Tingling : చేతులు, కాళ్లలో వచ్చే తిమ్మిర్లను పోగొట్టే.. అద్భుతమైన చిట్కా..!

Tingling : మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.
నేటి తరుణంలో మనలో చాలా మంది అరికాళ్లు, అరి చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, అలాగే కండరాలు పట్టుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్ద వారిలోనే కాకుండా నడి వయస్కుల్లో కూడా మనం సమస్యను గమనించవచ్చు. ఇటువంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం రక్తనాళాలు బలహీనంగా మారడమే. రక్తనాళాలు బలహీనంగా మారిన చోట రక్తసరఫరా తగ్గుతుంది. రక్తసరఫరా తగ్గడం వల్ల వెంటనే ఆ ప్రదేశంలో తిమ్మిర్లు రావడం, సూదితో గుచ్చినట్టు ఉండడం, పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది.
ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఒక చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలతో గసగసాలను కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. క్యాల్షియం లోపం తలెత్తకుండా చేయడంలో, ఎముకలను ధృడంగా మార్చడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా మార్చడంలో ఇలా అనేక రకాలుగా పాలు మనకు దోహదపడతాయి. అలాగే గసగసాల్లో ఒమెగా 3, ఒమెగా 6, క్యాల్షియం, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. గసగసాలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గసగసాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, వాపులు వంటి సమస్యలు తగ్గుతాయి. గసగసాల పాలను తీసుకోవడం వల్ల మతిమరుపు, రక్తపోటు, శరీరంలో బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పాలను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాలను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు, ఒక టీ స్పూన్ గసగసాలు వేసి పాలను వేడి చేయాలి. ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడిని వేయాలి. పంచదారను మాత్రం ఉపయోగించకూడదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఈ పాలను మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాలను పడుకోవడానికి అర గంట ముందు తాగి నిద్రపోవాలి. ఇలా ఈ పాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, నరాలల్లో వాపులు, అరికాళ్లల్లో మంటలు, తిమ్మిర్లు వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎముకలు, నరాలు బలంగా తయారవుతాయి. ఈ పాలను తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా గసగసాల పాలను తాగడం వల్ల మనం అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Related News