Saturday, November 16, 2024

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇవి మానేయండి!

Weight Loss Tips: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు.
మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వెంటనే బరువు పెరుగుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వాటి నుంచి తప్పించుకునేందుకు.. తగిన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం.

బరువు తగ్గాలనుకునే వారు భోజనం చేసిన తర్వాత టీ, కాఫీలు వంటివి తాగడం మానుకోవాలి. లేదంటే మీరు మరింతగా బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా లంచ్ తర్వాత మానుకోండి. లేదంటే బరువు తగ్గాలనే మీ ప్రయత్నం ఫలించదు.

టీ, కాఫీ మానుకోండి

చాలా మంది లంచ్ తర్వాత కాఫీ తాగడానికి ఇష్టపడతారు. అయితే, తిన్న వెంటనే ఆమ్ల ఆహారాలు తీసుకోవడం లేదా తినడం వల్ల కడుపులో చికాకు కలిగిస్తుంది. అలాగే కాఫీలోని చక్కెర క్యాలరీలను పెంచుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.

భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల..

భోజనం చేసిన తర్వాత డెజర్ట్‌లు తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ రోజూ స్వీట్లు తినే అలవాటు మంచిది కాదు. రోజూ భోజనం చేసిన తర్వాత స్వీట్లు తింటే శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి, భోజనం తర్వాత స్వీట్లు తినడానికి వీలైనంత దూరంగా ఉండాలి.

ఆలస్యంగా తినకూడదు..

ఆహారాన్ని అస్వాదిస్తూ తింటే శరీరానికి ఒంటపడుతుంది. కానీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎక్కువగా భోజనం చేసే వారు బరువు తగ్గే అవకాశం తక్కువ. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది.

Weight Loss With Egg: గుడ్డుతో ఈ మూడింటిని కలిపి తింటే కిలోల కొద్ది బరువు హాంఫట్.. అవేంటో తెలుసుకోండి

Weight Loss With Egg: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని ప్రొటీన్ల రారాజుగా అభివర్ణిస్తారు. గుడ్డులో ఖనిజాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి.
అయితే.. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు గుడ్డును తినడం చాలామంచిది. అయితే గుడ్లలో మూడు ప్రత్యేకమైన పదార్థాలను కలిపి తినడం వల్ల బరువు తగ్గే ప్రక్రియలో వేగం పెరుగుతుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. గుడ్లతో కలిపి (Egg combinations) ఈ ఆహార పదార్థాలను కలపి తింటే.. కొన్ని వారాలలో అనేక కిలోగ్రాముల బరువును తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్డు- బచ్చలికూర: గుడ్డుతో బచ్చలికూర తీసుకోవడం వల్ల వేగవంతంగా బరువు తగ్గొచ్చు. ఒక కప్పు బచ్చలికూరలో ఏడు కేలరీలు, అనేక పోషకాలు ఉంటాయి. ఈ కాంబినేషన్ లో అనవసరమైన కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఐరన్ అధికంగా ఉండే బచ్చలికూర మన బలాన్ని, జీవక్రియను కూడా పెంచుతుంది. దీని కారణంగా, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. ఆకలిని కూడా చాలా కాలం పాటు నియంత్రిస్తుంది.

గుడ్డు – కొబ్బరి నూనె: నెయ్యి లేదా ఇతర రకాల నూనెతో చేసిన ఆమ్లెట్ తినడం ద్వారా మన శరీరానికి ఎక్కువ కేలరీలు అందుతాయి. కొబ్బరి నూనె జీవక్రియను 5 శాతం పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 30 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. నెల రోజుల పాటు ప్రతిరోజూ రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల వారి నడుము పరిమాణం 1.1 అంగుళాలు తగ్గుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, నూనె లేదా వెన్నకు బదులుగా కొబ్బరి నూనెతో ఆమ్లెట్ వేసుకొని తినండి.

గుడ్డు – ఓట్ మీల్: గుడ్డును ఓట్ మీల్ తో కలిపి తినడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. వోట్‌మీల్‌లో ఉండే స్టార్చ్ నెమ్మదిగా జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆకలిని అణిచివేసేందుకు, కేలరీలను బర్న్ చేయడానికి జీర్ణ ఆమ్లాల విడుదలను ప్రేరేపిస్తుంది. గుడ్లతో ఓట్ మీల్ తినడం వల్ల మన జీవక్రియ కూడా పెరుగుతుంది.

గుడ్డు పోషకాహారానికి పవర్‌హౌస్: గుడ్డు మన శరీరంలోని పోషకాల లోపాన్ని సులభంగా తీర్చగలదు. ఒక గుడ్డులో 75 కేలరీలు ఉంటాయి. ఇందులో 7 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. ఇదేకాకుండా, ఒక గుడ్డు తినడం ద్వారా శరీరానికి 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు, కెరోటినాయిడ్లు అందుతాయి. అందుకే దీనిని పోషకాహారానికి పవర్‌హౌస్ అని నిపుణులు పేర్కొంటుంటారు.
(ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం నిపుణుల సూచనల మేరకే.. Mannam Web వీటిని ధృవీకరించడంలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత దీన్ని అనుసరించడం మంచిది.)

Greek Foot : కాలి బొటనవేలి కన్నా రెండో వేలు పొడుగ్గా ఉందా ? అయితే ఏం జరుగుతుందో తెలుసా ?

Greek Foot : సాధారణంగా మనలో కొందరికి శరీర అవయవాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. కొందరికి కొన్ని భాగాలు భిన్నమైన ఆకృతిలో ఉంటాయి. కొందరికి శరీరంలో ఒక వైపు భాగం పెద్దగా..
ఇంకో వైపు భాగం చిన్నగా ఉంటుంది. ఇవన్నీ మనకు పుట్టుకతోనే వస్తుంటాయి. అయితే ఇలాగే కొందరికి కాలి బొటన వేలి కన్నా రెండో వేలు పొడుగ్గా ఉంటుంది. ఇలా రెండు కాళ్లకూ బొటన వేళ్ల కన్నా వాటి పక్కనే ఉండే రెండో వేళ్లే పొడవుగా ఉంటాయి. ఇలా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటాయి. అయితే ఇలా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలి బొటన వేలి కన్నా రెండో వేలు పొడవుగా ఉంటే ఆ స్థితిని గ్రీక్ ఫుట్ అని అంటారట. ఇటువంటి పాదాలు ఉన్నవారికి త్వరగా కాళ్ల నొప్పులు వస్తాయట. ఎక్కువగా నడిస్తే అంతే సంగతులు. తీవ్రమైన కాళ్ల నొప్పులు ఏర్పడుతాయట. అలాగే ఎక్కువ పనిచేయకున్నా కాళ్లు త్వరగా అలసటకు గురవుతుంటాయట. ఇక వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కూడా ఉంటుందట.

Greek Foot
కాలి బొటన వేలి కన్నా రెండో వేలు పొడవుగా ఉన్నవారు చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారట. జీవితాన్ని చాలా సులభంగా ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. వీరిలో క్రియేటివిటీ కూడా ఉంటుంది. అలాగే ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. కొత్తవారిని కలవడం, పరిచయం చేసుకోవం అంటే వీరికి ఇష్టంగా ఉంటుంది. అలాగే వీరు ఇతరులను ఎల్లప్పుడూ మోటివేట్ చేస్తుంటారట. ఇతరుల్లో ప్రేరణను కలిగిస్తుంటారట. అయితే కోపం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందట. దీంతోపాటు ఇంట్లోని కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామిపై వీరి డామినేషన్ ఎక్కువగా ఉంటుందట. ఇలా అని చెప్పి గ్రీకులు విశ్వసిస్తారు. ఎంతో కాలం నుంచి వీరు దీన్ని నమ్ముతూ వస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా కొందరు ఇలాంటి వేళ్లు ఉన్నవారు బయట డామినేషన్ చేస్తూ మనకు కనిపిస్తుంటారు. దాని వెనుక ఉన్న అసలు కారణం ఇదన్నమాట..!

Prasar Bharati Invites Applications- దూరదర్శన్‌లో ఖాళీలు, వేతనం రూ.35వేలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

ప్రసార్‌ భారతి దూరదర్శన్‌లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కాపీ ఎడిటర్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: కాపీ ఎడిటర్‌
మొత్తం ఖాళీలు: 3(2-డీడీకే, 1- ఆకాశవాణి)
పని చేసే స్థలం: హైదరాబాద్‌
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌/డిగ్రీ/జర్నలిజం,మాస్‌ కమ్యునికేషన్‌లో పీజీ డిప్లొమా/మీడియా రంగంలో 3-5 ఏళ్లు పనిచేసిన అనుభవం.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం,ప్రాంతీయ, జాతీయ విషయాలపై అవగాహన,స్‌ఈవో, సోషల్‌ మీడియాకు సంబంధించినన పరిఙ్ఞానం కలిగి ఉండాలి.
వయో పరిమితి: 35 ఏళ్లకు మించరాదు.
వేతనం: రూ.35000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు https://prasarbharati.gov.in/pbvacancies/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Andhra Pradesh: ఓరి వీడు పాడుగాను.. దాని కోసం పాతిపెట్టిన మృతదేహాన్నే దొంగిలించాడు.. కట్ చేస్తే..

అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ చిత్రమే తీసేంత స్థాయిలో స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయినట్లు నమ్మించాలని అనుకున్నాడు.
పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కేతమళ్ల వెంకటేశ్వరరావు (పూసయ్య) వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాలకు తీర్చలేనన్ని అప్పులు చేసాడు. దీంతో ఓ ప్లాన్ రచించాడు.. చనిపోయినట్టు చిత్రీకరించుకుని కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని భావించాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్రణాళిక రూపొందించాడు. అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు.

ఆ తర్వాత గుర్తుతెలియని మృతదేహం కోసం రాజమహేంద్రవరం గ్రామీణం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాత బొమ్మూరులో ఈ నెల 23న ఓఎన్జీసీ ఇంజినీర్ నెల్లి విజయరాజు (53) మరణించారు. కుటుంబీకులు మరుసటిరోజు స్థానిక శ్మశానవాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులూ పూడ్చిపెట్టిన శవపేటిక నుంచి విజయరాజు మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు. వీరయ్య చెప్పిన ప్రకారం.. మర్నాడు దాన్ని వీరంపాలెం తీసుకెళ్లి ఓ పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోలు పోసి తగలబెట్టారు. పూసయ్య పాదరక్షలు, సెల్ఫోన్ను అక్కడే విడిచి పెట్టి పరారయ్యారు.

అయితే, అక్కడ లభించిన ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణించారని భావించి పూసయ్య భార్య తట్టుకోలేక తానూ చనిపోతానంటూ రోదించింది. అయితే, స్థానిక పరిస్థితులను యువకులిద్దరూ పూసయ్యకు ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పేవారు. బాధపడుతున్న భార్యకు విషయం ఎలాగైనా చెప్పాలని భావించి పూసయ్య మరో పథకాన్ని రూపొందించాడు.

గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసినట్టు పూసయ్య చెప్పుకొచ్చాడు. అయితే, అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు. అతడికి సహకరించిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూసయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనపర్తి సీఐ శివగణేష్, స్థానిక డిఎస్పి వివరాలను వెల్లడించారు.

Curries : రాత్రి చేసిన కూర పొద్దున్నే తింటే శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే..!!

Curries : మనందరికీ రెండు సార్లు వంట చేసుకోవటం అనేది అలవాటుగా ఉంటుంది. కొంతమందికి సమయం కుదరని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒక పూట వండి ఇంకో పూట కూడా తింటూ ఉంటారు.
ఫ్రిజ్లో పెడతారు. వేడి చేస్తుంటారు. వేసవికాలం అయితే వేడికి త్వరగా పదార్థాలు చెడిపోతూ ఉంటాయి. మరి చలికాలంలో వంట రెండు పూటలా చేసుకోకుండా ఒకే పూట వండుకు తినేవారు మరి ప్రొద్దుట వంటలు సాయంకాలం కూడా బయట పెట్టేసి తినొచ్చా.. ఫ్రిజ్లో పెట్టకుండా తింటే ఏమి లాభాలు వస్తాయి. ఈ విషయాలు మీద మీకు అవగాహన కలిగిద్దాం. రెండు పూటలా వండి పెట్టడం అనేది చలి కాలం చేయకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఏదో ఒకళ్ళిద్దరి కోసం కొంచెం తినే దానికోసం మళ్లీ వంట చేయటం వేస్ట్ కదా.

అలాంటప్పుడు ఉదయం పూట మీరు వంట చేసుకున్నప్పుడు ఈ పదార్థాలు సాయంకాలం సరిపడ వండుకొని వాటిని బయట ఉంచేసిన ఈ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల చెడిపోవు. ఫ్రిజ్ లు ఉన్నవారు ప్రజలు పెట్టొచ్చు. ఫ్రిజ్లో పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అందులో ఉపయోగపడే సూక్ష్మ జీవులు ఎంత పెరగాలో అంతే పెరుగుతాయి. వాటికి బెనిఫిట్ బాగా వస్తుంది. మనకి. అందుకని ఫ్రిజ్లో పెడితే ఈ బ్యాక్టీరియా అట్లా పెరగవు. కాబట్టి చలికాలం ఉదయం పూట వారి 10, 11 వంట చేసిన వెంటనే సాయంకాలం ఎంత కూర కావాలో రెండు రకాలు అనుకుంటే రెండు మూడు ని ఒక మంచి హాట్ బౌల్ ఒకటి తీసుకొచ్చేసి వెంటనే అందులో పెట్టకుండా మూత పెట్టేసి బయటే ఉంచండి.

అలాగే కొన్ని పచ్చళ్ళు మాత్రం కొబ్బరి ఇవి ఇవి సెనగపప్పు వేరుసెనగపప్పు పచ్చి కొబ్బరి ఇట్లాంటి వేసినప్పుడు అవి మాత్రం చెడిపోతాయి. వీటిని మాత్రం ఉంచకండి. రాత్రి చేసిన కూర, అన్నం మర్నాడు తినడం వలన మంచి బ్యాక్టీరియా పెరిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి రాత్రి చేసిన కూర కానీ అన్నం కానీ మరుసటి రోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి కావలసిన అన్ని విటమిన్లు పుష్కలంగా అందుతాయి..

.

TET And DSC Notification 2024 : గుడ్‌న్యూస్‌.. కేబినెట్ కీలక నిర్ణయం.టెట్ & డీఎస్సీ కి ఆమోదం..!

TET And DSC Notification 2024 : DSC డీఎస్సీలో 6000 పోస్టుల భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికిి ప్రతిపాదన పంపడం జరిగింది.ఈ క్రమంలోనే ఇటీవల అనగా జనవరి 31 న మంత్రివర్గ సమావేశాలను నిర్వహించారు.
దీనిలో భాగంగానే ఉపాధ్యాయ నియామకం టట్ డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత షెడ్యూల్ ని ప్రకటిస్తారని తెలియజేసారు. అయితే ముందుగా టెట్ నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఇవ్వనన్నట్లుు సమాచారం.టెట్ మరియు డీఎస్సీ కోసం కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ SGT పోస్టులకు పేపర్ 1 , పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకంగా ఏపీ టెట్ నిర్వహించనున్నారు.అయితే ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదు కాబట్టి నాలుగేళ్ల బ్యాచ్లర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివి ఉన్నవారు మాత్రమే అర్హులుగాా పేర్కొనబడతారు. ఇక టెట్ ఓసి లకు వ్రాయడానికి విరామంలో 50% ఎస్సీ, ఎస్టీ బీసీలకు PWD లకు 45 % మార్కులు పర్సంటేజీ గా ఉండాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ల కోసం ఎస్సీ, ఎస్టీ , బిసి,PWD అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ లో 40% మార్కులను ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది

అయితే ఇలా ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. అయితే గత ప్రభుత్వం 2018 లో చివరి సారిగా డీఎస్సీ నిర్వహణ జరిపింది. ఇక దీనిలో మొత్తం 7902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఆ సమయంలో దాదాపు 6.08 లక్షల మంది నుండి దరఖాస్తుల స్వీకరించబడ్డాయి.అలాగే గతంలో సార్జెంట్ హోదాలో ఉండేవారు బీఈడీ పూర్తి చేసిన వారు, అర్హులైన వారు డీఎస్సీ టెట్ తో పాటుు 100 పాయింట్లు కోసం కూడా నిర్వహించారు. TGT కోసం ఇంగ్లీష్ మీడియం కి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం టేట్ మరియు బిఎస్సి ను వేర్వేరుగా నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఐ ప్యాక్ సర్వే లీక్!.. మూడో సర్వేలోనూ టీడీపీ-జనసేనలదే అధికారం?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేపట్టిన మూడో తాజా సర్వే లీక్ అయినట్లుగా తెలుస్తోంది. రెండు సర్వేల్లో వైసీపీకి ఓటమి తప్పదని చెప్పిన ఐప్యాక్ సర్వే తాజాగా చేపట్టిన మూడో సర్వేలో కూడా ఓటమి తప్పదని తేల్చేసిందని సమాచారం.
టీడీపీ-జనసేన కూటమికి-143, వైసీపీకి-32 వస్తాయని నిర్ధారించింది, వైఎస్ షర్మిల రాకతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ మారిందంటూ రిపోర్ట్ బహిర్గతమైంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయడనంలో సందేహం లేదు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ను ఉతికారేస్తుండడంతో టీడీపీ-జనసేన కూటమికి ప్లస్ పాయింట్‌గా మారింది. అదేవిధంగా వైసీపీ చేపట్టిన అభ్యర్థుల మార్పు చేర్పులు కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. దాదాపు ఏడాదిన్నర నుంచి వివిధ రకాల ప్రైవేటు సంస్థలతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) చేపట్టిన ఐప్యాక్ సంస్థ సర్వే నిర్వహించింది. అందులో అధికార వైసీపీకి కొన్ని అనుకూల సర్వేలు రాగా, మరికొన్ని సంస్థలు టీడీపీకి మద్దతు పలికాయి
కానీ, తాజాగా ఐప్యాక్ మూడో సర్వేను లీక్ చేసింది. ఈ సారి టీడీపీ-జనసేన కూటమికి 143, వైసీపీకి-32 మించి సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సంక్షేమ పథకాలు జగన్‌ని కాపాడలేకపోతున్నాయని పీకే సర్వే తేల్చి చెప్పింది.

చంద్రబాబు అరెస్టు, షర్మిల రాకతో మార్పు

ఏపీ రాజకీయాల్లో తమకు ఓటమి లేదని గర్వపడిన సీఎం జగన్ కు చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరిగింది. వీటికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, జాబ్ క్యాలెండర్ వదలకపోవడం, పెరిగిన నిరుద్యోగం, పరిశ్రమలు లేకపోవడం, ఉద్యోగుల పట్ల అవలంభిస్తోన్న విధానాలు జగన్‌కు వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. ప్రత్యేకించి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాజకీయ సమీకరణాలు మరింత మారిపోయాయని సర్వేలో వెల్లడైంది.
ఐప్యాక్ సర్వేలో తేలిందేమిటంటే..

ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సర్వేను ఆ సంస్థ ప్రతినిదులు మూడు పర్యాయాలు లీక్ చేశారు. మొదటి సర్వే 2023 ఆగస్టులో లీక్ చేశారు. ఆ సర్వేలో వైసీపీకి 35 నుంచి 50 సీట్లకు మించి రావని చెప్పింది. 2023 నవంబర్ నెలలో రెండో సర్వేను లీక్ చేసింది. ఆ సర్వేలో టీడీపీ-జనసేన కూటమికి-144 సీట్లు, వైసీపీకి-31 సీట్లు వస్తాయని చెప్పింది. రెండు రోజుల క్రితం ఐప్యాక్ సర్వేను లీక్ చేసింది. ఈ సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు టీడీపీ-జనసేనకు-9, వైసీపీకి-1, విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు టీడీపీ-జనసేనకు 6, వైసీపీకి 3, విశాఖ జిల్లాలో 15 స్థానాల్లో టీడీపీ-జనసేనకు-13, వైసీపీకి-2 వస్తాయని వెల్లడించింది.
అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో19 స్థానాల్లో టీడీపీ జనసేనకు 17, వైసీపీకి 2, పశ్చిమ గోదావరి 15 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 14, వైసీపీకి 1, కృష్ణా జిల్లాలో 16 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 14, వైసీపీకి 2, గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు టీడీపీ-జనసేనకు 16, వైసీపీకి 1, ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు టీడీపీ-జనసేనకు 10, వైసీపీకి 2, నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు టీడీపీ, జనసేనకు 7, వైసీపీకి 3, చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 10, వైసీపీకి 4, కర్నూలు జిల్లా 14 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 10, వైసీపీకి-4, అనంతపురం జిల్లా 14 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 12, వైసీపీకి 2, కడప జిల్లా 10 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 5, వైసీపీకి 5 స్థానాలు వస్తాయని పేర్కొంది.

పిల్లల ఎత్తు పెరగాలంటే.. మూడు ఏళ్ల వయసు నుంచి ఈ ఆహారాలు ఇవ్వండి

తల్లితండ్రులు తమ పిల్లలు మంచి ఆరోగ్యం, శరీరాకృతితో ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం చిన్నతనం నుంచే ఆహారంపై శ్రద్ధ పెడతారు. చాలామంది పిల్లల ఎత్తు తల్లిదండ్రుల ఎత్తుపై ఆధారపడి ఉన్నప్పటికీ, కొన్నిసార్లు తల్లిదండ్రుల ఎత్తు బాగానే ఉన్నప్పటికీ, కొంతమంది పిల్లల ఎదుగుదల తక్కువగా ఉండటం కనిపిస్తుంది.
పిల్లలు ఎత్తు, వెడల్పు సరిగ్గా పెరగాలంటే వారి ఎముకలు, కండరాలు దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. అందువల్ల, వారికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. పుట్టినప్పటి నుండి దాదాపు 14 సంవత్సరాల వయస్సు వరకు, పిల్లల ఎదుగుదల సహజంగా చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి వారికి సరైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. మూడు సంవత్సరాల వయస్సు నుంచి పిల్లల ఆహారంలో కొన్ని ఆహారాలు తప్పనిసరిగా చేర్చాలి. అవి ఏంటంటే…

 

డ్రై ఫ్రూట్స్, నట్స్

పిల్లల ఆహారంలో పిస్తా, బాదం, వాల్‌నట్ వంటి గింజలను చేర్చండి. వాటిలో మంచి మొత్తంలో కాల్షియం, ఒమేగా 3 ఉంటాయి, ఇవి పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలను పెంచడంలో సహాయపడతాయి. అయితే ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, ఎండిన క్రాన్బెర్రీస్ వంటి డ్రై ఫ్రూట్స్ ఐరన్ యొక్క మంచి మూలం, ఇది శరీర కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది, అయితే పిల్లల ఆహారంలో సరైన పరిమాణంలో ఇవన్నీ చేర్చండి. దీని కోసం మీరు నిపుణుల నుండి కూడా సలహా తీసుకోవచ్చు.

పన్నీర్‌

పిల్లలకు రోజూ పాలు ఇవ్వడమే కాకుండా పన్నీర్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను వారి ఆహారంలో చేర్చాలి. ఇది సహజంగా కాల్షియం మరియు విటమిన్ డి లోపాన్ని తీరుస్తుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది.

సీజనల్ పండ్ల నుంచి విటమిన్లు లభిస్తాయి

పిల్లల ఎత్తును పెంచడంలో ప్రధాన కారణం జన్యుపరమైనది కాకపోతే, అది పోషకాల కొరత కావచ్చు, కాబట్టి వివిధ రకాల సీజనల్ పండ్లను ఆహారంలో చేర్చాలి. ఖనిజాలతో పాటు, విటమిన్లు కూడా పండ్లలో సమృద్ధిగా ఉంటాయి, ఇవి పెరుగుదలను వేగవంతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

కూరగాయలు ముఖ్యమైనవి

బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా, పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. ఇది వారి ఎత్తును కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, పిల్లల ఆహారంలో మంచి మొత్తంలో ఆకుపచ్చ, కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.

Brain Chip | మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్‌ చిప్‌.. చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ కంపెనీ

మనిషి మెదడులో అధునాతన చిప్‌
మొదటిసారిగా అమర్చిన ఎలాన్‌ మస్క్‌ కంపెనీ
బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌తో విధులు
శారీరక, మానసిక సమస్యలకు మేలైన పరిష్కారం
పక్షవాతం, పార్కిన్‌సన్స్‌ వంటి రోగాలకూ చెక్‌!
Brain Chip | న్యూయార్క్‌, జనవరి 30/(స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో): రామ్‌ కథానాయకుడిగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా చూశారా? ఆ చిత్రంలో హీరో మెదడులో ఓ చిప్‌ను అమరుస్తారు. సినిమాలో ఆ దృశ్యాన్ని చూసి ఇది నిజంగా సాధ్యమా? అని అనుకొన్నవాళ్లు చాలామందే ఉంటారు. అయితే, నిజ జీవితంలో ఆ ఫీట్‌ను చేసి చూపించింది అమెరికా స్టార్టప్‌ కంపెనీ న్యూరాలింక్‌. మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్‌ చిప్‌ను అమర్చి చరిత్ర సృష్టించింది.

అంతేకాదు.. ఈ చిప్‌ ద్వారా మెదడుకు, కంప్యూటర్‌కు నేరుగా అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది కూడా. ఈ మేరకు న్యూరాలింక్‌ వ్యవస్థాపకుడు, ఎక్స్‌ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మంగళవారం వెల్లడించారు. ‘మనిషి మెదడులో చిప్‌ ప్రవేశపెట్టాం. దీని ద్వారా న్యూరాన్ల కదలికలను గుర్తించాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు. చిప్‌ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్టు, తొలి ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్‌ స్పైక్‌ డిటెక్షన్‌’ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ చిప్‌నకు ‘ఎన్‌1(లింక్‌)’గా నామకరణం చేశారు.

ఏమిటీ ఎన్‌1?
మనిషి మెదడు, వెన్నెముక సంబంధ సమస్యలపై అధ్యయనం చేయడం, పక్షవాతం వచ్చిన మనిషి కంప్యూటర్‌ సాయంతో అవసరమైన పనులు నిర్వర్తించడం కోసం తీసుకొచ్చిందే చిప్‌ ‘ఎన్‌1’. ఈ చర్యలను ‘ప్రిసైజ్‌ రోబోటికల్లీ ఇంప్లాంటెడ్‌ బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (ప్రైమ్‌)’గా పిలుస్తున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..
మెదడులో అమర్చే ఎన్‌1 చిప్‌ 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. వెంట్రుకలో 20వ వంతు మందం ఉండే సన్నటి దారాల్లాంటి ఎలక్ట్రోడ్లు ఈ చిప్‌లో ఉంటాయి. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి మెదడుకు ఈ సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే 3 వేలకు పైగా సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఉంటూ అటూఇటూ వంగేలా ఉంటాయి.

ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇలా మెదడు కదలికల సిగ్నల్స్‌ను రికార్డు చేసిన ఈ చిప్‌.. వైర్‌లెస్‌గా ఓ యాప్‌నకు ఆ వివరాలను చేరవేస్తుంది. మెదడు ద్వారా ఆలోచిస్తూ కంప్యూటర్‌ మౌస్‌ కర్సర్‌ను కదలించేలా, కీబోర్డు అక్షరాలను ఎంటర్‌ చేసేలా ప్రాథమికంగా పరిశోధనలు చేయనున్నారు.

 

నాలుగు నెలల్లోనే..
కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌ -కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ ప్రయోగాలకు అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఐ) గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్‌ అభివృద్ధి చేసిన ఈ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు న్యూరాలింక్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ చిప్‌ సాయంతో ఒక కోతి వీడియో గేమ్‌ను కూడా ఆడినట్టు వెల్లడించారు. అయితే, మనుషుల మెదడుకు ఈ చిప్‌ను అమర్చి, ట్రయల్స్‌ నిర్వహించేందుకు న్యూరాలింక్‌కు గత సెప్టెంబర్‌లోనే అనుమతులు వచ్చాయి. దీంతో నాలుగు నెలల రికార్డు సమయంలోనే ఈ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఉపయోగాలేంటి?
నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను ఏఐ (కృత్రిమ మేధ) ఆధారంగా ఈ చిప్‌ సాయంతో మెరుగుపరిచే అవకాశమున్నది. ఈ చిప్‌ సాయంతో పక్షవాతం వచ్చినవాళ్లు కూడా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను సులభంగా ఉపయోగించగలుగుతారు.

మెదడు ఆదేశాల మేరకు శరీరంలోని అవయవాల పనితీరు ఆధారపడి ఉండటంతో.. మెదడు ఆదేశాలు అందక చచ్చుబడిపోయిన అవయవాలను కూడా ఈ చిప్‌ సాయంతో సిగ్నల్స్‌ పంపి తిరిగి పనిచేయించవచ్చు.
డిమెన్షియా, పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌ వంటి మానసిక సమస్యల చికిత్స కోసం ఈ చిప్‌ను వాడొచ్చని నిపుణులు
చెబుతున్నారు.
అవసరమైన ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను మెదడులోని చిప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని.. కంటిచూపు, వినికిడి వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని పేర్కొంటున్నారు.
ఈ చిప్‌ సాయంతో హార్మోన్‌ స్థాయిని నియంత్రించొచ్చని, కుంగుబాటును దూరం చేసుకోవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు.
స్మార్ట్‌ఫోన్స్‌, కంప్యూటర్స్‌ను తాకకుండానే చిప్‌ సాయంతో ఆపరేట్‌ చేసే అవకాశమున్నది.

Atibala Plant : ఈ అతిబల మొక్క ఉపయోగం తెలిస్తే.. మగవారు అస్సలు వదలరు.!

Atibala Plant : ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను సరైన పద్ధతిలో వినియోగించడం వల్ల శరీరానికి వచ్చే ఎన్నో రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్ పెట్టడానికి ఈ మొక్క అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ మెక్క ఏంటి.?దాన్ని వాడుకునే సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఈ మొక్క వేడి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఆకులు చూడడానికి గుండ్రంగా ఉంటాయి. అలాగే ఈ మొక్క ఎత్తుగా పెరుగుతుంది. సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎప్పటినుంచో కూడా ఈ యొక్క అతిబల మొక్కను వినియోగిస్తూ వస్తున్నారు. ఈ మొక్క వేర్లు, ఆకులు, పువ్వులు, విత్తనాలు, కాండం వంటి అన్ని భాగాలు కూడా ఆయుర్వేదంలో ఎప్పటినుంచో కూడా వినియోగిస్తూ వస్తున్నారు.దీనిని ముద్రగడ, దువ్వెన బెండ, అని కూడా అంటూ ఉంటారు అయితే మొక్కతో మగవారిలో ఉండే శిక్రాట్ సమస్యను తొలగించుకోవచ్చు.

అతిబల చెట్టు, పువ్వులు చూడడానికి గుండ్రంగా టైర్ లాగా ఉంటాయి.. ఒక అప్పటి రోజుల్లో వీటితో ఆడుకునేవారు పువ్వులు చూడడానికి దువ్వెన ఆఖరంలో ఉంటే కాబట్టి తలకు కూడా దువ్వుకుంటూ ఉండేవారు. అయితే ఈ చెట్టు బంగారమని చెప్పుకోవచ్చు. ఈ చెట్టు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయమైపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ చెట్టు ఒకటి ఉంటే చాలు జీవితాంతం ఎటువంటి వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చని ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు మరే చెట్టులో లేవని ఆయుర్వేద నేతలను అంటున్నారు.సీజనల్ గా వచ్చి ఎన్నో సమస్యలు తగ్గించుకోవడానికి ఈ మొక్కని ఎలా వాడుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం… ముందుగా అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పుకున్న సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. దానికి వేడి చేసినప్పుడు అంటే కొంతమందికి విపరీతంగా వేడి చేస్తూ ఉంటుంది.

అటువంటి వారికి కూడా అతిబల చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. మగవారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా బాగా సాయపడుతుంది. మగవారిలో ఎవరైతే సీగ్రస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటివారు 100 గ్రాముల ఈ యొక్క అతిబల ఆకులు పొడి అలాగే 100 గ్రాముల పట్టిక 100 గ్రాముల శతావరి పొడి తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ ని పాలతో కలిపి రాత్రి పూట తీసుకోవడం వల్ల మగవారిలో సీగ్రస్కరణ సమస్య తగ్గుతుంది. అలాగే మూత్రంలో మంట వచ్చిన రాళ్లు ఏర్పడిన ఈ ఆకుల వల్ల సమస్యలు తొలగిపోతాయి. జ్వరం తగ్గుతుంది. దంతాల సమస్యలు ఉన్నవారు ఈ ఆకులు రసాన్ని నోట్లో వేసుకుని నమిలితే దంతాల సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రెగ్యులేట్ చేసుకోవడానికి కూడా అతిబల కషాయం బాగా సాయపడుతుంది.

Pills with Water : ట్యాబ్లెట్స్ వేసుకునేప్పుడు ఎంత నీటిని తాగుతున్నారు?

అనారోగ్యంతో ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్ వేసుకుంటూ ఉంటాం. ఇలా మందులు వేసుకునే సమయంలో మనం అంతా తెలీకుండా చేస్తున్న తప్పుల్లో ముఖ్యంగా మందులు వేసుకునే సమయంలో ఎంత నీటిని తీసుకోవాలి అనేది తెలియక మింగేస్తూ ఉంటారు.
కొందరు ముందుగా ట్యాబ్లెట్ మింగేసి, తర్వాత నీరు తాగుతారు. కొందరైతే నీరు ముందుగా గొంతులో వేసుకుని తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అసలు ట్యాబ్లెట్స్ వేసుకునే టైంలో ఎంత వరకూ వాటర్ తీసుకోవాలి అనే విషయం ఎవరికీ కచ్చితంగా తెలీదు. నీరు ఎందుకు తాగాలి, ఎంతవరకూ తాగాలనే విషయాన్ని తెలుసుకుందాం.

అయితే ట్యాబ్లెట్స్ వేసుకున్న సమయంలో ఖచ్చితంగా నీరు తీసుకోవాలి..

టాబ్లెట్ వేసుకున్నాక ఒక పూర్తి గ్లాసు నీటిని తాగడం వల్ల పూర్తిగా కరిగి ఫలితాన్ని ఇస్తుంది. నీటిని తక్కువ తాగితే టాబ్లెట్ కరగదు. పైగా పేగులకు అంటుకుని ఉండే అవకాశం కూడా ఉంది. టాబ్లెట్స్ ఎన్ని ఉన్నా సరే ఒక గ్లాస్ నీటిని మాత్రమే తాగితే సరిపోతుంది. గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని తీసుకోవడం వల్ల త్వరగా కరుగుతాయి.
ఇలా చల్లని నీరు శరీరంలోకి వెళ్లిన తర్వాత వేడిగా మారటానికి శరీరం నుండి ఎక్కువ శక్తి ఉపయోగించవలసి ఉంటుంది. చల్లని నీటిలో టాబ్లెట్ తొందరగా జీర్ణం కాక సరైన ఫలితం ఇవ్వదు. అందుకే గోరువెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకోవడం మంచిది.
ట్యాబ్లెట్స్ వేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో రూల్ ఫాలో అవుతారు. కొంతమంది కొద్దిగా మాత్రమే నీరు తాగితే మరి కొంత మంది నీటితోనే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. మరికొంతమంది అసలు నీళ్ళు తాగరు. కానీ, ట్యాబ్లెట్ నీటితో శరీరంలోకి వచ్చినప్పుడే అవి త్వరగా కరిగి బాడీలో పని చేస్తుంది. బెనిఫిట్స్ ఉంటాయి. తాగాలి కాబట్టి, ఎక్కువగా నీరు తాగొద్దు. కొన్ని ఎక్కువ డోసేజ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి.

వీటిని తీసుకునే టైమ్‌లో నీరు ఎక్కువగా అంటే గ్లాసు నీరు తాగాలి. కొంతమంది అసలే నీరు తాగరు. కానీ, దీని వల్ల పొట్టలో అసిడిటీ, అల్సర్స్ వంటి సమస్యలొస్తాయి. హెల్త్ కండీషన్ బట్టి, మాత్రల రకాన్ని బట్టి నీటిని తీసుకోవాలి.

ThippaTheega : ప్రతిరోజు ఒక గ్లాసు తిప్పతీగ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఈ మధ్యకాలంలో తిప్పతీగ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ తిప్పతీగ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిసి చాలామంది ఈ ఆకును ఎక్కువగా ఉపయోగించడంతోపాటు కొంతమంది ఏకంగా చెట్లను ఇంట్లోనే పెంచుకుంటున్నారు.
చాలామంది ఈ తిప్పతీగ ఆకులు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు. తిప్పతీగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనం అందరికీ తెలిసిందే. ఈ తిప్పతీగ జ్యూస్ ని తాగడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ప్రతిరోజు ఒక గ్లాసు తిప్పతీగ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్ లో తిప్ప తీగ.. పౌడర్, జ్యూస్ రూపంలో లభిస్తోంది. వివిధ కంపెనీలు వీటిని తయారు చేసి అమ్ముతున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తిప్పతీగ జ్యూస్ ని తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువగా తాగడానికి ఇష్టపడని వారు రెండు నుంచి మూడు టీ స్పూన్లు జ్యూస్ తాగితే సరిపోతుంది. ఈ తిప్పతీగ జ్యూస్ తాగిన తర్వాత అర్ధగంట సేపు పానీయాలు ఏవి తీసుకోకూడదు. ఇలా చేస్తే మందు బాగా పని చేస్తుంది. తిప్ప తీగ జ్యూస్ ని తాగటం వల్ల జ్వరం తగిలినా తగ్గిపోతుంది. షుగర్ రెండో దశలో ఉన్న పేషెంట్లు తిప్ప తీగ జ్యూస్ తీసుకుంటే చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువ కాకుండా నార్మల్ గా ఉంటాయి. అంటు వ్యాధులు కూడా మనల్ని అంటుకోకుండా దూరంగా ఉండిపోతాయి. బాడీలో ఇమ్యునిటీ పవర్ పెరగటం వల్ల ఇతర రోగాలు మన దరి చేరవు. ఒకవేళ చేరినా త్వరగా నయమైపోతాయి.

తిప్ప తీగ జ్యూస్ ని తాగినవాళ్లకు తిండి అరగకపోవటం అనేదే ఉండదు. విరేచనం సాఫీగా జరుగుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. కాబట్టి గ్యాస్ ప్రాబ్లం వంటివి రావు. మానసికపరమైన సమస్యలూ తొలగుతాయి. ఒత్తిడి, ఆందోళన ఇబ్బంది పెట్టవు. కంటి చూపు మందగించదు. ఒక్క మాటలో చెప్పాలంటే తిప్ప తీగ జ్యూస్ ని సర్వ రోగ నివారిణిగా చెప్పవచ్చు. తిన్న ప్రతి ఆహార పదార్థమూ చక్కగా అరుగుతుందంటే ఒంట్లో ఎనర్జీకి ఢోకా ఉండదు. తిప్ప తీగను డబ్బులిచ్చి కొనాల్సిన పని లేదు. సహజంగానే దొరుకుతుంది. పల్లెటూళ్లల్లో అయితే చేలల్లో, పొలాల్లో, సిటీలో అయితే పార్కుల్లో, గార్డెన్లలో ఉంటుంది. కాకపోతే దాన్ని గుర్తుపట్టగలిగితే చాలు. తిప్ప తీగ జ్యూస్, పౌడర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల తిప్ప తీగను ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం అని చెప్పవచ్చు.

టీచర్లను గదిలో పెట్టి తాళం వేసి ఆందోళన చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులు

*టీచర్లను గదిలో పెట్టి తాళం*

» రెగ్యులర్ టీచర్లను నియమించాలని తల్లిదండ్రుల డిమాండ్

నూతిపాడు (విస్సన్నపేట), జనవరి 30: పాఠశాలకు రెగ్యులర్ టీచర్లను నియ మించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యుటేషన్పై వచ్చిన ఇద్దరు టీచర్లను తరగతి గదిలో బంధించి.. పాఠశాల ఎదుట రోడ్డుపై కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు వెంటనే రెగ్యులర్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి శివారు నూతిపాడు ఎంపీయూపీ పాఠశాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కాగా, టీచర్లను తరగతి గదిలో బంధించిన విషయం తెలుసుకున్న తిరువూరు పోలీసులు వచ్చి విద్యార్థుల తల్లి దండ్రులతో చర్చించారు. సమస్యను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్క రిస్తామని ఎంఈవో-2 హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో సుందర జలపాతం – ఉబ్బలమడుగు జలపాతం /సిద్ధేశ్వర కోన జలపాతం /తడ జలపాతం

ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో సుందర జలపాతం – ఉబ్బలమడుగు జలపాతం /సిద్ధేశ్వర కోన జలపాతం /తడ జలపాతం

ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు , తెలంగాణ లో ఆదిలాబాద్ జిల్లాలు జలపాతాలకు పెట్టింది పేరు. అలాంటి చిత్తూరు జిల్లాలో బుచ్చినాయుని కండ్రిగ, వరదయ్య పాలెం మండలాల సరిహాద్దు ప్రాంతంలో ఉబ్బలమడుగు జలపాతం కలదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్ధులకొన అని పిలువబడే అడవిలో ఈ సుందర జలపాతం కలదు. తిరుపతి నుండి ఈ జలపాతం 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జలపాతాన్నే తడ జలపాతం అని కూడా పిలుస్తారు. వరదయ్యపాలెం నుండి ఉబ్బలమడుగు కు రోడ్డు సౌకర్యం కలదు. అందుకే పర్యాటకులు కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.

తిరుపతి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉబ్బలమడుగు. వాహనాల్లో వెళితే 75 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిందే. అతి భయంకరమైన డీప్‌ ఫారెస్ట్ ఇది. ఎంతో అందంగా చల్లటి వాతావరణం ఉంటుంది. ఎంత దూరం నడిచినా అలసట రాకుండా ఎంతో చల్లగా ఉంటుంది ఉబ్బలమడుగు. రోడ్డు మొత్తం మట్టితో ఉన్నా అక్కడక్కడ చిన్న చిన్న కొలనులు కనిపిస్తుంటుంది. దీంతో అక్కడక్కడ పర్యాటకులు కొలనుతో దిగి ఎంజాయ్‌ చేస్తున్నారు. నీళ్ల మీద కట్టిన బ్రిడ్జి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరోవైపు చెక్‌ డ్యాంలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. యువత కేరింతలు కొడుతూ ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఈ ప్రాంతంలో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఉబ్బలమడుగు ఎంట్రన్స్ నుంచి జలపాతాల వద్దకు వెళ్ళాలంటే 10 కిలోమీటర్లకుపైగా నడిచి వెళ్ళాల్సిందే. 10 కిలోమీటర్లు నడిచినా అలసట ఉండదంటే ఇక్కడ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. ఎంత వేడి ఉన్నా ఈ ప్రాంతంలో మాత్రం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. అది ఇక్కడి ప్రత్యేకత.

ఇక జలపాతాల వద్దకు వెళితే మనల్ని.. మనం మరిచిపోవాల్సిందే. అంత చల్లటి ఆహ్లాదకర వాతావరణం. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఉబ్బలమడుగుకి చేరుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు ఉబ్బలమడుగులో వందేళ్ళ చరిత్ర కలిగిన సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఇది ఎంతో పురాతనమైనది. ఇక్కడి శివలింగం స్వయంభుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. దీంతో భక్తులు ముందుగా సిద్ధేశ్వరాలయానికి చేరుకుని పూజలు నిర్వహించిన తర్వాతనే జలపాతాల వద్దకు పయనమవుతున్నారు.
ఎండ వేడిమిగా ఎక్కువగా ఉండడంతో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన తలకోన, ఉబ్బలమడుగు, సదాశివకోన, కైలానకోనలు పర్యాటకులతో సందడిగా మారాయి. ఆదివారాలైతే మరింత మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నారు.

వంద అడుగుల లోతు ఉన్నప్పటికీ.. కేవలం పది అడుగుల లోతే ఉంటుందని భ్రమ కల్పించే స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. సిద్ధేశ్వర స్వామి పాదాలను తాకుతూ.. పరవళ్లు తొక్కుతూ.. కిందికి దూకుతుంటుంది సిద్ధేశ్వర కోన జలపాతం. సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, యాత్రికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ.. రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాళెం మండలాల సరిహద్దుల్లో ఉబ్బలమడుగు జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. తొట్టంబేడు మండలం బోనుపల్లి నుంచి సత్యవేడు దాకా సాగిపోతున్న కొండకోనల మధ్య పచ్చని ప్రకృతి ప్రాంతమే ఇది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఈ అందమైన ప్రాంతంలోనే సిద్ధేశ్వర కోన ఉంది. ఇక్కడ శివయ్య సిద్ధులయ్యగా పూజలందుకుంటూ సిద్ధేశ్వరుడిగా పిలువబడుతున్నాడు.
మహా శివరాత్రి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు సిద్ధేశ్వర కోనకు తరలివచ్చి.. సిద్ధులయ్యను దర్శించుకుని ఆ కీకారణ్యంలోనే నిద్రిస్తుంటారు. దీనికి ఎగువన, దిగువన జలపాతాల హోరు నిరంతరాయంగా వినిపిస్తుంటుంది. ఈ జలపాతాల నీరు ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంటుంది. ఇవి దూకే చోటు నుంచి కాస్త దిగువన నీటి కాలువలు ఉంటాయి. వీటినే ఉబ్బలమడుగులు అని స్థానికులు పిలుస్తుంటారు.
ప్రమాదాలకూ నిలయం..!
ఈ సుందర జలపాతాల హోరుతో పులకింపజేసే ఈ ప్రాంతం కొంతమందికి సౌందర్య దేవత అయితే, మరికొందరికి మృత్యుదేవతగా మారుతోంది. ఇక్కడి స్వచ్ఛమైన నీటి ప్రవాహం మృత్యుద్వారాలను తెరిచి.. ఎందరో యువకుల పాలిట యమపాశంలా మారుతోంది. ఉబ్బల మడుగు సుందర ప్రదేశమే కాకుండా…

ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం లేనే లేదని చెప్పవచ్చు.
ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న సరస్సు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. కొండలమీదుగా ఈ జలపాతం వద్దకు వెళ్లలేని పర్యాటకులు ఈ సరస్సు వద్దే స్నానాలాచరించి.. ఇక్కడే సేదతీరుతుంటారు.

ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పర్యాటకులకు ఏమి కావాలన్నా.. వరదయ్యపాళెంలోనే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. శివరాత్రి పండుగ సందర్భంగా దాదాపు నాలుగు రోజులపాటు భక్తులు, పర్యాటకులు, స్థానికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దాంతో తాత్కాలికంగా కరెంటు సౌకర్యంతోపాటు వివిధ దుకాణాలు సైతం ఇక్కడ వెలుస్తుంటాయి.
ఇక శివరాత్రి పండుగకు రెండు రోజుల ముందుగానే సిద్ధేశ్వర కోన ప్రాంతానికి చుట్టుప్రక్కల నివసించే గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలివస్తుంటారు. మూడు రోజులపాటు అక్కడే వంటావార్పూ చేసుకుని సిద్ధులయ్యను తనివితీరా దర్శించి పూజలు జరపటం ఆ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. అయితే, సాధారణంగా పర్యాటకులు చీకటిపడే సమయానికి వరదయ్యపాళెం చేరుకుంటుంటారు.వరదయ్యపాళెం నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దాకా తారు రోడ్డు, ఆపై మరో నాలుగు కిలోమీటర్లు మేరకు మట్టిరోడ్డు సౌకర్యం ఉంది. దాదాపు అన్ని రకాల వాహనాలు ఈ మార్గం గుండా కొండల పీఠభాగాన ఉండే సరస్సు వరకు సులభంగా వెళుతుంటాయి. అయితే ఉబ్బలమడుగు జలపాతాన్ని చూడాలంటే మాత్రం కాలినడకన పైకి వెళ్లక తప్పదు. వారాంతాల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా తరలివస్తుంటారు. అయితే ఎవరయినా సరే ఇక్కడికి వెళ్లాలంటే బృందాలుగా వెళ్లటం శ్రేయస్కరం.

Watch this video

Undavalli Caves story- ఉండవల్లి గుహలు-ఉలితో చెక్కిన సౌందర్యాలు.. ఉండవల్లి గుహాలయాలు..!

ఉండవల్లి గుహలు—ఉలితో చెక్కిన సౌందర్యాలు.. ఉండవల్లి గుహాలయాలు..!

ఉండవల్లి గుహలు
ఉండవల్లి గుహలు (ముందు వైపు)

ఉండవల్లి’ అంటే తెలుగువారందరికీ వెంటనే గుర్తొచ్చేవి అక్కడున్న గుహాలయాలు. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లి నాలుగు అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏక శిలా ‘అనంత పద్మనాభ స్వామి’ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. దేవతా మూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి.

ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు. ఇవి గుప్తుల కాలంనాటి ప్రథమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి.

పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి.

గుహ బయటివైపు
గుహ బయటివైపు

బౌద్ధులకు నిలయం..
ఈ గుహలు.. మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

 

ఉండవల్లి గుహలు లోపలిభాగం
ఉండవల్లి గుహలు లోపలిభాగం

ఏయే అంతస్తుల్లో ఏమున్నాయి..?
ఈ నాలుగు అంతస్తుల గుహల్లో.. మొదటి అంతస్తులో రుషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. రెండో అంతస్తులో శయనించి ఉన్న ‘అనంత పద్మనాభస్వామి’ విగ్రహం ఉంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది. ఇందలో ఎలాంటి విగ్రహాలు లేవు.
గుహల నుంచి రహస్య మార్గాలు..
గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి ఉంది.

అనంత పద్మనాభ స్వామి ప్రతిమ
అనంత పద్మనాభ స్వామి ప్రతిమ

ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయము కలదు. ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు.

ఎలా చేరుకోవాలి..?
ఉండవల్లి గుహాలయాలకు గుంటూరు, విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరి.. అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవల్లి కూడలికి చేరుకుని.. ఎడమ పక్కకు తిరిగి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు దర్శనమిస్తాయి. విజయవాడ నుంచి వచ్చేవారు.. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి కూడలి చేరుకుని కుడి వైపునకు మూడు కిలో మీటర్లులోనికి వెళితే ఉండవల్లి గుహలకు చేరుకోవచ్చు.

తెలుగులో శాశనం
తెలుగులో శాశనం

సందర్శన వేళలు..
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం.

Video …

ఒకే ఒక్క ప్రోటీన్ 75 % శాతం క్యాన్సర్ల వ్యాప్తికి కారణం.. ఆపగలిగే మార్గమిదే

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురిని వేధిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. దాని తీవ్రతను బట్టి, శరీరంలో వ్యాపించిన భాగాన్ని బట్టి ప్రాణహాని కలిగిస్తుంది.
అయితే శరీరంలోని కణాల్లో సహజంగానే ఉండే MYC (Master Regulator of Cell Cycle Entry and Proliferative Metabolism) అనే ఒకే ఒక్క ప్రోటీన్ లేదా కణం ఇందులో కీలకపాత్ర పోషిస్తోందని, 75 శాతం క్యాన్సర్ల వ్యాప్తికి కారణం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు గుర్తించారు.

కంట్రోల్ తప్పుతున్న కణం

నిజానికి MYC ప్రోటీన్ శరీరంలోని ఒక హెల్తీ యాక్టివేటెడ్ సెల్. ఆరోగ్యంగా ఉండటంలో దోహదం చేస్తుంది. కానీ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు మాత్రం అది దాని పనితీరు నుంచి విరమించుకుంటుంది. ఈ పరిస్థితి క్యాన్సర్ మరింత వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇలా జరగకుండా ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు.
పెప్టైడ్ సమ్మేళనం

”ఎంవైసీ(MYC) పనితీరు మందగించడంతో క్యాన్సర్ డెవలప్ అవుతుంది కానీ, దానిని నియంత్రించడం కూడా పెద్ద సమస్యగానే ఉంటోంది. ఎందుకంటే ఇది ఒక ఆకారం లేని ప్రోటీన్. నిరోధించడానికి టార్గెట్ చేసుకోగల స్ట్రక్చర్‌ని కలిగి ఉండదు. అందుకే దానిని సమర్థవంతంగా గుర్తించడం, మెడికేషన్స్ ద్వారా సాధారణంగా ప్రవర్తించేలా చేయడం కష్టం” అంటున్నారు రీసెర్చర్స్. ప్రస్తుతం దానిని గుర్తించి, సమర్థ వంతంగా పనిచేసేలా చేయడానికి పెప్టైడ్ అనే ఒక కొత్త సమ్మేళనాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఎంవైసీ ప్రోటీన్‌తో ఇంటరాక్ట్ అయి దానిని తిరిగి నియంత్రణలోకి తీసుకురావడంలో సహాయపడుతుంది. దీనివల్ల క్యాన్సర్ల వ్యాప్తిని అడ్డుకోవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. త్వరలో దీనిని ఎలా అప్లయ్ చేయాలనేదానిపై క్లారిటీ రానుందని చెప్తున్నారు.

AP Cabinet Meeting: నేడు 11 గంటలకు ఏపీ మంత్రివర్గ భేటీ .. తీసుకోబోయే నిర్ణయాలు ఇవేనా..?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. రైతులకు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులకు కూడా తీపి కబురు వినిపించేలా ఉంది.

కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ జరిగే ఆస్కారం ఉందని తాడేపల్లి నుంచి వస్తున్న వార్త.

ఇక తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయానికి కారణంగా నిలిచిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా సీఎం జగన్‌ మదిలో ఉన్నట్టు చర్చ నడుస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు. జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యచరణ ప్రణాళికపై సహచర మంత్రులతో సీఎం చర్చిస్తారని వినిపిస్తున్న మాట.

ఇక బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయం కూడా కావడంతో వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుండడంతో సీఎం జగన్‌ భారీ నిర్ణయాలే తీసుకునే అవకాశం ఉంది.

Bald Head: మెంతి గింజలతో మీ బట్టతల మాయం..!

Bald Head: మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మెంతికూర గురించి మాట్లాడుకుంటే.. ఇది ఆహారం రుచిని పెంచడం నుండి జుట్టు రాలడం సమస్యను నయం చేయడం వరకు ఉపయోగించబడుతుంది.
చాలా మంది మెంతి గింజలను హెయిర్ మాస్క్‌గా ఉపయోగిస్తారు. ఇదిలా ఉంటే.. కొంతమంది మొలకెత్తిన మెంతులు తినడానికి ఇష్టపడతారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రిస్తుంది. అయితే మెంతి గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బట్ట తల (Bald Head) కూడా నయం అవుతుందని మీకు తెలుసా? అవును, మొలకెత్తిన మెంతి గింజలు మీ రాలుతున్న జుట్టును తిరిగి పెంచడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా వినియోగించాలో, దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

మెంతి గింజలు జుట్టుకు ఎలా ఉపయోగపడతాయి?

జుట్టు రాలడం, చనిపోయిన జుట్టు సమస్య నుండి బయటపడటానికి మెంతి గింజలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా మొలకెత్తిన విత్తనాలు ఇందులో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిజానికి, మెంతి గింజల్లో విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయి, ఇవి మీ తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని కారణంగా, రంధ్రాలకు తగినంత పోషణ లభిస్తుంది.
మీరు జుట్టు రాలడం తగ్గాలంటే మొలకెత్తిన మెంతి గింజలను క్రమం తప్పకుండా తినండి. ఇది జుట్టుకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు తెల్లటి, నిర్జీవమైన జుట్టు సమస్యను దూరం చేస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

మొలకెత్తిన మెంతులు ఎలా తినాలి?

మొలకెత్తిన మెంతికూర తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముందుగా 1 నుండి 2 చెంచాల మెంతి గింజలను తీసుకోండి. తరువాత, వాటిని నీటిలో నానబెట్టి, రాత్రంతా వదిలివేయండి. ఉదయాన్నే కాటన్ క్లాత్‌తో గట్టిగా కట్టి సుమారు 2 నుంచి 3 రోజుల పాటు అలాగే ఉంచాలి. దీనివల్ల మెంతి గింజలు మొలకెత్తుతాయి. ఇలా చేసిన మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల మీ శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మీరు దీన్ని పచ్చిగా నమలండి, క్రమం తప్పకుండా తినండి. ఇది మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, బట్టతల సమస్య నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. మీకు కావాలంటే, మీరు మొలకెత్తిన మెంతి గింజలను పేస్ట్‌గా చేసుకోవచ్చు లేదా వాటిని ఇతర మొలకెత్తిన గింజలతో కలిపి తినవచ్చు. ఇది దాని ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది.

Bats : గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడతాయి..? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!

Bats : గబ్బిలాలు ఒక ప్రత్యేకమైన జీవి. ఇది క్షీరద జాతికి చెందినది. ఈ జాతిలో ఎగరగలిగే ఏకైక జీవి గబ్బిలం. చాలా మందికి గబ్బిలాల వల్ల వైరస్‌లు వ్యాప్తి చెందుతాయని మాత్రమే తెలుసు.
కానీ గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసా..? గబ్బిలాలను ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన జీవిగా ఎందుకు చెబుతారు..? గబ్బిలాల గురించి ఎప్పుడూ వినని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గబ్బిలాలు మిగిలిన పక్షుల్లా నడవలేవు, నిలబడలేవు. వీటికి ఎగరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గబ్బిలాలు ఎక్కడైనా నిలవాలంటే వాటి రెక్కలకి ఉన్న గోళ్లతో చెట్టుకొమ్మనో లేదా గోడ పగులునో పట్టుకుని తలకిందులుగా వేలాడుతాయి. ఇవి వేటకు వెళ్లేప్పుడు వాటి పిల్లలను పొట్టకి కరుచుకొని ఎగురుతాయి.

గబ్బిలాలకు ఇతర పక్షులకు చాలా తేడా ఉంటుంది. గబ్బిలాలు భూమిపై నుంచి పరుగెత్తలేవు. అలానే ఎగురలేవు.. ఎందుకంటే వాటి రెక్కలు తగినంత లిఫ్ట్‌ను ఇవ్వవు. వాటి వెనుక కాళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. గబ్బిలాలకు ఈకలు ఉండవు. వీటి వేళ్ల మధ్యన గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు ఉంటాయి. గబ్బిలం వేళ్లలో బొటనవేలు తప్ప మిగిలిన వేళ్లు గొడుడు ఊచల్లా పనిచేస్తాయి. ఈ బొటన వేలు పైకి పొడుచుకు వచ్చిట్లుగా ఉంటుంది. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడేందుకు ఈ వేలు సహకరిస్తుంది. తలక్రిందులుగా వేలాడడం ద్వారా గబ్బిలాలు చాలా సులభంగా ఎగురుతాయి.

అయితే గబ్బిలాలు ఎప్పుడు కూడా తలకిందులుగా నిద్రపోతుంటాయి. అందువల్ల గబ్బిలాలకు ఉండే కండరాలు ప్రత్యేక నిర్మాణంలో ఉంటాయి. గబ్బిలాల వెనుక పాదాలుకండరాలుకు ఎదురుగా పనిచేస్తాయి. గబ్బిలాలు వేలాడుతున్నప్పుడు ఎటువంటి శక్తిని ప్రయోగించవు. వేలాడుతున్నప్పుడు అవి చాలా విశ్రాంతిగా ఉంటాయి.

మీరు గమనించినట్లయితే మనిషి తలక్రిందులుగా వేలాడినప్పుడు తలకు రక్తప్రసరణ ఆగిపోతుంది. కానీ గబ్బిలాల విషయంలో అలా జరగదు. వేలాడుతున్న వాటికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి. అందువలనే వాటికి గురుత్వాకర్షణ, రక్తప్రసరణలో పెద్ద సమస్య ఉండదు. దీని కారణంగా గబ్బిలాలు తలకిందులుగా ఉండగులుగుతాయి. గబ్బిల చనిపోయిన తర్వాత కూడా తలకిందులుగానే ఉంటాయి.

గబ్బిలాలు డైనోసార్ల యుగం కంటే ముందు నుంచే ఉన్నాయి. ఇవి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్న ఎడారులలో కూడా జీవిస్తాయి. గబ్బిలాల నిర్మాణం కూడా పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని గబ్బిలాల బొచ్చు అంగోరా లాగా ఉంటుంది. ఇండోనేషియాలో కనిపించే గబ్బిలం తన రెక్కలను 6 అడుగుల వరకు విస్తరించగలదు. థాయిలాండ్‌కు చెందిన బంబుల్బీ గబ్బిలాల అతి తక్కువ బరువు కలిగి ఉంటాయి. లాటిన్ అమెరికాలో కనిపించే 70 శాతం గబ్బిలాలు రక్తం మాత్రమే తాగుతాయి.

Andhra Pradesh Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయన్నుట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశాం. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న ఓల్డ్ జీజీహెచ్ , హనుమాన్ పేట , విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ ఇన్‌ రిక్రూట్మెంట్ జరగనుందని ఆయన తెలిపారు.
అలాగే.. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుండి 15వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎం.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదంటే.. https://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లను పరిశీలించాలని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

Central Govt Jobs- Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు

Central Govt Jobs: భవిష్యత్‌కు బెంగ లేదు.. మంచి వేతనం.. సులువైన పని ఉన్న ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే మీకోసమే సహాయ లోకో పైలెట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఎదురుచూస్తోంది.
ఈ ఉద్యోగం కోసం పెద్దగా చదువుకోనవసరం కూడా లేదు. కేవలం పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా చదివి ఉంటే చాలు. రైల్వే శాఖ నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్‌లలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టు భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

సహాయ లోకో పైలెట్‌ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఆర్‌ఆర్‌బీ అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో ఏఎల్‌పీ నోటిఫికేషన్‌ 2024 అని పరిశీలిస్తే వివరాలన్నీ తెలుస్తాయి. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమవగా ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సమయం ఉంది చేసుకుందాం లే అని అనుకుంటే గడువు సమయం ముగిసిపోతుంది. ఈ దరఖాస్తుల గడువును మళ్లీ పొడిగించరు. ఇది గ్రహించి వీలైనంత త్వరలో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి.

ఉద్యోగ వివరాలు

పోస్టు పేరు: సహాయ లోకో పైలెట్‌
ఖాళీలు: 5,696
జీతం: రూ.19,000 నుంచి రూ.63,200 వరకు
దరఖాస్తు గడువు: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ (రాత్రి 11.59 గంటల వరకు)
వయసు: 18 నుంచి 30 ఏళ్ల వారు అర్హులు (కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది)
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్‌ సర్వీమెన్‌, మహిళలకు రూ.250, మిగిలిన అభ్యర్థులకు రూ.500
ఖాళీల బోర్డులు: అహ్మదాబాద్‌, అజ్మీర్‌, అలహాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీగడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్‌, గౌహతి, జమ్మూశ్రీనగర్‌, కోల్‌కత్తా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్‌, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం

90 Vacancies in Supreme Court of India – సుప్రీం కోర్టులో 90 క్లర్క్‌ పోస్టులు, ఎవరెవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్
మొత్తం ఖాళీలు: 90

అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సెర్చ్‌/ అనలిటికల్‌ స్కిల్స్‌, రాత సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
పరీక్ష విధానం: పార్ట్‌-1, 2 రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు

వయస్సు: 15.02.2024 నాటికి 20-32 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000.

India-Pakistan: ఆ బైక్ కోసం పాకిస్తాన్ అధ్యక్షుడు సగం దేశాన్ని ఇవ్వాల్సి వచ్చింది.. భారత్-పాక్ ఆర్మీ మేజర్ల స్నేహం వెనుక ఆసక్తికర కథ..

పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా “సామ్ బహుదూర్“ ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన మాణిక్ షా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.
పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో (Indo-Pak War) భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా “సామ్ బహుదూర్“ ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన సామ్ మాణిక్ షా (Sam Manekshaw) ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. 1971 యుద్ధం (1971 War) సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా యహ్యా ఖాన్ (Yahya Khan)ఉన్నారు. భారత్, పాక్ విభజనకు ముందు మాణిక్ షా, యహ్యా ఖాన్ మంచి స్నేహితులు.

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అంటూ వేర్వేరుగా లేవు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మాత్రమే ఉండేది. ఆ సైన్యంలో మాణిక్ షా, యహ్యా ఖాన్ కలిసి పని చేశారు. వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ సమయంలో మాణిక్ షాకు ఎరుపు రంగు బైక్ (Bike) ఉండేది. అది యహ్యా ఖాన్‌కి బాగా నచ్చింది. ఆ బైక్‌ను వెయ్యి రూపాయలకు మాణిక్ షా నుంచి యహ్యా ఖాన్ కొన్నారు. అయితే ఆ వెయ్యి రూపాయలు చెల్లించకుండా యహ్యా ఖాన్ విభజన తర్వాత పాకిస్తాన్ (Pakistan) వెళ్లిపోయారు.

1971నాటికి యహ్యా ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడు అయిపోయారు. ఆ సమయానికి మాణిక్ షా భారత సైన్యానికి చీఫ్‌గా ఉన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్)ను పాకిస్తాన్ నుంచి వేరు చేయడానికి యుద్ధం జరిగింది. మాణిక్ షా నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ఓడించింది. యుద్ధం అనంతరం మాణిక్ షా మాట్లాడుతూ.. “నా బైక్ ధర కోసం 24 ఏళ్లు ఎదురు చూశాను. యహ్యా ఖాన్ ఆ వెయ్యి రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు సగం దేశాన్ని ఇచ్చాడు“ అని కామెంట్ చేశారు.

మీ డబ్బును ఖర్చు పెట్టడానికి ఈ ఏడు చిట్కాలు పాటిస్తే.. బోలెడు డబ్బు ఆదా..

మనీ మేనేజ్‌మెంట్ అనేది మీరు మీ డబ్బును బడ్జెట్, ఖర్చు చేయడం, ఆదా చేయడం మరియు పెట్టుబడి పెట్టడం వంటి అన్ని మార్గాలు వాడుకోవడం. మీ డబ్బును క్రెడిట్‌ గా ఎలా ఉపయోగించాలో, రుణాన్ని ఎలా చెల్లించాలో కూడా తెలుపుతుంది.
మొత్తంగా మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం అన్నమాట.

మీ డబ్బును వృధాగా కాకుండా.. ఉపయోగకరంగా ఎలా ఖర్చు చేయడానికి ఓ ఏడు చిట్కాలు మీకు ఉపయోగపడతాయి. అవేంటో చూడండి..

బడ్జెట్ వేసుకోండి..
మీకు వచ్చే ఆదాయం, మీ ఖర్చులు.. మీరనుకున్న పొదుపు ప్రణాళికలు.. వీటితో బడ్జెట్ తయారు చేసుకోండి. దీనికోసం… మీ నెలవారీ ఆదాయం.. మీ జీతం, బోనస్‌లు, పన్ను వాపసు లేదా ఇతర ఆదాయాలు రాసుకోండి. ఆ తరువాత మీ నెలవారీ ఖర్చులను రాయండి.

ఇందులో హౌసింగ్, ఆహారం, స్టూడెంట్, హౌజ్, పర్సనల్ లోన్స్.. ట్రావెలింగ్ లాంటి వి మొదటి స్థానంలో రాసుకోండి. ఆ తరువాత వినోదం, యుటిలిటీలు వస్తాయి. మీ ఆదాయం నుండి మీ ఖర్చులను తీసివేయండి. ఈ మొత్తం మీ బడ్జెట్‌కు ఓ రూపం ఇస్తాయి.
మీరు నెలవారీ ఖర్చుల్లో ఏవి అవసరం లేదో వాటిని తొలగించడం లేదా అవసరమైనవాటిని జోడించడం వంటి సర్దుబాట్లు చేయవచ్చు. ఇంకో ప్లాన్ ఏంటంటే.. అద్దె, బీమా, ఆహారం వంటి అవసరాలు మీ ఆదాయంలో 50% కేటాయించుకోవాలి. ఆ తరువాత మీ ఆదాయంలో 30% వినోదం వంటి మీరు కోరుకునే విషయాలకు వెళ్లవచ్చు. మిగతా 20% పొదుపు చేయాలి. ఇది చాలా సింపుల్ గా చేసుకునే లెక్క.

బడ్జెటింగ్ కి కొన్ని చిట్కాలు…

– మీ ఖర్చులను ట్రాక్ చేయడం వలన మీరు ఎక్కువ ఖర్చుపెట్టకుండా.. సహాయపడవచ్చు.
– రిటైర్మెండ్ కోసం ముందునుంచే జాగ్రత్తగా ఆలోచించండి. పదవీ విరమణ కోసం ఆదా చేయడానికి రిటైర్మెంట్ అకౌంట్లలో నెలవారీ కొంత పొదుపు చేయాలి.
– అత్యవసర పరిస్థితుల కోసం సేవ్ చేయడం. ఇంటిమరమ్మత్తులు, అనుకోని ఆర్థికి, ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనప్పుడు అత్యవసర నిధిలో మీ వద్ద డబ్బు ఉంటే టెన్షన్ ఉండదు.
పొదుపు చిట్కాలు..
డబ్బును పొదుపు చేయడానికి ఏదో ఒక సేవింగ్ అకౌంట్ ని కాకుండా.. దీనికోసం కూడా షాపింగ్ చేయండి. మంచి అకౌంట్.. ఎక్కువ రిటర్న్స్ ఉండే అకౌంట్ ను ఎంచుకోండి. మెరుగైన రేటు ఇచ్చే అకౌంట్ అయితే, అదనపు వడ్డీ కాలక్రమేణా జోడించబడుతుంది. కొన్ని బ్యాంకులు అధిక-దిగుబడి పొదుపు ఖాతాలను కూడా అందిస్తాయి.

మీకొచ్చే ఎక్స్ ట్రా ఇన్ కంను సేవింగ్స్ అకౌంట్ లో వేయండి. టాక్స్ రిటర్న్, బోనస్ లాంటివి వచ్చినప్పుడు దానిని మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేయవచ్చు.

ఆటోమేటిక్ పొదుపులను సెటప్ చేయండి. మీ యజమాని సహాయంతో, మీ జీతంలో సేవింగ్స్ ఖాతాకు ఆటోమేటిక్ బదిలీలను సెటప్ చేయించుకోవచ్చు. ఆ విధంగా, మీకు అవసరమైనప్పుడు డబ్బు మీకు అందుబాటులో ఉంటుంది.

అప్పులు తీర్చాలి..
అప్పులు అనవరమైన ఒత్తిడిని పెంచుతాయి. అందుకే వీలైనంత వరకు వాటిని తొందరగా చెల్లించాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీనికీ కొన్ని మార్గాలున్నాయి.

మొదటిది.. స్నోబాల్ పద్ధతి. అంటే మొదట మీ చిన్న బ్యాలెన్స్‌లను చెల్లించడంపై దృష్టి పెట్టాలి. మీరు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించిన తరువాత… చిన్న మొత్తాల్లో ఉన్న అప్పులను తీర్చేయాలి.

దీనివల్ల అధిక వడ్డీ రేట్లు ఉన్న అప్పులు చెల్లించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని అర్థం అవుతుంది. దీర్ఘకాలంలో మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. మీ అప్పులను వాటి వడ్డీ రేట్ల ఆధారంగా, అత్యధిక నుండి తక్కువ వరకు లిస్ట్ రాసుకుని దాని ప్రకారం చెల్లించుకుంటూ రావాలి.

ముందుగా అత్యధిక వడ్డీ రేటున్న లోన్ ను తీర్చండి. అది చెల్లించిన తర్వాత, ఆ అదనపు నిధులను మీ జాబితాలోని తదుపరి రుణాన్ని చెల్లించడానికి ఉపయోగించవచ్చు.

మంచి క్రెడిట్ అలవాట్లు
ఆర్థిక ఆరోగ్యంలో క్రెడిట్ ప్రధాన భాగం. మీ క్రెడిట్ స్కోర్‌లను మెరుగుపరచడంలో పని చేయడం వల్ల మీరు ఉజ్వలమైన ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకోవచ్చు.

కొన్ని మంచి క్రెడిట్ అలవాట్లు ఎలా ఉంటాయంటే..

మీ బిల్లులను సకాలంలో చెల్లించండి. ఆలస్య చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌లను ప్రభావితం చేస్తాయి. ఆలస్య రుసుము, పెనాల్టీ APRలను ప్రేరేపిస్తాయి.

క్రెడిట్ ఖాతాను మూసివేసే ముందు, అది మీ క్రెడిట్ స్కోర్‌లను ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించండి.
మీకు అవసరమైన క్రెడిట్ కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోండి. కొత్త లైన్ క్రెడిట్ కోసం దరఖాస్తు చేయడం వలన మీ స్కోర్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

క్రెడిట్‌ని పర్యవేక్షణ
మీ క్రెడిట్‌ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం క్రెడిట్ ఆరోగ్యంలో మరొక ముఖ్యమైన భాగం.

ఇవన్నీ గుర్తు పెట్టుకుని బడ్జెట్ తయారు చేసుకుంటే.. దేశ, రాష్ట్ర బడ్జెట్ లలో వచ్చే మార్పులు మిమ్మల్ని.. మీ కుటుంబ బడ్జెట్ ను అంతగా ప్రభావితం చేయలేవు.

Aishwarya Deepam: ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాల్సిందే?

చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల పూజలు పరిహారాలు దానధర్మాలు చేస్తూ ఉంటారు. కొందరికి అమ్మవారి అనుగ్రహం తొందరగా గలిగే మరికొందరికి ఎన్ని పూజలు చేసినా కూడా లక్ష్మి అనుగ్రహం అసలు కలగదు.
అలాంటప్పుడు ఐశ్వర్య దీపం వెలిగించాల్సిందే అంటున్నారు పండితులు. ఇంతకీ ఐశ్వర్య దీపం అంటే ఏమిటి? ఈ దీపాన్ని ఏ సమయంలో ఎలా వెలిగించాలి? ఏ రోజు వెలిగించాలి అన్న వివరాల్లోకి వెళితే.. ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం సూర్యోదయానికి ముందు అలాగే సూర్యాస్తమయానికి తర్వాత వెలిగించాలి. ఇలా చేసిన వారికి తప్పకుండా ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. సంపద పెరుగుతుంది.

వ్యాపారాలు గణనీయంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నవారు, అప్పులపాలై బాధలు పడుతున్న వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే వారికి ఆర్థిక ప్రగతి కలుగుతుంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక ఐశ్వర్యాన్ని అందించే ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి? అన్న విషయానికొస్తే.. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పెద్ద ప్రమిదలను తీసుకుని వాటికి పసుపు, కుంకుమ రాయాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి, ఆ ముగ్గులో ఒకదానిపై ఒకటిగా పెట్టి, ఒక పావు కిలో రాళ్ల ఉప్పు వేసి, ఆ రాళ్ళ ఉప్పుపైన పసుపు, కుంకుమ చల్లాలి. దానిపై ఒక చిన్న ప్రమిదను పెట్టి రెండు వత్తులు ఒకటిగా వేసి దీపం వెలిగించాలి. దీనినే ఐశ్వర్య దీపం అంటారు.

ఇక ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు, పళ్ళు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా పెట్టి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకోవాలి. కనకధార స్తోత్రాన్ని కూడా చదివితే మంచిది. శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి, ఆ ఉప్పును నీటిలో కలిపి ఎవరూ తొక్కని ప్రదేశంలో పారబోయాలి. పారే నీటిలో పోయడం ఇంకా చాలా మంచిది. ఈ విధంగా 11, 16, 21, 41 శుక్రవారాలు చేస్తే ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు. ఐశ్వర్య దీపంతో ఆర్ధిక సమస్యల నుండి కొంతమేర ఉపశమనం తప్పక లభిస్తుంది. కనుక ఊహించని ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్న వారు ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది.

బాడీగార్డ్ నుంచి ప్రపంచ స్థాయి బౌలర్ దాకా.. బ్యాట్స్‌మెన్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న షామర్ జోసెఫ్

వెస్టిండీస్ క్రికెట్ జట్టు.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన జట్టు. బుల్లెట్ల లాంటి బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్లను వణికించే బౌలర్లు, సెంచరీలు, డబుల్ సెంచరీలతో కదంతొక్కే బ్యాట్స్‌మెన్లు ఆ జట్టు సొంతం.

జట్టు ఏదైనా సరే సమష్టిగా రాణించి వరుస విజయాలతో ఉర్రూతలూగించిన జట్టు విండీస్. కానీ ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు సీనియర్ల రిటైర్మెంట్లతో ఆ జట్టు బలహీనంగా మారింది. బోర్డు సభ్యులు, ఆటగాళ్లకు మధ్య వివాదాలు తలెత్తడంతో ఆ దేశంలో క్రికెట్ పతనమైంది.

యువ ఆటగాళ్లతో కొత్త జోష్..

ప్రస్తుతం విండీస్ జట్టు కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతోంది. తగేనారాయణ్ చందర్‌పాల్, క్రిక్ మెకెంజీ, కావెమ్ హాడ్జ్, జస్టీన్ గ్రీవ్స్, జోషువా డిసిల్వా, షామర్ జోసెఫ్, కెవిన్ సింక్లెయిర్ లాంటి యువ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తున్నారు. దీంతో మళ్లీ విండీస్ జట్టుకు మళ్లీ పాత కలొచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకు ఉదాహరణ బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించడమే.
బౌలింగ్ సంచలనం షామర్ జోసెఫ్..

షామర్ జోసెఫ్ కరేబియన్ దీవుల్లోని గయానాలోని బారకర అనే కుగ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యాలు లేకుండా క్రికెట్ మీద అతడికి ఉన్న ప్రేమ, నేర్చుకోవాలనే పట్టుదల అతడిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు తన స్నేహితుల సాయంతో 1980-90 దశకాల్లోని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కార్ల్టీఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్ క్రికెట్ టెస్ట్ హైలైట్స్ చూస్తూ.. బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు.

కుటుంబ భారాన్ని మోసేందుకు తాను బాడీగార్డ్‌గా కూడా పని చేశాడు. కష్టాలను అధిగమించాలని నమ్ముకున్న ఉద్యగానికి రాజీనామా చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. 2023లో గయానా హార్పీ ఈగల్స్ జట్టు తరపున ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు సంపాదించి తన కలను నెరవేర్చుకున్నాడు. అనంతరం సౌతాఫ్రిక పర్యటనకు ఎంపికై ఆశించన మేర వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నేరుగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు ఎంపికై ప్రస్తుతం కంగారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

గాయం ఇబ్బంది పెడుతున్నా.. అతడే ఒక సైన్యంలా

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో షామర్ జోసెఫ్ 7 వికెట్లతో చెలరేగాడు. దీంతో గబ్బాలో వెస్టిండీస్ ఎనమిది పరుగులతో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన యార్కర్ జోసెఫ్ కాలిని బొటను వేలును తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతడు రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తిరిగి అతడు నాలుగో రోజు మైదానంలోకి వస్తాడా అనే సందిగ్ధం నెలకొంది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. షామర్ జోసెఫ్ గ్రౌండ్‌లోకి చిరుతల ఎంటరయ్యాడు.
మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల ఇది ఆట..లేక యుద్ధమా అన్న తీరులో షామర్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను గడగడలాడించాడు. అల్‌రౌండర్ కామోరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, హెజిల్‌వుడ్ ఇలా.. క్రీజ్‌లోకి వచ్చిన వారిని ఒకరి తరువాత మరొకరిని పెవిలియన్‌కు పంపాడు. పేసర్ షామర్ జోసెఫ్ మొత్తం 68 పరుగులిచ్చి 7 వికెట్లను నేలకూల్చడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో 27 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించింది.

Train: తర్వాతి స్టేషన్‌లో రైలు ఎక్కుతానంటే కుదరదు!

ఓ స్టేషన్‌ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్‌ చేయించుకొని, తర్వాతి స్టేషన్లలో రైలు ఎక్కి.. నా బెర్త్‌ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించడం ఇకపై కుదరదు.
రైలులో రిజర్వేషన్‌ వివరాలను ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ)లు కొంత కాలంగా హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ (ట్యాబ్స్‌ వంటివి) ద్వారా పరిశీలిస్తున్నారు. వాటిలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్‌ అవుతాయి. ఓ స్టేషన్‌లో రిజర్వేషన్‌ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే.. తర్వాత స్టేషన్‌ వచ్చేలోపు ఆర్‌ఏసీ, వెయింటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారికి ఆ బెర్త్‌లు కేటాయించే వీలుంటుంది.

దీంతో తర్వాత స్టేషన్‌లో రైలెక్కి నా బెర్త్‌ ఏదీ? అని అడిగేందుకు ప్రయాణికులకు హక్కు ఉండదు. గతంలో టీటీఈలకు ప్రింటెడ్‌ రిజర్వేషన్‌ జాబితా ఇచ్చేవారు. దీంతో ఒకటి, రెండు స్టేషన్ల వరకు ప్రయాణికులు రాకపోయినా వారు వేచి చూసేవారు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. వచ్చే స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే.. బోర్డింగ్‌ వివరాలు మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Warts Removing :ఇలా చేస్తే 1 రోజులో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి.డాక్టర్ అవసరం ఉండదు

Warts In Telugu :పులిపిర్లు అనేవి సాధారణమైన సమస్య. ప్రతి 15 మందిలో ఒక్కరు పులిపిర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పులిపిర్లను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అని కూడా పిలుస్తారు.
ఇవి యుక్తవయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఇవి రావటానికి ప్రధానకారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి.

ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఒక బౌల్ లో రెండు వెల్లుల్లి పాయలను పేస్ట్ గా చేసి వేయాలి. దానిలో అర స్పూన్ నిమ్మరసం,పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి బ్యాండెజ్ వేయాలి.
ఒక గంట తర్వాత బ్యాండెజ్ తీసేసి శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ఉదయం,సాయంత్రం చేస్తూ ఉంటే పులిపిర్లు రాలిపోతాయి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. వెల్లుల్లి,నిమ్మరసంలో ఉన్న లక్షణాలు పులిపిర్లను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Mouni Amavasya : ఫిబ్రవరి 9 శక్తివంతమైన మౌని అమావాస్య. కొడుకుల ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం తప్పక చేస్తే రావాల్సిందే.!

Mouni Amavasya : ఫిబ్రవరి 9న మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు.
మరియు నదుల్లో పవిత్ర స్నానాలు కూడా ఆచరిస్తారు. మరో ముఖ్యమైన విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సమస్యకు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య అనేది ఈ యొక్క చిన్న పరిహారానికి ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఈరోజున మీరు కచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నారు కదండీ. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని ఆ నీటితో తల స్నానం చేయండి.

చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు. ఇక ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్న తల్లి ఎవరైనా సరే అంటే ఒక కొడుకు కావచ్చు. ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్న తల్లి అయినా సరే అండి మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు వృద్దిను చూడాలి అనుకుంటే ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు వారిపై ఉన్నటువంటి ఈ దృష్టి దోషాలను మీరు తొలగించుకోవచ్చు. కాబట్టి చిన్న పరిహారం చేయవచ్చండి. ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి. అంటే ఎరుపు రంగు కానీ లేకపోతే పసుపుపచ్చ రంగు కానీ వస్త్రాన్ని తీసుకొని దాంట్లో కొంచెం గల్లు ఉప్పు వేయండి.. వేసిన తర్వాత ఒక నాలుగు ఐదు లవంగాలను కూడా వేయండి. ఎందుకంటే ఈ దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు లవంగాలు, ఉప్పు. ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే లవంగాలకు కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వేయండి.

కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మూడు పదార్థాలు దాంట్లో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టేసేయండి. ఈ మూట మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకొని మీ కొడుకును తూర్పుముఖంగా కూర్చోబెట్టి వారు ఎడమ చేయి వైపు నుండి వారి చుట్టూ తిప్పండి. మీరు నిరసన ప్రదేశంలో కావచ్చు. లేకపోతే ఎవరూ తిరగని ప్రదేశంలో కావచ్చు.
ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కాని లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కాని అంటే ఎవరు తోక్కకుండా వేసి మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ విధంగా కనక మీరు చేశారంటే వారిపై ఉన్న దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.. ఇక ఇలా చేస్తే మీ కొడుకులు కచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు. కచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేసి చూడండి .. మంచి ఫలితాలను చూస్తారు…

Health

సినిమా