Friday, November 15, 2024

Chanakya Niti Telugu : జీవితంలో ఈ ముగ్గురిని అస్సలు సాయం అడగొద్దు..

చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజంలోని చాలా విషయాలలో అపారమైన జ్ఞానం, అనుభవం ఉంది. ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్యం కాకుండా.., ఆచరణాత్మక జీవితం గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు.
నేటికీ ఆయన మాటలు, సూత్రాలు మనిషికి కష్టకాలంలో ఎంతగానో ఉపకరిస్తాయి. ఎవరైనా చాణక్య నీతిని సరిగ్గా పాటిస్తే.., జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చాణక్య సూత్రం ప్రకారం, మనిషికి ఇతరులను సరిగ్గా అంచనా వేయగల సామర్థ్యం ఉంటే, వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. పాము, తేళ్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండే సామర్థ్యం మనకు ఉండాలి. అలాగే, జీవితంలో ఎప్పుడూ అలాంటి వ్యక్తుల నుండి సహాయం తీసుకోకండి.

చాణక్య నీతి ప్రకారం, పుట్టుకతో అంధుడైన వ్యక్తి దేనినీ చూడలేడు. కామం, క్రోధం, మత్తు నిండిన వ్యక్తి అది తప్ప మరొకటి చూడలేడు. అదే సమయంలో స్వార్థపరులు ఎవరికీ సహాయం చేయరు. వారందరూ సమానమే. అందుకే స్వార్థపరుడితో స్నేహం చేయకూడదు లేదా సహాయం కోరకూడదు.స్వార్థపరులను పొరపాటున కూడా నమ్మకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీకు ఎప్పటికీ మేలు చేయలేరు, మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు.

చాణక్యుడు ప్రకారం, శత్రువు ముందు నుండి దాడి చేస్తాడు. అతని దాడిని మనం జాగ్రత్తగా ఎదుర్కోవచ్చు. కానీ స్వార్థపరులు, నీచమైన వ్యక్తులు వెనుక నుంచి దాడి చేస్తారు. అలాంటి వారిని ఎప్పుడూ నమ్మవద్దు. స్వార్థపరుడు జీవితంలో తన మంచి గురించి తప్ప మరేమీ ఆలోచించడు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులను ట్రాప్ చేస్తారు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, క్రూర స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే కోపం మనిషికి ప్రధాన శత్రువు. కోపంగా ఉన్నప్పుడు ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. కోపం తెచ్చుకోవడం వల్ల తనకు, ఇతరులకు హాని కలుగుతుంది. కోపంలోని వ్యక్తి మంచి, చెడును తెలుసుకోలేడు. అతను తన ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తులు శత్రువుల కంటే ప్రమాదకరం. వారి నుంచి సాయం తీసుకోవద్దు. మీకు సాయం చేసి అందరి ముందు అనేస్తారు.

అత్యాశ, అసూయపడే వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. కష్ట సమయాల్లో కూడా అలాంటి వారి నుండి సహాయం తీసుకోకూడదు. ఎందుకంటే అత్యాశ, అసూయపడే వ్యక్తులు మీకు మంచికి బదులుగా హాని చేస్తారు. నిజానికి, అసూయపడే వ్యక్తులకు ఏది సరైనది, ఏది తప్పు అనే స్పృహ ఉండదు. వారు ఇతరుల సంతోషం, పురోగతితో ఎప్పుడూ సంతోషించరు. అసూయ, అత్యాశగల వ్యక్తులు ఇతరుల పురోగతిని చూసి అసూయపడతారు. వారికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. వారి నుంచి సాయం తీసుకుంటే.. మీకే చెడు జరుగుతుంది.

Bindi Allergy: ఇది ఆడవాళ్లకు మాత్రమే.. బొట్టు తీయకుండా నిద్రపోతున్నారా?

బొట్టుబిళ్ల పెట్టుకునే ప్రదేశంలో కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపు, మచ్చలు ఏర్పడుతుంటాయి. బొట్టుపెట్టుకునే ప్రదేశంలో చర్మం పొడిబారడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.
వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి చాలు…


మాయిశ్చరైజర్‌ :
బొట్టుబిళ్ల తీయకుండా అదేపనిగా ఉంచడం వల్ల చర్మం పొడిబారి దురద వస్తుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసి మాయిశ్చరైజర్‌ రాసి మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మానికి తేమనందించి దురదను తగ్గిస్తుంది.

నూనె: రోజూ రెండు నిమిషాల పాటు కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది మచ్చపడకుండా ఉంటుంది.

జెల్‌ : అలోవెరా జెల్‌ను రాసి మర్ధన చేయడం వల్ల అక్కడ ఏర్పడే దద్దుర్లు, మొటిమలు పోతాయి. అలోవెరా జెల్‌లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మాన్ని దురద, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

గ్లూ తక్కువగా : బొట్టు బిళ్లలను ఎంపిక చేసేటప్పుడు గ్లూ, గమ్‌ తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసేసి మాయిశ్చర్‌ రాసుకుని పడుకోవాలి. ఉదయం బొట్టు బిళ్ల పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు.

Kuber Mantra: కుబేర అష్టలక్ష్మీ మంత్రం చదివితే నిత్య దరిద్రుడు సైతం కోటీశ్వరుడు అవడం ఖాయం, మంత్రం ఇక్కడ ఉంది…చదవండి..

లక్ష్మీ దేవిని భూమ్మీద అందరి శ్రేయస్సు, అదృష్టం డబ్బుకు దేవతగా పూజిస్తారు. హిందూ సంప్రదాయంలో, అలాగే కుబేరుడిని సంపద దేవుడుగా ప్రసిద్ధి చెందాడు.
భూమి మీద మంచి ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని మనందరికీ తెలుసు. సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితం. అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులు అయితే మరికొందరు పేదవారుగా అవుతుంటారు. ఆర్థిక సమస్యలు మీకు హాని కలిగిస్తాయి. మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోకుండా మిమ్మల్ని నిషేధిస్తాయి.అలాంటప్పుడు కుబేర అష్టలక్ష్మీ మంత్రం పఠిస్తే మీ దరిద్రం పోయి ధన వంతులు అవుతారు.

ఈ మంత్రంపై విశ్వాసం కలిగి ఉండాలి. దానిని మీ హృదయంతో పఠించాలి; ఇది మీ జీవితానికి ప్రశాంతతను మాత్రమే కాకుండా మీరు కోరుకునే దేనికైనా, ముఖ్యంగా భౌతిక వస్తువులకు కూడా ఇస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, మూడు నెలల పాటు ప్రతిరోజూ 108 సార్లు కుబేరు మంత్రాన్ని పఠించడం అనేది కుబేరుని సంతృప్తిపరచడానికి మరియు అతని అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం.

కుబేరుడు “దేవతల కోశాధికారి”, “యక్ష రాజు” అని పిలువబడ్డాడు. అతను డబ్బు, విజయం, కీర్తికి నిజమైన స్వరూపుడు. భగవంతుడు కుబేరుడు విశ్వ సంపదను పంచుకోవడమే కాకుండా, భద్రపరుస్తాడు. ఫలితంగా, కుబేరుడు సంపద రక్షకుడిగా కూడా పరిగణించబడ్డాడు. కుబేరుడు బ్రహ్మదేవుని వంశ వృక్షం నుండి వచ్చినవాడు.

కుబేర అష్టలక్ష్మీ మంత్రం చదివితే నిత్య దరిద్రుడు సైతం కోటీశ్వరుడు అవడం ఖాయం..

మంత్రం: హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మం గృహే ధనం పురయ పురయ నమమ్

ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మీ మమ గృహే ధనం పూరాయ పూరాయ నమః

How To Become Rich: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!

ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ధనవంతుడు కావాలని.. బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తరువాత ఇవన్నీ మనవల్ల అయ్యేపని కాదని మధ్యలోనే ఊరుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు.. తప్పకుండా ధనవంతులవుతారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.

స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం..
ధనవంతుడు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఒక మంచి సులభమైన మార్గం స్టాక్ మార్కెట్ అనే చెప్పాలి. జీవితంలో డబ్బు పొదుపుచేయడం ఎంత ముఖ్యమో.. వాటిని ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇన్వెస్ట్‌మెంట్‌లో నష్టాలు వస్తాయని భావించవచ్చు, కానీ సరైన అవగాహన ఉంటే అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.

డైవర్సిఫికేషన్ చాలా అవసరం..
సంపాదించి కూడబెట్టిన డబ్బు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. అంటే మీదగ్గరున్న డబ్బు కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా.. గోల్డ్ లేదా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం వంటివాటిలో పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడు ఒక రంగంలో నష్టం వచ్చినా.. మరో రంగంలో తప్పకుండా లాభం వస్తుంది. దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు.

అప్పులు చేయడం మానుకోవాలి..
సంపాదనకు తగిన ఖర్చులను మాత్రమే పెట్టుకోవాలి. విచ్చలవిడి ఖర్చులు చేస్తూ.. డబ్బు కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుందనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.

గోల్ చాలా ముఖ్యం..
నువ్వు ధనవంతుడు కావాలంటే ముందుగా తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ఫైనాన్సియల్ గోల్స్ పెట్టుకోవాలి. మీ ప్రయాణాన్ని గోల్ వైపు సాగిస్తే తప్పకుండా అనుకున్నది సాదిస్తావు. ఇల్లు, కారు ఇతరత్రా ఏమి కొనాలనుకున్న ముందుగా ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి.

స్మార్ట్ ఇన్వెస్ట్ అవసరం..
ఇన్వెస్ట్ అంటే ఎదో ఒక రంగంలో గుడ్డిగా వెళ్లిపోవడం కాదు.. అలోచించి చాలా స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టాలి. ట్యాక్స్ సేవింగ్స్, ఫండ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో అధిక వడ్డీ వచ్చే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం మరచిపోకూడదు. యువకుడుగా ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవాలి.. అప్పుడే సక్సెస్ పరుగెత్తుకుంటూ వస్తుంది.

ధనవంతుడు కావాలనే కోరిక ఉంటే సరిపోదు.. దాని కోసం అహర్నిశలు ఆలోచించాలి, ఆ మార్గంలోనే ప్రయాణం కొనసాగించాలి. తెలియని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి, వీలైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెడుతున్నావో తెలియకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Washing Machine: వాషింగ్ మెషీన్‌లో దుస్తులు ఉతికేటప్పుడు.. 4 ఐస్‌క్యూబ్స్‌ను వేస్తే.. ఏం జరుగుతుందో మీరే చూడండి..!

గుట్టల గుట్టలుగా దుస్తులు ముందేసుకుని ఉదయాన్నే కూర్చున్న మనిషి సాయంత్రం వరకూ ఉతుకుతూనే ఉండే రోజులకు చెల్లు చీటి ఇచ్చేసి, మహా అయితే ఓ గంటలోనే దుస్తుల్ని ఉతికి గట్టిగా పిండేసి నీళ్ళు కారకుండా ఆరబెట్టుకునే సౌకర్యం వాషింగ్ మిషన్ తో వస్తుంది.
అయితే వాషింగ్ మిషన్ వాడకం కాస్త కష్టంగా అనిపించినా అలవాటయితే దానంత ఈజీ వర్క్ మరోటి లేదనే చెప్పాలి.

రోజూ దుస్తులు ఉతకడం, ఆరబెట్టడం, పిండటం, వాటిని అల్మారాలో ఉంచడం బోరింగ్ పని, కానీ ఇది చేయకపోతే, రోజువారీ జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పని చేస్తుంటే, మాత్రం ఉతికిన మడతలు లేని దుస్తులు తప్పని సరిగా వేసుకోవలసి వస్తుంది. వారాంతంలో దుస్తుల్ని ఉతకడం, ఎండబెట్టడం అనే పని జరుగుతుంది. ఇక వాషింగ్ మిషన్ లో వేసే దుస్తులు బయటకు తీసినప్పుడు, వాటిపై ముడతలు లేకుండా ఉండే కాస్త పని తగ్గినట్టు అవుతుంది. దీనికోసం ఏం చేయాలంటే..

ఇది కూడా చదవండి: అప్పుడప్పుడూ ఏడుస్తూ ఉండండి బాసూ.. ఎందుకిలా చెప్పాల్సి వస్తోందంటే..!
ఐస్ క్యూబ్స్ పెడితే ఏమవుతుంది?

వాషింగ్ మెషీన్ను నడుపుతున్నప్పుడల్లా, దుస్తులతో పాటు 3 నుండి 4 హ్యాండిల్ ఐస్ వేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల డ్రైయర్ లోంచి దుస్తులను బయటకు తీసినప్పుడు వాటిపై ముడతలు రావు.

అది ఎలా పని చేస్తుంది

నిజానికి, వాషింగ్ మెషీన్‌లో ఐస్ క్యూబ్స్‌ను ఉంచినప్పుడు, అది పెద్దగా మ్యాజిక్ ఏం చేయదు, కానీ ఇలా చేయడం వల్ల, డ్రైయర్ ఉష్ణోగ్రతను పెంచేటప్పుడు, మనం వేసిని ఐస్ వేగంగా కరగడం ప్రారంభమవుతుంది దీంతో ఆవిరి ఏర్పడటం ప్రారంభమవుతుంది, దీని వలన దుస్తులపై ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఎన్ని ఐస్ క్యూబ్స్ వేయాల్సి వస్తుంది.
మెషిన్‌లో ఎంత ఐస్ వేయాలి అనే అనుమానం కలిగితే అందులో ఎక్కువ ఐస్ ముక్కలు వేయాల్సిన అవసరం లేదు. 3 నుండి 4 ఐస్ క్యూబ్స్ వేసినా సరిపోతుంది. వాషింగ్ మెషీన్‌లో దుస్తులు వేసి, డిటర్జెంట్, సాఫ్ట్‌నర్ మొదలైన వాటిని మెషిన్‌లో వేయాలి. ఇప్పుడు యంత్రాన్ని ఆన్ చేయండి. దుస్తులు ఉతికినప్పుడు, డ్రైయర్‌లో 4 నుండి 5 ఐస్ క్యూబ్స్ వేసి, డ్రైయర్‌ను ఆన్ చేసి 15 నిమిషాలు నడపాలి. దుస్తులపై ముడతలు లేవనేది గమనిస్తారు. ఇది చిన్న ట్రిక్ అయినా ఫలితం మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఓసారి ట్రై చేసి చూడండి.

PMJJBY: ఈ కేంద్ర ప్రభుత్వ బీమా పథకం గురించి చాలామందికి తెలియదు.. జస్ట్ రూ.436 చెల్లిస్తే..

సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో జీవిత బీమాకు సంబంధించిన ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. మహత్తరమైనది.
కేవలం రూ.436 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.2లక్షల ఇన్సూరెన్స్‌ సొమ్ము అందుతుంది.

18ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య అర్హులు

ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో చేరేందుకు 18ఏళ్ల నుంచి 50ఏళ్ల వయసున్న వారు అర్హులు. బ్యాంకు, పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఇందులో చేరవచ్చు. ఇందుకోసం బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి, నో యువర్‌ కస్టమర్‌ పూర్తిచేయాలి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటే, ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే ఈ పథకంలో చేరాలి. ఎవరైనా రెండు అకౌంట్ల ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినా ఒకటి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకంలో ఏడాది కాలపరిమితి

ఏడాది కాల పరిమితితో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 1నుంచి మే 31వరకు అమల్లో ఉంటుంది. ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25-31మధ్య ప్రీమియం మొత్తం ఆటో డెబిట్‌ ద్వారా రెన్యూవల్‌ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్‌ చేయాలనుకుంటే రద్దుకోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా ఈ పథకంలో చేరేవారికి జూన్‌ 1నుంచి మే 31వరకు కవరేజీ లహాస్తుంది. ఈ పథకంలోకి కొత్తగా చేరినా లేదా తిరిగి జాయిన్‌ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే క్లెయిమ్‌కు అనుమతి ఉంటుంది.

గతంలో రూ.330 కాగా ఇప్పుడు రూ.436

తొలుత రూ.330తో ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. ఇప్పుడు ఈ ప్రీమియంను రూ.436కు పెంచారు. ఆటో డెబిట్‌ ద్వారా బ్యాంకు, పోస్టాఫీసు అకౌంటు నుంచే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ఈ స్కీమ్‌లో చేరే నెలను అనుసరించి ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇది మొత్తంగా టర్మ్‌ పాలసీ కావడంతో మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే నామినీకి హామీ మొత్తం చెల్లిస్తారు. ప్రీమియంను బట్టి సొమ్ము బీమా పరిహారంగా లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ స్కీం వర్తించదు.

Digital Voter ID – డిజిటల్ ‘ఓటర్ ఐడి’ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? ఇక్కడ తెలుసుకోండి

దురదృష్టవశాత్తు డిజిటల్ ఓటరు ID కార్డ్ 2022
తర్వాత నమోదు చేసుకున్న ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ సదుపాయం అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఈ పద్ధతిలో ఓటరు కార్డును ముందుగా డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకుని డిజిలాకర్ యాప్‌లో సేవ్ చేసుకోవచ్చు.

ఈ డిజిటల్ ఓటరు కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

1) ముందుగా ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.inకి వెళ్లండి
2) మీరు ఈ పోర్టల్‌ను మొదటిసారి ఉపయోగిస్తుంటే, ఫోన్ నంబర్ ద్వారా నమోదు చేసుకోండి. మీరు పోర్టల్‌లోకి ప్రవేశించిన తర్వాత, డౌన్‌లోడ్ ఇ-ఎపిక్‌పై క్లిక్ చేసి, అక్కడ మీ EPIC నంబర్‌ను నమోదు చేయండి. అప్పుడు మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది.
3) OTPని నమోదు చేసిన తర్వాత, ఓటరు కార్డును డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు దానిని డిజిటల్ లాకర్‌లో సేవ్ చేయవచ్చు. లేదా ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.

ఎల్‌ఐసీలో ఈ పాలసీ తీసుకుంటే.. నెల నెల రూ. 12 వేలు వస్తాయి తెలుసా..?

డబ్బును సేవ్‌ చేసుకోవడం అనేది కొందరికి మాత్రం ఉండే అలవాటు. అందరూ సేవ్‌ చేసుకుందాం అనుకుంటారు.. కానీ చేయలేరు. రిస్క్‌ లేకుండా పెట్టుబడితే మంచి ఫలితాలను పొందవచ్చు.

పోస్ట్‌ ఆఫీస్‌, ఎల్‌ఐసీలో మంచి మంచి స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఎల్‌ఐసీలో ఒక బెస్ట్‌ స్కీమ్‌ ఉంది. దీని ద్వారా నెలకు 12 వేలు పొందవచ్చు. సేవింగ్ స్కీమ్స్ కాకుండా మీరు ఎల్ఐసీ అందించే పాలసీ కొనుగోలు చేయడం ద్వారా కూడా ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు.

ఎల్ఐసీ పలు రకాల పాలసీ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఇందులో మీరు చేరితే ప్రతి నెలా డబ్బులు సొంతం చేసుకోవచ్చు. పెన్షన్ రూపంలో ఈ డబ్బులు లభిస్తాయి. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి అనేది యాన్యుటీ ప్లాన్. మీరు ఒకేసారి డబ్బులు పెట్టి ఈ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం డిపర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీ కొనే సయమంలోనే మీకు గ్యారంటీ యాన్యుటీ రేటు చెప్తారు. అందుకు తగినట్లుగా మీకు పెన్షన్ వస్తుంది.

మీరు ఈ పాలసీ కొంటే రెండు యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ అనేవి ఇది. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్ ఎంచుకుంటే తర్వాత దీన్ని మార్చుకోవడం కుదరదు. అందుకే కొనే సమయంలోనే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి.

30 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. గరిష్టంగా 79 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు కూడా ఈ ప్లాన్‌లో చేరొచ్చు. కనీసం రూ. 1.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. రూ. 5 లక్షలకు పైన కొంటే అప్పుడు అధిక యాన్యుటీ పొందొచ్చు.

పెన్షన్ మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లిస్తారు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు డిఫర్టెంట్ సెట్ చేసుకోవచ్చు. రెండేళ్ల డిఫర్మెంట్ ఎంచుకుంటే అప్పుడు మీకు పాలసీ కొన్న రెండేళ్ల తర్వాతి నుంచి పెన్షన్ చెల్లిస్తారు. ఇమ్మీడియన్ పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది.

మీరు రూ.10 లక్షల మొత్తానికి జీవన్ శాంతి పాలసీ కొనుగోలు చేయాలనుకుంటే.. ప్రతి నెలా ఎంత పెన్షన్ పొందొచ్చొ తెలుసుకుందాం. మీ వయసు 30 ఏళ్లు అనుకుంటే, ఐదేళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు ఏటా రూ. 86 వేల పెన్షన్ వస్తుంది. ఇక 12 ఏళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ అయితే అప్పుడు రూ. 1.32 లక్షలు వస్తాయి.

ఇంకా మీ వయసు 45 ఏళ్లు అనుకుందాం. ఇప్పుడు మీరు రూ.10 లక్షలు పెట్టి ఈ ప్లాన్ కొంటే.. ఐదేళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ అయితే మీకు రూ. 90 వేల వార్షిక పెన్షన్ వస్తుంది. ఇక 12 ఏళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ అయితే ఏడాదికి రూ. 1.42 లక్షలు వస్తాయి. అంటే నెలకు దాదాపు రూ.12 వేలు వస్తాయి.

Know it : ఫ్రిజ్‌కు గోడకు మధ్య ఎంత గ్యాప్‌ ఉంటే కరెంట్‌ బిల్లు తక్కువగా వస్తుంది..?

వంట గదిలో ఫ్రిడ్జ్‌, హాల్లో టీవీ లేని ఇళ్లు ఉండదు కదా..! ఇవి ఇప్పుడు చాలా కామన్‌ అయిపోయాయి. ఫ్రిడ్జ్‌లో అయితే పనికొచ్చేవి కంటే.. పాడైపోయినవే ఎక్కువగా ఉంటాయి.

చిన్నసైజ్‌ కర్రీపాయింట్‌ను మెయింటేన్ చేస్తుంది అమ్మ.. నిజమే కదా..! ఫ్రిడ్జ్‌, ఏసీ, వాషింగ్ మిషన్‌ వీటిని కండీషన్‌ బాగుంటేనే కరెంట్‌ బిల్లు తక్కువగా వస్తుంది లేదంటే.. అంతే సంగతులు. కొన్నిసార్లు ఇవి మంచి కండీషన్‌లో ఉన్నా.. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఫ్రిడ్జ్‌ను హాల్లో ఉంచినా, వంటగదిలో ఉంచినా..ఫ్రిజ్, గోడ మధ్య దూరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఒక్క తేడానే కరెంట్‌ బిల్లును పెంచుతుంది, తగ్గిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్రిజ్, గోడ మధ్య 6 నుండి 10 అంగుళాల ఖాళీ ఉండాలి. మీ ఫ్రిజ్ గోడకు చాలా దగ్గరగా ఉంటే అది వేడెక్కుతుంది, పనిచేయదు. వేడి సరిగా బయటకు వెళ్లలేక ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది. ఈ కారణంగా సమస్యలను నివారించడానికి గోడ నుండి సరైన దూరంలో మీ ఫ్రిజ్‌ను పెట్టాలి.

మీ ఫ్రిజ్‌ను చల్లబరచడానికి గాలి ప్రసరణ అవసరం. గాలి ప్రవాహానికి తగినంత స్థలం లేనట్లయితే కంప్రెసర్ వేడెక్కుతుంది. చివరికి పని చేయడం ఆగిపోతుంది. ఫ్రిజ్‌ లోపల కూడా సరైన సర్క్యులేషన్ లేకపోతే మీ ఆహారం త్వరగా పాడవుతుంది. ఫ్రిజ్ ఇంటిలో ఎక్కువగా విద్యుత్ ఉపయోగించే వస్తువులలో ఒకటి. ఎందుకంటే ఇది 24*7 ఆన్‌లోనే ఉంటుంది. టీవీ,ఏసీల్లా అవసరం లేనప్పుడు బన్‌ చేయనికీ కాదు. ఇది సాధ్యమైనంత సమర్థవంతంగా నడుస్తుందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

ఫ్రిజ్‌ను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఇతర అంశాలు

ఫ్రిజ్‌ని ఎక్కువగా నింపవద్దు. ముఖ్యంగా మీకు అవసరం లేనప్పుడు ఎక్కువ ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దు.

ఫ్రిజ్‌లో గట్టి ప్లాస్టిక్ ర్యాప్‌ను ఉంచవద్దు. దీంతో ఫ్రిజ్‌లో వేడి పెరుగుతుంది. ఫ్రిజ్‌ డోర్‌ను పదే పదే తెరిచి ఉంచవద్దు. ఇది కూడా అధిక విద్యుత్ బిల్లుకు కారణం అవుతుంది.

చాలా మంది ఇంటికి దగ్గరలోనే షాపులు ఉన్నా.. సామాను ఎక్కువగా తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఎక్కువ ఐటమ్స్ ఫ్రిజ్‍లో ఉంటే కరెంట్ బిల్లు పెరుగుతుంది. అందుకే ప్రతిదాన్ని ఒకేసారి షాపింగ్ చేయడానికి బదులుగా.. తక్కువ పరిమాణంలో కొనాలి. దీంతో ఫ్రిజ్‍లో అనవసరమైన వస్తువులను నింపకుండా ఉండొచ్చు.

Dead Sea: సముద్రంపై తేలుతున్న మనుషులు.. ఎక్కడో తెలుసా..?

Dead Sea: మాములుగా ఎక్కడైనా నీటిలో పడితే మునిగిపోతారన్న సంగతి తెలిసిందే. ఈత వచ్చిన వారు అయితేనే నీటిపై తేలగలరు. కానీ ఈత రాకపోతే..ఖచ్చితంగా నీటిలో మునిగిపోతారన్నది అందరికీ తెలిసిందే.
అయితే ఇక్కడ ఈత రాని వాళ్లు సైతం నీటిపై తేలవచ్చు. అలా అని అదేమీ స్విమ్మింగ్ ఫూల్ కాదు.. కుంట కాదు..సముద్రం. ఇంతకీ ఆ సముద్రం ఎక్కడ ఉంది. ఆ సముద్రంలో ఎందుకు మునిగిపోరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం చెప్పుకునే ఈ సముద్రాన్ని డెడ్ సీ అని పిలుస్తుంటారు. ఇది ఇజ్రాయెల్ , జోర్డాన్ మధ్య ప్రాంతంలో ఉంది. ఈ సముద్రపు నీటిలో కూర్చోవచ్చు, నడవచ్చు..పేపర్ చదవచ్చు.. ఇలా ఏమైనా చేయవచ్చు. సముద్రం మధ్యలోకి వెళ్లినా నీటిలో మునిగిపోరు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క సముద్రమే ఇలా ఉంటుందని తెలుస్తోంది. దీన్నే మృత సముద్రమని పిలుస్తుంటారు.

ఎక్కడైనా సముద్రపు నీరుగా ఉప్పగా ఉంటుందన్న విషయం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. నీరు ఉప్పగా ఉన్నప్పటికీ ఆ సముద్రాల్లో ఎన్నో జల జీవరాశులు జీవిస్తుంటాయి. అయితే డెడ్ సీలో నీరు చాలా ఉప్పగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సముద్రంలో ఎటువంటి జీవరాశులు బ్రతకలేవు. ఒకవేళ మనం చేపలను తీసుకొచ్చి వేసినా వెంటనే చనిపోతాయని సమాచారం.

ఈ మృత సముద్రపు నీటిలో బ్రోమైడ్, జింక్, మెగ్నీషియం, పొటాష్, కాల్షియంతో పాటు సల్ఫర్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ కారణంగానే సముద్రంలో నీరు చాలా ఉప్పగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా డెడ్ సీ సముద్ర మట్టానికి సుమారు 1388 అడుగుల దిగువన ఉంది. దీని కారణంగా సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సముద్రంలోని నీటి ప్రవాహం దిగువ నుంచి పైకి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఎవరైనా ఆ నీటిలో దిగినప్పుడు వారు తేలతారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కారణంగానే సముద్రంలో వస్తువులు అయినా, మనుషుల ఎవరైనా పడితే తేలరని స్పష్టం అవుతోంది.

Jio ధమాకా: 12 OTTలు మరియు డేటా కేవలం కేవలం రూ. 148 కే అందుకోండి.

Jio Dhamaka: 12 OTTలు మరియు డేటా కేవలం రూ. 148K పొందండి అని జియో చెప్పింది. రిలయన్స్ జియో ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను మరింత విస్తరించే కార్యక్రమంలో భాగంగా కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తీసుకొచ్చింది.

ఈ ప్లాన్ల ధర రూ. 148 మొదలుకొని రూ. 4,498 వరకు అందించబడింది. వీటిలో, చౌకైన బడ్జెట్ ప్లాన్ 12 OTTలకు యాక్సెస్తో పాటు డేటా వంటి అన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Jio is a blast

ఈ రూ. 148 ప్లాన్ గురించి ఖచ్చితంగా ఉంది. ఈ జియో ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ హై స్పీడ్ డేటా మరియు 12 OTTలకు సబ్స్క్రిప్షన్ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

జియో రూ. 148 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్తో కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు వర్తించవు. అయితే, Jio ఈ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్తో 28 రోజుల పాటు 10GB హై స్పీడ్ 4G డేటాను అందిస్తోంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ 12 ప్రముఖ OTT ప్లాట్ఫారమ్లకు సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

What are the 12 OTT platforms?

మరియు రూ. 148 ప్లాన్ కింద జియో అందించే 12 OTTల విషయానికొస్తే, ఈ ప్లాన్ సోనీ LIV, J5, JioCinema ప్రీమియం, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lanka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi ద్వారా యాక్సెస్ను అందిస్తుంది. JioTV యాప్. .

అప్పుడు బాబాయ్.. ఇప్పుడు చెల్లి.. కాంగ్రెస్‌పై CM జగన్ సెన్సేషనల్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు.
గతంలో మా బాబాయ్‌ను నాపై పోటీకి నిలబెట్టారు.. ఇప్పుడు మా సోదరిని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన జగన్ మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. కుటుంబాల్లో విభేదాలు సృష్టించి పాలిటిక్స్ చేస్తోన్న వాళ్లకు దేవుడే బుద్ధి చెబుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని.. టీడీపీ, జనసేన పార్టీలతోనే ఎన్నికల్లో తమ పోటీ అని జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. ఇష్యూ బేస్డ్ విషయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని జగన్ కుండబద్దలు కొట్టారు. సర్వేల ఆధారంగానే వైసీపీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామని.. ప్రజా వ్యతిరేకత ఉన్నందునే కొందరికి టికెట్లు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు మా వైపే ఉన్నారని భావిస్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని జగన్ దీమా వ్యక్తం చేశారు.

Samsung రిపబ్లిక్ డే సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు

2024 రిపబ్లిక్ డే సందర్భంగా, Samsung గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ అనే ప్రత్యేక సేల్ ని ప్రకటించింది. దీని కింద స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలతో సహా పలు శాంసంగ్ ఉత్పత్తులపై ఆఫర్‌లు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను ప్రకటించింది.
ముఖ్యంగా Samsung యొక్క ఈ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా, గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై 57% తగ్గింపును ప్రకటించారు. ఏ మోడల్స్ ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి? ఏ ఇతర ఉత్పత్తులు ఆఫర్‌లు ప్రకటించబడ్డాయి? వివరాలు ఇక్కడ ఉన్నాయి:

Samsung గ్రాండ్ రిపబ్లిక్ ఆఫర్‌లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? Samsung.com, Samsung shop యాప్ మరియు Samsung ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల ద్వారా Samsung స్మార్ట్‌ఫోన్‌లపై 57% వరకు తగ్గింపులను పొందవచ్చు. అదనంగా, HDFC, ICICI, Axis మరియు ఇతర ప్రముఖ బ్యాంకుల నుండి డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై 22.5% క్యాష్‌బ్యాక్ (రూ. 25,000 వరకు) పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై ఎలాంటి ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి? శాంసంగ్ ద్వారా ఈ ప్రత్యేక సేల్ సందర్భంగా, మీరు Galaxy A సిరీస్, M సిరీస్, F సిరీస్, S సిరీస్ మరియు Galaxy Z సిరీస్‌ల క్రింద మొత్తం 14 స్మార్ట్‌ఫోన్‌లపై 57% వరకు తగ్గింపును పొందగలరు.

ఖచ్చితంగా చెప్పాలంటే, గెలాక్సీ S21 FE, గెలాక్సీ S23, గెలాక్సీ s23 FE, గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5 డిస్కౌంట్ లో అందుబాటులో ఉంది.

అలాగే Galaxy A15 5G, Galaxy S34 5G, Galaxy A54 5G, Galaxy A25 5G, Galaxy M34, Galaxy M14, Galaxy F34, Galaxy F14 మరియు Galaxy M04 కూడా తగ్గింపుతో ఉన్నాయి.
Samsung స్మార్ట్ టీవీ లపై కూడా ఆఫర్‌లు ఉన్నాయి: బహుశా మీరు ఈ కొత్త శాంసంగ్ స్మార్ట్ టీవీ లపై ఆఫర్‌ల కోసం వెతుకుతున్నారు, Samsung యొక్క ప్రీమియం మరియు జీవనశైలి TV మోడల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు అదనపు ఎక్స్ఛేంజ్ ప్రయోజనం మరియు 48% వరకు తగ్గింపుతో రూ. 15,250 వరకు ఆఫర్లు పొందవచ్చు.

ఎంపిక చేసిన Neo QLED మరియు QLED TV మోడల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు కింది వాటిలో ఒకదానిలో ఒక ప్రత్యేక బహుమతిని పొందుతారు – రూ. 1,24,990 విలువైన Galaxy S23 Ultra లేదా రూ. 69,990 విలువైన 50-అంగుళాల Serif TV లేదా రూ. 38,990 విలువ సౌండ్‌బార్ (Q700C / C450) ను బహుమతిగా పొందవచ్చు.
ఇంకా, శాంసంగ్ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు గడియారాలపై ఆఫర్‌లు: గెలాక్సీ బుక్ గో, గెలాక్సీ బుక్ 3 మరియు గెలాక్సీ బుక్ 3 ప్రో వంటి గెలాక్సీ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకునే వారు 46% వరకు తగ్గింపులను పొందవచ్చు. అలాగే, ఎంచుకున్న గెలాక్సీ టాబ్లెట్‌లు, వాచీలపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.

Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!

Suryakumar Yadav named ICC Men’s T20I Cricketer of the Year for 2nd time: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు.
టీ20 ఫార్మాట్‌లో ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును రెండుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. 2023లో అద్భుతమైన ప్రదర్శనకు గాను ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సూర్యకు ఐసీసీ అందించింది. 2023లో 18 గేమ్‌లలో రెండు సెంచరీలతో సహా 733 పరుగులు చేశాడు. 2022లో కూడా ఈ అవార్డును సూర్యకుమార్ గెలుచుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును అందుకున్నాడు.

మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండా సంచలనం అల్పేష్ రంజానీ, న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ, గ్లోబల్ మీడియా ప్రతినిధులతో కూడిన ప్యానెల్ మరియు ప్రపంచ క్రికెట్ అభిమానుల ఓటింగ్ తర్వాత సూర్య విజేతగా ఎంపికయ్యాడు. అంతకుముందు 2023 సంవత్సరానికి టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఐసీసీ ఎంచుకుంది.
దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడిన సూర్య టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకుంటున్న సూర్యకు మరో సమస్య ఉందని తెలిసింది. జనవరి 17న స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం సూర్య కోలుకుంటున్నాడు. సూర్యకుమార్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందమీ సమాచారం. ఐపీఎల్‌ 2024 ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవచ్చు. అయితే టీ20 ప్రపంచకప్ 2024 సమయానికి అతడు అందుబాటులో ఉంటాడు.

Walk in: నిరుద్యోగులకు శుభవార్త..బీడీఎల్ లో 361 పోస్టులకు వాక్ ఇన్..పరీక్ష లేకుండానే ఎంపిక

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)..నాలుగేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్(కాంట్రాక్ట్) ప్రాతిపదికన హైదరాబాద్,వైజాగ్,బెంగళూరు, భానూర్ లో ఉన్న బీడీఎల్‌ ఆఫీసుల్లో 136 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎలాంటి పరీక్ష లేకుండానే వాక్ ఇన్ ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 361.

1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 136 పోస్టులు

2. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్: 142 పోస్టులు

3. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్: 83 పోస్టులు

విభాగాలు

ఫైనాన్స్, సివిల్,మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్,మెటలర్జీ, ఫిట్టర్, రేడియో మెకానిక్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రో ప్లేటింగ్, కంప్యూటర్స్, ప్లంబర్,ఎలక్ట్రీషియన్, మిల్ రైట్, డీజిల్ మెకానిక్‌, రిఫ్రెజిరేషన్‌ అండ్‌ ఎయిర్ కండిషనింగ్.

అర్హత

సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, MBA, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, CA/ ICWA/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి

14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము

ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులలకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం

ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు నెలకు రూ.30,000-రూ.39,000.

ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.25,000 – రూ.29,500.

ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ.23,000- రూ.27,500.

ఎంపిక ప్రక్రియ

విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు

ఫిబ్రవరి 17,18,21,22,25

వేదిక

బీడీఎల్‌ కంచన్‌బాగ్ (హైదరాబాద్), బీడీఎల్‌ భానూర్ (సంగారెడ్డి), బీడీఎల్‌ విశాఖపట్నం యూనిట్.

ఏపీ జ్యుడీషియల్ సర్వీసులో 39 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

AP రాష్ట్ర హైకోర్టు, అమరావతి నేరుగా రిక్రూట్మెంట్ / బదిలీ ప్రాతిపదికన AP స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

Posts and Vacancy:

Civil Judge (Junior Division): 39 పోస్టులు

వీటిలో 32 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉన్నాయి; 7 ఖాళీలను బదిలీ ద్వారా భర్తీ చేయాలి.

Qualification: Bachelors Degree in Law ఉత్తీర్ణులై ఉండాలి.

Age 35 ఏళ్లు మించకూడదు.

SC,ST, BB, Minoreity కు ఐదేళ్లు; వికలాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు.

Salary: నెలకు 77,840/- నుండి 1,36,520/-

Selection process: స్క్రీనింగ్ టెస్ట్, వ్రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Application Fee రూ.1500 (SC/ST/వికలాంగ అభ్యర్థులకు రూ.750).

Screening Test centers: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 31, 2024

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 01, 2024

వెబ్సైట్:  www.aphc.gov.in

Railway Recruitment | రైల్వేలో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులు

Railway Recruitment | కేవలం పదోతరగతి, ఐటీఐ/డిప్లొమా పూర్తయ్యిందా? మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువు కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ప్రకటన మీ కోసమే..
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా….

మొత్తం ఖాళీలు

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 5696
పోస్టులు: అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ)
కేటగిరీ వారీగా పోస్టులు: జనరల్‌- 2499, ఎస్సీ- 804, ఎస్టీ- 482, ఓబీసీ- 1351, ఈడబ్ల్యూఎస్‌- 560, ఎక్స్‌సర్వీస్‌మెన్‌- 572.
పేస్కేల్‌: రూ.19,900-63,200/-
అర్హతలు
పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి లేదా మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌/ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 2024, జూలై 1 నాటికి 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

21 ఆర్‌ఆర్‌బీల్లో ఏదో ఒక అర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మొదటి స్టేజీ సీబీటీ-1
రోండో స్టేజీ సీబీటీ-2
కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీబీఏటీ)
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌
మెడికల్‌ ఎగ్జామినేషన్‌
సీబీటీ-1

ఇది కేవలం స్క్రీనింగ్‌ ఎగ్జామ్‌ మాత్రమే. దీని ద్వారా అభ్యర్థులను సీబీటీ-2కు ఎంపిక చేస్తారు
సీబీటీ-1 స్కోర్‌/మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
మొత్తం ప్రశ్నలు- 75, మార్కులు- 75. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు
నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కు కోత విధిస్తారు.
పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
సీబీటీ-2

సీబీటీ-1లో వచ్చిన స్కోర్‌ను నార్మలైజేషన్‌ చేసి కమ్యూనిటీ వైజ్‌గా సీబీటీ-2కు పంపిస్తారు
ఖాళీల సంఖ్యను బట్టి 1:15 నిష్పత్తిలో సీబీటీ-2కు ఎంపిక చేస్తారు
దీనిలో రెండు పార్టులు ఉంటాయి.
పార్ట్‌- ఎ, బి.
పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు
మొత్తం ప్రశ్నలు 175
పార్ట్‌-ఎ లో 100 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన సమయం 90 నిమిషాలు
పార్ట్‌-బి లో 75 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన సమయం 60 నిమిషాలు
పార్ట్‌-బి కేవలం క్వాలిఫయింగ్‌ నేచర్‌ పరీక్ష మాత్రమే. సంబంధిత ట్రేడుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
పార్ట్‌ ఎలో మ్యాథ్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ నుంచి
ప్రశ్నలు ఇస్తారు.
కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీబీఏటీ)

సీబీటీ-2 స్కోర్‌తో పోస్టుల సంఖ్యకు 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను సీబీఏటీకి ఎంపిక చేస్తారు.
దీనిలో విజన్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. దీంతో పాటు బ్యాటరీ టెస్ట్‌/సెక్షన్‌ ఆఫ్‌ సీబీఏటీ వేర్వేరుగా అర్హత సాధించాలి.
నోట్‌: సీబీఏటీ పరీక్షకు 70 శాతం, సీబీటీ-2కు 30 వెయిటేజీ ఇచ్చి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు అభ్యర్థులను పిలుస్తారు.
ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఫిబ్రవరి 19
దరఖాస్తు సవరణలకు: ఫిబ్రవరి 20-29 మధ్య చేసుకోవాలి
వెబ్‌సైట్‌:  https://indianrailways.gov.in

Bangalore: కర్ణాటకలో పూజారులకు ప్రభుత్వం షాక్. 10 ఏళ్లుగా తీసుకున్న జీతం తిరిగి ఇవ్వాలని నోటీస్

కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి.

చిక్‌మగళూరు జిల్లా యంత్రాంగం పే ఫ్రీజ్ నోటీసును జారీ చేసింది. మీరు పూజలు చేస్తున్న ఆలయాల్లో ఆదాయం తగ్గింది. కానీ ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం తీసుకున్నారు. కనుక గత 10 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సిద్దరామయ్య సర్కార్ డిమాండ్ చేసింది.

ముఖ్యంగా కన్నడలో రాముడికి పూజలు చేసే పూజారి హిరేమగలూరు కన్నన్ కు సిద్ధరామయ్య ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాదిలోనే కన్నన్ జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ నోట్ పంపింది. నెలకు పూజారి హిరేమగలూరు కన్నన్ కు వేతనంగా రూ.4500 చెల్లిస్తూ ఉండేవారు ఇలా 10 ఏళ్లకు గాను 4,74,000లను చెల్లించారు. ఈ మొత్తాన్ని పండితులు, పూజారి హిరేమగళూరు కన్నన్‌ ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నోటీసు జారీ చేసింది.

కన్నడ పండితుడిగా, కన్నడ పూజారిగా పేరుగాంచిన హిరేమగళూరు కన్నన్ గత 50 ఏళ్లుగా చిక్కమగళూరు శివార్లలోని కల్యాణ కోదండ రామ మందిరానికి ప్రధాన అర్చకుడిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం వరకూ నెలకు 7500 రూపాయలు. చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఆలయ ఆదాయం తక్కువగా ఉండడంతో గత పదేళ్లుగా నెలకు రూ. 4500 జీతం చెల్లిస్తున్నారు. ఆ ఆలయం ఆదాయం గణనీయంగా పడిపోవడంతో గత పదేళ్లుగా చెల్లించిన జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని కన్నన్ కోరారు.

Bharat Ratna Karpoori Thakur: కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ప్రకటన..ఎవరీ కర్పూరీ ఠాకూర్ ఆయన చరిత్ర ఏంటి…

Who is Karpoori Thakur: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మంగళవారం (జనవరి 23) పెద్ద ప్రకటన చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది.
బుధవారం (జనవరి 24) కర్పూరి ఠాకూర్ 100వ జయంతి ఉన్న తరుణంలో ఈ ప్రకటన చేశారు. కర్పూరీ ఠాకూర్‌ని బీహార్‌లో జననాయక్‌ అని పిలుస్తారు. కర్పూరి ఠాకూర్ బీహార్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. ఠాకూర్ డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ముంగేరిలాల్ కమిషన్ అమలు చేసి పేదలకు, వెనుకబడిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. దీని తర్వాత జూన్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు మళ్లీ సీఎం అయ్యారు.

ఆయన తొలిసారి సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతి దళ్ ప్రభుత్వంలో సీఎం కాగా, రెండోసారి జనతా పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. బీహార్‌లోని సమస్తిపూర్ నివాసి కర్పూరి ఠాకూర్ నాయీ బ్రాహ్మణ ( మంగళి) కులానికి చెందినవాడు. వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను సమర్థించడంలో ఆయనకు పేరుంది.
కర్పూరీ ఠాకూర్ 1924లో జన్మించారు
కర్పూరీ ఠాకూర్ 1924లో సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో ఒకరైన నాయి కులంలో జన్మించారు. సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన విధానాలు, సంస్కరణల కోసం తీసుకున్న చర్యలు చాలా మంది ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చాయి.
‘భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో ఠాకూర్‌ను సన్మానించడం ద్వారా ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా ఆయన పాత్రను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. అతని జీవితం మరియు రచనలు అందరికీ సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు న్యాయాన్ని సూచించే భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ అవార్డు ఠాకూర్ గత విజయాలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది ఠాకూర్ ఎప్పుడూ నిలబడిన విలువలను గుర్తు చేస్తుందన్నారు.

కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని మీకు తెలియజేద్దాం. గతంలో జేడీయూ నేత కేసీ త్యాగి ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని, అలాగే ఆయన పేరుతో యూనివర్సిటీని తెరవాలని డిమాండ్ చేశారు.

BITSAT: బిట్‌శాట్‌- 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా

BITS Pilani BITSAT-2024 Notification: రాజస్థాన్లోని పిలానీలో ఉన్న ‘బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)’- బిట్శాట్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆయా క్యాంపస్లలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11తో ముగియనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 15 నుంచి 19 వరకు దరఖాస్తుల సవరణరకు అవకాశం కల్పిస్తారు. మే 21 నుంచి 26 వరకు బిట్శాట్ (సెషన్-1), జూన్ 22 నుంచి 26 వరకు బిట్శాట్ (సెషన్-2) పరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు…
⫸ బిట్శాట్ – 2024 ప్రవేశ ప్రకటన

➜ క్యాంపస్లవారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాం:

I. బిట్స్పిలానీ- పిలానీ క్యాంపస్:

➥ బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.

➥ బీఫార్మసీ

➥ ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

➥ ఎంఎస్సీ: జనరల్ స్టడీస్.

II. బిట్స్ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్:

➥ బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.

ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

III. బిట్స్ పిలానీ – హైదరాబాద్ క్యాంపస్:

➥ బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్.

➥ బీఫార్మసీ

➥ ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

అర్హత:అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు:సెషన్-1, 2 పరీక్షలకు రూ.5400 (పురుషులకు); రూ.4400 (మహిళలకు).

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ:బిట్శాట్-2024 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
పరీక్ష విధానం:బిట్శాట్-2024 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు:హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.04.2024.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 15 – 19.04.2024 వరకు.

➥ బిట్శాట్ ఆన్లైన్ టెస్ట్ (సెషన్-1) తేది: 21- 26.05.2024.
➥ బిట్శాట్ ఆన్లైన్ టెస్ట్ (సెషన్-2) తేది: 22 -26.06.2024.

BITSAT-2024 Notification

BITSAT-2024 Broucher

Online Application

Website

6 వేల చీర కేవలం 3 వందలకే.. నకిలీ ఇక్కత్ దందాపై రెయిడ్స్

యాదాద్రి భువనగిరి జిల్లాలో తయారయ్యే.. పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.
ఎంతో ఫేమస్ అయిన ఈ చీరలు కేవలం 3 వందలకే వస్తుందని తెలిసిన మహిళలు ఊరికే ఉంటారా.. ఆయా షాపులకు క్యూ కట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా.. విజిలెన్స్ అధికారుల వరకూ చేరింది. అంత తక్కువకు ఇక్కత్ చీరలు అమ్మటమేంటీ.. దీని వెనుక ఏదో మతలబు ఉందనుకున్న అధికారు.. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని చేనేత వస్త్రాల షో రూంలపై తనిఖీలు నిర్వహించారు. 12 దుకాణాల్లో తనిఖీలు చేయగా.. అసలు విషయం బయటపడింది. నకిలీ ఇక్కత్ చీరలను తయారు చేసి.. మహిళలకు పోచంపల్లి చీరలని చెప్తూ అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. నకిలీ చీరలను గుర్తించి వాటిని అమ్ముతున్న దుకాణాలకు అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ నకిలీ చీరలు తయారు చేస్తున్న వారిని గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. అయితే.. పోచంపల్లి ఇక్కత్ చీరలను చేతులతో చేయాలి.. కానీ మరమగ్గాలతో నేసి అమ్ముతున్నారు. ప్రత్యేక గుర్తింపు ఉన్న పోచంపల్లి చీరల స్థానంలో ఇలా ప్రింటెడ్ చీరలను అమ్మడాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. ఆ చీరలు ప్రత్యేకంగా పోచంపల్లిలోనే పుట్టాయని చెప్తుంటారు. చీరలకు చేతులతో రంగులు వేసే సంప్రదాయ పద్ధతినే ఇక్కత్ అని పిలుస్తుంటారు. చీరకు ఎక్కడ రంగు వేయాలో ముందే ఊహించుకొని.. దారాలకు రంగులేసి, రకరకాల డిజైన్లను నేస్తారు. ఈ పద్ధతిని రెసిస్ట్ డైయింట్ అంటారు. పురాతన పద్ధతుల్లో ఈ రెసిస్ట్ డైయింగ్ ఒకటి. పోచంపల్లి ఇక్కత్ చీరలు 1800 కాలం నుంచే ఉన్నాయని చెప్తుంటారు. కాగా.. పోచంపల్లిలో దాదాపు 10 వేల కుటుంబాల జీవన ఆధారం ఇక్కత్ చీరలు నేయడమే. ఇక్కత్ను ఒక చీరల్లోనే కాదు సల్వార్లు, స్కర్ట్, అనార్కలీ, లెహంగాల్లో కూడా ఉపయోగిస్తారు. చీరల ప్రామాణికతను నిర్ధారించే జియగ్రాఫికల్ ఇండికేటర్ 2005లో పోచంపల్లికి లభించింది. పోచంపల్లి చీరలను సెలబ్రిటీలు ధరించారు. ఐశ్వర్యరాయ్ తన పెళ్లి, రిసెప్షన్లో పోచంపల్లి చీర కట్టుకున్నారు. ఇక్కత్ చీరలు సూరత్లో చాలా ఫేమస్.

How to Stop Overthinking: ‘అతి ఆలోచనే ఆనందానికి శత్రువు’.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెరుగ్గా ఉండొచ్చు.. కానీ

‘నా పరువు పోతుందేమో’.. చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్‌’ అంటారు మానసిక నిపుణులు.
‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్‌.
ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్‌ క్లబ్‌’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది.

‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్‌ ‘ఓవర్‌థింకర్స్‌ క్లబ్‌’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్‌ మీడియా ద్వారా ఈ క్లబ్‌ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు.

‘జీవితంలో మార్పులు సహజం. కానీ జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు.. వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్‌ వైపు కాకుండా నెగెటివ్‌ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్‌ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు.
వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్‌.

ఆలోచన.. అతి ఆలోచన..
‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్‌. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే… వాన పడితే… వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది… లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్‌ అవుతాయి.

ధ్యాస మళ్లించాలి..
ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్‌
► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్‌ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు
► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్‌ చేద్దాం… చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి

► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి
► సోషల్‌ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి
► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్‌ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది
► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్‌ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి.

ఓవర్‌థింకర్ల లక్షణాలు ఇవే..
► ఆత్మవిమర్శ అధికంగా చేయడం
► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్‌ఫెక్షనిజం)
► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం

► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం
► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం
► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం
► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం.

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఇంట్లో ఆడపిల్ల ఉందంటే.. చాలు.. ప్రతి తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన పని ఈ స్కీమ్‌లో జాయిన్‌ అవ్వడమే.. ఇంతలా ప్రాచుర్యం పొందింది సుక్యన సమృద్ధి యోజన స్కీమ్.
ఇప్పుడు ఈ స్కీమ్‌లో జాయిన్‌ అయిన వాళ్లకు కేంద్ర శుభవార్త చెప్పింది. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సవరించింది. ఇది సుకన్య సమృద్ధి యోజన (SSY) మరియు మూడు సంవత్సరాల కాల డిపాజిట్ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది, ఇతర చిన్న పొదుపు పథకాలు మారలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ఏదైనా మార్పు ఉంటే తెలియజేస్తుంది.

 

చిన్న పొదుపు పథకం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి పథకం మరియు 3 సంవత్సరాల కాల డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటును పెంచింది. మునుపటి సందర్భంలో, ప్రభుత్వం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఐదు సంవత్సరాల RD రేట్లలో స్వల్ప పెరుగుదల మినహా ఏప్రిల్-జూన్ 2020 త్రైమాసికంలో PPF 7.9% నుండి 7.1%కి తగ్గించబడిన తర్వాత ఇది మారదు. దీనికి ముందు, ఇది జూలై-సెప్టెంబర్ 2019లో తగ్గించబడింది. ఇది చివరిసారిగా అక్టోబర్-డిసెంబర్ 2018లో 7.6% నుండి 8%కి పెరిగింది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)కి సంబంధించి, వరుసగా రెండు త్రైమాసికాల అప్‌వార్డ్ రివిజన్‌ల తర్వాత వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2% వద్ద స్థిరంగా ఉంచబడింది. ఏప్రిల్-జూన్ కాలంలో వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచారు. దీని కారణంగా, సుకన్య సమృద్ధి నిధి మరియు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై ప్రభుత్వం అదే వడ్డీ రేటును నిర్ణయించింది. రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 8.2 శాతం వడ్డీ ఇస్తారు.

ఈ పథకం కింద ఆడ పిల్ల తల్లితండ్రులు తమ పదేళ్ల లోపు వయస్సు గల కుమార్తెల పేరిట బ్యాంకు ఖాతా తెరవొచ్చు. తల్లితండ్రులు ఈ ఖాతాలో రూ. 1,000 మొదలుకొని సంవత్సరంలో లక్షన్నర రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుకు ఇతర పథకాల కన్నా బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.

C3 car: రూ.10 లక్షల లోపు 7 సీటర్ కారు.. ఫీచర్స్ అద్భుతం..

C3 car: కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్, ఎస్ యూవీ వేరియంట్ లో ఉండాలని చూస్తారు. కానీ హ్యాచ్ బ్యాక్ కార్ల తప్ప మిగతా కార్లు హై రేంజ్ లో ధరలు ఉంటాయి.
అయితే కొన్ని కంపెనీలు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కార్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ నేపథ్యంలో కాంపాక్ట్ SUV ధరలో 7 సీటర్ కారును ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఓ కంపెనీ. అదే C3. ఇటీవల C3 కారు గురించి విపరీతంగా చర్చ సాగుతోంది. ఎందుకంటే SUV కోరుకుంటున్న వారికి తక్కువ ధరలోనే దీనిని అందిస్తోంది. ఇంతకీ ఆ కారు ఏదో? దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్తాం..

C3 నుంచి వచ్చి కొత్త 7 సీటర్ కారు Aircross. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్, టర్బో ఇంిజన్ ను కలిగి ఉంది. ఇది 110 బీహెచ్ పీ పవర్ , 190 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ తో నడిచే ఈ కారు లీటర్ పెట్రోల్ కు 18.5 కిలోమీటర్లమైలేజ్ ఇస్తుంది. ఇందులో 10.2 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ అండ్రాయిడ్ ఆటో వంటివి ఆకర్షిస్తున్నాయి. రక్షణ కోసం ఫ్రంట్, బ్యాక్ కలపి మొత్తం 4 ఎయిర్ బ్యాగ్స్ఉన్నాయి. మాన్యువల్ ఏసీ తో పాటు ఆడియో నియంత్రణ వంటి ఫీచర్లుఆకర్షిస్తున్నాయి.

సాధారణంగా SUV కార్లు రూ.10 లక్షలకు పైగానే ప్రారంభ ధర ఉంటుంది. కానీ C3 ఎయిర్ క్రాస్ మాత్రం 9.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారుకు టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ పోటీగా నిలుస్తోంది. అయితే ఈ మోడల్ 11.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అంతే కాకుండా 7 సీటర్ కారు ఇంత తక్కువ ధరకు విక్రయించడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. C3 ఎయిర్ క్రాస్ కారును 2023లో భారత్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది మూడు వేరియంట్లలో లభిస్తోంది.

Cigarette Smoking : ఓమైగాడ్.. సిగిరెట్ ఒక్కసారిగా మానేస్తే ఇలా జరుగుతుందా..!

Cigarette Smoking : మద్యపానం, ధుమపాన ఆరోగ్యానికి హానికరమని మన అందరికీ తెలుసు. సినిమా థియేటర్లలో షోకు ముందు ముఖేష్ కూడా చెప్తాడు ఇదే మాట. సిగిరెట్ పెట్టెపై కూడా ఇదే రాసి ఉంటుంది.
కానీ స్మోకింగ్ మాత్రం మానలేరు. ఒక్కసాకి సిగిరెట్ అలవాటైందా.. ఒత్తిడి తగ్గడానికి, టైమ్ పాస్‌కి, ఫ్యాషన్ కోసం కూడా తాగేస్తాం సిగిరెట్. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు.. అయినా మానలేం. ఈ రోజుల్లో మగవారే కాదు.. మహిళలు కూడా సిగిరెట్ స్మోకింగ్‌కు బానిసలయ్యారు. పొగ కాల్చే వారికే కాదు.. పీల్చే వారికి కూడా ఆనారోగ్య సమస్యలు వస్తాయి.

స్మోకింగ్‌కు బానిసలయ్యే వారిలో ఉపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఆస్తమా.. ఇలా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సిగిరెట్, చుట్ట, బీడీలలో ఉండే నికోటిన్ వ్యసనపరులుగా మారుస్తుంది. అందుకే ఎంత కంట్రోల్ చేసుకున్న మనసు మళ్లీ మళ్లీ తాగాలని లాగేస్తుంది. ఒక వేళ మీరు ఉన్నట్టుండి సిగిరెట్ మానేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..!

సిగిరెట్ స్మోకింగ్ మానేయడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఈ అలవాటు ఉన్న వారు ఒక్కరోజు సిగిరెట్ మానేస్తే.. ముఖ్యంగా తలనొప్పి వస్తుంది. దీనితోపాటు ఆకలి, అలసట, నిద్రలేమి, మలబద్ధకం, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి.

సిగిరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వారి శరీరం నికోటిన్‌కు అలవాటు పడుతుంది. దీని వల్ల ఒక్కసారిగా నికోటిన్ తీసుకోవడం మానేస్తే.. తలనొప్పి బాధిస్తుంది. కాబట్టి నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీని ఫాలో అవ్వండి.

మీ సన్నిహితులకు, కుటుంబసభ్యులకు సిగిరెట్ స్మోకింగ్ మానేస్తున్నట్లు చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు మిమ్మల్ని స్మోకింగ్ చేయమని ప్రేరేపించరు. అవసరమైతే ఈ విషయంలో మీకు సపోర్ట్‌గా ఉంటారు. వారితో ఎక్కువ సమయం మాట్లాడే ప్రయత్నం చేయండి. లేదంటే డీ అడిక్షన్ థెరపీ సెంటర్లో చేరండి.

సిగిరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వారు ప్రతి భోజనం తర్వాత స్మోక్ చేస్తారు. ఇలాంటి వారు సిగిరెట్‌కు బదులుగా చేయింగ్ గమ్‌లో నమలడం అలవాటు చేసుకోండి. చూయింగ్ గమ్‌లు పొగాకు కోరికలను అణచి వేయడంలో సహాయపడతాయి. లేదా పచ్చి క్యారెట్లు తినడం వల్ల పొగాకు కోరికను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎక్సర్‌సైజ్ చేయడం మీ దిన చర్యలో చేర్చుకోండి. దీని వల్ల స్మోకింగ్ చేయాలనే కోరికలు తగ్గే అవకాశం ఉంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. ధూమపానం నుంచి మీ ధ్యాసను మరల్చడానికి ఎక్సర్‌సైజ్ ఉత్తమంగా నిలుస్తుంది. వాకింగ్, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేసిన చక్కటి ప్రయోజనాలు పొందొచ్చు.

సిగిరెట్ మానేసిన ఎంత సమయానికి ఏయే మార్పులు వస్తాయో చూద్దాం..

20 నిమిషాల పాటు సిగిరెట్ స్మోకింగ్ మానేస్తే.. హార్ట్ బీట్ బాగుంటుంది
8 గంటలు సిగిరెట్ మానేస్తే.. రక్తంలోని నికోటిన్ స్థాయిలు సగానికి తగ్గుతాయి
12 గంటలు సిగిరెట్ మానేస్తే.. రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు సగానికి తగ్గిపోతాయి
24 గంటలు సిగిరెట్ మానేస్తే.. కార్బన్ మోనాక్సైడ్ దగ్గు రూపంలో గొంతు నుంచి వెళ్లిపోతుంది
72 గంటలు సిగిరెట్ మానేస్తే.. ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి
1-2 వారాలపాటు సిగిరెట్ మానేస్తే.. ఊపిరితిత్తులు శరీరానికి మరింత గాలిని పంపిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది
1 నెల సిగిరెట్ మానేస్తే.. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చర్మం మీద ముడతలు కూడా తగ్గుతాయి
15 సంవత్సరాలు సిగిరెట్‌కు దూరంగా ఉంటే.. గుండెపోటు వచ్చే ప్రమాదాల నుంచి బయటపడతారు

చరిత్ర సృష్టించిన ఏపీ.ఆసియా ఖండంలో పొడవైన సొరంగాలు పూర్తి !

ఏపీలోని వెలిగొండ కల సాకారం అయింది. రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిమీల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.
మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసిన ప్రభుత్వం….ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. దుర్భిక్ష ప్రాంతా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం….శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ఇప్పటికే పూర్తి చేసింది.

వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ వైఎస్‌ హయాంలోనే పూర్తి అయింది. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది ఏపీ సర్కార్‌. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడపి జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం చేసింది ప్రభుత్వం. మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది.

Cricket టీం ఇండియా కి వ్యతిరేకంగా ఆడడమే నా లక్ష్యం.. భారత్ ప్లేయర్ సంచలన కామెంట్స్..!

భారత మాజీ అండర్ 19 కెప్టెన్ ఉన్ముక్ చంద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. టీమ్ ఇండియాకి వ్యతిరేకంగా ఆడడమే నా లక్ష్యం అని చెప్పాడు.
ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు పై తన ఆటని పరీక్షించుకోవాలని ఆసక్తి ఉందని అన్నాడు త్వరలో ఉన్ముక్ లక్ష్యం నెరవేరుతుంది. ప్రస్తుతం యునైటెడ్ ఆఫ్ అమెరికా తరపున ఆడుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో టీం టీమిండియా పై ఆడబోతున్నాడు.

జాతీయ జట్టు లో చోటు దక్కకపోవడం వలన సెప్టెంబర్ 2021 లో ఉమ్మత్ రిటైర్ అయ్యాడు టి20 ప్రపంచ కప్ కి వెస్టిండీస్ యూఎస్ఏ సంయుక్త అతిత్యమిస్తున్న విషయం మనకి తెలుసు. టార్నికి ఆతిధ్యమిస్తున్న జట్టుగా యూఎస్ఏ నేరుగా అర్హత పొందింది జూన్ 12న అమెరికా తో భారత్ తలబడుతుంది ఈ మ్యాచ్ లో అమెరికా తరఫున ఆడబోతున్నాడు ఈ ఆటగాడు. టీమిండియా కి వ్యతిరేకంగా ఆడడం చాలా వింతగా ఉందని వ్యాఖ్యలు చేశాడు

Gmail: జీమెయిల్ కొత్త అప్ డేట్ అదిరింది.. ఒక్క క్లిక్‌తో ఆ సమస్యకు చెక్.. పూర్తి వివరాలు

Gmail ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉంది. విద్యార్థుల నుంచి బిజినెస్ మ్యాన్ వరకూ అందిరికీ అనివార్యంగా దీనిని వినియోగించాల్సిన పరిస్థితి. స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా జీమెయిల్ ఉండాల్సిందే.
ప్రతి ఆన్ లైన్ ప్రక్రియ ఈ జీమెయిల్ ఆధారంగానే పనిచేస్తుంటుంది. అన్నింటికీ జీమెయిల్ ను ప్రాథమికంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక అనవసర ఈమెయిల్స్ మీ జీమెయిల్ ఇన్ బాక్స్ లోకి వచ్చి పడుతుంటాయి. వాటిల్లో చాలా ప్రమోషనల్ మెయిల్స్ కూడా ఉంటాయి. అటువంటి అనవసర మెయిల్స్ ఇక రాకుండా ఉండాలంటే వచ్చిన మెయిల్ కింద ఉండే రిపోర్ట్ స్పామ్ అండ్ అన్ సబ్ స్క్రైబ్ అనే బటన్ పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే జీమెయిల్ ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఓ కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. కేవలం ఒక ఆప్షన్ గా ఉన్న ఈ రిపోర్ట్ స్పామ్ అండ్ అన్‌సబ్‌స్క్రయిబ్ ను రెండు ఆప్షన్లుగా మార్చింది. అంటే రిపోర్ట్ స్పామ్ ఒక ఆప్షన్, అన్‌సబ్‌స్క్రయిబ్ పేరిట మరో ఆప్షన్ కింద విభజించింది. ఒక్క క్లిక్ తో అవాంఛిత మెయిల్స్ రాకుండా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎందుకు ఈ ఫీచర్..
జీమెయిల్ మొబైల్, వెబ్ వెర్షన్‌లలో ఈమెయిల్‌లకు సబ్ స్క్రిప్షన్ తీసివేయడాన్ని గూగుల్ ఇప్పుడు మరింత సులభతరం చేస్తోంది. గూగుల్ వర్క్ స్పేస్ లో ఈ కొత్త అప్ డేట్ గురించి వివరించింది. అవాంఛిత ఈ మెయిల్‌లను నిర్వహించడం చాలా మంది వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేస్తుందని.. అందుకే వినియోగదారులు సురక్షితంగా ఉండటంలో సహాయపడేందుకు తాము కొన్ని నెలల క్రితం బల్క్ మెయిల్స్ పంపేవారి కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ క్రమంలో వెబ్‌, మొబైల్‌లో జీమెయిల్ లోని అవాంఛిత ఈమెయిల్‌ల నుండి సబ్ స్క్రిప్షన్ తీసివేయడాన్ని మరింత సులభతరం చేయడానికి తాము కొత్త మార్గాలను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.

వెబ్‌ వెర్షన్ జీమెయిల్ అకౌంట్ అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను ప్రత్యేకంగా ఇచ్చింది. థ్రెడ్ లిస్ట్‌లోని హోవర్ యాక్షన్స్ వద్దకు దీనిని తరలిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను క్లిక్ చేయగానే మెయిలింగ్ చిరునామా నుంచి వినియోగదారు చిరునామాను తీసివేయడానికి మెయిల్ పంపినవారికి ఈమెయిల్‌ను పంపుతుంది. అలాగే వినియోగదారు ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలలో ఈ అన్ సబ్ స్క్రైబ్ ఆప్షన్ మరింత ప్రముఖంగా కనిపించడానికి మూడు-చుక్కల మెనుకి తరలించింది.

ఇకపై అన్ సబ్ స్క్రైబ్ లింక్ ఉండాల్సిందే..

9టు5 గూగుల్ నివేదిక ప్రకారం, బల్క్ ఈమెయిల్స్( 5000 కన్నా ఎక్కువ) పంపే సంస్థలు తప్పనిసరిగా ఇకపై వన్-క్లిక్ అన్‌సబ్‌స్క్రైబ్ లింక్‌ను వారి మెసేజ్ తో పాటు వినియోగదారులకు పంపాలి. 2024, ఫిబ్రవరి నుంచి ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ వన్-క్లిక్ అన్‌సబ్‌స్క్రైబ్ లింక్‌ కూడా మెసేజ్ బాడీలో ప్రముఖంగా కనిపించే విధంగా ఇవ్వాలి. ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారు వద్దనుకున్న మెయిల్స్ ఇక రాకుండా నియంత్రించొచ్చు. ఈ అభ్యర్థనను మెయిల్ సెండర్ రెండు రోజులలోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది జీమెయిల్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది.

Eye Care: కంటి చూపు మెరుగు పడాలా.. చిటికెడు తినండి చాలు!

ప్రస్తుత కాలంలో చాలా మంది కంటి చూపుతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇప్పుడున్న వర్క్ స్ట్రెస్, సెల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడటం, పోషకాహార లోపం వల్ల కూడా కంటి చూపు అనేది మందగిస్తుంది.
అదే విధంగా వివిధ రకాల లైటింగ్ వల్ల కూడా కంటి చూపుపై ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కంటి చూపు ఎక్కువ కాలం దెబ్బ తినకుండా ఉండాలంటే మన కంటిలో ఉండు రెటీనా ఆరోగ్యం బాగుండాలి. అప్పుడప్పుడూ కంటికి సంబంధించిన ఆహారం తినడం వల్ల కూడా కంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అనుకుంటారు. కానీ ఇతర పోషకాలు కూడా కావాలి.

రెటీనా ఆరోగ్యం మెరుగు పడాలంటే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం అవుతాయి. ఇది ఎక్కువగా సన్ ఫ్లవర్ సీడ్స్‌లో (పొద్దు తిరుగుడు గింజలు) ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పడటమే కాకుండా కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

కంటి కణాలు హెల్దీగా ఉండాలంటే జింక్, లూటిన్ వంటి యాంటీ ఆక్సింట్లు కావాలి. ఇవి ఎక్కువగా సన్ ఫ్లవర్ సీడ్స్‌లో లభ్యమవుతాయి. అదే విధంగా ఈ గింజల్లో విటమిన్లు సి, ఇ వంటివి కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ చిటికెడు పొద్దు తిరుగుడు గింజల పొడిని తీసుకుంటూ ఉంటే కంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

అంతే కాకుండా కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. ఎంత వర్క్ ఉన్నా గంటకు కనీసం ఓ ఐదు నిమిషాలైనా కంటికి రెస్ట్ ఇవ్వడం మేలు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ.. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్?

DSC Notification : : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీచర్ల నియామకాలపై దృష్టిసారించిన ప్రభుత్వం..
త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. 6 వేల నుంచి 10వేల పోస్టులతో, వారంరోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో డీఎస్సీపై కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించారు. కాగా విద్యాశాఖలో 18,500 పోస్టులు ఉన్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో కొన్నేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే, గత పదిరోజుల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ట్విటర్ వేదికగా డీఎస్సీ నోటిఫికేషన్ పై వివరాలను బొత్స వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వారందరికీ సంక్రాంతి తరువాత శుభవార్త తెలియజేస్తామని బొత్స చెప్పారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని, ఏఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు, తదితర అంశాలను పండుగ అనంతరం వెల్లడిస్తామని బొత్స ట్వీట్ లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ముగియడంతో తాజాగా బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో భేటీ కావడం, జిల్లాల వారీగా ఖాళీలను సేకరించడంతో త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Health

సినిమా