సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ లభించింది. తనపై నమోదయిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారించిన న్యాయస్థానం మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
తన నివాసం వద్ద…జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు కొన్నాళ్ల క్రితం ఒక మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదయింది. మోహన్ బాబు తనకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరడంతో సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. మోహన్ బాబు ఆస్తుల వ్యవహారంలో తలెత్తిన విభేదాలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ పై దాడి ఘటనలో ఆయన గాయపడిన జర్నలిస్టుకు క్షమాపణ చెప్పారు.