BREAKING: ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. 9 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

www.mannamweb.com


ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు.
ఇందులో టీడీపీ నుండి గెలిచి వైసీపీలోకి నలుగురు వెళ్లగా.. వైసీపీ నుండి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైపీసీకి మద్దతుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్‌ వైసీపీలోకి రాగా.. శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశించారు. ఎమ్మెల్యేల నుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోపక్కా విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ విడుదల చేశారు. గంటా రాజీనామా ఆమోదం, ఎమ్మెల్యేలకు నోటీసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.