Breaking:ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నేడు(జూన్ 26) నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు జూలై 2వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జూలై 3న నామినేషన్లు పరిశీలిస్తారు.

నామినేషన్ల దాఖలుకు జూలై 2వ తేదీ తుది గడువు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జులై 5 వరకు అవకాశం ఉంటుంది. పోలింగ్ నిర్వహించిన రోజునే ఫలితాలు వెల్లడిస్తారు. ఈ క్రమంలో కూటమికే 2 స్థానాలు దక్కే అవకాశముంది. వైసీపీ పోటీ చేస్తే జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.