Friday, November 15, 2024

Gold Rates: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. బంగారం ధర మీ ఫోన్‌కే మేసేజ్..ఎలానో చూడండి

Missed call number,Gold Rates: ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండాల్సిందే. అందువల్ల బంగారం కొనాలంటే వాటి ధరల మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
అందువల్ల మన ఫోన్ కె బంగారం ధరలు వస్తే బాగుంటుంది కదా.. ఇప్పుడు ఆ విధానం ఉంది. ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు బంగారం ధరలు మొబైల్ నంబర్‌కు మేసేజ్ రూపంలో వస్తాయి.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధరలు ఉంటాయి. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం కొనుగోలుకు ముందు మీరు మిస్డ్ కాల్ ద్వారా ధరలు తెలుసుకోవచ్చు. ఐబీజేఏ నంబర్ 8955664433 కు మీ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొద్ది సేపటికి మీ మొబైల్ నంబర్‌కు బంగారం ధరలు మేసేజ్ రూపంలో వస్తాయి. దీంతో మీరు చాలా సులభంగా ధరలు తెలుసుకోవచ్చు.

మరోవైపు.. గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.com లో సమాచారం పొందవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేయాలనీ అనుకున్నప్పుడు ముందుగానే ధరలను తెలుసుకుంటే.. అధిక ధరలు చెప్పి చేసే మోసాల నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది.

కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఫోన్ నుంచి పైన చెప్పిన నంబర్‌కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి బంగారం ధరలు తెలుసుకోండి. బంగారం కొనే విషయంలో మోసం జరగకుండా చూసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

E PAN: అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ అవసరమా.? రెండు నిమిషాల్లో ఈ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి..

పాన్‌ కార్డ్‌ ఎంత అనివార్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఆధార్‌ కార్డ్‌ తర్వాత అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్‌ కార్డ్‌ ఒకటని తెలిసిందే.
దేశంలో ప్రతి పౌరుడి, సంస్థల ట్యాక్సేషన్ కోసం ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. బ్యాంకుల్లో ఒకేసారి రూ. 50 వేల నగదు డిపాజిట్‌ చేయాలన్నా, ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలన్నా పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే.

అయితే పాన్ కార్డ్‌ను అప్లై చేసుకున్న తర్వాత కనీసం రెండు వారాల తర్వాతే పాన్‌ చేతుకి అందుతుంది. కొన్ని సందర్భాల్లో నెల రోజులు కూడా పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆధార్‌ కార్డ్‌ను క్షణాల్లో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫైల్ రూపంలో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణ పాన్ కార్డులాగే దీన్ని కూడా అన్ని ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ పాన్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇందుకోసం ముందుగా.. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

* అనంతరం స్క్రీన్‌కి లెఫ్ట్‌ సైడ్‌ కనిపించే.. ఆప్షన్స్‌లో ‘ఇన్ స్టాంట్ ఈ-పాన్ ‘ బటన్ పై క్లిక్ చేయాలి.

* తర్వాత గెట్‌ న్యూ పాన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.

* అనంతరం ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, చెక్ బాక్స్ పై టిక్ చేసి పై క్లిక్ చేసి కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి.

* వెంటనే మీ రిజిస్టర్ ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. దానిని ఎంటర్‌ చేసి కంటిన్యూ నొక్కాలి.
* తర్వాత ఆధార్ వివరాలను చెక్‌ చేసిన తర్వాత టర్మ్స్‌ను యాక్సెప్ట్ చేస్తూ చెక్‌ బాక్స్‌పై టిక్ చేయాలి.

* వెంటనే ఇన్‌స్టాంట్‌గా ఈ పాన్‌ కార్డ్‌ వస్తుంది. పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జగన్‌ను అలా ఎందుకన్నావ్… వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే సీఎం జగన్‌ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు.
ఏపీ విభజన సమస్యలు పరిష్కరించకపోవడానికి వైసీపీ, టీడీపీ కారణమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీఎం జగన్ పరిపాలనపైనా షర్మిల సన్సేషనల్ కామెంట్స్ చేశారు.
దీంతో వైఎస్ షర్మిలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసుకోకుండా వైఎస్ షర్మిల ఏపీకి ఎందుకువచ్చిందంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఆమె రాష్ట్రానాకి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ జగన్ పాలన బాగుందని కాని షర్మిల చేసిన వ్యాఖ్యలు సరిగాలేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.


అయితే వైఎస్ షర్మిలపై ఆమె బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి సైతం విరుచుకుపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఆమె ఎవరు అని ప్రశ్నించారు. తమతో వస్తే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగిందో చూపిస్తామని సవాల్ చేశారు. మొన్నటి వరకూ పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి అభివృద్ది జరగలేదంటే ఎలా అని నిలదీశారు. షర్మిల కాదు.. ఎవరు వచ్చినా జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని చెప్పారు. వైఎస్సార్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అలాంటి పార్టీ కోసమేనా షర్మిల మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టే వైసీపీ అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

LIC Jeevan Dhara II Policy: ఎల్‌ఐసీ ‘జీవన్​ ధార 2’ పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్‌ఫిట్స్‌!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్​ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్‌ అందుబాటులోకి రానుంది.

ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్‌ ఇన్‌ కమ్‌ పొందవచ్చు.

జీవన్ ధార 2 పథకం వివరాలు

►పాలసీ కట్టే సమయంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తిస్తుంది.

►ఒకేసారి డిపాజిట్‌ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు.
►యాన్యుటైజేషన్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది.

► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి.

► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు,

► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు,

►యాన్యుటీ టాప్​-అప్​ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
►ఈ ఎల్​ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్​ తీసుకోవచ్చు.

►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు.

Health Tips : క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి

Health Tips : మనం రోజువారీ జీవితంలో తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మనం ఏయే పదార్థాలు తిన్నా, తాగినా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయో తెలుసుకుందాం.
క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. దాని ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి, కానీ కొంతకాలం తర్వాత అది తీవ్రంగా మారుతుంది.
ప్రాసెస్ చేసిన మాంసం
ప్రాసెస్ చేయబడిన మాంసం కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో నైట్రేట్ ఉంటుంది. దీని కారణంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తిన్నప్పుడు అవి కడుపులో , జీర్ణక్రియ సమయంలో నైట్రోసమైన్‌ను ఉత్పత్తి చేస్తాయి. తక్కువ సోడియం లేదా నైట్రేట్ లేని మాంసాన్ని తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. పదార్ధాల లేబుల్‌లను తనిఖీ చేయడం, ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం కూడా మంచిది.
తీపి ఎక్కువగా తినవద్దు
ఎక్కువ చక్కెర తినడం లేదా పానీయాలు తాగడం వల్ల రొమ్ము, కడుపు క్యాన్సర్‌తో సహా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి కొన్ని క్యాన్సర్‌లకు ప్రమాద కారకాలుగా గుర్తించబడ్డాయి. శుద్ధి చేసిన చక్కెర కూడా ఆరోగ్యానికి చాలా హానికరం.
అత్యంత ప్రాసెస్ చేయబడిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారంలో చాలా సోడియం, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
వేయించిన కూరగాయలను తినొద్దు
వేయించిన కూరగాయలు ఆరోగ్యానికి హానికరం. అధిక ఉష్ణోగ్రత వద్ద వండిన ఆహారం, అదనపు నూనె వాడకం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఇది క్యాన్సర్ రిస్క్ తో ముడిపడి ఉంటుంది. అక్రిలమైడ్, పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్‌లు (PAHలు) వంట ప్రక్రియలో హానికరం. ఈ ఆహార పదార్థాలలో స్టార్చ్, ఆక్సిడైజ్డ్ పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మద్యం
అతిగా తాగడం వల్ల కొలొరెక్టల్, రొమ్ము, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్ , కాలేయ క్యాన్సర్‌లతో సహా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఆల్కహాల్ మెటబాలిజం సమయంలో ఎసిటాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారకం ఉత్పత్తి అవుతుంది.అందుకే వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలని అంటారు.

వైసీపీ ప్రభుత్వంపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఊహించని రేంజ్‌లో సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు YS షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ…
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో పాలకులు ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే కనిపిస్తున్నాయని ఎవరూ ఊహించని రేంజ్‌లో షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి ఒక నియంతలా పాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Pigeons : మీ నివాస ప్రాంతంలో పావురాలు ఉన్నాయా..? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..!

Pigeons : చూడటానికి ముచ్చటగా, ముద్దుగా ఉండే పావురాలంటే ఎవరికైనా ఇష్టమే. మన పల్లెటూళ్లలో చాలామంది వాటిని ఇష్టంగా పెంచుకోవటం తెలిసిందే. ఇక.. పట్టణాల్లో కొన్ని చౌరస్తాల్లో వాటికి రోజూ గింజలు వేసేవారినీ చూస్తుంటాం.
అయితే.. ఈ పావురాల పట్ల వీరికున్న ప్రేమే.. వారి ప్రాణాల మీదికి తీసుకొస్తోందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలకు చలి వాతావరణంతో బాటు పావురాలే ప్రధానకారణమని వారు చెబుతున్నారు. సినీనటి మీనా భర్త పావురాల వల్ల సోకిన ఇన్ఫెక్షన్ వలనే చనిపోయారనే వార్తలు కూడా ఆ మద్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

మన ఊపిరితిత్తులు పెద్ద ట్యాంక్‌లాగా పనిచేస్తాయి. నిమిషంలో 10 లీటర్ల చొప్పున.. ఒక రోజులో 14,400 లీటర్ల గాలిని అవి తీసుకుంటాయి. ఈ గాలిలో దుమ్ము, ధూళి, పక్షుల, జంతువుల శరీరం నుంచి వెలువడే వ్యర్థాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పావురాలు ఎగిరినప్పుడు దాని రెక్కల నుంచి విడుదలయ్యే గాలి, అవి వేసే రెట్టల్లో కొన్ని ప్రొటీన్లు గాలిలోకి విడుదలవుతాయి.
ఈ ప్రొటీన్లు ఆ పావురాలు ఎగిరే ప్రాంతాల్లో చాలా రోజుల పాటు అలానే గాలిలో తేలుతూ ఉంటాయి. తద్వారా అక్కడ నివసించే వారి, ఆ ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపే వారి లంగ్స్‌లో అవి చేరతాయి. రోగనిరోధక శక్తి బాగున్న వారిలో ఇవి నెలలు, సంవత్సరాల పాటు అలాగే నిద్రాణంగా ఉండి.. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధిగా మారుతుంటాయి.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ పక్షుల వ్యర్థాలు మోసుకొచ్చిన ప్రమాదకరమైన వైరస్‌ను కట్టడి చేసే శక్తి ఉండదు. దీనికి తోడు.. చలికాలపు వాతావరణంలో ఈ వైరస్‌లు వేగంగా పెరిగి వారం రోజుల్లోనే అది లంగ్స్‌లో బలంగా తిష్టవేస్తుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అంటారు.

ఈ హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ బలహీనమైన రోగనిరోధక శక్తి, ఏదైనా శ్వాసకోశ సమస్యలున్న వారి ఊపిరితిత్తులను వేగంగా దెబ్బతీస్తుంది. దీంతో వారి లంగ్స్‌లోని వాయుకోశాలను కుచించుకుపోయి, లంగ్స్ మూసుకుపోవటం మొదలవుతుంది. దీనివల్ల బాధితులు గాలిపీల్చుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. వైద్యపరిభాషలో ఈ ఇబ్బందికర పరిస్థితిని ‘ఫైబ్రోసిస్’ అంటారు. దీని బారినపడిన వారు నాలుగడుగులు వేగంగా వేసినా ఆయాసం వస్తుంటుంది.

మన ఊపిరితిత్తులలో 30 కోట్ల వరకు వాయుకోశాలు ఉంటాయి. పావురాల కారణంగా వ్యాపించే వైరస్.. వీటిలో 50 – 70 లక్షల వాయుకోశాలను ప్రభావితం చేసేవరకు పరిస్థితి అదుపులోనే ఉంటుంది. ఆ తర్వాత అది వేగంగా మిగిలిన వాయుకోశాల పనితీరును దెబ్బతీస్తుంది. ఆస్తమా, న్యుమోనియా వంటి రోగుల్లో ఈ వైరస్ 20 నుంచి 25 కోట్ల వాయుకోశాలను దెబ్బతీసి, ఈ వ్యక్తి మరణానికి కారణమవుతుంది.
జన్యుపరమైన అలెర్జీలు, ఉబ్బసం తదితర సమస్యలున్న వారు పొరబాటున కూడా పావురాలను, పెంపుడు జంతువులను పెంచటం, వాటితో సమయం గడపటం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదమని వారు సూచిస్తున్నారు. మీ నివాస ప్రాంతంలో పావురాలుంటే తప్పక మాస్క్ ధరించాలని, ఇంటి బాల్కనీల్లో పావురాలు రాకుండా నెట్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ, పావురాలను పెంచేవారు, పెద్దసంఖ్యలో పావురాలుండే కాలనీ వాసుల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల రోగాల బారిన పడుతున్నట్లు గణాంకాలను బట్టి తేలుతోందనీ, రోగుల్లో శ్వాస సమస్యలు, అవి ముదిరి తీవ్రమైన ఫైబ్రోసిస్‌గా మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చలికాలం ప్రభావం, మితిమీరిన కాలుష్యం నేపథ్యంలో దేశంలో హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి పావురం రెట్టలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలున్నవారు తక్షణం వైద్యులను కలవాలనీ, X Rayలలో ఫైబ్రోసిస్‌ను గుర్తించవచ్చని వారు సూచిస్తున్నారు.

16 Good Qualities of Lord Rama: ఆదర్శపురుషుడు అంటే ఎవరు – ఈ సుగుణాలుంటే మీరూ రాముడే!

The alluring qualities of Lord Rama: ఓ సందర్భంలో నారదుడు- వాల్మీకి మధ్య ఓ చర్చ జరిగింది

వాల్మీకి మహర్షి ప్రశ్న
నిత్యం సత్యం పలికే వాడు, నిరతము ధర్మం నిలిపే వాడు, చేసిన మేలు మరువని వాడు, సూర్యునివలనే వెలిగే వాడు, ఎల్లరికి చలచల్లని వాడు, ఎదనిండా దయగల వాడు…సరియగునడవడివాడు…ఈ లోకంలో ఎవరున్నారు
నారద మహర్షి సమాధానం
ఈ ప్రశ్నలన్నింటికీ చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రుడు.
ఓం కారానికి సరి జోడు, జగములు పొగిడే మొనగాడు, విలువులు కలిగిన విలుకాడు, పలుసుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు..దశరధ తనయుడు దానవ దమనుడు జానకిరాముడు…అతడే శ్రీరాముడు శ్రీరాముడు అని సమాధానం ఇచ్చాడు.

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో అవతరించి, ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన తనయుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రామయ్యలో షోడస (16) గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. ఆ సుగుణాలు ఇవే…

కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ||

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః |
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||

గుణవంతుడు, వీర్యవంతుడు , ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు
సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, వేద వేదాంతాలను తెలిసివాడు
అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు
ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు, ధైర్యవంతుడు
క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు
అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు…

ఈ 16 సుగుణాలే శ్రీరాముడిని ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి.

శ్రీరాముడు మానవుడిగా జన్మించాడు..ఎక్కడా దైవత్వం చూపించకుండా మానవుడిలానే పెరిగాడు.. జీవితంలో ఓ మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నాడు..కానీ ఎక్కడా తొణకలేదు, ధర్మాన్ని వీడలేదు, అసత్యం చెప్పలేదు. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే. అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించలేదు( కృష్ణావతారంలో తానే భగవంతుడిని అని చెబుతాడు కృష్ణుడు) . “రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది. అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం . సాధారణ మానవుడిలా జన్మించి..చివరకు మానవుడిలానే అవతార పరిసమాప్తి చేశాడు. అందుకే రాముడి ప్రతి అడుగు ఆదర్శం…రాముడే ఆదర్శ పురుషుడు…

Ayodhya Ram Mandir | అంకెల్లో అయోధ్య రామ మందిరం వివరాలు..

Ayodhya Ram Mandir | అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకలను ప్రపంచంలోని హిందువులంతా పండుగలా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అయోధ్యలో నూతనంగా నిర్మించబడిన ఆ శ్రీ రాముని దివ్య మందిరం గురించిన అంకెల వివరాలు మీ కోసం..
శంకుస్థాపన జరిగిన తేదీ: 5.08.2020
ప్రాణ ప్రతిష్ఠ: 22.01.2024
మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా) : 2026 నాటికి
ఆలయం విస్తీర్ణం : 2.77 ఎకరాలు
నిర్మాణ విస్తీర్ణం : 57,400 చదరపు అడుగులు
ఆలయం పొడవు : 360 అడుగులు
ఆలయం వెడల్పు : 235 అడుగులు
ఆలయ శిఖరం ఎత్తు : 161 అడుగులు
ప్రవేశ ద్వారాలు : 12
గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు : 51 అంగుళాలు
భక్తులకు దర్శనం ఇచ్చే దూరం : 35 అడుగులు
రామమందిరం కాంప్లెక్స్‌ మొత్తం విస్తీర్ణం : 110 ఎకరాలు
ఏకకాలంలో కాంప్లెక్స్‌లో ఎంతమంది ఉండొచ్చు : 10 లక్షల మంది వరకు
రామ మందిరానికి అయిన ఖర్చు : 900 కోట్లు
కాంప్లెక్స్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా : 1,800 కోట్లు
జూన్, 2022 నాటికి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు : 3,400 కోట్లు.

 

 

 

90 శాతం ముస్లీం ఉన్న దేశంలో ప్రతీ రోజూ రామయణం చదువుతారని తెలుసా?

అయోధ్యలో జనవరి 22న రామప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రాముడి భక్తులందరూ వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఎవరినోట విన్నా ఆ శ్రీరాముని పేరే వినిపిస్తుంది. అంతే కాకుండా చాలా మంది రామాయణం చదువుతున్నారు.

అయితే ఒక హిందూ దేశమైన మన భారత దేశంలో రాయాణం రోజూ చదివేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 90 శాతం ముస్లీం జనాభా ఉన్న దేశంలో ఈ రోజుకి కూడా రామున్ని పూజిస్తారంట. అలాగే అక్కడ రామ్‌లీల పాటించడం, ప్రతీ ఇంట్లో రామాయణం తప్పకుండా ఉంటుందంట. అంతేకాకుండా అక్కడి వారు హనుమాన్‌కి వీరభక్తులంట.ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా? మన పక్కనే ఉన్న ఇండోనేషియా,అక్కడ చాలా ఎక్కువ మంది ముస్లీలు ఉన్నప్పటికీ అక్కడ ఎక్కువ పూజించే గ్రంథం రామాయణం. అక్కడి వారు రామున్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారంట. అంతే కాకుండా ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం డిసెంబర్ 27న ప్రతీ ఒక్కరు హనుమాన్ వేషాధరణలో వచ్చి ఊరేగింపులు చేస్తారంట. అంటే అక్కడ హనుమంతునికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Ayodhya Rammandir: కాకతీయుల టెక్నాలజీతో అయోధ్య రామమందిరం, వెయ్యేళ్లు మన్నేలా వరంగల్ వాసి ప్లాన్

అయోధ్యలో జనవరి 22న రామప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రాముడి భక్తులందరూ వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఎవరినోట విన్నా ఆ శ్రీరాముని పేరే వినిపిస్తుంది. అంతే కాకుండా చాలా మంది రామాయణం చదువుతున్నారు.

అయితే ఒక హిందూ దేశమైన మన భారత దేశంలో రాయాణం రోజూ చదివేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 90 శాతం ముస్లీం జనాభా ఉన్న దేశంలో ఈ రోజుకి కూడా రామున్ని పూజిస్తారంట. అలాగే అక్కడ రామ్‌లీల పాటించడం, ప్రతీ ఇంట్లో రామాయణం తప్పకుండా ఉంటుందంట. అంతేకాకుండా అక్కడి వారు హనుమాన్‌కి వీరభక్తులంట.ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా? మన పక్కనే ఉన్న ఇండోనేషియా,అక్కడ చాలా ఎక్కువ మంది ముస్లీలు ఉన్నప్పటికీ అక్కడ ఎక్కువ పూజించే గ్రంథం రామాయణం. అక్కడి వారు రామున్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారంట. అంతే కాకుండా ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం డిసెంబర్ 27న ప్రతీ ఒక్కరు హనుమాన్ వేషాధరణలో వచ్చి ఊరేగింపులు చేస్తారంట. అంటే అక్కడ హనుమంతునికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Ayodhya Ram Mandir:సాలగ్రామ శిల అంటే ఏమిటి.. ? అయోధ్య రాముడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారా..?

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో భవ్య రామ మందిరంలో శ్రీరామ చంద్రుడు బాల రాముడుగా నిర్ణయించిన ముహూర్తంలోనే కొలువు తీరనున్నారు.
ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులకు బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరంలో కొలువు తీరనున్న రాముడి విగ్రహానికీ ఏ సాలగ్రామ శిలను ఉపయోగించారు. అసలీ సాలగ్రామాలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి. అయోధ్య బాల రాముడి కోసం ఏ సాలగ్రామ శిలను ఉపయోగించారనేది చూద్దాం.

రాములోరి జన్మ స్థలం అయోధ్యలోని రామ మందిరంలో కొలువు తీరనున్న సీతా సమేత రామ విగ్రహాల తయారీకి సాలగ్రామ శిలలను ఉపయోగించారు. పెద్ద ఆలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలకు సాలగ్రామాన్ని ఎందుకు ఉపయోగిస్తారు. అసలు సాలగ్రామం శిలకు ఆ పేరు ఎలా వచ్చింది. దీనిలో రకాలు ఉన్నాయా అని చాలామందికి సందేహం కలుగడం సహజం. అయితే ఈ సాలగ్రామం శ్రీ మహా విష్ణువుకి ప్రతీక. అంతేకాదు అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఒక శిల. కలికాలంలో భక్తుల సులభంగా పూజాదిక కార్యక్రమాలను జరుపుకునేందుకు స్వయంగా నారాయణుడే దివి నుండి భువిపై సాలగ్రామ రూపం ధరించి తరించాడని దేవి భాగవతం చెబుతుంది. అందుకనే కలియుగంలో సాలగ్రామ పూజలకు అత్యంత విశిష్టత ఏర్పడింది.

అసలు సాలగ్రామము విషయానికొస్తే.. ఇవి మహా విష్ణుకు ప్రతీకమైనవిగా భావిస్తారు. ఇవి ఒకరమైన విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల పూజాది కార్యక్రమాల సౌలభ్యం కోసం నారాయణుడు స్వయంగా సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహ దేవతా అర్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు.అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది.అపస్తంబుడు సాలగ్రామ పూజను మొదట పేర్కొన్నట్టు పురాణాల్లో ఉంది. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు.దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాల గ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహాన, షోడశ ఉపచార పూజలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

ఇక అయోధ్య రామ మందిరంలో కొలువు దీరనున్న సీతారాముల విగ్రహాలను తయారు చేసేందకు నేపాల్ నుంచి తీసుకుని వచ్చిన సాలగ్రామ శిలలను ఉపయోగించారు. ఈ సాలగ్రామ శిలలు సుమారు 6 కోట్ల సంవత్సరాల పురాతనమైనవగా కార్బన్ డేటింగ్ ద్వారా తెలుస్తోంది. వీటిని నేపాల్‌లోని గండకి నది నుంచి సంగ్రహించారు.

మన దేశానికి ఆనుకుని ఉండే నేపాల్ లోని గండకీ నది సాలగ్రామ శిలలకు ప్రసిద్ధి చెందింది. ఈ సాలగ్రామం..సాక్షత్ విష్ణు స్వరూపంగా భావిస్తారు భక్తులు. వీటిని అభిషేకించిన జలం పుణ్యప్రదనమైనదిగా భావిస్తారు. సాలగ్రామాన్ని అభిషేకం చేసిన తీర్ధం తీసుకుంటే సకల రోగాలు నశించిపోతాయని పలు సైన్స్ పత్రికలు కూడా ప్రూవ్ చేసాయి.సాలగ్రామాలతో సకల శుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషుల వాక్కు.

సాలగ్రామం వెనుక పురాణాల కథ కూడా ఉంది..
విష్ణుమూర్తి .. సాలగ్రామం అనే రాయి రుపాన్ని ధరించడానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని వివాహామాడుతుంది. బృంద మహా పతివ్రత. జలంధరుడు తన రాక్షస ప్రవృత్తితో దీనజనులతో పాటు దేవతలను సైతం పీడిస్తూ ఉండేవాడు. అంతేకాదు జలంధురుడు పార్వతీ దేవిపై మొహం పెంచుకుని.. శివుని రూపం ధరించి ఆమె వద్దకు వెళ్ళాడు. దీంతో ఆ జగజ్జనని జలంధురుడిపై కోపంతో శ్రీ మహా విష్ణువును ఆశ్రయిస్తుంది. ఈ సందర్భంగా బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది.

బృంద పాతివ్రత్య భంగం కలిగితేనే.. లోకకంటకుడైన జలంధురుడి అంతం జరుగుతుందనేది చాముండి ఉవాచ. దీంతో సమస్త లోకం సుఖ సంతోషాలను కోరిన శ్రీ మహా విష్ణువు.. జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం బృందకు తన నిజ రూపదర్శన భాగ్యం ఇస్తాడు. అసలు విషయం తెలుసుకున్న బృంద.. విష్ణుమూర్తిని శిలగా మారమని శపిస్తుంది. అలా శిల సాలగ్రామం అని పురాణాల కథ.

సాలగ్రామ శిలలు ఎంత చిన్నవిగా ఉంటె అంత విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ శిలలపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు.

సాలగ్రామంపై ఒక చక్రం ఉంటే సుదర్శనమని.. రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణుడని.. మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడనీ.. నాలుగు చక్రాలు ఉంటే జనార్ధుడు అనీ.. 5 చక్రాలు ఉంటే వాసుదేవుడనీ.. 6 చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడని అంటారు. అంతేకాదు ఏడు చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని సంకర్షణుడు అనీ, ఎనిమిది చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని పురుషోత్తముడు అనీ.. 9 చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని నవవ్యూహమని.. 10 చక్రాలు ఉంటే దశావతారమనీ అంటారు. ఇక సాలాగ్రామానికి పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు పేరుతో పిలుస్తారు. పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ అంటారు. పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని అనంతమూర్తి అని పిలుస్తారు.
సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేసి.. నియమ నిష్టలతో పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబసభ్యులు తప్ప ఇతరులు సాలగ్రామన్ని దర్శించరాదని పురాణ కథనం.ఏది ఏమైనా అయోధ్యలో మరికొన్ని గంటల్లో కొలువు తీరనున్న బాల రాముడి విగ్రహం నేపథ్యంలో సాలగ్రామ శిలలు మరోసారి వార్తల్లో నిలిచాయి.

రామమందిరానికి వివిధ రాష్ట్రాల నుంచి అందిన కానుకలివే!

అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. దీనిని సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ క్రమంలో ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విరాళాలు అందజేశారు. అయితే ఏయే రాష్ట్రం నుంచి ఏమేం విరాళాలు అందాయో ఓ సారి పరిశీలిద్దాం.

కశ్మీర్ కుంకుమ పువ్వు
కశ్మీర్ నుంచి తీసుకొచ్చిన రెండు కిలోల కుంకుమ పువ్వును విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ శ్రీరామ మందిరానికి అందజేశారు. ఇది స్వచ్చమైన కుంకుమ పువ్వు అని అలోక్ తెలిపారు. కశ్మీర్ కు చెందిన ముస్లింలు దీనిని తనకు అందజేసినట్టు వెల్లడించారు.

తమిళనాడు నుంచి సిల్క్ బెడ్‌షీట్
తమిళనాడుకు చెందిన పట్టు తయారీ దారులు సిల్క్ బెడ్ షీట్‌ను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. దీనిని 10 మంది కలిసి పది రోజులు తయారు చేశారు. శ్రీరామ మందిరాన్ని వర్ణించేలా ఉండటమే దీని ప్రత్యేకత.

అలీఘర్ నుంచి లాక్
400 కిలోల బరువున్న ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని అలీఘర్‌కు చెందిన భక్తులు పంపినట్టు తెలుస్తోంది. ఈ భారీ తాళాన్ని రెండేళ్ల క్రితం సత్య ప్రకాష్ శర్మ, ఆయన భార్య రుక్మిణి శర్మ అనే వృద్ధ దంపతులు తయారు చేశారు.

హైదరాబాద్ లడ్డూలు
హైదరాబాద్‌కు చెందిన భక్తులు 1,265 కిలోల లడ్డూలను ప్రసాదంగా పంపారు. హైదరాబాద్‌లోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఈ ప్రసాదాన్ని తయారు చేసింది. 25 మంది పురుషులు 3 రోజుల పాటు లడ్డూలను సిద్ధం చేసినట్టు కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు.
7000 దుప్పట్లు
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు మెహందీపూర్ బాలాజీ మందిర్ న్యాస్ 1,51,000 లడ్డూ ప్రసాదాల పెట్టెలను బహుమతిగా అందించినట్టు సమాచారం. అదనంగా, భక్తులకు పంపిణీ చేయడానికి 7,000 దుప్పట్లు కూడా పంపించారు.
108 అడుగుల అగర్‌బత్తీ
108 అడుగుల పొడవాటి అగరుబత్తీని గుజరాత్ నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. ఇది 3,610 కిలోల బరువు, సుమారు 3.5 అడుగులు ఉంటుంది. ఆవు పేడ, నెయ్యి, పూల పదార్దాలు, మూలికలను ఉపయోగించి దీనిని తయారు చేశారు. ఒకసారి వెలిగిస్తే దాదాపు నెలన్నర పాటు వెలిగి ఉండటమే దీని ప్రత్యేకత.

YS Sharmila: చక్రం తిప్పిన కేవీపీ..! జగన్‌ను వ్యతిరేకించే నేతలతో షర్మిల మంతనాలు..!

వైఎస్ షర్మిలపై (YS Sharmila) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. షర్మిల ఎవరెవరిని కలుస్తున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారనే అంశాలపై ఆరా తీస్తోంది.
షర్మిల విజయవాడ పర్యటనపై స్పెషల్ బ్రాండ్, ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోకస్ చేశారు. షర్మిల వద్దకు ఎవరు వెళ్తున్నారనే అంశానికి సంబంధించి డేటా తీస్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను విభేదించిన నేతలతో షర్మిల టచ్‌లో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్ఆర్‌తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. జగన్‌ను వ్యతిరేకించే వారు, బడుగు బలహీన వర్గాల నేతలను పార్టీలో చేర్చుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్లాలని హై కమాండ్ ఆమె దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.

వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు కేవీపీ రంగంలోకి దిగినట్టు తెలిసింది. షర్మిల వెంట కేవీపీ ఉన్నారని, పలుకుబడి ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. కేవీపీ మరోసారి చక్రం తిప్పుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్ఆర్‌తో కలిసి నడిచిన నేతలను కేవీపీ తీసుకొస్తున్నారు. ఇప్పటి తరం నేతలతో షర్మిల మాట్లాడుతున్నారని తెలిసింది. పాత, కొత్త తరం నేతలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో షర్మిల బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని షర్మిల వర్గం నేతలు చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆమె ఏ మేరకు ప్రభావం చూపగలదో చూడాలి మరి.

Mango Powder : చింతపండుకు బదులుగా ఇది వాడండి.. షుగర్ తగ్గుతుంది, రక్తం ఫుల్లుగా తయారవుతుంది..!

Mango Powder : మనం రోజూ చేసే వంటలకు తగిన రుచి, సువాసన రావడానికి రకరకాల పదార్థాలను వాడుతూ ఉంటాం. అందులో మామిడి కాయ పొడి ఒకటి. భారతీయులు చాలా కాలం నుండి వంటల్లో మామిడి కాయ పొడిని వాడుతున్నారు.
వంటల్లో ఉప్పుకు, చింతపండుకు బదులుగా మనం మామిడి కాయ పొడిని వాడుకోవచ్చు. మార్కెట్ లో మనకు ఉప్పు కలిపిన మామిడి కాయ పొడి, ఉప్పు కలపని మామిడి కాయ పొడి రెండు లభ్యమవుతాయి. ఉప్పు కలపని మామిడి కాయ పొడిని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతంది.
పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడంలో మామిడి కాయ పొడిని వాడుతున్నారు. మామిడి కాయ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌, మైక్రో న్యూట్రియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో మామిడి కాయ పొడి ఎంతో సహాయపడుతుంది. మనం తిన్న ఆహారం నుండి వచ్చే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా కలవకుండా మామిడి కాయ పొడి ఉపయోగపడుతుంది. మామిడి కాయ పొడిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా చేరకుండా చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
అధిక బరువును తగ్గించడంలో మామిడి కాయ పొడి ఉపయోగపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మామిడి కాయ పొడి అదుపులో ఉంచుతుంది. మామిడి కాయ పొడిలో ఉండే మ్యాగ్నిఫెరిన్ అనే మూలకం శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరగకుండా చేస్తుంది.
వంశపారపర్యంగా వచ్చే అధిక బరువును తగ్గించడంలోనూ మామిడి కాయ పొడి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది కనుక భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
మామిడికాయ పొడిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
మామిడి కాయ పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యి జీర్ణ క్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. మన వంటల్లో పులుపుకు బదులుగామామిడి కాయ పొడిని వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

Hair Care: కరివేపాకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం…

ఆధునిక జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు కారణంగా జుట్టు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అందరూ జుట్టు రాలిపోయే సమస్యని ఎదుర్కొనే వాళ్ళే ఉంటున్నారు.
జుట్టు మంచిగా లేకపోతే ఎంత అందంగా రెడీ అయినా ప్రయోజనం ఉండదు. అందుకే జుట్టు మీద అదనపు శ్రద్ధ చూపించడం చాలా అవసరం. మార్కెట్లో దొరికే వాటితో జుట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తారు కానీ అవి ఎంతవరకి మేలు చేస్తాయనే విషయం మాత్రం చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి ఉన్న జుట్టు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టు పెంచుకునేందుకు ట్రై చెయ్యొచ్చు. వాటిలో ముందుగా వినిపించే పేరు కరివేపాకు.
ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు తప్పనిసరిగా ఉంటుంది. కూరలకి అద్భుతమైన వాసన, రుచి అందిస్తుంది. కానీ తినేతప్పుడు మాత్రం కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు. అలా చేయడం వల్ల మీ జుట్టు ఎదుగుదల మీరే అడ్డుకుంటున్నట్టు అవుతుంది. కరివేపాకు జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుంటాయి. చుండ్రు,స్కాల్ఫ్ దురదని దూరం చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంతే కాదు తెల్ల జుట్టు రాకుండా పోషణ ఇచ్చే విటమిన్ బి ఇందులో లభిస్తుంది. దీన్ని తినడం వల్ల సిల్కీ, పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది.
పొడవాటి జుట్టు కోసం
జుట్టు పొడవు పెంచాలని అనుకుంటే కరివేపాకుని వీటితో కలిపి తీసుకుంటే చాలా మంచిది. అరకప్పు కరివేపాకు, మెంతి ఆకులు, ఒక ఉసిరికాయని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తల మొత్తం పట్టించాలి. ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని బాగా తలకి పట్టించిన తర్వాత చల్లని నీటితో కడిగేయొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు బాగా పొడవుగా అవుతుంది. ఉసిరి జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది.
కొబ్బరి నూనె కరివేపాకు
తక్కువ మంట మీద కొబ్బరి నూనె వేడి చేసుకోవాలి. అందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని చితపటలాడనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిక్స్ చల్లారిన తర్వాత ఒక బాటిల్ లోకి వడకట్టుకోవాలి. తరచుగా లేదా వారానికి ఒకసారి ఈ నూనె తలకి పట్టిస్తే జుట్టు మృదువుగా నిగనిగలాడుతుంది. హెల్తీ హెయిర్ కోసం ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టుకి పోషణ అందిస్తాయి.
ఉల్లిపాయ, కరివేపాకు
ప్రతి పది మందిలో ఏడుగురు మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఉల్లిపాయ, కరివేపాకు జుట్టుకి పెట్టడం వల్ల జుట్టు రాలే సమస్యని అధిగమించవచ్చు. ఉల్లిపాయ రసంలో మంచి మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు క్యూటికల్స్ ని బలపరుస్తుంది. ఉల్లిపాయ, కరివేపాకు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకుని దాన్ని వడకట్టుకోవాలి. అందులో కాటన్ బాల్ ముంచి జుట్టు కుదుళ్ళకి అప్లై చేసుకోవాలి. ఒక 30నిమిషాల పాటు తలకు అలాగే ఉంచుకోవాలి. ఉల్లిపాయ వాసన జుట్టుకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా షాంపూ చెయ్యాలి. మెరిసే జుట్టు కోసం పెరుగు కరివేపాకు మిశ్రమం కలిపి కూడా పెట్టుకోవచ్చు.

Black Cumin : రాత్రి వీటిని నీటిలో నానబెట్టి.. మరుసటి ఉదయం పరగడుపునే తినండి.. షుగర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు రావు..

Black Cumin : షుగర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో ఎక్కువవుతుంది.
ఇలాంటి అనారోగ్య సమస్యలన్నింటిని ఒక ఔషధంతో తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఔషధాన్ని వాడడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.

మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఈ ఔషధం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే ఈ ఔషధమే నల్ల జీలకర్ర. ఇది మనకు బయట మార్కెట్ లో లేదా ఆయుర్వేద షాపుల్లో విరివిరిగా లభిస్తుంది. ఆయుర్వేదంలో ఈ నల్ల జీలకర్రను అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

మన శరీరంలో జుట్టు నుండి పాదాల వరకు వచ్చే అనారోగ్య సమస్యలన్నింటిని తగ్గించడంలో ఈ నల్లజీలకర్ర మనకు సహాయపడుతుంది. ఈ నల్ల జీలకర్రలో విటమిన్ బి1, బి2 లతో పాటు క్యాల్షియం, ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.

ఇవే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలను కూడా ఈ నల్లజీలకర్ర కలిగి ఉంటుంది. అయితే ఈ నల్ల జీలకర్రను ఏవిధంగా తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని నల్ల జీలకర్రను నమిలి మింగాలి. నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

Black Cumin

ఈ నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఈ విధంగా నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఈ నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల నయం చేసుకోవచ్చు.

బీపీ నియంత్రిండంలో, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో, గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో.. ఇలా అనేక విధాలుగా ఈ నల్ల జీలకర్ర మనకు ఉపయోగపడుతుంది.

నల్లజీలకర్రను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తప్రసరణ చురుకుగా జరుగుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. నల్ల జీలకర్రతో చేసిన ఈ నీటిని తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. భయంకరమైన క్యాన్సర్ వ్యాధిన పడకుండా ఉంటాం. ఎముకలు ధృడంగా అవ్వడంతో పాటు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి కూడా తగ్గుతుంది.

అదేవిధంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో, నరాల బలహీనత వంటి సమస్యను తగ్గించడంలో కూడా ఈ నల్ల జీలకర్ర మనకు ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఈ నల్ల జీలకర్ర నీటిని ఇవ్వవచ్చు.

ఈ విధంగా నల్ల జీలకర్ర మనకు ఎంతో సహాయపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Hair Tips : ఎలాంటి రంగు వాడకుండా 5 నిమిషాలలో మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకోండి.!

Hair Tips : మనం చాలామందిలో జుట్టు తెల్లగా మారడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ తెల్ల జుట్టు అనేది వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. దానిని తగ్గించుకోవడం కోసం లేదా కవర్ చేయడం కోసం ఎన్నో రకాల ప్రోడక్ట్లను, ఆయిల్స్ ను, హెయిర్ కలర్స్ వినియోగిస్తూ ఉంటారు.
అయితే వాటిలో ఉండే కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల వెంట్రుకలను ఐదు నిమిషాలలో నల్లగా మార్చుకోండి ఇలా.. దానికోసం మొదటగా ఒక కప్పు ఎల్లిపాయలు పొట్టును తీసుకోవాలి. మనం బయట పడేసి వెల్లుల్లిపొట్టు వలన తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి.

ముందుగా ఒక ఇనప కడాయిని తీసుకొని దాంట్లో ఒక కప్పు ఎల్లిపాయ పొట్టు తర్వాత ఒక కప్పు గోరింటాకు కూడా వేసి అదంతా నల్లగా అయ్యేవరకు వేయించుకోవాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దింపి చల్లారే అంతవరకు ఉంచి తర్వాత దానిని పౌడర్లా చేసుకోవాలి. దానికోసం మిక్సీ వేయాల్సిన అవసరం ఉండదు గరిటెతో అటు ఇటు కదిపితే అది పౌడర్లా అవుతుంది. ఈ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఎంత పడుతుందో అంత దానిలో వేసుకొని ఒక చెంచా కాపీ పోవడానికి కూడా కలుపుకొని తర్వాత కొంచెం కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు మసాజ్ లాగా చేసుకోవాలి

తర్వాత ఒక గంట వరకు దానిని బాగా ఆరనివ్వాలి. తర్వాత గాడత తక్కువ గల షాంపూతో తల స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటికీ చెడిపోదు. అలాగే వారానికి ఒకసారి దీనిని పెట్టుకోవడం వలన మంచి రిజల్ట్ ఇస్తుంది. దీనిని అప్లై చేసుకున్న ప్రతిసారి ఒక గిన్నెలో ఒక చెంచా వేసి తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె బదులు అలోవెరా జెల్ ని కూడా కలుపుకోవచ్చు. ఏదైనా పెళ్లిళ్లకి శుభకార్యాలకి వెళ్లాలి అనుకున్న టైంలో అప్పటికప్పుడు ఈ చిట్కాని వాడుకోవచ్చు. లేదా వారానికి ఒకసారి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని వాడుకోవచ్చు. ఇది ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు…

*????రావణ రహస్యం…స్పెషల్ స్టోరీ…* ▪శ్రీలంక ప్రభుత్వం అనేక కమిటీలు ,పరిశోధనలు చేసి అధికార రాజముద్ర వేసి గుర్తించిన ప్రాంతాలు… అశోక వాటిక,రావణ గుహ సీతా జల, రాముసోలా (సంజీవిని పర్వతం) కొండ, కెలీనియా (విభీషణుని రాజభవనం), సీతా గోళీలు, రావణ గుహ …. *????ఫొటోలతో కూడిన విశేషాలు….* *????రావణ గుహ దగ్గర షూట్ చేసిన , రావణ గుహ రహస్య వివరణ వీడియోస్…*

Photo courtesy : Ramanjaneyulu Patrika 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Ravana Rahasyam
రావణ రహస్యం – శ్రీలంక ప్రభుత్వం అనేక కమిటీలు ,పరిఅహోదనలు చేసి అధికార రాజముద్ర వేసి గుర్తించిన ప్రాంతాలు…- అశోక వాటిక, రావణ గుహ,సీతా జల,హిమాలయ మట్టితో కూడిన రాముసోలా (సంజీవిని పర్వతం) అనే కొండ..కెలీనియా (విభీషణుని రాజభవనం), సీతా గోళీలు , రావణ గుహ ….విశేషాలు…మీ కోసం..

రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం..
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు…
2
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది..
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌… ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది…
3
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా..
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు… రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు… గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు..రా గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది..
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
4
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.

కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది…

ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్‌ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే  భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..

శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.

రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి.

హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో ………………………..
కాలమే సమాధానం.

రావణ గుహ…వీడియో

 రావణ రహస్యం వీడియో…తెలుగులో

Charana Paduka: అయోధ్య రాములోరికి అతి సూక్ష్మ స్వర్ణ పాదుకలు.. స్వర్ణకారుడి అపురూప సృష్టి

అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు సమయం సమీపిస్తుండడంతో.. ప్రపంచమంతా రామనామ స్మరణతో మారు మ్రోగుతోంది. రాముడిపై భక్తిని ప్రజలు వివిధ మార్గాల్లో చాటుకుంటున్నారు.
అయోధ్యలో కొలువుదీరనున్న బాల రాముడికి నల్లగొండ జిల్లాకు చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు బంగారు పాదుకులను రూపొందించారు
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన స్వర్ణకారుడు చొల్లేటి శ్రీనివాసచారి అతిచిన్న అయోధ్యలోని రాములోరికి పాదుకలను తయారు చేశారు. అయోధ్యలో చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 22న జరిగే బాలరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ, రామ మందిర ప్రారంభోత్సవ పుణ్యకార్యాన్ని పురస్కరించుకుని అతి చిన్న స్వర్ణ పాదుకులను తయారు చేశారు.
కేవలం 0.130 మిల్లీ గ్రాముల బంగారాన్ని వినియోగించి 8 మిల్లీ మీటర్‌ సైజు పొడవు, 4మిల్లీ మీటరు సైజు వెడల్పుతో రెండు పాదుకలను తయారు చేశాడు. వీటిని తయారు చేయడానికి కేవలం గంట మాత్రమే సమయం పట్టిందని స్వర్ణకారుడు శ్రీనివాసచారి చెబుతున్నాడు. శ్రీరాముడుపై ఉన్న భక్తితో తన కళను రామునికి అంకితం చేస్తూ ఈ స్వర్ణ పాదుకులను సమర్పించుకుంటున్నానని అన్నారు. కాగా గతంలో బతుకమ్మ, రాకెట్‌ నమూనా, జాతీయ పతాకం, శివలింగం, భారతదేశ పటం వంటి వాటిని అతి చిన్నసైజు పరిమాణంలో తయారు చేసి పలువురి మన్ననలు పొందాడు.

Hair Tips : ఈ కొబ్బరి చిప్ప జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు. మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Hair Tips : కొబ్బరి చిప్పలు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. కొబ్బరికాయలు కొట్టి వాటిలో కొబ్బరి తీసి చిప్పలని పడేస్తూ ఉంటారు అందరూ. అయితే ఈ చిప్పలు జుట్టును నల్లగా మారుస్తుంది.

ఇంకా ఎన్నో ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు అస్సలు వీటిని వదలరు.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…

ఈ కొబ్బరి శాస్త్రీయ నామం “కోకాస్ న్యూ సిపెర”ప్రతి జాతిలో ఇదొక్కటే జాతి ఉంటుంది. ఇది వరల్డ్ వైస్ గా విస్తరించి ఉంది. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతూ ఉంటుంది. కొబ్బరికాయ రూపంలో చెట్లనుంచి వస్తూ ఉంటాయి. హిందువులకు ఇది ప్రధానమైన పూజ ద్రవ్యంలో ఉపయోగపడుతుంది. దీనినే టెంకాయ అని కూడా అంటూ ఉంటారు. దీనిని ఎన్నో రకాల ఆహార పదార్థాలలో వాడుతూ ఉంటారు.
కొబ్బరి చెట్లను నుంచి రకరకాల పదార్థాలు అనేక రకమైన పద్ధతులను వాడుతూ ఉంటారు. అయితే కొబ్బరి తిన్న తర్వాత దాని చిప్పను పడేస్తూ ఉంటారు. అయితే వయసుతో సంబంధం లేకుండా అందరూ దీన్ని చేస్తూ ఉంటారు. కానీ కొబ్బరి చిప్ప లో ఉండే ప్రయోజనాలు తెలిస్తే దానిని అస్సలు వదలరు.. ఎన్నో రకాల సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సహజంగా కొబ్బరికాయ చిప్పను చెత్తలో పడేస్తూ ఉంటారు. అయితే అందులో ఉండే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇకపై చిన్న ముక్క కూడా వదలము. కొబ్బరి పెంకెను ఏ విధంగా ఉపయోగించాలి. మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం చూద్దాం…కొబ్బరి టెంక ఉపయోగాలు : కొబ్బరి చిప్పను వాడడం వలన గాయం వాపు తగ్గిపోతుంది.
కొబ్బరి చిప్పను రోజు ఉపయోగించడం వలన దంతాల మీద ఉన్న పసుపు మరకలు పోతాయి. దీనికోసం ముందుగా కొబ్బరి పీచును కాల్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొద్ది కొద్దిగా సోడాతో కలిపి దంతాలు తప్పకుండా రోజు రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. కొబ్బరి చిప్పను గ్రైండ్ చేసి పసుపు పొడిని కలిపి గాయమైన చోటులో పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి చిప్పను మెత్తగా నూరి ఆ పొడిని రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో కలిపి తీసుకోవడం వలన ఫైల్స్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. బాణలిలో కొబ్బరి చిప్పను వేడి చేయండి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు నల్లగా తయారవుతుంది.

Fenugreek Leaves : చలికాలంలో మెంతి ఆకులను తినడం మరిచిపోకండి.. ఎందుకో తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుని తింటారు..!

Fenugreek Leaves : మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ అనేక రకాల ఆకుకూరలు అందుబాటులో ఉంటాయి. ఎవరి అభిరుచులను బట్టి వారు ఆకుకూరలను కొని వండుకుని తింటుంటారు.
అయితే మనం తినే ఆకుకూరల్లో మెంతి కూర కూడా ఒకటి. ఇది కాస్త చేదుగా ఉంటుంది. అందువల్ల దీన్ని సాధారణంగా చాలా మంది తినరు. కానీ దీన్ని వంటల్లో మాత్రం వేస్తుంటారు. కొత్తిమీర లేదా కరివేపాకులా కాస్త తక్కువ మోతాదులో మెంతి ఆకులను వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే మెంతి ఆకులను చలికాలంలో మాత్రం తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. ఇక మెంతి ఆకులను ఈ సీజన్‌లో తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి ఆకుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేందుకు సహాయ పడుతుంది. అలాగే మెంతి ఆకుల్లో కాల్షియం, విటమిన్ సి, ఎ, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల మెంతి ఆకులను తినడం వల్ల మనకు పోషణ లభిస్తుంది. పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. ఇక చలికాలంలో మన జీర్ణవ్యవస్థ పనితీరు సహజంగానే మందగిస్తుంది. దీంతో పలు రకాల జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే మలబద్దకం కూడా వస్తుంది. అయితే మెంతి ఆకులను చలికాలంలో తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం అన్న మాటే ఉండదు. రోజూ ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది. కనుక మెంతి ఆకులను తప్పక తినాలి.
ఈ ఆకులను నేరుగా తినలేని వారు రోజూ ఉదయాన్నే జ్యూస్ చేసి 30 ఎంఎల్ మోతాదులో పరగడుపునే తాగవచ్చు. దీనివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మెంతి ఆకులను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. కనుక మెంతి ఆకులను చలికాలంలో తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పోషణ కూడా లభిస్తుంది.

Drinking Water Tips: నీరుని ఈ సమయంలో అస్సలు తాగకూడదు.. తాగారో జీర్ణ సమస్య, ఊబకాయం వస్తుంది!

Drinking Water Tips, Do not drink water while taking food: ఈ భూ ప్రపంచంలోని ప్రతి జీవికి అత్యంత అవసరమైన పదార్థం ‘నీరు’. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజూ 4-5 లీటర్ల నీరు త్రాగడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇదే నీరు మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసి.. వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.
నిజానికి నీటిని సరైన పద్దతిలో తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదు. సక్రమంగా తాగకపోవడం వల్లనే మనం అనారోగ్యానికి గురవుతాం. త్రాగే నీటికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు ఓసారి తెలుకుందాం.

సరిగా జీర్ణం కాదు:
చాలా మంది ఆహారం తీసుకునేటప్పుడు.. నీరు తాగుతూనే ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. మనం తింటున్నప్పుడు మన జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటుంది.

దాంతో తీసుకున్న ఆహారాన్ని ఏకకాలంలో జీర్ణం చేస్తుంది. ఆహారంతో పాటు నీరు తీసుకుంటే.. అప్పుడు జీర్ణవ్యవస్థలో ఆటంకం ఏర్పడుతుంది. పొట్టలోని ఆహారం సరిగా జీర్ణం కాదు.

గుండెల్లో మంట:
ఆహారంతో పాటు నీటి ఎక్కువగా తీసుకుంటే.. గ్యాస్-ఎసిడిటీ, పుల్లని బెవులు వస్తాయి. అంతేకాదు యాసిడ్ రిలాక్సేషన్‌కు దారితీస్తుంది.
దీని కారణంగా గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల పొట్టలో కొవ్వు క్రమక్రమంగా పెరుగుతుంది.

15-30 నిమిషాల తర్వాత:
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయాలంటే.. ఏదైనా తిన్న 15-30 నిమిషాల తర్వాత నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు. అప్పటిలోగా ఆహారం చాలా వరకు జీర్ణమవుతుంది.
15-30 నిమిషాల తర్వాత కూడా చల్లటి నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా జీర్ణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదు.

గోరు వెచ్చని నీరు:
ఆహారం గొంతులో చిక్కుకుపోతుందనే భయం లేదా కారం అవుతదని నీటిని పక్కనే ఉంచుకుంటాం.
అయితే చల్లని నీరు కాకుండా గోరు వెచ్చని నీళ్లను పెట్టుకోవడం మంచిది. అత్యవసర సమయంలో ఆ నీటిని ఉపయోగించవచ్చు. అలా చేస్తే జీర్ణక్రియ ప్రక్రియకు ఎలాంటి హాని ఉండదు.

Blackheads : కేవలం 5 నిమిషాల్లోనే బ్లాక్ హెడ్స్‌ను నిర్మూలించే అద్భుతమైన చిట్కా.. ఇలా చేయాలి..!

Blackheads : మనలో చాలా మందిని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
ఇవి ఎక్కువగా ముక్కు, నుదురు, ఛాతీ, గడ్డం, బుగ్గలు, తొడలు, పిరుదుల వంటి భాగాల్లో ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్న వారిలో, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఉన్న వారిలో, యువతలో ఈ సమస్య కనిపిస్తుంది.

చర్మం పై ఉండే ధూళి, దుమ్ము, మలినాలు చర్మంపై ఉండే నూనెతో కలిసి బ్లాక్ హెడ్స్ గా మారతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తనప్పటికి వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

మార్కెట్ లో దొరికే ఫేస్ వాష్ లను, స్క్రబర్లను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఫలితం లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.

బ్లాక్ హెడ్స్ ను తొలగించే చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో తెల్లగా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

తరువాత ఇందులో 6 నుండి 7 చుక్కల నిమ్మరసాన్ని వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. తరువాత సున్నితంగా ఉండే బ్రష్ తో 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసిన తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొనను తీసుకుని బాగా కలపాలి. టూత్ పేస్ట్ తో స్క్రబ్ చేసుకున్న తరువాత తెల్లసొనను బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. తరువాత ఇందులో దూదిని ముంచి బ్లాక్ హెడ్స్ పై ఉంచి అతికించి ఉంచాలి.

తరువాత ఈ దూదిపై మరికొద్దిగా తెల్లసొనను రాయాలి. తరువాత దూది పూర్తిగా ఆరిపోయే వరకు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత దూదిని నెమ్మదిగా తొలగించాలి.

ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వారానికి రెండు సార్లు చేయాలి.

ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Boiled Banana: అరటిపండు ఉడకబెట్టుకుని తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయ్

మీరు అరటి పండు ఎలా తింటున్నారు? అదేం ప్రశ్న తొక్క తీసుకుని తింటామని చెప్తారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. అదేంటో తెలుసా..?
అరటిపండుని బాగా ఉడకబెట్టుకుని తినడం. అదేమీ కఠినమైన పదార్థం కాదు కదా ఉడకబెట్టడానికి మెత్తగానే ఉంటుంది కదా అని కొందరు అనుకుంటారేమో. కానీ అరటిపండు ఉడకబెట్టుకుని తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు.

అరటిపండుని దాని తొక్కతో సహా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకబెట్టడం వల్ల అవి మరింత మృదువుగా, టీపీగా, క్రీమ్ గా మారిపోతుంది. దాంట్లో పీనట్ బటర్, తేనె, దాల్చిన చెక్క పొడి వంటి వాటిని వేసుకుని తింటే అద్భుతంగా ఉందని చెప్తున్నారు.

అన్నట్టు మీకో విషయం తెలుసా మన దేశంలో తొక్క తీసి అరటి పండు తింటారేమో కానీ వివిధ దేశాలలో తొక్కతో సహా వాటిని ఉడకబెట్టి రకరకాల వంటల్లో వేసుకుంటారు.

థాయ్ సంస్కృతిలో ఉడికించిన అరటిపండ్లను మెత్తగా చేసి కొబ్బరి పాలతో కలిపి క్లూయ్ బూట్ చి అనే డెజర్ట్ తయారు చేస్తారు. అది అక్కడ చాలా ఫేమస్. ఇతర ప్రాంతాల్లో ఉడకబెట్టిన అరటిపండ్లను బనానా బ్రెడ్ తయారుచేయడానికి ఉపయోగిస్తారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్. ఉడికించిన అరటిపండు అల్పాహారంగా లేదా డెజర్ట్ గా తీసుకున్నా అందులోని కేలరీల్లో మాత్రం ఎ మాత్రం మార్పు ఉండదు.

పోషకాలు పెరుగుతాయా?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటిపండుని ఉడకబెట్టడం వల్ల దానిలోని పోషకాల లభ్యత పెరుగుతుంది. అందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి మరింత త్వరగా అందుతాయి. ఉడకబెట్టడం వాళ్ళ అందులోని పిండి పదార్థాలు పెరుగుతాయి. శక్తిని అందిస్తుంది.

అంతే కాదు అరటిపండు ఉడకబెట్టింది తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు. ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి వెచ్చదనం, విశ్రాంతిని ఇస్తుంది. అదనంగా తీపి తినాలనే కోరికలను తగ్గిస్తుంది.

ఎందుకు ఉడకబెట్టాలి?

అరటిపండ్లు ఉడకబెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వాటి ఆకృతి, రుచి మారుస్తుంది. మృదువుగా మారిపోతాయి. నమలడం, మింగడం సులభం అవుతుంది. ఉడకబెట్టడం వల్ల వేడి కారణంగా అందులోని సహజ చక్కెరలని విచ్చిన్నం చేస్తుంది. ఇది పచ్చి అరటిపండ్ల కంటే తియ్యగా ఉంటుంది.

ప్రయోజనాలు..

అరటిపండ్లు ఉడకబెట్టడం వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే సులభంగా జీర్ణంఅవుతుంది. పచ్చి అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణం కావడం కష్టతరం చేస్తుంది.

ఉడకబెట్టడం వల్ల ఫైబర్ విచ్చిన్నమవుతుంది. దీని వల్ల పండులోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత సహాయపడుతుంది.

చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఉడికించిన అరటిపండు మలబద్ధకం లేదా దగ్గుతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుందని నమ్ముతారు.

అలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉడకబెట్టిన అరటిపండు అతిసారం చికిత్సకి ఉపయోగిస్తారు.

Eye glasses cleaning tips: మీ కళ్లజోడుపై గీతలు, మరకలు పడ్డాయా? ఈ 4 టిప్స్ నిమిషాల్లో మెరిసిపోతుందట..

Eye glasses cleaning tips: అద్దాలు (Glasses) ఉపయోగించడం అనేది కొంతమంది వ్యక్తులకు అవసరం, అయితే కొంతమంది వాటిని స్టైలిస్ట్‌గా కనిపించడానికి మాత్రమే ఉపయోగిస్తారు.
ప్రస్తుతం వేసవి కాలం (Summer) ప్రారంభం కావడంతో ఎండ వేడిమిని తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కూడా సన్ గ్లాసెస్ ధరించడం మర్చిపోరు. అటువంటి సందర్భాలలో, తరచుగా ఉపయోగించడం వల్ల, కొన్నిసార్లు గీతలు అద్దాలపై పడతాయి
గీతలు కొన్నిసార్లు అద్దాల ద్వారా దృష్టిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీ అద్దాలు కూడా గీతలు పడి ఉంటే, ఇక్కడ మేము కొన్ని సాధారణ చిట్కాలను చెబుతున్నాము, వీటిని ఉపయోగించి మీరు చిటికెలో గీతలను కూడా తొలగించవచ్చు
గాజు గ్లాస్‌పై చాలా గీతలు ఉంటే, దాని వల్ల స్పష్టంగా కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అద్దాలపై ఉన్న గుర్తులు తీయకుంటే సమస్య వచ్చి చివరకు ఇష్టం లేకపోయినా అద్దాలు విరమించుకుని కొత్త గాజులు కొనుక్కోవాల్సి వస్తుంది.
అటువంటి పరిస్థితిలో, కొన్ని సాధారణ చిట్కాలను ఉపయోగించడం మీకు సహాయకరంగా ఉంటుంది. కాబట్టి అద్దాలపై ఉన్న గుర్తులను తొలగించడానికి సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.

టూత్ పేస్ట్..

మీరు టూత్‌పేస్ట్ సహాయంతో అద్దాలపై గీతలు సులభంగా తొలగించవచ్చు. ఇది చేయుటకు, మీరు మృదువైన శుభ్రమైన గుడ్డపై టూత్‌పేస్ట్ తీసుకోవాలి.
ఇప్పుడు గ్లాసుల లెన్స్‌పై అప్లై చేసి గుడ్డతో సున్నితంగా రుద్దండి. ఇలా చేయడం వల్ల గ్లాసెస్ మార్క్స్ క్షణాల్లో మాయమై, మీ అద్దాలు కొత్తగా కనిపిస్తాయి.

బేకింగ్ సోడా..
మీరు అద్దాలపై గీతలు తొలగించడానికి బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను గ్లాసులపై అప్లై చేసి మెత్తని గుడ్డతో మెత్తగా తుడవండి. ఇది క్రమంగా అద్దాల నుండి గీతలు తొలగిస్తుంది.

విండ్‌షీల్డ్ వాటర్ రిపెల్లెంట్..
కారు అద్దాలను పాలిష్ చేయడానికి సాధారణంగా విండ్‌షీట్ వాటర్ రిపెల్లెంట్‌ను ఉపయోగిస్తారు. కానీ మీరు గ్లాసులను శుభ్రం చేయడానికి విండ్‌షీల్డ్ వాటర్ రిపెల్లెంట్‌ని కూడా ఉపయోగించవచ్చు.

డిష్ సోప్..
డిష్ సోప్ ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు, మీరు మీ కళ్లజోడును కూడా శుభ్రం చేయడానికి వస్తువును ఉపయోగించవచ్చు. లెన్స్‌లపై డిష్ సోప్‌ను సున్నితంగా రుద్దడానికి మీ చేతివేళ్లను ఉపయోగించండి.

ఆ తరువాత మృదువైన టవల్ తో శుభ్రం చేయండి. మీరు సిట్రస్ ఆధారిత డిష్ సబ్బును ఉపయోగించకుండా చూసుకోండి. వాటిలోని అసిడిక్ కంటెంట్ మీ అద్దాలను మరింత దిగజార్చుతుంది.

White Hair: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలా..? వీటిని అతిగా తీసుకోవడమే అందుకు కారణం.. అవేమిటంటే..?

White Hair: మారిన జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలతో పెరిగిన ఒత్తిడి కారణంగా.. జుట్టు తెల్లబడడం, రాలడం, చుండ్రు అనేవి సర్వసాధారణ కేశ సమస్యలుగా మారాయి.
అయితే ఒత్తిడి లేకపోయినా లేదు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే అందుకు మనం తినే ఆహారమే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అవును, వృద్ధాప్యానికి సంకేతమైన తెల్ల జుట్టు మనం తినే ఆహారం కారణంగానే మొదలవుతుంది.

కొన్ని రకాల ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందని కేశ నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఆ ఆహారాలు జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా వివరించారు. మరి ఏయే ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కూల్ డ్రింక్స్: చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడానికి కూల్ డ్రింక్స్ ఒక కారణం. ఎందుకంటే ఈ డ్రింక్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే సోడా, చక్కెర.. జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లను శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మీ జుట్టు త్వరగా తెల్లబడుతుంది.

చక్కెర: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తినేవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. చిన్నవారిలో కూడా వెంట్రుకలు వేగంగా తెల్లగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, నల్లబడేందుకు విటమిన్ ఇ ఎంతగానో అవసరం.

అయితే చక్కెర ఎక్కువగా తీసుకుంటే దాంతో శరీరం విటమిన్ ఇ ని గ్రహించలేదు. ఆ కారణంగా జుట్టు త్వరగా తెల్లగా అవుతుంది.

మోనోసోడియం గ్లూటమేట్: మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తరచూ ఎక్కువగా తీసుకున్నా కూడా వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి.

ఎందుకంటే ఈ మోనోసోడియం గ్లూటమేట్ మన శరీర మెటబాలిజం ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాక జుట్టు సమస్యలను కూడా కలిగిస్తుంది.

ఉప్పు: ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా జుట్టు తెల్లబడుతుంది. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాలు నియంత్రణ కోల్పోతాయి.

ఆ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరితే జుట్టు సమస్యలే కాదు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.

Tingling : చేతులు, కాళ్లలో వచ్చే తిమ్మిర్లను పోగొట్టే.. అద్భుతమైన చిట్కా..!

Tingling : మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.
నేటి తరుణంలో మనలో చాలా మంది అరికాళ్లు, అరి చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, అలాగే కండరాలు పట్టుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్ద వారిలోనే కాకుండా నడి వయస్కుల్లో కూడా మనం సమస్యను గమనించవచ్చు. ఇటువంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం రక్తనాళాలు బలహీనంగా మారడమే. రక్తనాళాలు బలహీనంగా మారిన చోట రక్తసరఫరా తగ్గుతుంది. రక్తసరఫరా తగ్గడం వల్ల వెంటనే ఆ ప్రదేశంలో తిమ్మిర్లు రావడం, సూదితో గుచ్చినట్టు ఉండడం, పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది.
ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఒక చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలతో గసగసాలను కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. క్యాల్షియం లోపం తలెత్తకుండా చేయడంలో, ఎముకలను ధృడంగా మార్చడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా మార్చడంలో ఇలా అనేక రకాలుగా పాలు మనకు దోహదపడతాయి. అలాగే గసగసాల్లో ఒమెగా 3, ఒమెగా 6, క్యాల్షియం, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. గసగసాలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గసగసాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, వాపులు వంటి సమస్యలు తగ్గుతాయి. గసగసాల పాలను తీసుకోవడం వల్ల మతిమరుపు, రక్తపోటు, శరీరంలో బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పాలను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాలను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు, ఒక టీ స్పూన్ గసగసాలు వేసి పాలను వేడి చేయాలి. ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడిని వేయాలి. పంచదారను మాత్రం ఉపయోగించకూడదు.

ఈ పాలను మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాలను పడుకోవడానికి అర గంట ముందు తాగి నిద్రపోవాలి. ఇలా ఈ పాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, నరాలల్లో వాపులు, అరికాళ్లల్లో మంటలు, తిమ్మిర్లు వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎముకలు, నరాలు బలంగా తయారవుతాయి. ఈ పాలను తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా గసగసాల పాలను తాగడం వల్ల మనం అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Fever In Kids : మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తుందా.. ఈ సూచనలు పాటిస్తే ఇక జ్వరం రాదు..!

Fever In Kids : ప్రస్తుత కాలంలో చంటి పిల్లలు ఎక్కువగా తరుచూ జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు.
జ్వరం వచ్చినప్పుడల్లా వారు రెండు నుండి మూడు కిలోల బరువు తగ్గిపోతున్నారు. జ్వరం నుండి కోలుకుని మరలా కొద్దిగా కండ పట్టేసరికి మరలా జ్వరం వచ్చి బలహీనంగా అయిపోతున్నారు. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా పిల్లలకు సరిగ్గా నిద్ర ఉండదు. వారి వల్ల తల్లి దండ్రులకు కూడా నిద్ర సరిగ్గా ఉండదు. అలాగే జ్వరం వచ్చినప్పుడల్లా వేలకు వేలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలా మంది పిల్లల్లో ఎన్ని మందులు వాడినప్పటికి ఇలా జ్వరం, జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూనే ఉంటారు. అయితే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్ కు వెళ్లే అవసరం లేకుండా కొన్ని చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా పిల్లల్లో వచ్చే జ్వరం, ఇన్పెక్షన్ లు తగ్గేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే, వారికి కొద్దిగా నలతగా ఉన్న వెంటనే తల్లి దండ్రులు వెంటనే మందులు వేసేస్తూ ఉంటారు. ఇదే మనం చేసే అతి పెద్ద తప్పని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారికి జ్వరం వచ్చినప్పుడు పాలు తాగాలి అనిపించదు. ఆహారం తీసుకోవాలని అనిపించదు. కానీ పిల్లలకు బలవంతంగా పాలు తాగించాలని, ఆహారం ఇవ్వాలని చూస్తూ ఉంటారు. ఇది మనం చేసే రెండు తప్పని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ లు రాగానే వెంటనే మందులు ఇవ్వకూడదు. చంటి పిల్లలకైనా సరే ఇలా వెంటనే మందులు ఇవ్వడం మంచి కాదు. అలాగే వారికి బలవంతంగా పాలు తాగించడానికి, ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించవద్దు. వారికి ఆకలి వేసినప్పుడు వారే ఆహారాన్ని తీసుకుంటారు. ఇలా జ్వరం వచ్చినప్పుడు పాలకు బదులుగా కాచి చల్లార్చిన నీళ్లను తాగించడానికి ప్రయత్నం చేయాలి.
చాలా మంది చంటి పిల్లలకు, చిన్న పిల్లలకు నీటిని తాగించడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని చంటి పిల్లలకు, చిన్న పిల్లలకు నీటిని తాగించవచ్చని నీటిని తాగించడం వల్ల శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలు తాగని పిల్లలకు విరోచనం సులభంగా అవ్వదు. అలాంటి పిల్లలకు నీటిని తాగించడం వల్ల విరోచనం సులభంగా అవుతుంది. కనుక పిల్లలకు నీటిని తాగించడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా జ్వరంతో బాధపడే పిల్లలకు కాచి చల్లార్చిన నీటిలో తేనె కలిపి రోజుకు 5 నుండి 6 సార్లు పట్టించాలి. ఇలా పాలు తాగించకుండా నీటిని తాగించడం వల్ల పొట్టకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరం దానంతట అదే యాంటీ బాడీస్ ను తయారు చేసుకుంటుంది.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ కు కారణమైన క్రిములను యాంటీ బాడీస్ నశింపజేస్తాయి. దీంతో 3రోజుల పాటు ఇబ్బందిపెట్టే జ్వరం కూడా ఒక్క రోజులో తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక రోజు పాటు లంకనం పెట్టడం వల్ల పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, కఫం వంటి సమస్యల నుండి సత్వర ఫలితం కలుగుతుందని, అలాగే వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం నుంచి ఉచిత ఇల్లు.. ఇలా పొందండి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 25, జూన్, 2015న ప్రారంభించింది. ఈ పథకం కింద ఇళ్లు లేని వారు..

ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకు కొన్ని అర్హతలు ఉండాలి. మీకు ఆ అర్హతలు ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాను rhreporting.nic.in పోర్టల్‌లో చూడవచ్చు. ఈ పథకం కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

PMAY ప్రయోజనం ఏమిటి?

దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, సొంత ఇల్లు నిర్మించుకోలేని వారు, ఈ పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని అర్హతలను నిర్ణయించారు. వాటిని పరిశీలిద్దాం.

PMAY కోసం అర్హతలు:
దరఖాస్తుదారు తప్పనిసరిగా కింది వాటిలో ఏదైనా అర్హత కలిగివుండాలి.

– ఇల్లు లేని కుటుంబం అయివుండాలి. ఒకటి లేదా రెండు గదులు, కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు.

– 25 ఏళ్లు పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబం.

– 16 నుండి 59 సంవత్సరాల వయస్సులో వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబం.

– 16, 59 సంవత్సరాల మధ్య వయోజన సభ్యులు లేని కుటుంబం.

– సామర్థ్యం ఉన్న సభ్యులు లేని కుటుంబాలు, వికలాంగ సభ్యులు ఉన్నవారు.

– భూమిలేని కుటుంబాలు, సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్నవారు.

– షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు, మైనారిటీలు.

దరఖాస్తుదారు ఈ కింది అర్హతలను కూడా కలిగి ఉండాలి:

– దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి.

– దరఖాస్తుదారుకు శాశ్వత ఇల్లు ఉండకూడదు.

– దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాల వయస్సు పరిమితిని దాటి ఉండాలి.

– దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం రూ.03 లక్షల నుంచి రూ.06 లక్షల మధ్య ఉండాలి.

– దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితాలో ఉండాలి.

– దరఖాస్తుదారు ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన యొక్క అవసరమైన పత్రాలు:

మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ఈ కింది పత్రాలను కలిగి ఉండాలి.

– ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నంబర్

– మీ ఫొటో
– లబ్ధిదారుని జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నంబర్

– బ్యాంకు పాస్ బుక్

– స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) నమోదు సంఖ్య

– మొబైల్ నంబర్

PMAY కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కోసం ఇంటి దగ్గరే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోతే, మీరు ఏదైనా ప్రజా సేవా కేంద్రానికీ లేదా మీసేవా కేంద్రానికీ లేదా బ్లాక్ లేదా గ్రామ అధిపతి దగ్గరకు వెళ్లి పైన ఇచ్చిన అన్ని పత్రాలతో వెళ్లవచ్చు. మీరు హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ కింది విధంగా ఉంటుంది.
ముందుగా మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ (https://pmaymis.gov.in)ను సందర్శించాలి. ఆ తరువాత, వెబ్‌సైట్ యొక్క ప్రధాన పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు మెనూ బార్‌లో ఉన్న మూడు పైలను చూస్తారు, దానిపై క్లిక్ చేయండి, ఆపై కొన్ని ఆప్షన్లు జాబితా రూపంలో మీ ముందు కనిపిస్తాయి. వాటిలో మీరు “Awaassoft”పై క్లిక్ చేయాలి, ఆ తర్వాత మరొక జాబితా ఓపెన్ అవుతుంది. అందులో మీరు “డేటా ఎంట్రీ”పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత, ఒక పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు “DATA ENTRY FOR AWAAS”ను ఎంచుకోవాలి.

అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకుని, “కొనసాగించు” బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆపై మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా (captcha)ను నమోదు చేసి, “లాగిన్” బటన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత “బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం” మీ ముందు ఓపెన్ అవుతుంది.
అందులో మీరు మొదటి విభాగంలో మీ “వ్యక్తిగత వివరాల”కి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి.

అప్పుడు మీరు రెండవ విభాగంలో “బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు” పూరించాలి.

తర్వాత మూడవ విభాగంలో మీరు జాబ్ కార్డ్ నంబర్, స్వచ్ఛ్ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్ (SBM నంబర్) వంటి “బెనిఫిషియరీ కన్వర్జెన్స్ వివరాల” సమాచారం నమోదు చేయాలి.

బ్లాక్ ద్వారా పూరించే నాల్గవ విభాగంలో, మీరు “కన్సర్న్ ఆఫీస్ ద్వారా పూరించిన వివరాలు”కి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి.

ఈ విధంగా మీరు బ్లాక్ లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా PM ఆవాస్ యోజన ఫారమ్‌ను పూరించవచ్చు. ఆ తర్వాత లబ్దిదారుల జాబితాను rhreporting.nic.in పోర్టల్‌లో చూడవచ్చు.

Health

సినిమా