Sunday, November 17, 2024

424 Jobs: వైద్యశాఖలో ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

ఇందులో  234 పోస్టులు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.

11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్‌ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్‌ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు.
7 వరకు దరఖాస్తులకు అవకాశం

కాగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్‌ వైద్య పోస్టులకు https://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మైదాన ప్రాంతాల్లో అయితే నెలకు రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.­1.40 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు.
దరఖాస్తు సమయం­లో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు 7416664387/8309725712 నంబర్లను సంప్రదించవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా ఎప్ప­టి­కప్పుడు ఖాళీలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది.

అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ను సైతం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా బోర్డు­కు అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో గతంలో ఎన్నడూ­లేని విధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ కొనసాగుతోంది.

AP AHD Recruitment 2024- ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు, నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department)వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలోని బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Assistant Surgeon) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.
అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు: వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌
వేతనం: రూ.54,060/- 1,40,540/-

వయో పరిమితి: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బి.వి. యస్‌.సి పాతాలజీ/మైక్రోబయాలజీ/పేరసైటాలజీ/ఎపిడమాలజీ/వైరాలజీ/ఇమ్యునాలజీ బయెటెక్నాలజీ/వెటర్నరీ పబ్లిక్‌ హెల్త్‌ ఏదైనా ఒక విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 07.02.2024
మరిన్ని వివరాల కోసం https://ahd.aptonline.in ను సంప్రదించండి.

NIACL Recruitment 2024- NIACLలో 300 అసిస్టెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

న్యూ ఇండియా అస్యురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(NIACL) 300 అసిస్టెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: 300
అర్హత:గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
వయో పరిమితి: 21-30 ఏళ్లకు మించరాదు.
వేతనం: ₹22,405 నుంచి 62,265/-

అప్లికేషన్‌ ఫీజు: రూ.850/-(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 100/).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 15/02/2024

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://www.newindia.co.in/recruitment/list ను సంప్రదించండి.

ఏపీలో కొత్తగా 3 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆదిత్య విద్యాసంస్థలు (కాకినాడ జిల్లా), అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ (రాజంపేట), గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ (రాజమండ్రి)కి అవకాశం కల్పించింది.
ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో 70% సీట్లతో పాటు కొత్తగా ఏర్పడే పరిస్థితిల్లో 35% సీట్లను కన్వీనర్ కోటాకు కేటాయించాల్సి ఉంది. అలాగే, మిచౌంగ్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి నిధులు ఈ నెలలో విడుదలవుతాయని సిఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు త్వరలోనే నిధులు కేటాయిస్తామన్నారు. వేసవిలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటికి ఇబ్బందిలేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Ravadurg Gooty Fort-చరిత్ర ప్రసిద్ది చెందిన గుత్తికోట- గుత్తి కి ఆ పేరు రావటానికి కారణం….?? 15 బురుజులు ,15 ద్వారాలు… మురారీరావు గద్దె… 101 బావులు. రంగమండపం. బారా మహల్. అప్పాజీ తిమ్మరుసు బాల్యం గుత్తి లొనే… అనేక చారిత్రక విషయాలకు… అనేక రాజ వంశాలచరిత్రలో భాగం….గుత్తి…. గుత్తిని గగనతలం నుంచి చూపు వీడియో…

Gooty Fort-చరిత్ర ప్రసిద్ది చెందిన గుత్తికోట- History of Gooty Fort | Anantapur

చరిత్ర ప్రసిద్ది చెందిన గుత్తికోట అనంతపురము జిల్లాలో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో గుత్తి పట్టణ సమీపంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన దుర్గములలో ఒకటి. అలనాటి రతనాల సీమగా పిలువబడిన రాయలసీమలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కర్నూలు, అనంతపురము జిల్లాల సరిహద్దులో గుత్తి పట్టణానికి తూర్పు దిశలో 300 మీటర్ల ఎత్తున కొండలపై నిర్మించిన గుత్తి కోట శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా విలసిల్లుతోంది. ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారములు కలిగి ఉంది. ఇందులో రెండు శాసనములు, వ్యాయామశాల మరియు మురారి రావు గద్దె ఉన్నాయి. మురారి రావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. కోటలో చాలా నూతులున్నవి ఆంధ్రుల పరాక్రమ వైభవానికి, శిల్పుల సాధనిర్మాణ కళా కౌశలానికి మౌన సాక్షిగా నిలిచి మూడు వైపులా భారీ విస్తీర్ణంలో కోటను నిర్మించారు. ప్రారంభంలోనే పెద్ద కందకం ఉంటుంది. అక్కడి నుండి కోట ప్రారంభం అవుతుంది.

ఆ తరువాత సింహద్వారం, నగరేశ్వర ఆలయం. రెండవ ద్వారం దాటి పైకి వెళితే సైనికులకుద్దేశించి విశాలమైన మైదానం. అక్కడ గజశాలలు, అశ్వశాలలు ఉంటాయి.మరికొన్ని ద్వారాలు దాటితే రాజ్యోగుల నివాస గృహాల ఆనవాళ్లు కనిపిస్తాయి. కోటలో హిందూ రాజుల నాట్యశాలగానూ, మహమ్మదీయుల మసీదుగానూ ఉపయోగించే రంగమండపం ఉంది. వాటిలో వర్ణ చిరత్రాలు నేటికీ వన్నె తగ్గలేదు. మండపం దాటగానే రాజకీయ సౌందర్యాన్ని పుచ్చుకొన్న ఒక మండపం ఉంది. దాన్ని బేగం మహల్‌ అంటారు. దాని సమీపంలో మురారిరావు గద్దె, సభాభవనం తదితర భవనాలు ఉంటాయి. తరువాత ఖిల్లా అనే శిఖరాగ్ర భాగం ఉంటుంది. ఆ శిఖరం నుంచి కిందికి చూస్తే చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం 50 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. శత్రువులను దెబ్బతీయడానికి కోటను నిర్మించారు. ప్రాకారంపై నుంచి శత్రువులకు కనిపించకుండా దాక్కొని కోట దెబ్బతినకుండా రాళ్లు దొర్లించడానికి వీలుగా నిర్మాణం జరిగింది. దుర్గంలో మంచినీటికి 101 బావులు ఏర్పాటు చేశారు. ఈ దుర్గం నిర్మాణం వైశిష్ట్యాన్ని చూసిన విల్స్‌ అనే చరిత్రకారుడు క్షామం, మోసం ఇవి రెండు మాత్రమే దుర్గాన్ని లొంగదీయగలవని తన పుస్తకంలో వ్యాఖ్యానించాడు. గుత్తి సమీపంలో గౌతముడు అనే మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని దానిలో నివసించాడు. గౌతముని పేరు మీద గౌతమపురం అని దీనిని పిలిచేవారు. అది కాలక్రమేణా గుత్తిగా మార్పు పొందిందని ఒక ఐతాహ్యం. గుత్తికోట చుట్టూ ఉన్న గుట్టలతో కలిపి చూడటానికి పుష్పగుచ్ఛం ఆకారంలో ఉన్నందున దీనిని పూగుత్తి అని తరువాత గుత్తి అని పిలిచేవారని ఒక కథనం. ఈ ప్రాంతాన్ని మొదట శాతవాహనులు పాలించారు. అనంతరం బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటములు, పశ్చిమ గంగమ రాజులు, పశ్చిమ చాళుక్యులు పాలించారు. కోటగోడను 11, 12వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది.

గుత్తి కొట పూర్వ చరిత్ర
గుత్తికోటకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత సామాన్యమైనది కాదు. కాలం పుటలను వెనుక్కు తిప్పితే మెరిసిపోయే గాథలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం రెండువేల ఐదు నుంచి తొమ్మిది వందల వరకు గుత్తి దుర్గంలో జన నివాసాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. రాతి యుగం అవశేషాలు కొన్ని తవ్వకాల్లో బయటపడ్డాయి. అలనాటి మనుషులు నివాసం ఉన్న గృహాలను బ్రిన్ పూల్ అనే బ్రిటిష్ వ్యక్తి బహిరంగ పరిచాడు. అనాటి పనిముట్లు శిథిలాలు ఉరవకొండ మండలంలోని లత్తవరం, విడపనకల్లు మండలంలోని కరకముక్కల ప్రాంతాల్లో కూడా బయటపడ్డాయి. క్రీ.పూ.260 నుంచి మాత్రం దీని విశేషాలు క్రమ పద్దతిలో వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతాన్ని క్రీ.పూ.220 నుంచి 200 వరకు శాతవాహనులు పాలించినట్లు తెలుస్తోంది. అనంతరం బాదామి చాళుక్కులు, రాష్ట్ర కూటములు, పశ్చిమ గంగమ రాజులు, పశ్చిమ చాళుక్యులు పాలించారు. కాగా కోట గోడను 11,12వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది. కోటలో కనిపించే సంస్కృత శ్లోకాన్ని బట్టి హరిహర బుక్కరాయలు గుత్తిని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలుస్తోంది. బుక్కరాయల కాలంలోనే కోట శంకాకృతిని సంతరించుకుందని తెలుస్తోంది. విజయనగర రాజుల హయాంలో కోటతో గొప్ప వెలుగు పొందింది. నరసింహరాయులు హయాం నుంచి వారి స్వాధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగర పాలకుల చిహ్నమైన గజలక్ష్మి చిత్రం అన్ని ద్వారాలపై ప్రముఖంగా కనిపిస్తుంది. రాయల మరణాంతరం వారసత్వ తగాదాల వివాదంలో గుత్తి కోటకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. అప్పాజిగా ప్రసిద్ధుడైన తిమ్మరుసులు తమ బాల్యాన్ని గుత్తిలో గడిపినట్లు ఆధారాలు ఉన్నాయి. విజయనగరరాజుల వివాదంలో సామ్రాజ్యానికి వారసులైన సదాశివరాయలను మంత్రి శలకం తిమ్మయ్య కుట్ర చేసి ఈ కోటలోనే బంధించాడు. తరువాత రామ రాయలులు గుత్తిపై దండెత్తి వచ్చి సదాశివరాయులను విడిపించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బిజాపూర్ నవాబులు పాలించారు. క్రీ.పూ.1650 ప్రాంతంలో నల్గొండ నవాబులు కుతుబ్ షాహి అధికారులైన మీర్ జుమ్లా అనేక నెలలు ముట్టడి తరువాత కోటను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఔరంగజేబు దాడుల్లో గుత్తి మొగలాయిల వశమైంది. క్రీ.పూ.1750 ప్రాంతంలో మరాఠీరాజు గుత్తిని స్వాధీనం చేసుకొన్నాడు. క్రీ.శ 1762లో హైదర్ ఆలీ గుత్తిపై దండెత్తి ఆరు నెలలు ముట్టడి సాగించినా గెలుపు పొందలేక వెనుదిరిగి మరో దండయాత్రలో స్వాధీనం చేసుకొన్నాడు. . 1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు గుత్తి దుర్గానికి పేరు రావడం వెనుక అనేక కథలు ఉన్నాయి. సమీపంలో గౌరి గుట్టమీద గౌతమ మహర్షి తపస్సు చేసినందున గౌతమీపురంగా ఏర్పడి కాలక్రమేణా గుత్తిగా మారిందని ప్రజల నమ్మకం. కాగా 9,10 శతాబ్దాలలో నొలంబావడి అని పేరు ఉన్నట్లు హేమావతి, మడకశిర శాసనాలు తెలుపుతున్నాయి. కాగా గుత్తి దుర్గం పాలకులుగా ఉన్న మురాఠీరావు మనవడు వారి వారసుడైన ఘోర్పడే 1984లో గుత్తి దుర్గాన్ని సందర్శించాడు

Great Wall of China చైనా పెద్ద కుడ్యము (గోడ)., దీని పొడవు 6,508 కి.మీ. లేదా 4,000 మైళ్ళు..

చైనా మహా కుడ్యము (Great Wall of China) చైనాలో ఉన్న ఒక పెద్ద కుడ్యము (గోడ)., దీని పొడవు 6,508 కి.మీ. లేదా 4,000 మైళ్ళు.[1] క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో నిర్మింపబడి, క్రీ.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. ఈ గోడ అనేక గోడల సమూహము. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి “ఖిన్ షీ హువాంగ్” చే క్రీ.పూ. 200 – 220 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణ కారణం, చైనా ఉత్తర సరిహద్దులను కాపాడుట. నవీన కాలంలో కనిపించే గోడ ‘మింగ్ వంశ’ కాలంలో నిర్మింపబడింది
క్రీ.పూ. 7వ శతాబ్దకాలంలో చైనీయులకు ఈ కుడ్యనిర్మాణ సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్-రాష్ట్ర యుద్ధకాలమైన 5వ శతాబ్దం నుండి క్రీ.పూ. 221 వరకు, “ఖీ”, “యాన్”, మరియు “ఝావో” రాష్ట్రాలమధ్య, వారి వారి సరిహద్దులను కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెదికారు. కోటలకు గోడవలె, రాష్ట్రభూములకూ పటిష్ఠమైన శత్రు దుర్భేద్యమైన కుడ్యాలను నిర్మింపతలపెట్టారు. “ఖిన్ షీ హువాంగ్” క్రీ.పూ. 221 లో తన శత్రురాష్ట్రాలను జయించి చైనా ఏకీకరణ చేసి, ‘ఖిన్ సామ్రాజ్యాన్ని’ స్థాపించాడు. ఈ ఏకీకరణ తరువాత, రాష్ట్రాల మధ్య గల గోడలు, తన సామ్రాజ్యానికి అడ్డుగోడలుగా తయారయ్యాయి, వీటిని తొలగించాలని ఆజ్ఞాపించాడు. తన సామ్రాజ్య ఉత్తరభాగాన, మహాకుడ్యాల నిర్మాణానికి ఆజ్ఞలు జారీ చేశాడు. వీటి నిర్మాణానికి కొండప్రాంతాల కుడ్యాలకు కొండలనుండే రాళ్ళను తరలించారు. మైదాన ప్రాంతాలలో రాళ్ళనూ మట్టినీ ఉపయోగించారు. ఈ ప్రాచీన గోడలు చాలావరకు శిథిలావస్థకు చేరుకొన్నాయి, కాని అందులో కొన్ని నేటికినీ నిలిచి ఉన్నాయి.[3] తదనంతరం, ‘హాన్’, ‘సాంగ్’ మరియు ‘జిన్’ వంశపు రాజులు, మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు మరియు విశాలీకరణలు చేశారు. ఈ నిర్మాణాలతో ఉత్తరాది ఆక్రమణల నుండి రక్షణకు ఇవి ఉపయోగపడ్డాయి.
1907 లో మహాకుడ్య ఛాయాచిత్రం.
‘ఖిన్’ రాజుల కోటల నిర్మాణాలకంటే ‘మింగ్’ rajulu నిర్మాణాలు చాలా బలీయంగా వుండేవి. దీనికి కారణం వీరు ‘ఇటుక’లను ఉపయోగించడమే. మంగోలుల దండయాత్రలు సంవత్సరాల తరబడీ కొనసాగడంవల్ల మింగ్ వంశస్థులు ఈ కుడ్యాల నిర్మాణాలను, మరమ్మత్తులను కొనసాగిస్తూనేవచ్చారు. బీజింగ్ నగర సమీపాన ఈ కుడ్య భాగాలు ఇంకనూ బలిష్ఠంగా నిర్మింపబడ్డవి.[4]
క్రీ.శ. 1600 లో, ‘షున్’ వంశ కాలంలో, మంచూ ల దండయాత్రలనుండి తమ రాజ్యాలను కాపాడుకోవడంలో ఈ కుడ్యాలు మహత్తరమైన పాత్రను పోషించాయి. ‘యువాన్ చోంగువాన్’ సేనాధిపత్యంలో, మంచూలు చైనాలో ప్రవేశించలేకపోయారు. ఆఖరుకు, షున్ వంశపాలనతో విసిగిపోయిన ప్రజలు, ‘వూ సాంగుయీ’ నాయకత్వంలో షన్ హైగువాన్ వద్ద ద్వారలను తెరచి మంచూలకు ప్రవేశం కల్పించారు. మంచూలు బీజింగ్ నగరాన్ని స్వాధీనపరచుకొని “ఖింగ్” సామ్రాజ్యా”న్ని స్థాపించారు. వీరి కాలంలో ఈ కుడ్యాల మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు ఆగిపోయాయి. చైనా దక్షిణాన గల బార్బేరియన్ల నుండి చైనాను రక్షించుకొనుటకు చైనాకు దక్షిణాన కుడ్యముల నిర్మాణం ప్రారంభింపబడినది
ప్రముఖంగా పేర్కొనదగిన భాగాలు
జిన్ షాంగ్లిన్ వద్ద మహాకుడ్యభాగ ప్రాంతం
బీజింగ్ నగరపాలికలో గల ఈ మూడు ప్రాంతాలు, పునర్నిర్మాణాలకు నోచుకొని, యాత్రికులకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
· జుయోంగుఆన్ కనుమలకు చెందిన “ఉత్తర కనుమ” “North Pass” దీనినే ‘బడాలింగ్’ అనికూడాపేరు. ఇది రాళ్ళతోనూ ఇటుకలతోనూ నిర్మింపబడింది. దీని ఎత్తు 7.8 మీటర్లు (25.6 అడుగులు) మరియు వెడల్పు 5 మీటర్లు (16.4 అడుగులు).
· మింగ్ మహాకుడ్యము లోతైన ప్రాంతాలు కలిగివున్నది. దీని పొడవు 11 కి.మీ. (7 మైళ్ళు), ఎత్తు 5 నుండి 8 మీటర్లు, (16–26 ft), మరియు వెడల్పు 6 మీటర్లు (19.7 అడుగులు) పాదభాగంలోనూ, శిరస్సుభాగంలో దాదాపు 5 మీటర్లు (16.4 అడుగులు). వాంగ్జింగ్లో, జిన్ షాంగ్లింగ్ యొక్క 67 ‘కుడ్య బురుజుల’లో ఒకటి. ఇది సముద్ర ఉపరితలానికి 980 మీటర్లు (3,215 అడుగులు) ఎత్తున గలదు.
· జిన్ షాంగ్లింగ్ కు ఆగ్నేయాన, ముతియాను కుడ్యము ఆగ్నేయం నుండి వాయువ్యంవైపుకు అనేక ఒంపు సొంపులతో 2.25 కి.మీ. పొడవును కలిగివున్నది.
· విశేషాలు[మార్చు]
·
· 1805 మ్యాపులో మహాకుడ్యము
· ఇటుకలు ఉపయోగించకముందు, వీటి నిర్మాణంలో ‘తైపా మట్టి’, రాళ్ళు మరియు కలపను ఉపయోగించారు. మింగ్ వంశస్థుల కాలంలో వీటి నిర్మాణానికి ఇటుకలను విరివిగా ఉపయోగించారు. ఇటుకలు, టైల్స్, సున్నము మరియు రాళ్ళు ఉపయోగించారు. ఇటుకల ఉపయోగం నిర్మాణంలో వేగాన్ని పెంచింది. రాళ్ళ స్థానంలో ఇటుకల ఉపయోగం చాలా సులువైంది. మట్టి కంటే ఇటుకలు ఎక్కువ బరువును మోస్తాయి, ఇటుకల కంటే రాళ్ళ నిర్మాణం ఎక్కువ ధృడత్వాన్ని కలిగివుంటుంది. కాని రాళ్ళ ఉపయోగం అంత సుళువైనది కాదు. అందుకే ఇటుకలను ఎక్కువగా ఉపయోగించారు. రాళ్ళను పునాదుల కొరకునూ మరియు ఇటుకలను గోడల నిర్మాణానికి ఉపయోగించారు.
· ప్రస్తుత స్థితి[మార్చు]
·
· బీజింగ్ దగ్గర ముతియాన్యు వద్ద మహాకుడ్యము.
·
· ఈ కుడ్యానికి చెందిన బీజింగ్ ఉత్తర ప్రాంతం, మరమ్మత్తులు పునర్నిర్మాణాలకు నోచుకొని, పర్యాటకుల కేంద్రంగా విరాజిల్లుతున్నది. దీని ఇతర ప్రాంతాలు కుడ్యశిథిలాలతో, గ్రామ ఆటస్థలములుగానూ వీటి ఇటుకలు రాళ్ళు పల్లెవాసుల ఇండ్ల కట్టడాలకు దురుపయోగమౌతున్నవి.[6] ఈ కుడ్యం అనేక భాగాలు దురుపయోగం పాలౌతున్నవి. ఈ కుడ్యముల గూర్చి సరైన సర్వేలు చేపట్టక పోవడం విచారకరం. మరీ ముఖ్యంగా లోపలి ప్రాంతాలలో దీనిపై సరైన నిఘాలేకపోవడం దురదృష్ట్రం.
· రాబోవు 20 సంవత్సరాలలో ‘గాన్సూ’ రాష్ట్రంలోని ఈ కుడ్యభాగం 60 కి.మీ. కంటే ఎక్కువ భాగం అంతరించిపోయే ప్రమాదముంది. దీనికి కారణాలు దుమ్ము తుఫానులు మరియు ఇసుక తుఫానులు. ఈ ప్రాంతాలలో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు కుదించుకుపోయింది. ఈ కుడ్యాల ఆకృతులూ తమ ఆకర్షణను కోల్పోతున్నాయి.[7]
· కుడ్యం బురుజులు మరియు టవర్లు
·
· బురుజులు
· సైన్యపు అవసరాలైన తపాలా మరియు వార్తాసంకేతాల కొరకు ఈ కుడ్యాల వెంబడీ గల సైన్యానికి ఈ బురుజులు చాలా ఉపయోగపడ్డాయి. శత్రువుల కదలికలను గుర్తించడానికి మరియు సైగలద్వారా సందేశాలను పంపడానికి ఈ బురుజులు మరియు టవర్లు చాలా ముఖ్యమైనవని నిరూపింపబడ్డాయి
చంద్రుడి నుండి[మార్చు]
మే 1932 లో రిప్లీ వేసిన ‘నమ్ము నమ్మక పో’ అనే కార్టూన్ లో ఈ కుడ్యంగురించి ఇలా చెప్పబడింది: చంద్రుడిపైనుండి వీక్షించగలిగే మానవుని ఘనమైన పని ఇది.
1938 లో ‘అత్భుతాల రెండవ పుస్తకం’ లో కూడా దీని గురించి ఇలాంటి ప్రస్తావనే జరిగింది. కానీ ఇది నిజం కాదు.
ఈ మహాకుడ్యము అత్యధికంగా 30 అడుగుల వెడల్పును కలిగివున్నది. మరియు తన చుట్టుప్రక్కన గల రంగునూ కలిగివున్నది. కటకాల దృశ్యబలం ఆధారంగా సుదూరాలనుండి వీక్షిస్తే ఈ గోడ అస్సలు కనబడదు. భూమి నుండి చంద్రుని దూరం రమారమి 238,857 మైళ్ళు (384,393 కి.మీ.). ఈ మహాకుడ్యము ఓ ‘పళ్ళెం’ గాదు, ఓ ‘దారం’ లాంటిది. నూరు గజాల దూరంనుండి 15 సె.మీ. మందంగల త్రాడు కనబడదు. చంద్రునిపైనుండి ఈ కుడ్యము ఎలా కనబడగలదు?
దగ్గరి భూకక్ష్య నుండి[మార్చు]
ఇంకో ప్రశ్న ఉదయించింది, దగ్గరి భూకక్ష్య నుండి ఈ కుడ్యము కనబడగలదా? అని, అనగా భూమి నుండి 100 మైళ్ళ దూరాన గల భూకక్ష్య నుండి ఈ కుడ్యము కనబడగలదా? ఏకగ్రీవ అంగీకారమేమంటే కనబడుతుంది అని.[8]
వ్యోమగామి విలియమ్ పోగ్, స్కైలాబ్ నుండి చూడడానికి ప్రయత్నించాడు. ఇతనికి చైనా కాలువ కనబడింది గాని ఈ చైనా మహాకుడ్యము కనబడలేదు. ఏలాంటి పరికరాన్ని ఉపయోగించకుండా దీనిని చూడడం సాధ్యము గాదని చెప్పాడు. అయితే బైనాక్యులర్తో చూడగలిగాడు.
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అపోలో 11 నుండి వీక్షిస్తూ ఇలా చెప్పాడు : “భూమిపై గల మానవనిర్మిత వస్తువులను నేను వీక్షించలేక పోతున్నాను, చైనా మహాకుడ్యాన్నీ చూడలేకపోతున్నాను, కారణం అది ఇక్కడనుండి కనబడుట లేదు”

The Great Wall of China in 4k – DJI Phantom 4

The Great Wall of China in 4k – DJI Phantom 4

click here to view video

The Great Wall of China was not built all at one time. In 7th and 8th century BC, battles happened frequently among the states of the Spring-Autumn and Warring States dynasty and in order to defend themselves they began to built walls and towers on the borders. It was the state Chu who first built the wall. It was during the Qin Dynasty that the kingdom of Qin united the different parts into one empire. To defend off the invasions from northern invaders, Emperor Qin Shi Huang had all the walls joined up. Thus, the Great Wall came into being.

Since then, the Great Wall was rebuilt, modified or extended throughout Chinese history for over 2,000 years by millions of Chinese people drafted in for the task. The primary purpose was always to protect the Chinese Empire from the Mongolians and other invaders. Most of the current Great Wall we see today was built in the Ming Dynasty (1368-1644) and is approximately 6000km long.

The Great Wall of China was built to protect China from its enemies and invaders from the North, especially the Mongols. The Mongols were a tribal group that would regularly conduct raids into China. Despite the wall, the Mongols eventually conquered China. The Wall also kept Chinese citizens from leaving China.

Actually, China is not the only country in history that built wall along its boundary. Athens, the Roman Empire, Denmark and Korea all did so at certain time in the past. The Hadria Wall in northern England, built “to separate the Romans from the barbarians”, extended 117 kilometres from Wallsend-on-Tyne in the east to Bowness-on-Solway  in the west. All the walls were built for the purpose of military defense, and the Great Wall of China was no exception.

click here ….about chaina wall in telugu

???? దేశంలో చిట్టచివరి గ్రామం ఇది, రెండు సముద్రాల మధ్య ఏకాకిలా….. ధనుష్కోడి… తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్‌ ఈ గ్రామంలోనే ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి రోడ్ మార్గం వేశారు…. రామేశ్వరం నుంచి ధనుష్కోడి జర్నీ వీడియోను ని కూడా ఇక్కడ చూడండి.

Dhanushkodi is an abandoned town at the south-eastern tip of Pamban Island of the state of Tamil Nadu in India. It is situated to the South-East of Pamban and is about 18 miles west of Talaimannar in Sri Lanka. The town was destroyed during the 1964 Rameswaram cyclone and remains uninhabited in the aftermath.
Dhanushkodi is an abandoned town at the south-eastern tip of Pamban Island of the state of Tamil Nadu in India. It is situated to the South-East of Pamban and is about 18 miles west of Talaimannar in Sri Lanka. The town was destroyed during the 1964 Rameswaram cyclone and remains uninhabited in the aftermath. ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలోనే చిట్టచివరి గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది. ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది.


ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలోనే చిట్టచివరి గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది.

ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్‌ ఈ గ్రామంలోనే ఉంది. దనుష్కోడికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో చేరుకొనేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది.

తీరని విషాదం: దేశ చరిత్ర, ఇతిహాసాల్లో ధనుష్కోడికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతం మనుషులను మింగేసింది. 1964లో ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది. దీంతో 23 అడుగుల ఎత్తులో ఉప్పెన వచ్చింది. ఫలితంగా ఆ గ్రామంలో నివసిస్తున్న 1800 మంది చనిపోయారు. తుఫాన్ సమయంలో 115 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు కూడా ఉప్పెనలో చిక్కుకుంది. ఆ విషాద గుర్తులు ఇప్పటికీ దనుష్కోడిలో కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. 2004లో ఏర్పడిన సునామీ సైతం 1,600 అడుగుల ఎత్తైన అలలతో దనుష్కోడిని ముంచేశాయి. దీంతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలన్నా, నివసించాలన్నా ప్రజలు వణికిపోతున్నారు.

ఆ సమయాల్లో వెళ్తే ప్రమాదమే: రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. లేదా మధురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా దనుష్కోడికి వెళ్లేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళ్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి. అవి రెండు ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశబ్దంగా ఉంటే.. హిందూ మహా సముద్రం అలలతో ఎగసిపడుతూ కనిపిస్తుంది. . ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా.. ఈ ప్రాంతం మునిగిపోతుంది.

శ్రీలంకకు 18 మైళ్ల దూరంలోనే: ఈ ప్రాంతానికి 18 మైళ్ల దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి, అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే, 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సారి రామేశ్వరం వెళ్లినప్పుడు తప్పకుండా ఈ చిట్టచివరి గ్రామాన్ని సందర్శించి సెల్ఫీ తీసుకోండి.

రామేశ్వరం నుంచి ధనుష్కోడి జర్నీ వీడియోను ఇక్కడ చూడండి:

Gandhiji letter -సరిగ్గా 80ఏళ్ల క్రితం..రెండో ప్రపంచ యుద్ధం మొదలైన రోజు..మహాత్మా గాంధీ స్వ దస్తూరీ తో రాసిన లేఖ వెలుగులోకి….వివరాలు…

జెరూసలేమ్‌: సరిగ్గా 80ఏళ్ల క్రితం..రెండో ప్రపంచ యుద్ధం మొదలైన రోజు..మహాత్మా గాంధీ స్వదస్తూరీతో ఓ లేఖ రాశారు. యూదులకు శాంతి శకం రావాలని ఆకాంక్షిస్తూ బాంబే జియోనిస్టు అసోసియేషన్‌ (బీజడ్‌ఏ)కు నేతృత్వం వహిస్తున్న ఎ.ఇ.షోహెత్‌కు ఆయన ఈ లేఖ పంపారు. ఈ లేఖ రాసిన 80 ఏళ్ల తరవాత ఇప్పుడు ఇజ్రాయెల్‌లోని జాతీయ గ్రంథాలయం ఆన్‌లైన్‌లో తొలిసారి విడుదల చేసింది.
ఎనభై ఏళ్ల కిందట గాంధీ రాసిన ఓ లేఖను ఇజ్రాయెల్ జాతీయ గ్రంథాలయం విడుదల చేసింది. ఈ లేఖలో అప్పటి బాధిత యూదు ప్రజల జీవితాల్లో శాంతి శకం ప్రారంభమవ్వాలని గాంధీ మహాత్ముడు ఆకాంక్షించారు. ఈ లేఖను అప్పటి బాంబేలోని యూదుల ప్రతినిధి ఏ.ఈ.షోహెట్‌కు రాశారు. ‘‘డియర్‌ షోహెట్‌, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ(యూదు) బాధిత ప్రజల జీవితాల్లో శాంతి శకం ఆరంభంతో నూతన సంవత్సరం జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఎన్‌ఎల్‌ఐ ఇన్‌ఛార్జి స్పందిస్తూ.. యూదులపై నాజీల హింస ఆనాడు ప్రపంచ పౌరులను ఏ స్థాయిలో ఆందోళన కలిగించిందో ఈ లేఖ ద్వారా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ లేఖ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సెప్టెంబరు 1, 1939లో రాసినట్లు తెలుస్తోంది.

20వ శతాబ్దపు అనేక జ్ఞాపకాలు, చరిత్రాత్మక ఆధారాలను వెలికితీసే క్రమంలో లేయర్ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఎన్‌ఎల్‌ఐ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. దీన్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా ఉంచినట్లు తెలిపారు. గాంధీ 150వ జయంతి ఉత్సవాలను భారత్‌ ఘనంగా జరపుకోనున్న తరుణంలో ఈ లేఖ బహిర్గతమవడం ప్రాధాన్యం సంతరించుకొంది. అప్పట్లో గాంధీ మద్దతు కోసం షోహెట్‌ చాలా ప్రయత్నించారని.. అయితే ఏ సమస్యకైనా సత్యం, అహింస, సహాయనిరాకరణే ఆయుధాలని గాంధీ అప్పట్లో యూదులకు సూచించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.

*????????ఫెజంట్ ఐలాండ్: ????????* ఆరు నెలలు ఫ్రాన్స్ చేతిలో.. ఆరు నెలలు స్పెయిన్ నియంత్రణలో – దాదాపు 350 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అధికార మార్పిడి సంప్రదాయం ప్రపంచంలో విశేషమైంది.- ఈ దీవి గురించి తప్పకుండా తెలుసుకోవాలి!

Pheasant Island on the Bidasoa River between France and Spain.
ఫెజంట్ ఐలాండ్: ఆరు నెలలు ఫ్రాన్స్ చేతిలో.. ఆరు నెలలు స్పెయిన్ నియంత్రణలో – ఈ దీవి గురించి తప్పకుండా తెలుసుకోవాలి!

ఒక్క తూటా పేలకుండా, ఒక్క రక్తపు బొట్టు చిందకుండా రెండు దేశాల మధ్య అధికార మార్పిడి జరుగుతోంది. దాదాపు మూడున్నర శతాబ్దాల నుంచి శాంతియుతంగా ఒక దేశాన్ని పంచుకుంటున్నాయి స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాలు. ఈ రెండు దేశాల ఎగువ, దిగువన ఉన్న ప్రధాన భూభాగంలోని ఫెజంట్ ఐలాండ్ ఈ వినూత్నమైన అధికార మార్పిడికి వేదికైంది.

ఐరోపాలో ఆరు నెలలకోసారి దేశం మారే ఒక దీవి కథ ఇది. ప్రస్తుతం ఈ దీవి ఫ్రాన్స్ ఆధీనంలో ఉంది. ఆరు నెలల తర్వాత స్పెయిన్ అధికారంలోకి వెళ్తుంది. స్పెయిన్, ఫ్రాన్స్‌ రెండు దేశాల ప్రధాన భూభాగంలో ఉన్న ఈ సుందరమైన, ఆహ్లాదకరమైన ఫెజంట్ దీవి విస్తీర్ణం దాదాపు 3,200 చదరపు అడుగులు (355.5 చదరపు గజాలు). ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య సరిహద్దుగా ఉన్న బిడసోవా నదిలో ఉంది ఈ ఫీజంట్ దీవి. ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దిగువన, స్పెయిన్ ప్రధాన భూభాగానికి ఎగువన ఉందీ ఫెజంట్ ఐలాండ్.

స్పెయిన్ నాలుగో రాజు ఫిలిప్ కుమార్తెను ఫ్రాన్స్ పద్నాలుగో రాజు లూయీ పెళ్లి చేసుకున్నారు. ఈ చరిత్రాత్మక ఘటనకు గుర్తుగా 1659లో స్మారక చిహ్నం

ఫెజంట్ ఐలాండ్‌పై నియంత్రణ కోసం పదహారవ శతాబ్దంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య సుదీర్ఘకాలం యుద్ధం సాగింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు మూడు నెలలపాటు ఉభయ దేశాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనిని ట్రీటీ ఆఫ్ ద పిరినీస్ గా పిలుస్తారు ఇరుదేశాల ప్రజలు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఈ దీవిని ప్రతీ ఆరు నెలలకొకసారి మార్చుకుంటాయి. శాంతి ఒప్పందం సందర్భంగా రాజ వివాహం జరిగింది. స్పెయిన్ నాలుగో రాజు ఫిలిప్ కుమార్తెను ఫ్రాన్స్ పద్నాలుగో రాజు లూయీ పెళ్లి చేసుకున్నారు. ఈ చరిత్రాత్మక ఘటనకు గుర్తుగా 1659లో స్మారక చిహ్నం నిర్మించాయి ఇరుదేశాలు. ఈ దీవిని అనుబంధానికి ప్రతీకగా మార్చాయి. శాంతి ఒప్పందం ప్రకారం ఫెజంట్ ఐలాండ్ ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు స్పెయిన్ పాలనలో, ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ ఏలుబడిలో ఉంటుంది. ప్రతి ఆరు నెలలకోసారి ఇలా అధికార మార్పిడి జరుగుతుంటుంది. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలంగా రెండు దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న భూభాగాల్లో ఈ దీవి మొదటిది.

దాదాపు 350 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అధికార మార్పిడి సంప్రదాయం ప్రపంచంలో విశేషమైంది. ఫ్రాన్స్‌ లోని బయోనే, స్పెయిన్‌లోని సాన్ సెబాస్టియన్ పట్టణ నౌకాదళ కమాండర్లు ఫెజంట్ ఐలాండ్‌కు గవర్నర్లుగా ఉంటారు. ఫ్రాన్స్‌లోని హెండయే, స్పెయిన్‌లోని ఇరున్ పట్టణాల మేయర్లు ఈ దీవి వ్యవహారాలు చూసుకుంటారు. సంవత్సరంలో ఇంచుమించుగా పన్నెండుసార్లు సమావేశమై నీటి నాణ్యత, చేపల వేటపై హక్కులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. ఇంతకుముందు ఫ్రాన్స్ పొడవాటి పడవల డిజైన్ పై స్పెయిన్ మత్స్యకారుల అభ్యంతరాలు ఉండేవి. అయితే ఎవరికి ఇబ్బంది కలుగకుండా, దీవిలోని నదికి ఎటువంటి కాలుష్యం జరుగుకుండా ఉండేందుకు పడవల డిజైన్లను మార్చారు.

ఇంత ప్రాముఖ్యత కలిగిన ఫెజంట్‌ దీవిలోమనుషులు ఉండకపోవడం విశేషం. కేవలం పగటి వేళల్లోనే ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. రాత్రివేళల్లో ఇక్కడికి పర్యాటకులను అనుమతించరు. స్పెయిన్ నుంచి నడిచి వెళ్లగలిగే ఈ దీవిలో అక్రమంగా తిష్టవేసే వారిని స్పెయిన్ పోలీసులు తరిమేస్తుంటారు. అయితే శతాబ్దాల ప్రయాణంలో ఈ దీవి విస్తీర్ణం దాదాపు సగానికి సగం తగ్గిపోయింది. పిరినీస్ పర్వతాల్లోని మంచు కరిగి బిడసోవా నదిలోకి చేరుతోంది. నదిలో ప్రవాహ మట్టం పెరిగి దీవి విస్తీర్ణం తగ్గుతుందని ప్రకృతి ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఈ దీవిని రక్షించేందుకు ఫ్రాన్స్‌, స్పెయిన్ దేశాలు నిధులు వెచ్చించి చరిత్రాత్మక దీవిని కాపాడాలని పర్యాటకులు కోరుకుంటున్నారు.
గజం భూమి పక్కవాడు ఆక్రమించుకుంటేనే ప్రాణాలు తీసుకునే రోజుల్లో ఉన్నాం. అయితే ప్రపంచంలోని రెండు దేశాల ముఖ్యదేశాల మధ్య శాంతియుత, సామరస్య సంబంధాలకు నిలువెత్తు సాక్షిగా నిలిచింది ఈ ఫెజంట్‌ దీవి.

Viral ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ మొక్క ఇదే..లాస్ట్ స్టేజ్ క్యాన్సర్‌ ను కూడా నయం చేస్తుంది!

అనేక ఖరీదైన ఔషధాల కంటే ఎక్కువ ప్రయోజనకరమైన వాటిని ప్రకృతి మానవులకు బహుమానంగా ఇచ్చింది. నేటి కాలంలో ప్రజలు అనేక వ్యాధులతో బాధపడుతూ డాక్టర్ల దగ్గరకు వెళ్తున్నారు.
కానీ ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేసే అనేక సహజసిద్ధమైన వస్తువులు ఉన్నాయి. అలాంటి సహజ పదార్ధాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.

ఈ వీడియోలో, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్ గురించి సమాచారం ఇవ్వబడింది. ప్రతి ఇంట్లో నాటాల్సిన మొక్క ఇది. దాని పేరు ఒరేగానో(oregano). మీరు దీన్ని పిజ్జాపై కూడా చల్లుకుని తింటూ ఉండవచ్చు. ఇది అనేక ఇటాలియన్ వంటలలో మసాలాగా ఉపయోగించబడుతుంది. అయితే ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది,

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మసాలా

భారతదేశంలో వెల్లుల్లిని జలుబు,దగ్గు విషయంలో ఉపయోగిస్తారు. కానీ వెల్లుల్లి, నిమ్మకాయల కంటే ఒరేగానోలో 30 రెట్లు ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయని మీకు తెలుసా. ఇది కాకుండా, గ్రీన్ టీ కంటే ఒరేగానో నూనెలో 37 రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి. దీని వినియోగం ద్వారా చాలా తీవ్రమైన వ్యాధులను నయం చేయవచ్చు. ఇది క్యాన్సర్ నుండి అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్ల వరకు ప్రతిదీ కలిగి ఉంటుంది.

మీరు దీన్ని ఇలా తినవచ్చు

సోషల్ మీడియాలో ఇది శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ను ఉపయోగించే మార్గంగా వివరించబడింది. దీన్ని తినడానికి, ఒక చెంచా ఒరేగానోను ఒక కూజాలో వేసి, అందులో 300 ml వేడినీరు జోడించండి. 15 నిమిషాలు ఆగి తాగే ముందు అందులో నిమ్మరసం కలపండి. దీన్ని తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు నయమవుతాయి. జలుబు, దగ్గులే కాకుండా క్యాన్సర్ చివరి దశలో ఉన్న రోగికి ప్రాణం పోస్తుంది.

ఫోన్ లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఫోన్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చేయండి..

ఫోన్ లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఫోన్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చేయండి..

ప్రస్తుతం మొబైల్ ఫోన్ ( Mobile phone )ఉపయోగించని వ్యక్తులు బహుశా ఉండరేమో. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి చేతిలో మొబైల్ ఫోన్ తిరుగుతూనే ఉంటుంది.
అయితే మొబైల్ ఫోన్ ఉపయోగించిన కాసేపటికి ఫోన్లో త్వరగా చార్జింగ్ ( charging )అయిపోతూ ఉండడం ఒక ప్రధాన సమస్యగా మారింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాక ఫుల్ ఛార్జ్ చేస్తే మొదట్లో రెండు లేదా మూడు రోజులు ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ ( Phones battery backup )ఇస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ పాత పడే కొద్ది ఫుల్ ఛార్జ్ చేస్తే కొన్ని గంటలకే ఫోన్ లో ఛార్జింగ్ తర్వాత అయిపోతుంది.

ఈ సమస్యను అధిగమించడానికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొన్ని నియమాలను సూచించాయి. ఫోన్ లో త్వరగా బ్యాటరీ అయిపోతే ఏం చేయాలో అనే విషయాలు తెలుసుకుందాం.ఏ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పెట్టిన 100% పూర్తికాకుండానే అంటే 90% చార్జింగ్ పూర్తి అయితే ఫోన్ చార్జింగ్ తీసేయాలి.

ఫోన్ ను చార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తే బ్యాటరీ తన సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతూ వస్తుంది. అలాగే కంపెనీ ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా ఒకవైపు ఫోన్ చార్జింగ్ లో పెట్టి మరొకవైపు ఫోన్ ఉపయోగించడం కూడా ప్రమాదకరమే. ఫోన్లో చార్జింగ్ పూర్తిగా అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్( Smart phones fast charging mode ) లో ఉంటే.. ఫోన్ త్వరగా వేడిని గ్రహిస్తుంది.

దీంతో బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ లో కనిపించే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ను నిలిపివేయాలి. అయితే ఈ ఆప్షన్ నిలిపివేయడం వల్ల ఫోన్ చార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. స్మార్ట్ ఫోన్లో ఉపయోగించని యాప్స్ స్లీప్ మోడ్ లో ఉంటే చార్జింగ్ త్వరగా అయిపోదు. అందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ ను క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే అక్కడ బ్యాక్ గ్రౌండ్ యూసేజ్ లిమిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఉపయోగించని యాప్స్ ను స్లిప్ మోడ్ లోకి వెళ్తాయి.ఈ టిప్స్ పాటిస్తే ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోదు.

Pioneer Poll Strategies: ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు గెలిచే పార్టీ ఇదే.. సంచలన సర్వే!

Pioneer Poll Strategies: ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు గెలిచే పార్టీ ఇదే.. సంచలన సర్వే!

Pioneer Poll Strategies: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరి కొద్ది రోజుల్లో షెడ్యూల్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు హల్ చల్ చేస్తున్నాయి.
రోజుకో సర్వే బయటకు వస్తోంది. ప్రజల సైతం సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వివిధ కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న కొన్ని సంస్థలు ప్రసార మాధ్యమాల ద్వారా ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా పనిచేసే పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ తాజాగా ఓ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో సర్వే చేపట్టినట్లు సంస్థ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల నమూనాల సేకరణ ద్వారా సర్వే చేసినట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసులు నాయుడు వెల్లడించారు. జనవరి 1 నుంచి 15 మధ్యఈ నమూనాలు సేకరించినట్లు ఆయన వివరించారు.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన కూటమికి 95 నుంచి 100 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే తేల్చింది. వైసిపి 35 నుంచి 40 స్థానాలు ఖాయంగా గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది. మరో 45 నుంచి 50 చోట్ల ఇరుపక్షాల మధ్య గట్టి ఫైట్ ఉంటుందని స్పష్టం చేసింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువతతో పాటు సమాజంలోని వివిధ వర్గాల నుంచి రాండం పద్ధతిలో సర్వే నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు నాయుడు చెబుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలో ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలసలో టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. పలాస, నరసన్నపేటలో హోరాహోరీ ఫైట్ నడుస్తుంది.విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో ఎచ్చెర్ల,రాజాం, బొబ్బిలి, విజయనగరం, నెల్లిమర్లలో టిడిపి, జనసేన కూటమి, చీపురుపల్లి, గజపతినగరంలో వైసిపి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి. అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరులో వైసిపి, పాలకొండ, రంపచోడవరం లో హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో ఎస్. కోట, భీమిలి, విశాఖ తూర్పు విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, గాజువాక నియోజకవర్గం టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి లోక్ సభ స్థానం పరిధిలో చోడవరం, అనకాపల్లి, పెందుర్తి,ఎలమంచిలి, నర్సీపట్నంలో టిడిపి, జనసేన కూటమికి విజయావకాశాలు ఉన్నాయి. మాడుగులలో వైసిపి గెలిచే అవకాశం ఉంది. పాయకరావుపేటలో హోరాహోరీ ఫైట్ నడవనుంది.

కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలో పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెద్దాపురం, జగ్గంపేటలో టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. తునిలో రెండు పార్టీల మధ్య గట్టి ఫైట్ నడవనుంది. రాజమండ్రి లోక్ సభ స్థానం పరిధిలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అనపర్తి లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. రాజానగరంలో ఇరుపక్షాల మధ్య ఫైట్ నెలకొంది. అమలాపురం లోక్ సభ స్థానం పరిధిలో ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేటలో కూటమి గెలిచే అవకాశం ఉంది. రామచంద్రపురం లో మాత్రం హోరాహోరి పోరు నడవనుంది. నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో అచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకులలో కూటమి గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెంలో ఇరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది. ఏలూరు పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంగటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడులో కూటమి గెలిచే ఛాన్స్ ఉంది. ఏలూరు,కైకలూరులో ఇరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది.

మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరులో కూటమికి స్పష్టమైన విజయావకాశాలు ఉన్నాయి. పామర్రు, గుడివాడ, గన్నవరంలో గెట్ ఫైట్ ఉంటుంది. నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాలలో కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేటలో మాత్రం హోరాహోరీ ఫైట్ నడవనుంది. బాపట్ల పార్లమెంట్ స్థానం పరిధిలో వేమూరు, రేపల్లె, పరుచూరు, అద్దంకిలో కూటమి అభ్యర్థులు, బాపట్ల,చీరాలలో వైసీపీ అభ్యర్థులువిజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. సంతనూతలపాడు లో ఇరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది. ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలోఎర్రగొండపాలెం, కొండేపిలో కూటమి అభ్యర్థులు, దర్శి, మార్కాపురంలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరిలో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉంటుంది. నెల్లూరు పార్లమెంట్ స్థానం పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కూటమి అభ్యర్థులు, కందుకూరు, ఆత్మకూరులో వైసిపి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఉదయగిరి,కోవూరు, కావలిలో గట్టి ఫైట్ ఉంటుంది. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేటలో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. తిరువూరు, మైలవరంలో మాత్రం విరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది.గుంటూరు ఎంపీ స్థానం పరిధిలో మంగళగిరి,పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు తూర్పు లో ఓటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. తాడికొండ, గుంటూరు పశ్చిమ లో గట్టి ఫైట్ ఉంటుంది.

చిత్తూరు పార్లమెంట్ స్థానం పరిధిలో నగిరి, పలమనేరు, కుప్పంలో కూటమి అభ్యర్థులు, చిత్తూరు, చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో తంబళ్లపల్లెలో కూటమి అభ్యర్థి, రాయచోటి, పుంగనూరులో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లిలో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. కడప పార్లమెంట్ స్థానం పరిధిలో కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు,ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. బద్వేలు, మైదకూరులో మాత్రం పోరా హోలీ ఫైట్ ఉంటుంది. నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో పాణ్యం, నంద్యాలలో కూటమి అభ్యర్థులు, నందికొట్కూరు లో వైసీపీ గెలుపొందే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ,శ్రీశైలం, బనగానపల్లె,డోన్ లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో కర్నూలు, మంత్రాలయం, ఆదోనిలో కూటమి అభ్యర్థులు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. ఆలూరు లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ,గుంతకల్లు, తాడిపత్రి,అనంతపురం, కళ్యాణదుర్గంలో ఓటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి. సింగనమల నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి ఛాన్స్ ఉంది. హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో రాప్తాడు, హిందూపురం, పెనుగొండ, ధర్మవరంలో కూటమి అభ్యర్థులు, మడకశిర,పుట్టపర్తి లో మాత్రం వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. కదిరిలో హోరాహోరీ ఫైట్ ఉంటుంది.మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమిదేవి విజయమని ఈ సర్వే సంస్థ తేల్చడం విశేషం.

LK Advani – PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

Bharat Ratna to LK అద్వానీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. ” భారత రత్న గౌరవం అందుకోబోతున్న ఎల్‌కే అద్వానీతో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పని చేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారు. మన హోంమంత్రిగా, ఐఅండ్‌బీ(Ministry of Information and Broadcasting) మంత్రిగా కూడా సేవలు అందించారు. పార్లమెంట్‌లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయి” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

AP Medical Services Recruitment Board: వైద్యశాఖలో 253 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఓవైపు ఈ పోస్టుల భర్తీ కొనసాగుతుండగానే మరోవైపు 253 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇందులో 234 పోస్టులు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.

11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్‌ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్‌ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు.

7 వరకు దరఖాస్తులకు అవకాశం
కాగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్‌ వైద్య పోస్టులకు https://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మైదాన ప్రాంతాల్లో అయితే నెలకు రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.­1.40 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు.

దరఖాస్తు సమయం­లో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు 7416664387/8309725712 నంబర్లను సంప్రదించవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా ఎప్ప­టి­కప్పుడు ఖాళీలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది.

అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ను సైతం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా బోర్డు­కు అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో గతంలో ఎన్నడూ­లేని విధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ కొనసాగుతోంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: టెన్త్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు

టెన్త్ అర్హతతో ఇస్రో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధ సంస్థ అయిన యూ.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC) లో వివిధ విభాగాల్లో 224 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఫిబ్రవరి 10, 2024 నుంచి ఇస్రో వెబ్ సైట్ www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 10,2024
అప్లికేషన్ దరఖాస్తు చివరి తేది : త్వరలో ప్రకటిస్తారు.
మొత్తం ఖాళీలు: 224

సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -3
సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -2
టెక్నికల్ అసిస్టెంట్ -55
సైంటిస్ట్ అసిస్టెంట్ -6
లైబ్రరీ అసిస్టెంట్ -1
టెక్నీషియన్, డ్రాట్ మెన్ కలిపి -142
ఫైర్ మెన్-ఎ -3
కుక్ -4
లైట్ వెహికల్ డ్రైవర్ ఎ -6
హెవీ వెహికల్ డ్రైవర్ ఎ -2
విద్యార్హత లు, వయోపరిమితి :

సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ అర్హత : ME/M.Tech(Engg) 60 శాతం ఉత్తీర్ణత
వయస్సు : 18-30 సం// మధ్య ఉండాలి

సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -60 శాతం మార్కులతో M.Sc లేదా తత్సమాన ఉత్తీర్ణత
వయస్సు : 18-28 సం// మధ్య ఉండాలి

టెక్నికల్ అసిస్టెంట్ :ఇంజనీరింగ్ లో ఫస్ట క్లాస్ డిప్లమా (ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

సైంటిస్ట్ అసిస్టెంట్:60 శాతం మార్కులతో B.Sc ఉత్తీర్ణత (ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

లైబ్రరీ అసిస్టెంట్:60 శాతం మార్కులతో BLiSc లేదా తత్సమాన ఉత్తీర్ణత(ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

టెక్నీషియన్ :SSLC/SSC/Matriculation +ITI/NTC సంబంధిత ట్రేడ్ లో (NCVTనుంచి)
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

డ్రాట్ మెన్ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత( ఏదేని గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్)
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

ఫైర్ మెన్-ఎ:SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత( ఏదేని గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్)
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

కుక్ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ఏదేనీ ప్రముఖ హోటల్, క్యాంటీన్ లో 05 సంవత్సరాల పాటుపనిచేసిన అనుభవం
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

లైట్ వెహికల్ డ్రైవర్ ఎ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ లైట్ వెహికల్ డ్రైవర్ గా 03 సంవ్సతరాల అనుభవం
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

హెవీ వెహికల్ డ్రైవర్ ఎ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ హెవీ వెహికల్ డ్రైవర్ గా 05 సంవ్సతరాల అనుభవం
వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి

మంగళసూత్రంలో నల్ల పూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా..? కారణం చాలా ప్రత్యేకమైనది..!

హిందూ మతంలో వివాహ సమయంలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు. ఇందులో మంగళసూత్రాన్ని ధరించడం కూడా ఒక ఆచారం. హిందూ మతంలో మంగళసూత్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది.
మంగళసూత్రం లేకుండా వివాహం సంపూర్ణంగా పరిగణించబడదు. అలాగే, వివాహానంతరం వధువు 16 అలంకారాలలో మంగళసూత్రం ఒకటి. మంగళసూత్రం లేకుండా ఏ వివాహమూ పూర్తికాదు.

వివాహ ఆచారాల సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు. ఆ తర్వాతే ఆ వివాహం సంపూర్ణంగా పరిగణించబడుతుంది. మంగళసూత్రం ప్రధానంగా బంగారం, నల్ల పూసలను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేక దారంతో నేసినది. అయితే మంగళసూత్రంలో నల్ల పూసలనే ఎందుకు వాడతారో తెలుసా.

మన దేశంలో పాటించే ప్రతి సంప్రదాయం వెనుక కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు ముడిపడి ఉన్నాయి. పూర్వకాలంలో మన పెద్దలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇలాంటి సిద్దాంతలను అమలు చేశారు. వీటిల్లో కొన్ని ఆచారాలు ఇప్పటికీ యధాతథంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే మంగళసూత్రాన్ని పవిత్రంగా భావించడం. అందులో నల్లపూసలు మరింత పవిత్రమైనవిగా పరిగణిస్తారు.

బంగారు గొలుసుకు ఆ ప్రాంతపు నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల ప్రాతిపదికన.. ఒకటి లేదా రెండు సూత్రాలను నల్లపూసలు, పగడాలు, ముత్యాలతో కలిపి కుచ్చుతారు. ఇది కొన్ని చోట్ల ఒకటే సూత్రంగా కూడా కనిపిస్తుంది. అయితే, వివాహిత స్త్రీలను, వైవాహిక జీవితాన్ని చెడు దృష్టి నుండి రక్షించడానికి నల్ల పూసలు రక్షణగా పనిచేస్తుందని నమ్ముతారు. మంగళ సూత్రంలో ఉండే నల్ల పూసల వల్ల స్త్రీ చుట్టూ ఉన్న పరిసర వాతావరణంలోని దుష్టశక్తులను గ్రహించి వాటిని పారద్రోలడానికి నల్లపూసలు సాయపడతాయని నమ్ముతారు.

నల్ల పూసలను శివునికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే స్త్రీ మంగళసూత్రాన్ని తన భర్తకు రక్షణ కవచంగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా, అనేక మంది దేవీ దేవతలు మంగళసూత్రంలో నివసిస్తున్నారని కూడా నమ్ముతారు. ఇక, బంగారు మంగళసూత్రమే ఎందుకనే విషయానికి వస్తే.. బంగారంలో వైద్యం చేసే లక్షణాలు ఉన్నాయి.

ఇది వివాహిత స్త్రీలను ఆందోళన, టెన్షన్, ఒత్తిడి నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. బంగారం, నల్లపూసల్లోని క్రియాశీలత కారణంగా స్త్రీ శరీరంలోని దైవిక శక్తి మేల్కొంటుంది. దీనివల్ల ఆమె ప్రవర్తనలోనూ నెమ్మదితనం వస్తుంది. దీనితో పాటు, బంగారం బృహస్పతి ప్రభావాన్ని పెంచుతుంది. వైవాహిక జీవితాన్ని ఆనందపరుస్తుంది.

Bank Manager: కస్టమర్ బంగారంతో వడ్డాణం చేయించుకున్న బ్యాంక్ మేనేజర్

“బంగారం బ్యాంక్ లాకర్‌లో పెడితే ఏమొచ్చిద్ది.. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే.. నీకు అవసరానికి ఉపయోగపడతాయి” అంటూ తన ఫ్రెండ్ బ్యాంక్ మేనేజర్ చెప్పిన మాటలు విన్నాడో అమాయక చక్రవర్తి.
ఆమె చెప్పినట్లుగానే ఏ మాత్రం ఆలోచించకుండా 300 గ్రాములకు పైగా బంగారం తనఖా పెట్టి 2 లక్షల లోన్ తీసుకున్నాడు. కొన్నాళ్లు గడిచిన తర్వాత.. బ్యాంకు లోన్ తీర్చేసి, తన బంగారాన్ని తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. “బంగారం బ్యాంకులో లేదు.. మా ఇంట్లో ఉంది.. ఇంటికే నేరుగా ఇంటికొచ్చేయ్” అని ఆమె చెప్పిన మాటలు విని కాస్త కంగారు పడ్డాడు. పోనీలే ఇంటికెళ్లే.. తీసుకుందాం అనుకుని ఆమె ఇంటికెళ్లగానే.. నువ్వంటే ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. నీ బంగారు ఆభరణాలతో మన పెళ్లికై వడ్డాణం చేయిస్తున్నానని చెప్పడంతో మనోడికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు ఈ యవ్వారమంతా.. ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో జరిగింది.

Also Read ????ఏపీలో దారుణం..అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపిన భార్య, ప్రియుడు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం కాగా.. అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్‌లో ఉన్న యూనియన్ బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్‌ఫర్‌ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకరు అడగ్గా… ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు.

అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభర ణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభర ణాలు విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

YSRCP 6th List: వైసీపీ 6వ జాబితా విడుదల, ఇంఛార్జ్‌లుగా 10 మందికి అవకాశం

YSRCP 6th List: అమరావతి: వైనాట్ 175 అంటున్న అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) ఇదివరకే 5 జాబితాలు విడుదల చేయగా.. తాజాగా 6వ జాబితా విడుదల చేసింది.

6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్ల పేర్లతో శుక్రవారం మరో జాబితా (YSRCP new incharges) విడుదల చేసింది వైసీపీ.

లోక్సభ స్థానాలకు ఇంఛార్జీలు..
– రాజమహేంద్రవరం – గూడూరి శ్రీనివాస్
– నర్సాపురం – అడ్వకేట్ గూడూరి ఉమాబాల
– గుంటూరు – ఉమ్మారెడ్డి వెంకటరమణ
– చిత్తూరు (ఎస్సీ) – ఎన్.రెడ్డప్ప

అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీలు
– మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్
– మార్కాపురం – అన్నా రాంబాబు
– గిద్దలూరు – కె. నాగార్జున రెడ్డి
– నెల్లూరు సిటీ – ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
– జీడీ. నెల్లూరు – కె.నారాయణస్వామి
– ఎమ్మిగనూరు – బుట్టా రేణుక

సీఎం జగన్ను కలిసిన మైలవరం నూతన ఇంఛార్జ్..
మైలవరం నూతన వైసీపీ అభ్యర్థిగా స్వర్ణాల తిరుపతిరావు పేరు ప్రకటించారు. అనంతరం స్వర్ణాల తిరుపతిరావు సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మైలవరంలో జోగి రమేష్ వ్యూహం ఫలించింది. ఈ స్థానంలో ఇప్పటిదాకా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తున్న పార్టీలు.. కానీ మొదటి సారిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అందులోనూ ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చారు.

జగన్ నినాదం వైనాట్ 175..
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి ప్రభంజనం సృష్టించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నిస్తేనే భారీ స్థానాల్లో ఫ్యాన్ పార్టీ విజయం సాధిస్తుందని వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 అంటూ వీలున్నచోటల్లా రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే సిద్ధంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఇంఛార్జ్లను ప్రకటిస్తున్నారు. ఇదివరకే 5 జాబితాలు ప్రకటించగా, శుక్రవారం రాత్రి 6వ జాబితా విడుదల చేశారు.

జాబితాల వారీగా ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారంటే…
ఇంఛార్జ్ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది.

స్కూల్‌కెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి ఇంటికి చేరుకోలేదు..ఆందోళన లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

2024 జనవరి 29వ తేదీ.. ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లేందుకు 14 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలు హడావుడిగా తయారయ్యారు. పుస్తకాల సంచిని భుజాన వేసుకుని ఉదయం 8.30 గంటలకు వడివడిగా బయల్దేరారు.
సాధారణంగా సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి రావాలి. అయితే ఆరోజు ఆ ఇద్దరు బాలికలు సాయంత్రం దాటినా ఇంటికి రాలేదు. దీంతో ఆ ఇద్దరు బాలికల తల్లిదండ్రులు ఆందోళనతో స్కూల్, స్నేహితుల ఇళ్లల్లో వాకబు చేశారు. అసలు ఆరోజు వాళ్లిద్దరూ స్కూల్‌కు రాలేదని తెలిసింది. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. 14 ఏళ్ల వయస్సున్న తమ ఆడపిల్లల్ని వెతికి పెట్టాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఖాకీలు అదృశ్యమైన బాలికల కోసం గాలిస్తున్నారు. నేటికి ఐదు రోజులైనా బాలికల ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామం ఆందోళనలో ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఫారం గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనవరి 29వ తేదీన కుటుంబసభ్యులకు స్కూల్‌కి వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు, గ్రామంలోని స్థానిక పరిసర ప్రాంతాలు.. వారి బంధువుల ఇళ్లలో అన్వేషించి.. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రాచర్ల మండలం ఫారం గ్రామానికి చెందిన మీనిక చరిత(14), రాచర్లలోని జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతుండగా.. సోడా నారాయణమ్మ(13) రాచర్ల మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ స్నేహితులు కావడంతో ప్రతిరోజు కలిసి పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. జనవరి 29వ తేది ఉదయం కూడా అలాగే వెళ్లినవారు.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో బాలికలు అదృశ్యంపై ఇద్దరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు తమ పిల్లలు బతికే ఉన్నారా..? అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వెంటనే తమ పిల్లల్ని వెతికి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు.

నోటు పై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా…ఎన్నో గాంధీగారి చిత్రాలు ఉండగా….ఆ ఒక్క ఫోటోనే ముద్రిస్తారు దేనికి… అసలు ఆ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారంటే

History Behind Mahatma Gandhi Picture On Indian Currency Notes

మీకెప్పుడైనా మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఎందుకు ఉంది అనే అనుమానం వచ్చిందా ? గాంధీజీ బొమ్మను మాత్రమే అన్ని నోట్ల పై ఎందుకు ముద్రించారో తెలుసా ?
దాని వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. అసలు గాంధీజీ బొమ్మనే అన్ని కరెన్సీ నోట్ల పై ఎందుకు ముద్రించ వలసి వచ్చింది. అది కూడా గాంధీ నవ్వుతున్న ఆ ఒక్క బోమ్మనే ఎందుకు ముద్రించారో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు కల్మషం అనేదే లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో నవ్వుతున్న ఆ గాంధీ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే మీరు నిజం గా ఆశ్చర్య పోతారు. ఒక సరైన ప్రయోజనం కోసం, అంత పరిపూర్ణంగా, ఎంతో ముగ్దమనోహరంగా ఉన్న గాంధీ బొమ్మ ఎలా లభించింది?

గాంధీజీ వి ఎన్నో బొమ్మలు ఉండగా , ఆ ఒక్క బొమ్మని ఎందుకు అన్ని కరెన్సీ నోట్ల పై వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ ఫోటోను ఎవరు తీశారంటే :
1946 వ సంవత్సరంలో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ గాంధీ గారి బొమ్మని తన కెమెరా లో బంధించాడు. కోల్ కత్తా లోని వైస్రాయ్ భవంతి లో, అప్పట్లో బ్రిటీష్ సెక్రటరీ అయిన లార్డ్ పతిక్ లారెన్స్ అనే వ్యక్తిని మహాత్మా గాంధీ 1946 వ సంవత్సరంలో కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఫోటో తీసారట.

ఆ చిత్రం గురించి మరిన్ని విశేషాలు :
ఆ ప్రత్యేక చిత్రాన్ని ఒకప్పుడు, అంటే 1946 లో వైస్రాయ్ భవనం గా ప్రసిద్ధి గాంచిన ప్రదేశం నుండి తీసుకున్నారు. దానినే ఇప్పుడు రాష్ట్రపతి భవనంగా పరిగణిస్తున్నాం. ఈ ఇతిహాస గాంధీ చిత్రాన్ని మన కరెన్సీ నోట్ల పై ముద్రించడానికి అనుగుణంగా మార్చుకొని మన నోట్ల పై ముద్రించడం ప్రారంభించారు.
ఆ ప్రతిబింబ చిత్రాన్ని మొదట అప్పుడు వాడారు :
మహాత్మా గాంధీ యొక్క అసలు బొమ్మకు ప్రతిబింబ చిత్రాన్ని 1987 లో ముద్రించిన ఐదు వందల రూపాయల నోట్ల పై మొట్ట మొదటి సారిగా వాడారు. ఆ నోట్ల పై గాంధీ జీ చిత్రాన్ని నీటిగుర్తు గా వాడారు. ఆ నోట్లని గాంధీ శ్రేణి నోట్ల గా పిలవడం ప్రారంభించారు.

ఇండియన్ కరెన్సీ గురించి మీకు తెలియని కొన్ని సర్ ప్రైజింగ్ విషయాలు..!!

1996 లో నోట్లు రూపాంతరం చెందాయి :
గాంధీ జీ బొమ్మని ముద్రించబడ్డ కరెన్సీ నోట్లు 1996 వ సంవత్సరం నుండి చలామణిలోకి వచ్చాయి. అంతక ముందు నోట్ల పై అశోక స్తంభాన్ని ముద్రించేవారు. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా నోట్లను రూపాంతరం చేయాలని భావించి ఇక అప్పటి నుండి ఐదు రూపాయల నోటు మొదలు కొని వెయ్యి రూపాయిల నోటు వరకు గాంధీ జీ చిత్రాన్ని వ్యాపార చిహ్నంగా ముద్రించడం ప్రారంభించింది.

ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధీ జీ చిత్రాన్ని అన్ని భారతీయ కరెన్సీ నోట్ల పై ముద్రించ బడుతూనే ఉంది..

Interesting: భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇదే.. ఎందుకో తెలుసా..

భారత రైల్వే ఆసియాలో రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. మన దేశంలో 8000 కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ అంశాలను బట్టి వివిధ ప్రాంతాలలో ఉన్న రైల్వే స్టేషన్లు ప్రత్యేక ప్రాచుర్యం పొందాయి. జనం నోళ్లలో నానాలి.. లేదా వార్తల్లో చర్చనీయాంశం అవ్వాలంటే దేనికైనా ఒక ప్రాముఖ్యత ఉండాలి. అలాంటి ఒక రైల్వే స్టేషన్ గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం. దానికి సొంత గుర్తింపు లేదు. అవును మేము చెప్పబోయే రైల్వే స్టేషన్‌కు పేరు లేదు.

తగాదా కారణంగా రైల్వే పేరు తొలగించబడింది

అవును, మేము చెప్పేది నిజమే. మన దేశంలో పేరు లేని స్టేషన్ ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని ఆద్రా రైల్వే డివిజన్‌లోని పేరులేని రైల్వే స్టేషన్ గురించి మేము మాట్లాడుతున్నాం.
బంకురా-మసాగ్రామ్ రైలు మార్గంలో ఉన్న ఈ స్టేషన్ రైనా, రైనగర్ అనే రెండు గ్రామాల మధ్య వస్తుంది. ఈ స్టేషన్ ప్రారంభ రోజుల్లో రైనాగర్ అని పిలువబడింది. కానీ రైనా గ్రామ ప్రజలు దీనిని వ్యతిరేకించి తమ గ్రామం పేరిట ఈ స్టేషన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కారణంగా రెండు గ్రామాల ప్రజల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ విషయం రైల్వే బోర్డుకు చేరింది. వివాదాన్ని పరిష్కరించడానికి, రైల్వే స్టేషన్… బోర్డు నుండి స్టేషన్ పేరును తొలగించారు అధికారులు.

దీనివల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేరు లేకపోవడం వల్ల ప్రయాణీకులు దాని గురించి ఇతర వ్యక్తులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే, రైల్వే శాఖ ఇప్పటికీ దాని పాత పేరు రైనగర్ పేరుమీదనే ప్రయాణీకులకు టిక్కెట్లను జారీ చేస్తుంది.

Crow-మూడేళ్ళుగా కాకి పగ…వణికి పోతున్న దినసరి కూలి

మూడేళ్ళుగా కాకి పగ…వణికి పోతున్న దినసరి కూలి
భోపాల్‌ : సాధారణంగా నచ్చని వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటే ఆ విషయాన్ని పాము పగతో పోలుస్తారు కొంతమంది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన శివ కేవత్‌ అనే దినసరి కూలీపై పగబట్టిన కాకుల గురించే తెలిస్తే తమ అభిప్రాయం మార్చుకుంటారు. పిల్ల కాకిని చంపేశాడన్న కోపంతో కాకి సమాజం అతడిపై కక్ష గట్టి మూడేళ్లుగా దాడి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమని ముఖం నిండా గాయాలతో సతమవుతున్న శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన శివ కేవత్‌ మూడేళ్ల క్రితం పనికి వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి సమీపంలో ఉన్న కాకి గూట్లో పిల్ల కాకి మూలుగు విని దాని దగ్గరకు వెళ్లాడు. గాయంతో విలవిల్లాడుతున్న కాకి పిల్లను చేతిలోకి తీసుకుని నిమురుతుండగానే అది ప్రాణాలు కోల్పోయింది. సరిగ్గా అప్పుడే గూటికి దగ్గరకు వచ్చిన తల్లి కాకి సహా ఇతర కాకులు పిల్ల కాకిని శివ చంపేశాడని భావించాయి. ఇక ఆనాటి నుంచి అతడిపై పగబట్టాయి. ఇంట్లో నుంచి శివ బయటికి వెళ్లే సమయంలో అక్కడికి చేరుకుని రోజూ అతడిని ముక్కుతో పొడవడంతో పాటుగా కాళ్లతో ముఖం, చేతులపై దాడి చేయడం ప్రారంభించాయి.

కాగా మొదట్లో ఇదంతా యాధృచ్చికంగా జరుగుతోందని భావించిన శివకు రాను రాను అసలు విషయం అర్థమైంది. దీంతో వాటిని తప్పించుకుని పోయేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కాకులు మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. మూడేళ్లుగా తాను అనుభవిస్తున్న బాధ గురించి శివ మాట్లాడుతూ..‘ నేను కాకి పిల్లను కాపాడాలనుకున్నాను. కానీ అది నా చేతుల్లో ప్రాణాలు విడిచింది. దీంతో నేనే దాన్ని చంపానని కాకులు భావిస్తున్నాయి. వాటి ఙ్ఞాపక శక్తి అమోఘం. ఇన్నేళ్లు అయినా నా ముఖాన్ని మర్చిపోకుండా దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా నన్ను క్షమించి వదిలేస్తే బాగుండు’ అని వ్యాఖ్యానించాడు.

Ayya konda, kurnool dist -రాయలసీమలోని ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ సమాధులు ఎందుకున్నాయ్?- ఇళ్ల మధ్యలో సమాధులు ఎందుకు! దాని వెనుకున్న రహస్యం ఏమిటి.. ?

‘అయ్య కొండ’. పేరుకు తగ్గట్టే కొండమీద ఉంది ఈ గ్రామం.
పాడుబడిన ఇంటి గోడ మీద వెలిసిపోతున్న అక్షరాలు ఊరి వైపు చూపించాయి.
ఆ ఊరి నిండా గోరీలే. ప్రతీ ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంది.
ఆడవాళ్లు వాటి మధ్యే నీళ్లు మోసుకుంటూ వెళ్తారు. పిల్లలు సమాధుల ముందే ఆడుకుంటారు.
ఇక్కడ బడి, గుడి ముందు కూడా సమాధులే ఉన్నాయి.
ఊరి మధ్యలో సమాధులు ఉన్నాయో.. సమాధుల మధ్య ఊరుందో అక్కడ అడుగు పెట్టిన మాకు అర్ధం కాలేదు.
కానీ, అక్కడ సమాధులే సర్వస్వం. వాటితోనే ప్రజల జీవితం పెనవేసుకుపోయింది.


ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? రాయలసీమలో.
కర్నూలు నుంచి పడమర వైపున 66కిలోమీటర్ల దూరంలో గోనెగండ్ల మండలంలో గంజిహల్లి పంచాయితీ పరిధిలోని కుగ్రామమే అయ్యకొండ.
సమాధుల ముందు నిత్య నైవేద్యాలు!
ఇక్కడ ప్రతీ ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంది.
ఇంటి ముందు ఉన్న గోరీలకు ప్రతీరోజూ నైవేద్యాలు పెడతారు.
వంట చేసిన తర్వాత గోరీల ముందు నైవేద్యం పెట్టిన తర్వాతే ఇంట్లోని వారు తింటారు.
‘ఈ సమాధులు మా తాత, ముత్తాతలవని మా పెద్దలు చెప్పారు. వాటిని భక్తితో పూజిస్తాం. నిత్యం నైవేద్యం సమర్పిస్తాం. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నాం’ అని గ్రామస్తులు చెప్తారు..

ఈ గ్రామం సమాధులకు నిలయంగా ఎలా మారింది’
ఇళ్ల మధ్యలో సమాధులు ఎందుకు! దాని వెనుకున్న రహస్యం ఏమిటి.. ?
గ్రామ మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులును ఈ ప్రశ్నలు అడిగితే ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
‘పూర్వం నల్లారెడ్డి అనే గురువు ఈ ఊరి కోసం శ్రమించి, తన సర్వస్వం ధారపోశాడట. ఆయన శిష్యుడు ఈ గ్రామానికి చెందిన మాలదాసరి చింతల మునిస్వామి. అయ్యకొండ అభివృద్ధికి వీరిద్దరు కృషి చేశారట. వారు చేసిన మేలుకు కృతజ్ఞతగా వారి మరణానంతరం వారికి ఇక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు. అప్పటి నుంచి ఎవరు మరణించినా వారి ఇంటి ముందే సమాధి కడుతున్నారు’ అని శ్రీనివాసులు చెప్పారు.
కొత్త వస్తువు కొన్నా, ఏదైనా వండినా ఈ ఇద్దరు స్వాముల సమాధుల వద్ద పెట్టి, ఆ తర్వాత, ఇంటి ముందున్న సమాధులకు సమర్పించాలి. ఆ తర్వాతే ఇంట్లోని వాళ్లు ముట్టుకోవాలి.

నైవేద్యం పెట్టకుండా నేరుగా తింటే అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల గట్టి నమ్మకం.
‘40 మందికి పైగా పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అంగన్‌ వాడీ కేంద్రం ఏర్పాటు అవసరం చాలా ఉంది. కొండ కింద స్థలం కేటాయిస్తే అక్కడ ఇళ్లు కట్టుకుంటామని ప్రజలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని ఆయన బీబీసీకి వివరించారు.
గ్రామ అభివృద్ధిలో ముందుండే మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు రోజూ ఉచితంగా చిన్నారులకు చదువు చెబుతారు. అయ్యకొండలో మార్పు తేవాలనుకున్నారు. కానీ, మూఢ నమ్మకాలతో సావాసం చేస్తున్న పెద్దలను ఒప్పించ లేక, చదువుతో విద్యార్థులను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ఊరి నిండా వింత ఆచారాలే!
ఈ గ్రామంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి.
ఇక్కడి వారు ఈ ఊరిలోని వారినే పెళ్లి చేసుకోవాలి.
ఈ గ్రామస్థులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి. బయటి సంబంధాలు చేసుకోరు.
ఊరంతా మాలదాసరులే!
ఇక్కడ ఎవరూ పట్టె మంచాల మీద పడుకోరు. దాని వల్ల కూడా అరిష్టం అని వీరి నమ్మకం. ఈ ఊరిలో మాల దాసరులే తప్ప వేరే కులం వారు ఉండరు.
గతంలో వాల్మీకి బోయకు చెందిన రెండు కుటుంబాలుండేవి. కానీ వారు అంతుచిక్కని వ్యాధులకు గురై ఊరు విడిచి వెళ్లి పోయారని గ్రామస్థులంటారు.
పొద్దు దిగక ముందే ఇంటికి చేరాలి !
ఇక్కడ అందరూ కష్టపడి పని చేస్తారు. వీరిలో 80శాతం మందికి కొండకింద భూములున్నాయి.
కొర్రలు, సజ్జలు, పల్లీ, మిరప, ఉల్లి వంటి పంటలు పండిస్తారు. తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్లి, సూర్యుడు అస్తమించక ముందే గ్రామానికి చేరుకోవడం వీరి ఆనవాయితీ.

అసలు పేరు కుందేలుపడ
“అయ్యకొండ” ను ఒకప్పుడు “కుందేలు పడ” అని పిలిచేవారు.
ఇక్కడ కుందేళ్లు ఎక్కువగా ఉండేవి. మాల దాసరులు వాటిని వేటాడి బతికేవారు. “కుందేలు పడ” కాలక్రమంలో అయ్యకొండగా మారింది.
ఇక్కడ 150 కుటుంబాలున్నాయి. రేషన్‌ సరుకుల కోసం, పింఛన్ల కోసం, సంతకు కొండకింద ఉన్న గంజిహల్లికి వెళ్లాల్సిందే.
మారాలనే ఉంది కానీ..!
‘ఇది తరతరాలుగా వస్తున్న అచారం. కట్టు తప్పితే కీడు జరుగుతుందని మా నమ్మకం. కానీ, ఎంత కాలమిలా? భవిష్యత్‌లో ఇక్కడ సమాధులకు స్థలం ఉండదేమోనని దిగులు వేస్తోంది. శ్మశాన వాటికకు ఎక్కడైనా చోటు ఇవ్వమని ప్రభుత్వ అధికారులను అడిగాం కానీ, ఇపుడు పట్టించుకునే నాధుడే లేడు. నాయకులు ఎన్నికల సమయంలోతప్ప మా వైపు తొంగి చూడరు’ అని గ్రామపెద్ద రంగస్వామి నిరాశ కూడిన స్వరంతో చెప్పారు.

Walking trees -నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా?.చెట్లేంటీ.. నడవడమేంటీ? అని ఆశ్చర్యపోకండి. నిజంగా ఈ చెట్లు నడుస్తాయి..నడిచే చెట్టు లోగుట్టు….

చెట్లేంటీ.. నడవడమేంటీ? అని ఆశ్చర్యపోకండి. నిజంగా ఈ చెట్లు నడుస్తాయి. వీటిని ఓ చోట నాటారనుకోండి.. కొన్నాళ్ళ తర్వాత అవి వేరే చోట ఉంటాయి. వీటిపేరే సొక్రాటియా ఎక్సోర్హిజా. ఎక్సో అంటే అవుట్, ర్హిజా అంటే రూట్స్.. బయటకు కనిపించే వేర్ల వల్లే చెట్లకు ఆ పేరు వచ్చింది. ఆ చెట్టును ఓ చోటనాటి కొన్నాళ్ల తర్వాత చూస్తే ఆ చెట్టు అక్కడుండదు. కొంచెం ముందుకో, వెనక్కో, పక్కకో జరిగిపోతుంది. అందుకే ఆ చెట్టును వాకింగ్ పామ్ అని కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ అమెరికా, బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, పెరూల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వాకింగ్ పామ్ నడవటానికి కారణం.. దాని వేర్లు. ఈ చెట్టు ఆకులు సూర్యకాంతిలో పెరుగుతాయి. దట్టమైన అడవుల్లో సూర్యరశ్మి తక్కువగా పడుతుంది.
ఆ సమయంలో చెట్టు వేర్లతో నెమ్మదిగా నడిచేస్తుంది. చెట్టు కాండం కింద పొడవైన వేర్లు ఉంటాయి. చూడ్డానికి ట్రైపాడ్‌లా ఉంటాయవి. ఇవే చెట్టు కదిలేలా చేస్తాయి.

బయటకు ఉన్న వేర్లు కొంచెం పక్కకు నాటుకుంటాయి. అవి పాతుకున్నాక ఇది వరకటి వేర్లను క్రమంగా వదిలించేసుకుంటాయి. మళ్లీ కొత్తవి నాటుకుంటాయి. ఆ తర్వాత పాత వేర్లను వదిలేస్తాయి. ఇలా కొంచెం కొంచెంగా ముందుకో, పక్కకో కదులుతుంది. ఇదంతా చాలా మెల్లగా జరుగుతుంది.

రైలు బోగిలపై ఉండే ఈ గీతలకు అర్థం ఏంటో తెలుసా..? చాలా సమాచారం దాగి ఉంది.. మీరు తెలుసుకోండి..

Strips on Train Coaches : తరచుగా మీరు రైలులో ప్రయాణిస్తారు. మొదటి టికెట్ బుక్ చేసుకుంటారు. తరువాత రైల్వే స్టేషన్‌కు వెళ్లి మీ కంపార్ట్‌మెంట్ వెతుక్కొని సీట్ నెంబర్ చూసుకొని కూర్చుంటారు. కానీ చాలామంది రైలుకి సంబంధించి ఇతర విషయాలపై శ్రద్ధ చూపరు. మీరు కూర్చున్న కంపార్ట్‌మెంట్‌లో రైలు సమాచారంతో పాటు, కొన్ని గీతలు గీస్తారు. ఇవి కంపార్ట్మెంట్ చివరిలో కిటికీ పైన కనిపిస్తాయి.అయితే ఈ గీతలు డబ్బాల అందం కోసం కాదు సమాచారం తెలియజేయడం కోసం గీస్తారు. చదువురానివారు కోచ్ గురించి తెలుసుకోవడానికి ఈ గీతలు ఉపయోగపడుతాయి. ఇప్పుడు వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం. ప్రతి బోగిపై భిన్నమైన రంగులో గీతలు గీసి ఉంటాయి. ఈ రంగును బట్టి దూరం నుంచే మీరు ఎక్కే డబ్బాను కనుక్కోవచ్చు.

1. బోగిపై పసుపు గీతలు ఉంటే..

బోగి చివర పసుపు రంగు రేఖలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్. అంటే జనరల్ కోచ్ అని అర్థం చేసుకోండి. ఇందులో టికెట్ నంబర్ అవసరం లేదు. అదనంగా, పసుపు రంగు రేఖలను సాకేడ్ క్లాస్ కోచ్‌లపై కూడా తయారు చేస్తారు. పసుపు గీతలతో కూడిన పెట్టె దూరం నుంచి మనం సులువుగా కనిపెట్టవచ్చు.

2. బోగిపై తెల్లని గీతలు ఉంటే..

నీలిరంగు డబ్బాలపై లేత నీలం లేదా తెలుపు రంగుతో గీసిన గీతలు ఉంటే అది స్లీపర్ క్లాస్ అని అర్థం.

3. నీలం రంగులో పసుపు గీతలు ఉంటే..

పెట్టెపై మందపాటి పసుపు చారలు ఉంటే అప్పుడు ఈ పెట్టె విభిన్న సామర్థ్యం ఉన్న అనారోగ్య వ్యక్తుల కోసం కేటాయించబడిందని అర్థం.

4. ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే..

బూడిద రంగు పెట్టెలపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్ మహిళలకు కేటాయించబడిందని అర్థం. ఇది ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంది.

5. బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే..

అదే సమయంలో బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం. స్థానిక రైళ్లకు ఇది జరుగుతుంది.

6. బోగిపై ఉన్న సంఖ్యలు ఏమి సూచిస్తాయి..

రైలులోని ప్రతి కోచ్‌లో 5 అంకెల సంఖ్య ప్రధానంగా కనిపిస్తుంది. వాటికి భిన్నమైన అర్థాలు ఉంటాయి. దాని మొదటి రెండు పాయింట్లు కోచ్ ఏ సంవత్సరంలో తయారైందో సూచిస్తుంది. 92322 రైలు కోచ్‌లో రాసారు అనుకుంటే.. మొదటి రెండు పాయింట్ల ప్రకారం ఈ కోచ్ 1992 సంవత్సరంలో తయారైంది. మిగిలిన మూడు సంఖ్యలు కోచ్ ఎసి 1 టైర్ లేదా 2 టైర్ లేదా జనరల్ సెకండ్ క్లాస్ అనే దాని గురించి చెబుతాయి. 322 ఇది రెండో తరగతి స్లీపర్ కోచ్ అని చూపిస్తుంది.

East India Company: నాడు దేశాన్ని పాలించిన ఆ కంపెనీ పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా..ఏం చేస్తుందో తెలుసా

East India Company: ఓడలు బడులు..బడులు ఓడలౌతాయనేది పాత సామెత. అన్ని రోజులూ ఒకేలా ఉండనేది మరో సామెత. ఈ రెండు సామెతలూ నాడు దేశాన్ని పాలించిన ఆ కంపెనీకు సరిగ్గా సరిపోతుంది.

ఆశ్చర్యంగా ఉందా..నిజమే మరి. లెట్స్ హ్యావ్ ఎ లుక్…

ఈస్ట్ ఇండియా కంపెనీ. పేరు చెబితేనే వణుకు పుట్టించే వ్యాపార సామ్రాజ్యమది. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యానికి పునాది వేసింది ఈ కంపెనీనే. ఈస్ట్ ఇండియా కంపెనీనే తొలుత ఇండియాలో అడుగు పెట్టింది.

దాదాపు 2 వందల ఏళ్లు ఇండియాను పాలించించి ఈ కంపెనీనే. 16 వందల శతాబ్దం చివరిలో ప్రవేశించి..నెమ్మది నెమ్మదిగా మొత్తం దేశంపై ఆధిపత్యం చెలాయిస్తూ..పాలనను బ్రిటీషు ప్రభుత్వానికి అప్పగించింది.

టీ, కాఫీలు అమ్ముతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ

ఆంగ్లేయులు ఇండియాలో స్థాపించిన తొలి కంపెనీ ఇది. ప్రారంభంలో ఈ కంపెనీ వ్యవసాయం నుంచి మైనింగ్, రైల్వే వరకూ అన్ని పనుల్లో ఉండేది. అలా వ్యాపార విస్తరణ కోసం ఇండియాకు వచ్చి..దేశాన్నే పాలించే స్థితికి చేరింది. మరి ఇప్పుడా కంపెనీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలనుందా.

యాధృఛ్చికమో మరేదో కానీ నాటి ఘనమైన ఈస్ట్ ఇండియా కంపెనీని భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త సంజీవ్ మెహతా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తరువాత కంపెనీని ఈ కామర్స్ వేదికగా మార్చేశారు. ఇప్పుడీ కంపెనీ టీ, కాఫీ, చాకొలేట్ వంటి వస్తువుల్ని ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తోంది.

క్రీస్తుశకం 16 వందల శతాబ్దం చివర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానప జరిగింది. అప్పటి ఇంగ్లండ్ మహారాణి ఎలిజబెత్ 1..ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మెర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ ఈస్ట్ ఇండీస్‌కు అనుమతించింది. ఫలితంగా ఈ కంపెనీకు తూర్పు ద్వీప సమూహంలోని దేశాల్లో వ్యాపారం కోసం పూర్తి అధికారాలు అప్పగించారు. మసాలా వ్యాపారం కోసం అప్పట్లో ఈ కంపెనీ స్థాపించారు. అప్పట్లో స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పూర్తి అధికారాలుండేవి.

ఇండియాపై 2 వందల ఏళ్లు అధికారం

కొన్నేళ్ల తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ కపాస్, రేషమ్, టీ, నీలం, మత్తు మందు వ్యాపారం కూడా ప్రారంభించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పట్లో వ్యాపారం, సూరత్‌లో ఫ్యాక్టరీ తెర్చుకునేందుకు జహంగీర్ నుంచి అనుమతి తీసుకుంది. క్రమంగా మొత్తం దేశాన్ని ఆధీనంలో తీసుకుని..2 వందల ఏళ్లు పాలించింది.

1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం ఇంగ్లండ్ ప్రభుత్వం 1874 జనవరి 1వ తేదీన కంపెనీని వెనక్కి పిలిపించి సొంతంగా అధికార పగ్గాలు తీసుకుంది. నాడు ఇండియాలో దురాక్రమణ రీతిలో కంపెనీ వైఖరి ఉండేది. భారతీయులపై దౌర్జన్యాలకు పాల్పడేది. 2003లో ఈ కంపెనీని షేర్స్ గ్రూప్ ఒకటి కొనుగోలు చేసి..టీ, కాఫీ వ్యాపారం ప్రారంభించింది.

ఆ తరువాత 2005లో భారతీయ మూలాలు కలిగిన బ్రిటీషు వ్యాపారవేత్త సంజీవ్ మెహతా ఈ కంపెనీ చేజిక్కించుకున్నారు. లగ్జరీ టీ, కాఫీ, ఇతర పదార్ధాల విక్రయంలో కొత్త బ్రాండ్ సృష్టించి వ్యాపారం విస్తరించారు. ఏ కంపెనీ అయితే నాడు మొత్తం దేశాన్ని ఆక్రమించి పాలించిందో అదే కంపెనీకు యజమాని కావడం ఓ భారతీయుడిగా గర్వంగా ఉందంటున్నారు సంజీవ్ మెహతా.

చాణక్య నీతి: ఈ రెండింటికీ భయపడేవారు ఎప్పటికీ గెలవలేరు… జీవితాంతం కష్టపడాల్సిందే!

ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు, అయితే మనిషి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. ఎవరైనాసరే విజయం సాధించాలంటే, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దాటాలి.

ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు మనిషిని విజయపథంలోకి తీసుకెళ్లడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వాటిని సరిగ్గా అనుసరిస్తే విజయానికి మార్గం సులభతరం అవుతుంది. జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలను చాణక్య తెలిపారు. రెండు ముఖ్యమైన విషయాల్లో భయపడే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పోరాడాల్సి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కష్టపడి పనిచేయడం

తాను చేయాల్సిన పని విషయంలో ఎప్పుడూ బద్ధకించని వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధించి, దానిలోని ఆనందాన్ని అందుకుంటాడని ఆచార్య చాణక్య తెలిపారు. కృషి చేయకుండా పురోగతి సాధ్యంకాదు. కష్టపడి పనిచేయడానికి భయపడే వ్యక్తి ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అలాంటివారు జీవితాంతం డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సివస్తుంది. కష్టపడితేనే లక్ష్యం నెరవేరుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు.

విమర్శలను ఎదుర్కోవడం

విమర్శ అనేది మనిషిని తీవ్రంగా కలవరపెడుతుంది. తప్పు చేయనప్పుడు విమర్శలను తట్టుకునేవాడే ధైర్యవంతుడు. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎవరైనాసరే విమర్శలు ఎదుర్కొనే సమయం ఖచ్చితంగా వస్తుంది. వాటిని చూసి భయపడేవాడు తన గమ్యాన్ని చేరుకోలేడు. విమర్శ అనేది విజయ మార్గంలో అడ్డంకి.

అందుకే దానిని ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించాలని ఆచార్య చాణక్య సూచించారు. ప్రత్యర్థి చేసే విమర్శలకు భయపడి నిరుత్సాహపడకండి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి. ప్రత్యర్థులకు భయపడితే తప్పటడుగులు వేసి విఫలమవుతారని చాణక్య తెలిపారు.

Budama Mokka : షుగర్ వ్యాధిని సమూలంగా నయం చేసే.. బుడమ మొక్క.. ఎన్నో ఔషధ గుణాలు కలది..!

Budama Mokka : పొలాల గట్లు, పత్తి చేలలో ఎక్కువగా కనిపించే మొక్కలలో బుడమకాయ మొక్క ఒకటి. దీనిని బుడమ, బుడ్డ, కుంపటి, కుప్పంటి మొక్క అని కూడా పిలుస్తారు.
ఈ మొక్కను సంస్కృతంలో మృధు కంచిక అని, హిందీలో బంధ ప్రియ అని పిలుస్తారు. ఈ బుడమ మొక్క కాయలు గాలి బుగ్గలలా ఉంటాయి. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. పూర్వకాలంలో ఈ మొక్క కాయలను పిల్లలు తినేవారు. వాటితో ఆడుకునే వారు కూడా. ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఈ మొక్క విస్తారంగా పెరుగుతుంది. దీనిని చాలా మంది కలుపు మొక్కగా భావిస్తారు. కానీ బుడమ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

ఆయుర్వేదంలో ఈ మొక్కను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అల్సర్, దగ్గు, బ్రోంకైటిస్, మూత్ర సంబంధిత సమస్యలు వంటి వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. బుడమ మొక్క కాయలను కొన్ని ప్రాంతాలలో కూరగా కూడా వండుకుని తింటారు. ఈ కాయలలో విటమిన్ సి తోపాటు పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్ ఉంటాయి. బుడమ మొక్క ఆకులను తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి నయం అవడంతోపాటు బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. బుడమ మొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి వాటిని మూడు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని వడకట్టుకుని రోజుకు ఒకసారి తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల షుగర్ వ్యాధి నయం అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Budama Mokka
ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ మొక్క వేర్ల నుండి తీసిన రసాన్ని పొట్టపై లేపనంగా రాస్తారు. అంతేకాకుండా బుడమ మొక్క యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ మొక్క పండ్లను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి. బుడమ మొక్క యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వీటి ఆకులను ముద్దగా నూరి నొప్పులపై ఉంచి కట్టు కట్టడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్క ఆకులను ఉడికించుకుని కూడా తింటారు. ఈ విధంగా కలుపు మొక్కగా భావించే బుడమ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Skin Care Tips: మీ నుదుట ముడతలు పడుతున్నాయా..ఈ పద్ధతులు పాటిస్తే చాలు

Skin Care Tips: చాలామంది మగవారిలో నుదుట ముడతలు ఎక్కువగా ఉంటుంటాయి. ఫలితంగా వృద్ధాప్యఛాయలు, నిర్జీవం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంటాయి. మరి ఈ ముడతల్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
నుదుట ముడతలు పడి..చర్మం కాంతి విహీరంగా కన్పిస్తూ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. మహిళల కంటే ఎక్కువగా పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది.

ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మార్కెట్‌లో లభించే చాలా రకాలు ఉత్పత్తులు వినియోగిస్తుంటారు కానీ ప్రయోజనం ఉండదు. చర్మం ఇంకా పాడైపోతుంటుంది. అందుకే మీ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం.

దీనికోసం కొన్ని వస్తువులను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ క్రమంలో నుదుట ముడతల్నించి ఉపశమనం కల్గించే కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం..

మహిళలతో పోలిస్తే పురుషులు ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంటారు. ఎక్కువ మంది చర్మ సంరక్షణపై దృష్టి కూడా పెట్టరు. ఫలితంగా చర్మం నిర్జీవంగా మారిపోతుంటుంది.

అందుకే ఎండలో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తీక్షణమైన సూర్య కిరణాల్నించి రక్షించుకోవాలి. ఒకవేల ఎండలో ఉండాల్సి వస్తే మాత్రం మంచి సన్‌స్క్రీన్ వాడాలి. మరోైవైపు మీ పని భారాన్ని ఒత్తిడిగా భావించకూడదు.

ఆందోళన చెందకూడదు. ఇలా చేయడం వల్ల సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. ఫలితంగా నుదుట ముుడతలు పెరిగిపోతాయి. ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా, అరోమా థెరపీ, సరైన నిద్ర అవసరమౌతాయి. వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

ఎండిపోయిన, నిర్జీవమైన చర్మం నుంచి రక్షించుకునేందుకు మీరు చర్మాన్ని హైడేట్ చేసుకోవాలి. మీ శరీరం అవసరమైనంతగా హైడ్రేట్ అయుంటే..నుదుటే కాదు మరెక్కడా పెద్దగా ముడతలు కన్పించవు.

ఎండాకాలంలో కూడా చర్మం మెరుస్తుంటుంది. అందుకే రోజంతా ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. దీనికోసం రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.

ఒకవేళ మీ చర్మాన్ని సంరక్షించుకోవాలంటే..ధూమపానం పూర్తిగా మానేయాలి. చర్మ సంరక్షణతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి

Health

సినిమా