Budget 2024: రైతులకు శుభవార్త.. రుణాల పరిమితి, సబ్సిడీ, పీఎం కిసాన్ నిధుల పెంపు..!

www.mannamweb.com


దేశంలో చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎంత చేసినా వ్యవసాయం మాత్రం లాభసాటిగా మారడం లేదు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. అయితే కష్టం చేసినా రైతు కన్నా మధ్యలో ఉండే దళారి, ఆ తర్వాత వ్యాపారి బాగుపడుతున్నారు.
అందుకే రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి. అందులోనే భాగంగా రైతలకు తక్కు వడ్డీలకే రుణాలు ఇవ్వడం, పీఎం కిసాన్, రైతు బంధు, ఎరువులపై సబ్సిడీ, విత్తనాలపై సబ్సిడీ, రైతు బీమా వంటి పథకాలు తీసుకొచ్చారు.

అయితే తెలంగాణలో ప్రస్తుతం పీఎం కిసాన్, రైతు బంధు, రైతు బీమా, ఎరువులపై సబ్సిడీ కొనసాగుతోంది. విత్తనాలపై సబ్సిడీ ఎప్పుడో ఎత్తేశారు. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న వేళ ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో రైతులకు ఇచ్చే రుణ పరిమితి పెంచే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ నాటికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల మేర రైతు రుణాలను పంపిణీ చేసింది.

ఈ రుణాలను రూ.22-25 లక్షల కోట్లకు పెంచాలని యోచిస్తోంది. అగ్రిటెక్ స్టార్టప్​లకు కనీసం 10-15 సంవత్సరాల పాటు ప్రత్యేక ట్యాక్స్ డిస్కౌంట్ ఇవ్వాలని భావిస్తోంది. రైతుల ఆదాయాలు పెరగాలంటే ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంది.అన్నదాతలు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా పెంచాలని డిమాండ్ ఉంది. దీనిపై బడ్జెట్ లో ఏమైనా ప్రతిపాదనలు ఉండే ఛాన్స్ ఉంది.

దేశీయంగా తయారు చేసిన ఎరువులపై సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పలు రకాల ఎరువులపై సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీని మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే రూ.6 వేలను రూ.8 వేలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలను రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అన్నదాత బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.