే, కారు టైర్లు పగిలిపోయే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించడం వల్ల టైర్‌లోని టెంపరేచర్‌ని మెయింటెయిన్ చేసి టైర్లు పగిలిపోయే అవకాశం ఉండదు.
పెట్రోల్ పంపుల వద్ద మీరు సాధారణ గాలిని ఉచితంగా ఎక్కిస్తుంటారు. కానీ మీరు నైట్రోజన్ గాలి కోసం కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టైర్‌లో నైట్రోజన్ గాలి నింపితే ఒక్కో టైరుకు 20 రూపాయలు తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రూ.10 మాత్రమే తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛార్జీలలో తేడాలు ఉండవచ్చని గుర్తించుకోండి.

Foldable House : మడత పెట్టే ఇల్లు వచ్చేసిందోచ్..ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

కుర్చీని మడత పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ మడత పెట్టే ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా?.. ఏంటి అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదూ..
అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది.. చిన్న వయసు నుంచే తమకు ఇలాంటి ఇళ్లు కావాలో ప్లాన్లు వేస్తూ వుంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష్టపడుతూ వుంటారు.. ఇప్పుడు మామూలు ఇళ్లను కొనాలి అంటే చాలా కష్టం.. ఎందుకంటే అవి లక్షల్లో ఉంటాయి.. ఇంకా బాగా కావాలంటే కోట్లు కూడా పెట్టాలి..

ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకు చాలా మంది రకాలుగా ఇంటిని నిర్మిస్తు ఉంటారు.. మనం నిత్యం ఇలాంటివి వార్తల్లో చూస్తూనే ఉంటాం.. అయితే ఇప్పుడు మడత పెట్టే ఇల్లు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అమెరికాకు చెందిన 23 ఏళ్ల టిక్‌టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన జెఫ్రీ బ్రయంట్ టిక్‌టాక్‌లో పంచుకున్న ఈ వీడియో వైరల్‌గా మారింది…

ఆ ఇంటి ధర అక్షరాల రూ. 21 లక్షలకు పైనే ఉంటుంది.. 16.5 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏంటో తెలుసో.. ఫోల్డ్ చేయడం. ఈ చిన్న ఫ్లాట్‌లో షవర్, టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూమ్ వున్నాయి. బ్రయంట్ మాత్రమే కాదు.. పెరుగుతున్న అద్దెలు, అడ్వాన్స్‌లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఇలాంటి చిన్న ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.. ఈ ఇంటి వీడియో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను ఒక్కసారి చూసేయ్యండి..

Foldable House : ఇదేందయ్యా ఇది.. అమెజాన్‌లో ఫోల్డబుల్ హౌస్ కొనుగోలు చేసిన వ్యక్తి.. రేట్ ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యువకులు ఇల్లు కొనలేకపోతున్నారు.ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి.
అందుకే ఇంటిని సొంతం చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.తాజాగా అమెరికాకు చెందిన 23 ఏళ్ల యువకుడు అమెజాన్ నుంచి ఇల్లు కొనుగోలు చేశాడు.

అదేంటి అమెజాన్ ఇళ్లు కూడా అమ్ముతుందా? అదేమైన బొమ్మ ఇల్లా అని అనుకోకండి.అది నిజమైన ఇల్లే, కాకపోతే ఫోల్డబుల్ హౌస్( Foldable house ).దాన్ని మడతపెట్టి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు.ఈ ఇంటి గురించి సదరు యూఎస్ వ్యక్తి టిక్‌టాక్‌లో వీడియో చేశాడు.

అతను అమెజాన్( Amazon ) నుంచి కొనుగోలు చేసిన తన కొత్త ఇంటిని చూపించాడు.అతని పేరు జెఫ్రీ బ్రయంట్( Jeffrey Bryant ), అతను లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్నాడు.
“నేను అమెజాన్‌లో ఇల్లు కొన్నాను.దాని గురించి పెద్దగా ఆలోచించలేదు కూడా” అని అతను వీడియోలో చెప్పాడు.

చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు.ఇప్పుడా వీడియో బాగా పాపులర్ అయింది.
ఇల్లు చాలా పెద్దది కాదు.ఇది 16.5 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది.దీని ధర 26,000 డాలర్లు (రూ.21,37,416).ఇందులో ఒక షవర్, ఒక టాయిలెట్, ఒక చిన్న కిచెన్, ఒక రూమ్, ఒక బెడ్‌రూమ్ ఉన్నాయి.

జెఫ్రీ చనిపోయాక తన తాత వదిలేసిన డబ్బుతో ఆ ఇంటిని కొన్నాడు.ఇలాంటి ఇల్లు కొన్నది జెఫ్రీ మాత్రమే కాదు.మరికొంత మంది ఆన్‌లైన్‌లో చిన్న ఇళ్లను కూడా కొనుగోలు చేశారు.
అవి చౌకగా, హాయిగా ఉండటం వల్ల తమకు నచ్చిందని చెప్పారు.ఒక వ్యక్తి అమెజాన్‌లో “థిస్ ఇస్ లవ్! ఇది చవకైనది, నాకు, నా కుక్కకు సరిపోతుంది! హైలీ రికమెండెడ్
” అని తెలిపింది.అయితే ఇంటర్నెట్‌లో కొంతమందికి అవి నచ్చలేదు.
వారు ఈ ఇంటిపై పెట్టే డబ్బు పెట్టడం వృధా అని అన్నారు.
ఆ ఇంటిని ఎందుకు కొన్నాడో జెఫ్రీ న్యూయార్క్ పోస్ట్‌తో వివరించాడు.”ఒక యూట్యూబర్ తన అమెజాన్ ఇంటిని అన్‌బాక్స్ చేయడం నేను చూశా.నేను కూడా అలాంటి ఒక ఇల్లు పొందడానికి వెబ్‌సైట్‌కి పరిగెత్తాను.

” అని చెప్పారు.అయితే అతను ఇల్లు కొనేయగానే అతడి పని అయిపోలేదు.

ఇంకా చాలానే ఇతర పనులు చేయాల్సి వచ్చింది.అతడు విద్యుత్, నీటిని కనెక్ట్ చేయాల్సి వచ్చింది.

అయితే ఈ ఇంట్లో తాను ఉండనని కూడా అతడు చెప్పాడు.ఉండడానికి స్థలం అవసరమైన వారికి అద్దెకు ఇస్తానని పేర్కొన్నాడు.

రియల్ ఎస్టేట్ ఏజెంట్‌తో కలిసి పని చేస్తూ ఫోల్డబుల్ ఇంటిని ఎక్కడంటే అక్కడ ఇన్‌స్టాల్ చేసి డబ్బు పొందాలని ఆశిస్తున్నాడు.

 

Hair Regrowth Tips : మందారను మీ జుట్టుకు ఈ విధంగా అప్లై చేస్తే బట్టతల దూరమవుతుంది

Hibiscus Benefits For Hair : మందార చెట్టు ఇంట్లో ఉంటే చాలు. దాని పూలు దేవుడి పూజకే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. దాని ఆకులు కూడా హెయిర్​ గ్రోత్​కి మంచివి.
అయితే మందార పువ్వు జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. ప్రకాశవంతమైన, సిల్కీ హెయిర్​ కోసం మీరు మందార పూలను ఉపయోగించవచ్చు. బట్టతలను దూరం చేయడంలో మందార ఎంతో ఎఫిక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు.

జుట్టు రాలిపోవడానికి వివిధ కారణాలు ఉంటాయి. మీకు జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు మీరు మీ హెయిర్​ కేర్​ రోటీన్​లో వీటిని చేర్చుకోవడం వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. బట్టతల రాకుండా, చుండ్రును దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. పొడిబారిన సమస్యను దూరం చేస్తూ.. జుట్టును డీప్ కండీషన్ చేస్తుంది. జుట్టు మెరిసిపోవడాన్ని ఆలస్యం చేస్తుంది. అయితే మందారను మీరు నేరుగా ఉపయోగించవచ్చు. కానీ వాటిని వివిధ పదార్థాలతో కలిపి అప్లై చేసినప్పుడు అది మరింత ఎఫెక్టివ్​గా పని చేస్తుంది. ఇంతకీ మందారను ఎలాంటి పదార్థాలతో తలకు అప్లై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగుతో కలిపి..

పెరుగుతో మందారను కలిపి తయారు చేసుకునే హెయిర్ మాస్క్ మీ జుట్టును బలంగా, మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా లోపలి నుంచి పోషణను అందిస్తుంది. ఓ మందార పువ్వు, 5 మందార ఆకులు, 5 టేబుల్ స్పూన్ల పెరుగుతో మీరు హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు. మీ జుట్టు పొడవును బట్టి వీటి కొలత మారుతుంది. ఆకులు, పువ్వులు కడిగి.. మిక్సీలో వేసుకుని పేస్ట్ చేయండి. దానిలో పెరుగు వేసి మెత్తని పేస్ట్​గా చేసుకుని హెయిర్​కి మాస్క్​గా అప్లై చేయవచ్చు. దీనిని గంటపాటు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ హెయిర్ మాస్క్​ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయవచ్చు.

ఉసిరి కాయలతో..

ఉసిరి, మందార హెయిర్​ మాస్క్​ మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును బలోపేతం చేస్తుంది. మందార పువ్వులు, ఆకులును పేస్ట్ చేసి లేదా వాటిని పొడిని ఉసిరి పొడితో కలిపి.. నీరు వేసి పేస్ట్​గా చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్​ను స్కాల్ప్​ నుంచి జుట్టు వరకు బాగా అప్లై చేసి 45 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. దీనిని కూడా మీరు వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు.

అల్లంతో..

అల్లం కూడా జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిని మందారతో కలిపి హెయిర్​ మాస్క్​గా అప్లై చేస్తే జుట్టు రీగ్రోత్ అవుతుంది. అల్లం రసం, మందార పూల పొడిని బాగా కలిపి మెత్తని పేస్ట్​గా అప్లై చేయాలి. ఈ పేస్ట్​ని మీ స్కాల్ప్​కు అప్లై చేయండి. అరగంట అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు దీనిని తలకు అప్లై చేయవచ్చు. బట్టతలతో ఇబ్బంది పడేవారికి ఈ మాస్క్ మంచి ఫలితాలు ఇస్తుంది. మందార పూలను ఈ విధంగా అప్లై చేసినప్పుడు వాటిలో పోషకాలు పెరిగి జుట్టుకు మంచి ఫలితాలు అందుతాయి.

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే మీరు తక్కువ నీరు తాగుతున్నారని అర్థం.. నిర్లక్ష్యం చేయవద్దు..!

Health Tips: మన బాడీలో 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. శరీరంలో జరిగే ప్రతి పనికి నీరు అవసరం ఉంటుంది. ఆహారం తీసుకోకుండా నీరు తాగుతూ ఒక వ్యక్తి వారం రోజులపాటు బతకవచ్చు.
అయితే నీరు తాగే పద్దతులు, నియమాలు చాలా మందికి తెలియవు. కాబట్టి ఒక వ్యక్తి తన శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రమే నీటిని తాగాలి. శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను విస్మరిస్తే డీహైడ్రేషన్ తీవ్రమైన సమస్య ఎదురవుతుంది. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.

నీటి కొరత వల్ల సమస్యలు

శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు అనేక సమస్యలు పెరుగుతాయి. వాటిలో యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం, అజీర్ణం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. ముఖంపై మొటిమలు రావడం ప్రారంభమవుతుంది. నీటి కొరత వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
డీ హైడ్రేషన్‌ లక్షణాలు

శరీరంలో నీటి కొరత కారణంగా మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే నీరు తాగాలి. నీరు లేకపోతే శరీరంలో విషపదార్థాలు పెరిగి ముఖంపై మొటిమలు రావడం మొదలవుతాయి. ఈ సమస్య ఉన్నట్లయితే నీటిని తాగడం ప్రారంభించాలి. నీరు లేకపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్‌లలో దురద, మంట మొదలవుతుంది. యూరిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట మొదలవుతుంది.

శరీరంలో నీటి కొరత కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చిన్న వయస్సులోనే ముడతలు ఏర్పడుతాయి. శరీరంలో నీరులేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. తలలో నిరంతరం నొప్పి ఉంటుంది. నీటి కొరత కారణంగా శరీరంలోని కండరాలలో నొప్పి, తిమ్మిర్లు, దృఢత్వం వంటి సమస్యలు మొదలవుతాయి. నీటి కొరత కారణంగా ఒక వ్యక్తి విపరీతమైన అలసట, ఒత్తిడి, గందరగోళానికి గురవుతాడు. దీని కారణంగా అతడికి చిరాకు పెరుగుతుంది.

పూజలో దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..

హిందూ ధర్మంలో( Hinduism ) దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మన దేశంలోని చాలా మంది ప్రజలు ఇంటిలో క్రమం తప్పకుండా దీపారాధనను చేస్తూ ఉంటారు.
అలాగే ఏ పూజ కార్యక్రమంలో ఆయన దీపాలు( lamps ) కచ్చితంగా వెలిగిస్తారు. ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి ఉంది. ఏ పూజ కార్యక్రమం అయినా దీపం వెలిగించడంతో మొదలవుతుంది. దీపం వెలిగించకుండా చేసే పూజలు అసంపూర్ణమని శాస్త్రాలలో ఉంది.

అందుకే పూజా సమయంలో దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తారు.అయితే దీపాలు వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.చాలా మంది ప్రజలు ఈ నియమాలను అస్సలు పాటించారు. దీని వల్ల వారు పూజ చేసిన శుభ ఫలితాలను పొందలేరు.

పూజ చేసిన ఫలితం పూర్తిగా పొందడానికి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి. మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే పూజ సమయంలో వెలిగించే దీపం ఎంతో శుభ్రంగా ఉండాలి.

అలాగే పూజలో ఉపయోగించే దీపం ఎక్కడ పగలకుండా ఉండాలి. ఇలాంటి దీపం ఉపయోగించడం అపశకునం అనే పండితులు చెబుతున్నారు. మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించేటప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి. అలాగే పూజా సమయంలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. పూజ మధ్యలో దీపం ఆరిపోవడం అశుభంగా భావిస్తారు. పూజ సమయంలో నెయ్యి దీపం( ghee lamp ) వెలిగించిన వెంటనే మరో నూనె దీపం వెలిగించకూడదు.దీపాన్ని పూజా స్థలంలో మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి.

నెయ్యి దీపం వెలిగిస్తే ఈ దీపాన్ని మీ ఎడమవైపున ఉంచాలి. మీరు నూనె దీపం వెలిగిస్తే దానిని మీ కుడివైపున ఉంచాలి. నూనె దీపం లో ఎర్రటి ఒత్తిని ఉపయోగించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇంటిలో వెలిగించే దీపానికి దూదిని ఉపయోగించి స్వయంగా వత్తులు చేసి వెలిగిస్తే శుభప్రదం అని చాలామంది ప్రజలు భావిస్తారు. ఎప్పుడూ పడమర దిశలో దీపాన్ని ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

Hair లైఫ్ స్టైల్: తలకు రంగు వేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?

ప్రస్తుతం జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు సైతం వస్తున్నాయి యువతకు. అంతేకాకుండా పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి.గతంలో కేవలం వృద్ధాప్యంలో మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి కానీ ఇప్పుడు సగటు పదిమందిలో కచ్చితంగా ఐదు మందికి సైతం తెల్ల వెంట్రుకలు రానే వస్తున్నాయి.
దీంతో వారు వెంట్రుకలకు రంగు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది అనేక రకాల దుష్ప్రభావాలకు కారణం అవుతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా జుట్టుకు రంగు వేసిన వెంటనే సైడ్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ముందుగా పసిగట్టకపోతే చాలా అనార్థానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొందరు తల వెంట్రుకలు చిక్కులు పడకుండా స్ట్రైట్ గా ఉండాలని అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. హెయిర్ స్ట్రైట్నర్ ఉపయోగించడం వల్ల మహిళలు గర్భాశయ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ డై కొన్నిసార్లు చర్మ ప్రతిచర్యకు కారణం అవుతుందట. అంతేకాకుండా చర్మం మీద మంట ఎరుపు బాడడం పొరలుగా చర్మం ఊడిపోవడం వంటివి జరుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
జుట్టు రంగులో ఉన్న రసాయనాలు కారణంగా ఇది మరింత ప్రభావం చూపుతోందట ఇలాంటి పరిస్థితుల్లో జుట్టుకు రంగు వేయకపోవడమే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. హెయిర్ డై వేసుకునేవారు చర్మా అలర్జీలు హస్తమాకు ఎక్కువగా గురవుతున్నారని ఒక అధ్యయనంలో తెలియజేశారు. జుట్టుకు రంగు వేయడం వల్ల అలర్జీ వచ్చిన వ్యక్తులు తల పైన ఎర్రటి దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి. ఇక అంతే కాకుండా హేరుడై వేసుకున్న వ్యక్తికి పడకపోతే వాటి వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా ఎన్నో నష్టాలు జరుగుతాయి. అయితే కేవలం తనకు గోరింటాకు పట్టించుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదట.

Palm Jaggery: అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారా? అయితే మీరు ఈ బెల్లం తిని చూడండి

Palm Jaggery: అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారా? అయితే మీరు ఈ బెల్లం తిని చూడండి..

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఉద్యోగం వ్యాపారం అంటూ ఇలా ఎవరికి వారు బిజీ లైఫ్ గడుపుతున్నారు.

ఈ బిజీలైఫ్ లో ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు కొందరు. అందుకే జీవితంలో డబ్బులతో పాటు రోగాలు అదే స్థాయిలో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆర్గానిక్ విధానంలో పండించిన ఆహారాన్నే తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తున్న మాట. దీంతో ఇటీవల కాలంలో సహజసిద్ధమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న బెల్లం కూడా మనిషి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే బెల్లం కంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తాటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలట.

ఈ బెల్లాన్ని ఉదయాన్నే టీ కాఫీలో ఉపయోగించుకోవడం ఇతర పదార్థాల్లో కలుపుకుని తినడం ద్వారా మన కడుపులో ఉండే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మూల వ్యాధులతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్యకు తాటి బెల్లం మంచి ముందుగా పనిచేస్తుందని ఇప్పటికే దానిని ఉపయోగించినవారు వివరిస్తున్నారు. అజీర్ణం, గ్యాస్ వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని వారు అంటున్నారు. అయితే షుగర్ పేషెంట్లు ఈ తాటి బెల్లం వాడొచ్చా లేదా అన్నది వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ తాటిబెల్లం ఎలా తయారవుతుందంటే!

సాధారణ బెల్లం చెరుకు ద్వారా తయారు చేస్తారు. అయితే తాటి బెల్లాన్ని మాత్రం కేవలం తాటికల్లు ఉపయోగించి తయారు చేస్తారట. ఈ బెల్లంలో కొన్ని రకాల సహజ ఔషధ గుణాలు ఉండటంతో తాటి బెల్లానికి అంత గిరాకీ ఉంది. మామూలుగా కేజీ బెల్లం రూ.40 ఉంటే, తాటి బెల్లం మాత్రం రూ.200 నుండి రూ.300 వరకు రేటు పలుకుతుంది. ఈ తాటి బెల్లంలో మిరియాలు, సొంటి పొడులను కలుపుతూ ప్రత్యేకంగా అందిస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలో ఈ తాటి బెల్లం విరివిగా అందుబాటులో ఉంది. తమిళనాడు నుంచి తాటి బెల్లాన్ని దిగుమతి చేసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) తో పాటు విశాఖపట్నం (Visakhapatnam), శ్రీకాకుళం (Srikakulam) వరకు అమ్మకాలు చేస్తున్నారు.

మూత్రంలో మంట, నొప్పి, యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా శరీరంలో వేడి ఉండదు

Urine infection Home Remedies in Telugu :

మూత్రంలో మంట, నొప్పి, యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా శరీరంలో వేడి ఉండదు

ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఈ రోజుల్లో అసలు కంగారూ పడవలసిన అవసరం లేదు. డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ప్రస్తుత కాలంలో అనేక మంది మూత్రంలో మంట, ఇన్ ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు.

దీనికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత పెరిగి కిడ్నిల్లో రాళ్లు మరియు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (యు.టి.ఐ) ఏర్పడే అవకాశం ఉండటమే.యూటిఐ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ )అత్యంత సాధారణ సమస్య. దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి.

ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పటికబెల్లం, పావు స్పూన్ ఉప్పు వేసి 7 నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే మూడు రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది.ఈ నీటిని తాగటం వలన యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా కరుగుతాయి. ధనియాలు,పటికబెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ధనియాలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు.

అలాగే మంచి నీటిని ఎక్కువగా తాగాలి. ఆకుకూరలు,పండ్లను తప్పనిసరిగా తినాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తూ డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఉంటే యూరిన్ ఇన్ ఫెక్షన్ నుండి చాలా త్వరగా బయట పడవచ్చు. యూరిన్ ఇన్ ఫెక్షన్ ఉన్నప్పుడూ విపరీతమైన బాధ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Mango Leaves Benefits: మామిడి ఆకుల పూజకే కాదు.. పోషకాల గని.. షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ మెడిసిన్..

Mango Leaves Benefits: మామిడి పండుని పండ్లలో రారాజు అంటారు. వేసవి సీజన్‌లో మీరు అనేక రకాల మామిడి పండ్లు లభిస్తాయి. మామిడి పండ్లు రుచికి రుచి..

ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే మామిడి పండ్లు మాత్రమే కాదు.. మామిడి ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా. మామిడి ఆకులను సాధారణంగా పూజలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, బి, ఏ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మామిడి ఆకులు సహాయపడతాయి.. మామిడి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

మధుమేహానికి ప్రయోజనకరమైనది

మామిడి ఆకులను మధుమేహ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకులు చాలా మేలు చేస్తాయి. మామిడి ఆకులను ఎండబెట్టి పొడిని తయారు చేయండి. ఈ పొడిని క్రమం తప్పకుండా తినండి. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకుల నీటిని రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఈ ఆకులను ఉదయాన్నే వడపోసి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

మూత్రపిండాల్లోని రాళ్ల నివారణకు

మామిడి ఆకులు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మామిడి ఆకుల పొడిని వేయండి. రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఉదయాన్నే ఈ నీటిని తాగండి. ఈ నీరు మూత్రం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది.

బీపీ నియంత్రిస్తుంది

మామిడి ఆకులు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని కోసం మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకులను కషాయంగా సేవించండి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పొట్ట సంబంధిత ఆరోగ్యానికి

మామిడి ఆకులు అనేక పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. ఇందుకోసం మామిడి ఆకులను నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. పొట్ట సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఈ నీరు పనిచేస్తుంది.

జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది

మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అందువల్ల, మామిడి ఆకులు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయి.

(నోట్‌: ఇందులో అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

Garuda Mukku Kayalu : అత్యంత శక్తివంతమైన కాయలు ఇవి.. ఇంటి ప్రధాన ద్వారానికి కడితే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Garuda Mukku Kayalu : అత్యంత శక్తివంతమైన కాయలు ఇవి.. ఇంటి ప్రధాన ద్వారానికి కడితే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Garuda Mukku Kayalu : మనం పండ్లను, కాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని రకాల కాయలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసివస్తుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు.

అలాంటి వాటిలో గరుడ ముక్కు కాయలు కూడా ఒకటి. ఇవి గరుడ ముక్కు చెట్టు నుండి లభిస్తాయి. ఈ మొక్కను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తాయి. ఈ గరుడ ముక్కు కాయలు ఎంతో శక్తివంతమైనవి. ఈ కాయలు గరుత్మంతుని ముక్కులాగా, నాగ పడగలాగా ఉంటాయి. పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహద్వారాలకు కట్టేవారు. అలాగే ఇంట్లో పెట్టుకునే వారు. ఈ కాయలకు అతీంద్రియ శక్తులు ఉంటాయట. నర దిష్టి, నర పీడను, నర ఘోష వల్ల ఇంట్లోని వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇంట్లో డబ్బు నిలవక పోవడం, భార్యా భర్తల మధ్య గొడవలు ఇలా అనేక సమస్యలు వస్తాయి. ఈ కాయలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంటికి, ఇంట్లోని వారికి నరదిష్టి, నర ఘోష వంటివి తగలకుండా ఉంటాయి.

ఒక అమావాస్య రోజున 5 లేదా 11 ఎండిన గరుడ ముక్కు కాయలను సేకరించి వాటిని ఇంటికి తీసుకు వచ్చి ధూపం చూపించి వాటిని దండ లాగా గుచ్చి మరలా ధూపం చూపించి ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి పోతుంది. అంతేకాకుండా ఈ కాయలను ఇంట్లో ఎక్కడ ఉంచినా కూడా ఆ ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల శత్రు భయాలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం ప్రవాహంగా వస్తుందని పూర్వీకులు నమ్మేవారు. ఈ కాయలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో దరిదాపుల్లోకి కూడా భూత ప్రేత పిశాచులు అస్సలు రావట. ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. అంతేకాకుండా ఈ చెట్టు ఆకులు రాత్రి పూట ఆకాశాన్ని చూస్తూ తపస్సు చేస్తాయట. వీటిని రాత్రిపూట శబ్దం చేయకుండా, వాటి తపస్సుకు భంగం కలగకుండా చూడాలట. వీటి తపస్సుకు భంగం కలిగిస్తే ఈ చెట్లు శపిస్తాయని నమ్మేవారు.

గరుడ ముక్కు చెట్టును ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. తేలు విషాన్ని హరించడంలో ఈ మొక్క పని చేసినట్టు ఏ ఇతర మొక్క కూడా పని చేయదని నిపుణులు చెబుతున్నారు. తేలు కుట్టినప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని తేలు కాటుకు గురి అయిన ప్రాంతంలో వేసి ఆ దంచిన ఆకులను ఆ ప్రాంతంలో ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే తేలు విషం హరించుకుపోతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని మెడకు రాయడం వల్ల క్షయ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. అంతేకాకుండా ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఛాతి నొప్పి తగ్గుతుంది.

ఈ ఆకుల రసాన్ని గాయలపై, పుండ్ల పై రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. ఈ మొక్క వేరును ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ఈ కషాయం అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. ఈ విధంగా గరుడ ముక్కు చెట్టును ఉపయోగించి ఆరోగ్యంతోపాటు అదృష్టాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Kidney Stones : కిడ్నీల్లోని రాళ్లను కరిగించే మొక్క ఇది.. ఎక్కడ కనిపించినా వదలొద్దు..!

Kidney Stones : కిడ్నీల్లోని రాళ్లను కరిగించే మొక్క ఇది.. ఎక్కడ కనిపించినా వదలొద్దు..!

Kidney Stones : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి మన చుట్టూ పెరుగుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు.
అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇది చాలా చిన్నగా ఉంటుంది. తక్కువ పొడవు పెరుగుతుంది. దీని కొమ్మలకు కాయలు కాస్తాయి. దీన్ని సులభంగానే గుర్తు పట్టవచ్చు. అయితే ఈ నేల ఉసిరి మొక్క కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. 2004లో సైంటిస్టులు చేసిన పలు పరిశోధనల ప్రకారం.. నేల ఉసిరి మొక్క ఆకులకు కిడ్నీ స్టోన్లను కరిగించే శక్తి ఉన్నట్లు వెల్లడైంది. అందువల్ల కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ మొక్క ఆకులను తీసుకోవాలి. ఇక అందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నేల ఉసిరి మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లను తీసుకోవాలి. అందులో ఒక రెబ్బ నేల ఉసిరి ఆకులను వేయాలి. తరువాత నీటిని బాగా మరిగించాలి. నీళ్లు రెండు కప్పుల నుంచి ఒక కప్పు అయ్యే వరకు సన్నని మంటపై మరిగించాలి. తరువాత నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి.

Kidney Stones
ఈ విధంగా నేల ఉసిరి ఆకులతో కషాయం తయారు చేసుకుని రోజూ రెండు పూటలా తాగాలి. ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం ఒక గంట విరామం ఇచ్చి ఈ కషాయాన్ని తాగుతుండాలి. దీన్ని నెల రోజుల పాటు తాగితే తప్పక ఫలితం కనిపిస్తుంది. కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. మళ్లీ రాకుండా ఉంటాయి. ఇక ఈ ఆకుల కషాయం మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఈ కషాయం అందిస్తుంది. కనుక దీన్ని ఎక్కడ దొరికినా సరే ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేయండి. అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు.

Jeera Rice : జీరా రైస్ ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం.. తయారీ ఇలా..!

Jeera Rice : జీరా రైస్ ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం.. తయారీ ఇలా..!

Jeera Rice : మనం సాధారణంగా అన్నంతో తయారు చేసే రకరకాల ఆహార పదార్థాలలో జీరా రైస్ ఒకటి. జీరా రైస్ చాలా రుచిగా ఉంటుంది. కూరను తయారు చేసే సమయం లేనప్పుడు అన్నంతో జీరా రైస్ ను తయారు చేసుకొని తినవచ్చు.
అంతే కాకుండా జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక జీలకర్రతో చేసే ఈ జీరా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jeera Rice
జీరా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..

ఉడికించి చల్లార్చిన అన్నం – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్‌, బిర్యానీ ఆకు -ఒకటి, యాలకులు – 2 , లవంగాలు – 3, దాల్చిన చెక్క – 2 (చిన్న ముక్కలు), జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్‌, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 6 లేదా 7, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు – ఒక రెబ్బ, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌.

జీరా రైస్ తయారీ విధానం..

ముందుగా ఒక కళాయిలోనూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. ఇవి వేగాక జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇవి పూర్తిగా వేగాక.. ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మిరియాల పొడి వేసి కలిపి.. మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉంచిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే జీరా రైస్ తయారవుతుంది. జీరా రైస్ తయారీలో నూనె కు బదులుగా నెయ్యిని, అన్నం తయారీలో సాధారణ బియ్యానికి బదులుగా బాస్మతీ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. జీరా రైస్ ను నేరుగా లేదా కుర్మా వంటి కూరలతో కలిపి తినడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

Onion Chutney : ఉల్లిపాయ పచ్చడి ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..

Onion Chutney : మనం వంటింట్లో అనేక రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంటల తయారీలో కచ్చితంగా ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి.
చాలా మంది ఉల్లిపాయను వేయకుండా వంటలను తయారు చేయలేరు. ఇవి వంటల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.

ఉల్లిపాయలను వంటలలో ఉపయోగించడమే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చడిని, నెయ్యిని వేసుకుని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సులువుగా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Onion Chutney
ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..

పెద్దగా తరిగిన ఉల్లిపాయలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 10 నుండి 12, కరివేపాకు – గుప్పెడు, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చింతపండు – 10 గ్రాములు, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 3, ఉప్పు – తగినంత, నీళ్లు – కొద్దిగా.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 2, కరివేపాకు – ఒక రెబ్బ.

ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం..

ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత శనగ పప్పును, మినప పప్పును, ఎండు మిరపకాయలను, కరివేపాకును వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ధనియాలను, జీలకర్రను వేసి వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత చింతపండును, పసుపును, కొత్తిమీరను వేసి కలిపి రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ లో వేసిన వాటన్నింటినీ మెత్తని పొడిలా చేసుకోవాలి.

ఇలా చేసిన తరువాత ఇందులోనే వేయించిన ఉల్లిపాయలను, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని అన్నం, దోశ, ఊతప్పం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలను కేవలం కూరలలోనే కాకుండా ఇలా పచ్చడిగా కూడా చేసుకుని తినవచ్చు.

Barley Seeds: వీటిలొ శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్

బార్లీ లో ఉండే బి విటమిన్ నీటిలో కలిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని నీటిలో ఉడికించి.. నీటితో సహా తీసుకోవాలి.
Barley Seeds: బార్లీ గింజలు.

ఇవి ఒక రకం గడ్డి జాతి గింజలు. బార్లీ గింజలు మనకు ఆహారంగా, ఔషధంగా పని చేస్తాయి. వీటిలో పిండి పదార్థాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. అరుగుదల శక్తిని పెంచడంలో బార్లీ ఎంతగానో ఉపయోగపడతాయి.

ఒక కప్పు ఉడికించిన బార్లీ గింజల్లో 4.5 గ్రాముల పీచు పదార్థాలు, 12.5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటుంది. అంతే కాకుండా బార్లీ లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి.

గ్లూటెన్ పదార్థాలతో ఎలర్జీ ఉండే వాళ్లు వీటిని తీసుకోకపోవడమే మంచిది. బార్లీ గింజలను తడి లేని,

గాలి తగలని డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల పోషకాలను కోల్పోకుండా కొన్ని నెలల వరకు తాజాగా ఉంటాయి.

వివిధ రకాల సూప్ ల తయారీలో కూడా బార్లీ గింజలను ఉపయోగిస్తారు.

బార్లీ లో ఉండే బి విటమిన్ నీటిలో కలిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని నీటిలో ఉడికించి.. నీటితో సహా తీసుకోవాలి.

మద్యపానం తయారీలో కూడా ఈ బార్లీ గింజలను ఉపయోగిస్తారు. బార్లీ గింజలను నాన బెట్టిన నీటిని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న నీటి శాతం తగ్గుతుంది.

ఒంట్లో నీరు చేరిన గర్భిణీ స్త్రీలు ఈ బార్లీ గింజలు నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్య సమస్యల కారణంగా బలహీనంగా, నీరసంగా ఉన్న వాళ్లు బార్లీ నీటిని తాగడం వల్ల నీరసం తగ్గుతుంది.

అంతే కాకుండా వీటితో ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినడం వల్ల త్వరగా, తేలికగా జీర్ణమవుతాయి.

బార్లీ గింజల నుండి తీసిన నూనెను వాడడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికానికి బార్లీ నీళ్లు, సగ్గుజావ తాగించేవాళ్లు పెద్దలు.

అయితే, కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది.

వేసవిలో అరగుదలతో బాధపడే వారు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది

పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు.

ఎండప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి.

మధుమేహం ఉన్న వారికి బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది.

ఇన్సులిన్‌ కూడా అదుపులోనే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.

మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్‌.

ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి.

BREAKING: రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కీలక అధికారికి రిజైన్ చేయాలని ఆర్డర్

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల విషయంలో వివాదం నడుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది.
ఇందులో భాగంగా సీనియర్ అధికారి ఈఎన్సీ మురళీధర్‌ రావును ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆదేశించారు. మరో వైపు రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ చార్జ్ వెంకటేశ్వరరావును సర్వీస్ నుండి తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక, కేఆర్ఎంబీ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది. మరికొందరు ఇంజనీర్లపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనున్న వేళ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

Special accounts for children in SBI…!! ఎస్బిఐ లో పిల్లల కోసం ప్రత్యేకమైన అకౌంట్లు…!!

Special accounts for children in SBI…!!

ఎస్బిఐ లో పిల్లల కోసం ప్రత్యేకమైన అకౌంట్లు…!!

Special accounts for children in SBI…!! ఎస్బిఐ లో పిల్లల కోసం ప్రత్యేకమైన అకౌంట్లు…!!
దేశంలోనే ఎక్కువ ఖాతాదారులు గల బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అయితే అందిస్తోంది.

వీటిల్లో ప్రత్యేకమైన సేవలు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా బ్యాంక్ (Bank) సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు కూడా అందిస్తోంది. రెండు రకాల ప్రత్యేకమైన అకౌంట్లు అందుబాటులో ఉంచింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.

ఎస్‌బీఐ మైనర్లకు పెహ్లా కదమ్, పెహ్లి ఉడాన్ పేర్లతో పిల్లలకు సేవింగ్స్ ఖాతా సేవలు అందిస్తోంది. వీటి ద్వారా మీరు మీ పిల్లలకు పొదుపు గురించి అయితే తెలియజేయవచ్చు. చిన్నప్పటి నుంచే వారికి సేవింగ్స్ అలవాటు చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. ఇది ఊరట కలిగించే విషయం .
పెహ్లా కదమ్, పెహ్లి ఉడాన్ అకౌంట్ సర్వీసులు ద్వారా పొదుపు మాత్రమే కాకుండా పిల్లలకు కొనుగోలు విలువను కూడా తెలియజేయవచ్చని ఎస్‌బీఐ పేర్కొంటోంది. పర్సనల్ ఫైనాన్స్ ఆవశ్యకతను పిల్లలను చిన్నతనం నుంచే తెలియజేయొచ్చు. ఈ అకౌంట్ తెరవడ వల్ల మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు కూడా పొందవచ్చు.

ఈ చిల్డ్రన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే చెక్ బుక్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు.. అకౌంట్ ఓపెన్ చేస్తే 10 చెక్కులతో కూడిన చెక్ బుక్ ఇస్తారు. పిల్లల పేరుపై చెక్ జారీ చేస్తారు. గార్డియన్స్‌కు ఈ చెక్ బుక్ అందిస్తారు. ఇంకా ఏటీఎం కార్డు కూడా లభిస్తుంది. కార్డుపై పిల్లల ఫోటో వస్తుందట.విత్‌డ్రాయెల్ లిమిట్ రూ. 5 వేలు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రోజుకు రూ.2 వేల ట్రాన్సాక్షన్ నిర్వహించొచ్చు.
ఏ వయసులో ఉన్న మైనర్లు అయినా సరే పెహ్లా కదమ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అదే పెహ్లి ఉడాన్ అకౌంట్ అయితే పదేళ్లకు పైన వయసు ఉన్న వారు మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇంకా ఈ అకౌంట్లకు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాల్సిన పని అయితే లేదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు వర్తించే వడ్డీ రేటే వీటికి వర్తిస్తుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్‌బుక్ ఉచితంగానే అందిస్తారట.అలాగే ట్రాన్స్‌ఫర్ ట్రాన్సాక్షన్లకు ఇంటర్ కోర్ చార్జీలు కూడా ఉండవు. మీ పిల్లల పేరుపై ఇంకా అకౌంట్ ఓపెన్ చేయకపోతే.. వెంటనే ఆ పని పూర్తి చేయండి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేయాలి

Bells in Temples – దేవాలయాల్లో గంటలు ఎందుకు పెడతారు?

Bells in Temples – దేవాలయాల్లో గంటలు ఎందుకు పెడతారు?

గంట ఓం శబ్ధానికి లేదా సృష్టి శబ్ధానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే గంట కొడతారు. అన్ని రకాల వాస్తు దోషాలు కూడా గంట మోగించడం ద్వారా తొలగిపోతాయి. గంట శబ్దం క్రమం తప్పకుండా ఎక్కడ వస్తుందో, అక్కడి వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది.

స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల మనిషికి వంద జన్మల పాపాలు నశిస్తాయి. గంట మోగించడం ద్వారా దేవతల ముందు మీరు హాజరు గుర్తించబడుతుందని చెబుతారు.

గంట శబ్దం కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియా, వైరస్‌లు మొదలైనవాటిని నాశనం చేస్తాయి. లయబద్ధమైన గంట శబ్దం మనస్సు నుండి ఉద్విగ్నతను తొలగించి శాంతిని ఇస్తుంది.

నిరంతరం గంటను మోగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కాలచక్రానికి ప్రతీకగా గంటను పరిగణిస్తారు. ఆలయంలోని దేవత లేదా దేవతల హారతి సమయంలో గంట మోగిస్తారు.

టాయిలెట్ కు వెళ్ళినప్పుడు చిటికెన వేలు ఎందుకు చూపిస్తారో తెలుసా ?

టాయిలెట్ కు వెళ్ళినప్పుడు చిటికెన వేలు ఎందుకు చూపిస్తారో తెలుసా ?

Do you know why you show your little finger when you go to the toilet?

టాయిలెట్ కి చిన్నంగా చిటికెన వేలును చూపిస్తాము. మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అర్జెంటుగా టాయిలెట్ వస్తే మనం నిలబడి చేసేది మన చిటికెన వేలును టీచర్ కి చూపిస్తూ పర్మిషన్ అడగడం అసలు ఎప్పుడైనా ఆలోచించారా?

లేదా డౌట్ వచ్చిందా? టాయిలెట్ కి సిగ్నల్ గా చిటికెన వేలును ఎందుకు చూపిస్తాం అని, అయితే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం!

మన పురాతన భారతీయ బోధనల ప్రకారం మన చేతి యొక్క ఐదు వేళ్ళు అనేవి మానవ జీవితాన్ని రూపొందించిన ప్రకృతి లోని ఐదు ప్రాథమిక మూలకాలను సూచిస్తున్నట్టుగా తెలిపారు. అవేమిటంటే 1.ఆకాశం, 2.వాయువు, 3.అగ్ని, 4.భూమి, 5.నీరు ఈ ఐదు మూలకాలు మన చేతిలో ఉన్న వేళ్లను సూచిస్తాయి. మన బ్రొటనవేలు అగ్నిని, చూపుడువేలు గాలిని, మధ్య వేలు ఆకాశాన్ని, ఉంగరపు వేలు భూమిని, చిటికెన వేలు నీటిని సూచిస్తుంది. అందువలన మన శరీరంలో ఉన్న నీరు పరిమితి దాటి అదనపు స్థాయికి చేరుకున్నప్పుడు ఆ నీటిని తొలగించేందుకు నీటిని సూచించే ఈ చిటికెన వేలును సిగ్నల్ గా చూపించడం ప్రారంభించారు. అంటే దాని అర్థం ఆ వ్యక్తి మలమూత్రానికి వెళ్లాలని కోరడం. అయితే అలా టాయిలెట్ కి వెళ్లడం కోసం సిగ్నల్ గా చిటికెన వేలును చూపించడం అనేది కేవలం మన భారతదేశంలో మాత్రమే మరి ఇతర ఏ దేశాల్లో లేదు.

ఎందుకంటే ఈ సిగ్నల్ అనేది మన హిందూ పురాతన బోధనల ప్రకారం అవలంబిస్తూ నేటికీ వచ్చాం కాబట్టి. మరి వేరే దేశాల్లో ఈ చిటికెన వేలును ఒక బీర్ ఇవ్వు అని అడగడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా అమెరికాలో బీర్ కోసం ఇలా అడుగుతారు. సాధారణంగా ఈ దేశాలలో పబ్ లలో, రెస్టారెంట్లలో మ్యూజిక్ అనేది బిగ్గరగా ఉంటుంది కాబట్టి, కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తిని బీర్ ఇవ్వమని కస్టమర్ అడిగేందుకు ఇలా చిటికెన వేలును సిగ్నల్ గా చూపిస్తాడు.

ఇంకో డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. టాయిలెట్ కోసం అయితే సింగిల్ నంబర్ ని, టు టాయిలెట్ కోసం మాత్రం టూ నంబర్ ని ఎందుకు చూపిస్తామని, నిజానికి దీనికి అంటూ రెండు రకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. కానీ మీకు చెప్తాను. నెంబర్ వన్ ని టాయిలెట్ కి సూచించడానికి కారణం టాయిలెట్ కి ఒక నిమిషం సమయంలో అయిపోతుంది అని, ఇక నంబర్ టు ని టు టాయిలెట్ కి సూచించడానికి కారణం ఏమిటంటే ఇది పూర్తయ్యేందుకు రెండు నిమిషాలు సమయం పడుతుందని ఇలా ఈ నంబర్లను కేటాయించారని అంటారు.

Sukanya Samriddhi Yojana: ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన కింద ముగ్గురు కుమార్తెల పేరుపై ఖాతాలు తీయవచ్చు.. ఎలాగంటే..

Sukanya Samriddhi Yojana: ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన కింద ముగ్గురు కుమార్తెల పేరుపై ఖాతాలు తీయవచ్చు.. ఎలాగంటే..

దేశంలోని మహిళలు, బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం. ఈ పథకంలో కుమార్తెల పేరుపై తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతా తెరిచినప్పుడు మీరు ప్రతి నెలా మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం కింద ప్రతి ఖాతాదారుడు డిపాజిట్ చేసిన మొత్తంపై 7.6 శాతం వడ్డీ రేటు పొందుతారు.

మీరు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 250 నుండి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద మీరు 10 సంవత్సరాల వరకు ఆడపిల్లల కోసం ఖాతాను తెరవవచ్చు. మీరు ఈ ఖాతాను బ్యాంక్ లేదా ఏదైనా పోస్టాఫీసులో తెరవవచ్చు. ఈ పథకం కింద ఏదైనా పెట్టుబడిదారుడు మొత్తం 14 సంవత్సరాలకు గరిష్ట పెట్టుబడి పరిమితిని పొందుతాడు. దీని తరువాత, బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో మిగిలిన మొత్తాన్ని 21 సంవత్సరాల వయస్సు తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా (SSY ఖాతా)లో జమ చేసిన డబ్బును ఉపసంహరించుకునే హక్కు కుమార్తెకు ఉందని గుర్తుంచుకోండి. 18 సంవత్సరాలలో ఆమె తన చదువుల కోసం, 21 సంవత్సరాల తర్వాత తన వివాహ ఖర్చుల కోసం ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ముగ్గురిపై ఖాతా తీయడం ఎలా?

సుకన్య సమృద్ధి యోజన కింద తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఖాతాలను తెరవడానికి అనుమతి పొందుతారు. అటువంటి పరిస్థితిలో మూడవ ఆడపిల్ల సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి అనుమతి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తికి మొదటి బిడ్డలో ఒక కుమార్తె, రెండవ సారి కవలలు జన్మించినట్లయితే. అటువంటి పరిస్థితిలో ముగ్గురు బాలికలందరికీ సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. తల్లిదండ్రులు ముగ్గురు బాలికల పేరు మీద సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ పథకం కింద గుర్తించదగ్గ విషయం ఏమిటంటే, ముగ్గురు కుమార్తెల ఖాతాకు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఇవ్వబడింది. ఈ పథకం కింద 7.6 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఈ పథకంలో ఆదాయం ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ -10 ప్రకారం పూర్తిగా పన్ను ఆదా పొందవచ్చు. అలాగే స్కీమ్‌లో చేసిన పెట్టుబడి చట్టంలోని సెక్షన్ 80-సి కింద మినహాయింపుకు అర్హత పొందుతుంది.

Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..

Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..

ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సదుపాయం వినియోగదారులు రూపే క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్‌తో లింక్ చేసుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేసిన తర్వాత, ఇప్పుడు కస్టమర్ కార్డ్‌ని స్వైప్ చేయకుండానే ఉపయోగించవచ్చు. UPIకి కార్డ్ లింక్ చేసుకుంటే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, క్రెడిట్ కార్డ్ ఉపయోగం 30 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని, అయితే భారత్‌లో వ్యాపారం 6 శాతం తగ్గిందని ఫిన్‌టెక్ కంపెనీ మైండ్‌గేట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ఈ కొత్త విధానం క్రెడిట్ కార్డు వినియోగం పెంచడంలో ఉపయోగపడుతుంది ఆయన చెప్పారు.ఇక ఈ రూపే క్రెడిట్ కార్డులను ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే అందిస్తారు. సెప్టెంబర్ 20, 2022న NPCI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ కస్టమర్‌లు ముందుగా BHIM యాప్‌లో రూపే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.

యూపీఐతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ని ఎలా లింక్‌ చేయాలంటే..

* ఇందుకోసం ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో BHIM యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* అనంతరం ‘యాడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’ను సెలక్ట్‌ చేసుకొని, రూపే క్రెడిట్‌ కార్డును జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవాలి.
* అనంతరం రూపే క్రెడిట్ కార్డ్‌లోని చివరి ఆరు అంటకెలు, చెల్లుబాటు తేదీని ఎంటర్‌ చేయాలి.

* వెంటనే ఫోన్‌కు ఓటీపీ వెళుతుంది.

* చివరగా యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి.

Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింకలు, దోమలు, ఈగలను తరిమేయండిలా..!Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింకలు, దోమలు, ఈగలను తరిమేయండిలా..!

Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింకలు, దోమలు, ఈగలను తరిమేయండిలా..!

Cockroaches : మనం ఎంత శుభ్రం చేసినప్పటికి ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి కీటకాలు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. ఇలాంటి కీటకాలు వాలిన పదార్థాలను తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఈ కీటకాలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ కీటకాల నుండి బయట పడడానికి మనం అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని వాడడం వల్ల ఫలితం ఉన్నప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సహజ సిద్ద పద్దతిలో కూడా మనం కీటకాలను ఇంట్లో నుండి తరిమివేయవచ్చు. దోమలు, ఈగలు, బొద్దింకలు వంటి వాటిని తరిమి కొట్టే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కా కోసం మనం కర్పూరాన్ని, సహజ సిద్ద పదార్థాలతో తయారు చేసిన అగర బత్తులను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కీటకాలను నశింపజేయడంలో కర్పూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. గాలి ద్వారా, నీటి ద్వారా వ్యాధులను కలిగించే కీటకాలను కూడా కర్పూరాన్ని ఉపయోగించి నశింపజేయవచ్చు. ముందుగా 5 కర్పూరం బిళ్లలను తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత 3 అగర బత్తులను కూడా పొడిగా చేసి ఈ రెండింటిని కలపాలి. ఇప్పుడు ముప్పావు గ్లాస్ నీటిలో ఈ పొడిని వేసి కలపాలి.

తరువాత ఈ నీటిని ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ నీటిని జల్లిగంటె సహాయంతో మరో గిన్నెలోకి వడకట్టుకుని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని బొద్దింకలు, ఈగలు, దోమలు ఉన్న చోట స్ప్రే చేయాలి. స్ప్రే బాటిల్ అందుబాటులో లేని వారు ఈ నీటిలో దూదిని ముంచి ఆ దూదిని బొద్దింకలు తిరిగే చోట ఇంట్లో మూలలకు, తలుపుల దగ్గర ఉంచాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు ఇంట్లోకి రాకుండా పోతాయి.అలాగే ఇంట్లో ఉన్న కీటకాలు బయటకు పోతాయి. మార్కెట్ లో దొరికే రసాయనాలు కలిగిన కీటక నాశనిలను వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వాడడం వల్ల ఈగలు, బొద్దింకలు, జిల పురుగులు, దోమలు వంటి కీటకాల నుండి విముక్తిని పొందవచ్చు.

Tradition భార్యాభర్తకి ఎటువైపు ఉండాలో.. అలా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా..

భార్యాభర్తకి ఎటువైపు ఉండాలో.. అలా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా..

మన దేశంలో చాలామంది ప్రజలు సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు.భార్యాభర్తలు ఇలా నిలబడాలో అనే దాని గురించి కూడా సంప్రదాయాలలో ఉంది. భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలని శాస్త్రం చెబుతోంది.
ముఖ్యంగా దానధర్మాలు పూజలు నోములు చేసేటప్పుడు భర్తకు భార్య తప్పనిసరిగా ఎడమవైపు ఉండడమే ఉండడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని చాలామంది వేద పండితులు చెబుతారు.

సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని సృష్టించేటప్పుడు తనలోని కుడి భాగాన్ని పురుషుడిగా, ఎడమ భాగాన్ని స్త్రీగా తీసుకొని ఆడా మగవారిని ఈ భూమిపై సృష్టించాడని పురాణాలలో ఉంది. శ్రీమహావిష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలోనే పదిలంగా భద్రపరచాడని చెబుతారు. అందువల్లే నిజజీవితంలోనూ భర్తకు భార్య ఎప్పుడూ ఎడమవైపే ఉండాలని చెబుతూ ఉంటారు. సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు అర్చకులు కొన్ని సూచనలు చెబుతూ ఉంటారు. అయ్యవారి రూపాన్ని చూడాలి అంటే ఎడమ కన్ను మూసి కుడి కన్నుతో చూడమని చెబుతూ ఉంటారు.
అదే అమ్మవారిని చూడాలనుకుంటే కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో చూడమని చెబుతూ ఉంటారు. దీనికి ఉన్న అర్థం ఏమిటంటే శరీరాన్ని రెండు భాగాలు చేస్తే కుడివైపు బలంగా ఉంటుంది. ఎడమ భాగం కుడివైపు కన్నా కాస్త బలహీనంగానే ఉంటుంది. కుడి వైపు ఉన్న ప్రతి భాగం ఎడమవైపు ప్రతి భాగం కన్నా ఎంతో కొంత బలంగానే ఉంటుంది. కుడి చేతికి ఉన్నంత బలం ఎడమ చేతికి ఉండదు. కుడి కన్ను కు ఉన్నంత దృష్టి ఎడమ కన్నుకు ఉండదు. కుడి సూర్యభాగం ఎడమ చంద్రభాగం అంటే కుడి వైపు సూర్య నాడి ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది.ఆభరణాలు చేయించుకున్న వారు కూడా కుడివైపు సూర్యుడు బొమ్మను, ఎడమవైపు చంద్రుడి బొమ్మను ఆభరణంగా చేయించుకుంటూ ఉంటారు. పగలు సూర్య నాడి రాత్రి చంద్రనాడీ ప్రకాశంవంతంగా ఉంటుంది. అందుకే పగలు నిద్రించేటప్పుడు ఎడమవైపు తిరిగి రాత్రి నిద్రి నిద్రపోయేటప్పుడు కుడివైపు తిరిగి నిద్రపోవాలి.

Viral Video: కళ్లు తెరిచి మూసేలోగా రంగు మారుస్తున్న చేప..వీడియో చూడండి..!

Color Changing Fish Video: నెట్టింటా ఎన్నో వైరల్ వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. ఇందులో పాముల వీడియోలు కోకొల్లలు. అయితే, మేమేం తక్కువా? అన్నట్లు ఈసారి ఓ చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటి వరకు రంగులు మార్చేది ఊసరవెల్లి అని మనం అనుకుంటాం. కానీ చేప కూడా రంగులు మారుతుందంటే మీరు నమ్ముతారా?

సోషల్ మీడియాల వల్ల ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మన ఇంట్లో కూర్చొనే చూడగలుగుతున్నాం. ఈరోజు మనం ఓ వైరల్ వీడియోను చూద్దాం. ఈ వీడియోలో చేప కన్ను తెరిచి మూసిన సెకన్లలోనే రంగులు మారుస్తోంది. ఇప్పటి వరకు రంగులు మార్చే ఊసరవెల్లిని చూశారు ఇప్పుడు చేపను కూడా చూడండి మరి.. ఈ వైరల్ వీడియోలో మీరు ప్రతి సెకనుకు చేప తన రంగును ఎలా మారుస్తుందో చూడవచ్చు. ఇది చూసిన ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
ప్రకృతి అన్ని జీవులకు వివిధ రూపాలు, విభిన్న సామర్థ్యాలను కూడా ఇచ్చింది. ఏదైనా జీవి మన ముందు కాస్త వింతైన పని ఏం చేసినా ఆశ్చర్యపడి మరి చూస్తాం. ప్రస్తుతం అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి సెకనుకు రంగు మారుతున్న చేపల వీడియో వైరల్‌గా మారుతుంది. ఈ ప్రత్యేకమైన చేప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో నిజమేనా? మన కళ్లు మోసం చేస్తున్నాయా? అనుకుని మళ్లీ మళ్లీ వీడియోను చూస్తున్నారు.

 

 

Health

సినిమా