కారు స్పీడ్‌లో ఉన్నప్పుడు సెడన్‌గా బ్రేక్‌ ఫెయిల్‌ అయితే.. ఏం చేయాలంటే..

www.mannamweb.com


కారులో ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. క్షణాల్లో భారీ వేగాన్ని అందుకోగలిగే కార్లు ప్రమాదాల బారిన పడితే జరిగే నష్టాలు భారీగా ఉంటాయి.

ముఖ్యంగా కారు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో సెడన్‌గా బ్రేక్‌లు ఫెయిల్‌ అయితే జరిగే నష్టం మాములుగా ఉండదు. అయితే కారు వేగంగా ఉన్న సమయంలో బ్రేక్‌లు ఫెయిల్ అయితే కొన్ని రకాల టిప్స్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కారు కంట్రోల్‌లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కారు బ్రేక్‌ల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వార్నింగ్ లైట్స్‌ ఆన్‌ చేయాలి. వీటినే పార్కింగ్ లైట్స్‌గా చెబుతుంటారు. డ్యాష్‌ బోర్డు మధ్యలో కనినిపంచే బటన్‌ను నొక్కడం వల్ల ఒకేసారి నాలుగు ఇండికేటర్స్‌ ఆన్‌ అవుతాయి. ఈ బటన్‌ ఆన్‌ చేసిన వెంటనే లాంగ్‌ హారన్‌ కొడుతుండాలి. దీనివల్ల రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులకు మీరు ప్రమాదంలో ఉన్న విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత క్లచ్‌ నొక్కి గేరు న్యూట్రల్‌ వేయాలి. నెమ్మదిగా కారు వేగం తగ్గుతుంది.

* ఇక కారు మెయిన్‌ బ్రేక్‌ ఫెయిల్ అయిన వెంటనే.. హ్యాండ్‌ బ్రేక్‌ను ఉపయోగించాలి. అయితే ఈ సమయంలో వెనకాల నుంచి ఏవైనా కార్లు వస్తున్నాయో లేదో గమనించాలి. హ్యాండ్ బ్రేక్‌ వేయడం ద్వారా కారు ఒక్కసారిగా ఆగిపోతుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెనకాల ఎలాంటి కార్లు లేవని కన్‌ఫామ్‌ చేసుకున్న తర్వాత కారును రోడ్డుకు ఒకవైపు తీసుకెళ్లి హ్యాండ్‌ బ్రేక్‌ వేసే ప్రయత్నం చేయాలి.

* ఇక కారు నడపుతున్న సమయంలో సెడన్‌గా బ్రేక్‌ ఫెయిల్‌ అయితే క్లచ్‌ నొక్కి నెమ్మదిగా గేరును డౌన్‌లో చేయాలి. ఒక్కో గేర్‌ను మార్చుతుండాలి. గేరు తగ్గించడం వల్ల కారు వేగం కంట్రోల్‌లోకి వస్తుంది. ఇలా వేగాన్ని తగ్గించిన తర్వాత హ్యాండ్‌ బ్రేక్‌ను ఉపయోగించాలి.

* ఇక కారు రోడ్డుపై వెళ్లే అంత వేగం మట్టి రోడ్డుపై వెళ్లదు. అందుకే బ్రేక్‌ ఫెయిల్‌ అయిన సమయంలో కారును రోడ్డుపై నుంచి కిందికి దించాలి. దీంతో కారు వేగం భారీగా తగ్గుతుంది. ఈ సమయంలో హ్యాండ్ బ్రేక్‌ వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. కారు నడిపించే సమయంలో కేవలం ఈ టిప్స్ పాటిస్తే క్షేమంగా బయటపడతామని చెప్పలేము.