Charana Paduka: అయోధ్య రాములోరికి అతి సూక్ష్మ స్వర్ణ పాదుకలు.. స్వర్ణకారుడి అపురూప సృష్టి

అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు సమయం సమీపిస్తుండడంతో.. ప్రపంచమంతా రామనామ స్మరణతో మారు మ్రోగుతోంది. రాముడిపై భక్తిని ప్రజలు వివిధ మార్గాల్లో చాటుకుంటున్నారు.
అయోధ్యలో కొలువుదీరనున్న బాల రాముడికి నల్లగొండ జిల్లాకు చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు బంగారు పాదుకులను రూపొందించారు
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన స్వర్ణకారుడు చొల్లేటి శ్రీనివాసచారి అతిచిన్న అయోధ్యలోని రాములోరికి పాదుకలను తయారు చేశారు. అయోధ్యలో చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 22న జరిగే బాలరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ, రామ మందిర ప్రారంభోత్సవ పుణ్యకార్యాన్ని పురస్కరించుకుని అతి చిన్న స్వర్ణ పాదుకులను తయారు చేశారు.
కేవలం 0.130 మిల్లీ గ్రాముల బంగారాన్ని వినియోగించి 8 మిల్లీ మీటర్‌ సైజు పొడవు, 4మిల్లీ మీటరు సైజు వెడల్పుతో రెండు పాదుకలను తయారు చేశాడు. వీటిని తయారు చేయడానికి కేవలం గంట మాత్రమే సమయం పట్టిందని స్వర్ణకారుడు శ్రీనివాసచారి చెబుతున్నాడు. శ్రీరాముడుపై ఉన్న భక్తితో తన కళను రామునికి అంకితం చేస్తూ ఈ స్వర్ణ పాదుకులను సమర్పించుకుంటున్నానని అన్నారు. కాగా గతంలో బతుకమ్మ, రాకెట్‌ నమూనా, జాతీయ పతాకం, శివలింగం, భారతదేశ పటం వంటి వాటిని అతి చిన్నసైజు పరిమాణంలో తయారు చేసి పలువురి మన్ననలు పొందాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Related News