పండుగల సీజన్ ప్రారంభమైంది. పండుగలతో పాటు డిస్కౌంట్లు, ఆఫర్ల సీజన్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం దసరా పండుగ (Dussehra 2024) సీజన్. దీంతో ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లతో వచ్చేసింది. అయితే.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా ద్విచక్ర వాహనాలను సైతం కొనుగోలు చేయవచ్చు. పండుగ సీజన్‌లో మార్కెట్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ ఆకర్షణీయమైన అమ్మకాలతో కళకళలాడుతున్నాయి. అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రిక్, పెట్రోల్ ద్విచక్ర వాహనాలపై బంపర్ ఆఫర్‌లను అందిస్తూ వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా.. హీరో, బజాజ్, టీవీఎస్, ఓలా, చేతక్, జావా, యెజ్డీ, విదా, ఏథర్, ఇతర ప్రముఖ బ్రాండ్‌లతో భాగస్వామ్యం ద్వారా ద్విచక్ర వాహన కొనుగోలు అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని ఫ్లిప్‌కార్ట్ నడుంబిగించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో ద్విచక్ర వాహనాల కోసం ఒక విభాగం ఉంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల ఎంపికకు సంబంధించిన ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో కమ్యూటర్ బైక్‌లు, ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లు, స్కూటర్‌ల వంటి పెట్రోల్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, SuperCoin ద్వారా లాయల్టీ ప్రయోజనాలతో సహా సరసమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. HDFC వంటి ప్రధాన బ్యాంకులపై కూడా డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
బుకింగ్ ప్రాసెస్ ఇదే:
ఈ బైక్‌లను కొనుగోలు చేయాలంటే మీకు నచ్చిన బైక్‌ను సెలెక్ట్ చేసుకొని బై నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే.. ఈ ఓటీపీని వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి.. డెలివరీ అడ్రస్, ఆర్డర్ సమ్మరీ, పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓటీపీ ఎంటర్ చేసి లొనికి వెళ్లాక.. అడ్రస్ ఎంటర్ చేయాలి. అనంతరం పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా పూర్తి చేశాక.. మీరు ఎంటర్ చేసిన అడ్రస్‌కి డెలివరీ వస్తుంది. డెలివరీకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా మొబైల్‌కి ఎస్‌ఎంఎస్‌లు వస్తుంటాయి. ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్రతియేటా నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale 2024) తేదీలను ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కానుంది. అయితే.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26వ తేదీ (గురువారం)నే సేల్ అందుబాటులోకి రానుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులకు డిస్కౌంట్ అందిచనున్నారు. ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే.. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు ఉంటుంది. నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం పొందొచ్చని పేర్కొంది. Flipkart HDFC బ్యాంక్ ఫర్ సేల్ 2024తో చేతులు కలిపింది. అంటే.. మీరు బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో షాపింగ్ చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే.. కొంత మొత్తం డబ్బు ఆదా చేసుకోవచ్చు.