AIIMS Mangalagiri Jobs : మంగళగిరి ఎయిమ్స్(AIIMS)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిమ్స్ లో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,18,200 జీతాభత్యాలు ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపారు.
ఖాళీల వివరాలు
ఎయిమ్స్ మంగళగిరిలో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఐదు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలుగా నిర్ణయించారు.
జీతం వివరాలు
మెడికల్ సూపరింటెండెంట్- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200లు నెలవారీ జీతంగా చెల్లిస్తారు. .
రిజిస్ట్రార్ పోస్టుకు- ఎంపికైన అభ్యర్థులకు రూ. 78,800 నుంచి రూ. 2,09,200లు నెలవారీ జీతం చెల్లిస్తారు.
నర్సింగ్ సూపరింటెండెంట్- ఎంపికైన అభ్యర్థులకు రూ. 67,700 నుంచి రూ.2,08,700 నెలవారీ జీతం
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- ఎంపికైన అభ్యర్థులకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 నెలవారీ జీతం
ఎలా దరఖాస్తు చేయాలి
అర్హత కలిగిన అభ్యర్థులు ఎయిమ్స్ మంగళగిరి అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు ఫామ్ ప్రింటౌట్ తీసుకొని చివరి తేదీకి ముందుగా మంగళగిరి ఎయిమ్స్ చిరునామాకు పంపాలి.
ఆ చిరునామా- “రిక్రూట్‌మెంట్ సెల్, అడ్మిన్ మరియు లైబ్రరీ బిల్డింగ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్- 522503”. ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 4, 2024.
ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టులు
మంగళగిరి ఎయిమ్స్ లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 125 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.3,100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.2,100, దివ్యాంగులకు రూ.100 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు జనవరి 29 చివరి తేదీకాగా, దరఖాస్తుల హార్డ్ కాపీలను ఫిబ్రవరి 8వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు
ప్రొఫెసర్- 20 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్- 73 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్- 10 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్- 22 పోస్టులు