Budget 2025: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర వార్షిక బడ్జెట్ (2025-26)ను ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజానీకంతో పాటు వేతన జీవులకు భారీగా ఊరట ఇచ్చారు.


శాఖల వారీగా చూసుకుంటే.. రక్షణ శాఖకు ఏకంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది కంటే రూ.400 కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. మొత్తంగా రూ.5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. విశాఖ పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే రూ.445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది. మొత్తంగా విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించింది.

ఏపీకి ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు

విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు

విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు

ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు

లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు

ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు

ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు