మీ బ్లడ్ గ్రూప్ ఏంటి. ఏ పాజిటివ్, ఏ నెగెటివ్, బీ పాజిటివ్, బీ నెగెటివ్, ఓ పాజిటివ్, ఓ నెగెటివ్ , ఏబీ పాజిటివ్, ఏబీ నెగెటివ్ ఇలా గ్రూపులు ఉంటాయి.
అందులో ఏదొక గ్రూపు అయ్యి ఉంటుంది. అత్యవసర చికిత్సలు, ప్రమాదాల సమాయాల్లో, ప్రసవ సమాయాల్లో రక్తం ఎక్కించాల్సినప్పుడు డాక్టర్లు మీ బ్లడ్ గ్రూపు ఏంటని ప్రశ్నిస్తుంటారు. ఇలా బ్లడ్ గ్రూపు అనేది వ్యక్తుల ఆరోగ్యంలోనూ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
A, B, O అనే పదాలో ఓబీవో జీన్ ను ప్రతిఫలిస్తాయి. ఇది మన రక్త కణాలను భిన్నంగా తయారు చేస్తుంది. దీన్ని బట్టిపలు రక్త గ్రూపులు ఏర్పడ్డాయి. ఏబీ గ్రూపు అంటే ఏ, బీ యాంటీజెన్స్ ను వారి ఎర్రరక్తకణాలు తయారు చేసేలా శరీర నిర్మాణం ఉంటుంది.
బ్లడ్ గ్రూపుల్లో ఒక గ్రూపు ఎలాంటి యాంటీజెన్స్ ను ఉత్పత్తి చేయదు. అందుకే ఓ గ్రూపు వారు మిగిలిన రక్త గ్రూపుల వారికి తమ రక్తాన్ని అత్యవసరాల్లో దానంగా ఇస్తారు. ఓ పాజిటివ్ వారు మిగిలిన అన్ని పాజిటివ్ గ్రూపుల వారికి ఇవ్వచ్చు.
ఓ వీరిని యూనివర్సల్ డోనర్ అంటుంటారు. జనాభాలో సుమార్ సగం శాతం Oగ్రూపువారే ఉంటారు. ఇక ఎర్రరక్త కణాల్లో ప్రొటీన్లు ఉంటే వారిని పాజిటివ్ గ్రూపుగా లేనివారిని నెగెటివ్ గ్రూపుగా నిర్దార్ధిస్తారు. ఇలా రక్తంలో ఎందుకు వ్యత్యాసాలుఉంటాయన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు.
Oగ్రూపుతో వారితో పోల్చితే…A,B,ABగ్రూపు వారికి హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కు ఎక్కువగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. Aలేదా Bగ్రూపు వారికి హార్ట్ ఎటాక్ రిస్క్ 8శాతం ఎక్కువ.
హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 10శాతం ఎక్కువ. రక్తంలో క్లాటింగ్ రేటులోనూ వ్యత్యాసం ఉంటుందని AHAఅంటోంది. ఏ, బీ బ్లడ్ గ్రూప్ వారికి డీప్ వేన్ థ్రోంబోసిస్ వచ్చే అవకాశాలు 51శాతం ఎక్కువని…పల్మనరీ ఎంబాలిజమ్ వచ్చే ఛాన్స్ 47శాతం ఎక్కువగా ఉంటుందని AHAఅధ్యయనం చెబుతోంది. టైప్, A,B,ABబ్లడ్ గ్రూపుల వారి శరీరంలో వచ్చే ఇన్ ఫ్లమ్మేషన్ దీనికి కారణం కావచ్చని హెమటాలజిస్ట్ గుగెన్ హీమ్ నిర్వచించారు.
A,Bగ్రూపుల్లోని వారి రక్తంలో ఉండే ప్రొటన్ లు ధమనులు, సిరలలో అవరోధాలు, గట్టిపడేందుకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది. Oగ్రూపు వారికి రక్తం గట్ట కట్టడాలు, గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉంటుంది.
కానీ వీరికి హెమరేజింగ్ లేదా రక్తస్రావం రిస్క్ కూడా ఎక్కువే. ABగ్రూపు వారికి కాగ్నిటివ్ ఇంపెయిర్ మెంట్ రిస్క్ కూడా ఎక్కువ.
అంటే గుర్తుంచుకోకపోవడం, దేనిపైనా ద్రుష్టి పెట్టలేకపోవడం నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి వాటికి దారితీస్తుంది.