BREAKING: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.
చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగగా.. బాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ తరుఫు లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేసు దర్యా్ప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.


కాగా, చంద్రబాబు ప్రభుత్వ హయంలో చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలాట్మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఎం చంద్రబాబు పేరును సైతం నిందితుల జాబితాలో చేర్చింది. దీంతో చంద్రబాబు ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు బాబుకు ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. బాబు బయట ఉంటే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తోందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఐఆర్ఆర్ కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ఎదురు దెబ్బ తగిలినట్లైంది.