నాగబాబు పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


జనసేన ప్రధాన కార్యదర్శి, సోదరుడు నాగబాబు(JanaSena General Secretary Nagababu) మంత్రి కాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రచారంపై ఆయన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించారు. తన సోదరుడు నాగబాబు తొలుత ఎమ్మెల్సీ అవుతారని స్పష్టం చేశారు. మంత్రి అనేది తర్వాత ముచ్చట అని పేర్కొన్నారు. నాగబాబు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి రాజ్యసభకు పంపాలని అనుకున్నామని, కానీ కుదరలేదని, దాంతో ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులతో నాగబాబు తిట్లు పడ్డారని, జనసేన కోసం చాలా స్ట్రాంగ్‌గా నిలిచారని చెప్పారు. కందుల దుర్గేశ్ ఏ కులమో తనకు తెలియదని, కానీ ఆయన పని తీరు నచ్చడంతోనే మంత్రి పదవి ఇచ్చామని చెప్పారు. రాజకీయాల్లో పని తీరు ప్రమాణికం కావాలని, కులం కాదన్నారు. నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), హరిప్రసాద్(Hariprasad) తొలి నుంచి పార్టీ కోసం పని చేశారని, ప్రతిభ చూసే పదవులు ఇచ్చామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు