ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కొన్ని మన కళ్లు చూసినా నమ్మలేము. కొన్ని మనం విన్నా మనస్సు అంగీకరించదు.
అలాంటి ఓ అద్భుతమైన జీవి… భూలోకంలో తన ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థతో ఉండే ప్రాణి… అర్మడిల్లో. ఈ ప్రాణి గురించి వింటే మీరు నమ్మలేరు. తుపాకీ నుండి వచ్చిన బుల్లెట్ కూడా దాని పైభాగాన్ని దాటి లోపలికి చొచ్చుకుపోలేదు. ప్రకృతి కల్పించిన రక్షణ కవచం… నిశ్శబ్దమైన రక్షకధనం… ఇది యుద్ధభూమిలో దొరికే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కంటే మిన్న.
ప్రపంచంలో చాలా రకాల వింత జంతువులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వింత జీవుల్లో అర్మడిల్లో ఒకటి. దీని చర్మం చాలా గట్టిగా ఉంటుంది. ఎంతలా అంటే బుల్లెట్ కూడా దీని చర్మంలోకి చొచ్చుకుపోదు. ఈ జంతువు బుల్లెట్ ప్రూఫ్ శరీరం కలిగి ఉంటుంది.అర్మడిల్లో జీవి ప్రధానంగా మధ్య, దక్షిణ అమెరికా అడవులలో కనిపిస్తుంది. ఈ జంతువులు ఇల్లినాయిస్,నెబ్రాస్కా నేలలపై కూడా కనిపించాయి.
నీటిలోకి వెళ్లి 5-6 నిమిషాలు తన శ్వాసను పట్టుకోగలదు. ఈ అర్మడిల్లోను చిన్న సాయుధ జంతువు అని కూడా అంటారు. ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని చాలా మంది తాబేలుతో పోలుస్తారు. అయితు ఈ జీవులు సాధారణంగా చెదపురుగులను తినడం ద్వారా తమ కడుపు నింపుకుంటాయి.అర్మడిల్లో శరీరం పై భాగం ఇనుము కంటే గట్టిగా ఉంటుంది. అయితే ఈ షెల్ లోపలి నుంచి తోక, అవయవాలు, తల..ముందు భాగం నుంచి పొడుచుకువస్తాయి. అచ్చం తాబేలు మాదిరిగానే ఉంటుంది.
అర్మడిల్లో శరీరం బుల్లెట్ ప్రూఫ్ కాదా అని నిర్ధారించడానికి పలు ప్రయోగాలు కూడా చేశారు. ఈ ప్రయోగాల్లో బుల్లెట్లను సైతం తట్టుకోగలవని నిర్ధారణ అయ్యింది. ఒక ప్రయోగంలో పరిశోధకుల బృందం 22 క్యాలిబర్ రైఫిల్ నుండి 10 అడుగుల దూరం నుండి అర్మడిల్లో షెల్‌పై కాల్పులు జరిపింది. అయినప్పటికీ షెల్ బుల్లెట్లను ఆపగలిగింది. మరొక ప్రయోగంలో 25 అడుగుల దూరం నుండి అర్మడిల్లో షెల్‌పై 9mm హ్యాండ్‌గన్‌ను కాల్చారు. అయినా షెల్ బుల్లెట్లను మళ్లించగలిగింది. మొత్తానికి అర్మడిల్లో చాలా దృఢంగా ఉంటాయని బుల్లెట్లను సైతం తిప్పిగొట్టలవు అని నిరూపితం అయ్యింది.