Sunday, November 17, 2024

Blood Pressure ,Oxygen Level, Pulse, Temperature,HRCT/CT Scan Normal ,High ,Very High Details Every one must know the following General information

Blood Pressure ,Oxygen Level, Pulse, Temperature,HRCT/CT Scan Normal ,High ,Very High Details

Every one must know the following General information

Blood Pressure ,Oxygen Level, Pulse, Temperature,HRCT/CT Scan Normal ,High ,Very High Details Every one must know the following General information
Blood Pressure

● 120/80 — Normal

● 130/85 — Normal

● 140/90 — High

● 150/95 — Very High

Oxygen Level

Check Through Oximeter

● 94 – Normal

● 95 to 100 – Good

● 94 to 90 – Low

● Below 90- Very Low

(Required Oxygen Support)

PULSE

● 72 – PM – Standard)

● 60 – 80 PM – Normal)

● 90 – 120 PM – High

TEMPERATURE

● 92 – 98.6 F – Normal

● 99.0 F – Normal Fever

● 100F – 102 F – High Fever

HRCT/CT SCAN

● Score: 0 – 8 – Mild Infection.

● Score: 9 – 18 – Moderate Infection

● Score: 19 – 25 – Severe Infection

వంట గ్యాస్ సిలిండర్‌పై ఉండే ఈ కోడ్‌కు అర్థం ఏమిటో తెలుసా ?.. దీని ద్వారా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఇవే….

Do you know what this code on the cooking gas cylinder means?

వంట గ్యాస్ సిలిండర్‌పై ఉండే ఈ కోడ్‌కు అర్థం ఏమిటో తెలుసా ?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల స్కీములను అందుబాటులోకి తేవడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎల్‌పీజీ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఎల్‌పీజీ సిలిండర్లను వంటకు వాడుతున్నారు.

అయితే ఎల్‌పీజీ సిలిండర్లపై కొన్ని రకాల కోడ్స్ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు కదా. అవును.. వాటిపై చిత్రంలో చూపిన విధంగా B-13 అనే కోడ్స్ ఉంటాయి. అయితే వాటికి అర్థం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

మనకు ఏడాదిలో 12 నెలలు ఉంటాయి కదా. వాటిని 4 భాగాలుగా విభజిస్తారు. A, B, C, D అని ఉంటాయి. ఈ క్రమంలో A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అని అర్థం. అలాగే B అంటే ఏప్రిల్‌, మే, జూన్ అని, C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అని, D అంటే అక్టోబర్, నవంబర్‌, డిసెంబర్ అని అర్థం చేసుకోవాలి

ఇక పైన తెలిపిన కోడ్‌ను ఒకసారి డీకోడ్ చేస్తే.. B-13 అంటే.. సదరు సిలిండర్‌కు ఏప్రిల్‌, మే, జూన్ నెలల్లో 2013 సంవత్సరంలో టెస్టింగ్ చేయాలి అని అర్థం. మనకు సరఫరా చేసే సిలిండర్లపై ఇవే కోడ్‌లు ఉంటాయి. అయితే మనకు వచ్చే సిలిండర్లపై టెస్టింగ్ అయిపోయిన ఏడాది ఉండదు. టెస్టింగ్ కాబోయే ఏడాది రాసి ఉంటుంది.

అంటే ఇప్పుడు 2021 కనుక మనకు వచ్చే సిలిండర్లపై B-22 అని ఉంటుంది. ఇలా నెలలను బట్టి కోడ్‌లు మారుతాయి. Bకి బదులుగా A, C, Dలు కూడా ఉండవచ్చు. ఆ కోడ్‌ను అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఆ కోడ్‌లో ఉన్న ఏడాది గడిచాక మనకు సిలిండర్ వస్తే దాన్ని వాడకూడదని, ప్రమాదమని గుర్తించాలి. ఎందుకంటే టెస్ట్ చేయాల్సిన సంవత్సరం దాటి పోతుంది కనుక ఆ సిలిండర్‌ను వాడకూడదు. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తలు వహించాలి.

Oldest Bank in World : ఇది ప్రపంచంలోనే అతి పురాతన బ్యాంకు..! డబ్బుకు బదులు విలువైన వస్తువులను ఉంచేవారు..

Oldest Bank in World : ఇది ప్రపంచంలోనే అతి పురాతన బ్యాంకు..! డబ్బుకు బదులు విలువైన వస్తువులను ఉంచేవారు..

Oldest Bank in World : తరచుగా ప్రజలు తమ డబ్బు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను బ్యాంకులో ఉంచుతారు. కానీ శతాబ్దాల క్రితం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేదని మీకు తెలుసా. కాకపోతే ప్రజలు ఈ బ్యాంకులో డబ్బుకు బదులు ధాన్యరాశులు, విలువైన వస్తువులను నిల్వ చేసేవారు. అటువంటి బ్యాంకు గురించి ఈ రోజు తెలుసుకుందాం. మొరాకో వరల్డ్ న్యూస్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం.. శతాబ్దాల క్రితం అమాజి సమాజంలోని ప్రజలు మొరాకోలో బ్యాంకులను ఉపయోగించారు. ఈ సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థను రాబాట్-ఇగుదార్ అని పిలుస్తారు. దీనిని ప్రపంచంలోని పురాతన బ్యాంకు అని చెబుతారు.

ఇక్కడ ప్రజలు బార్లీ, గోధుమలు, చట్టపరమైన పత్రాలను ఇందులో ఉంచేవారు.

రాయిటర్స్ వీడియో నివేదికను అనుసరించి అగాదిర్ ఆని పిలువబడే ఇగుదార్ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. యాహూ న్యూస్, ఇతర విదేశీ మీడియా సంస్థలు కూడా దీనిపై కవరేజ్ ఇచ్చాయి. చాలా మంది పరిశోధకులు ఈ అమాజిగ్ ధాన్యాగారాలను మానవ చరిత్రలో పురాతన బ్యాంకింగ్ వ్యవస్థలలో ఒకటిగా భావించారు. బార్లీ లేదా గోధుమలు, చట్టపరమైన పత్రాలు, నగలు వంటి వాటిని నిల్వ చేయడానికి దీనిని ఉపయోగించారు. మీడియా నివేదికల ప్రకారం ఈ ప్రారంభ బ్యాంకులను లామిన్ అనే కార్యదర్శి నిర్వహించేవారు. అప్పట్లోనే ఈ బ్యాంకును10 మందితో కూడిన కమిటీ నడిపించేదని తెలిసింది. దీనిని ఇన్ఫ్లాస్ అని పిలుస్తారు. ఈ కమిటీ వివిధ తెగల ప్రతినిధులతో రూపొందించబడిందని తేలింది.

Bommalamma Jona: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!

కురుక్షేత్ర యుద్ధవీరులైన పాండవులు వనవాసం చేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఆ నివాస స్థలాల్లో బొమ్మాలమ్మ జోన ప్రాంతం ఒకటి. ఇక్కడ పాండవులు సంచరించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) రావికమతం మండలం, చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉంది. ఈ బొమ్మాలమ్మ జోన ప్రాంతంలో పాండవులు వనవాసం చేశారన్న నమ్మకం.

ఇక్కడ పాండవులు గుహ ఏర్పాటు చేసుకున్నారని దానికి రెండు దారులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఆ గిరిజనుల దైవం బొమ్మాలమ్మ తల్లి అమ్మవారు కూడా ఆ ప్రాంతం లో ఉండటంతో ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి, అక్కడ పూజలు చేస్తారు. ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు, టూరిస్ట్లు వస్తుంటారు.

భీముడి కుర్చి.

అక్కడ ప్రజలకు వారి పూర్వీకులు చెప్పిన మాటలు ప్రకారం. పాండవులు ఈ ప్రదేశం లో తిరిగారనేందుకు అక్కడున్న పొడవైన సొరంగ మార్గమే గుర్తుటున్నారు. అక్కడ భీముడి కుర్చీ, భీముడి కుడి పాదం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరోజు భీముడికి కోపం వచ్చి గట్టిగా భూమి మీద పాదం వేశారని.ఆ పాదం అచ్చు ఇప్పటికీ అక్కడ ఉన్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.

నారదతత్వాన్ని తెలిపే చెట్టు

పాండవులు తమ అస్త్రాలను జమ్మిచెట్టు మీద పెట్టుకునేవారని..ఆ చెట్టు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు త్రిమూర్తల ప్రతిరూపాలైన రావి, మర్రి చెట్లు ఇక్కడ ఉన్నాయని..నారదుని తాలుకూ ఓ చెట్టు ఉందని..అది నారదుని తత్వాన్ని బోదించేలా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. నారదుడంటే మనకు తెలిసి ఓ ఇద్దరి మధ్య అగ్గిరాజేసి..నారాయణ నారాయణ అంటూ కడుపునింపుకుంటారు. సరిగ్గా ఆ తత్వాన్ని తెలిపేలా ఈ కొండమీద ఓ చెట్టు ఉంది. అందుకే అందరు దాన్ని నారద చెట్టు అంటారు.

పాండవుల కోనేరు.., చర్మవ్యాధులు పోతాయని నమ్మకం

ఇక్కడ కొండమీద ఓ కోనేరు ఉంది. పాండవులకు సహాయసహకారాలు అందించిన శ్రీకృష్ణుడు గోపికలతో ఆ కోనేరులో జలకాలాడేవారని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు ఈ కోనేటిలో పాండవులు స్నానాలు చేసేవారని ఆదివాసీలు నమ్ముతారు. ఈ కోనేటిలో నీళ్లు ఎప్పటికి ఇంకిపోవని గ్రామ ప్రజలు చెబుతున్నారు.ఈ కోనేరులో మునిగితే ఏమైనా చర్మవ్యాధులు ఉంటే పోతాయని ప్రజల నమ్మకం. కార్తీకమాసంలో వనభోజనాలు చేసేందుకు, కార్తీక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

పాండవులకు ప్రత్యేక పూజలు

ఈ ప్రాంతంలో భీముడు, అర్జునులను యోధులుగా పూజిస్తారు ఆదివాసీలు. అక్కడ పిల్లలకు కూడా ఎక్కువగా భీముడు, అర్జునుల పేర్లు పెడుతుంటారు. అంతేకాదు వారిని దైవంగా భావిస్తూ ,అక్కడ వున్న బొమ్మలమ్మ తల్లి దగ్గర పాలు పొంగించి పొలం పనులు ప్రారంభిస్తారు. ఏటా విత్తనాలకు ఇక్కడ పూజచేశాకే చేలల్లో చల్లుతారు. చేతికొచ్చిన కొత్తపంటకు ఇక్కడ పూజ చేస్తారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

కొత్తహంగులతో బొమ్మాలమ్మజోన

బొమ్మాలమ్మ జోనకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండటంతో అక్కడ గ్రామస్తులే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దేవాడ వరప్రసాదరావు అనే వ్యక్తి తన సొంత ఖర్చుతో మెట్ల నిర్మాణం చేపట్టారు. బొమ్మాలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. చీమలపాడు, జెడ్‌ కొత్తపట్నం గ్రామసర్పంచ్‌లు చర్చించి..ఆ ప్రాంతంలో బొమ్మాలమ్మ అమ్మవారి గుడికి, పాండవుల గృహాలకి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు.ప్రభుత్వం కూడా తమకు సహాయం చేస్తే ఈప్రాంతం మరింతగా అభివృద్ధి చేయోచ్చంటున్నారు గ్రామపెద్దలు.

ఇదో చక్కని పర్యాటక ప్రాంతం

కొండకోనలు, పచ్చని వాతావరణంతో ఈ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్తీకమాసం సమయంలో మంచుతో ఈ ప్రాంతం ఇంకా కనువిందుచేస్తుందని..ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు ఈ ప్రాంతానికి వచ్చి ఎంజాయ్‌ చేస్తుంటారు. గత రెండు మూడేళ్లుగా ఈ ప్రాంతం గురించి ఆ నోట ఈ నోట ప్రచారం జరగడంతో. పక్క జిల్లాల వాళ్లు కూడా అక్కడకు ఫ్యామిలీలతో వెళ్తున్నారు.

బొమ్మాలమ్మ- భీమార్జునుల చల్లని దీవెన

భీమార్జునుల ఆశీస్సులతో, బొమ్మాలమ్మవారి చల్లని దీవెనలతో అనుకూలమైన వ్యవసాయ కాలం ఉంటుందనేది ఆదివాసీల అపార నమ్మకం. ఇక్కడ పూజ చేయిస్తేనే పంట బాగా పండుతుందని, వర్షాలు బాగా పడతాయని అక్కడి పెద్దలు చెప్తున్నారు.

ఎలా వెళ్లాలి?

ఈ ప్రాంతానికి వెళ్లాలంటే వైజాగ్‌ వరకు బస్సు, రైలు, విమాన మార్గం ద్వారా వెళ్లొచ్చు. కానీ అక్కడ నుంచి బస్సులో చోడవరంకు వెళ్లాలి. అక్కడ నుంచి నుండి నర్సీపట్నం వెళ్ళే మార్గ మధ్యలో కొత్తకోట గ్రామం వస్తుంది. కొత్తకోట నుండి చీమలపాడు గ్రామానికి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చీమలపాడు గ్రామంలో ఈ ప్రాంతం నెలకొని ఉంది.

చూడదగ్గ మరికొన్ని ప్రాంతాలు

దీనికి దగ్గరలో అరకు, బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడకు వెళ్లే వాళ్లకు కూడా బహుశా ఈప్రాంతం గురించి ఇప్పటివరకు తెలిసి ఉండకపోచ్చు.. ఈ సారి మీరు అటు వెళ్లినప్పుడు ఈ బొమ్మలమ్మజోనను కూడా సందర్శించిరండి.

Hair growth tips: ఒక్కసారి ఇది రాసుకోండి. జుట్టు రాలటం తగ్గి రెట్టింపు వేగంతో జుట్టు పెరుగుతుంది

Hair growth Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం.

దీని కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతులను నీటిని పోసి నానబెట్టాలి.

మరుసటి రోజు ఈ నీటిని వడకట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ఎర్ర ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పది వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసంలో మెంతుల నీటిని పోసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోయాలి.

జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టేలా స్ప్రే చేసి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది. వెల్లుల్లిలో ఉండే మెగ్నీషియం,విటమిన్స్ జుట్టుకి మంచి పోషణ అందించి జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. మెంతులను జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. అలాగే చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

Cracked Heels : పాదాల పగుళ్లను తగ్గించే అద్భుతమైన చిట్కా.. వారం రోజుల్లో మార్పు వస్తుంది..!

Cracked Heels : మనలో చాలా మంది పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పాదాలు పగలడం, పాదాలు తేమ లేకుండా పొడిబారడం, పాదాలను శుభ్రపరచకపోవడం వంటి కారణాల వల్ల పాదాలు పగుళ్ల సమస్య వస్తుంది.

అంతేకాకుండా పోషకాహార లోపం, పొడి నేల మీద ఎక్కువ సమయం నిలబడుతూ ఉండడం, వయస్సు పెరగడం, మధుమేహం కారణంగా కూడా పాదాల పగుళ్లు ఏర్పడతాయి. కొంత మంది ఈ పాదాల పగుళ్లను అస్సలు పట్టించుకోరు. దాని వల్ల సమస్య తీవ్రమై నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు కూడా చూడడానికి అందవిహీనంగా ఉంటాయి.

పాదాల పగుళ్ల సమస్య తీవ్రతరం కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మన ఇంట్లో పెంచుకునే కరివేపాకు, గోరింటాకు మొక్కలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

కరివేపాకు ప్రతి ఇంట్లో ఉండనే ఉంటుంది. దీనిని ప్రతిరోజూ మనం వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. కరివేపాకు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాక గోరింటాకు కూడా మనకు లభ్యమవుతూనే ఉంటుంది. గోరింటాకు.. పాదాలు మెత్తగా, మృదువుగా ఉండేలా చేయడంలో సహాయడుతుంది. ఈ రెండింటినీ ఉపయోగించి మనం పాదాల పగుళ్లను నయం చేసుకోవచ్చు.

కరివేపాకును, గోరింటాకును ఉపయోగించి మనం ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఉండే కరివేపాకును, గోరింటాకును సేకరించి శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో లేత మర్రి ఊడల నుండి తీసిన పాలను కలిపి రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి ఉదయాన్నే కడిగేయాలి.

ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోయి పాదాల పగుళ్లు తగ్గుతాయి. పాదాలు మెత్తగా, మృదువుగా, అందంగా తయారవుతాయి. ఇలా ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి, పాదాలు పొడిబారకుండా అందంగా ఉండేలా మార్చుకోవచ్చు. పాదాలపై ఉండే చర్మం మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి.

రాత్రిళ్లు లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా ? అయితే జాగ్రత్తగా ఈ వ్యాధుల ప్రభావం ఎక్కువట.. అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..

సాధారణంగా చాలా మందికి రాత్రిళ్లు లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది.. కానీ 63 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఎక్కువగా నిద్రపోతున్నప్పుడు లైట్స్ వేసుకుంటారు..కానీ తాజా నివేదికల ప్రకారం వారిలో అధిక శాతం ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కలిగి ఉన్నారట..

రాత్రి సమయంలో ఎటువంటి కాంతికి గురికానీ వారికంటే లైట్స్ వేసుకునే వారిలో ఆ సమస్యలు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుుతన్నాయి..

జూన్ 22న ఓ పత్రికలో ప్రచురించబడిన నివేదికలో రాత్రిపూట లైట్స్ వేసుకుని పడుకునేవారిలో ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలు అధికంగా ఉంటుందని వెలువడింది.. ఒకరి స్మార్ట్ ఫోన్ లేదా రాత్రిళ్లు టీవీ లైట్స్ వంటి కాంతిలో 24 గంటలు ఉంటున్నామని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫీన్ బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ ఫిజిషియన్ అధ్యయన సంబంధిత రచయిత డా.మింజీ కిమ్ అన్నారు.

వృద్ధులలో ఇప్పటికే మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉందని.. కాబట్టి వారు రాత్రిళ్లు ఎక్కువగా కాంతికి గురయినప్పుడు అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయన్నారు.. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో 552 మందిలో సగం కంటే తక్కువ మంది రోజుకు ఐదు గంటలు పూర్తి చీకటిని కలిగి ఉన్నారని అధ్యయన పరిశోధకులు తెలిపారు..

ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు లైట్స్ వేసుకుని నిద్రపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరు చీకటిలో కంటే కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండడడం ప్రధాన కారణం.. మధుమేహం కారణంగా పాదాల తిమ్మిరి ఉన్నవారు పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి రాత్రిపూట కాంతిని ఉంచుకోవాలనుకోవచ్చు. వీరు రాత్రిళ్లు లైట్స్ ఆఫ్ చేయడం మరింత ముఖ్యం అన్నారు నిపుణులు..

నిద్రలో కాంతిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చిట్కాలు..

లైట్స్ వేయకూడదు.. బదులుగా డిమ్ లైట్ వేసుకోవడం మంచిది..

రంగు ముఖ్యం.. అంబర్ లేదా ఎరుపు, నారింజ రంగు కాంతి మెదడుకు తక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తుంది.. తెలుపు, నీలం కాంతిని ఉపయోగించవద్దు. అవుట్‌డోర్ లైట్‌ని కంట్రోల్ చేయలేకపోతే బ్లాక్అవుట్ షేడ్స్ లేదా ఐ మాస్క్‌లు మంచివి.

Astro Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. డబ్బులు నిలవడం లేదా.. తమలపాకులతో ఇలా చేసి చూడడండి..

Astro Tips: మనమందరం జీవితాన్ని సాఫీగా నడపడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం చాలా కష్టపడతారు. అయినప్పటికీ జీవితంలో పురోగతి చాలా దూరంగా ఉంటుంది.

దీంతో తాము చేసే పనిలో లేదా జాతకంలోనో ఏదో కొంత లోపం ఉన్నట్లు భావించడం ప్రారంభిస్తారు. మీరు జ్యోతిష్యం లేదా వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తే.. దీని వెనుకగల కారణాలను తెలుసుకోవచ్చు. వాస్తు లోపాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.. చాలా కాలం వరకు కనిపిస్తుంది. జీవితంలోని అడ్డంకులను అధిగమించడానికి, ప్రజలు పూజలు, ఉపవాసం లేదా దానికి సంబంధించిన ఇతర పనులు చేస్తారు.

పూజల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి. పూజకు కొబ్బరి, కలవ, తమలపాకులతో సహా ప్రత్యేక సామగ్రిని ఉపయోగిస్తారు. తమలపాకుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా.

పూజలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న తమలపాకులు అనేక నివారణలు లేదా ప్రత్యేక విషయాలు జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి. వీటిని అనుసరించడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

ఇంటి నుండి ప్రతికూలత తొలగించడానికి:

హిందూ మతంలో, దేవతలు తమలపాకులలో నివసిస్తారని నమ్మకం. ఈ కారణంగానే పూజలో ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే దేవుడి ముందు తమలపాకులు సమర్పించండి. ఇది మీ ఇంట్లోనే కాకుండా జీవితంలో కూడా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రానున్న సమస్యలపై పోరాడే ధైర్యం కూడా మీకు లభిస్తుంది. పనిలో అడ్డంకులు ఉంటే.. ఆదివారం మీతో తమలపాకును తీసుకెళ్లండి.

తమలపాకులతో శివుని పూజించండి

శివునికి తమలపాకులు సమర్పించడం ద్వారా.. త్వరగా సంతోషిస్తాడని.. అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. శివునికి తమలపాకులతో పూజ చేసే సమయంలో గుల్కందం, మెంతులు, పప్పు మాత్రమే కాకుండా నైవేద్యంగా పెట్టాలి. ఇలా భగవంతుడికి సమర్పించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఈ పరిహారం సోమవారం చేయడం వలన మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ పరిహారం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ఆర్ధిక ఇబ్బందులుంటే:

ఎంత సంపాదించినా ఆ డబ్బులు చేతిలో నిలబడకపోతే.. ఈ పరిస్థితి ఆందోళన కలిగించే విషయంగా పరిగణించబడుతుంది. డబ్బు సంపాదించడానికి కష్టపడి పని చేస్తాము.. తద్వారా సౌకర్యాలకు కొరత ఉండదు, కానీ డబ్బు చేతిలో నిలవక పొతే కష్టాలు మనల్ని మరింత ఇబ్బంది పెడతాయి. ఒకిక్కసారి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో తమలపాకులతో నివారణ కోసం పూజ చేయండి. 5 తమలపాకులను తీసుకుని లక్ష్మీదేవికి సమర్పించండి. దీని తరువాత, వాటిని ఒక దారంలో కట్టి, ఇంటికి తూర్పు దిశలో వాటిని కట్టాలి. దీనివల్ల వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ ప్రయోజనం ఉంటుంది.

Don’t Take: ఇరుగు పొరుగు వల్ల నుండి ఈ వస్తువులు తీసుకుంటే కష్టాలు తప్పవు..!

Don’t Take: సాధారణంగా మన ఇంట్లో ఏదైనా వస్తువు లేదంటే వెంటనే పక్కింటికి వెళ్లి అరువు తెచ్చుకుంటాం.. ఇది ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు..

మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని వస్తువులు అడిగి తెచ్చుకోకుడదట.. అలా తెచ్చుకుంటే మనకే నష్టమట.. ఎందుకంటే కొన్ని వస్తువుల పై శనిదేవుని ప్రభావం ఉంటుంది..! అలాంటి వస్తువులను మనం వేరే వారి నుండి తీసుకోవటం వలన శని యొక్క ప్రభావం మనపై ఉంటుంది..! ఆ వస్తువులు ఏంటంటే.!?

Don’t Take: these things from others

పక్కింటి వారిని పాల కోసం తోడు అడిగి తీసుకుంటూ ఉంటాం.. కానీ అలా తీసుకోకూడదని చెబుతున్నారు.. ఎవ్వరితోనైనా పాల కోసం తోడు అవసరమని కాకుండా మజ్జిగా కోసం అని చెప్పి తెచ్చుకోవాలట. అంతేగాని పాలలో తోడు వేయాలి అని చెప్పి తీసుకోకూడదట..

ఒకప్పుడు నువ్వుల నూనె మాత్రమే ఎదుటి వారిని అడిగి తీసుకోకూడదు అని అనేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఏ నూనె అయినా సరే వేరే వారి నుండి తీసుకోవటం మంచిది కాదు అంటున్నారు..

పాత బట్టలు కూడా వేరే వారి నుండి ఎప్పుడూ తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు శని ప్రభావం కూడా వస్తుంది. పాత బట్టలు కేవలం బిడ్డకు జన్మనిచ్చినప్పుడు పెద్దవారి నుండి తీసుకుంటారు.

Don’t Take: these things from others

అదేవిధంగా ఇనప వస్తువులు, నువ్వులు, బెల్లం, నెయ్యి వేరే వారి నుండి అప్పుగా తీసుకోకూడదు. అలాగే నేరుగా ఒకరి చేతి నుండి తీసుకోకూడదు. నువ్వులతో చేసిన పదార్థాలు ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఎదుటి వారికి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇచ్చి మాత్రమే తీసుకోవాలి.

అలాగే చీపురు, చేట, చెప్పులు కూడా వేరే వారి నుండి తీసుకోకూడదు. నల్లని, నీలం వస్త్రాలు కూడా ఎప్పుడూ ఒకరి నుండి తీసుకోకూడదు. ఇవి శని దేవునికి ఇష్టమైన రంగులు. అలానే వేరే వారి నుండి ఊరికినే లేదా దానంగా తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మనపై ఉంటుందని నమ్ముతారు.

Cockroach : ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా ? సహజసిద్ధంగా వాటిని ఇలా తరిమేయండి..!

Cockroach : బొద్దింకలు.. వీటిని చూడగానే చాలా మందికి అసహ్యం కలుగుతుంది. ఈ బొద్దింకలు మనకు అప్పుడప్పుడూ ఇంట్లో కనబడుతూనే ఉంటాయి. అపరిశుభ్ర వాతావరణం ఉన్న చోట బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి.

బొద్దింకల కారణంగా మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనం వంట చేసుకునే ప్రాంతాలలో ఇవి ఎక్కువగా తిరగడం వల్ల ఆహారం విషతుల్యం అవడం, వాంతులు, కడుపు నొప్పి, నీళ్ల విరేచనాల వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. కనుక సాధ్యమైనంత వరకు మన ఇంటి పరిసరాలలో, ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి.

మనకు బొద్దింకలను నివారించే అనేక రసాయన ఉత్పత్తులు మార్కెట్‌లో దొరుకుతాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం బొద్దింకలను నివారిచుకోవచ్చు. కానీ వీటి తయారీలో రసాయనాలను ఎక్కువగా వాడతారు. కనుక వీటిని తగిన జాగ్రత్తలు తీసుకుని వాడాల్సి ఉంటుంది.

అయినప్పటికీ మనం ఒక్కోసారి వాటి విష ప్రభావానికి గురవుతూ ఉంటాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు ఈ రసాయనాలతో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మన ఇంట్లో నుండి బొద్దింకలను తరిమేయవచ్చు. బొద్దింకలను నివారించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న చోట నాలుగు బిర్యానీ ఆకులను ఉంచడం వల్ల లేదా ఆ ఆకులను పొడిగా చేసి చల్లడం వల్ల కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయి. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని బొద్దింకలు తిరిగే చోట చల్లడం లేదా స్ప్రే చేయడం వల్ల కూడా బొద్దింకలు నివారించబడతాయి. మనం ఆహారంగా తీసుకునే దోసకాయను ముక్కలుగా చేసి ఇంట్లో అక్కడక్కడా ఉంచడం వల్ల కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయి.

అలాగే కోడిగుడ్డులోని పచ్చ సొనలో బోరిక్ యాసిడ్ ను కలిపి బొద్దింకలు తిరిగే చోట ఉంచాలి. ఈ మిశ్రమాన్ని తిని బొద్దింకలు చనిపోతాయి. మిరియాలను, వెల్లుల్లి రెబ్బలను, ఉల్లిపాయలను పేస్ట్ గా చేసి ఆ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.

ఈ చిట్కాలను పాటించడంతోపాటు ఇంటిని, ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. వంట గదిలో తేమ లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఉంటాయి.

AP Politics: టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

టిడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం కేటాయించినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థుల్లో చాలా మంది కొత్తవారే ఉన్నారు.
వైసీపీ రెబల్స్‌లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

అభ్యర్థులు వీళ్లేనా?

శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గం
కింజారపు రామ్మోహన్‌నాయుడు
సిట్టింగ్‌ ఎంపీ
విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం
కేశినేని శివనాథ్‌ (చిన్ని)
సీనియర్‌ నేత
విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం
ఎం.శ్రీభరత్‌
గీతం అధినేత
నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
రఘురామకృష్ణంరాజు
వైసీపీ రెబల్‌ ఎంపీ
ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
గోపాల యాదవ్
ఎన్‌ఆర్‌ఐ
మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం
వల్లభనేని బాలశౌరి(జనసేన)
సిట్టింగ్‌ ఎంపీ
నరసారావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం
లావు శ్రీకృష్ణదేవరాయులు
సిట్టింగ్‌ ఎంపీ
విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం
అశోకగజపతిరాజు / రామ్‌మల్లిక్ నాయుడు
అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం
కిడారి శ్రావణ్‌కుమార్‌
మాజీ మంత్రి
అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం
ప్రముఖ వ్యాపారవేత్త
బైరా దిలీప్ / బుద్ధా వెంకన్న / చింతకాయల విజయ్
కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం
సానా సతీష్ (జనసేన)
అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
గంటి హరీశ్‌
రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గం
బొడ్డు వెంకటరమణ చౌదరి / శిష్ల లోహిత్‌
గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ
బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం
ఉండవల్లి శ్రీదేవి
ఒంగోలు / నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
మాగుంట శ్రీనివాస్ రెడ్డి/ రాఘవరెడ్డి
తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గం
పనబాక లక్ష్మి, నిహారిక
చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య
ఎమ్మెల్యే ఆదిమూలం
రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం
రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం
కడప పార్లమెంట్‌ నియోజకవర్గం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి
కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం
సంజీవ్ కుమార్ / పార్థసారథి
నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి / శబరి
నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం
ప్రసాద్ రెడ్డి, పారిశ్రామికవేత్త గోగిశెట్టి నరసింహారావు
అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
పూల నాగరాజు / కాల్వ శ్రీనివాస్
హిందుపురం పార్లమెంట్‌ నియోజకవర్గం
బీకే పార్థసారథి

Toys : చైనాకు మళ్లీ షాక్..ఇండియా బొమ్మలతో అమెరికా, యూరప్, ఆఫ్రికాలు ఆడుకుంటాయి

Toys : చైనీస్ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా, యూరప్, ప్రపంచంలోని ఇతర దేశాల మార్కెట్లు చైనీస్ బొమ్మలతో నిండి ఉన్నాయి. జర్మనీలోని న్యూరెంబర్గ్ నగరంలో అంతర్జాతీయ టాయ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.
అక్కడ భారతీయ బొమ్మలు ఉన్నాయి. దీంతో చైనా ఇబ్బందుల్లో పడింది. ఐదు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ టాయ్ ఫెయిర్ లో పాల్గొంటున్న భారతీయ బొమ్మల తయారీదారులకు కూడా కోట్లాది రూపాయల ఆర్డర్లు వచ్చాయి. ఈ సమాచారాన్ని బొమ్మల ఎగుమతిదారులు, భారతీయ తయారీదారులు ఫెయిర్‌లో నాణ్యమైన ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. అంటే ఇప్పుడు అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికా వరకు అందరూ భారతీయ బొమ్మలతో ఆడుకోవడానికి సిద్ధమయ్యారు.

అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, జర్మనీ వంటి దేశాల నుండి కొనుగోలుదారులు తమ ఉత్పత్తులపై ఆసక్తిని కనబరిచారు. భారీ సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చారు. న్యూరేమ్‌బెర్గ్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ ఫిబ్రవరి 3న ముగిసింది. ప్రపంచంలోని అతిపెద్ద బొమ్మల ప్రదర్శనలలో ఒకటైన ఈ కార్యక్రమంలో 65 కంటే ఎక్కువ దేశాల నుండి 2,000 మందికి పైగా పాల్గొన్నారు. గ్రేటర్ నోయిడాకు చెందిన లిటిల్ జీనియస్ టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ నరేష్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ మా ఉత్పత్తులకు భారీ ప్రశంసలు లభించాయి. అది చెక్క విద్యా బొమ్మలు లేదా మృదువైన బొమ్మలు కావచ్చు. చైనీస్ బొమ్మలపై బలమైన చైనా వ్యతిరేక సెంటిమెంట్ ఉంది. భారతీయ బొమ్మలు ప్రశంసించబడ్డాయి. బొమ్మల తయారీ కోసం భారత్‌లో లిటిల్ జీనియస్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన రెండు కంపెనీలు ఆసక్తి కనబరిచాయని తెలిపారు.
దిగుమతుల్లో 52 శాతం తగ్గింపు
వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. బొమ్మల పరిశ్రమకు ప్రభుత్వం దిగుమతిలో 52 శాతం తగ్గింపు అందించింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు బొమ్మల ఎగుమతి 239 శాతం పెరిగింది. భారతీయ విలువలు, సంస్కృతి, చరిత్ర ఆధారంగా బొమ్మల రూపకల్పనను ప్రోత్సహించే చర్యలతో పాటు ‘మేడ్ ఇన్ ఇండియా టాయ్స్’ని ప్రోత్సహించడానికి ఒక క్రియాశీల ప్రచారం, ఒక అభ్యాస వనరుగా బొమ్మలను ఉపయోగించడం ఆశించిన ఫలితాలను ఇచ్చాయి.

దిగుమతి, ఎగుమతి
బొమ్మల నాణ్యతను పర్యవేక్షించడం, నాసిరకం, అసురక్షిత బొమ్మల దిగుమతులను పరిమితం చేయడం, స్వదేశీ బొమ్మల సమూహాలను ప్రోత్సహించడంతోపాటు బొమ్మల రూపకల్పన, తయారీ కోసం ప్రభుత్వం హ్యాకథాన్‌లు, గ్రాండ్ ఛాలెంజ్‌లను కూడా నిర్వహిస్తోంది. ఈ ప్రచారం బొమ్మల పరిశ్రమలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. మొత్తం బొమ్మల దిగుమతి 2014-15 ఆర్థిక సంవత్సరంలో 332.55 మిలియన్ డాలర్ల నుండి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 158.7 మిలియన్ డాలర్లకు తగ్గింది. ఎగుమతుల గురించి మాట్లాడుకుంటే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 96.17 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 325.72 మిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగింది.

iphone‌లో “i” అంటే ఏమిటో తెలుసా?

ఐఫోన్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చాలా మందికి ఐ ఫోన్ కొనుగోలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా యువతకి.. యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్ అంటే మక్కువ ఎక్కువ చూపిస్తారు. రోజుకు ఎన్ని కొత్త మోడల్స్‌ స్మార్ట్ ఫోన్స్ వచ్చినా .. ఐ ఫోన్ మీద ఉన్న ఇష్టం మాత్రం ఎవరికీ తగ్గట్లేదు.
ఎందుకంటే ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్, కెమెరా ఇవన్నీ ఐ ఫోన్‌లో బాగుంటాయి.అయితే, కాసేపు ఇది పక్కన పెడితే, iphone‌లో “ఐ” ( i ) ప్రత్యేకత ఏంటో తెలుసా..? అసలు ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే దాని గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.

ఐ ఫోన్‌లో “ఐ” అంటే ఏమిటని మనం మన స్నేహితులను అడిగితే వారు మనకు ఫన్నీగా ఆన్సర్ ఇస్తారు. ఐ ఫోన్‌లో ‘ i ‘ అంటే ఇడియట్, యాపిల్ ఆఫ్ మై అంటూ ఇలా ఒకటి కాదు.. ఎన్నో చెబుతుంటారు. కానీ iphone‌లో ” ఐ” కి వేరే అర్థం ఉన్నది. కంపెనీ తన i phoneలో ఐకి ఖచ్చితమైన అర్థాన్ని చెప్పనప్పటికీ, ఐ అనేది ఐదు పదాలను సూచిస్తుందని 1998లో స్టీవ్ జాబ్స్ పేర్కొన్నారు. ఐ ఫోన్‌లో ఐ అంటే ఇంటర్నెట్, ఇండివిడ్యువల్, ఇన్ స్టక్ట్ర్, ఇన్ఫార్మ్, ఇన్ స్పైర్ . దీనికి టెక్నికల్‌గా ఎలాంటి అఫిషియల్‌ మీనింగ్‌ లేదని స్టీవ్‌ జాబ్స్‌ స్పష్టం చేశారు.

Petrol Bunk Cheating: బంకుల్లో ఇదొక్కటి గమనిస్తే మోసపోకుండా ఫుల్‌ పెట్రోల్‌ మీ సొంతం

Petrol Bunk Fraud: ఉరుకుల పరుగుల జీవితంలో పరుగులు పెట్టేందుకు మనకు వాహనాల వినియోగం తప్పనిసరి. వ్యక్తిగత వాహనదారులు నిత్యం వాహనాలు వినియోగిస్తుంటారు.
వాహనానికి సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకులకు వెళ్తుంటారు. మీకు ఎంత మోతాదులో కావాలో చెప్పి పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకుంటారు. అయితే పోసేటప్పుడు అక్కడి మీటర్‌ను గమనించకపోతే మోసపోయినట్టే. బంకుల్లో మీటర్‌లపై ఓ కన్నేసి ఉంచాలి. మొదట ఆ మీటర్‌పై అవగాహన పెంచుకోవాల్సి ఉంది.
ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ డబ్బులకు తగ్గట్టు రావడంపై కొంత అవగాహన పెంచుకున్నారు. రౌండ్‌ ఫిగర్‌ అంటే రూ.50, 100, 150, 200, 500 ఇలా పోయించుకోవద్దనే అవగాహన వచ్చింది. రూ.60, 90, 120, 170, 230 ఇలా పోయించుకుంటున్నారు. అయితే ఇది మంచి పద్ధతే కానీ. అయితే వాహనదారుల తెలివిని గమనించిన పెట్రోల్‌ బంక్‌ల యజమానులు వాళ్లు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఈ విధంగా కూడా మోసాలకు పాల్పడేలా మీటర్‌లలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇవన్నీ కాకుండా అసలు పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు మోసాలకు చిక్కకుండా ఫుల్‌ పెట్రోల్‌, డీజిల్‌ పొందాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. అది పాటిస్తే మీ నగదుకు తగినంత ఇంధనం వస్తుంది. అదేమిటంటే బంక్‌లపై అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం బంక్‌ల మీటర్లు అప్‌డేట్‌ అవుతున్నాయి. గతంలో అయితే పది చొప్పున మారుతుండేవి. కొత్తగా వచ్చిన విధానంలో రూ.5 చేరుస్తూ మీటర్‌ తిరుగుతుంది. అంటే 5, 10, 15, 20, 25 ఇలా మీటర్‌లో రూపాయి మారుతుంటుంది. ఇలా మీటర్‌లలో ఐదు చొప్పున మారే బంక్‌లు కొత్త మీటర్‌ విధానం అమలు చేస్తున్నాయని గ్రహించాలి. దీని ద్వారా మనం వెచ్చించిన నగదుకు తగ్గట్టు ఇంధనం వస్తుంది.

రూ.10,20,30 కలుపుతూ మీటర్ తిరిగితే ఆ బంకుల్లో మోసం జరుగుతుందని గ్రహించాలి. పది రూపాయల చొప్పున మారే బంకుల్లో అసలు పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించుకోవద్దు. ఈ మోసాలు పాత పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్నాయి. కొత్త విధానం అమలు చేస్తున్న బంకుల్లో మోసం జరగడం లేదు. అందుకే మీరు బంకులకు వెళ్లినప్పుడు మీటర్‌లో పది చొప్పున కాకుండా ఐదు చొప్పున మీటర్‌ తిరిగే బంకుల్లోనే ఇంధనం వినియోగించండి.

పది చొప్పున మీటర్‌ తిరిగే బంకుల వద్దకు వెళ్లకండి. ఒకవేళ వెళ్లినా మీరు మీటర్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోలేదని బంక్‌ యాజమాన్యానికి చెప్పండి. మీరు అవగాహన పొందండి.. ఇతరులకు అవగాహన కల్పించండి. అప్‌గ్రేడ్‌ అయిన బంక్‌ల వద్దనే పోయించుకుంటే మీ నగదుకు తగిన విలువ కలిగిన ఇంధనం మీ సొంతమవుతుంది. వినియోగదారుల అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పెట్రోల్‌ మోసాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలు నిత్యం అవగాహన పొందుతుంటే మీ డబ్బుకు తగ్గ ఇంధనం పొందవచ్చు.

Menthulu Water For Weight Loss: 5 రోజుల్లో మెంతుల నీటితో బరువు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలా?

Menthulu Water For Weight Loss And Diabetes Control: భారతీయులు ప్రతి ఆహార పదార్థాల్లో మెంతులను వినియోగిస్తారు. ముఖ్యంగా వీటిని పులుపు కలిగిన కర్రీస్‌లో ఎక్కువగా వాడతారు.
ఇవి ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. మెంతికూరలో సోడియం, పొటాషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి వంటి అనేక రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు మెంతి ఆకులను ఆహారాల్లో వినియోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మెంతి గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుత లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది:
రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతి గింజల నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఔషధ గుణాలు గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం ఇతర దీర్ఘకాలిక పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా క్రమం తప్పకుండా మెంతికూరను తీసుకోవడం వల్ల మలం కూడా మృదువుగా వస్తుంది. దీంతో పాటు మెంతి నీరులో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌ గుణాలు జీర్ణక్రియను మెరుగు పరిచేందుకు కూడా సహాయపడుతుంది.

చర్మానికి ఎంతగానో సహాయపడుతుంది:
మెంతి నీరులో ఉండే ఔషధ గుణాలు చర్మానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా స్కిన్ అలర్జీ, ఇతర చర్మ సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిచేందుకు కూడా కీలక పాత పోషిస్తుంది. దీంతో పాటు మొటిమలు, మచ్చలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీని కారణంగా చర్మం కూడా మృదువుగా తయారవుతుంది.

బరువు తగ్గడం:
మెంతికూరలో ఉండే ఆయుర్వేద గుణాలు, పీచుపదార్థాలు ఆకలిని సులభంగా నియంత్రిస్తాయి. దీని కారణంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించేందుకు సహాయపడుతుంది. కాబట్టి బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా మెంతి కూరను క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

చక్కెర పరిమాణాలపై ప్రభావం:
మధుమేహంతో బాధపడేవారిలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడం చాలా కీలకం. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా కొంతమందిలో చక్కెర పరిమాణాలు వేంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా తీవ్ర మధుమేహం బారిన పడుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే తప్పకుండా మెంతి నీటిని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.

వ్యర్థాలను తొలగించి బాడీని క్లీన్ గా మార్చే బెస్ట్ డీటాక్స్ డ్రింక్స్ ఇవి.. వారంలో ఒక్కసారి తీసుకున్న చాలు

హెల్తీ లైఫ్ ను లీడ్ చేయాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ వ్యాయామం, కంటినిండా నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉంటే సరిపోదు.. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సైతం ఎప్పటికప్పుడు బయటకు పంపుతూ ఉండాలి.
లేదంటే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పలు చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే బాడీని అంతర్గతంగా క్లీన్ చేసుకోవడం ఎంతో అవసరం. అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డీటాక్స్ డ్రింక్స్( Detox drinks ) అద్భుతంగా తోడ్పడతాయి.

డ్రింక్-1: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం రసం, రెండు స్పూన్లు నిమ్మరసం మరియు చిటికెడు పింక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రింక్ ను మార్నింగ్ సమయంలో తీసుకోవడం శరీరంలో వ్యర్ధాలు తొలగిపోతాయి. జీర్ణక్రియ( Digestion ) సాఫీగా సాగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయి.

డ్రింక్-2: ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం మరియు నాలుగు దంచిన పుదీనా ఆకులు( Spearmint ) వేసి బాగా కలపాలి. ఈ డ్రింక్ కూడా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. అదే సమయంలో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్‌, విటమిన్స్‌ ను అందిస్తోంది. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. డ్రింక్‌-3: వ్యర్థాలను తొలగించి బాడీని శుభ్రంగా మార్చడానికి కీరా కివి జ్యూస్ కూడా ఎంతగానో తోడ్పడుతుంది. దీనికోసం బ్లెండర్ లో పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసిన ఒక కివి పండు, నాలుగు నుంచి ఐదు కీర దోసకాయ స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, చిటికెడు పింక్‌ సాల్ట్( Pink salt ) వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాంతో మన డీటాక్స్ డ్రింక్‌ సిద్ధమవుతుంది. ఈ డ్రింక్ ను వారానికి ఒకసారి తీసుకున్న చాలు.. మీ బాడీ క్లీన్‌గా, హెల్తీగా ఉంటుంది.

బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం మంచిదేనా…తాజా అధ్యయనాలు చెప్తుంది ఇదే

రోజు మొత్తంలో అత్యంత ముఖ్యమైన భోజనం, బ్రేక్‌ఫాస్ట్‌ అని మనం చిన్నప్పటి నుంచీ వింటూ ఉన్నాం. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్‌ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
రాత్రి భోజనం తినడానికీ ఉదయం నిద్ర లేవడానికీ మధ్య ఉండే విరామ సమయంలో మన శరీరం రాత్రి తిన్న భోజనం ద్వారా అందిన క్యాలరీలను ఖర్చు చేసుకుంటుంది. అయితే అదే విరామ సమయాన్ని మరికొంత పొడిగిస్తే, ఖర్చు చేయడానికి సరిపడా క్యాలరీలు లేక మన శరీరం కొవ్వును కరిగించుకోవడం మొదలు పెడుతుంది. అయితే ఆ విరామ సమయంలో ఆకలితో కలిగే పదార్థ వ్యామోహాలు, ఎమోషనల్‌ ఈటింగ్‌లకు చెక్‌ పెడుతూ ఉండాలి. దీర్ఘ సమయాల పాటు శరీరానికి ఆహారం అందించకపోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

వ్యాధుల నుంచి రక్ష: టైప్‌2 మధుమేహం, గుండె జబ్బులు, వయసుతో సంబంధం ఉన్న న్యూరోడీజెనరేటివ్‌ డిజార్డర్లు, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌, పలు రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌తో అధిక రక్తపోటు అదుపులోకొస్తుంది. విరామ సమయంలో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది.
బరువు తగ్గొచ్చు: మెటబాలిజంను పెంచడం ద్వారా బరువు తగ్గడం మీ లక్ష్యమైతే, దీనికీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోడానికీ ఎటువంటి సంబంధం ఉండదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో మెటబాలిజం కిక్‌స్టార్ట్‌ అవుతుందనేది అపోహ మాత్రమే!

శక్తి పెరుగుతుంది: బ్రేక్‌ఫాస్ట్‌తో అందే క్యాలరీల మీద కోత విధిస్తే, నీరసం బదులుగా శక్తి సమకూరుతుంది. ఇందుకు కారణం శరీరం సురక్షితమైన కీటోజెనిక్‌ స్థితిలోకి ప్రవేశించడమే!

ఆటోఫజీ: కణాల వ్యర్థాలను శుభ్రం చేసే ప్రక్రియ ఆటోఫజీ. ఈ ప్రక్రియ జరగనప్పుడు పైబడే వయసుతో ముడిపడి ఉండే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఆహారం తీసుకోనప్పుడు, ఆటోఫజీ వల్ల కణ శుభ్రత పెరుగుతుంది.
అప్రమత్తత: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల మానసిక అప్రమత్తత, ఏకాగ్రతలు పెరుగుతాయి.

ఇన్సులిన్‌ సెన్సిటివిటీ: ఫాస్టింగ్‌ గ్లూకోజ్‌, ఫాస్టింగ్‌ ఇన్సులిన్‌, లెప్టిన్‌లు తగ్గి ఫలితంగా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ కూడా తగ్గుతుంది.

ఇన్‌ఫ్లమేషన్‌: మధుమేహం, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ సిండ్రో మ్‌లతో ముడిపడి ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌తో తగ్గుతుంది.

UBI Specialist Officers: నెలకి 89,000 జీతం తో యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు..

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SO రిక్రూట్‌మెంట్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీని ద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హతలు మరియు అనుభవం పోస్ట్ వారీగా నిర్ణయించబడతాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.175 చెల్లిస్తారు.
వివరాలు..

???? స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 606.

పోస్టుల కేటాయింపు: జనరల్ (UR)-253, EWS-59, OBC-161, ST-44, SC-89.

1) Chief Manager (IT): 05 Posts

2) Senior Manager (IT): 42 Posts

3) Manager (IT): 04 Posts

4) Manager (Risk): 27 Posts

5) Manager (Credit): 371 Posts

6) Manager (Law): 25 Posts

7) Manager (Integrated Treasury Officer): 05 Posts

8) Manager (Technical Officer): 19 Posts

9) Assistant Manager (Electrical Engineer): 02 Posts

10) Assistant Manager (Civil Engineer): 02 Posts

11) Assistant Manager (Architect): 01 post

12) Assistant Manager (Technical Officer): 30 Posts

13) Assistant Manager (Forex): 73 Posts

అర్హతలు: పోస్ట్‌ల తర్వాత సంబంధిత విభాగాల్లో B.Sc/BE/BTech/MCA/MTech/MSc/CA/CMA/ICWA/CS/CFA సర్టిఫికేట్/MBA.

వయో పరిమితి..

* చీఫ్ మేనేజర్(IT) పోస్ట్ 30-45 సంవత్సరాల మధ్య ఉండాలి.
* సీనియర్ మేనేజర్ (IT) పోస్టులకు 28-38 సంవత్సరాల మధ్య ఉండాలి.

* సీనియర్ మేనేజర్ (రిస్క్/CA) 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

* మేనేజర్ (IT/క్రెడిట్/ITO/TVO) పోస్టులకు 25 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

* మేనేజర్ (రిస్క్/లా) 25 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

* అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్/సివిల్ ఇంజనీర్/ఆర్కిటెక్ట్/టెక్నికల్/ఫారెక్స్) పోస్టులకు 20 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.

* SC, STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, మాజీ సైనిక అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు 5 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.175 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం..

* రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహించబడుతుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల వృత్తిపరమైన పరిజ్ఞానం నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

* అయితే, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు, అభ్యర్థుల నుంచి 50 ప్రశ్నలు ప్రొఫెషనల్ నాలెడ్జ్-100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

* పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

పర్సనల్ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. జనరల్ మరియు EWS అభ్యర్థులకు ఇంటర్వ్యూలో అర్హత మార్కులు 25గా నిర్ణయించబడ్డాయి. మరియు SC, ST, OBC మరియు వికలాంగులకు ఇది 22.5 గా నిర్ణయించబడింది. నిర్ణీత అర్హత మార్కులను సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
గ్రూప్ డిస్కషన్: మొత్తం 50 మార్కులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇందులో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులు 25గా నిర్ణయించారు. మరియు SC, ST, OBC మరియు వికలాంగులకు ఇది 22.5 గా నిర్ణయించబడింది.

పరీక్షా కేంద్రాలు: ఢిల్లీ NCR, హైదరాబాద్, చండీగఢ్/మొహాలి, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతా, భోపాల్, పాట్నా, ముంబై/నేవీ ముంబై/గ్రేటర్ ముంబై/థానే, భువనేశ్వర్, అహ్మదాబాద్/గాంధీనగర్.

జీత భత్యాలు

* చీఫ్ మేనేజర్ పోస్టులు రూ.76,010-రూ.89,890.

* సీనియర్ మేనేజర్ పోస్టులు రూ.63840-రూ.78,230.

* మేనేజర్ పోస్టులకు ఇది రూ.48,170-రూ.69,810 వరకు ఉంటుంది.

* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు రూ.36,000-రూ.63,840.

ముఖ్యమైన తేదీలు

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2024

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.02.2024

OTT Movies : ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు.. గుంటూరు కారంతో పాటు ఆ మూవీస్ కూడా

వారం వారం ఓటీటీలో పదుల సంఖ్యలో లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కొత్త లు ఓటీటీలో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి.
ఇప్పటికే చాలా లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న ల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం గురించే సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ ఇప్పుడు ఓటీటీలో అలరించనుంది.

గుంటూరు కారం తో పాటు చాలా లు ఈ వారం సందడి చేయనున్నాయి. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా ఇప్పుడు ఓటీటీలో అలరించనుంది. ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్..

డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ – ఫిబ్రవరి 05

ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ – ఫిబ్రవరి 05

మాంక్ సీజన్స్- ఫిబ్రవరి 05

మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్-ఫిబ్రవరి 05

ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్-ఫిబ్రవరి 05

లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ – ఫిబ్రవరి 07

రైల్: ది లాస్ట్ ప్రొఫెట్- ఫిబ్రవరి 07

లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07

వన్ డే- ఫిబ్రవరి 08
గుంటూరు కారం- ఫిబ్రవరి 09

భక్షక్-(హిందీ క్రైమ్ – ఫిబ్రవరి 09

లవర్ స్టాకర్ కిల్లర్ – ఫిబ్రవరి 09

యాషెస్- ఫిబ్రవరి 09

ఎ కిల్లర్ పారడాక్స్ – ఫిబ్రవరి 09

ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 – ఫిబ్రవరి 09

హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10

బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11

అమెజాన్ ప్రైమ్

కెప్టెన్ మిల్లర్ -ఫిబ్రవరి 09
డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌

ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3- ఫిబ్రవరి-0 9

జీ5

కాటేరా- ఫిబ్రవరి- 09

Deep Fake: డీప్ ఫేక్ దారుణం..వీడియోకాల్‌లో కనిపిస్తున్నది బాస్ అనుకుని రూ.207 కోట్ల బదిలీ!

సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సృష్టించిన కలకలం ఇంకా సద్దుమణగముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. డీప్ ఫేక్‌ టెక్నాలజీతో నిందితులు తాజాగా ఓ ఉద్యోగికి ఏకంగా రూ.207 కోట్ల మేర టోపీ పెట్టారు.
హాంకాంగ్‌లోని (Hongkong) ఓ ప్రముఖ కంపెనీలో వెలుగు చూసిన ఈ ఘటన(Deep Fake Fraud) ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

హాంగ్‌కాంగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్ (Chief Financial Officer) నుంచి ఈమెయిల్ వచ్చింది. ఓ సీక్రెట్ పనికోసం 25.2 మిలియన్ డాలర్లు ట్రాన్స్‌ఫర్ చేయాలనేది దాని సారాంశం. సీక్రెట్ కార్యకలాపాలు అన్న పదాన్ని చూసిన వెంటనే అతడికి సందేహం కలిగింది. కానీ అప్పటికే నిందితులు పక్కా ప్లాన్ వేసుకుని బాధితుడికి వీడియో కాల్ (Video Call) చేశారు. నిందితులు డీప్ ఫేక్ టెక్నాలజీ వాడటంతో వీడియో కాల్‌లో వారి ముఖాలన్నీ సంస్థ ఉన్నతోద్యోగుల్లానే కనిపించాయి. దీంతో, బాధితుడు తాను సంస్థ సీఎఫ్ఓ, ఇతర సహోద్యోగులతో మాట్లాడుతున్నానని భ్రమించాడు. చివరకు నిందితులు కోరిన మొత్తాన్ని బదిలీ చేశాడు. ఆ తరువాత అతడు హెడ్ ఆఫీసును సంప్రదించడంతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాధితుడు ఎవరు? అతడు ఏ కంపెనీలో చేస్తాడు? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

డీఫ్ ఫేక్ మోసాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గగ్గోలు రేగుతోంది. ఈ టెక్నాలజీతో అసాధారణ నేరాలకు ఆస్కారం ఉండటంతో పోలీసులకు దీన్ని ఎలా కట్టడి చేయాలో తెలియట్లేదు. హాంకాంగ్‌లో ఇటీవల కాలంలో పలు డీఫ్ ఫేక్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఓ కేసులో నిందితులు తాము దొంగిలించిన ఐడీ కార్డులతో పలు బ్యాంకు లోన్లకు అప్లై చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఫేస్‌రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌నే బురిడీ కొట్టించి నేరాలకు పాల్పడ్డారు.

Shani Remedies : ఈ 10 విషయాలు.. శనిగ్రహ కోపం నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి..

Shani Remedies:శనిని ప్రసన్నం చేసుకోవాలంటే చేయాల్సిన మొదటి పని సేవ,శ్రమ. శనిదేవుడు ఈ చర్యలతో సంతోషించడమే కాకుండా జాతకంలో ప్రతికూల స్థానంలో ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలను ఇవ్వడు.
శని దేవుడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తి ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తాడు.శనిదేవుడు, న్యాయ దేవుడు ఒక వ్యక్తి తన ప్రస్తుత , పూర్వ జన్మలలో చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు.ఇప్పటికీ శనిదేవుడు జాతకంలో అననుకూలంగా సంచరిస్తున్నట్లయితే అతని కోపాన్ని కొంతవరకు తగ్గించడానికి కొన్ని ఖచ్చితమైన చర్యలు ఉన్నాయి.

ఖచ్చితంగా ఈ పని చేయండి..
1.ఎవరినీ మోసం చేయకూడదు. డబ్బు మొదలైనవి తీసుకున్న తర్వాత దానిని సమయానికి తిరిగి ఇవ్వాలి.
2.వికలాంగులకు సహాయం చేస్తే మీ కర్మను పెంచుతుంది.ఇది శనిని ప్రసన్నం చేస్తుంది.
3.శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఎవరి దగ్గరా ఉచితంగా ఏమీ తీసుకోకండి.

మీ ఇంటికి అతిథి లేదా ఎవరైనా వచ్చినట్లయితే అతను పూర్తిగా భోజనం చేసిన తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయలుదేరాలి.
వృద్ధులను గౌరవించడం, ఇంట్లో లేదా బయట వారిని బాగా చూసుకోవడం ద్వారా శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
శనివారం నాడు 1.25 కిలోల మొత్తం నల్ల మినప పప్పును దానం చేయండి. ఏడు ధాన్యాలు దానం చేయడం మంచి పరిష్కారం.
నల్ల నువ్వులు, మైదా, పంచదార కలిపి చీమలకు తినిపించాలి. కాలువ, చెరువు లేదా నదిలోని చేపలకు పిండి మాత్రలను తినిపించండి.
ఇనుప,పాత బూట్లు, చెప్పులు శనివారం ఎవరికైనా దానం చేయాలి.అలాగే ఈ రోజున ఏ కొత్త పని లేదా ప్రయాణం ప్రారంభించవద్దు.
పేదలకు భోజనం పెట్టి వారి ఆశీస్సులు పొందండి. ఇది కాకుండా సమీపంలోని ఆలయంలో భండారా నిర్వహిస్తుంటే బొగ్గును విరాళంగా ఇవ్వండి.
నల్ల కుక్కకు పాలు లేదా రొట్టె తినిపించండి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. శని ప్రభావంతో బాధ పడేవారు ఈ రెమెడీని ప్రయత్నించాలి.

తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది, ఏపీకి విలన్ – సాయిరెడ్డి సంచలనం..!!

రాజ్యసభ వేదికగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ విభజన ద్వారా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఆశించిందన్నారు. పదేళ్ల తరువాత అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.
త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.

కీలక వ్యాఖ్యలు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైందని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు .రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ కనుమరుగవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఉన్నంత కాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదన్నారు. కుటుంబ విషయాల్లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం ఆశించినా నెరవేరలేదన్నారు. పదేళ్ల తరువాత అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే అక్కడి ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

హోదా పై మోసం చేసారు

2019లో రాహుల్‌ గాంధీ అమేధిలో ఓడిపోయారని గుర్తు చేశారు. 2024లో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు. మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను నమ్మడం లేదని, 2029 నాటికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ తథ్యమని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చిందని మండిపడ్డారు. ఏపీపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా పొందుపరిచేందుకు ఎందుకు విస్మరించారని నిలదీసారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదన్నారు. ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీ కాంగ్రెస్ బాధిత రాష్ట్రం

ఏపీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని సాయిరెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రంగా పేర్కొన్నారుఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారని గుర్తు చేసారు. ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదన్నారు. కుటుంబం వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణగా సాయిరెడ్డి పరోక్షంగా షర్మిల అంశం ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశం ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదని సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం పైన సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.

Life style: రాత్రి పడుకునే ముందు గ్లాస్‌ గోరు వెచ్చని నీరు తాగండి.. వారంలో ఈ తేడాలు కనిపిస్తాయి

శరీరానికి మంచి నీరు ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేయాలంటే కచ్చితంగా తగినంత నీరు తీసుకోవాలని చెబుతుంటారు.
వైద్యుల సూచన ప్రకారం ప్రతీ రోజూ కనీసం 6 నుంచి 8 లీట్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. శరీరంలో అన్నిభాగాలు సక్రమంగా పనిచేయాలన్నా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండాలన్నా కచ్చితంగా నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. అయితే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ రాత్రి ఒక గ్లాసు గోరు వెచ్చిన నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒక వారం రోజులు గోరు వెచ్చని నీరు తాగితే చాలు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇంతకీ గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

* గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్‌ను పొందుతుంది. బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత, నిద్రించడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు గోరువెచ్చని నీటిని తాగితే.. శరీర జీర్ణక్రియ మెరుగవుతుంది.

* గోరవెచ్చని నీటిని తీసుకోవడం వల్ల వల్ల రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో 2 చుక్కల నిమ్మరసం కలిపితే శరీరానికి మరింత శక్తి అందుతుంది.

* జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు గోరు వెచ్చని నీరు ద్వారా దూరమవుతాయి. జీర్ణక్రియకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, నిద్రపోయే ముందు ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగండి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వేడినీరు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
* రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగితే ఒత్తిడి, డిప్రెషన్‌ తగ్గుముఖం పడతాయి. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగితే మంచి నిద్ర సొంతమవుతుంది.

* గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మంపై ముడతలు దూరమవుతాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి, దీని కారణంగా చర్మం బిగుతుగా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

Cervical Cancer Vaccine: ఏ వయస్సులో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది?

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేది భారతదేశంలో ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఒక వ్యాధి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధించేందుకు టీకాపై దృష్టి పెట్టింది.
కానీ నేటికీ భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్, దాని వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన లేదు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఏ వ్యాక్సిన్‌ వేయాలో, ఎప్పుడు వేయాలో చాలా మంది మహిళలకు తెలియదు. టీకా గురించి సమాచారం లేకపోవడం వల్ల భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి, అయితే టీకాతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 70 నుండి 80 శాతం వరకు తొలగించవచ్చు. మరి ఈ టీకా ఏ వయస్సు ఉన్నవారు వేసుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టీకాలు ఎప్పుడు వేయాలి

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని ఓంకో గైనకాలజిస్ట్ డాక్టర్ సలోని చద్దా మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించే వ్యాక్సిన్ పొందడం వల్ల గరిష్టంగా 9 నుండి 14 సంవత్సరాల మధ్య ప్రయోజనం ఉంటుందన్నారు. అంటే 9 ఏళ్లు దాటిన అమ్మాయికి సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. ఈ వ్యాక్సిన్‌ను 26 సంవత్సరాల వయస్సు వరకు ఇవ్వగలిగినప్పటికీ, గరిష్ట ప్రభావం 9 నుండి 14 సంవత్సరాల మధ్య కనిపిస్తుంది. దీనికి కారణం లైంగికంగా చురుకుగా మారడానికి ముందు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే సెర్వికల్ క్యాన్సర్ లైంగికంగా చురుగ్గా మారిన తర్వాత వస్తుంది. అయినప్పటికీ ఈ క్యాన్సర్ రావడానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

26 ఏళ్ల తర్వాత టీకా వేయకూడదా?

26 ఏళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్‌ వేయకూడదా? అనే ప్రశ్నకు డాక్టర్ సలోని సమాధానం ఇచ్చారు. 26 ఏళ్ల తర్వాత టీకా వేయకూడదని కాదు. మహిళలు ఈ టీకా తీసుకోవచ్చు. ప్రభావం అంతగా లేనప్పటికీ, ఇప్పటికీ ఈ టీకా HPV వైరస్ అనేక రకాల జాతుల నుండి రక్షించగలదు. ఒక మహిళ శరీరంలో HPV వైరస్ ఉన్నప్పటికీ, ఆమె టీకాలు వేయవచ్చు. అయితే, మీరు ఈ వ్యాక్సిన్‌ను 9 నుండి 14 సంవత్సరాలలోపు తీసుకుంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సలహా. ఈ వయస్సులో టీకాలు వేయడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అన్నారు.

దీని గురించి, మాక్స్ హాస్పిటల్‌లోని హెమటాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ మాట్లాడుతూ, మీరు లైంగికంగా చురుకుగా లేకుంటే మాత్రమే HPV వ్యాక్సిన్ పొందడం వల్ల గరిష్ట ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మీరు లైంగికంగా చురుకుగా మారిన తర్వాత, HPV వైరస్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు టీకాలు వేసినప్పటికీ, అది 9 నుండి 14 సంవత్సరాలలోపు లేదా లైంగికంగా చురుకుగా మారడానికి ముందు లాభదాయకంగా ఉండదు. అందువల్ల, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు ఈ టీకాను తీసుకోవాలని సలహా ఇస్తుంది.
45 ఏళ్ల తర్వాత హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని డాక్టర్ కపూర్ చెప్పారు. ఈ వయస్సు నాటికి HPV వైరస్ శరీరంలో వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్ క్యాన్సర్‌కు కారణం కానవసరం లేదు. ఎందుకంటే చాలా మంది మహిళలు తమ జీవితకాలంలో HPV వైరస్ బారిన పడతారు. అయితే ఇది ప్రతి ఒక్కరిలో గర్భాశయ క్యాన్సర్‌కు కారణం కాదు.

మహిళలు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మహిళలు అసురక్షిత సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం, ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో శారీరక సంబంధాలు పెట్టుకోకపోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ కపూర్ చెప్పారు. ఇది కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం, ధూమపానం, మద్యపాన వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోని మహిళలు భయపడకూడదు. జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత టీకాలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ ఎక్కడ పొందాలి?

మీరు ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధర రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండగా, త్వరలో సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను విడుదల చేయనుందని, దీని ధర ఒక్కో డోస్ రూ.200 నుంచి రూ.400 ఉంటుందని తెలుస్తోంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

Health: భారత్‌లో గుండె సమస్యలు అందుకే ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే

ఒకప్పుడు గుండె సంబంధిత సమస్యలు అంటే 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే హార్ట్‌ ఎటాక్‌లు వస్తున్నాయి.
అప్పటి వరకు ఉషారుగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో కూడా హృద్రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగ సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడమే గుండె వ్యాధులకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ గంటలు ఒకేచోట కూర్చొని పనిచేసే వారిలో ఎక్కువ గుండె సమస్యలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇదిలా ఉంటే హృద్రోగాలకు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాలను వెల్లడించింది. వ్యాయామం చేయని కారణంగానే భారతీయుల్లో హృద్రోగ సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
సాధారణంగా మనిషీ వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే భారతీయుల్లో యాభైశాతానికిపైగా ప్రజలు వ్యాయామం చేయడం లేదంటా. అందుకే భారత్‌లో హృద్రోగ సమస్యలు ఎక్కువని చెబుతున్నారు. 150 నిమిషాలని లెక్కపెట్టు కోలేకపోవడం, రోజుకి 30 నిమిషాలని ప్రత్యేకంగా కేటాయించకపోవడం ఇందుకో కారణమని చెబుతుంటారు వైద్యులు. ఇలాంటి వారు మనం నడిచే అడుగులను కౌంట్ చేసే మొబైల్‌ యాప్స్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ఇక వ్యాయామం నిజంగానే హృద్రోగాలను తగ్గిస్తుంద అన్న అంశంపై అమెరికాలోని ఎంఐటీకి చెందిన పరిశోధకులు పరిశోధనలు చేపట్టారు. భారత్‌ సహా 42 దేశాలకి చెందిన 20 వేల మందికి సంబంధించిన వ్యాయామ వివరాలను పరిశీలించారు. ప్రతీ రోజూ 6 నుంచి 9 వేల అడుగులు నడిచే వాళ్లలో హృద్రోగ సమస్యలు 60 శాతానికి తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు. ఇదిలా ఉంటే భారతీయులు ముఖ్యంగా, ఉద్యోగ విరమణ పొందిన వారు శారీరక శ్రమకి దూరమవుతున్నారనీ, అలాంటి వాళ్లు ఇలా అడుగులు లెక్కలేసుకొని నడిస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.

Health Tips : సొరకాయను ఇలా తీసుకుంటే హై బీపి క్షణాల్లో మాయం..

హై బీపి సమస్య ఈ మధ్య అందరికీ వస్తుంది.. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. అతి చిన్న వయస్సులోనే బీపి సమస్యతో బాధ పడుతుంటారు..
చిన్న వయసులోనే ఇలా బీపీతో బాధపడడం వల్ల అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా వారికి ఎటువంటి లక్షణాలు లేవని వారికి బీపీ లేదని భావిస్తూ ఉంటారు. కానీ లక్షణాలు లేనప్పటికి చాలా మంది బీపీతో బాధపడుతన్నారని నిపుణులు చెబుతున్నారు.. సొరకాయ తో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు.. ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలు చక్కగా జరుగుతాయని వారు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుందని కొన్ని పరిశోధనల్లో రుజువైంది.. సొరకాయలో 90 శాతం నీరు ఉంటుంది.. అలాగే పోటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.. దాంతో బిపిని వెంటనే కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు..
టెట్రాసైక్లిక్ ట్రైటెర్పెనోయిడ్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంతో పాటు రక్తనాళాలు వ్యాకోచించేలా చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.. అందుకే బీపి సమస్యతో బాధ పడేవారు రోజూ ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.. మీరు ఈ సమస్యతో బాధ పడుతుంటే ఈ జ్యూస్ ను ట్రై చెయ్యండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Teeth Care: మీరూ రాత్రిళ్లు నిద్రకు ముందు బ్రష్‌ చేయట్లేదా? ఈ విషయం తెలుసుకోండి..

దంతాల సంరక్షణలో చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా అనేక నోటి సమస్యలకు గురవుతుంటారు. దంతాల సంరక్షణకు బ్రషింగ్ అనేది ముఖ్యం. అలాగే దంతాల పరిశుభ్రతకు కూడా ఇదే అత్యంత ఉత్తమ మార్గం.
రోజూ పళ్లను శుభ్రంగా తోముకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది పళ్ళు తోముకోవడంతో తమ రోజును ప్రారంభిస్తారు. అయితే రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవడం చేయరు. రోజు ప్రారంభంలో ఏ విధంగా అయితే పళ్లు తోముకుంటారో.. రోజు ముగింపులో కూడా పళ్లు తోముకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా రోజుకు రెండుసార్లు దంతాలను బ్రష్ చేయాలని సూచిస్తున్నారు. నిద్ర లేవగానే ఒకసారి, నిద్రపోయే ముందు ఒకసారి. కానీ చాలామంది ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు.

అమెరికన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ఉదయం పళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యమో రాత్రిపూట పళ్ళు తోముకోవడం కూడా అంతే ముఖ్యం. ఉదయం కంటే రాత్రిపూట పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యమట. మనం రోజంతా తినే ఆహారం, రాత్రిపూట నోటిలో రకరకాల బ్యాక్టీరియా పేరుకుపోయేలా చేస్తుంది. ఈ స్థితిలో పళ్లు తోమకుండా నిద్రపోతే ఆరోగ్యానికి మరింత హానికరం. దీంతో దంతక్షయం, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌ సమస్యలు తలెత్తుతాయి. పళ్ళు కూడా చిన్న వయసులోనే రాలిపోతాయి. రాత్రిపూట పళ్లు తోమకుండా నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

రాత్రి పళ్లు తోముకోకుండా నిద్రపోతే నోటిలో బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా దంత క్షయాన్ని పెంచుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా పెంచుతుంది.
దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం నుంచి బాక్టీరియా యాసిడ్ విడుదల చేస్తుంది. ఈ యాసిడ్ పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇలా రోజూ జరిగితే దంతాలు, చిగుళ్లకు సంబంధించిన రకరకాల సమస్యలు తలెత్తుతాయి.
రాత్రిపూట పళ్ళు తోముకోకపోతే ఫలకం పేరుకుపోతుంది. మరుసటి రోజు ఉదయం పళ్ళు తోముకున్నా ఈ ఫలకం పూర్తిగా తొలగిపోదు. ఈ ఫలకం నోటి దుర్వాసనకు కారణమవుతుంది.
నోటిలోని ఎర్రటి గ్రంథులు పగటిపూట కంటే రాత్రిపూట తక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. లాలాజలం నోటిలోని బ్యాక్టీరియాను కడగడానికి సహాయపడుతుంది. కానీ రాత్రిపూట అలా జరగదు. పళ్ళు తోముకోవడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. లాలాజలం సరిగా పనిచేయదు. ఇది దంతాలు, చిగుళ్ల సమస్యలను పెంచుతుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత పళ్లు తోముకోవడం చాలా అవసరం.

Bathing: నీటిలో దీన్ని కలిపి తలస్నానం చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయం.. అదేంటో తెలుసుకోండి..

Bathing with Salt Water Benefits: వర్షాకాలం ప్రారంభం అయింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్యం దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా చాలా మంది వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేస్తారు. అయితే నీటిలో ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే తెలుసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు దూరమవుతాయి: ఉప్పునీరు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. తలస్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే చిన్నపాటి శరీర నొప్పులు తగ్గిపోతాయి. ఇది కాకుండా పాదాలలో నొప్పి ఉంటే.. పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటితో కడుక్కోవడం వల్ల కూడా ప్రయోజనం చేకూరుతుంది.

ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది : ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొలగించడానికి ఉప్పునీరు చాలా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఉప్పులో ఉండే మినరల్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని అన్ని రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మొటిమలు : మొహంపై మొటిమలను వదిలించుకోవడానికి ఉప్పునీరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శ్వేత రంద్రాలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత శరీరంలోని మురికి సులభంగా బయటకు వస్తుంది. ఇలా చేస్తే బాడీ డిటాక్స్ వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. అలాగే, ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా మేలు చేస్తుంది.

ఒత్తిడి తక్కువ అవుతుంది: ఏదైనా విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటే, ఖచ్చితంగా ఉప్పు నీటితో స్నానం చేయాలి. దీని నుంచి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. ఉప్పు నీటిలో ఉండే మినరల్స్ శరీరంలో శోషించబడతాయి. సోడియం మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంటారు. ఇది కాకుండా శరీరం డిటాక్స్ చేసినప్పుడు శరీరం నుంచి ఒత్తిడి కూడా విడుదల అవుతుంది. ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ నీటితో స్నానం మంచి అనుభూతి చెందుతారు.

Viral News: 1992లో సముద్రంలో విరిసిన సీసా 32 ఏళ్ల తర్వాత తీరానికి.. లోపల లెటర్ లో ఏముందంటే..

సముద్రం తన గర్భంలో ఏ వస్తువుని దాచుకోదు.. ఏదొక సమయంలో తీరానికి విసిరేస్తుంది అని పెద్దలు చెబుతారు. అందుకు సాక్ష్యంగా చాలా సార్లు సముద్ర తీరంలో దశాబ్దాల నాటి ఏదో వస్తువులు కనిపిస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇటీవల న్యూయార్క్‌లోని షిన్నెకాక్ బేలో ఇలాంటిదే ఒకటి కనిపించింది. ఇది ఒక గాజు సీసా. అయితే గాజు సీసా కనిపించడం కూడా ఒక విశేషమేనా అని అనుకుంటుంటే.. అది నార్మల్ బాటిల్ కాదు మరి. గత 32 ఏళ్లుగా సముద్రంలో తేలియాడుతున్నది. అందులో ఓ లేఖ కూడా ఉంది. ఎవరో ఉత్తరం రాసిన తర్వాత ఆ సీసాలో ఈ ఉత్తరాన్ని సీల్ చేసి అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరారు.

న్యూయార్క్‌లోని మాటిటక్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న షాన్ , బెన్నీ అనే విద్యార్థులు 1992లో ఈ లేఖ రాశారు. విద్యార్థులు ఈ బాటిల్‌ను ఎర్త్ సైన్స్ ప్రాజెక్ట్‌గా లాంగ్ ఐలాండ్ సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరారు. లేఖలో విద్యార్థులు ఇచ్చిన సమాచారాన్ని పూరించండి .. ఇచ్చిన చిరునామాకు బాటిల్‌ను తిరిగి ఇవ్వండి. అంటూ స్కూల్ అడ్రస్ రాశారు కూడా.

nypost ప్రకారం.. ఆడమ్ ట్రావిస్ అనే వ్యక్తి షిన్నెకాక్ బేలో ఈ బాటిల్ ను అందులో ఉన్న లేఖను చూశాడు. అనంతరం మట్టిటక్ హై స్కూల్ అలుమ్ని అనే ఫేస్‌బుక్ పేజీలో బాటిల్ తో పాటు ఉత్తరం ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఆ లెటర్ రాసిన విద్యార్థుల్లో ఒకరైన బెన్నీ డోరోస్కీ ఈ పోస్ట్‌ను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఎర్త్ సైన్స్ ఉపాధ్యాయుడు రిచర్డ్ ఇ. బ్రూక్స్ ని గుర్తు చేసుకుంటూ ఈ లెటర్ రాసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.

బెన్నీ ఇలా వ్రాశాడు.. మిస్టర్ బ్రూక్స్ అద్భుతమైన ఉపాధ్యాయుడు. ఈ ఉత్తరం వయసు 32 సంవత్సరాలు అని నమ్మలేకపోతున్నాను. బాటిల్ దొరికిన వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. బెన్ని చేసిన వ్యాఖ్యకు ఆడమ్ స్పందించాడు.. సమాధానం ఇవ్వడంతో బెన్ని కోరిక కూడా నెరవేరింది. ఆడమ్ బాతులను వేటాడే పరికరాలను శుభ్రం చేస్తున్నప్పుడు.. శిధిలాల కుప్ప పైన ఒక బాటిల్ ను అందులో ఉన్న ఉత్తరాన్ని చూసినట్లు ఆడమ్ చెప్పాడు.

                      Adam Travis

అదే సమయంలో టీచర్ బ్రూక్స్ కొడుకు జాన్ ఈ పోస్ట్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. విద్యార్థులతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం నచ్చింది. ఇది మాకు మొమెంటో కంటే తక్కువ కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ ఉత్తరం గురించి ప్రపంచానికి తెలియజేసిన జాన్ ఆడమ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే తన తండ్రి ఈ ప్రపంచంలో ఇప్పుడు లేరని.. గత సంవత్సరం అల్జీమర్స్‌తో మరణించారని చెప్పారు ఉపాధ్యాయుడి కొడుకు జాన్.

మీడియా కథనాల ప్రకారం ఇలా సముద్రంలో బాటిల్ లెటర్ తేలుతూ ఒడ్డుకు చేరుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. 1997లో కూడా ఇలాంటి వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్స్‌లోని వెండీలో మసాచుసెట్స్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి రాసిన బాటిల్ సందేశం కనిపించింది. అంతేకాదు 1972లో రాసిన లేఖ 2019లో దొరికింది.

Viral: దేవుడా.. ఎక్కాలు ఇలాక్కూడా నేర్చుకోవచ్చా? ఇన్నాళ్లూ అనవసరంగా బట్టీ కొట్టామే!

పిల్లలకు ఎక్కాలు నేర్పించేందుకు ఓ టీచర్ కనిపెట్టిన కొత్త టెక్నిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

గణితం అంటే చాలా మంది విద్యార్థులు భయపడతారు కానీ కరెక్ట్ టీచర్ దొరికితే మాత్రం చదువంతా నల్లేరు మీద నడకే అయిపోతుంది. కానీ, అలాంటి టీచర్లు దొరకడం చాలా అరుదు. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో దాగున్న టాలెంట్ అంతా జనాలు ముందుకొచ్చేస్తోంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి జనాలను బాగా సర్‌ప్రైజ్ చేస్తోంది. వీడియోలోని టీచర్ ఎక్కాలు నెర్పించేందుకు ఫాలో అవుతున్న టెక్నిక్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ చిన్ని సూత్రం తెలీక ఇన్నాళ్లూ అనవసరంగా టేబుల్స్ బట్టీ కొట్టామంటూ వాపోతున్నారు (Teacher follows unique technique to help pupils learn tables).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ మాస్టారు మొదట ఒకటి నుంచి పది వరకూ అంకెలను బోర్డు మీద పై నుంచి కిందకు రాశారు. ఆ తరువాత మళ్లీ ఒకటి తరువాత అంకెలను లెక్కబెడుతూ మొదటి వరుస పక్కన ఖాళీల్లో నింపుతూ వెళ్లారు. దీంతో, రెండు ఎక్కం అయిపోయింది. ఇదే పద్ధతిలో మూడో ఎక్కం, నాలుగో ఎక్కం కూడా పూర్తి చేశాడు. టీచర్ చెబుతున్న టెక్నిక్ సులభంగా ఉండటంతో ఆయన కంటే ముందే స్టూడెంట్లు ఒక్కో టేబుల్‌లోని సంఖ్యలను చెప్పుకుంటూ వెళ్లిపోయారు.

ఇదంతా చూసిన జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. పిల్లలకు టేబుల్స్‌ సులువుగా అర్థమయ్యేందుకు మాస్టారు కనిపెట్టిన టెక్నిక్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ టెక్నిక్ గురించి ముందే తెలిసుంటే ఇంతకాలం టేబుల్స్ బట్టీ కొట్టేవాళ్లం కాదని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్‌ల మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ కొత్త టెక్నిక్‌పై మీరూ ఓ లుక్కేయండి.

వీడియో చూడండి 

Health

సినిమా