Black Hair : తెల్ల జుట్టును చాలా త్వరగా నల్లగా మార్చుకోవచ్చు.. మళ్లీ జుట్టు తెల్లగా మారదు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Black Hair : మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం మనల్ని అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యల బారిన పడేలా చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
జుట్టు రాలడం, జుట్టు తెల్ల బడడం, జుట్టు పొడి బారడం, జుట్టు చిట్లడం వంటి అనేక జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం అనేక రకాల హెయిర్ స్ప్రేలను, హెయిర్ ప్యాక్ లను వాడుతూ ఉంటాం. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల మనం చక్కటి జుట్టును సొంతం చేసుకోవచ్చు. వారినికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల మన జుట్టు అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

ఈ చిట్కాను వాడడం వల్ల నెలరోజుల్లోనే జుట్టు పెరుగుదలలో వచ్చిన మార్పును చూడవచ్చు. అలాగే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక కళాయిలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో 2 టీ స్పూన్ల ఉసిరి పొడిని వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో సహజసిద్ధమైన హెన్నా పౌడర్ ను 2 టీ స్పూన్ల మోతాదులో వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల శీకాయ పొడిని వేసి కలపాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల గుంటగలగరాకు పొడిని, 2 టీ స్పూన్ల మందార పువ్వుల పొడిని వేసి కలపాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే దీనిని జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ను నూనె రాసిన జుట్టు మీద వేసుకోకూడదు. హెయిర్ ప్యాక్ వేసుకున్న ఒక గంట తరువాత ఎటువంటి షాంపూ ఉపయోగించకుండా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టును పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత జుట్టుకు మనం తరచూ ఉపయోగించే నూనెను బాగా పట్టించి నూనె ఇంకేలా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసిన మరుసటి రోజూ ఉదయం షాంపుతో తలస్నానం చేయాలి. ఈ చిట్కా తయారీలో ఉపయోగించిన పొడులన్నీ మనకు ఆయుర్వేద షాపుల్లో లేదా ఆన్ లైన్ లో లభ్యమవుతాయి. వారినికి ఒకసారి ఈ చిట్కాను వాడడం వల్ల సమస్యలు తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు కాంతివంతంగా కూడా తయారవుతుంది.

Related News

Related News