Blackheads : కేవలం 5 నిమిషాల్లోనే బ్లాక్ హెడ్స్‌ను నిర్మూలించే అద్భుతమైన చిట్కా.. ఇలా చేయాలి..!

Blackheads : మనలో చాలా మందిని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
ఇవి ఎక్కువగా ముక్కు, నుదురు, ఛాతీ, గడ్డం, బుగ్గలు, తొడలు, పిరుదుల వంటి భాగాల్లో ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్న వారిలో, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఉన్న వారిలో, యువతలో ఈ సమస్య కనిపిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

చర్మం పై ఉండే ధూళి, దుమ్ము, మలినాలు చర్మంపై ఉండే నూనెతో కలిసి బ్లాక్ హెడ్స్ గా మారతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తనప్పటికి వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

మార్కెట్ లో దొరికే ఫేస్ వాష్ లను, స్క్రబర్లను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఫలితం లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

Related News

ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.

బ్లాక్ హెడ్స్ ను తొలగించే చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో తెల్లగా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

తరువాత ఇందులో 6 నుండి 7 చుక్కల నిమ్మరసాన్ని వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. తరువాత సున్నితంగా ఉండే బ్రష్ తో 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసిన తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొనను తీసుకుని బాగా కలపాలి. టూత్ పేస్ట్ తో స్క్రబ్ చేసుకున్న తరువాత తెల్లసొనను బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. తరువాత ఇందులో దూదిని ముంచి బ్లాక్ హెడ్స్ పై ఉంచి అతికించి ఉంచాలి.

తరువాత ఈ దూదిపై మరికొద్దిగా తెల్లసొనను రాయాలి. తరువాత దూది పూర్తిగా ఆరిపోయే వరకు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత దూదిని నెమ్మదిగా తొలగించాలి.

ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వారానికి రెండు సార్లు చేయాలి.

ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News