మన దేశంలో చాలా మంది బిజినెస్ చేయాలనే కోరికను వదిలేసి ఏదో ఒక ఉద్యోగంలో సెట్ అవుతున్నారు. దీనికి రీజన్ సరైన పెట్టుబడి లేకపోవడం.
ఉన్నదంతా ఇన్వెస్ట్ చేశాక, నష్టపోతే తేరుకోలేమనే భయం ఉంటుంది. మీకు కూడా ఇదే సమస్య ఉంటే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేవలం రూ.50,000 బడ్జెట్‌తోనే కొన్ని బిజినెస్‌లు స్టార్ట్ చేయవచ్చు. కొన్నింటిని నష్టభయం లేకుండా ఫుల్ టైమ్ కెరీర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఇంకొన్నింటిని అదనపు ఆదాయం కోసం ప్రారంభించవచ్చు. తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించే వీలున్న టాప్ 10 బిజినెస్ ఐడియాలు ఏవో చూద్దాం.
* కోచింగ్ క్లాసులు
మీకు మంచి టీచింగ్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే.. ఇంట్లోనే కోచింగ్ క్లాసులు ప్రారంభించవచ్చు. లేదా చిన్న స్థలాన్ని అద్దెకు తీసుకొని కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయవచ్చు. ఇందుకు డెస్క్‌లు, బ్లాక్‌బోర్డ్, మార్కర్స్ వంటి బేసిక్ ఫర్నిచర్ అవసరం. ఆన్‌లైన్ లెర్నింగ్ కూడా పెరగడంతో, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ సహాయంతో వర్చువల్‌గా క్లాస్‌లు చెప్పవచ్చు.
* హోమ్ మేడ్ ఫుడ్ సర్వీస్
కుకింగ్ అంటే ఇష్టమున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ టిఫిన్ సర్వీసును స్టార్ట్ చేయవచ్చు. పచ్చళ్లు అమ్మవచ్చు. దీనికి కేవలం వంట పాత్రలు, టిఫిన్ బాక్స్‌లు ఉంటే సరిపోతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్ కంటైనర్లకు బదులుగా అరటి ఆకులను ఉపయోగించడం మంచిది.
* కుకింగ్ క్లాస్‌లు
ఇప్పటికే ఇంట్లో ఉన్న పదార్థాలు, పాత్రలను ఉపయోగించి ఇంట్లో నుంచి కుకింగ్ క్లాస్‌లు ప్రారంభించవచ్చు. ఆన్‌లైన్ కుకింగ్ వీడియోలకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది. ఇండియన్, కాంటినెంటల్ రెసిపీస్, చాక్లెట్లు లేదా బేకింగ్ నేర్పించవచ్చు.
* వ్లాగింగ్
కథలు చెప్పడం, గలగలా మాట్లాడటం ఇష్టమా? ఇలాంటి వాళ్లు వ్లాగింగ్‌ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. ఇందుకు మంచి స్మార్ట్‌ఫోన్ లేదా కెమెరా ఉంటే చాలు. అడ్వర్టైజ్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్స్ ద్వారా సంపాదించవచ్చు.
* అఫిలియేట్ మార్కెటింగ్
ఆన్‌లైన్‌లో ప్రొడక్టులను ప్రమోట్ చేస్తూ కమీషన్ సంపాదించవచ్చు. మీ రిఫరల్ లింక్స్ ద్వారా ప్రొడక్టులు సిఫార్సు చేయాలి. దీనికి ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. అలాగే మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండాలి.
* ఇన్సూరెన్స్ ఏజెంట్
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారడం మంచి ఆప్షన్. ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతూ మంచి కమీషన్ పొందవచ్చు.
* వర్చువల్ ఫిట్‌నెస్ ట్రైనర్
ఫిట్‌నెస్, యోగా లేదా మెడిటేషన్‌లో నైపుణ్యం ఉన్నవాళ్లు ఆన్‌లైన్ ట్రైనింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. వర్చువల్ సెషన్స్ నిర్వహించడానికి ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ మాత్రమే అవసరం.
* సేంద్రీయ వ్యవసాయం
ఈ రోజుల్లో సేంద్రీయ ఆహారానికి మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో టెర్రస్‌పై లేదా ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో సేంద్రీయ కూరగాయలు పెంచడం ప్రారంభించవచ్చు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా.
* డేకేర్ సెంటర్
పిల్లలతో సమయం గడపడం ఇష్టపడేవారు దీన్నో బిజినెస్‌గా మార్చవచ్చు. ఇంట్లో చిన్న డేకేర్‌ను ఓపెన్ చేయవచ్చు. మీరు జెన్యూన్ అయితే.. వర్కింగ్ ఉమెన్స్ తమ పిల్లలను మీ దగ్గర వదిలేసి, వారి కేరింగ్ బాధ్యతలు అప్పగిస్తారు. కనీస పెట్టుబడి అవసరం లేకుండా, నోటి మాట ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు.
* ఫ్రీలాన్స్ రైటింగ్
రైటింగ్‌పై ఆసక్తి ఉన్నవాళ్లు బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్ లేదా కాపీ రైటింగ్ ద్వారా సంపాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్‌లతో పని చేయడానికి ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది.