Blood Type Diet: ఆ బ్లడ్‌​ గ్రూప్‌ అయితే..చికెన్‌, మటన్‌ వద్దంటున్న వైద్యులు!

www.mannamweb.com


వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్‌ వెజ్‌ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్‌ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్‌వెజ్‌గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్‌ లేదా చికెన్‌ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్‌వెజ్‌ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి చికెన్‌ లేదా మటన్‌ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్‌ గ్రూప్‌ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..!

ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్‌ గ్రూప్‌ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్‌వెజ్‌ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్‌ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు ఏదీ తింటే బెటర్‌ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్‌ గ్రూప్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు.

ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్‌వెజ్‌ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్‌లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్‌గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్‌వెజ్‌ తింటే బెటర్‌ అనేది సవివరంగా చూద్దాం!.

‘ఏ’ గ్రూప్‌..
ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి.

‘బీ’ గ్రూప్‌..
బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి.

ఇక ‘ఏబీ’, ‘ఓ’ గ్రూప్‌ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు.

కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి.