వనవాస కాలంలో రాముడు తిన్న ఆహారం..? ఈ దుంప ప్రయోజనాలు ఆరోగ్యానికి శ్రీ రామరక్షణతో సమానం..!

భూచక్ర గడ్డ.. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు భూచక్ర గడ్డను తిన్నాడని చెబుతుంటారు. కొండల మధ్య దొరికే ఈ దుంపకు ప్రజల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పరిమాణంలో పొడవుగా ఉండే ఈ దుంప భూమిలో 10-15 మీటర్ల లోతులో పెరుగుతుంది. ఈ దుంప బెరడు లేతవర్ణంలో ఉండి, రుచికి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాలే ఉంటుంది. ఎత్తైన కొండల్లో భూమి లోపల నుంచి సేకరించినది కాబట్టి ఎలాంటి రసాయనలు వాడరు. ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది. అయితే ఈ భూచక్ర తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
భూచక్ర గడ్డ మూలం భారతదేశం అయినప్పటికీ, ఈ మొక్క పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కర్నాటకలోని పశ్చిమ కనుమలతో సహా కేరళ, మహారాష్ట్రలోని కొండలలోని స్క్రబ్ అడవులలో పెరుగుతుంది. మహా కుంభమేళాలో ఈ భూచక్ర దుంపను రామకండ, రామ ఫల పేర్లతో విక్రయిస్తారు. ఈ దుంపకు ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
భూచక్ర గడ్డ ఆకు, పువ్వు, కాండం ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించబడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది. ఈ దుంపలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సందర్భాలలో కూడా తినవచ్చు. బరువు తగ్గడంలో భూచక్ర గడ్డ సహాయపడుతుంది.
ఈ దుంపలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును సులభంగా జీర్ణం చేస్తుంది. త్వరగా బరువును తగ్గిస్తుంది.
భూచక్ర గడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది విటమిన్ సి అదనపు ప్రయోజనాలను కలిగి ఉంది. అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఈ గడ్డ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది.
అలాగే హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, ఈ గడ్డ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. తక్కువ కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులతో గుండెకు మంచిది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *