మీ ఇంట్లో కుక్క ఉందా..? అయితే మీకు ఈ అరుదైన వ్యాధి వచ్చినట్లే..

కుక్కలంటే చాలామందికి ఇష్టం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ కుక్క ఉండటం సాధారణం అయింది. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కుక్కలు ఉండాల్సిందే. కొందరు వాటిని కేవలం కాపలాగా మాత్రమే చూస్తారు.


మరికొందరు వాటిని తమ సొంత బిడ్డల్లా సాకుతారు. అయితే యూకేలో జరిగిన ఈ ఘటన వింటే ఇప్పుడు కుక్కల్ని పెంచుకునేవాళ్లు ఆందోళనలో పడక తప్పదు. పెంపుడు కుక్క నాకడంతో ఓ మహిళ వ్యాధి బారిన పడి ఆరోగ్యం క్షీణించి మృతి చెందిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యూకేలోని నార్ ఫోల్క్ ప్రాంతానికి చెందిన 83 ఏళ్ల బామ్మకు పెంపుడు కుక్క ఉంది. అయితే ఆమెను ఓ సారి కుక్క నాకడంతో సెప్సిస్ అనే అరుదైన వ్యాధి బారినపడింది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. వైద్యులు పరీక్షించగా ఈ బ్యాక్టీరియమ్ సాధు జంతువుల్లో ఉంటుందని తెలిపారు. కుక్క నాకడంతోనే వృద్ధురాలు మృతి చెందినట్లు తేల్చారు. యూకేలోని అటిల్ బారో ప్రావిన్స్ నార్ ఫోల్క్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు ఇంట్లో పెంపుడు కుక్క ఉంది. అయితే ఆమె కాలికి ఇటీవల గాయమైంది. ఆ గాయాన్ని పెంపుడు కుక్క నాకింది. దీంతో కుక్క నాలుకపై ఉండే లాలాజలం గాయం గుండా మహిళ శరీరంలోకి ప్రవేశించింది. దీంతో ఆమెకు కొద్ది రోజుల్లోనే సెప్సిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. అలా ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది.

అయితే మొదట వృద్ధురాలి కాలికి ఉన్న గాయాన్ని కుక్క నాకిన విషయం ఆమె తన మనవరాలు అలెన్ కు చెప్పింది. అయితే ఆ మరుసటి రోజే ఆమె ఆరోగ్యంలో మార్పులు రావడంతో అలెన్.. తన బామ్మను నార్ విచ్ హాస్పిటల్ అండ్ యూనివర్సిటీకి తీసుకెళ్లింది. అయితే అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించారు. రక్త పరీక్షలు చేశారు. ఆమె శరీరంలో పాస్టురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియం ఉన్నట్లు గుర్తించారు. కుక్కల ద్వారా ఈమె శరీరంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. అయితే వైద్యులు కొంత చికిత్స చేసినా ఆమె సెప్సిస్ బారిన పడి ఇటీవల మృతి చెందింది.

దీంతో పెంపుడు కుక్కలు ఉన్నవాళ్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కుక్కలకు ఎప్పటికప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలని తెలిపారు. కుక్కలు గీరినా.. నాకినా వైద్యుడిని సంప్రదించడం మేలు అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.