తెలంగాణలో మరో పరువు హత్య..! యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు

తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషాద ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఆదివారం ఆర్ధరాత్రి జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మామిళ్లగడ్డ (Mamillagadda) గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ (Krishna) అలియాస్ మాల బంటి అనే యువకుడిని కొంతమంది దుండగులు అర్ధరాత్రి మాటు వేసి అత్యంత కిరాతకంగా బండరాళ్లతో తలపై మోది చంపేశారు.

అనంతరం డెడ్‌బాడీ (Dead Body)ని జనగామ నుంచి పిల్లలమర్రికి వెళ్లే రహదారిలో ఉన్న మూసీ కెనాల్ (Musi Canal) సమీపంలో పడేశారు. అయితే, 6 నెలల క్రితం కృష్ణ (Krishna) కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అతడు దారుణ హత్యకు గురకావడంతో అంతా అయోమయం నెలకొంది. కృష్ణది పరువు హత్యనా.. లేక పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.