మహారాష్ట్రలోని పూణె(Pune) పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపైన యువతిని దుండగుడు కిరాతకంగా హత్య చేసి చంపాడు(Murder).
నడిరోడ్డుపై కత్తిపోట్లు చూసి స్థానికులు నివ్వెరపోయినట్లు సమాచారం. అనంతరం హంతకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హంతకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిది, హంతకుడు ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నట్లు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.