Budget 2025: ఆరోగ్య రంగానికి పెద్ద పీట.. 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు.


పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు.

ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే పీఎమ్ జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కూడా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లు ప్రయోజనం చేకూరబోతోంది.