ఇండియాలో సగం మందికి ఈ సీక్రెట్ తెలిదు.. తెలిస్తే కోటీశ్వరులు అయినట్టే

www.mannamweb.com


మీరు సేవింగ్స్ ద్వారా జమ చేసిన డబ్బుతో లక్షాధికారి అవుతారని ఎప్పుడైనా ఊహించారా? ఒక విధంగా ఊహించకపోవచ్చు. చిన్న సేవింగ్స్ చేయడం ద్వారా ప్రభుత్వ సేవింగ్స్ స్కిం లేదా బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసి ఆర్ధికంగా భరోసాతో కొందరు సంతోషిస్తుంటారు.

కానీ మీరు బ్యాంకు లేదా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టే చిన్న మొత్తంతో మీరు లక్షాధికారి కావచ్చని తెలుసా ? ఇది ఖచ్చితంగా సాధ్యమే. దీని కోసం మీరు తప్పకుండా SIP రూల్స్ అండ్ ఫార్ములా పాటించాలి. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. SIP ఈ ఫార్ములాలో ఒకటి 12x12x24. మీరు ఫార్ములా ఉపయోగించి సేవింగ్స్ డిపాజిట్ చేస్తే మీరు ఖచ్చితంగా కనీసం రూ. 2 కోట్లకు అధిపతి కావచ్చు.

SIP అంటే ఏమిటి?

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానుని SIP అంటారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి SIP ఒక సాధనం. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) పెట్టుబడిదారుల డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది, దింతో మీకు ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) ఇంకా సేవింగ్స్ పథకాల కంటే మంచి రిటర్న్ వస్తుంది. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు కంపౌండింగ్ రిటర్న్ పొందుతారు.

మ్యూచువల్ ఫండ్‌లో డబ్బు ఎలా పెట్టాలి

మ్యూచువల్ ఫండ్ అనేది పెట్టుబడి పథకం, దీనిలో చాలా మంది పెట్టుబడిదారులు డబ్బును సేకరించి స్టాక్‌లు, బాండ్‌లు ఇంకా ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు. ఈ ఫండ్స్ ప్రొఫెషనల్ అసెట్ మేనేజర్‌ల ద్వారా నిర్వహిస్తారు, వీరిని పోర్ట్‌ఫోలియో మేనేజర్లు అని కూడా పిలుస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి డబ్బును సేకరిస్తుంటారు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి డబ్బును కలిపి వివిధ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు. ఇలా ఈ ఫండ్స్ లాభాలు పెట్టుబడిదారులందరికి షేర్ చేస్తారు.

SIP 12x12x24 ఫార్ములా ఏంటి ?

ఉదాహరణకు మీ వయస్సు 24 సంవత్సరాలు అనుకుందాం… ఇప్పుడు మీరు SIP ద్వారా కంపెనీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా రూ. 12,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఇలా మీరు ఒక 24 ఏళ్లపాటు ప్రతి నెలా రూ.12,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క నెల మిస్ కాకూడదు. ఈ పెట్టుబడిపై మీరు ఏటా 12% రిటర్న్ పొందుతారు. సాధారణంగా, SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల 12% నుండి 15% వరకు రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ SIP పథకంలో పెట్టుబడి పెట్టినప్పుడు మీకు 24 సంవత్సరాలలో భారీ ఫండ్ ఉంటుంది.

SIP 12x12x24 ఫార్ములా నుండి సంపాదించడం ఎలా

మీరు దీనిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు 24 సంవత్సరాల వయస్సు నుండి 24 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 12,000 డిపాజిట్ చేస్తే ఈ 24 సంవత్సరాలలో మీ పెట్టుబడి మొత్తం దాదాపు రూ. 34,56,000 లక్షలు అవుతుంది. ఇప్పుడు మీరు SIP క్యాలికులేటర్ ద్వారా చూస్తే రూ. 34.56 లక్షల పెట్టుబడిపై మీరు 12% చొప్పున రిటర్న్ తో 24 ఏళ్ళకి దాదాపు రూ. 1,66,16,246గా అంచనా ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టుబడి మొత్తం రూ. 34.56 లక్షలకు రూ. 1,66,16,246 కలిపితే దాదాపు రూ. 2,00,72,246 అంటే రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. విశేషమేమిటంటే, మీకు 48 ఏళ్లు వచ్చినప్పుడే ఈ మొత్తం మీకు బ్యాంకుకు జమ అవుతుంది. అంటే రిటైర్మెంట్ వయస్సు 58 లేదా 60 సంవత్సరాల కంటే ముందే మీరు రిటైర్‌మెంట్ తీసుకొని హాయిగా జీవితాన్ని గడపవచ్చు.